Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
తెలుగులో మాత్రమే కాదు... ఇతర భాషల్లోనూ ఇప్పుడు హారర్ సినిమాలు అరుదుగా వస్తున్నాయి. కామెడీతో హారర్ మిక్స్ చేసి, ప్రేక్షకులను నవ్విస్తూ భయపడుతున్న దర్శక రచయితలు ఎక్కువయ్యారు. ఈ తరుణంలో పక్కా హారర్ సినిమాగా '418' వచ్చింది. మేకర్స్ అయితే ఇంతలా భయపెట్టే సినిమా ఇటీవల కాలంలో రాలేదని హైప్ ఇచ్చారు. కానీ హారర్ థ్రిల్లర్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే జంప్ స్కెర్స్, భయపెట్టడంలో కనిపించే రొటీన్ ట్రిక్స్ '418'లో లేవు. సిట్యువేషనల్ హారర్ కోసం దర్శకుడు కీర్తన నాడగౌడ ప్రయత్నించారు. అయితే... అది వర్కవుట్ కాలేదు.
సినిమాలో చైత్ర జె ఆచార్ పాత్ర బావుంది. ఆ పాత్ర లక్ష్యాన్ని బలంగా రాసిన దర్శకుడు... ఆమె వెళ్లే దారిని బలంగా రాలేదు. ఇక చివరకు వచ్చేసరికి 418 రూమ్ సీక్రెట్ కూడా సోసోగా అనిపిస్తుంది. అందువల్ల కథ పరంగా బలం లోపించింది. హారర్ కామెడీల మధ్య కేవలం ప్రేక్షకులను భయపెట్టే ఉద్దేశంతో వచ్చిన ప్యూర్ హారర్ సినిమా '418'. ఇందులో హారర్ ఎలిమెంట్స్, థ్రిల్స్ తక్కువ. కథ పరంగా ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువ. కొంత మేరకు మాత్రమే భయపెట్టింది. చైత్ర జె ఆచార్ కనిపించినది తక్కువ సేపే అయినా ఆమె నటన తప్పకుండా ఆకట్టుకుంది.
418 Movie Review
Positives :
1. Background Score
2. Initial Few Minutes
Negatives :
1. Unexciting Screenplay
2. Lack of Scary Moments
3. Runtime
4. Lack of Emotional Depth
418 movie is Another drawback of the film is the excessive Kannada flavour. It is a film which is made by a Kannada director, presented by a Kannada filmmaker, and acted by many Kannada actors, set in Karnataka, has a backdrop of Yakshagana, a traditional folk dance form popular in Coastal Karnataka districts and has two Kannada songs.
Overall, 418, has an interesting core point, a good takeoff and a couple of mildly scary moments but other than that, the film offers nothing interesting. An unexciting first half followed by an equally unexciting second half, made it a tiresome watch.
Bottom Line – Empty Vessels Make The Most Noise
Rating: 2.25/5
ఒకప్పుడు హార్రర్ సినిమా అంటే హార్రర్ సినిమానే. జనాలను భయపెట్టడమే లక్ష్యంగా సాగేవీ సినిమాలు. కానీ తర్వాత భయానికి నవ్వును కూడా జోడించి ఈ జానర్ రీచ్ పెంచారు కొందరు ఫిలిం మేకర్స్. దీంతో క్రమంగా ఆ సినిమాలు ఒక మూసలా మారి.. ఆ జానరే కంగాళీగా తయారైంది. ఇలాంటి టైంలోనూ అప్పుడప్పుడూ ఫక్తు హార్రర్ సినిమాలు కొన్ని వస్తుంటాయి. ‘418’ కొంచెం సిన్సియర్ గానే ఆ పని చేసింది. ఎప్పుడూ హార్రర్ సినిమాల్లో చూసే సెటప్ కు కొంచెం భిన్నంగానే ఈ కథ నడుస్తుంది. ఐతే ఎంత కసరత్తు చేసినా.. కథను అర్థమయ్యేలా.. కన్విన్సింగ్ గా చెప్పడం.. లాజిక్కులు సరిగ్గా ఉండడం.. జెన్యూన్ హార్రర్ మూమెంట్స్ తో ప్రేక్షకులను భయపెట్టడం కీలకం. ఈ విషయాల్లో ‘418’ ఒకింత నిరాశకే గురి చేస్తుంది.
