Register as a Reviewer
రుద్రవనం – పి ఎస్ (Rudravanam – P.S)

రుద్రవనం – పి ఎస్ (Rudravanam – P.S)

30 Oct 2026
Overall Rating
4.9/10
7 Reviews

నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ "రుద్రవనం – పి ఎస్". శశిధర్ మున్నంగి డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన జీ 5 లో స్ట్రీమింగ్ అవుతూ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Shashidhar Munnangi
Cast: Naresh Agastya, Banerjee, Raja Ravindra, Charu Vakan, Preethi Sundar, and others

Available in:

Reviews

What critics and the public are saying about రుద్రవనం – పి ఎస్ (Rudravanam – P.S)

Media Reviews

7 Avg: 4.9/10
Chitra Jyothy
Chitra Jyothy Website
4

Below Average

Rudravanam Ps Web series review

నిజానికి ఈ తరహా మర్డర్ మిస్టరీ వెబ్ సీరిస్ లు చాలానే వచ్చాయి. అయితే అందులో ఎంగేజింగ్‌ గా ఉన్నవి చాలా తక్కువ. ఇన్వెస్టిగేషన్ పేరుతో ఎపిసోడ్స్ కు ఎపిసోడ్స్ సాగిపోతుంటాయి కానీ కథ మాత్రం ముందుకు కదలదు. ఇది కూడా అలాంటిదే. రకరకాల వ్యక్తులను అనుమానిస్తూ, పోలీసు అధికారులలో ఉండే అసహనాన్ని ఎలివేట్‌ చేస్తూ మూడ...

నిజానికి ఈ తరహా మర్డర్ మిస్టరీ వెబ్ సీరిస్ లు చాలానే వచ్చాయి. అయితే అందులో ఎంగేజింగ్‌ గా ఉన్నవి చాలా తక్కువ. ఇన్వెస్టిగేషన్ పేరుతో ఎపిసోడ్స్ కు ఎపిసోడ్స్ సాగిపోతుంటాయి కానీ కథ మాత్రం ముందుకు కదలదు. ఇది కూడా అలాంటిదే. రకరకాల వ్యక్తులను అనుమానిస్తూ, పోలీసు అధికారులలో ఉండే అసహనాన్ని ఎలివేట్‌ చేస్తూ మూడు నాలుగు ఎపిసోడ్స్ ను తీశారు. అసలు కథను చివరి రెండు ఎపిసోడ్స్ లో చూపించారు. అంజి నేరం ఒప్పుకున్న తర్వాత కూడా అందుకు మోటివ్ ఏమిటనేది చెప్పడం కోసం దర్శకుడు ఇంకో ఎపిసోడ్ తీశాడు. అదే ఈ మొత్తం ఎపిసోడ్స్ లో కాస్తంత ఆసక్తికరంగా ఉంది. కానీ ఆ మోటో అంత బలంగా లేకపోవడంతో చివరకు తేలిపోయింది.


నరేశ్‌ అగస్త్య ఈ సిరీస్ లో ఎస్.ఐ.గా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించి, మెప్పించాడు. కథంతా ఒకే ఊరిలోనూ, పోలీస్‌ స్టేషన్‌లోనూ జరగడం వల్ల పరిమితమైన బడ్జెట్ లోనే వెబ్ సీరిస్ ను నిర్మాతలు పూర్తి చేశారనిపిస్తోంది. తాజ్‌ సయ్యద్‌ రాసిన మాటలు పాత్రల ఔచిత్యానికి తగ్గట్టుగా ఉన్నాయి. అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ, మాధవ్ ఎడిటింగ్‌ ఓకే. కాకపోతే... కాస్తంత ట్రిమ్‌ చేసి దీనిని ఐదు ఎపిసోడ్స్ లేదా ఆరు ఎపిసోడ్స్ కు కుదిస్తే ఇంకా బాగుండేది. ఇన్వెస్టిగేటివ్‌ డ్రామాలను, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వారికి 'రుద్రవనం పీఎస్' ఓ మేరకు నచ్చే ఆస్కారం ఉంది. 


Oct 30, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

RudraVanam Web Series Review

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో సాగే వెబ్ సిరీస్‌లను తెరకెక్కించేటప్పుడు ప్రేక్షకుడికి ఎక్కడా విసుగు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. సుదీర్ఘమైన ఎపిసోడ్స్ పెట్టి సాగదీయకుండా, చాలా తక్కువ నిడివితో విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేయడం ఈ ప్రాజెక్టుకు అతిపెద...

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో సాగే వెబ్ సిరీస్‌లను తెరకెక్కించేటప్పుడు ప్రేక్షకుడికి ఎక్కడా విసుగు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. సుదీర్ఘమైన ఎపిసోడ్స్ పెట్టి సాగదీయకుండా, చాలా తక్కువ నిడివితో విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేయడం ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద బలం. ఇక సిరీస్ లో నేర విచారణ తీరు, మధ్యలో వచ్చే ఊహించని మలుపులు చూసేవారిని కట్టిపడేస్తాయి. కానీ విచారణ ఎంత ఆసక్తికరంగా సాగిందో, ముగింపు కూడా అంతే బలంగా ఉండాలి. అక్కడే ఈ రుద్రవనం సిరీస్ కాస్త తడబడింది. 


వీక్ రైటింగ్ వల్ల కాస్త ఆసక్తి తగ్గుతుంది. ఒక ముఖ్యమైన పాత్రను మరీ అతిగా, వినయంతో చూపించడంతో జరగబోయేది ఏంటో ప్రేక్షకుడికి ముందే అర్థమైపోతుంది. దాని వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ కూడా అంతగా రుచించదు. అలాగే భార్యకు సంబంధించిన ట్రాక్ కూడా కథకు అనవసరంగా అతికించినట్లు అనిపిస్తుంది. ముగింపులో బలమైన ఎమోషన్స్ ఉండి ఉంటే ఈ సిరీస్ స్థాయి మరోలా ఉండేది. ఊహకు అందే ముగింపు కూడా ఉంటుంది.. అయినా కూడా వీకెండ్‌కు డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునేవాళ్లకు రుద్రవనం పిఎస్ మంచి ఛాయిసే. చివరి ఎపిసోడ్స్ రాసుకోవడంలో ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే అద్భుతమైన ఫలితం దక్కేది.


పంచ్ లైన్:


ఓవరాల్‌గా రుద్రవనం PS.. డీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా..!


Oct 30, 2026 Read Review
5

Average

RudraVanam Ps series review

రుద్రవనం పీఎస్ తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘విలంగు’ (2022) వెబ్ సిరీస్‌కు తెలుగు రీమేక్. ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను తెలుగులో అందించేటప్పుడు కొత్తదనం చూపించడం దర్శకుడికి పెద్ద సవాలనే చెప్పాలి. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్, వరుస హత్యలు, నిందితుడి చుట్టూ తిరిగే కథలత...

రుద్రవనం పీఎస్ తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘విలంగు’ (2022) వెబ్ సిరీస్‌కు తెలుగు రీమేక్. ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను తెలుగులో అందించేటప్పుడు కొత్తదనం చూపించడం దర్శకుడికి పెద్ద సవాలనే చెప్పాలి. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్, వరుస హత్యలు, నిందితుడి చుట్టూ తిరిగే కథలతో ప్రేక్షకులకు ఇప్పటికే మంచి పరిచయం ఉంది. ఈ సిరీస్ కథనం సాధారణ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా తరహాలో సాగుతుంది. అయితే కథలో ఆశించిన స్థాయిలో ఉత్కంఠ కనిపించదు. పోలీసుల దర్యాప్తులో అనేక ఆధారాలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని అర్థం చేసుకోవడంలో పదేపదే తప్పులు జరగడం, నిందితుడి దగ్గరకు చేరడానికి ఎక్కువ సమయం తీసుకోవడం కథనాన్ని నెమ్మదింపజేస్తాయి. 


ఈ సిరీస్‌లో భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా శివకుమార్ తన విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తూనే, నేరస్థుల వెనుక ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆకట్టుకునే అంశం. ఒక నేరస్థుడి పట్ల మానవీయ కోణంలో ఆలోచించడం, అతడి భవిష్యత్తు విషయంలో బాధ్యత తీసుకోవడం కథలో మంచి భావోద్వేగాన్ని అందిస్తుంది. రుద్రవనం పీఎస్‌లో చివరి ఎపిసోడ్స్‌లో కొన్ని ఆసక్తికరమైన మలుపులు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు కోరుకునే థ్రిల్ ని అందించలేవు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథలు ఇష్టపడేవారు ఒకసారి ప్రయత్నించవచ్చు. అయితే కొత్తదనం కోరుకునే వారికి ఈ సిరీస్ పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వకపోవచ్చు.


Nov 03, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Rudravanam Ps review

క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటేనే సగటు మూవీ లవర్ ఓ ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటాడు. మధ్య మధ్య సాగే ట్విస్టులు, చిక్కుముడులు విప్పలేని ప్రశ్నలు.. చివరకు దొరికే సమాధానాలు ఇవే అందరి మదిలో మెదులుతాయి. ఇక తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రుద్రవనం పీఎస్ విషయానికి వస్తే... డైరెక్టర్ శశిధర్ మున్నంగి...

క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటేనే సగటు మూవీ లవర్ ఓ ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటాడు. మధ్య మధ్య సాగే ట్విస్టులు, చిక్కుముడులు విప్పలేని ప్రశ్నలు.. చివరకు దొరికే సమాధానాలు ఇవే అందరి మదిలో మెదులుతాయి. ఇక తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రుద్రవనం పీఎస్ విషయానికి వస్తే... డైరెక్టర్ శశిధర్ మున్నంగి ఆడియన్స్ ఆ థ్రిల్ పంచడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే స్టోరీ నెమ్మదిగా సాగడం ఆడియన్స్‌కు విసుగు కలిగిస్తుంది. దర్శకుడు చెప్పదలుచుకున్న స్టోరీని కేవలం ల్యాగ్ చేయడం కోసమే సిరీస్‌ను 7 ఎపిసోడ్స్ రూపొందించారన్న ఫీలింగ్ కలిగిస్తుంది. 


ప్రతీ ఎపిసోడ్‌ లోనూ స్టోరీ నెరేషన్ చాలా స్లోగా సాగుతుంది. ఇది ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుందనే చెప్పాలి. మధ్య మధ్యలో వచ్చే కొన్ని అనవసరమైన పాత్రలు ఎందుకు పెట్టారో కూడా తెలియదు. కథకు అవసరం లేని, కొన్ని లింక్స్ చూపిస్తారు. ఇది కొంత కన్ఫ్యూజన్ కలిగిస్తుంది. చివరకు వచ్చే సరికి కొంత క్లారిటీ వస్తుంది. ఇక స్టోరీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఆడియన్ కొంత సాటిస్‌ఫై అవుతాడు. ఇందులో కొంత సైకలాజికల్ మెథడ్‌ను కూడా చూపించారు. మొత్తంగా రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ టైమ్ పాస్‌ చేయాలంటే చూసే ఓ సింపుల్ క్రైమ్ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు.

Nov 03, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

RudraVanam Web series Review

జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ క్రైమ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘రుద్రావనం P.S’! డైరెక్టర్ శశిధర్ మున్నంగి తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం! కథ విషయానికి వస్తే.. సిరీస్ ఆరంభంలోనే గ్రిప్పింగ్ నేరేషన్ తో డైరెక్టర్ మంచి హైప్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా...

జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ క్రైమ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘రుద్రావనం P.S’! డైరెక్టర్ శశిధర్ మున్నంగి తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం!


కథ విషయానికి వస్తే.. సిరీస్ ఆరంభంలోనే గ్రిప్పింగ్ నేరేషన్ తో డైరెక్టర్ మంచి హైప్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఆద్యంతం క్యూరియాసిటీ పెంచుతూ, నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఎస్సై శివకుమార్‌గా నరేష్ అగస్త్య పర్ఫార్మెన్స్, ఆయన యాటిట్యూడ్ అండ్ బాడీ లాంగ్వేజ్ సిరీస్ మూడ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. అంజి పాత్ర చుట్టూ అల్లిన డ్రామా, అష్కర్ ఆలీ విజువల్స్ అండ్ రూరల్ లైటింగ్, ఎలివేటింగ్ బిజీఎమ్ సిరీస్‌కి బిగ్ ప్లస్!


అయితే, ముగింపు ఎపిసోడ్లకు వచ్చేసరికి కథను కొంత సాగదీసినట్టు అనిపించడం, ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది అనిపించడం చిన్న మైనస్. శ్రీ చక్ర మూవీస్ నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. ఓవరాల్‌గా క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ వీకెండ్‌లో ప్రశాంతంగా కూర్చుని బింజ్ వాచ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!

Oct 30, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Rudravanam Ps Series review

క్రైమ్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్‌, సస్పెన్స్ జోనర్‌లో రుద్రావనం సిరీస్ కథను ప్రారంభించిన దర్శకుడు శశిధర్ ఆరంభ ఎపిసోడ్స్‌ను గ్రిప్పింగ్‌ గా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఆకట్టుకొన్నది. తొలి నాలుగు ఎపిసోడ్స్‌ పై క్యూరియాసిటీ పెరగడంతో ఏం జరగబోతుందో అనే ఆసక్తిని రేకెత్తించాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ కోసం...

క్రైమ్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్‌, సస్పెన్స్ జోనర్‌లో రుద్రావనం సిరీస్ కథను ప్రారంభించిన దర్శకుడు శశిధర్ ఆరంభ ఎపిసోడ్స్‌ను గ్రిప్పింగ్‌ గా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఆకట్టుకొన్నది. తొలి నాలుగు ఎపిసోడ్స్‌ పై క్యూరియాసిటీ పెరగడంతో ఏం జరగబోతుందో అనే ఆసక్తిని రేకెత్తించాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ కోసం ఎస్ఐ శివకుమార్ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. ఆ పాత్ర యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ స్టోరీ మూడ్‌కు తగినట్టుగా ఉండటం పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. అంజి పాత్ర చుట్టూ అల్లిన కథ కూడా బాగుంది. కానీ చివరి ఎపిసోడ్స్‌లో కథను సాగదీసినట్టు ఉండటం కొంత మైనస్‌గా అనిపిస్తుంది. ఇంకా బెటర్‌గా సన్నివేశాలు, స్క్రీన్ ప్లేను డిజైన్ చేసి ఉంటే.. బెటర్ రిజల్ట్ కనిపించి ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది.


ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అంశాలు కథను, సన్నివేశాలను ఎలివేట్ చేసేందుకు ఉపయోగపడ్డాయి. గ్రామీణ వాతావరణంలో అష్కర్ ఆలీ చిత్రీకరించిన సన్నివేశాలు, లైటింగ్ బాగుంది. ఎడిటర్ మాధవ్ ఇంకాస్త షార్ప్‌గా కట్ చేయాల్సి ఉండేది.శ్రీ చక్ర మూవీస్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్రైమ్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ కంటెంట్‌ను ఎంజాయ్ చేసే వారికి ఈ సిరీస్ నచ్చుతుంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని సమయం చిక్కినంత కాకుండా తగినంత టైమ్ సెట్ చేసుకొని ఒకేసారి చూసేయండి.. మంచి అనుభూతి కలిగే అవకాశం ఉంది.


