Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1353
Total Reviews
90
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 97-108 of 1353 reviews

Irumudi Movie Review

Thyview

By Thyview

7.0
out of 10
ఇరుముడి... first things first... సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఇది చాలా ట్రిక్కీ ఫిలిం అండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని 3 జోనర్స్ లో డివైడ్ చేస్తే... ముందుగా అందులో ఒకటి ఫ్యామిలీ డ్రామా... చాలా బాగా తీశారు. స్పెషల్లీ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలా బాగుంది. రవితేజ రోల్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. రెండోది ఆ డివోషనల్ టచ్. మరీ ఓ రేంజ్ లో వాడుకున్నట్టు కాకుండా, ఎక్కడా తప...

ఇరుముడి... first things first... సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఇది చాలా ట్రిక్కీ ఫిలిం అండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని 3 జోనర్స్ లో డివైడ్ చేస్తే... ముందుగా అందులో ఒకటి ఫ్యామిలీ డ్రామా... చాలా బాగా తీశారు. స్పెషల్లీ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలా బాగుంది. రవితేజ రోల్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. రెండోది ఆ డివోషనల్ టచ్. మరీ ఓ రేంజ్ లో వాడుకున్నట్టు కాకుండా, ఎక్కడా తప్పులేకుండా సహజంగా చూపించారు. అండ్ మూడోది థ్రిల్లర్ అంది.. సెకండ్ హాఫ్ లో ఒక మెయిన్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కి సప్రయిజ్ అవుతారు. 


రివెంజ్ డ్రామా... ఇదొక్కటి మనకు రొటీన్ ఫీల్ ఇస్తుంది. అవి కథకు అవసరమా అని కూడా అనిపిస్తుంది. అండ్ మూవీ ఎండ్ చేసిన విధానం కూడా అంతగా తీసుకోలేకపోయాను. బట్ ఓవరాల్ మూవీ బాగుంది. రవితేజకి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. 

Aug 22, 2026 Tamil +1

Irumudi Movie Review

7.0
out of 10
ముందుగా "ఇరుముడి" కచ్చితంగా రవితేజ నుండి వచ్చిన రీసెంట్ బెస్ట్ కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రేచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు. కథ పాయింట్ ఆసక్తిని కలిగించగా స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే డైరెక్టర్ చెప్పాలి అనుకున్న పాయింట్ ని బలంగానే చెప్పాడు, కానీ కొంచం అది హార్ట్ హిట్టింగ్ లెవల్ లో అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్స్ కూడా ఎమోషనల్ గా హార్డ...

ముందుగా "ఇరుముడి" కచ్చితంగా రవితేజ నుండి వచ్చిన రీసెంట్ బెస్ట్ కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రేచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు. కథ పాయింట్ ఆసక్తిని కలిగించగా స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే డైరెక్టర్ చెప్పాలి అనుకున్న పాయింట్ ని బలంగానే చెప్పాడు, కానీ కొంచం అది హార్ట్ హిట్టింగ్ లెవల్ లో అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్స్ కూడా ఎమోషనల్ గా హార్డ్ హిట్టింగ్ లెవల్ లో ఉంటాయి. అవి ఆడియన్స్ ఎక్స్ పెర్ట్ చేయరు. కానీ ఇదే సినిమాకి మేజర్ గా ప్లస్ అయింది అని చెప్పొచ్చు.


అయ్యప్ప స్వామీ పాటలు రెండూ కూడా సినిమాలో హైలెట్ అనిపించాయి. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం స్లో గా అనిపించింది. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా కొంచం ఎలివేట్ చేసేలా ఉంటే బాగుండేది. రవితేజతో పాటూ చిన్న పాప బాగా నటించింది. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఓవరాల్ గా రీసెంట్ టైంలో రవితేజ నుండి వచ్చిన మూవీస్ లో ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. మరీ ఎక్కువ అంచనాలతో కాకుండా నార్మల్ గా థియేటర్స్ కి వెళితే కచ్చితంగా అంచనాలను అందుకుని మెప్పిస్తుంది సినిమా. 

Aug 22, 2026 Tamil +1

Irumudi Movie Review

7.0
out of 10
వరుస పరాజయాల తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా 'ఇరుముడి'. ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధం, గ్రామంలో చిన్న పిల్లలకు ఎదురయ్యే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఓ ఆదర్శవంతమైన తండ్రిగా రవితేజ, ఆయన కూతురుగా బేబీ నక్షత్ర ఈ స్టోరీకి ప్రాణప్రతిష్ట చేశారు. వరుస డిజాస్టర్ల అనంతరం రవితేజ తన వయస్సుకు తగ్గ, నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ఎంచుక...