ఇది కంటెంట్ ఉన్న సినిమానే కానీ.. కన్విన్సింగ్ గా లేకపోవడంతో ఒక మోస్తరు స్థాయిని మించలేకపోయింది. కథా నేపథ్యం బాగున్నా.. లీడ్ క్యారెక్టర్-అందులో ఛైత్ర అచర్ పెర్ఫామెన్స్ అదిరిపోయినా.. సాంకేతిక అంశాల్లో మెరుపులున్నా.. 418 ‘జస్ట్ ఓకే’ స్థాయిని మించలేకపోయింది. రైటర్ కమ్ డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ.. ఒక డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ కు అవసరమైన సెటప్ బాగానే చేసుకున్నాడు. తన టేకింగ్ బాగుంది. కానీ కథను ఇంకా క్లారిటీతో చెప్పాల్సింది. హార్రర్ ఎలిమెంట్స్ ను ఇంకా బాగా డీల్ చేయాల్సింది. తనలో మంచి టెక్నీషియన్ ఉన్న సంగతి తెలుస్తుంది కానీ.. ఔట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. చివరగా: 418.. కంటెంట్ ఉంది కడుపు నిండదు.
‘418’ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కీర్తన్ నడగౌడ ఎంచుకున్న నేపథ్యం, ఆ హాస్టల్ సెటప్, ఆత్మ చుట్టూ అల్లిన ఇంట్రడక్షన్ సీన్స్ మొదట్లో చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ ఆ ఉత్కంఠ కాసేపు కంటిన్యూ అయింది. సినిమా ముందుకు వెళ్లేకొద్దీ మనం రెగ్యులర్‌గా చూసే పాతకాలపు హారర్ సినిమాల ఫార్ములాలోకి వెళ్లిపోతుంది. పాడుబడిన భవనం, పగతో రగిలిపోయే దయ్యం, ఊహకు అందే భయానక సీన్స్.. ఇవే మళ్లీ మళ్లీ కనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో ఇంకాస్త కొత్తదనం ఉండుంటే అదిరిపోయేది. ఆడియన్స్‌ను నిజంగా భయపెట్టే సీన్స్ కంటే, కేవలం భారీ సౌండ్స్ పెట్టి ఉలిక్కిపడేలా చేసే సీన్స్‌పైనే డైరెక్టర్ ఎక్కువగా ఆధారపడ్డాడు.
ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా మొదలైంది.. కానీ దాన్ని బాగా ల్యాగ్ చేసినట్లు అనిపించింది. ముఖ్యంగా చివరి అరగంట ఇంకాస్త ఫోకస్ చేసుంటే బాగుండేది. మెయిన్ ప్లాట్ అంతా అక్కడే ఉంది. లాజిక్ లేని సీన్స్‌తో ఆడియన్స్‌కు విసుగు తెప్పిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉన్నా.. అది ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో పర్లేదనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి ఈ తరహా రొటీన్ కథకు చాలా ఎక్కువైంది. ఒక అద్భుతమైన హారర్ సినిమా చూస్తామనుకుని థియేటర్‌కు వెళ్లిన వాళ్ళకు ఈ సింపుల్ స్క్రీన్‌ప్లే రొటీన్‌గానే అనిపిస్తుంది. కథలో లేని బలాన్ని నేపథ్య సంగీతంతో లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. అకుల్ అవినాష్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాల్సింది. నిడివి బాగా ఎక్కువవడం, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌ని ట్రిమ్ చేయకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి.
