Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1353
Total Reviews
90
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 73-84 of 1353 reviews

Toxic Movie Review

5.0
out of 10
టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఏదో మ్యాజిక్ చేయబోతుందని భావించిన ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. సినిమా సెకండాఫ్‌ లో కథ గాడి తప్పడం, బలమైన సీక్వెన్స్ లేకపోవడం, ఎమోషనల్ కనెక్టివిటీ లోపించడం, యష్‌ ఎలివేషన్ డ్రామా ఆకట్టుకోకపోవడంతో అప్పటి వరకు గ్రాండియర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను చూస్తున్నామనే ఫీలింగ్ నుంచి సాదాసీదా మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ తెప్పిస్తుంది. ఓ...

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఏదో మ్యాజిక్ చేయబోతుందని భావించిన ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. సినిమా సెకండాఫ్‌ లో కథ గాడి తప్పడం, బలమైన సీక్వెన్స్ లేకపోవడం, ఎమోషనల్ కనెక్టివిటీ లోపించడం, యష్‌ ఎలివేషన్ డ్రామా ఆకట్టుకోకపోవడంతో అప్పటి వరకు గ్రాండియర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను చూస్తున్నామనే ఫీలింగ్ నుంచి సాదాసీదా మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ తెప్పిస్తుంది. ఓవరాల్‌ గా అంచనాలకు ఏ మాత్రం చేరుకోలేని సినిమా అనిపిస్తుంది.


ఓవరాల్‌ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. యష్ స్టైలిష్ లుక్, మాస్ ఎలిమెంట్స్‌ తో, యాక్టింగ్‌ తో మ్యాజిక్ చేశాడు. విజువల్స్ చాలా రిచ్‌ గా ఉన్నాయి. కానీ కథ మాత్రం నిల్. సినిమాకు కావాల్సిన మెయిన్ కాన్‌ప్లిక్ట్‌ లో పస లేకపోవడం వల్ల సెకండాఫ్ డల్‌ గా సాగుతుంది. అవసరం లేకపోయిన బోల్డ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ జొప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా నిడివి మరో మైనస్. కనీసం 20 నిమిషాల సినిమాను కట్ చేస్తే.. కొంత బెటర్ అవుట్ పుట్ ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. మేకింగ్‌ పై పెట్టిన శ్రద్ద.. కథ, కథనాలు, పాత్రల డిజైన్ మీద మరింత పెట్టి ఉంటే.. ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదనిపిస్తుంది. ఫైనల్ గా యష్ కోసం, గ్రాండియర్ మేకింగ్ కోసం టాక్సిక్ సినిమా ఓసారి చూడొచ్చు.

Aug 26, 2026 Hindi +5
5.0
out of 10
ఈరోజే టాక్సిక్ (Toxic) మ్యాట్నీ షో చూసొచ్చాను... నాకైతే డీసెంట్ అనిపించింది. ఎందుకంటే మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు.. ఇది బోల్డ్ అటెంప్ట్ తో చేస్తున్న యాక్షన్ డ్రామా అని. కాకపోతే సినిమాలో సరైన స్ట్రాంగ్ స్టోరీ లేదు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే లేదు. బట్ యష్ వన్ మ్యాన్ షో తో మూవీని నడిపించాడు. ఎక్సెలెంట్ పెర్ఫార్మన్స్ బై యష్ అండ్ కియారా also. ట్రైలర్ చూసి స్టైలిష్ గా ఎదో ఊహించుకుని వెళ్తే చ...

ఈరోజే టాక్సిక్ (Toxic) మ్యాట్నీ షో చూసొచ్చాను... నాకైతే డీసెంట్ అనిపించింది. ఎందుకంటే మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు.. ఇది బోల్డ్ అటెంప్ట్ తో చేస్తున్న యాక్షన్ డ్రామా అని. కాకపోతే సినిమాలో సరైన స్ట్రాంగ్ స్టోరీ లేదు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే లేదు. బట్ యష్ వన్ మ్యాన్ షో తో మూవీని నడిపించాడు. ఎక్సెలెంట్ పెర్ఫార్మన్స్ బై యష్ అండ్ కియారా also. 


