Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

608
Total Reviews
90
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 1-12 of 608 reviews
Clear all filters
6.0
out of 10
ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి మంచి బజ్ సెట్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాని మేకర్స్ హిందీ, తెలుగు భాషల్లో విడుదలకి ప్లాన్ చేశారు. మరి నేడు థియేటర్స్ లో విడుదలకి వచ్చిన ఈ బోల్డ్ యాక్షన్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌పైకి చాలా అద్భు...

ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి మంచి బజ్ సెట్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాని మేకర్స్ హిందీ, తెలుగు భాషల్లో విడుదలకి ప్లాన్ చేశారు. మరి నేడు థియేటర్స్ లో విడుదలకి వచ్చిన ఈ బోల్డ్ యాక్షన్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌పైకి చాలా అద్భుతంగా మలిచారాలని చెప్పొచ్చు. పంకజ్ త్రిపాఠీ, అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 


ఇక మొత్తానికి, మీర్జాపూర్: ది మూవీ అనేది ఓ ఇంటెన్స్ బోల్డ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో అభిమానించే మీర్జాపూర్ ప్రపంచాన్ని బిగ్ స్క్రీన్‌పైకి మేకర్స్ సాలిడ్ గా వర్కవుట్ చేశారు. ప్రధాన నటీనటుల బలమైన నటన, పవర్‌ఫుల్ డైలాగ్స్, హ్యూమర్, ఇంటెన్స్ ఫేస్-ఆఫ్ సీక్వెన్స్ లు అలాగే థియేట్రికల్ మూమెంట్స్‌తో నిండిన మాస్ సెకండ్ హాఫ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలెట్ గా నిలిచాయి. ఫస్టాఫ్ లో కొంచెం స్లో కథనం, కొన్ని పాత్రలని వీక్ గా వదిలేయడం కొంచెం డిజప్పాయింట్ చేస్తాయి. ఇవి పక్కన పెడితే మీర్జాపూర్ సినిమా సాలిడ్ ట్రీట్ అందిస్తుంది, వాచ్ ఇట్.


Sep 19, 2026 Hindi +1
అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో సూపర్ డూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఈ క్రమంలో ఇదే కథతో సినిమాగా వస్తున్నదంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే వెబ్ సిరీస్‌ కథ, సన్నివేశాలు, డైలాగ్స్‌, యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా దర్శకుడు గుర్మిత్ సింగ్ మరో ప్రయోగమే చేశాడని చెప్పాలి. మెయిన్ స్టోరి పాయింట్‌ తీసుకొని కొత్తగా సన్నివేశాలు, పాత్రలను సృష్టించి.. అంతే గ్రిప్పిం...

అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో సూపర్ డూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఈ క్రమంలో ఇదే కథతో సినిమాగా వస్తున్నదంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే వెబ్ సిరీస్‌ కథ, సన్నివేశాలు, డైలాగ్స్‌, యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా దర్శకుడు గుర్మిత్ సింగ్ మరో ప్రయోగమే చేశాడని చెప్పాలి. మెయిన్ స్టోరి పాయింట్‌ తీసుకొని కొత్తగా సన్నివేశాలు, పాత్రలను సృష్టించి.. అంతే గ్రిప్పింగ్‌గా కథను చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.


స్టోరీ లైన్ చుట్టూ అల్లుకొన్న సన్నివేశాలు కొత్తగా ఉండటంతో న్యూ వెర్షన్ ఆఫ్ మీర్జాపూర్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు వచ్చే కిక్, మజా, ఈ మూవీ చూస్తే అంతగా అనిపించదు. కాకపోతే డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ ఉంటుంది. మీర్జాపూర్ సిరీస్ చూడని వాళ్లకు ఈ మూవీ తెగనచ్చేస్తుంది. ఈ సినిమాలో కాళిన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నా భయ్యాగా దివ్యేందు, గుడ్గుగా అలీ ఫజల్, బబ్బన్ యాదవ్‌గా రవికిషన్ తమ పాత్రల్లో రెచ్చిపోయారు. రసిక దుగల్ పాత్ర సిరీస్‌లో ఉన్నదాని కంటే భిన్నంగా డిజైన్ చేశారు. జాన్ స్టీవార్డ్ ఎడ్యూరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. గూమార్ పాట బాగుంది. ఓవరాల్ గా మంచి అనుభూతితో బయటకు వచ్చేలా సినిమాగా మీర్జాపూర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.


Sep 19, 2026 Hindi +1
4.0
out of 10
This weekend does not have many notable theatrical releases, but Happy Journey stands out because of its ensemble cast.Starring Annapurna, Aamani, Jhansi, Vamsi, Payal Radhakrishna, Sunaina, Ravi Siva Teja, Jinisha Alishetty, Roopa Srinivas, Prudhvi Dandamudi and others.HighlightsInteresting basic ideaA few decent sequencesEuropean locationsDrawbacksWeak screenplayMeandering narrativeRepetitive dr...

This weekend does not have many notable theatrical releases, but Happy Journey stands out because of its ensemble cast.


Starring Annapurna, Aamani, Jhansi, Vamsi, Payal Radhakrishna, Sunaina, Ravi Siva Teja, Jinisha Alishetty, Roopa Srinivas, Prudhvi Dandamudi and others.


Highlights


Interesting basic idea

A few decent sequences

European locations


Drawbacks


Weak screenplay

Meandering narrative

Repetitive drinking and free-stuff comedy

Emotional portions fail to connect

Lack of consistent humour


Despite a reasonably promising idea, Happy Journey fails to turn its premise into an engaging film. The comedy is inconsistent, the emotions do not connect, and the screenplay keeps wandering.


The journey ultimately feels more tiring than entertaining.


Bottom Line: Tiring Journey

Sep 18, 2026 Telugu

Happy Journey Movie Review

6.0
out of 10
హ్యాపీ జర్నీ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, చెప్పాలనుకున్న సందేశం చాలా బాగున్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్‌ లో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా వంశీధర్ గౌడ్ అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకోగా.. రవి శివతేజతో ఆయన కాంబినేషన్ బాగుంది.కొన్ని అనవసరమైన సీన్లు, కొన్ని రిపీటెడ్ సన్నివేశాల వల్ల కథనం కాస్త నెమ్మదించినా పరవాలేదనిపిస్తుంది. ప్రతినాయిక పాత్రకు సంబంధించిన భావోద...

హ్యాపీ జర్నీ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, చెప్పాలనుకున్న సందేశం చాలా బాగున్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్‌ లో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా వంశీధర్ గౌడ్ అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకోగా.. రవి శివతేజతో ఆయన కాంబినేషన్ బాగుంది.


కొన్ని అనవసరమైన సీన్లు, కొన్ని రిపీటెడ్ సన్నివేశాల వల్ల కథనం కాస్త నెమ్మదించినా పరవాలేదనిపిస్తుంది. ప్రతినాయిక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. కామెడీకి, ఎమోషన్ కు మధ్య సరైన సమతుల్యత లోపించినట్లు అనిపిస్తుంది.


ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. హేమంత్ ధోమే కథ బాగున్నా, అభిరామ్ నాయుడు కథనాన్ని మరికొంత గ్రిప్పింగ్ గా తీర్చిదిద్ది ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది. ఫైనల్‌ గా .. 'హ్యాపీ జర్నీ' కొన్ని మంచి నవ్వులు, సందేశం కావాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్.


Sep 18, 2026 Telugu

Happy Journey movie Review

6.0
out of 10
అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఒక మంచి ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం కొంతమంది ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇక టైటిల్‌ తోనే ఈ సినిమా ఇచ్చే మెసేజ్ ఏమిటో అర్థమవుతుంది....

అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఒక మంచి ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం కొంతమంది ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇక టైటిల్‌ తోనే ఈ సినిమా ఇచ్చే మెసేజ్ ఏమిటో అర్థమవుతుంది.


అయితే స్క్రీన్‌ ప్లే సరిగ్గా కుదరకపోవడం వల్ల ‘హ్యాపీ జర్నీ’ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొన్ని అనవసరమైన సన్నివేశాల వల్ల మంచి సీన్ల ఇంపాక్ట్ తగ్గి, సినిమా ఫ్లో దెబ్బతింది. రిపీటెడ్ సీన్లను తగ్గించి ఉంటే బాగుండేది. ఇక మొత్తంగా చూసుకుంటే.. ‘హ్యాపీ జర్నీ’ అక్కడక్కడా ఓకే అనిపించే ఫన్ డ్రామాగా నిలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ పాయింట్, వారితో జెనరేట్ చేసిన ఫన్ అక్కడక్కడా మెప్పిస్తాయి. కానీ కథ, కథనాల్లో కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్ డెప్త్ మిస్ కావడంతో ఫలితంకి దెబ్బ పడింది. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకుంటే ఈ కామెడీ డ్రామా కనెక్ట్ అవుతుంది.


Sep 18, 2026 Telugu
5.0
out of 10
సహజంగా ఇలాంటి డివోషనల్‌ సోషియో ఫాంటసీ చిత్రాలలో దర్శకుడు ఏదో ఒక వైపు నిలబడతారు. పూర్తిగా భక్తిని లేదంటే ఆ భక్తి పేరుతో కొందరు చేసే మోసాలను ఎక్స్ ప్లోర్ చేస్తారు. కానీ ఇందులో దైవశక్తి ఉందని చెబుతూనే, ఆ దైవ శక్తి పేరుతో కొందరు తమ పగను ఎలా తీర్చుకుంటారో చూపించారు. నాస్తికుడైన సిద్ధార్థ్‌ ఆస్తికుడిగా మారడంతో ఈ సినిమా ముగుస్తుంది. అయితే సినిమాలో హీరో సమస్యని ఛేదించడానికి లేట్ గా ఎంట్రీ ఇస్తాడు. దాంతో క...

సహజంగా ఇలాంటి డివోషనల్‌ సోషియో ఫాంటసీ చిత్రాలలో దర్శకుడు ఏదో ఒక వైపు నిలబడతారు. పూర్తిగా భక్తిని లేదంటే ఆ భక్తి పేరుతో కొందరు చేసే మోసాలను ఎక్స్ ప్లోర్ చేస్తారు. కానీ ఇందులో దైవశక్తి ఉందని చెబుతూనే, ఆ దైవ శక్తి పేరుతో కొందరు తమ పగను ఎలా తీర్చుకుంటారో చూపించారు. నాస్తికుడైన సిద్ధార్థ్‌ ఆస్తికుడిగా మారడంతో ఈ సినిమా ముగుస్తుంది. అయితే సినిమాలో హీరో సమస్యని ఛేదించడానికి లేట్ గా ఎంట్రీ ఇస్తాడు. దాంతో క్లయిమాక్స్ ట్విస్ట్ ను కన్వెన్సింగ్‌ గా చెప్పడానికి దర్శకుడికి టైమ్‌ సరిపోలేదు. దానికి తోడు ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్ సాగదీయడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. 


మొత్తం మీద దర్శకుడు ఏదో అనుకుని, మరేదో తీశాడనే భావనే కలుగుతుంది. సంతోష్‌ జాగర్లపూడికి ఈ తరహా సినిమా తీయడంలో అనుభవం ఉన్నా.. ఎందుకో ఈ కథను ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యాడు. క్లయిమాక్స్ ట్విస్ట్ తప్పితే... సినిమా అంతా సాదాసీదాగా సాగిపోవడంతో 'మహేంద్రగిరి వారాహి' ప్రేక్షకులను మెప్పించడం కష్టమే!


Sep 16, 2026 Telugu
6.0
out of 10
సుమంత్ హీరోగా, సిద్దూ జొన్నలగడ్డ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదలయి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. సంతోష్ జాగర్లమూడి రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. ఈ ‘మహేంద్రగిరి వారాహి’లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ డివోషనల్ టచ్ కూడా బాగుంది. అయితే ఇలాంటి డివోషనల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కా...

సుమంత్ హీరోగా, సిద్దూ జొన్నలగడ్డ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదలయి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. సంతోష్ జాగర్లమూడి రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. ఈ ‘మహేంద్రగిరి వారాహి’లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ డివోషనల్ టచ్ కూడా బాగుంది. అయితే ఇలాంటి డివోషనల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.


‘మహేంద్రగిరి వారాహి’ అంటూ వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ లో కొన్ని ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు సంతోష్ రాసిన కథ, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని ట్విస్ట్ లు సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కాన్ ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం, కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన, డివోషనల్ తరహా చిత్రాలని ఇష్టపడేవారికి ఈ సినిమా కొంతవరకు కనెక్ట్ అవుతుంది.

Sep 16, 2026 Telugu

Maremma movie review

4.0
out of 10
దర్శకుడు మంచాల నాగరాజు మారెమ్మ కథకు రాసుకొన్న పాయింట్ బాగున్నది. తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయాలను, ఆచారాలను జోడించి కథగా మార్చుకొన్నాడు. సినిమా ఆరంభంలో వచ్చిన సన్నివేశాలను చూస్తే.. ఎదో డిఫరెంట్ కథ చెప్పబోతున్నాడా? అనే ఫీలింగ్ కలిగించాడు. కానీ కథలోకి వెళ్లిన కొద్ది పేలవమైన రైటింగ్, అర్ధం పర్థం లేని సన్నివేశాలు, డైలాగ్స్ చాలా విసుగు పుట్టిస్తాయి. కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో అర్ధం కాదు. కొన్ని సీ...

దర్శకుడు మంచాల నాగరాజు మారెమ్మ కథకు రాసుకొన్న పాయింట్ బాగున్నది. తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయాలను, ఆచారాలను జోడించి కథగా మార్చుకొన్నాడు. సినిమా ఆరంభంలో వచ్చిన సన్నివేశాలను చూస్తే.. ఎదో డిఫరెంట్ కథ చెప్పబోతున్నాడా? అనే ఫీలింగ్ కలిగించాడు. కానీ కథలోకి వెళ్లిన కొద్ది పేలవమైన రైటింగ్, అర్ధం పర్థం లేని సన్నివేశాలు, డైలాగ్స్ చాలా విసుగు పుట్టిస్తాయి. కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో అర్ధం కాదు. కొన్ని సీన్లు చాలా దారుణంగా చిత్రీకరించారనే ఫీలింగ్ కలుగుతుంది. 


కథలో ఓ ఫ్లో ఉండదు. ప్రేమ కథలో ఎమోషన్ ఉండదు. ఓవరాల్‌ గా అతుకుల బొంత మాదిరిగా ఉంటుంది. ఫస్టాఫ్ ఏదో పర్వాలేదనిపించినా .. సెకండాఫ్‌ను సాగదీసి సాగదీసి సహనానికి పరీక్ష పెట్టారేంటి? అనే విసుగు పుడుతుంది. మంచి పాయింట్‌ను ఎమోషనల్‌గా రాసుకోలేని నిస్సహాయత ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. మాధవ్ యాక్టింగ్ బాగానే ఉన్నా, పూర్తి స్థాయిలో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ లా డిజైన్ చేయలేదు. కథ బలం, కథనంలో పసలేకపోతే సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతేలా ఉంటుందనేది ఈ సినిమాలో కనిపించింది. లైటింగ్ ఈ సినిమాకు మైనస్. నటీనటుల ముఖాలు, వారి హావభావాలు కనిపించనంతగా చీకటిలో ముంచేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ అవుట్‌పుట్ చాలా నాసిరకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సినిమాను చూడాలా? వద్దా? అనేది మీరే నిర్ణయించుకొండి.


Sep 16, 2026 Telugu

Maremma movie Review

5.0
out of 10
మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో మాధవ్ భూపతి రాజు నటించిన విలేజ్ డ్రామా ‘మారెమ్మ’ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ చిత్రంలో తెలంగాణ నేపథ్యానికి చెందిన పలు అంశాలు మెప్పిస్తాయి. అక్కడి సాంప్రదాయ విలువలు, ముఖ్యంగా జానపద పాటలు ఇంప్రెస్ చేసాయి. ఇక యువ నటుడు మాధవ్ భూపతిరాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. పాత్రకి తగ్గట్టుగా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్ ఇందులో...

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో మాధవ్ భూపతి రాజు నటించిన విలేజ్ డ్రామా ‘మారెమ్మ’ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ చిత్రంలో తెలంగాణ నేపథ్యానికి చెందిన పలు అంశాలు మెప్పిస్తాయి. అక్కడి సాంప్రదాయ విలువలు, ముఖ్యంగా జానపద పాటలు ఇంప్రెస్ చేసాయి. ఇక యువ నటుడు మాధవ్ భూపతిరాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. పాత్రకి తగ్గట్టుగా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్ ఇందులో బాగున్నాయి. అయితే రచనా లోపం వల్ల అతని ప్రతిభకు తగ్గ స్కోప్ దక్కలేదు. అలానే యంగ్ హీరోయిన్ దీపా బాలు పల్లెటూరి అమ్మాయిగా డీసెంట్ లుక్స్, నటనతో ఆకట్టుకుంది. 


ఇక మొత్తంగా చూసుకుంటే ‘మారెమ్మ’ అనేది స్పష్టత లేని ఒక బోరింగ్ రూరల్ డ్రామాగా నిలిచింది. సినిమా కథనం ఆద్యంతం నీరసంగానే సాగుతుంది. ఎలాంటి హై, ఎమోషనల్ మూమెంట్స్ లేకుండా చప్పగా నడిపించడం డిజప్పాయింట్ చేస్తుంది. యువ నటుడు మాధవ్ తన మొదటి సినిమా అయినా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ పేలవమైన రచన మరియు దర్శకత్వం వల్ల ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది.


Sep 16, 2026 Telugu
ఒక కుటుంబంలో అమ్మవారి శాపం, దేవుడి శాపం కథతో `మురారి` సినిమా వచ్చింది. అది పెద్ద హిట్‌. మళ్లీ అలాంటి కథతోనే ఇప్పుడు `మహేంద్రగిరి వారాహి` మూవీని రూపొందించారు. శాపం ఉందనేది ముందే తెలిసిపోతుంది. దాన్ని ఆ రాజవంశానికి చెందిన వాళ్లు ఎలా ఫేస్‌ చేశారు? దాన్నుంచి బయటపడ్డారా? బలయ్యారా? అనేదే కథ. దాన్ని ట్విస్ట్ లతో నడిపించడం విశేషం. ఇక సినిమా ప్రారంభంలో శాపానికి సంబంధించిన బ్యాక్‌ స్టోరీని వివరిస్తారు. అది...

ఒక కుటుంబంలో అమ్మవారి శాపం, దేవుడి శాపం కథతో `మురారి` సినిమా వచ్చింది. అది పెద్ద హిట్‌. మళ్లీ అలాంటి కథతోనే ఇప్పుడు `మహేంద్రగిరి వారాహి` మూవీని రూపొందించారు. శాపం ఉందనేది ముందే తెలిసిపోతుంది. దాన్ని ఆ రాజవంశానికి చెందిన వాళ్లు ఎలా ఫేస్‌ చేశారు? దాన్నుంచి బయటపడ్డారా? బలయ్యారా? అనేదే కథ. దాన్ని ట్విస్ట్ లతో నడిపించడం విశేషం. ఇక సినిమా ప్రారంభంలో శాపానికి సంబంధించిన బ్యాక్‌ స్టోరీని వివరిస్తారు. అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లోకి వచ్చాక ఆ ఎమోషన్‌ గానీ, ఆ పెయిన్‌గానీ సినిమాలో క్యారీ కాదు. కథ బాగున్నా, దాన్ని కన్విన్సింగ్‌ గా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. 


సిద్ధార్థ్‌ పాత్రలో సుమంత్‌ ఫర్వాలేదనిపించాడు. ప్రారంభంలో ఆయన పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. సెకండాఫ్‌లో బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంది. దాన్ని అంతా సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ విషయంలో దర్శకుడి ఆలోచన వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. దేవుడికి సంబంధించిన కథలతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా ఆ కోవకి చెందిన మూవీనే. అయితే అందులో ట్విస్ట్ లు, టర్న్ లతో నడిపించిన తీరు బాగుంది. ఇలాంటి డివైన్‌ మూవీస్‌ ఇష్టపడేవారికిది నచ్చే చిత్రమవుతుంది.



Sep 16, 2026 Telugu

Mandaadi movie review

5.0
out of 10
గ్రామీణ నేపథ్యం, సాంప్రదాయ క్రీడలు, మానవ సంబంధాల కలయికతో తెరకెక్కిన తమిళ డ్రామా 'మండాడి' సినిమా. తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా గురువారం థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలో సముద్ర తీర ప్రాంత ప్రజల జీవనశైలిని, వారి సాంప్రదాయ పడవల పోటీని అత్యంత వాస్తవికంగా తెరకెక్కించడం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. అలాగే సినిమాలో సూరి, స...

గ్రామీణ నేపథ్యం, సాంప్రదాయ క్రీడలు, మానవ సంబంధాల కలయికతో తెరకెక్కిన తమిళ డ్రామా 'మండాడి' సినిమా. తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా గురువారం థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలో సముద్ర తీర ప్రాంత ప్రజల జీవనశైలిని, వారి సాంప్రదాయ పడవల పోటీని అత్యంత వాస్తవికంగా తెరకెక్కించడం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. అలాగే సినిమాలో సూరి, సుహాస్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. 


అయితే ఫస్టాఫ్ వేగంగా, ఆసక్తికరంగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌ కు వచ్చేసరికి స్టోరీలో రొటీన్ ఫార్ములా కనిపించి వేగం తగ్గుతుంది. ఇక సినిమాలో హీరోల మధ్య ఉన్న స్నేహం, భావోద్వేగ నేపథ్యాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల కొన్ని సీన్లలో ఎమోషన్ లోపించింది. 


దర్శకుడు మతిమారన్ పుగలేంది ఓ విభిన్నమైన వాటర్ స్పోర్ట్ నేపథ్యాన్ని ఎంచుకుని మెప్పించే ప్రయత్నం చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, సముద్రతీర పోరాట ఘట్టాలకు ప్రాణం పోసింది. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ తీరప్రాంత అందాలను గ్రాండ్ గా చూపించింది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే బాగుండేది. ఫైనల్‌ గా.. 'మండాడి' సినిమా సాంప్రదాయ నీటి క్రీడ ఆధారంగా ఈగో, ప్రతీకారాల చుట్టూ సాగే ఓ ఆసక్తికరమైన డ్రామా. విభిన్నమైన కథాంశాలను కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

Sep 16, 2026 Tamil +1
5.0
out of 10
అక్కినేని సుమంత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. థ్రిల్లర్ జానర్లో ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో ఈ సినిమాలపై మంచి బజ్ ఏర్పడుతోంది. తాజాగా సుమంత్ కథానాయకుడిగా, సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక సినిమాలో స్టార్టింగ్ లో, అలాగే సిద్...

అక్కినేని సుమంత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. థ్రిల్లర్ జానర్లో ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో ఈ సినిమాలపై మంచి బజ్ ఏర్పడుతోంది. తాజాగా సుమంత్ కథానాయకుడిగా, సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. 


ఇక సినిమాలో స్టార్టింగ్ లో, అలాగే సిద్దు జొన్నలగడ్డ కామియో పాత్ర ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. యూట్యూబర్‌ గా సుమంత్ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలను డైరెక్టర్ చాలా ఆసక్తికరంగా మలిచారు. క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉండి ఆకట్టుకుంటాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో కొంచెం కత్తెర వేయాల్సిన అవసరం కనిపిస్తుంది.


అయితే స్టోరీలో కొన్ని లాజిక్‌లు లోపించడం మైనస్‌గా మారింది. స్టోరీలో దైవ ప్రభావం చివర్లోనే చూపించడం, మధ్యలో వచ్చే కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉండటం సినిమా వేగాన్ని తగ్గిస్తాయి. సాంకేతిక పరంగా చూస్తే వీఎఫ్ఎక్స్ పనితనం, ఏఐ వాడకం నాణ్యంగా లేకపోవడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. ఫైనల్‌గా.. మొత్తానికి 'మహేంద్రగిరి వారాహి' సినిమా కొన్ని మంచి ఆకట్టుకునే క్షణాలతో కూడిన మిస్టరీ థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒకసారి చూడదగిన చిత్రం.

Sep 16, 2026 Telugu
Why MRO?