సింపుల్ అండ్ ఎమోషనల్ స్టోరీ పాయింట్ అల్లుకొన్న హారర్, థ్రిల్లర్ 418. ఈ సినిమాలో కథ కంటే ఎక్కువగా కథనం, సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ విభాగాలపైనే ఎక్కువ దృష్టిపెట్టారనే విషయం సినిమా ఆరంభంలోనే తెలిసి పోతుంది. కథలో వేగం లోపించడం, అక్కడక్కడే తిరుగుతూ సాగదీసి సాగదీసినట్టు ఉండటంతో ఆడియెన్స్‌లో ఉండే క్యూరియాసిటీపై క్రమంగా ప్రభావం పడిందనే చెప్పాలి. అయితే లాగించి చెప్పే ప్రయత్నం చేయడం వల్ల కొన్నిసార్లు విసుగు కూడా పడుతుంది. ఇక హారర్ ఎలిమింట్స్ కొన్ని సార్లు నిజంగానే భయపెట్టాయి. కానీ ఎక్కువ సార్లు చాలా ఆర్టిఫిషియల్‌గాను ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్‌లో కొన్ని సీన్లు మాత్రమే ఓకే అనిపించేలా ఉంటాయి.
ఇక ఈ సినిమా సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక పెట్టించింది. ఇక ఎప్పటిలానే ప్రశాంత్ నీల్ తరహా కలర్ ప్యాటర్న్‌తో సాగుతుంది. కొన్నిసార్లు చీకట్లో ఏం జరుగుతుందో తీక్షణంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కథ, కథనాలను ఇంకాస్త పట్టించుకొంటే.. అందరూ హైప్ చేసినట్టు మంచి థ్రిల్లర్ అయి ఉండేది. అంచనాలు పెంచుకొని వెళ్తే కొంత నిరాశ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకొని వెళ్తే మంచి అనుభూతితో బయటకు రావొచ్చు.
చైత్ర జె ఆచార్ మెయిన్ లీడ్ లో ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ "418" తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ చిత్రంలో మొదటి నుంచీ హైప్ చేసిన సౌండ్ డిజైన్ మాత్రం అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. కొన్ని టెన్స్ సీన్స్ ఒకటీ రెండు అక్కడక్కడా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో మరియు క్లైమాక్స్ పోర్షన్ లో థ్రిల్ మూమెంట్స్ ఈ తరహా సినిమాలు ఇష్ట పడేవారికి, జెనరల్ ఆడియెన్స్ కి కూడా గూస్ బంప్స్ తెప్పించేలా అనిపిస్తాయి. అయితే ఖచ్చితంగా ఈ సినిమాపై సెట్ చేసిన హైప్ ఆధారంగా ఏదో క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది అనుకోని ఆడియెన్స్ ట్రై చేస్తే మాత్రం డిజప్పాయింట్ అవ్వక తప్పదు.
కేవలం కొన్ని చోట్ల మినహా మిగతా కథనం అంతా చాలా స్లోగా చప్పగా సాగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘418’ అనే హారర్ సినిమా కేవలం కొన్ని చోట్ల మాత్రమే థ్రిల్స్ ని పంచగలుగుతుంది. యువ నటీనటులు అలాగే నటి చైత్ర జే ఆచార్ మంచి పెర్ఫామెన్స్ లను అందించారు. అలాగే కొన్ని చోట్ల సౌండింగ్, థ్రిల్ మూమెంట్స్ బాగున్నాయి. కానీ ఓ రేంజ్ లో భయపెట్టేసే సినిమా అయితే ఇది కాదు. ముందు సెట్ చేసిన హైప్ తో వెళితే మాత్రం డిజప్పాయింట్ అవుతారు. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే బెటర్.
Just ippude ETV win app lo Nallajarla Road short film chusa. genral ga nenu short film chudanu kaani... youtube lo trailer chusaka intrest occhindi. and subcription lekapothe konukkuni mari chusa..
but movie chala intresting ga anipinchindi. dennenduku long length movie ga teesi theaterlo enduku release cheyaledani feel occhindi.
but short ga unnanduke bore kottakunda thrill feel icchindi. 2 hours length unna movie ga marchithe chala bore kottedani tarvatha realize ayya.
twist lu, thrills bagunnayi nakaithe... mari evarikaina intrest unte low hype tho chudandi thriller movies like chesevallakaithe definatley try cheyocchu.
