Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
బుర్రకథకు జన పదాలను జోడించిన లక్ష్మీ జీవితాన్ని ప్రజలకు చెప్పాలని దర్శకుడు గౌరీ నాయకుడు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ చేసిన ప్రయత్నం బాగుంది. ఆ ప్రయత్నానికి వారు చేసిన రీసెర్చ్, కథను రూపొందించిన తీరు, తెరపైన ఎమోషనల్గా సన్నివేశాలను నడిపించడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. వీటన్నిటికి తోడు పాత్రను తెర మీద సజీవంగా పండించడంలో ఆనందిని నుంచి పెర్ఫార్మెన్స్ను రాబట్టుకొన్న విధానానికి దర్శకుడిని ఎంత అభినందించినా తక్కువే.
ఇక ఈ సినిమా కథ ప్రవాహాన్ని చూస్తే మహానటి సినిమా ఫార్మాట్ అనుక్షణం గుర్తుకు వస్తుంది. మరుగున పడిన అద్బుతమైన కళాకారిణి జీవితాన్ని తెరపైన ఆవిష్కరించాలనే నిర్మాతల అభిరుచి, ఈ సినిమా కోసం వారు చేసిన కృషి తెరపైన ప్రతీ సీన్లో కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్న సేపు ఎమోషన్స్, జాయ్ వెంటాడుతూనే ఉంటుంది. ప్రతీ సన్నివేశంలో అభినయంతోపాటు డ్యాన్సులు, హావభావాలు, పాత్రకు తగ్గిన యాటిట్యూడ్ తో అదరగొట్టింది. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో మెప్పించింది. ఓవరాల్ గా ఓ మంచి అనుభూతిని అందించిన సినిమాను చూశామనే సంతృప్తి కలుగుతుంది.
చిన్న స్థాయి నుంచి ఉత్తరాంధ్రను ఊపేసే స్థాయికి వెళ్లడం.. నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోవడం.. అందరూ తన పేరుని వాడుకుని చివరకు తననే అనాథలా మూలకు వదిలేయడం.. ఇలా గరివిడి లక్ష్మీలో కావాల్సినంత డ్రామా ఉంది. మామూలుగానే బయోపిక్ అంటే ఇప్పుడు అంతా కూడా ‘మహానటి’ మూవీతో పోల్చుతారు. ఈ సినిమాలోనూ అదే టెంప్లెట్ వాడుతారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లక్ష్మి ప్రయాణమే కనిపిస్తుంది. లక్ష్మి జీవితంలోకి బుర్ర కథ ఎంట్రీ ఇవ్వడం, నేర్చుకోవడం, స్టేజ్ మీద మొదటి పర్ఫామెన్స్ ఇవ్వడం, అవమానాలు ఇలా అన్నీ ముందుకు సాగుతుంటాయి.
ఇక సెకండాఫ్లో గరివిడిలక్ష్మి వైభవాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఆమె పేరుని, గాత్రాన్ని చివరకు సినీ ప్రముఖులు కూడా ఎంతలా వాడుకున్నారు.. తన పేరు చెప్పుకుని ఎవరెవరికో స్టేజ్ మీదే ప్రభుత్వ పురస్కారాలు అందుకోవడం ఇవన్నీ మనసుని కదిలిస్తుంటాయి. నమ్మిన వారే మోసం చేయడం, చివరకు అన్నీ కోల్పోయి అనాథగా మిగలడం ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించేలా ఉంటాయి. పాటలు మాత్రం థియేటర్లో ఊపును తీసుకు వస్తాయి. మాటలు అంత గొప్పగా అనిపించవు. చివరగా ‘గరివిడి లక్ష్మి’ చిత్రం ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గరివిడిలక్ష్మికి నివాళిలా అనిపించే రేంజ్లో సినిమా లేకపోయినా.. ఆమెకి ఇన్నేళ్లు రాని గుర్తింపుని తీసుకు వచ్చే చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు వచ్చిన చిత్రాల్లో ఒక ఫోక్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ‘గరివిడి లక్ష్మి’ కూడా ఒకటి. టాలెంటెడ్ నటీనటులు ఆనంది, రాగ్ మయూర్, షకలక శంకర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.
