Register as a Reviewer
కల్ట్ (#Cult)

కల్ట్ (#Cult)

Upcoming Expected Release: 30 Oct 2026

#Cult : "కల్ట్" బొమ్మతో వైల్డ్ గా వస్తున్న మాస్ కా దాస్.. ఈసారి కొట్టేలానే ఉన్నాడు..!

Director: Vishwak Sen
Cast: Vishwak Sen, Gayatri Bharadwaj, Tarak Ponnapa, Murali Sharma, Srikanth Iyenger, Karthikeya, Anirudh Bhaskar, EZY, Yagnya Turlapati, Kabeer Bhartiya, Vishak Nair, Chepuri Vivek

Available in:

About This Movie

టాలీవుడ్ లో ఉన్న యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గత కొంతకాలంగా వరుస ప్లాపుల్లో సతమతవుతున్నాడు. ఈ క్రమంలో తనే డైరక్షన్ లోనే మరోసారి హీరోగా నటించి ఈసారి ఎలాగైనా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ ఇంతకు ముందు రెండు సినిమాలను డైరెక్ట్ చేసిన విశ్వక్ ఈసారి "కల్ట్" అంటూ క్యాచీ టైటిల్ తో ఒక వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. 

 

 

ఇక కల్ట్ మూవీ ట్రైలర్ ని చూస్తుంటే.. లాక్ డౌన్ లో ఫేమస్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ లా అనిపిస్తుంది. ట్రైలర్ లో కంటెంట్ ని చూస్తే... గోవాకు సరదాగా గడపడానికి వెళ్లిన కొంతమంది యువతి, యువకులు ఓ రహస్య పార్టీకి సంబంధించిన పాస్‌ లు సంపాదించి లోపలికి వెళ్తారు. అయితే అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా, సడన్ గా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న బిల్డింగ్ ను కొందరు లాక్ చేస్తారు. ఎంత ప్రయత్నిస్తే అంత చనిపోతూ ఉంటారు. అందులో చిక్కుకున్న దాదాపు 300 మంది సర్వైవల్ గేమ్ ఆడక తప్పని పరిస్థితి. అలాగే ఆ జనాల్లో డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) కూడా ఉంటాడు.

 

 

ఈ భయంకరమైన సర్వైవల్ గేమ్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం, అధికారులు ప్రయత్నాలు చేసినా విఫలం కావడంతో, చివరికి డీఎస్పీ సంకల్ప్ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న 300 మందిని హీరో ఎలా కాపాడారన్నది సినిమాగా తెరకెక్కించారు. ఇక ట్రైలర్ లో మరీ వైలెన్స్ ఎక్కువగానే చూపించారు. విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్‌ గా నటించగా, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, విశాఖ్ నాయర్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ కీ రోల్స్ లో నటించారు. రవి బసూర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను తారక్ సినిమాస్ బ్యానర్‌ పై సందీప్ కాకరాల నిర్మించారు. అక్టోబర్ 30న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ కల్ట్ సినిమాతో కల్ట్ రేంజ్ లో సక్సెస్ కొట్టి విశ్వక్ ట్రాక్ లో ఎక్కుతాడో లేదో చూడాలి.

Why MRO?