final ga eeroju crazy kalyanam movie eeroju complete chesa. ippude first show chusostuna.. pandakki ekkuva cinemalocchesariki annintini cover cheyadaniki intha time pattindi. and cinema ayithe decent timepass movie ani cheppochu.
movie mottham manchi entertainment untundi. and village back drop kabatti naku chala nachindi. because elagu ee busy life lo oollu tiragalem.. atleast cinemalo ayina naku chustunte ooriki vellina feel occhindi.
and movielo anupama, tarun bhasker, naresh performance peaks asalu... mareee pedda message cinemalo ledu kani.. alochiste.. adapillalaku pelli ventante cheseyakunda... valla career lo setile ayyedaka chance ivvalani movielo cheppinattu nakanipinchindi.
గ్రామాల్లో అమ్మాయికి పెళ్లి చేస్తే తమ బరువు తీరుతుందని, మంచి చదువుకున్న, జాబ్ చేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తుంటారు. చాలా వరకు అలానే జరుగుతుంటాయి. అమ్మాయి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ఇలాంటి పెళ్లిళ్లు చేస్తారు. అమ్మాయి కెరీర్‌ని పెళ్లితోనే సమాధి చేస్తుంటారు. అలాంటి రియలిస్టిక్ అంశాలతో క్రేజీ కళ్యాణం మూవీని రూపొందించారు దర్శకుడు బద్రప్ప. అదే సమయంలో తెలంగాణ పల్లెల్లో ఉంటే కల్చర్ ని, బంధాలు, అనుబంధాలు, అలకలు, గొడవలను బేస్ చేసుకుని తెరకెక్కించారు. రియాలిటీకి దగ్గరగా చూపించారు.
అయితే సినిమాలో ఫస్టాఫ్‌లో ఫన్ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. డోస్ తగ్గింది. కొన్ని సీన్లు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. దీంతో డ్రైగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది.కీర్తిగా అనుపమా నటన అదిరిపోయింది. మామఅల్లుళ్ల గొడవలు నవ్విస్తాయి. బాలరాజు పాత్ర నవ్విస్తుంది. ఆకట్టుకుంటుంది. పర్వతాలు పాత్రలో సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్స్ బాగున్నాయి. క్లైమాక్స్ అదిరిపోయింది. సంగీతం ఫర్వాలేదు. విజువల్స్ బాగున్నాయి. సినిమాలో మెయిన్‌గా కామెడీ వర్కౌట్ కాలేదు. నరేష్ పాత్ర హైలైట్ కావడంతోపాటు కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. ఎమోషన్స్ పెద్దగా పండలేదు. డ్రామా కూడా కొన్ని చోట్లు తేలిపోయింది. ఇలాంటివి కొన్ని పక్కన పెడితే పండక్కి సరదాగా టైమ్ పాస్‌కి చూసే మూవీ ఇదే.