ఇందులో గరివిడి లక్ష్మి జీవితంలో చూసిన పతనం మంచి ప్రభావవంతంగా ఇందులో కనిపిస్తాయి. బుఱ్ఱకథ అనే కళని ఆమె తనదైన శైలిలో మార్చి తనకి తెలియకుండానే ఎలా కమిలిపోయారు అనే ఎమోషనల్ పార్ట్ ఇందులో వర్క్ అవుతుంది. ముఖ్యంగా కొన్ని ఫోక్ సాంగ్స్ థియేటర్స్ లో మాస్ ఆడియెన్స్ ని ఊగేలా చేస్తాయి. ఇక సెకండాఫ్ లో చివరి 30 నిమిషాలు చూసే ఆడియెన్ ని అలా హుక్ చేసి ఉంచుతాయి. ఈ పార్ట్ అంతా సినిమాకి, గరివిడి లక్ష్మికి న్యాయం చేసినట్టు అనిపించింది.
అయితే ఏ బయోపిక్ చూసినా సరే సాలిడ్ ఎలివేషన్స్ ఆ పాత్రకి ఉంటాయి కానీ అలాంటి సన్నివేశాలు ఇందులో డిజైన్ చేసుకోలేకపోవడం డిజప్పాయింట్ చేస్తుంది. అలాగే సినిమాలో ఫస్టాఫ్ కూడా ఏమంత ఇంపాక్ట్ కలిగించేలా లేదు. నెమ్మదిగా కథనం పికప్ అవుతూ వెళుతుంది. దీనితో చూసే ఆడియెన్ కి ఒక బయోపిక్ ఇవ్వాల్సిన హై ని ఈ చిత్రం అందించలేదు. ఇక సెకండాఫ్ లో కూడా కొంతమేర ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘గరివిడి లక్ష్మి’ ప్రతీ ఒకరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక చారిత్రక వ్యక్తుల కథల్లో ఒకటిగా కనిపిస్తుంది. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలు ఊగించిన గరివిడి లక్ష్మి కోసం ఒకప్పుడు ఉన్న సాధనాలు రీత్యా చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆమె ‘ఎవరు’ అని ప్రపంచానికి చూపించిన సినిమా ఇది. అయితే ఈ క్రమంలో సెకండాఫ్ లో ఎమోషనల్ పార్ట్ బాగా వర్క్ అవుతుంది. పాటలు, సంగీతం, ఆనంది సాలిడ్ పెర్ఫామెన్స్, ఇతర నటీనటుల దన్ను కూడా బాగుంది కానీ ఈ తరహా బయోపిక్ లకి కావాల్సిన హై మూమెంట్స్ ఇందులో మిస్ అయ్యాయి. పైగా ఒక స్లో ఫస్టాఫ్ కూడా డల్ గా అనిపిస్తుంది. వీటిని పక్కన పెడితే ఈ తరహా బయోపిక్ లు ఇష్టపడేవారిని ఈ చిత్రం మెప్పిస్తుంది. మిగతా ఆడియెన్స్ తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చెయ్యండి.
#GarividiLakshmi is a well-made film with good casting, an authentic script (though I’m not sure about its historical accuracy), an entertaining first half, and an emotional second half.
Like most biopics, it chronicles the rise and fall of the legendary Uttarandhra folk singer.
Anandi is brilliant, the direction feels genuine, and the music is superb.
Producer Krithi & TG Vishwa Prasad deserve appreciation for producing this film.
Worth giving it a try! 👍
రణబాలి సినిమా గురించి చెప్పాలంటే.. డైరెక్టర్ రాహుల్ అనుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని సూపర్బ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. రణబాలి అనే క్యారెక్టర్ ని కూడా ఫెంటాస్టిక్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ క్యారెక్టర్ మ్యానరిజమ్స్ ని కానీ చాలా బాగా లేఅవుట్ చేసుకున్నాడు. కాకపోతే సెకండ్ హాఫ్ ఇస్ ఏ లెట్ డౌన్ అని నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కి హైలైట్ ఇస్ ద ఇంటర్వెల్. అక్కడ మన అజయ్ అతుల్ కొట్టిన ఆ మ్యూజిక్ కానీ అండ్ ఆల్సో అక్కడ ఉన్న ఆ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అని అనిపించలేదు. అసలు లేవు అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఒక రెండు మూడు ఎపిసోడ్లు పెట్టుకున్నారు కానీ ఫీలయ్యాను. అండ్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేసిన అంత పవర్ఫుల్ విలన్ మనకు తగలలేదు.