ట్రైలర్ చూసి స్టైలిష్ గా ఎదో ఊహించుకుని వెళ్తే చాలా డిస్సపాయింట్ అవుతారు... ఏం లేదు లో ఎక్సపెక్టషన్స్ తో వెళ్తే కొంచెం బెటర్ ఫీల్ తో బైటికొస్తారు. లెంగ్త్ ఒక అరగంట తగ్గించి ఉంటె ఆడియన్స్ కి బాగా నచ్చేదేమో.. ఒకసారైతే సినిమా చూసేలానే ఉంది నాకైతే. బట్ ఫ్యామిలీస్ చూడలేని సినిమా ఇది. 

Aug 26, 2026 Hindi +5

Toxic Movie Review

Tupaki

By Tupaki

5.0
out of 10
టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... ఒక ట్రెండ్ సెట్టింగ్.. బ్లాక్ బస్టర్ సినిమా చేశాక ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. యశ్ కూడా ‘కేజీఎఫ్’ హ్యాంగోవర్లోనే ‘టాక్సిక్’ సినిమా చేశాడన్నది స్పష్టమైంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన కుర్రాడు.. మాఫియా సామ్రాజ్యంలోకి అనామకుడిగా అడుగుపెట్టి అందలమెక్కడం.. ‘కేజీఎఫ్’ను గుర్తుకుతెచ్చే ‘టాక్సిక్’ స్టోరీ లైన్ ఇది. మేకర్స్ ప్రయత్నమైతే గట్టిగానే చేశ...

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... ఒక ట్రెండ్ సెట్టింగ్.. బ్లాక్ బస్టర్ సినిమా చేశాక ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. యశ్ కూడా ‘కేజీఎఫ్’ హ్యాంగోవర్లోనే ‘టాక్సిక్’ సినిమా చేశాడన్నది స్పష్టమైంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన కుర్రాడు.. మాఫియా సామ్రాజ్యంలోకి అనామకుడిగా అడుగుపెట్టి అందలమెక్కడం.. ‘కేజీఎఫ్’ను గుర్తుకుతెచ్చే ‘టాక్సిక్’ స్టోరీ లైన్ ఇది. మేకర్స్ ప్రయత్నమైతే గట్టిగానే చేశారు, కానీ కథలో విషయం లేకపోతే.. స్క్రీన్ ప్లేలో క్లారిటీ మిస్సయియితే.. ఎంత భారీగా- స్టైలిష్ గా తీసినా ప్రయోజనం ఉండదు. 


‘టాక్సిక్’తో వచ్చిన సమస్య ఇదే. సినిమాలో వైలెన్స్, రొమాన్స్ తప్ప ఇంకేమీ చూపించకపోతే.. అది వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. ‘టాక్సిక్’లో కథా కథనాలు ప్రేక్షకులకు తలపోటు తెప్పిస్తాయన్నది వాస్తవమే అయినా.. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు వావ్ అనిపిస్తాయి. ఇక పాత్ర కోసం ప్రాణం పెట్టేసిన యశ్ సూపర్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఆ కష్టాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఓవరాల్ గా టేకింగ్ స్టైలిష్ గా ఉన్నా.. కంటెంట్ మరీ వీక్ అయిపోవడంతో ‘టాక్సిక్’ ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్నే మిగులుస్తుంది. ఓవరాల్ గా టాక్సిక్.. నిజంగా టాక్సికే యష్ ఫ్యాన్స్ కి ఓ చేదు జ్ఞాపకం. 