Oct 30, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

RudraVanam PS Web series review

ఈ వారం ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన లేటెస్ట్ సిరీస్ లలో జీ 5 తీసుకొచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘రుద్రవనం – పి ఎస్’ కూడా ఒకటి. ఇక ఈ సిరీస్ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ సిరీస్ లో మంచి విషయం ఏమన్నా ఉంది అంటే మిగతా థ్రిల్లర్ సిరీస్ ల తరహాలో సాగదీతగా ఎక్కువ ఎపిసోడ్స...

ఈ వారం ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన లేటెస్ట్ సిరీస్ లలో జీ 5 తీసుకొచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘రుద్రవనం – పి ఎస్’ కూడా ఒకటి. ఇక ఈ సిరీస్ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ సిరీస్ లో మంచి విషయం ఏమన్నా ఉంది అంటే మిగతా థ్రిల్లర్ సిరీస్ ల తరహాలో సాగదీతగా ఎక్కువ ఎపిసోడ్స్ లా ప్లాన్ చేయకుండా తక్కువ నిడివితోనే కథనంని ఎక్కువగా డీవియేట్ చేయకుండా కట్టే కొట్టే తెచ్చే రీతిలో సెట్ చేయడం డీసెంట్ గా అనిపిస్తుంది. ఇక నరేష్ అగస్త్య ఎస్సై రోల్ లో సిన్సియర్ పెర్ఫామెన్స్ ని చేసాడు.


అయితే ఆరంభం ఎలా ఉన్నప్పటికీ దేనికైనా ఇచ్చే ముగింపు తోనే చూసే ఆడియెన్స్ లో ఇంపాక్ట్ మిగులుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ సిరీస్ లో చివరి ఎపిసోడ్స్ లోనే పస తక్కువైంది. అప్పటివరకు సెటప్ చేసుకున్నది అంత ఒక వీక్ రైటింగ్ ఉన్న ఆరవ ఎపిసోడ్ తో తేలిపోయేలా చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘రుద్రవనం – పి ఎస్’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోని క్రైమ్ థ్రిల్లర్ గా నిలిచిపోయింది. మొదటి 5 ఎపిసోడ్స్ ఓ మోస్తరుగా ఓకే అనిపిస్తాయి కానీ ఆరవ ఎపిసోడ్ చాలా సిల్లీగా డిజప్పాయింట్ చేస్తుంది. అలానే చివరి ఎపిసోడ్ ని కూడా ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకోవాల్సింది. నరేశ్ అగస్త్య సిన్సియర్ పోలీస్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. కానీ ఈ థ్రిల్లర్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.


Oct 30, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story :

 

కథ విషయానికి వస్తే... రుద్రవనం ప్రాంతం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రోజు ఒక అనుమానాస్పద మృతదేహం దొరుకుతుంది. తల లేకుండా మొండెంతో ఉన్న బాడీ కేసు పోలీసులకు పెద్ద సవాల్ గా మారుతుంది. అయితే ఈ కేసును ఎస్ఐ శివకుమార్ (నరేశ్ అగస్త్య), సీఐ వేణుగోపాల్ (బెనర్జీ) దగ్గరుండి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో పాత కేసుల్ని కూడా గమనిస్తే... దాదాపు 8 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యం అవుతారు. అయితే మిస్ అయినవాళ్లలో ఎమ్మెల్యే భైరవులు (రాజా రవీంద్ర) సోదరుడు కూడా ఉంటాడు. అందుకే ఈ కేసు మరింత కంప్లికేటెడ్ గా మారుతుంది. ఈ క్రమంలో అంజి (చారు వాకన్)ను అనుమానితుడిగా తీసుకుని విచారించే సమయంలో హత్యల వెనుక అసలు వాస్తవాలు తెలుస్తాయి. మరి ఈ కేసును ఎస్ఐ శివకుమార్ ఎలా సాల్వ్ చేశాడు? రుద్రవనం హత్యల వెనుక మిస్టరీ ఎలా వీడింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Plus Points : 

 

రుద్రావనం వెబ్ సిరీస్ కి మంచి ప్లస్ పాయింట్ కాన్సెప్ట్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు రురల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం మంచి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అలాగే పలు సన్నివేశాలు ఉత్కంఠకి గురి చేసేలా రాసుకున్నారు డైరెక్టర్. అలాగే ఈ మధ్య వస్తున్న క్రైమ్ థ్రిల్లర్స్ లాగా ఎక్కువ లెంగ్త్ తో కాకుండా చిన్నగా 7 ఎపిసోడ్లలోనే ప్లాన్ చేయడం కలిసొచ్చే అంశం. అందువల్ల ఆడియన్స్ కి సాగదీతగా అనిపించకపోవచ్చు. అలాగే కథలోకి నేరుగా ఆడియన్స్ ని తీసుకెళ్లేలా స్క్రీన్ ప్లే ఇంట్రో ఉంటుంది. కథలో భాగంగా ఇన్వస్టిగేషన్ సీన్స్, పలు ట్విస్ట్ లు కూడా బాగా మైంటైన్ చేసారు. అలాగే మెయిన్ లీడ్ లో నటించిన నరేష్ అగస్త్య బాగా నటించాడు.  మిగతా నటీనటులు వాళ్ళ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు. 

 

Minus Points : 

 

ఒక క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ని మెప్పించాలంటే కావాల్సింది ఊహించలేని ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ సీన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్... ఆడియన్స్ కి ఎంత కొత్తగా అనిపిస్తే.. అంత బాగా ఇలాంటి సినిమాలు గాని, సిరీస్ లు గాని సక్సె అవుతాయి. కానీ ఈ రుద్రావనం వెబ్ సిరీస్ లో ఒక క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన ఎలిమెంట్స్ కాస్త తక్కువే కనిపించాయి. స్టార్టింగ్ పర్లేదనిపించినా నెమ్మదిగా ల్యాగ్ ఫీల్ వస్తుంది. పైగా లాస్ట్ ఎపిసోడ్ లోనే థ్రిల్లింగ్ ఉందనుకుంటే... అక్కడే పసలేనట్టు ఓ మోస్తరుగా వెళ్తుంది. రైటింగ్ పరంగా పేలవమైన స్క్రీన్ ప్లే రాసినట్టు అనిపిస్తుంది. అలాగే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఇంతకు ముందు సిరీస్ లలో చూసిన ఫీల్ వస్తుంది. అంటే ఎదో ఇంగ్లీష్ లేదా హిందీ సిరీస్ లలో కాన్సెప్ట్ ని కాపీ చేశారన్న భావన కలుగుతుంది. కనీసం లాస్ట్ ఎపిసోడ్ ని బాగా చూపించి ఉంటే డీసెంట్ ఫీల్ అనిపించేది.

 

Technical Values : 

 

టెక్నికల్ పరంగా ఈ సిరీస్ కి ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఒక క్రైమ్ థ్రిల్లర్ కి మేకింగ్ పరంగా కావాల్సిన అన్ని టెక్నికల్ వాల్యూస్ సరిపోయాయి. సినిమాటోగ్రఫి బాగుంది. పవన్ అందించిన బీజీఎమ్ బాగుంది. మాధవ్ ఎడిటింగ్ పర్వాలేదు. కాకపోతే డైరెక్టర్ శశిధర్ మున్నంగి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, అంటే ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు. స్టోరీలో క్లైమాక్స్ దగ్గరవుతున్న కొద్దీ ఓ రెండు ట్విస్ట్ లు మినహా మిగతా అంతా ఊహించినట్టే అనిపిస్తుంది. 

 

Final Review : 

 

ఓవరాల్ గా "రుద్రవనం – పిఎస్" అంటూ ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్ లతో కొంతవరకు మెప్పిస్తుంది. రొటీన్ స్టోరీ అండ్ రెగ్యులర్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి యావరేజ్ ఫీల్ నే ఇస్తుంది. అయితే థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. 

Review Statistics

4.9
Overall Rating
Avg. of all reviews
7
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
4.9/10
Public
N/A
Why MRO?