క్రేజీ కళ్యాణం సినిమా చూసేటప్పుడు ఇది పీరియాడిక్ సినిమానా? లేదంటే ప్రజెంట్ టైంలో జరిగే కథనా? అన్న అనుమానం వస్తుంది. ఒక్కోసారి ఇది పాత కాలం చిత్రం అన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు మోడ్రన్ టైంలోనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే అమ్మాయిల్ని ఎలా పెంచాలి.. వాళ్లకి ఆర్థిక స్వేచ్ఛ ఎంత అవసరం? పెళ్లికి పెట్టే ఖర్చులో పదో వంతు వారి చదువులకు పెట్టినా వారి జీవితం బాగు పడుతుంది.. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచించాలి అనే సందేశాన్ని ఇవ్వాలని దర్శకుడు అనుకున్నట్టుగా కనిపిస్తోంది. \
ఫస్ట్ హాఫ్ అంతా కూడా నరేష్, తరుణ్ భాస్కర్ ట్రాక్ తో నవ్వులు పూయించారు. ఇక సెకండాఫ్‌లో ఎమోషనల్ పార్ట్ ఏమైనా కనెక్ట్ అవుతుందని అనుకుంటే.. అక్కడా నిరాశే కలుగుతుంది. ప్రేమ సీరియస్‌గా అనిపించదు. తండ్రీకూతుళ్లు సెంటిమెంట్ మాత్రం ప్రీ క్లైమాక్స్‌లో హత్తుకునేలా ఉంటుంది. కానీ పూర్తి సినిమాగా చూస్తే అంత గొప్పగా అనిపించదు. అందరికీ కనెక్ట్ అయ్యేలా తీయడం, ఎమోషనల్ డెప్త్ చూపించడంలో మేకర్స్ పూర్తిగా సక్సెస్ అవ్వలేదనిపిస్తుంది. ఓవరాల్ గా ‘క్రేజీ కళ్యాణం’ అనే టైటిల్‌లో కనిపించే వైబ్ సినిమాలో కనిపించదు. మెసెజ్, చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంటుంది. కానీ హార్ట్ టచింగ్‌గా చెప్పడంలో కాస్త విఫలం అయ్యారనే చెప్పొచ్చు. సినిమాని చూడాల్సిందే.. చూడకపోతే.. కాస్ట్ లీ మిస్ అన్నట్టుగా చెప్పలేం. థియేటర్లలో వీలు కాకపోతే ఓటీటీలో అయినా చూడొచ్చు. అక్కడ కూడా టైం లేదనుకుంటే స్కిప్ చేస్తూ చివరి 20 నిమిషాలు అయినా చూసుకోవచ్చు.
'క్రేజీ కల్యాణం' కథ విషయానికి వస్తే.. ఇది ఒక రొటీన్ తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్ డ్రామా. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, చిన్న చిన్న కామెడీ సీన్లతో కాస్త స్లోగా, ఆడియన్స్‌కి ముందే ఊహించేలా సాగుతుంది. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి అసలు కథలో వేగం పెరుగుతుంది. పెర్ఫార్మెన్సెస్ పరంగా అనుపమ పరమేశ్వరన్ తెలంగాణ స్లాంగ్‌ను పర్‌ఫెక్ట్‌గా పలికిస్తూ, తన నటనతో మరోసారి మెప్పించింది. తరుణ్ భాస్కర్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులు పూయించాడు.
కానీ ఈ సినిమాకి రియల్ 'షో స్టాపర్' మాత్రం వీకే నరేష్ గారే! క్లైమాక్స్ ముందు వచ్చే సీన్లలో ఆయన చేసిన ఎమోషనల్ యాక్టింగ్, అమ్మాయిల స్వయం ప్రతిపత్తి అండ్ పెళ్లిళ్లపై ఇచ్చే సందేశం హృదయాలను తాకుతుంది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది అనిపించినా, ఫ్యామిలీ, లవ్ అండ్ ఎమోషన్స్ ని కోరుకునే ఆడియన్స్‌కి ఇది ఒక గుడ్ ఛాయిస్. finally ఫస్ట్ హాఫ్ సోసోగా ఉన్నా.. క్లైమాక్స్ ఎమోషన్స్‌తో థియేటర్ నుంచి బయటకి వస్తాం.
‘క్రేజీ కల్యాణం’ సినిమా కథ రొటీన్ ఫ్యామిలీ డ్రామాగానే మొదలై, ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. అనుపమ పరమేశ్వరన్ అద్భుతమైన అభినయం, తెలంగాణ స్లాంగ్, తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వీకే నరేష్ గారి ఎమోషనల్ యాక్టింగ్, అమ్మాయిల స్వయం ప్రతిపత్తి, పెళ్లి అంశాలపై ఇచ్చిన మంచి సందేశం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
రొటీన్ కథనం వల్ల అక్కడక్కడా కాస్త బోర్ కొట్టినా, ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామాలు, ఫీల్-గుడ్ ఎమోషన్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి చాయిస్. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ సోసోగా ఉన్నా, చివరి అరఘంట ఎమోషన్స్ కోసం కచ్చితంగా ఒకసారి చూడొచ్చు!
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers