Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1353
Total Reviews
90
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 37-48 of 1353 reviews

Romanchakam movie review

Tupaki

By Tupaki

5.0
out of 10
ప్రేమ- హాస్యం- ఉత్కంఠ.. ‘రోమాంచకం’ చిత్రానికి పెట్టిన క్యాప్షన్ ఇది. కానీ ఇందులో హాస్య రసం మాత్రమే పండింది. ప్రేమకథల్లో ప్రతిసారీ కొత్తదనం చూపించడం కష్టం. కథ కంటే కథనంతోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ‘రోమాంచకం’లో ఆ మ్యాజిక్ జరగలేదు. అసలు హీరో - హీరోయిన్ ఎప్పుడు ప్రేమించుకున్నారో అర్ధం కాదు. పైగా సినిమాలో డైలాగులకు.. కథకి సంబంధం ఏంటో అర్థం కాదు. ఇలా లాజిక్ లేని బోలెడన్ని సన్నివేశాల మధ్య కేవలం ఫ...

ప్రేమ- హాస్యం- ఉత్కంఠ.. ‘రోమాంచకం’ చిత్రానికి పెట్టిన క్యాప్షన్ ఇది. కానీ ఇందులో హాస్య రసం మాత్రమే పండింది. ప్రేమకథల్లో ప్రతిసారీ కొత్తదనం చూపించడం కష్టం. కథ కంటే కథనంతోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ‘రోమాంచకం’లో ఆ మ్యాజిక్ జరగలేదు. అసలు హీరో - హీరోయిన్ ఎప్పుడు ప్రేమించుకున్నారో అర్ధం కాదు. పైగా సినిమాలో డైలాగులకు.. కథకి సంబంధం ఏంటో అర్థం కాదు. ఇలా లాజిక్ లేని బోలెడన్ని సన్నివేశాల మధ్య కేవలం ఫ్రెండ్స్ మధ్య కామెడీ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.


హీరో హీరోయిన్ల కంటే.. ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ ఫేమ్ నరేంద్ర రవి పాత్ర సెకండాఫ్ ను కొంత ఎంగేజింగ్ గా మార్చింది. సినిమాలో క్లైమాక్స్ బాగానే పండింది. అక్కడ కూడా కామెడీ వర్కవుట్ అయింది. ట్విస్టు ఓకే. ‘రోమాంచకం’ టైటిల్ కు న్యాయం చేసే సినిమా కాదు. ఓవరాల్ గా కథాకథనాల్లో ఒక కొత్త దర్శకుడి నుంచి ఇంతకంటే ఎక్కువ ఫ్రెష్నెస్ ఆశిస్తారు. చివరగా ‘రోమాంచకం’ టైటిల్‌ కు తగ్గ రోమాంచనం లేకపోయినా.. టైంపాస్ బడ్డీ కామెడీ కోసం ఓ లుక్కేయొచ్చు!

Sep 03, 2026 Telugu

Romanchakam movie review

Thyview

By Thyview

5.0
out of 10
‘రోమాంచకం’ మూవీని సందీప్ రెడ్డి వంగ ప్రెసెంట్ చేసారు... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. ఆక్చుయల్లి మూవీ టైటిల్ చూసి, ప్రొడక్షన్ హౌస్ చూసి, అలాగే ప్రమోషన్స్ వల్ల మంచి హై తో సినిమాకెళ్ళాను. కానీ మూవీ లో అస్సలు అంత ఏం లేదు. సినిమా మెయిన్ లీడ్ మధ్య అసలు కెమిస్ట్రీ కూడా లేదు. అసలు హీరో హీరోయిన్లు ఎందుకు లవ్ చేసుకుంటారో కూడా అర్ధం కాదు. అసలు ఈ సినిమాలో ప్లస్ ఏమున్నదంటే కామెడ...

‘రోమాంచకం’ మూవీని సందీప్ రెడ్డి వంగ ప్రెసెంట్ చేసారు... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. ఆక్చుయల్లి మూవీ టైటిల్ చూసి, ప్రొడక్షన్ హౌస్ చూసి, అలాగే ప్రమోషన్స్ వల్ల మంచి హై తో సినిమాకెళ్ళాను. కానీ మూవీ లో అస్సలు అంత ఏం లేదు. సినిమా మెయిన్ లీడ్ మధ్య అసలు కెమిస్ట్రీ కూడా లేదు. అసలు హీరో హీరోయిన్లు ఎందుకు లవ్ చేసుకుంటారో కూడా అర్ధం కాదు. 