మరి నేను చెప్పాను కదా ఇందాక అలాగే కాకుండా వేరేలాగా తీసుంటే చాలా బాగుండేది అనే ఫీలింగ్ తో నేను థియేటర్ లో నుంచి ఇదేంట్రా బాబు సినిమా అంతా ఒకలాగా చూపించి లాస్ట్ లో ఇలా ఎండ్ చేశారు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ తో నేను బయటికి వచ్చాను. లాస్ట్ క్లైమాక్స్ గురించి నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అజయ్ అతుల్ మ్యూజిక్ అయితే ఇరక్కొట్టారు. రాహుల్ ఏ పాయింట్ తో అయితే ఈ సినిమాని ఎస్టాబ్లిష్ చేస్తాడో ఒక ఫెయిరీ టేల్ లాగా లాస్ట్ కి వచ్చేటప్పటికి ఈ సినిమాని మరి ఫెయిరీ టేల్ లాగా ఎండ్ చేస్తున్నామా లేకపోతే మనం ఎలా చేద్దాము అన్న కైండ్ ఆఫ్ ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఈ మూవీని ఇలా ఎండ్ చేయాల్సి వచ్చిందేమో అనేది నా ఫీలింగ్. సో ఓవరాల్ గా మీరు గనుక ఈ సినిమా చూడాలి అనుకుంటే మీ ఎక్స్పెటేషన్స్ ని డెఫినెట్ గా కొంచెం తక్కువగా పెట్టుకోండి. నాకైతే నేను ఫస్ట్ హాఫ్ ఇస్ గ్రేట్, సెకండ్ హాఫ్ నాకైతే లెట్ డౌన్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంక రణబాలి గురించి ఇంకా మనం ఇంతకన్నా మాట్లాడుకునేది ఏమీ లేదన్నమాట.
రణబాలి ఎగ్జామ్ అయిపోయింది. ఇది ఎలా ఉందిరా, ఎలా జరిగింది ఎగ్జామ్ అంటే చెప్పాలా స్పెషల్ గా చెప్పాలా అన్నట్టు గుర్రం అయితే చచ్చింది. నా లాజిక్ ఏందంటే ఏరా నువ్వు ముందు ఎందుకు ఇలా చెప్తున్నావ్ అంటే నాకైతే అసలు మూడు ఉత్సాహం లేదు ఎప్పుడూ లేదు. ఏంట్రా అంటే ఎమోషన్ ఫీల్ కమాన్ ఇప్పుడు ఎలా చెప్పాలి దేశభక్తి సినిమాలో గాని వేరే సినిమాలో గాని అది చూస్తే మనకు ఒక ఫీల్ రావాలి. ఆ ఫీల్ అనేది ఎమోషన్ ద్వారా నో సీన్ల ద్వారా నో నాచురల్ గానో అది ఏదో యాక్టింగ్ కుదురో ఏదో ఒకటి బాగా రావాలి అవుట్పుట్. ఇక్కడ ఎలా ఉంటది అంటే అడ్డంగా నరుకుతా నిలువుగా నరుకుతా అన్నట్టుంది. సినిమాలో ఎమోషన్ పండితే యాక్షన్ పండిద్ది అంతేగాని యాక్షన్ లో 10 మందిని ఒకేసారి నరికితే పండిద్దా?
రొట్టె కొట్టుడు సినిమాని తీస్తారు మళ్ళీ జనాలు మూడు లేదు అంటే ఆ దిగి దిగి అంటారు. ఫస్ట్ మన మెయిన్ టాపిక్ కొండన్న. కొండన్న గారి యాక్టింగ్ ఆ మ్యాండరిజమ్స్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించినాయి ఆయనే అన్ కంఫర్టబుల్ గా ఉన్నారు అన్నట్టు అనిపించింది. అంటే అది యాక్టింగ్ చాలా అన్ ఆర్టిఫిషియల్ గా ఉంది. సో నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు వెళ్ళండి. నాది ఇది మాత్రం ఇంకోటి లేదండి. తెలిసిందేగా అస్సలు నచ్చలేదు.