వరుస పరాజయాల తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా 'ఇరుముడి'. ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధం, గ్రామంలో చిన్న పిల్లలకు ఎదురయ్యే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఓ ఆదర్శవంతమైన తండ్రిగా రవితేజ, ఆయన కూతురుగా బేబీ నక్షత్ర ఈ స్టోరీకి ప్రాణప్రతిష్ట చేశారు. వరుస డిజాస్టర్ల అనంతరం రవితేజ తన వయస్సుకు తగ్గ, నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ఎంచుకుని అద్భుతమైన నటనను కనబరిచాడు. 


ఇక స్టోరీలోన బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను చివరి వరకు సీటును కట్టిపడేస్తాయి. ఇక ఇరుముడి సినిమా చివరి 20 నిమిషాల్లో వచ్చే తండ్రీ కూతుళ్ల క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసి కంటతడి పెట్టిస్తాయి. థ్రిల్లర్ సీన్లలో కొంత ఉత్కంఠ కొరవడినప్పటికీ, రవితేజ నటన, బలమైన ఎమోషనల్ కనెక్ట్, క్లైమాక్స్ దృశ్యాలు 'ఇరుముడి' చిత్రాన్ని తప్పక చూడదగినదిగా నిలబెట్టాయి.

Aug 21, 2026 Tamil +1
7.0
out of 10
Irumudi Review: Finally… RaviTeja is back... in the moment ‘Irumudi’ was announced, something felt different. The title, the vibe, the whole setup created a positive buzz. The story isn’t something completely new. It’s actually a very relatable, everyday family story that could happen around us. I don’t want to reveal much because even a small detail can spoil the experience.But there’s one thing...

Irumudi Review: Finally… RaviTeja is back... in the moment ‘Irumudi’ was announced, something felt different. The title, the vibe, the whole setup created a positive buzz. The story isn’t something completely new. It’s actually a very relatable, everyday family story that could happen around us. I don’t want to reveal much because even a small detail can spoil the experience.


But there’s one thing I’ll definitely say — every parent who has a daughter MUST watch this film.

Ravi Teja didn’t just play the character… he lived it. The pain, anger, love and intensity — everything lands perfectly.


And thnanks to director Shiva Nirvana for giving Ravi Teja such a strong and emotionally powerful character.

Final Verdict: Irumudi is a MUST WATCH.


Aug 21, 2026 Tamil +1
7.0
out of 10
Irumudi is a sincere and emotionally driven family drama that marks a refreshing change for Ravi Teja. The story may feel familiar, but its strong emotional core and relevant social message make it impactful.Ravi Teja delivers one of his most grounded performances in recent times, carrying the film with conviction and intensity. Shiva Nirvana handles the emotional moments effectively, especially i...

Irumudi is a sincere and emotionally driven family drama that marks a refreshing change for Ravi Teja. The story may feel familiar, but its strong emotional core and relevant social message make it impactful.


Ravi Teja delivers one of his most grounded performances in recent times, carrying the film with conviction and intensity. Shiva Nirvana handles the emotional moments effectively, especially in the latter half.


The film may not be entirely flawless, but its strong performances, emotional depth and meaningful message make it a worthwhile theatrical watch.


Verdict: A heartfelt drama with a powerful Ravi Teja performance — definitely worth watching.

Aug 21, 2026 Tamil +1
8.0
out of 10
ఫైనల్ గా రవన్న కొట్టేసాడు హిట్టు... ఇదొక్కటేనా... మా ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు. నాలుగైదేళ్ల నుండి రవితేజ నుండి సరైన సినిమా వస్తనే లేదు. క్రాక్ తర్వాత నాకే సినిమా కూడా నచ్చలేదు. అందుకే కొన్ని థియేటర్లో కూడా చూడలేదు. కానీ ఇరుముడి ఎప్పుడైతే స్టార్ట్ అయి టైటిల్ అనౌన్స్ అయిందో అప్పుడే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది నాకు. సినిమా పక్కా చూద్దాం ఎలా ఉన్నా సరే అని. ఫైనల్ గా ఈరోజు థియేటర్...

ఫైనల్ గా రవన్న కొట్టేసాడు హిట్టు... ఇదొక్కటేనా... మా ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు. నాలుగైదేళ్ల నుండి రవితేజ నుండి సరైన సినిమా వస్తనే లేదు. క్రాక్ తర్వాత నాకే సినిమా కూడా నచ్చలేదు. అందుకే కొన్ని థియేటర్లో కూడా చూడలేదు. కానీ ఇరుముడి ఎప్పుడైతే స్టార్ట్ అయి టైటిల్ అనౌన్స్ అయిందో అప్పుడే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది నాకు. సినిమా పక్కా చూద్దాం ఎలా ఉన్నా సరే అని. ఫైనల్ గా ఈరోజు థియేటర్లోకి వచ్చేసింది... మార్నింగ్ షోకే వెళ్ళిపోయా.. 


సినిమా కొత్త కథేం కాదు... మన చుట్టూ ఉండే సగటు ఫ్యామిలీ స్టోరీ.. స్టోరీ గురించి నేనేం చెప్పినా రివీల్ అయిపొద్దని చెప్పట్లేదు గాని... ఒక్కటి మాత్రం చెప్తా... ప్రతి ఆడపిల్ల తల్లి దండ్రులు పక్కా చూడాల్సిన సినిమా ఇది. రవితేజ సినిమాలో జీవించేసాడు.. డైరెక్టర్ శివ నిర్వాణకి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నా తరపున ఆడియన్స్ తరపున పెద్ద థ్యాంక్స్... ఫైనల్ గా మస్ట్ వాచ్ ఇరుముడి...

Aug 21, 2026 Tamil +1

Irumudi Movie Review

7.0
out of 10
రవితేజతో శివ నిర్వాణ సినిమా అని, అయ్యప్ప మాల బ్యాక్ డ్రాప్ అని "ఇరుముడి"ని ప్రకటించడంతోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో అయ్యప్ప స్వామి ఎపిసోడ్స్ అన్ని కూడా బాగున్నాయి. అయ్యప్ప మాలలు వేసే భక్తులు ఆ సీన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. యాక్షన్ సీక్వెన్స్ లు అన్ని బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచే ప్రేక్షకులను ఏడిపించేసారు. అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి, కూతుళ్లు అన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాల...

రవితేజతో శివ నిర్వాణ సినిమా అని, అయ్యప్ప మాల బ్యాక్ డ్రాప్ అని "ఇరుముడి"ని ప్రకటించడంతోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో అయ్యప్ప స్వామి ఎపిసోడ్స్ అన్ని కూడా బాగున్నాయి. అయ్యప్ప మాలలు వేసే భక్తులు ఆ సీన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. యాక్షన్ సీక్వెన్స్ లు అన్ని బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచే ప్రేక్షకులను ఏడిపించేసారు. అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి, కూతుళ్లు అన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాలి అని మెసేజ్ ని చాలా చక్కగా చూపించారు. అయితే ఆ అమ్మాయిల సంబంధించిన సీన్స్ కొంత ఇబ్బందిగా, హార్డ్ హిట్టింగ్ గా అనిపించవచ్చు కొంతమందికి. 


సినిమా అంతా అయిపోయిన తర్వాత ఏదో అసంతృప్తి అనిపిస్తుంది. కానీ చివర్లో మణికంఠ పాత్ర చెప్పిన ఒక్క డైలాగ్ తో సినిమా పరిపూర్ణం అయింది అనే ఫీల్ వస్తుంది. ఇటీవల సినిమా థియేటర్స్ నుంచి ఏడుస్తూ బయటకువచ్చిన సినిమాలు రాలేదు. చాన్నాళ్ల తర్వాత ఒక సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఏడుస్తూ బరువైన హృదయంతో బయటకు వస్తారు. అయితే కమర్షియల్ గా చూస్తే ఈ సినిమాని కార్తీక మాసం, అయ్యప్ప మాల సీజన్ లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ హైప్, రీచ్ వచ్చేది. చాన్నాళ్ల తర్వాత రవితేజ హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. మొత్తంగా ‘ఇరుముడి’ తన కూతురు, ఊళ్ళో ఆడపిల్లల కోసం నిలబడే ఓ మిడిల్ క్లాస్ తండ్రి కథ అయ్యప్ప స్వామి మాలతో యాక్షన్ క్రైమ్ ఎమోషనల్ సినిమాగా మెప్పిస్తుంది.


Aug 21, 2026 Tamil +1

Irumudi Movie Review

7.0
out of 10
నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. వాటిని డైజెస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు.. "ఇరుముడి" సినిమాలో అలాంటి కఠినమైన నిజాలని చెప్పాడు శివ నిర్వాణ. ఈ సినిమా కమర్షియల్ గా ఆడుతుందా లేదా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తీసాడు. ఆడపిల్ల తండ్రులకు ఈ సినిమా చూస్తున్నప్పుడు భయమేస్తుంది.. అలాంటి కొన్ని మనసును హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్నా కూడా ఇది పక్కా కమర్షియల్ సినిమ...

నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. వాటిని డైజెస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు.. "ఇరుముడి" సినిమాలో అలాంటి కఠినమైన నిజాలని చెప్పాడు శివ నిర్వాణ. ఈ సినిమా కమర్షియల్ గా ఆడుతుందా లేదా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తీసాడు. ఆడపిల్ల తండ్రులకు ఈ సినిమా చూస్తున్నప్పుడు భయమేస్తుంది.. అలాంటి కొన్ని మనసును హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్నా కూడా ఇది పక్కా కమర్షియల్ సినిమా. తెలిసిన కథనే కానీ సరికొత్త స్క్రీన్ ప్లేతో చెప్పాడు శివ నిర్వాణ.. 


ఆడపిల్లకు భయం ఉండకూడదు అనే లైన్ ఈ సినిమాతో చెప్పాలనుకున్నాడు శివ. దానికి రవితేజ లాంటి యాక్టర్ తోడయ్యేసరికి మెసేజ్ బాగానే పాస్ అయింది. ఎమోషనల్ సినిమా కాబట్టి స్లోగానే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. ఇరుముడిలో లోపాలు కూడా బాగానే ఉన్నాయి.. కానీ వాటిని కంటెంట్ తో కవర్ చేశాడు శివ నిర్వాణ. ఈ క్రమంలో అక్కడక్కడ ఆయన స్లో అయ్యాడు కానీ ఓవరాల్ గా మంచి మెసేజ్ ఇచ్చాడు. ఓవరాల్ గా ఇరుముడి.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా..!


Aug 21, 2026 Tamil +1

Irumudi movie review

7.0
out of 10
రవితేజ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించామా? మాస్ ఎలిమెంట్స్‌కు దూరంగా.. ఓ తండ్రి ఆవేదన, కూతురిపై ప్రేమ, అన్యాయంపై తిరుగుబాటును కథగా ఎంచుకున్నాడు శివ నిర్వాణ.‘ఇరుముడి’ కథ మొదలయ్యేది చాలా సింపుల్‌గా. త్రినాథ్ ఓ సాధారణ వ్యక్తి. కుటుంబమే అతడి ప్రపంచం. కానీ తన కూతురి జీవితంలో జరిగే ఓ విషాద ఘటన అతడిని పూర్తిగా మార్చేస్తుంది. ఆ ఘటన వెనుక దాగి ఉన్న నిజాలను బయటకు తీసే కొద్దీ.. కథ వ్యక్తిగత సమస్య నుంచి ప...

రవితేజ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించామా? మాస్ ఎలిమెంట్స్‌కు దూరంగా.. ఓ తండ్రి ఆవేదన, కూతురిపై ప్రేమ, అన్యాయంపై తిరుగుబాటును కథగా ఎంచుకున్నాడు శివ నిర్వాణ.

‘ఇరుముడి’ కథ మొదలయ్యేది చాలా సింపుల్‌గా. త్రినాథ్ ఓ సాధారణ వ్యక్తి. కుటుంబమే అతడి ప్రపంచం. కానీ తన కూతురి జీవితంలో జరిగే ఓ విషాద ఘటన అతడిని పూర్తిగా మార్చేస్తుంది. ఆ ఘటన వెనుక దాగి ఉన్న నిజాలను బయటకు తీసే కొద్దీ.. కథ వ్యక్తిగత సమస్య నుంచి పెద్ద పోరాటంగా మారుతుంది.


ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, కుటుంబ ఎమోషన్స్‌పై ఫోకస్ చేసిన సినిమా.. సెకండాఫ్‌లో అసలు రంగు చూపిస్తుంది. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు కథకు ప్రాణం. తండ్రి బాధ, కోపం, కూతురికి న్యాయం చేయాలనే పట్టుదల ప్రేక్షకుడిని కూడా ఆ ఎమోషన్‌లోకి తీసుకెళ్తాయి.

త్రినాథ్‌గా రవితేజ తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కనపెట్టి నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అరుపులు, యాక్షన్ కంటే కళ్లలో కనిపించే బాధతోనే ఎక్కువ ప్రభావం చూపించాడు. అయితే కథలోని కొన్ని సన్నివేశాలు, కొన్ని లాజిక్స్ సాధారణ ప్రేక్షకుడికి ప్రశ్నలు రేకెత్తించవచ్చు. అయినప్పటికీ దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ మాత్రం బలంగా రీచ్ అవుతుంది. మొత్తంగా.. ‘ఇరుముడి’ ఓ రెగ్యులర్ మాస్ సినిమా కాదు. ఓ తండ్రి గుండెల్లో మొదలైన బాధ.. చివరికి ప్రతీకారంగా ఎలా మారిందో చెప్పే ఎమోషనల్ డ్రామా. సింగిల్ వర్డ్ లో దీక్ష ఫలించింది. 


Aug 21, 2026 Tamil +1

Irumudi Movie Review

8.0
out of 10
రవితేజ సినిమా అంటే మాస్‌, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు, డాన్సులు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు ఉంటాయి. కానీ అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న క్రమంలో తాను రూట్‌ మార్చి చేసిన మూవీ `ఇరుముడి`. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఇది సాగుతుంది. ముఖ్యంగా తండ్రీ కూతురు మధ్య బాండింగ్‌,, ఎమోషన్స్ ని ఆవిష్కరించే మూవీ ఇది. సినిమాలో రవితేజ కనిపించరు, త్రినాథ్‌ మాత్రమే కనిపిస్తాడు. అంతగా పాత్రలో ఒదిగిపోయి నటించి...

రవితేజ సినిమా అంటే మాస్‌, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు, డాన్సులు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు ఉంటాయి. కానీ అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న క్రమంలో తాను రూట్‌ మార్చి చేసిన మూవీ `ఇరుముడి`. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఇది సాగుతుంది. ముఖ్యంగా తండ్రీ కూతురు మధ్య బాండింగ్‌,, ఎమోషన్స్ ని ఆవిష్కరించే మూవీ ఇది. సినిమాలో రవితేజ కనిపించరు, త్రినాథ్‌ మాత్రమే కనిపిస్తాడు. అంతగా పాత్రలో ఒదిగిపోయి నటించి ఆకట్టుకున్నాడు. 


ఇక సినిమాలో సెంటిమెంట్‌, ఎమోషనల్‌ గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్‌ అయ్యారు. ఈ సినిమా సీరియస్‌ గా సాగుతున్నా, మధ్య మధ్యలో రవితేజ మార్క్ ఫన్‌ కూడా ఉంటుంది. తండ్రికూతురు మధ్య ఉన్న కెమిస్ట్రీని బలంగా చూపించారు. క్లైమాక్స్ మాత్రం కొంత రెగ్యూలర్‌గానే ఉంది. కొన్ని ట్విస్ట్ లు కూడా పెద్దగా పేలలేదు. అంతగా వర్కౌట్‌ కాలేదు. ఎమోషనల్‌ సీన్లు మాత్రం అదిరిపోయాయి. ఉత్కంఠకు గురి చేసే సీన్లు బాగున్నాయి. పైగా సినిమాలో అమ్మాయిలను ధైర్యంగా పెంచాలనే సందేశం బాగుంది. ఫైనల్ గా అయ్యప్పస్వామి భక్తుల బ్యాక్‌ డ్రాప్‌లో తండ్రికూతుళ్ల సెంటిమెంట్‌ నేపథ్యంలో సాగిన ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామా ఇరుముడి. రవితేజ చేసిన కొత్త ప్రయత్నమని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడగలిగే మూవీ. అమ్మాయిలను, ముఖ్యంగా ఆడ పిల్లల్ని భయంతో కాదు, ధైర్యంతో పెంచాలని చెప్పడం బాగుంది.




Aug 21, 2026 Tamil +1

Irumudi movie review

Sakshi

By Sakshi

7.0
out of 10
రవితేజ అంటే మాస్ ఎలివేషన్స్, ఎనర్జీ, కామెడీ, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ **‘ఇరుముడి’**లో మాత్రం ఆయనను పూర్తిగా మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ఒక సాధారణ తండ్రి.. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక చేసే పోరాటమే ఈ కథకు అసలు బలం. మొదటి భాగంలో కుటుంబం, ఊరి నేపథ్యం, త్రినాథ్ క్యారెక్టర్‌ను నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు.. కథ అసలు మలుపు తిరిగిన తర్వాత డ్రామాను...

రవితేజ అంటే మాస్ ఎలివేషన్స్, ఎనర్జీ, కామెడీ, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ **‘ఇరుముడి’**లో మాత్రం ఆయనను పూర్తిగా మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ఒక సాధారణ తండ్రి.. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక చేసే పోరాటమే ఈ కథకు అసలు బలం. మొదటి భాగంలో కుటుంబం, ఊరి నేపథ్యం, త్రినాథ్ క్యారెక్టర్‌ను నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు.. కథ అసలు మలుపు తిరిగిన తర్వాత డ్రామాను బలంగా నడిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను గట్టిగా హిట్ చేస్తాయి.


త్రినాథ్‌గా రవితేజ నటన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి బాధ, కోపం, కసితో కూడిన పాత్రను ఆయన బాగా క్యారీ చేశాడు. అమ్మాయిలపై జరిగే అన్యాయం, తండ్రి ఆవేదనను కలిపి చెప్పిన విధానం మెప్పిస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు, కథలోని కొన్ని అంశాలు అందరికీ సులభంగా కనెక్ట్ కాకపోవచ్చు. అయినా కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా వెళ్లి ఎమోషన్‌ను నమ్ముకున్న ‘ఇరుముడి’.. రవితేజ కెరీర్‌లో డిఫరెంట్ అటెంప్ట్‌గా నిలుస్తుంది.


Aug 21, 2026 Tamil +1

Irumudi Movie Review

7.0
out of 10
ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు... ఏదైనా చెప్పుకోగలమనే ధైర్యంతో - ప్రీ క్లైమాక్స్‌ లో రవితేజ డైలాగ్. 'ఇరుముడి'లో మెయిన్ పాయింట్, స్టోరీ కోర్ ఎమోషన్ ఆ ఒక్క మాటలో చెప్పేశారు దర్శకుడు శివ నిర్వాణ. తాను విన్నది, చూసినది... ప్రతిదీ తండ్రితో చెప్పే అలవాటు ఉన్న అమ్మాయి మణెమ్మ. అటువంటి చిన్నారి ఒకానొక సందర్భంలో తండ్రికి కాస్త దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఓ ప్రమాదం. కూతురి దగ్గర తండ్రి ఉంటే ప్రమా...

ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు... ఏదైనా చెప్పుకోగలమనే ధైర్యంతో - ప్రీ క్లైమాక్స్‌ లో రవితేజ డైలాగ్. 'ఇరుముడి'లో మెయిన్ పాయింట్, స్టోరీ కోర్ ఎమోషన్ ఆ ఒక్క మాటలో చెప్పేశారు దర్శకుడు శివ నిర్వాణ. తాను విన్నది, చూసినది... ప్రతిదీ తండ్రితో చెప్పే అలవాటు ఉన్న అమ్మాయి మణెమ్మ. అటువంటి చిన్నారి ఒకానొక సందర్భంలో తండ్రికి కాస్త దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఓ ప్రమాదం. కూతురి దగ్గర తండ్రి ఉంటే ప్రమాదం జరిగేది కాదని ప్రేక్షకులు ఫీలయ్యేలా తీశారు శివ నిర్వాణ.


అయితే 'ఇరుముడి'... రెగ్యులర్ రవితేజ సినిమా కాదు. మాస్ కమర్షియల్ రొటీన్ అనిపించే సినిమాలకు భిన్నమైన సినిమా. అలాగని, రవితేజ ఫైట్స్ చేయలేదా? అంటే... చేశారు. అవన్నీ కథలో భాగంగా వచ్చాయి. కావాలని ఫైట్ చేసినట్టు అనిపించదు. కథ, కథలో కీలకమైన ట్విస్ట్ రొటీన్ అనిపించినా... ప్రారంభం నుంచి ముగింపు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న లోపాలను కవర్ చేసింది. కమర్షియాలిటీ కోసం శివ నిర్వాణ పక్కకు అడుగులు వేయలేదు. రవితేజ తన మాస్ ఇమేజ్ పక్కన పెట్టి ఆడపిల్ల తండ్రిగా జీవించారు. ఆయన్ను కొత్తగా చూడటం బావుంది. కుటుంబ ప్రేక్షకులకు, ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులకు అమితంగా నచ్చే చిత్రమిది.


Aug 21, 2026 Tamil +1
Why MRO?