అసలు ఈ సినిమాలో ప్లస్ ఏమున్నదంటే కామెడీ.. అది తప్ప ఇంకేమి బాగా లేదు. సినిమాలో కథేంటంటే... హీరో ఓ అప్ స్టార్ట్ చేస్తాడు. ఆ అప్ ద్వారానే హీరోయిన్ ని మీట్ అయ్యి లవ్ చేస్తాడు. కానీ అసలు వీళ్ళ మధ్య లవ్ జెనరేట్ అవ్వడానికి ప్రాపర్ రీసన్ కూడా ఉండదు. సినిమాలో నరేంద్ర రవి కామెడీ హైలెట్ అయింది. అసలు సినిమాలో రైటింగ్ స్ట్రాంగ్ ఉంటె ఎంతో కొంత నచ్చేది. సుమంత్ క్యారెక్టరైజేషన్ బాగున్నా, దానికి జస్టిఫికేషన్ ఉండదు. ఇక హీరోయిన్ అనంతిక కు చాలా లిమిటెడ్ స్క్రీన్ టైం వచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమాని కామెడీయే కాపాడాలి. ఇంక సినిమా గురించి చెప్పేదేం లేదు. 


Sep 03, 2026 Telugu

Romanchakam Movie Review

5.0
out of 10
#Romanchakam REVIEW: #iDreamMedia Rating (2.25/5)కుర్రకారు కామెడీ సినిమా..పెద్దగా కథ ఏమీ వుండదు..సీన్లు సీన్లుగా చూసుకుంటూ వెళ్లడమేనవ్వు వచ్చిన చోట నవ్వడం…నవ్వు రాని టైమ్ లో వెయిట్ చేయడం.మ్యాడ్-పంచతంత్రం ల సినిమాల ఇమిటేషన్ప్లస్ పాయింట్లుకామెడీమైనస్ పాయింట్లుఆరంభంలో కొంతమలిసగం మధ్యలో మరి కొంతపంచ్ లైన్: పరాచకం

#Romanchakam REVIEW:

#iDreamMedia Rating (2.25/5)


కుర్రకారు కామెడీ సినిమా..

పెద్దగా కథ ఏమీ వుండదు..


సీన్లు సీన్లుగా చూసుకుంటూ వెళ్లడమే

నవ్వు వచ్చిన చోట నవ్వడం…


నవ్వు రాని టైమ్ లో వెయిట్ చేయడం.

మ్యాడ్-పంచతంత్రం ల సినిమాల ఇమిటేషన్


ప్లస్ పాయింట్లు


కామెడీ


మైనస్ పాయింట్లు


ఆరంభంలో కొంత


మలిసగం మధ్యలో మరి కొంత


పంచ్ లైన్: పరాచకం

Sep 03, 2026 Telugu

Romanchakam movie review

4.0
out of 10
#Romanchakam Artificial Short Film Vibes With Only a Few Comedy Scenes Working!Film is boring for most of its runtime, with tiring staging, barely any plot, and an artificial short film feel. Few dialogues and comedy scenes work in both halves, along with the climax, but the rest feels very dragged. Love story portions are practically nonexistent, while the weak writing and editing make it feel li...

#Romanchakam Artificial Short Film Vibes With Only a Few Comedy Scenes Working!


Film is boring for most of its runtime, with tiring staging, barely any plot, and an artificial short film feel. Few dialogues and comedy scenes work in both halves, along with the climax, but the rest feels very dragged. Love story portions are practically nonexistent, while the weak writing and editing make it feel like a bunch of chaotic scenes stitched together


Narendra Ravi is the only real saving grace and carries the film with his comic timing. Without him, this would’ve been an even more exhausting watch. This really doesn’t feel like something Sandeep Reddy Vanga would sign off on. Disappointing!


Rating: 2/5

Sep 03, 2026 Telugu

Romanchakam movie review

4.0
out of 10
సో ‘రోమాంచకం’ మూవీ ఇప్పుడే చూసొచ్చాను భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. బేసిగ్గా సినిమాలో వంద జోకులుంటాయంటే.. అందులో ఒక పది పదిహేను జోక్స్ నచ్చాయి. అది కూడా ఈ మూవీలో ఉన్న కమెడియన్స్ లో ఒక్కరే బాగా చేసారు. ఈ సినిమా లవ్ స్టోరీనా, లేదా ఫ్రెండ్స్ మధ్యలో జరిగే నార్మల్ కామెడీ స్టోరీనా అస్సలు అర్ధం కాలేదు. మెయిన్ సినిమాలో ఫస్ట్ 30 మినిట్స్ వరస్ట్. క్రింజ్... ప్రాబ్లెమ్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ తో ఇంత...

