Register as a Reviewer
కిల్లర్ (KillR | KilleR)

కిల్లర్ (KillR | KilleR)

Upcoming Expected Release: 30 Oct 2026

KillR | KilleR : సీరియల్ నటి జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'కిల్లర్' (KilleR). ఈ సినిమాకు జ్యోతి పూర్వాజ్ భర్త, పూర్వాజ్ దర్శకత్వం వహించగా, తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రివ్యూస్ దక్కించుకుంటుంది.

Director: Poorvaaj
Cast: Jyoti Poorvaj, Poorvaaj, Manish Gilada, Chandra Kanth Kollu, Vishal Raj, Archana Ananth, Gautam Chakradhar Koppisetty

Available in:

About This Movie

గుప్పెడంత మనసు సీరియల్ తో జగతి మేడంగా ఫేమస్ అయిన నటి జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'కిల్లర్' (KilleR). ఈ సినిమాకు జ్యోతి పూర్వాజ్ భర్త, పూర్వాజ్ దర్శకత్వం వహించగా, తాజాగా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఇక జ్యోతి పూర్వాజ్ మంచి యాక్షన్ సీక్వెన్స్ తో బోల్డ్ గా కనిపిస్తూ, అదరగొడుతుంది. 

 

ట్రైలర్ ని గమనిస్తే... ఈ సినిమా ఊహకందని ఓ మైండ్ గేమ్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిందని తెలుస్తుంది. ఇక బుల్లితెరపై కేవలం హోమ్లీ క్యారెక్టర్లలోనే చూసిన జ్యోతిని, ఈ సినిమాలో ఎన్నడూ లేని విధంగా చాలా వైల్డ్, బోల్డ్ అండ్ ఇంటెన్స్ రోల్‌ లో చూపించబోతున్నారు మేకర్స్. ట్రైలర్ కూడా సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా సినిమా నడుస్తుందని తెలుస్తుంది. థియేటర్లలో జ్యోతి పూర్వాజ్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెస్మరైజ్ చేస్తారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. 

 

ఇక ట్రైలర్ ద్వారా భారీ అంచనాలు నెలకొల్పిన ఈ 'కిల్లర్' సినిమాను అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదల చేయబోతున్నారు మేకర్స్. మరి బుల్లితెరపై స్టార్‌ డమ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్.. వెండితెరపై ఈ కిల్లర్ సినిమాతో ఏ స్థాయిలో రచ్చ చేస్తారో చూడాలి.

Why MRO?