క్రేజీ కళ్యాణం ( Crazy Kalyanam)
Crazy Kalyanam : ఈసారి పక్కా ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న మలయాళ కుట్టి అనుపమ..
Available in:
About This Movie
టాలీవుడ్ లో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు చేసే హీరోయిన్లలో "అనుపమ పరమేశ్వరన్" ఒకరు. ఈ మధ్య కాలంలో సరైన సినిమా లేక డీలా పడిపోయిన ఈ మలయాళ కుట్టి, ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని లేడీ ఓరియెంటెడ్ జోనర్ లో పక్కా ఎంటర్టైన్మెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ "క్రేజీ కళ్యాణం". తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బూసమ్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెళ్లి వేడుకల నేపథ్యంలో ఆ సమయంలో జరిగే నాటకీయ పరిణామాల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన సంఘటనలతో, పక్కా కామెడీ ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ని చూస్తే థియేటర్లో మాంచి నవ్వులు పూయించే ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక టీజర్ లో గమనిస్తే... అనుపమ - తరుణ్ భాస్కర్ ల మధ్య వచ్చే సీన్స్ బాగా కామెడీ వే లో ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. అలాగే సీనియర్ నరేష్, అఖిల్ రాజ్ రోల్స్ కూడా కీలకంగా మారనున్నాయి.
ఇక ఈ క్రేజీ కళ్యాణం సినిమాకు సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, టీజర్ కి ఇచ్చిన మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇక టీజర్ లో డైలాగ్స్ కూడా ఫన్నీగా సిచ్యువేషన్స్ కి తగ్గ కామెడీస్ తో సినిమా నిండి ఉంటుందని తెలుస్తుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ ని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు కానీ, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సినిమాని సెప్టెంబర్ లో క్రేజీ కళ్యాణం సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.