సో ‘రోమాంచకం’ మూవీ ఇప్పుడే చూసొచ్చాను భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. బేసిగ్గా సినిమాలో వంద జోకులుంటాయంటే.. అందులో ఒక పది పదిహేను జోక్స్ నచ్చాయి. అది కూడా ఈ మూవీలో ఉన్న కమెడియన్స్ లో ఒక్కరే బాగా చేసారు. ఈ సినిమా లవ్ స్టోరీనా, లేదా ఫ్రెండ్స్ మధ్యలో జరిగే నార్మల్ కామెడీ స్టోరీనా అస్సలు అర్ధం కాలేదు. మెయిన్ సినిమాలో ఫస్ట్ 30 మినిట్స్ వరస్ట్. క్రింజ్... ప్రాబ్లెమ్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ తో ఇంతకు ముందు చాలా సినిమాలొచ్చాయి. 


కానీ దీంట్లో అది వర్కౌట్ కాలేదు. అండ్ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో కొన్ని పంచ్ లు తప్ప ఏం వర్కౌట్ కాలేదు. అన్ని సీన్లు కూడా చాలా ఏళ్ళ నుండి ఎన్నో సినిమాల్లో చుసిన సీన్ల లాగానే ఉన్నాయి. బట్ చాలా మంది నవ్వుకున్నారు. నాకు మాత్రం నవ్వు రాలేదు. అండ్ సినిమాలో సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా అర్ధం కాలేదు. అసలు హీరోకే సరైన క్యారెక్టర్ డిజైన్ చేయలేదు. అక్కడే దొబ్బింది ఈ సినిమా. ఎన్నో సినిమాల చూసిన డైలాగ్స్ వినిపిస్తాయి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మరీ కామెడీ చేసారు. బట్ సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్ లో వస్తుందన్న ఒకే ఒక్క రీసన్ తోనే సినిమాకి వచ్చాను. మరి నార్మల్ ఆడియన్స్ కి కామెడీ ఇష్టం ఉన్నోళ్లకు నచ్చోచ్చేమో... నాకు మాత్రం నచ్చలేదు. 

Sep 03, 2026 Telugu

Romanchakam movie Review

5.0
out of 10
‘రోమాంచకం’ అనే సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలని అనుకున్నాడు.. అసలు ఏ పాయింట్లతో కథని అల్లుకున్నాడు.. ఏం రాసుకున్నాడు.. ఏం తీశాడు.. ఏం కన్వే చేయాలని అనుకున్నాడు.. ఇలా ఏ విషయం కూడా ఓ పట్టాన అర్థం కాదు. చాలా చోట్ల కథ సిల్లీగా అనిపిస్తుంది. ఎక్కడా లాజిక్స్ కనిపించవు. అసలు ఏ పాత్రలోనూ సీరియస్‌నెస్ కనిపించదు. అనంతిక ఓకే చేసిన స్క్రిప్ట్ కదా.. పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని ఎవరైనా ఊహించి, ఆశించి వస్తే మాత్రం...

‘రోమాంచకం’ అనే సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలని అనుకున్నాడు.. అసలు ఏ పాయింట్లతో కథని అల్లుకున్నాడు.. ఏం రాసుకున్నాడు.. ఏం తీశాడు.. ఏం కన్వే చేయాలని అనుకున్నాడు.. ఇలా ఏ విషయం కూడా ఓ పట్టాన అర్థం కాదు. చాలా చోట్ల కథ సిల్లీగా అనిపిస్తుంది. ఎక్కడా లాజిక్స్ కనిపించవు. అసలు ఏ పాత్రలోనూ సీరియస్‌నెస్ కనిపించదు. అనంతిక ఓకే చేసిన స్క్రిప్ట్ కదా.. పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని ఎవరైనా ఊహించి, ఆశించి వస్తే మాత్రం దారుణంగా నిరాశ చెందాల్సి వస్తుంది.


టెక్నికల్‌ గా చూసుకుంటే విజువల్స్ బాగుంటాయి. బీజీఎం కంటే.. పాటలు చాలా హృద్యంగా అనిపిస్తాయి. తెరపై పాటల్ని చూస్తుంటే ఎంతో ప్లెజెంట్‌గా కనిపిస్తాయి. ఎడిటింగ్ బాగుంటుంది. లొకేషన్స్ కూడా ఎక్కువగా లేకుండా.. ఉన్నంత వరకు బాగా చూపించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉంటాయి. కథకు కావాల్సినంత ఖర్చు పెట్టినట్టుగా కనినిపిస్తుంది.


ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే... ఎదిగీఎదగని.. ఓ ఇమ్మెచ్యూర్.. నిబ్బానిబ్బిలానే హీరో హీరోయిన్లు తెరపై కనిపిస్తారు. పాత్రల్నే అలా రాసుకున్నట్టుగా, కథనే అలా డీల్ చేసినట్టుగా కనిపిస్తోంది. చాలా చోట్ల జెన్ జీ ని రిఫర్ చేసుకున్నాడు డైరెక్టర్. బహుషా తలాతోక లేనట్టుగా అనిపించే ఈ మూవీ జెన్ జీ ఆడియెన్స్‌కి నచ్చితే నచ్చొచ్చు. కొన్ని పాటలు, కొంత కామెడీ చాలు అనుకుంటే మాత్రం ‘రోమాంచకం’ ఓ ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. చివరగా ఈ సినిమాకి పెట్టుకున్న క్యాప్షన్స్‌లో చెప్పాలంటే.. గోరంత ప్రేమ, కొండంత హాస్యం, పిసరంత ఉత్కంఠ.


Sep 03, 2026 Telugu

Romanchakam movie Review

6.0
out of 10
‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. వేణు గోపాల్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. స్టోరీ పరంగా యావరేజ్ గానే ఉన్నా, డీసెంట్ కామెడీ తో మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా సినిమాని తీసాడు డైరెక్టర్. సినిమా మొత్తం కామెడీయే హైలెట్ గా మెయిన్ గా సాగ...

‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. వేణు గోపాల్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. స్టోరీ పరంగా యావరేజ్ గానే ఉన్నా, డీసెంట్ కామెడీ తో మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా సినిమాని తీసాడు డైరెక్టర్. సినిమా మొత్తం కామెడీయే హైలెట్ గా మెయిన్ గా సాగుతుంది. సాంగ్స్ డీసెంట్ గా ఉన్నాయి.


మొత్తంగా చూస్తే, ‘రోమాంచకం’ వినోదమే ప్రధానంగా సాగే ఒక టైమ్‌పాస్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. సుమంత్ ప్రభాస్ నటన, అతని స్నేహితుల గ్యాంగ్ మధ్య వచ్చే నవ్వుల సన్నివేశాలు సినిమాను ముందుకు నడిపించాయి. నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్, వర్కౌట్ కాని ఎమోషనల్ సీన్లు కాస్త నిరాశపరిచినా, ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా కాసేపు నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ఈ వారాంతంలో ఈ చిత్రం మంచి ఆప్షన్.


Sep 03, 2026 Telugu

Romanchakam movie review

4.0
out of 10
సో రోమాంచకం మూవీ గురించి చెప్పాలంటే... బాలేదు.. ఎం బాలేదు సినిమా. అంటే ఆల్మోస్ట్ రోమాంచకం కాస్తా రోత సినిమా అన్న స్టేజ్ కి వెళ్ళిపోయింది సినిమా. కాకపోతే సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ బాగున్నాయి. వాళ్ళ వల్ల మంచి కామెడీ జెనెరేట్ అయింది. అసలు సినిమా అయితే చాలా వరకు నిబ్బా నిబ్బి స్టోరీ కంటే అద్వానంగా ఉంది. ఎదో జాతిరత్నాలు సినిమాలాగా, లేదా మ్యాడ్ సినిమాల్లాగా ఫన్ తో లాగిద్దాం అని ట్రై చేసారు దెబ...