Aug 26, 2026 Hindi +5

Toxic movie review

5.0
out of 10
కేజీయఫ్ 2 తర్వాత యశ్ చాలా గ్యాప్ తీసుకుని ‘ టాక్సిక్ ’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ విషయంలో కథా, నిర్మాణం అన్నింట్లోనూ యశ్ భాగస్వామ్యం ఉంది. ఇక ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ కంటెంట్ ఈ సినిమా ఏ రేటెడ్ అని స్పష్టంగా చెప్పింది. అయితే సినిమా విషయానికి వస్తే... గీతూ మోహన్ దాస్ రాసుకున్న కథకి, ఎంచుకున్న నేపథ్యానికి, తెరకెక్కించిన తీరుకి ఎక్కడా పొంతన కనిప...

కేజీయఫ్ 2 తర్వాత యశ్ చాలా గ్యాప్ తీసుకుని ‘ టాక్సిక్ ’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ విషయంలో కథా, నిర్మాణం అన్నింట్లోనూ యశ్ భాగస్వామ్యం ఉంది. ఇక ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ కంటెంట్ ఈ సినిమా ఏ రేటెడ్ అని స్పష్టంగా చెప్పింది. అయితే సినిమా విషయానికి వస్తే... గీతూ మోహన్ దాస్ రాసుకున్న కథకి, ఎంచుకున్న నేపథ్యానికి, తెరకెక్కించిన తీరుకి ఎక్కడా పొంతన కనిపించదు. ఇందులో మితి మీరిన హింస, రక్తపాతనం, శృంగారానికి సంబంధించిన సీన్లే డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. 


ఇంత గందరగోళంలో దర్శకురాలు, రచయిత రాసుకున్న ఎమోషన్స్ మాత్రం కనిపించకుండా పోతాయి. ఎక్కడా ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోవడంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టుగా అనిపిస్తుంది. చివరగా.. మితిమీరిన రక్తపాతం, అడల్డ్ సీన్లతో ‘టాక్సిక్’లోని ఎమోషన్స్ కనిపించకుండా పోయాయని చెప్పుకోవచ్చు. ఎంత సేపు నరకడం, కాల్చడం, శృంగార సన్నివేశాలే తప్పా.. ఒక్క చోట కూడా ఎమోషనల్ కనెక్టిటీ ఉండదు. టెక్నికల్‌ గా స్ట్రాంగ్ అయిన టాక్సిక్.. ఎమోషనల్‌గా వీక్.


Aug 26, 2026 Hindi +5

Toxic Movie Review

5.0
out of 10
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లాంగ్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ భారీ సినిమా ఇంత లేట్ అయినా కూడా షాకింగ్ బుకింగ్స్ తో ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. అయితే మొదటి నుంచీ మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమాలో మాస్ ఆడియెన్స్, ముఖ్యంగా యశ్ తరపున కే జి యఫ్ స్టైల్ యాక్షన్, పెర్ఫార్మన్స్ లని కోరుకునే వారికి అక్కడక్కడా మూమెంట్స్ మాత్రం ఎంగేజ్ చేస్తాయి. కానీ ఒక...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లాంగ్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ భారీ సినిమా ఇంత లేట్ అయినా కూడా షాకింగ్ బుకింగ్స్ తో ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. అయితే మొదటి నుంచీ మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమాలో మాస్ ఆడియెన్స్, ముఖ్యంగా యశ్ తరపున కే జి యఫ్ స్టైల్ యాక్షన్, పెర్ఫార్మన్స్ లని కోరుకునే వారికి అక్కడక్కడా మూమెంట్స్ మాత్రం ఎంగేజ్ చేస్తాయి. 


కానీ ఒక రొటీన్ కథ ఉన్నప్పటికీ నడిపించే కథనం ఎంగేజింగ్ గా ఉంటే చూసే ఆడియెన్ కథ లైన్ వంటి వాటిని పెద్దగా పట్టించుకోడు. కానీ టాక్సిక్ లో బలమైన కథ మిస్ అయ్యింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ విషయానికి వస్తే.. తను మాత్రం డిజప్పాయింటింగ్ చేసారని చెప్పక తప్పదు. పూర్తిగా ఇలా బోల్డ్, యాక్షన్ ఎలిమెంట్స్ తోనే ప్లాన్ చేసుకున్నారా.. లేక తర్వాత పరిస్థితులు మారాయా ఏమో కానీ తను ప్లాన్ చేసుకున్న పాయింట్ ని మాత్రం చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా అనవసర హంగులు, ఆర్భాటాలు యాడ్ చేసి ఆఖరికి నిరుత్సాహన్ని మిగిల్చారు.


ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “టాక్సిక్” వచ్చిన హైప్ ని మాత్రం అందుకోలేకపోయింది. యశ్ వరకు తన పని నటన వరకు సిన్సియర్ గా చేసి ఇంప్రెస్ చేశారు. కానీ రచనా సహకారం డిజప్పాయింటింగ్ గా ఉంది. స్టార్ నటీనటులు పెర్ఫార్మన్స్ లు, కొన్ని యాక్షన్ సీన్స్, ఒకటీ రెండు చోట్ల ఎమోషన్స్ ఓకే కానీ పస లేని కథనం, బలం లేని కథ, సాగదీతగా అనిపించే సెకండాఫ్ చూసే ఆడియెన్ లోని ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. సో వీటితో టాక్సిక్ అంతగా ఆకట్టుకోదు.

Aug 26, 2026 Hindi +5

Toxic Movie Review

T

By Tharuni

3.0
out of 10
జస్ట్ ఇప్పుడే Toxic (టాక్సిక్) కళాఖండం చూసొచ్చాను... మీరన్నది నిజమే... ఇదో కళాఖండమే... నా ఖర్మ గాలి 500 రూపాయలు పెట్టి మరీ సినిమాకెళ్ళాను... దీనికన్నా second time ఇరుముడికి వెళ్లినా అయిపోయేది.. ఏదో యష్ మీద అభిమానమో.. లేక సినిమా మీదున్న హైపో.. తెలీదు గాని 3 గంటలు సినిమా టార్చర్ ని తట్టుకున్నాను. అండ్ సినిమా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే... స్టోరీ ఏమైనా ఉందా అని డౌట్ ఒచ్చింది. కొట్టుకోవడం, చం...

జస్ట్ ఇప్పుడే Toxic (టాక్సిక్) కళాఖండం చూసొచ్చాను... మీరన్నది నిజమే... ఇదో కళాఖండమే... నా ఖర్మ గాలి 500 రూపాయలు పెట్టి మరీ సినిమాకెళ్ళాను... దీనికన్నా second time ఇరుముడికి వెళ్లినా అయిపోయేది.. ఏదో యష్ మీద అభిమానమో.. లేక సినిమా మీదున్న హైపో.. తెలీదు గాని 3 గంటలు సినిమా టార్చర్ ని తట్టుకున్నాను. అండ్ సినిమా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే... స్టోరీ ఏమైనా ఉందా అని డౌట్ ఒచ్చింది. 


కొట్టుకోవడం, చంపుకోవడం, మధ్యలో అప్పుడప్పుడు 18+ సీన్స్... దీనికేనా హాలీవుడ్ రేంజ్ సినిమా తీశామని చెప్పుకున్నారు... మళ్ళీ స్పెషల్ హైక్ ఒకటి... ఈ తలనొప్పి నుండి రిలీఫ్ అవడానికి ఇప్పుడే ఫ్రెష్ గా జండూ బాంబ్ కొన్నా... ఎవ్వరైనా సినిమా చూడాలనుకుంటే... ఓటిటి లోకి ఒచ్చేంత వరకు ఓపిక పట్టండి... లేదా గమ్మున ఇరుముడి వెళ్లిపోండి. 


Aug 26, 2026 Hindi +5

Toxic Movie Review

4.0
out of 10
సో రాకింగ్ స్టార్ యష్ మూవీ టాక్సిక్ మూవీ ఇప్పుడే చూసొచ్చాను.. కాదు భరించి.. ఆల్మోస్ట్ టార్చర్ అనుభవించి కొద్దిలో తప్పించుకున్నాను. దీనికోసం 435 రూపాయలు పెట్టాను... మళ్ళీ టికెట్ రేట్లు పెంచామాన్నోళ్లు ఈ సినిమాకోసం పెంచారు.. 3 గంటల దారుణం ఈ సినిమా.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసి బైటికొచ్చినోళ్ళు గ్రేట్... ఫస్ట్ సినిమా పాసిటివ్స్ గురించి చెప్పుకుందాం.. సినిమాటోగ్రఫి, యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగ...

సో రాకింగ్ స్టార్ యష్ మూవీ టాక్సిక్ మూవీ ఇప్పుడే చూసొచ్చాను.. కాదు భరించి.. ఆల్మోస్ట్ టార్చర్ అనుభవించి కొద్దిలో తప్పించుకున్నాను. దీనికోసం 435 రూపాయలు పెట్టాను... మళ్ళీ టికెట్ రేట్లు పెంచామాన్నోళ్లు ఈ సినిమాకోసం పెంచారు.. 3 గంటల దారుణం ఈ సినిమా.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసి బైటికొచ్చినోళ్ళు గ్రేట్... ఫస్ట్ సినిమా పాసిటివ్స్ గురించి చెప్పుకుందాం.. సినిమాటోగ్రఫి, యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టైలిష్ గా ఉన్నాయి. అండ్ యష్ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. అమ్మాయిలు అందంగా ఉన్నారు.. ఇంతకు మించి ఇంకేం లేవు. క్లైమాక్స్ కొంచెం బాగా రాసుకున్నారు... ఎంత అంటే... ఇదా... దీని గురించి ఇంత రాసుకుని, ఇంత గందరగోళం చేసారా అన్నట్టుంటుంది సినిమా. 



హైలెట్ ఏంటంటే సినిమాలో చెప్పుకోడానికి ఎంతో కొంత కొద్దో గొప్ప ఉండాలి.. కానీ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి సీన్ లేదు. అండ్ సినిమాలో పేజీల కొద్దీ పేజీల డైలాగులు ఉంటాయి... కానీ ఒక్క డైలాగ్ చెప్పడానికి రాదు. అండ్ సినిమా కాన్సెప్ట్ పేపర్ మీద చూస్తే బాగుంటది అనుకున్నట్టుంటది.. కానీ స్క్రీన్ మీద చూస్తేనే భరించలేం.. అండ్ సినిమాలో 3 గంటల 14 నిమిషాల సినిమాలో ఆ 18+ సీన్స్ అన్ని ఎందుకు పెట్టారో ఏంటో అర్ధం కాదు. ఒక్క క్లైమాక్స్ తప్ప ఇంకే సీన్లు ఎందుకు పెట్టారో అర్ధం కాదు. రవి బాసూర్ అయితే మాత్రం ఇంకా డిస్సపాయింట్ చేసారు. ఇవన్నీ పక్కన బెడితే మంచి మంచి తెలుగు సినిమాలో హైక్ ఇవ్వలేదు గాని, ఇలాంటి చెత్త సినిమాలకిస్తారు. తీసింది కళాఖండం అంటే... దానికి మళ్ళీ మేమె డబ్బులొదిలించుకోవాలి. అది మ్యాటరు... 


Aug 26, 2026 Hindi +5
3.0
out of 10
ఇప్పుడే యష్ నటించిన టాక్సిక్ సినిమా మార్నింగ్ షో చూసొస్తున్న. నా రివ్యూ చూసే వాళ్ళకి చెప్తున్నా... ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా ఈ మూవీకి తీసుకెళ్ళకండి. ఎందుకో ట్రైలర్ చూసినోళ్లకి కూడా అర్ధమైపోతుంది. సినిమా గురించి చెప్పాలంటే అసలు స్టోరీయే లేని సినిమా గురించి ఏం చెప్తాము. ఏదో కెజిఎఫ్ రేంజ్ లో ఎలివేషన్లు మాత్రమే ఇస్తే ఆడుద్ది అనుకున్నారో ఏమో కథని పక్కనెట్టేసారు. సినిమా మొత్తం చాలా ఓపికతో నిద్ర ఆపుకున...

ఇప్పుడే యష్ నటించిన టాక్సిక్ సినిమా మార్నింగ్ షో చూసొస్తున్న. నా రివ్యూ చూసే వాళ్ళకి చెప్తున్నా... ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా ఈ మూవీకి తీసుకెళ్ళకండి. ఎందుకో ట్రైలర్ చూసినోళ్లకి కూడా అర్ధమైపోతుంది. సినిమా గురించి చెప్పాలంటే అసలు స్టోరీయే లేని సినిమా గురించి ఏం చెప్తాము. ఏదో కెజిఎఫ్ రేంజ్ లో ఎలివేషన్లు మాత్రమే ఇస్తే ఆడుద్ది అనుకున్నారో ఏమో కథని పక్కనెట్టేసారు. సినిమా మొత్తం చాలా ఓపికతో నిద్ర ఆపుకుని ఉండాల్సొచ్చింది. 


సినిమా క్లైమాక్స్ కి వస్తే గాని అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ చూసే వరకు స్టోరీ విషయంలో క్లారిటీ రాదు. ఆ ట్విస్ట్ కూడా ముందే తెలిసిపోతే ఇక సినిమా చూడ్డం కూడా వేస్ట్. ఇలాంటి స్టోరీ లైన్ ఉన్న మూవీస్ తెలుగులో రీసెంట్ గా వచ్చాయి. అండ్ సినిమాలో యష్ పెర్ఫార్మన్స్ గురించి తప్ప ఇంక చేప్పేదేం లేదు. ఎవరికైనా ఓపికుండి... డబ్బులు వేస్ట్ చేద్దాం అనుకుంటే వెళ్ళండి... లేదంటే మన ఇరుముడికి రెండోసారైనా వెళ్ళండి... 

Aug 26, 2026 Hindi +5

Toxic movie Review

4.0
out of 10
టాక్సిక్... 3 hours 15 minutes రన్ టైం తో థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది... జెన్యూన్ గా మాట్లాడుకుందాం. పిల్లల్ని, ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా తీసుకెళ్ళకండి. చాలా అడల్ట్ కంటెంట్, అండ్ హెవీ వైలెన్స్ ఉంది. కొన్ని బూతుల్ని కూడా మ్యూట్ చేయలేదు. ఇక పాయింట్ కొస్తే హాలీవుడ్ మూవీస్ టాక్ తో సంబంధం లేకుండా చూసే కొన్ని వర్గాల ఆడియన్స్ కి మాత్రమే పొరపాటున నచ్చే ఛాన్స్ ఉంది గాని, మన ఆడియన్స్ విషయానికి వస్త...

టాక్సిక్... 3 hours 15 minutes రన్ టైం తో థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది... జెన్యూన్ గా మాట్లాడుకుందాం. పిల్లల్ని, ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా తీసుకెళ్ళకండి. చాలా అడల్ట్ కంటెంట్, అండ్ హెవీ వైలెన్స్ ఉంది. కొన్ని బూతుల్ని కూడా మ్యూట్ చేయలేదు. ఇక పాయింట్ కొస్తే హాలీవుడ్ మూవీస్ టాక్ తో సంబంధం లేకుండా చూసే కొన్ని వర్గాల ఆడియన్స్ కి మాత్రమే పొరపాటున నచ్చే ఛాన్స్ ఉంది గాని, మన ఆడియన్స్ విషయానికి వస్తే... ఈ సినిమా కనీసం కన్నడ వాళ్ళకైనా నచ్చుతుందా అని డౌట్ ఒచ్చేంత దారుణంగా ఉంది. 


అసలు ట్రైలర్ చూసినప్పుడే డౌట్ ఒచ్చింది. అసలు సినిమా స్టోరీ ఏమైనా ఉందా అంటే... నాకు ఏం అర్ధం కాలేదు. ఎదో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఇదా అసలు కథ అని అనిపించింది. ఇంతకు ముందే రీసెంట్ గా తెలుగులో వచ్చిన సత్యదేవ్ మూవీ గుర్తొస్తుంది. అసలు సినిమాలో హైలెట్ సీన్స్ ఎమున్నాయా అని చూస్తే... ఒక్కటి కూడా అనిపించలేదు. అసలు యాక్షన్ మూవీ అనేలా కూడా లేదు. అయితే హీరో యష్ పెర్ఫార్మన్స్ అయితే బాగుంది. అండ్ నయనతార కూడా బాగా నటించింది. విజువల్స్ బిగ్ స్క్రీన్ మీద అదిరిపోయాయి. 


మైనస్ గురించి చెప్పాలంటే హీరో క్యారెక్టర్ కి తప్ప దేనికి కూడా కనెక్ట్ అవ్వం. ఎందుకంటే అసలు స్టోరీయే లేదు కదా. రవి బాసూర్ మ్యూజిక్ కూడా ఏం బాగాలేదు. డైరెక్టర్ వర్క్ అయితే అసలు ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు. ఇంకా మాట్లాడుకోవడమే అనవసరం అసలు. నా రేటింగ్ అయితే కేవలం యష్ పెర్ఫార్మన్స్ అండ్ విజువల్స్ కోసం 2\5.

Aug 26, 2026 Hindi +5
6.0
out of 10
ఇప్పుడే అమీర్‌ లోగ్ సినిమా చూసొస్తున్నా. ట్రైలర్ చూసి ఇదేదో హైదరాబాద్ స్టయిల్లో ఒక ఫలక్ నామా దాస్, పెళ్లి చూపులు సినిమాల స్టయిల్లో ఉంటుందని వెళ్ళా. కానీ నేను ఊహించినంత ఏం లేదు గాని, ఒకే ఒకసారి ఖాళీ ఉంటె ట్రై చేయొచ్చు. మనందరికీ తెలిసిన కథనే మళ్ళీ డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేసాడు డైరెక్టర్. ఇందులో యాక్టర్ల పేర్లు తెలీవు గాని, అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. చాలా న్యాచురల్ గా హైదరాబాద్ స్టయిల్...

ఇప్పుడే అమీర్‌ లోగ్ సినిమా చూసొస్తున్నా. ట్రైలర్ చూసి ఇదేదో హైదరాబాద్ స్టయిల్లో ఒక ఫలక్ నామా దాస్, పెళ్లి చూపులు సినిమాల స్టయిల్లో ఉంటుందని వెళ్ళా. కానీ నేను ఊహించినంత ఏం లేదు గాని, ఒకే ఒకసారి ఖాళీ ఉంటె ట్రై చేయొచ్చు. 


మనందరికీ తెలిసిన కథనే మళ్ళీ డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేసాడు డైరెక్టర్. ఇందులో యాక్టర్ల పేర్లు తెలీవు గాని, అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. చాలా న్యాచురల్ గా హైదరాబాద్ స్టయిల్లోనే ఉండడం వల్ల హైదరాబాద్ వాళ్లయితే బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్లకయితే కష్టం. పైగా ఇరుముడి లాంటి సినిమాని థియేటర్లో ఉంచుకుని ఈ వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. ఓవరాల్ నాట్ బ్యాడ్.. ఇట్స్ వన్ టైం వాచబుల్. 

Aug 26, 2026 Telugu

Ameer log movie review

6.0
out of 10
అమీర్‌ లోగ్ సినిమా కథ చాలా పాతదే. ఓ ముగ్గురు ఖాళీగా తిరిగే కుర్రాళ్ళు, వాళ్ళని బాగుపడమని చెప్పే ఇంట్లో వాళ్ళు, వాళ్లకు సపోర్ట్ చేసే మనుషులు, వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వడం.. ఇదే కథ, కథాంశం. గతంలో చాలా సినిమాల్లో చూసేసాం. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు తిరగడంతోనే ఒక అరగంట రొటీన్ సీన్స్ తో సాగదీశారు. ముగ్గురు లైఫ్ లో సెటిల్ అవుదాం అనే దగ్గర్నుంచి కథ కాస్త ఆసక్తిగా నడుస్తుంది. ఆఫీస్ టీమ్ వర్సెస్ బ...

అమీర్‌ లోగ్ సినిమా కథ చాలా పాతదే. ఓ ముగ్గురు ఖాళీగా తిరిగే కుర్రాళ్ళు, వాళ్ళని బాగుపడమని చెప్పే ఇంట్లో వాళ్ళు, వాళ్లకు సపోర్ట్ చేసే మనుషులు, వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వడం.. ఇదే కథ, కథాంశం. గతంలో చాలా సినిమాల్లో చూసేసాం. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు తిరగడంతోనే ఒక అరగంట రొటీన్ సీన్స్ తో సాగదీశారు. ముగ్గురు లైఫ్ లో సెటిల్ అవుదాం అనే దగ్గర్నుంచి కథ కాస్త ఆసక్తిగా నడుస్తుంది. ఆఫీస్ టీమ్ వర్సెస్ బస్తి క్రికెట్ మ్యాచ్ తో ఎవరు గెలుస్తారు? నెక్స్ట్ ఏమవుతుంది అనే బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ మీద ఆసక్తి అయితే పెంచారు. ఇక సెకండ్ హాఫ్ లో క్రికెట్ అయిపోయి బిర్యానీ చుట్టూ కథ నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. 


ఇక సినిమాలో అక్కడక్కడా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. క్లైమాక్స్ లో అధికారికంగా ప్రకటించకపోయినా పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. ఎడిటింగ్ లో చాలా ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. పాత కథే అయినా హైదరాబాద్ బస్తి బ్యాక్ డ్రాప్ లో కొత్తగా ప్రయత్నించాడు దర్శకుడు. మొత్తంగా ‘అమీర్ లోగ్’ ఓ ముగ్గురు హైదరాబాదీ బస్తి కుర్రాళ్ళ కథ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.


Aug 25, 2026 Telugu
6.0
out of 10
పాతబస్తీ నేపథ్యంలో చాలా అరుదుగా సినిమాలు వస్తుంటాయి. ఆ స్లాంగ్‌, కల్చర్‌, నేటివిటీ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అలా చాలా రోజుల తర్వాత అలాంటి కథతో ఇప్పుడు `అమీర్‌ లోగ్‌` అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో వేద జలంధర్‌, హరి మున్నంగి, మనోజ్‌ ఆవుల, శశిధర్‌ కొచ్చర్ల కోట, విశ్వేశ్వర్‌ రెడ్డి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి డీసెం...

పాతబస్తీ నేపథ్యంలో చాలా అరుదుగా సినిమాలు వస్తుంటాయి. ఆ స్లాంగ్‌, కల్చర్‌, నేటివిటీ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అలా చాలా రోజుల తర్వాత అలాంటి కథతో ఇప్పుడు `అమీర్‌ లోగ్‌` అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో వేద జలంధర్‌, హరి మున్నంగి, మనోజ్‌ ఆవుల, శశిధర్‌ కొచ్చర్ల కోట, విశ్వేశ్వర్‌ రెడ్డి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. 


సినిమా పాతబస్తీ జీవితాలను ఆవిష్కరించింది. వారి స్వచ్ఛమైన మనసులను ఆవిష్కరించింది. పాత్రల తీరుతెన్నులు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ ఫన్‌ వర్కౌట్ అయ్యింది. కానీ సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు, కామెడీ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. సాగదీత ఎక్కువగా ఉంది. సినిమాలో ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. సినిమా ఎలా తీశామనేది కాదు, ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. ఈ మూవీ విషయంలో ఆ మీటర్‌ తేడా కొడుతుందని చెప్పొచ్చు. ఫైనల్ గా ఈ అమీర్ లోగ్ పాతబస్తీ జీవితాలను ఆవిష్కరించిన మూవీ. జెన్యూన్‌ అటెంప్ట్. పాతబస్తీ వాళ్లని ఆకట్టుకునే మూవీ అవుతుంది.


Aug 25, 2026 Telugu
Why MRO?