Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1353
Total Reviews
90
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 49-60 of 1353 reviews

Kiku Chiranjeevi Movie Review

5.0
out of 10
‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న థ్రిల్లర్!టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో తెరకెక్కిన చిత్రం ‘కికు చిరంజీవి’. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లింగ్ ట్విస్టులను కలిపి దర్శకుడు శుభ సాయి వెంకట్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపున ఉండటం అనే కాన్సెప...


‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న థ్రిల్లర్!


టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో తెరకెక్కిన చిత్రం ‘కికు చిరంజీవి’. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లింగ్ ట్విస్టులను కలిపి దర్శకుడు శుభ సాయి వెంకట్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపున ఉండటం అనే కాన్సెప్ట్. ఈ కొత్త పాయింట్ చుట్టూ దర్శకుడు రాసుకున్న పాత్రలు, కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి.


కథలో వచ్చే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాను రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కు భిన్నంగా నిలబెడతాయి. ముఖ్యంగా కథనం ముందుకు సాగే కొద్దీ వచ్చే మలుపులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఓవరాల్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను ఇష్టపడే వారికి ‘కికు చిరంజీవి’ మంచి ఆప్షన్. ఈ వారం థియేటర్‌లో తప్పక చూడాల్సిన సినిమాల జాబితాలో దీన్ని చేర్చుకోవచ్చు.


ఫైనల్లీ కొన్ని తడబాట్లు ఉన్నా, థ్రిల్లర్ లవర్స్ కి కికు చిరంజీవి నచ్చోచ్చు. 

Aug 31, 2026 Telugu
6.0
out of 10
I just finished watching the movie *Kiku Chiranjeevi*. It is far better than some of the worst movies I have seen recently. *Kiku Chiranjeevi* is a unique thriller featuring an interesting blend of romance, emotion, action, and plot twists. The premise—featuring a heart located on the right side of the body instead of the left—is quite novel.The lead actor, Kiku Yanamala, delivered a good performa...

I just finished watching the movie *Kiku Chiranjeevi*. It is far better than some of the worst movies I have seen recently. *Kiku Chiranjeevi* is a unique thriller featuring an interesting blend of romance, emotion, action, and plot twists. The premise—featuring a heart located on the right side of the body instead of the left—is quite novel.


The lead actor, Kiku Yanamala, delivered a good performance. Director Shubha Sai Venkat did a great job steering the narrative. The climax leaves the audience with a pleasant, feel-good vibe. Ultimately, this film will appeal to those who enjoy thrillers with unique concepts. Personally, I really liked it.

Aug 31, 2026 Telugu

Kiku Chiranjeevi Movie Review

7.0
out of 10
లవ్, ఎమోషనల్, యాక్షన్, ట్విస్టులతో సాగే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న డిఫరెట్ మూవీ కికు చిరంజీవి. ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపుకు ఉండటం అనే పాయింట్ కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్ చుట్టూ దర్శకుడు శుభ సాయి వెంకట్ రాసుకొన్న పాత్రలు, కథను నడిపించిన విధానం బాగుంది. స్టోరీ గ్రిప్పింగ్‌గా ప్లాన్ చేశారు. ట్విస్టులు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ తో మూవీ డిఫరెంట్ జోనర్‌ లో కనిపిస్తుంది. క్లైమాక్స్‌ను భావోద్వేగాలతో మ...

లవ్, ఎమోషనల్, యాక్షన్, ట్విస్టులతో సాగే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న డిఫరెట్ మూవీ కికు చిరంజీవి. ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపుకు ఉండటం అనే పాయింట్ కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్ చుట్టూ దర్శకుడు శుభ సాయి వెంకట్ రాసుకొన్న పాత్రలు, కథను నడిపించిన విధానం బాగుంది. స్టోరీ గ్రిప్పింగ్‌గా ప్లాన్ చేశారు. ట్విస్టులు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ తో మూవీ డిఫరెంట్ జోనర్‌ లో కనిపిస్తుంది. క్లైమాక్స్‌ను భావోద్వేగాలతో ముగించడం ఈ సినిమాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ గా మారిందని చెప్పాలి.


దీప్తి నడిమింటి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాలో లిస్టులో ఈ మూవీని ఎలాంటి సందేహం లేకుండా చేర్చుకోవచ్చు. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమాగా కికు చిరంజీవి మూవీ ఓ రకమైన అనుభూతిని కలిగిస్తుంది.


Aug 31, 2026 Telugu
7.0
out of 10
జస్ట్ ఇప్పుడే కికు చిరంజీవి మూవీ చూసి వచ్చాను. లాస్ట్ వీక్ ఇరుముడి మూవీ హడావిడిలో ఉన్నాను. ఈ వీక్ వేరే మూవీకి వెళదామని అందరూ టాక్సిక్ వెళ్దాం అని ఫ్రెండ్స్ అంటే, ఆ మూవీ టాక్ ముందే తెలిసి... ఈ మూవీకి తీసుకెళ్ళా. మూవీ చుశాక వీళ్ళని చిరంజీవి మూవీకి తీసుకొచ్చి మంచి పనే చేసాను అనిపించింది. సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా బాగానే తీశారు. కానీ కొన్ని థ్రిల్ మూమెంట్స్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చ...

జస్ట్ ఇప్పుడే కికు చిరంజీవి మూవీ చూసి వచ్చాను. లాస్ట్ వీక్ ఇరుముడి మూవీ హడావిడిలో ఉన్నాను. ఈ వీక్ వేరే మూవీకి వెళదామని అందరూ టాక్సిక్ వెళ్దాం అని ఫ్రెండ్స్ అంటే, ఆ మూవీ టాక్ ముందే తెలిసి... ఈ మూవీకి తీసుకెళ్ళా. మూవీ చుశాక వీళ్ళని చిరంజీవి మూవీకి తీసుకొచ్చి మంచి పనే చేసాను అనిపించింది. 


సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా బాగానే తీశారు. కానీ కొన్ని థ్రిల్ మూమెంట్స్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూపించి ఉండాల్సింది. అయితే ఈ మూవీమీద అసలు నేనేం ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా చూసాను కాబట్టి ఈ మూవీ నాకు నచ్చింది. అండ్ టాక్సిక్ లాంటి కళాఖండంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ మూవీ. డైరెక్టర్ పేరు కూడా తెలీదు కానీ అతను బాగానే హ్యాండిల్ చేసాడు. మంచి స్టోరీ పాయింట్ ను రాసుకున్నాడు. కాకపోతే స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఏది ఏమైనా ఈ వారం ఎవరైనా మంచి మూవీకి వెళ్దాం అనుకుంటే, ఆ టాక్సిక్ ని పక్కనబెట్టి ఈ చిరంజీవి సినిమాకెళ్ళండి. 


Aug 31, 2026 Telugu

Kiku chiranjeevi movie Review

6.0
out of 10
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో ఓ చిన్న థ్రిల్లర్ చిత్రం “చిరంజీవి” కూడా ఒకటి. యువ నటుడు కికు యనమల హీరోగా ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “చిరంజీవి” సినిమా అక్కడక్కడా ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామాగా నిలిచింది.దర్శకుడు శుభ సాయి వెంకట్ తీసుకున్న పాయింట్ లో మంచి పోటెన్షియల్ ఉంది...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో ఓ చిన్న థ్రిల్లర్ చిత్రం “చిరంజీవి” కూడా ఒకటి. యువ నటుడు కికు యనమల హీరోగా ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “చిరంజీవి” సినిమా అక్కడక్కడా ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామాగా నిలిచింది.


దర్శకుడు శుభ సాయి వెంకట్ తీసుకున్న పాయింట్ లో మంచి పోటెన్షియల్ ఉంది. దీనికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. నటీనటులు కూడా తమ బెస్ట్ ఇచ్చారు. కానీ ఇంకా క్లారిటీతో కూడిన కథనం ఇందులో అవసరం ఉంది. దర్శకుడు కొన్ని మూమెంట్స్ ని సింపుల్ గా వదిలేశారు. వీటిని కూడా బాగా డిజైన్ చేసుకొని ఉంటే ఈ థ్రిల్లర్ బెటర్ గా ఉండేది. సో, ఈ కికు చిరంజీవి చిత్రాన్ని తక్కువ అంచనాలతో ప్రయత్నిస్తే మంచిది.


Aug 31, 2026 Telugu

Toxic movie review

3.0
out of 10
టాక్సిక్... (toxic).. Starring Yash, Nayanatara, Kiara Adwani, Rukmini vasanth... Directed by Geethu mohandas... ఏం సినెమారా బాబు ఇది... నవ్వాలో ఏడ్వాలో తెలీట్లేదు... ఇదేదో స్టాండప్ కామెడీలాగా... మెయిన్ డైలాగ్స్ అండి... ఒక డైలాగ్ ఉంటది.. శౌర్యానికి - వీర్యానికి అని ఎదో డైలాగ్ ఉంటది... ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి... ఏం సినిమానో ఏంటో.. ఎమోషనల్ సీన్స్ కి కూడా నవ్వొచ్చింది నాకు. నాకు ఆ టీజర్ చూసిన...

టాక్సిక్... (toxic).. Starring Yash, Nayanatara, Kiara Adwani, Rukmini vasanth... Directed by Geethu mohandas...

ఏం సినెమారా బాబు ఇది... నవ్వాలో ఏడ్వాలో తెలీట్లేదు... ఇదేదో స్టాండప్ కామెడీలాగా... మెయిన్ డైలాగ్స్ అండి... ఒక డైలాగ్ ఉంటది.. శౌర్యానికి - వీర్యానికి అని ఎదో డైలాగ్ ఉంటది... ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి... ఏం సినిమానో ఏంటో.. ఎమోషనల్ సీన్స్ కి కూడా నవ్వొచ్చింది నాకు. నాకు ఆ టీజర్ చూసినప్పుడే ఎదో రాంగ్ యాంగిల్ లో వెళ్తుంది అనుకున్నా... కానీ రిలీజ్ తర్వాత అంతకంటే ఘోరంగా కెజిఎఫ్ లాంటి ఎలివేషన్ల సినిమాలు అన్ని కలిపి కిచిడి చేసిన సినిమా ఇది. 


అసలు సినిమాలో ఏమైనా చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్. హీరో పెర్ఫార్మన్స్ అంతే.. అసలు సినిమాలో ఒక కథలేదు. స్క్రీన్ ప్లే లేదు.. ఎవడు ఎవడ్ని వేసేస్తాడో తెలీదు. ఎందుకో తెలీదు. క్లైమాక్స్ లో అయితే బాగుందని కొందరున్నారు కానీ, నాకు అది కూడా నచ్చలేదు. అండ్ ఈ ఇయర్ లో నేను చుసిన వరెస్ట్ మూవీస్ లో ఇదొకటి. పైగా 20 డాలర్లు పెట్టి సినిమా చూడాల్సొచ్చింది. ఇంతకంటే ఏం చెప్పలేను.. మీకెలా అనిపించింది మరి. 

Aug 27, 2026 Hindi +5
3.0
out of 10
ఇప్పుడే టాక్సిక్ (Toxic) మార్నింగ్ షో చూసొచ్చం మేము మా ఫ్రెండ్స్... సినిమా చూస్తున్నపుడు మేమేదైనా కన్నడలో or హిందీలో చూస్తున్నామా అన్న doubt ఒచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేసి చూస్తున్నట్టు ఉంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నపుడు లేటెస్ట్ గా అందులో ట్రాన్సలేట్ ఆప్షన్ ఉంటుంది కదా.. ఈ సినిమాని కూడా ట్రాన్సలేట్ చూస్తున్నట్టే ఉంది అంత wore...

ఇప్పుడే టాక్సిక్ (Toxic) మార్నింగ్ షో చూసొచ్చం మేము మా ఫ్రెండ్స్... సినిమా చూస్తున్నపుడు మేమేదైనా కన్నడలో or హిందీలో చూస్తున్నామా అన్న doubt ఒచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేసి చూస్తున్నట్టు ఉంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నపుడు లేటెస్ట్ గా అందులో ట్రాన్సలేట్ ఆప్షన్ ఉంటుంది కదా.. ఈ సినిమాని కూడా ట్రాన్సలేట్ చూస్తున్నట్టే ఉంది అంత worest గా ఉంది dubbing. 


ఇంతకు మించి సినిమా గురించి ఏం చెప్పలేను. చెత్త డైరెక్షన్.. చెత్త స్టోరీ.. చెత్త సాంగ్స్... అంతా చెత్త చెత్త... ఇంత చెప్పినా ఎవరైనా సినిమాకి వెళ్లాలనుకుంటే యష్ ని చూడ్డానికి మాత్రమే వెళ్ళండి... సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటే... నిద్రపోతారు అంతే... ఓపికపట్టి సీన్స్ ఎంజాయ్ చేద్దామనుకుంటే జండూబామ్బ్ తీసుకుపోండి. 

Aug 27, 2026 Hindi +5

Toxic movie Review

Thyview

By Thyview

4.0
out of 10
టాక్సిక్ (Toxic)... సినిమా చూసాక ఫస్ట్ అనిపించే వర్డ్ why...  అసలేం చెప్పాలనుకున్నరు డైరెక్టర్... నాకేం అనిపించిందంటే... నాకు తెలిసి ఈ డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్టు మరెవ్వరూ ఇలా తీసే ధైర్యం చేయొద్దు అని ఫిక్స్ అయ్యి తీశారు అని అనిపిస్తుంది. ఒక్క యష్ - కియారా మధ్యలో ఉండే కొన్ని సీన్స్ తప్ప సినిమా మొత్తంలో ఏం కూడా నాకు నచ్చలేదు. అండ్ సినిమా గురించి ప్లస్ మాట్లాడితే ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్... బట్...

టాక్సిక్ (Toxic)... సినిమా చూసాక ఫస్ట్ అనిపించే వర్డ్ why...  అసలేం చెప్పాలనుకున్నరు డైరెక్టర్... నాకేం అనిపించిందంటే... నాకు తెలిసి ఈ డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్టు మరెవ్వరూ ఇలా తీసే ధైర్యం చేయొద్దు అని ఫిక్స్ అయ్యి తీశారు అని అనిపిస్తుంది. ఒక్క యష్ - కియారా మధ్యలో ఉండే కొన్ని సీన్స్ తప్ప సినిమా మొత్తంలో ఏం కూడా నాకు నచ్చలేదు. అండ్ సినిమా గురించి ప్లస్ మాట్లాడితే ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్... బట్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే విధానం గాని, సినిమాలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను గాని అస్సలు చూపించలేకపోయారు. 


అండ్ టాక్సిక్ సినిమాలో యాక్షన్ అయినా బాగుంటుందేమో అని అనుకుంటే అది కూడా నచ్చలేదు నాకు. ఒక సిన్సియర్ అడ్వైస్ నా నుంచి ఏంటంటే... తెలుగులో మాత్రం అస్సలు చూడకండి.. అంత వరెస్ట్ డబ్బింగ్ ఉంది. ఎదో ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేసి చూస్తున్నట్టు ఉంది. అండ్ సినిమాని ఎంతో కొంచెం చూడాలి అని గట్టిగా ఫిక్స్ అయితే అది యష్ కోసం మాత్రమే అయి ఉంటుంది. 

Aug 27, 2026 Hindi +5

Toxic movie review

5.0
out of 10
టాక్సిక్ టాక్సిక్ నో టాక్సిక్ (Toxic) అన్నమాట.. ఇప్పుడే చూసి రావడం జరిగిందన్నమాట.. టాక్సిక్ మూవీలో మంచిగా రాసుకున్న ఫిమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి... అంటే అన్ని కాదు.. నయనతార, కియారా రోల్స్ మాత్రమే. అండ్ యష్ క్యారెక్టర్ అయితే సూపర్ గా రాసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని కొన్ని సీన్లుగా పార్ట్ లు పార్ట్ లు గా చూస్తే బాగానే ఉన్నాయి కానీ, ఓవరాల్ గా సినిమా మొత్తం కలిపి చూస్తే... ఇదేమిటి సినిమా ఇలా తీశార...

టాక్సిక్ టాక్సిక్ నో టాక్సిక్ (Toxic) అన్నమాట.. ఇప్పుడే చూసి రావడం జరిగిందన్నమాట.. టాక్సిక్ మూవీలో మంచిగా రాసుకున్న ఫిమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి... అంటే అన్ని కాదు.. నయనతార, కియారా రోల్స్ మాత్రమే. అండ్ యష్ క్యారెక్టర్ అయితే సూపర్ గా రాసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని కొన్ని సీన్లుగా పార్ట్ లు పార్ట్ లు గా చూస్తే బాగానే ఉన్నాయి కానీ, ఓవరాల్ గా సినిమా మొత్తం కలిపి చూస్తే... ఇదేమిటి సినిమా ఇలా తీశారు... అంత గ్రాండియర్ గా చెప్తున్నామంటూ, వీళ్ళు చెప్పిన స్టోరీ ఇదా అని అనిపిస్తుంది. 


బట్ వీళ్ళు సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. ఆ పాయింట్ ని కొంచెం కమర్షియల్ గానే చెప్తూ, ఒక ఆర్టిఫీషియల్ గా చెప్దామన్న ప్రయత్నంలో కొంచెం పులిహోర ఎక్కువ కలపడం వల్ల... ఇదేమిట్రా బాబు... ఇంత నాన్ టాక్సిక్ లాకుందేంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అసలు సినిమాలో ఎవడి గ్యాంగ్ ఎవడిదో... ఎవడు ఎవడ్ని చంపుకుంటారో కూడా తెలీదన్నట్టు ఉంటుంది. టెక్నికల్ గా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ గా ఉంటాయి. అంతే తప్ప ఇంకేమి ఎక్కవు. అసలు సినిమాలో లాస్ట్ లో వచ్చే ఆ 15 నిమిషాల స్టోరీని అనలైజ్ చేసుకుంటే.. సినిమా ఇదన్నమాట అనుకుంటూ బైటికివస్తారు. ఆ క్లైమాక్స్ కూడా నచ్చకపోతే సినిమా మొత్తం మీ మైండ్ లోంచి ట్రాష్ అయిపోతుంది అనమాట. మొత్తానికి డిస్సపాయింట్ అనే చెప్పాలి యష్ టీం కి. 

Aug 27, 2026 Hindi +5

Toxic movie review

5.0
out of 10
టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... its a long long rod రోత మూవీ. ఎంత దరిద్రంగా అంటే ఉంది. పొరపాటున పార్ట్ 2 కూడా అనౌన్స్ చేస్తారేమో అని భయపడ్డా.. అంతలా ఉంది ఈ సినిమా. first of all ఈ సినిమా అసలు సినిమాయే కాదు. ఇదేంటంటే ధైర్యానికి, వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం అంతే.. అంతకు మించి ఇంకేమి లేదు సినిమా. ఎంతసేపు నరుక్కోవడం, కాల్చుకోవడం తప్ప ఇంకేం లేదు. చాలా సినిమాలు దీనికి సిమిలర్ గా కనిపిస్తా...

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... its a long long rod రోత మూవీ. ఎంత దరిద్రంగా అంటే ఉంది. పొరపాటున పార్ట్ 2 కూడా అనౌన్స్ చేస్తారేమో అని భయపడ్డా.. అంతలా ఉంది ఈ సినిమా. first of all ఈ సినిమా అసలు సినిమాయే కాదు. ఇదేంటంటే ధైర్యానికి, వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం అంతే.. అంతకు మించి ఇంకేమి లేదు సినిమా. ఎంతసేపు నరుక్కోవడం, కాల్చుకోవడం తప్ప ఇంకేం లేదు. చాలా సినిమాలు దీనికి సిమిలర్ గా కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా అనిమల్, 1 నేనొక్కడినే సినిమా గుర్తొస్తాయి. అది ఎందుకో సినిమా చూస్తే తెలుస్తుంది. 


నాకు తెలిసి యష్ కూడా సినిమా మొత్తం చూసి ఉండడు. లేకపోతే వేరేలా ఉండేది. యాష్ అయితే అద్భుతంగా యాక్టింగ్ చేసాడు. కానీ సీరియస్లి ఆ కష్టం వేస్ట్ అయింది. అండ్ రవిబాసుర్ అయితే పెద్ద దెబ్బేసాడు, బీజీఎమ్ కి కూడా. యాక్షన్ సినిమాలు ఇలా తీయకూడదు అనడానికి టాక్సిక్ బెంచ్ మార్క్ అని చెప్పాలి సింపుల్ గా. అండ్ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవలేదు. ఇంక నాకైతే ఈ సినిమా గురించి చెప్పే ఓపిక కూడా లేదు. నా రేటింగ్ గనక సినిమాకి ఇవ్వాలంటే.. యష్ పెర్ఫార్మన్స్ కోసం, పెట్టిన ఖర్చుకి గాను 1\5 ఇస్తాను.. ఇంతకంటే ఇవ్వలేను. 

Aug 27, 2026 Hindi +5
5.0
out of 10
KGF tarvatha Yash movie ante expectations next level lo unnayi. Teaser, glimpses, trailers lo action + adult content chusi mass feast anukunte… movie konchem different route teesukuntundi. First half chala scenes routine ga anipistayi. Second half inka drag ayye feeling vastundi.Kani climax twist matram mind block! Assalu expect cheyyani reveal. Yash screen presence, performance super, visuals kud...

KGF tarvatha Yash movie ante expectations next level lo unnayi. Teaser, glimpses, trailers lo action + adult content chusi mass feast anukunte… movie konchem different route teesukuntundi. First half chala scenes routine ga anipistayi. Second half inka drag ayye feeling vastundi.


Kani climax twist matram mind block! Assalu expect cheyyani reveal. Yash screen presence, performance super, visuals kuda rich ga unnayi. But strong story, engaging screenplay leka povadam biggest minus. Action, violence ekkuva…


Overall: Yash kosam, action lovers kosam once watchable. Kani KGF range expectations tho vellakandi. Mass feast anukunte… psychological twist tho shock istundi Toxic!

Aug 27, 2026 Hindi +5

Toxic movie review

4.0
out of 10
టాక్సిక్ కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించే పాయింట్ తో రూపొందగా యష్ ఈ కథని ఎందుకని ఒప్పుకున్నాడో అన్న డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే హీరోగా సినిమాను సేఫ్ చేయడానికి యష్ ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ కథలో బలం లేక పోవడంతో యష్ శ్రమ వృధా అయింది. ఇక హీరోయిన్స్ చాలా మంది ఉండగా ఉన్నంతలో కీయరా అద్వాని రోల్ ఆకట్టుకుంది. ఇక సినిమాలో సంగీతం జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్...

టాక్సిక్ కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించే పాయింట్ తో రూపొందగా యష్ ఈ కథని ఎందుకని ఒప్పుకున్నాడో అన్న డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే హీరోగా సినిమాను సేఫ్ చేయడానికి యష్ ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ కథలో బలం లేక పోవడంతో యష్ శ్రమ వృధా అయింది. ఇక హీరోయిన్స్ చాలా మంది ఉండగా ఉన్నంతలో కీయరా అద్వాని రోల్ ఆకట్టుకుంది. ఇక సినిమాలో సంగీతం జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. 


చాలా సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండొచ్చు…లెంత్ చాలా తగ్గించవచ్చు కూడా కానీ మేకర్స్ అలా చేయలేదు. దాంతో అనవసరంగా సీన్స్ అన్నీ కూడా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. అయితే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎపిసోడ్ లు బాగానే ఆకట్టుకోవడంతో ఓవరాల్ గా ఓకే అనిపించింది. మొత్తం మీద ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే కొంచం ఎక్కువ ఓపిక పట్టి చూస్తె మొత్తం మీద యష్ కోసం స్టైలిష్ టేకింగ్ కోసం ఒక సారి చూడొచ్చు అనిపించవచ్చు. కానీ కొంచం అంచనాలను పెట్టుకుని వెళ్ళినా చాలా చాలా చాలా ఓపిక పట్టాల్సి వస్తుంది. 


Aug 27, 2026 Hindi +5
Why MRO?