సో రోమాంచకం మూవీ గురించి చెప్పాలంటే... బాలేదు.. ఎం బాలేదు సినిమా. అంటే ఆల్మోస్ట్ రోమాంచకం కాస్తా రోత సినిమా అన్న స్టేజ్ కి వెళ్ళిపోయింది సినిమా. కాకపోతే సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ బాగున్నాయి. వాళ్ళ వల్ల మంచి కామెడీ జెనెరేట్ అయింది. అసలు సినిమా అయితే చాలా వరకు నిబ్బా నిబ్బి స్టోరీ కంటే అద్వానంగా ఉంది. ఎదో జాతిరత్నాలు సినిమాలాగా, లేదా మ్యాడ్ సినిమాల్లాగా ఫన్ తో లాగిద్దాం అని ట్రై చేసారు దెబ్బేసింది. 


ఇక సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా ఏం అంత లేదు. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ ఏం అంత లేదు. ఎంత సేపు ఫ్రెండ్స్ ఎదో అనడం దానికి హీరో రియాక్షన్ ఇవ్వడం అంతే.. లవ్ స్టోరీ కూడా బాగాలేదు. ఎమోషన్స్ అస్సలే ఏం బాగాలేవు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమాకి ఎంత పెట్టాలో అంతే పెట్టారు కాబట్టి పెద్దగా లాస్ ఏం అవ్వలేదు కావచ్చు. హీరో అసలేం చూసి సినిమా యాక్సెప్ట్ చేసాడో ఏమో మరి. ఏమో సినిమాలో క్యామియో చేసిన అనుదీప్ కోసమే ఇంకా ఆడియన్స్ వెళ్లొచ్చు. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగాలేదు. నా రేటింగ్ అయితే ఈ సినిమాకు 2/5

Sep 03, 2026 Telugu

Kiku Chiranjeevi movie review

6.0
out of 10
కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘కికు చిరంజీవి’. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మాణంలో శుభ సాయి వెంకట్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా రాఘవ.. పలువురు కీలక పాత్రలు పోషించారు. కికు చిరంజీవి సినిమా నేడు ఆగస్టు 28న థియేటర్స్ లోకి వచ్చింది.అయితే గుండె కుడివైపు ఉండటం అనే కాన్సెప్ట్ తో గతంలో కొన్...

కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘కికు చిరంజీవి’. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మాణంలో శుభ సాయి వెంకట్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా రాఘవ.. పలువురు కీలక పాత్రలు పోషించారు. కికు చిరంజీవి సినిమా నేడు ఆగస్టు 28న థియేటర్స్ లోకి వచ్చింది.


అయితే గుండె కుడివైపు ఉండటం అనే కాన్సెప్ట్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. పాయింట్ రేర్ గా వచ్చేదే అయినా కథనం బాగానే రాసుకున్నారు. చిరంజీవి అంటే మరణం లేనివారు అని అర్ధం. దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సీన్స్ బాగానే జస్టిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయొచ్చు. హీరో – హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ అంతగా పండలేదు. లవ్ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ని అక్కడక్కడా సాగదీశారు. కొత్త పాయింట్ తీసుకున్నా రెగ్యులర్ కథనంతో కాస్త థ్రిల్లింగ్ గా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా ‘కికు చిరంజీవి’ హీరోకి గుండె కుడివైపు పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించిన సినిమా. 


Aug 31, 2026 Telugu
6.0
out of 10
‘కికు చిరంజీవి’ (Kiku chiranjeevi) Movie ఇప్పుడే చూసి వచ్చాను. పెద్దగా expectations పెట్టుకోకుండా వెళ్తే ఒకసారి engage చేసే సినిమా అనిపించింది. movie lo heroను విలన్లు చంపడానికి కాల్చినా అతను ఎందుకు చనిపోడు? అసలు దాని వెనుక reason ఏంటి? అనేది movie లో main point. ఆ twist ఆసక్తికరంగా అనిపించింది. suspence, thriller elements తో పాటు fun, romance, action కూడా బాగానే ఉన్నాయి.heart ఎడమ వైపు కాకుండా కుడ...

‘కికు చిరంజీవి’ (Kiku chiranjeevi) Movie ఇప్పుడే చూసి వచ్చాను. పెద్దగా expectations పెట్టుకోకుండా వెళ్తే ఒకసారి engage చేసే సినిమా అనిపించింది. movie lo heroను విలన్లు చంపడానికి కాల్చినా అతను ఎందుకు చనిపోడు? అసలు దాని వెనుక reason ఏంటి? అనేది movie లో main point. ఆ twist ఆసక్తికరంగా అనిపించింది. suspence, thriller elements తో పాటు fun, romance, action కూడా బాగానే ఉన్నాయి.


heart ఎడమ వైపు కాకుండా కుడివైపు ఉండటం అనే పాయింట్ కూడా కొత్తగా అనిపించింది. story పరంగా మంచి ఐడియా ఉన్నప్పటికీ, దాన్ని తెరపై ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో అక్కడక్కడా కొంత తడబాటు కనిపిస్తుంది. కొన్ని సీన్లు ఇంకా బాగా చూపించి ఉంటే impact మరింత వచ్చేది.


అయితే twist లు, climax లో వచ్చే ఎమోషన్ సినిమాకు ప్లస్. ఓవరాల్‌ గా naku ‘కికు చిరంజీవి’ ఫర్వాలేదనిపించింది.


Aug 31, 2026 Telugu
6.0
out of 10
`చిరంజీవి` అంటే మరణం లేనివారు, చచ్చిబతికిన వారిని పిలుస్తుంటారు. ఇందులో రెండో యాంగిల్‌ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు కాలుస్తారు. కానీ అతను చనిపోడు. అది ఎలా జరిగిందనేది ఇందులో ఆసక్తికరం. అదే పెద్ద ట్విస్ట్. సస్పెన్స్, థ్రిల్లర్‌ అంశాలు కనిపిస్తాయి. ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ముగుస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఫర్వాలేదనిపించింది. సినిమాలో ఫన్‌, రొమాన్స్, యాక్షన్...

`చిరంజీవి` అంటే మరణం లేనివారు, చచ్చిబతికిన వారిని పిలుస్తుంటారు. ఇందులో రెండో యాంగిల్‌ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు కాలుస్తారు. కానీ అతను చనిపోడు. అది ఎలా జరిగిందనేది ఇందులో ఆసక్తికరం. అదే పెద్ద ట్విస్ట్. సస్పెన్స్, థ్రిల్లర్‌ అంశాలు కనిపిస్తాయి. ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ముగుస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఫర్వాలేదనిపించింది. 


సినిమాలో ఫన్‌, రొమాన్స్, యాక్షన్‌ అంశాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఎగ్జిక్యూషన్‌లోనే కొంత లోపం కనిపిస్తుంది. కథనం కూడా బాగుంది. కానీ తెరపై ఆవిష్కరించే విషయంలోనే కొంత తడబాటు కనిపిస్తుంది. ఒక సారి చూడొచ్చు అనిపించేలా చేశాడు. హార్ట్ కుడివైపు ఉండటమనే పాయింట్‌ కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. అంచనాలు లేకుండా చూస్తే కొంత వరకు ఎంగేజ్‌ చేసే సర్వైవల్‌ డ్రామా థ్రిల్లర్‌ `కికు చిరంజీవి`.


Aug 31, 2026 Telugu

Kiku Chiranjeevi movie review

Sakshi

By Sakshi

5.0
out of 10
‘కికు చిరంజీవి’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. గుండె కుడివైపున ఉండటం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాన్ని దర్శకుడు శుభ సాయి వెంకట్ తెరకెక్కించిన విధానం అక్కడక్కడా స్లోగా అనిపిస్తుంది. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను కలిపి కథను నడిపించే ప్రయత్నం చేశారు. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నా, అన్ని సీన్లు ఒకే స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వవు. ఫస్టాఫ్ ఓ మోస్తరుగా సాగితే, సెక...

‘కికు చిరంజీవి’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. గుండె కుడివైపున ఉండటం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాన్ని దర్శకుడు శుభ సాయి వెంకట్ తెరకెక్కించిన విధానం అక్కడక్కడా స్లోగా అనిపిస్తుంది. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను కలిపి కథను నడిపించే ప్రయత్నం చేశారు. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నా, అన్ని సీన్లు ఒకే స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వవు. ఫస్టాఫ్ ఓ మోస్తరుగా సాగితే, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.


క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ టచ్ సినిమాకు కొంత ప్లస్‌గా నిలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా ‘కికు చిరంజీవి’ ఒక డిఫరెంట్ ప్రయత్నం. కాన్సెప్ట్, థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారికి సినిమా ఓసారి ట్రై చేయొచ్చు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించే స్థాయిలో మాత్రం సినిమా లేదనే చెప్పాలి.


Aug 31, 2026 Telugu
Why MRO?