ఇప్పుడే రణబాలి సినిమా చూసొస్తున్నా.. ప్రతిదాన్ని తీసుకొచ్చి ఒక సీరియల్ వచ్చేసి కాపాడుతది తప్ప మనోళ్ళకి చివరి వరకు రాలేదు అన్నట్టుగా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల నాకు సినిమా నచ్చలేదు. బట్ సినిమాలో చాలా పొటెన్షియల్ ఉంది మంచి సీన్స్ పడ్డాయి. సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్స్ అయితే మాత్రం పర్ఫామెన్సెస్ అని చెప్తా ఫస్ట్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన చాలా చాలా బాగా వర్కౌట్ చేశారు. నాకు ముఖ్యంగా ఈ విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం ఆయన పర్ఫామెన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన స్క్రిప్ట్స్ ఎలక్షన్ అంటే నాకు అసలు నచ్చదు. జయమ్మ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి.
కానీ వీళ్ళు తీసుకున్న బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో 1876 టు 78 ఈ టైంలో ఒకటి ఇస్ ది గ్రేట్ ఫామిన్ వచ్చింది మనకి ఆ కరువుని డిపిక్ట్ అది మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ కొన్ని కొన్ని ఏరియాస్ లో చాలా బాగుందనిపించింది బట్ స్టిల్ కొన్ని కొన్ని ఏరియాస్ లో ఇంకా చాలా వాడాలి టచ్ ఉంటది ప్రతి తెలుగు సినిమాలో ప్రతి ఇండియన్ సినిమాలో బ్రిటిష్ ఏ రకంగా బిహేవ్ చేస్తారో ఈ సినిమాలో కూడా అదే రకంగా ఎందుకు బిహేవ్ చేస్తారు. అండ్ నాకు ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాన్సెప్ట్ ఏది లేదు 5 లక్షల టన్నులు బియ్యం దాన్ని తీసుకుపోవాలి ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటాడు తప్ప ఎందుకు ఎందుకు వీళ్ళని అణగదొక్కుతున్నారు ఏముంది న్యూన్స్ ఏమీ లేదు కొంచెం చూపెట్టు.. అనంటే ఎం చూపించలేదు. ఫస్ట్ హాఫ్ సెట్ అప్ అవ్వలేదు. సూపర్ ఓకే అని చెప్పలేను. ఇట్స్ ఆన్ యావరేజ్ ఫస్ట్ హాఫ్. సేమ్ అదే కమర్షియల్ డ్రాప్ వెళ్ళిపోయినా బానే ఉంది అని ఫీలింగ్ వస్తుంది కొన్ని ఏరియాలో. బట్ స్టిల్ సో ఇది సిచువేషన్. నాకైతే నచ్చలేదు.
రణబాలి సినిమా గురించి చెప్పాలి అంటే ఇట్స్ లైక్ 50-50. అంటే బానే ఉంది అనిపిస్తది కానీ, చాలా చోట్ల ఆ రైటింగ్ పరంగా కావచ్చు లేదంటే ఎగ్జిక్యూషన్ పరంగా కావచ్చు కొంచెం బాగాలేదు అనిపిస్తూ ఉంటది. సో బట్ ఓవరాల్ గా పర్లేదు బానే ఉంది అని చెప్పొచ్చు. సినిమాలో బిజిఎంలు దెబ్బేశారు. సాంగ్స్ బానే ఉంటాయి. కొన్ని సీన్స్ చాలా బాగా అనిపిస్తది. లిటరల్లీ చెప్తున్నా రక్తం మరుగుతది నిజంగా. అండ్ ఎందుకంటే నేను నేను బేసిక్ గా ఫస్ట్ హాఫ్ లో ఒక గంటన్నర అనుకుందాం పోనీ రెండుగంటల కిందట తిన్నా. ఆ ఆకలే బేసిక్ గా నాకు చాలా చాలా అంటే లైక్ ఆ కడుపులో లాగేస్తుంది, కానీ అప్పటివాళ్ళు ఏడు రోజులు వారం నెల రోజులు ఎన్నో ఎన్నో రోజులు తిండి లేకుండా ఉన్నారే అసలు ఎలా రా నాయనా అని చెప్పి అండ్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ ట్రూ. నిజంగా జరిగింది.
ఓకే కాకపోతే లాస్ట్ లో అక్కడ చాలా కన్వీనియెంట్ రైటింగ్ లాస్ట్ లో ఉంటాయి. బట్ కొన్ని సీన్స్ ని మటుకు చాలా బాగా చూపించారు ఓవరాల్ గా పర్లేదు బానే ఉంది అన్న ఒక ఫీల్ వస్తది. అండ్ ఆక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ లో చేశాడు. అట్లా అంటే ఈ క్యారెక్టర్ ని యాక్సెస్ చేసి ఆ లెవెల్ లో చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ హి డిడ్ వెరీ వెల్. సో అది గైస్ సిచువేషన్ సో ఓవరాల్ గా మూవీ అయితే మటుకు బానే ఉంది పర్లేదు. ఇక ఈ మూవీకి జెనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నా రేటింగ్ 3.25\5.
రణబాలి టు అవర్స్ 50 మినిట్స్ రన్ టైం తో థియేటర్ లో రిలీజ్ అయింది. 1870స్ బ్రిటిష్ పీరియడ్ వాళ్ళకి ఎదురు తిరగడం, ఫైట్స్ చేయడం ఇదే ప్లాట్ తీసుకోండి అది కూడా నేను చెప్తున్నాను.. సినిమాలో ఎక్స్ట్రార్డినరీ హై మూమెంట్స్ చాలా తక్కువ కనిపించాయి. నాకు 2019 లో వచ్చిన సైరా నరసింహారెడ్డి మూవీ చాలా ఇష్టం. ఆ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్, హీరో జర్నీ, సాక్రిఫైస్ చేసే ఎమోషన్స్ అన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. కానీ ఈ రణబాలిలో ఆ రేంజ్ లో ఎమోషన్ క్యారీ అవ్వలేదని నాకు అనిపించిందండి. అలా అని రణబాలి బ్యాడ్ అటెంప్ట్ అని చెప్పను. ఇంప్రెసివ్ పార్ట్స్ అని చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంది. లాస్ట్ 25 మినిట్స్ కొంచెం స్ట్రెచ్ అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కంటెంట్ వైస్ ఫ్యామిలీతో చూడొచ్చు. అయితే సినిమాలో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాయింట్స్ లో ఇదొకటి. 1876 78 పీరియడ్ లో గ్రేట్ మద్రాస్ ఫెమిన్ వల్ల దక్షిణ భారతదేశంలో లక్షల మంది ప్రజలు ఆకలి, పోషకాహారం లేక ఇబ్బంది పడుతున్నారు. చనిపోయారు చాలా మంది. ఆ టైం ని రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేసారు. కొన్ని ప్లేసెస్ లో స్టోరీ సింపుల్ యాక్షన్ రివర్స్ ఫ్యాక్టర్ లో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఎమోషనల్ కనెక్షన్ కూడా తక్కువ. ఫస్ట్ హాఫ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ని సెకండ్ హాఫ్ మొత్తం మెయింటైన్ చేయలేకపోయింది. స్టోరీలో ఇంకా స్ట్రాంగ్ డ్రామా, ఎమోషనల్ క్యారెక్టర్, మెమరబుల్ హై మూమెంట్స్ ఉండుంటే ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండేది. ఇక ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే ఇది నా ఒపీనియన్ 2.75\5.
రణబాలి చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అందుకు ఫ్రస్ట్రేషన్. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే రణబాలి అనే వీరుడు కథ, బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుతాడు, ఫామిలీ జరుగుతున్న టైం లో పుట్టాడు అండ్ తన బర్త్ చుట్టూ కూడా ఒక సర్టెన్ మిత్ ఉంటది. అది రివీల్ చేసి నేను మీకు స్పాయిల్ చేయదలుచుకోలేదు. రాహుల్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పర్సనల్ రిలేషన్స్ బాగా రాస్తాడు తను. సో విజయ్ రష్మిక వీళ్ళిద్దరి పోర్షన్ బాగుంది.
అండ్ రాహుల్ కరెక్ట్ థాట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి డిజైన్ చేసిన సీన్స్ కరెక్ట్ గా ల్యాండ్ అవ్వకపోవడం అండ్ ఈ డ్రామాకి ఎప్పుడైనా పే ఆఫ్ ఇచ్చేది త్రూ యాక్షనే కదా. ఈ సింక్ ని తెప్పియలేదు యాక్షన్. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. బట్ బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ సౌండ్ అండి. అది నాకు థియేటర్ ప్రాబ్లమో లేకపోతే ఏంటో తెలియదు కానీ అంటే స్క్రీన్ మీద ఏదో సౌండ్ వస్తుంది అన్నట్టు ఏముంది కానీ బట్ ఫిల్మ్ రాహుల్ ఏం చెప్పాలనుకున్నాడు అనేది నాకు క్లారిటీ వస్తుంది, కొన్ని ఐడియాస్ ఏమో ప్రాపర్ బిల్డ్ అప్ లేకుండా వచ్చేస్తాయి. విజయ్ దేవరకొండ ఇస్ ఫినోమినల్ అండి. చాలా బాగా చేసాడు. ఆ స్లాంగ్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి.. బట్ ఈ యాక్షన్ బిల్డ్ చేయడము అండ్ మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ తను నాకు చెప్పడం వల్ల గాని ఏదన్నా గాని సో ఆ కాన్వర్సేషన్ బిల్డ్ చేయడంలో హి సక్సీడెడ్. ఫైనల్ వర్డ్ ఏంటంటే ఓకే ఒకే.
‘Ranabaali’ బొమ్మ చూశాక నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది! థియేటర్లో ఇది కేవలం ఒక సినిమా లాగ అనిపించలేదు.1900ల నాటి భయంకరమైన కరవు పరిస్థితుల్ని, అండ్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ల దౌర్జన్యాలను ఎదిరించే ఒక అన్టోల్డ్ హిస్టారికల్ మాస్టర్పీస్ ని డైరెక్టర్ మనకు బాగా చూపించారు.
అండ్ స్పెషల్ గా మా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మా కల్చర్ కి దగ్గరగా చూపించినందుకు నాకు బాగా నచ్చిందేమో. అండ్ విజయ్ దేవరకొండ అన్న పర్ఫార్మెన్స్ సూపర్ అసలు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా హ్యాండిల్ చేసాడు. బట్ సీమ స్లాంగ్ అంత సెట్ అవ్వలేదనిపించింది. అండ్ సినిమాలో కొన్ని యాక్షన్స్ సీన్స్ కి పూనకాలు వచ్చేసేలా ఉన్నాయి.
బట్ కొంచెం న్యాచురాలిటీ తగ్గిందనిపిస్తుంది. అండ్ ఇది ఫిక్షనల్ స్టోరీ అని సినిమా చూసేదాకా తెలీదు. సో దాంట్లో చిన్న డిస్సపాయింట్మెంట్ అంతే. మిగతా అంతా సూపర్.
గైస్, ‘Ranabaali’ ఇప్పుడే చూసొస్తున్నా... అసలు థియేటర్లో ప్యూర్ విజువల్ ఫీస్ట్ అండ్ మైండ్-బ్లోయింగ్ పీరియాడిక్ డ్రామా అంతే!
Vijay Deverakonda పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్! మన తెలంగాణోడు అయినా కూడా సీమ యాస, ఆ ఆవేశం సీన్లలో కంప్లీట్ రా ఫైర్ కనిపించింది. Rashmika యాక్టింగ్ నాకంత నచ్చదు కానీ.. ఈ సినిమాలో బాగా చేసింది. అండ్ రియల్ లైఫ్ జోడి కాబట్టి ఇద్దరి పెయిర్ కూడా మస్త్ ఉంది సినిమాలో కూడా.
అండ్ సినిమాలో అప్పటి కరువు బ్యాక్డ్రాప్ ల మరుగున పడిన మన రియల్ హిస్టరీని డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ బాగా చూపించాడు. ఇదైతే మెయిన్ నాకు బాగా నచ్చింది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ అయితే థియేటర్లో goosebumps తెప్పించేశాయి!
కథలో ఉన్న emotion అండ్ డిటైలింగ్ మనల్ని ఆ కాలానికి తీసుకెళ్తది. మరీ క్లాసిక్ రేంజ్ లో కాదు గాని, మన తెలుగు సినిమా లవర్స్ కైతే బాగా నచ్చుతాది సినిమా. కొండన్న ఫ్యాన్స్ కైతే పిచ్చెక్కుద్దేమో.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers