Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Just caught Haiku movie and honestly... it’s a hard pass. The premise of one guy in a college with 2,000 girls had potential, but the film quickly devolves into an utterly generic, rehashed love triangle.
While the leads do their best with the material and the first half delivers a few light laughs, the second half is an absolute drag. The pacing crawls, the soundtrack is completely forgettable, and the script relies on outdated tropes we’ve seen a hundred times before.
overall Dull, repetitive, and lacks any real spark. Skip it!
just eప్పుడే 'Haiku' movie చూసొచ్చా bro! Over all గా చెప్పాలంటే, zero expectations తో వెళ్తే okayish timepass, అంతే!
Plot ఏంటంటే.. అదే రొటీన్ triangle love story bro! Hero Manohar, present girlfriend Nivedha, and ex-lover Pavalakodi మధ్య నడిచే నలిగే కథ. First half లో 2000 girls ఉన్న college లో మనో ఒక్కడే అబ్బాయి అవ్వడం, ఆ scene ల్లో వచ్చే fun and comedy moments మటుకు బాగానే vibe అయ్యాయి. Lead actors Egan, Femina & Sridevi acting screening లో బానే అనిపించింది.
but second half కి వచ్చేసరికి డ్రాగ్ చేసి చేసి పారేశారు bro! Theatre బయటకి వచ్చాక ఒక్క scene కూడా గుర్తుండదు, songs అయితే totally unskippable clutter లాగా అనిపించాయి. Totally outdated routine template story, no freshness at all! overall ga Friends తో chill అవుతూ casually చూడటానికి తప్పిస్తే, పెద్దగా ఏం లేదు bro. One time watch at best! nakaithe adi kooda ekkuve..
ఇప్పుడే 'హైకూ' సినిమా చూసి థియేటర్ బయటకి వచ్చా! overall గా చెప్పాలంటే అస్సలు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా వెళ్తే ఓకే అనిపించే యావరేజ్ మూవీ, అంతకు మించి ఏమీ లేదు!
కథ విషయానికి వస్తే.. అదే routeen traiangil లవ్ స్టోరీ! హీరో మనోహర్, ప్రజెంట్ లవర్ నివేద, కాలేజ్ రోజుల్లో మాజీ ప్రేయసి పవళకొడి మధ్య నడిచే నలిగే కథ.
అయితే ఫస్ట్ హాఫ్‌లో రెండు వేల మంది అమ్మాయిలున్న ఉమెన్స్ కాలేజీలో మనోహర్ ఒక్కడే చదివే కాన్సెప్ట్, అక్కడ జరిగే కొన్ని కామెడీ సీన్స్ బాగానే అనిపిస్తాయి, అక్కడక్కడ నవ్వుకోవచ్చు. హీరో ఏగన్, హీరోయిన్లు ఫెమినా, శ్రీదేవి యాక్టింగ్ ఓకే, స్క్రీన్ మీద బానే ఉన్నారు.
but second half స్టార్ట్ అయ్యాక దండం రా బాబోయ్! సీన్స్ సాగదీసి సాగదీసి బోర్ కొట్టించేశారు. థియేటర్ బయటకి వచ్చాక అసలు ఏ ఒక్క సీన్ కూడా మనకి గుర్తుండదు. పాటలు కూడా అంతగా మైండ్‌లో నిలవవు. రొటీన్ లవ్ స్టోరీస్ చూసీ చూసీ ఉన్న మనకి ఇది ఇంకా పాత చింతకాయ పచ్చడిలానే అనిపిస్తుంది.
Haiku movie ippude chosoccha friends tho... anavasaranga dabbulu bokka ayinayi anipistundi.. edo trailer chusi aa college life.. aa cool bgm chusi idedo feel good cinemala untadi anukunna.. atleast commerial love storyla kooda teeyaledu...
rotta routeen cinemaki maaku antagattaru.. kaneesam chusinollu evaraina chepte vellakunda ade dabbultho biryani tinevallam... ippudu naku maa friends ki 500 bokka.. and cinemalo telugu heroine tappa anni kottha mohale..
konchem better anipinchindante aa ladies college lo oke oka abbai chadavadam... adi tappa cinema antha rotte... nakaithe one time watchable kooda kadu.
లేడీస్ కాలేజీ మొత్తం మీద ఒక్కడే కుర్రాడు - దర్శకుడు యువరాజ్ చిన్నసామి ఈ పాయింట్ మీద హైకూ సినిమా స్టార్ట్ చేశాడు. అమ్మాయిలను అబ్బాయిలు ర్యాగింగ్ చేయడం పలు సినిమాల్లో చూశాం. బట్, ఫర్ ఏ ఛేంజ్... అబ్బాయిని అమ్మాయిలు ర్యాగ్ చేసే సన్నివేశాలు వినోదాత్మకంగా సాగాయి. అమ్మాయిల మధ్యలో హీరో పడే తిప్పలు నవ్విస్తాయి. అయితే... ప్రేమలో పడిన తర్వాత వచ్చే కులం పట్టింపులు వంటివి రొటీన్ అనిపిస్తాయి. మనసులో మరొకని ఉంచుకుని తన మీద చూపించే ప్రేమ వద్దనుకునే అమ్మాయి నివి కథగా 'హైకూ' మారుతుంది.
బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమలో పడిన కథతో కొన్ని సినిమాలు వచ్చాయి. 'హైకూ' స్పెషాలిటీ ఏమిటంటే... బ్రేకప్ తర్వాత గతంలో ప్రేమించిన అమ్మాయిని గుర్తు పెట్టుకుని, ఆమె విషయంలో చేసిన తప్పులు తన దగ్గర రిపీట్ చేయకుండా ఉండటాన్ని నివి సహించలేకపోతుంది. వేరొకరి ప్రేమ తనకు వద్దంటుంది. ఆ పాయింట్ బావున్నా ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు యువరాజ్ ఫెయిలయ్యాడు. యువరాజ్ చిన్నసామి కథకు, సినిమాకు సిద్ధూ కుమార్ సంగీతం ప్లస్ అయ్యింది. ఈతరం యువత, ముఖ్యంగా 'జెన్ జి'కి ప్రేమలో చేసే తప్పుల గురించి మెసేజ్ ఇచ్చే సినిమా 'హైకూ'. వినోదంతో పాటు సందేశం బావుంది. అయితే ఎమోషన్స్ హార్ట్ టచింగ్‌గా తీసి ఉంటే బావుండేది. రొమాంటిక్ కామెడీ జానర్స్ ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఎంజాయ్ చేయవచ్చు. కాసేపు నవ్వుకుని రావచ్చు.
తమిళ్ హీరో ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ జంటగా యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా 'హైకూ' ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.కథ విషయానికి వస్తే.. హీరో మనోహర్ తన ప్రెజెంట్ లవర్ నివేద, కాలేజ్ డేస్ మాజీ ప్రేయసి పవళకొడిల మధ్య నలిగే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. రెండు వేల మంది అమ్మాయిలున్న కాలేజీలో ఒకే ఒక్క అబ్బాయి చదివితే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్, ఫస్ట్ హాఫ్‌లోని కామెడీ అండ్ ఫన్ మోమెంట్స్ ఆడియన్స్‌కి బాగానే నవ్విస్తాయి. కొత్త హీరో ఏగన్‌తో పాటు హీరోయిన్లు ఫెమినా, శ్రీదేవి తమ నటనతో ఆకట్టుకున్నారు. ప్రియేష్ కెమెరా వర్క్, కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి plus.
అయితే థియేటర్ బయటకి వచ్చాక గుర్తుండే ఒక్క స్ట్రాంగ్ సీన్ కూడా లేకపోవడం, సెకండాఫ్‌లో సాగదీత సన్నివేశాలు, గుర్తుందిపోని పాటలు సినిమాకి పెద్ద మైండ్ బ్లాకింగ్ మైనస్! ఎలాంటి కొత్తదనం లేని పాత చింతకాయ పచ్చడి లాంటి కథనం వల్ల తెలుగు ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వడం కష్టమే. రొటీన్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే just one time watch.
స్నేహితురాలిగా పరిచయమై, ప్రేయసిగా మారిన అమ్మాయితో బ్రేకప్.. మూవ్ ఆన్ అయ్యి మరో అమ్మాయితో ప్రేమ.. మరో పక్క మాజీ ప్రేయసి జ్ఞాపకాలతో సతమతమవుతున్న ఓ యువకుడి కథను హైకూ గా తెరపై ఆవిష్కరించాలనుకున్నాడు దర్శకుడు. ఆయన కథలో కాన్‌ఫ్లిక్ట్ బావున్నా... ఎగ్జిక్యూషన్‌లో గజిబిజి చేసేశారు. సినిమాలో ఒకే సీన్స్ రిపీట్ అయిన భావన కలుగుతుంది. అయితే మనో, నివేదా పాత జ్ఞాపకాలకు స్వస్తి చెప్పి కొత్త జీవితానికి నాంది పలకాలనుకునే సమయంలో పాత జ్ఞాపకాలు ఎలా వెంటాడాయి అన్నది ఆసక్తికరంగా, భావోద్వేగంగా చూపించారు. కానీ ప్రేమ సన్నివేశాల్లో బలంగా చెప్పాల్సిన విషయాన్ని తేలిపోయినట్లు చేశారు.
నటీనటుల నుంచి చక్కని నటనను మాత్రం తీసుకున్నాడు దర్శకుడు. లవ్‌స్టోరీగా చూస్తే ఇదేమీ కొత్త కథకాదు కానీ.. సీన్లుగా చూస్తే దర్శకుడు చూపించిన ప్రతిభ ఆకట్టుకుంటుంది. ఈ ప్రేమకథలో కులాల అంతరాలు గురించి చూపించి చిన్న సందేశం ఇచ్చారు. ఏగెన్ మనో పాత్రకు యాప్ట్‌గా నిలిచారు. బ్రేకప్‌తో నలిగిపోయిన ప్రేమికుడిగా చక్కని భావోద్వేగాలు పండించారు. తెలుగమ్మాయి శ్రీదేవి కొడి పాత్రలో ఆకట్టుకుంది. ఫెమినా జార్జ్ కూడా క్యూట్‌గా కనిపిస్తూనే నివి పాత్రకు న్యాయం చేసింది. ఇక లవ్‌స్టోరీకి కావలసిన సంగీతం అందించారు మ్యూజిక్ డైరెక్టర్ సిద్దూ కుమార్. కథ, కథనం రొటీన్‌గానే ఉన్నా.. యంగ్‌స్టర్స్ ఆ లోపాన్ని కొంతలో కొంత సరిదిద్దారు. అక్కడక్కడా ఫ్యామిలీ వాల్యూస్‌తో జెన్‌జీ బ్యాచ్‌కు నచ్చేలా ఈ సినిమా తీశారు. అయితే పూర్తిగా తమిళ వాసనతో ఉన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి.
ఒక అమ్మాయితో ప్రేమ, బ్రేకప్.. ఆ తర్వాత ఆ పాత జ్ఞాపకాలను మర్చిపోలేక సతమతమవుతూనే ఇంకో అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించడం అనే పాయింట్ చుట్టూ డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి ఈ చిత్రాన్ని మలిచారు. ఎంచుకున్న థీమ్ బాగున్నప్పటికీ, తెరపై ప్రదర్శించిన తీరు మాత్రం కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. సినిమా అంతా మనం రెగ్యులర్‌గా చూసే రొటీన్ ఫార్ములానే. అయితే సినిమాలో రెండో లవ్ స్టోరీ మొదలైన తర్వాత ఫస్టాఫ్ సీన్లే మళ్లీ రిపీట్ అవుతున్నాయా అనే ఫీలింగ్ కలుగుతుంది. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త బంధంలోకి అడుగుపెట్టే క్రమంలో హీరో పడే మానసిక సంఘర్షణను దర్శకుడు ఎమోషనల్‌గా బాగానే రాసుకున్నారు. కానీ రొమాంటిక్ ట్రాక్‌లో బలంగా ఉండాల్సిన డెప్త్ మిస్ అవ్వడం కాస్త నిరాశపరుస్తుంది.
ముగింపు సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. ఓవరాల్ గా ఇదొక కొత్త తరహా పాయింట్ కాకపోయినా, కొన్ని సీన్ల పరంగా డైరెక్టర్ పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అంతర్లీనంగా కులాల కుమ్ములాటలపై ఇచ్చిన చిన్న మెసేజ్ కూడా ఆలోచింపజేస్తుంది. అయితే పాత స్టోరీనే అయినా యువతీయువకుల నటన సినిమాను కాస్త సేవ్ చేసింది. ఈతరం ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు కుటుంబ విలువలు కూడా ఇందులో బాగానే ఉన్నాయి. అయితే డబ్బింగ్ సినిమా కావడం ఒక్కటే దీనికి మైనస్.. మన దగ్గర దీనికి ఎంత కనెక్ట్ అవుతారనేది చూడాలి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా హైకూ.. రియలిస్టిక్ ఎంగేజింగ్ లవ్ స్టోరీ..!
బ్రేకప్ తో జీవితం అతలాకుతలమైన ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ప్రేమలో పడితే.. వారి పాత జీవితం వారిని ఎలా వెంటాడుతుందనే మంచి ఎమోషనల్ పాయింట్‌ను బేస్ చేసుకొని దర్శకుడు యువరాజ్ చిన్నస్వామి రాసుకొన్న ఈ హైకూ కథ బాగుంది. కొంత మేరకు కథ, కొన్ని సన్నివేశాలు రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ.. కొంత పాయింట్స్, డిఫరెంట్ యాంగిల్‌లో రిలేషన్స్‌ను చూపించిన విధానం బాగుంది. మనో, జాబిలి ప్రేమ కథ సమాజ కట్టుబాట్లతో నేటి తరం యువత ఆలోచన, జీవితంపై వారి అంచనాలను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక ప్రియుడి వేధింపులతో ప్రేమ బంధంపై విరక్తి పెరిగిన అమ్మాయిగా నివేదా పాత్ర భావోద్వేగంగా సాగుతుంది.
ఇలాంటి ప్రేమలో విఫలమైన ఇద్దరు కలిసి మళ్లీ లవ్ జర్నీ చేయాలనుకొన్న సమయంలో వారి గత అనుభవాలు వారిని ఎలా ఆడుకొన్నాయి? అనే పాయింట్ కథకు మరింత బలంగా కనిపించింది. సెకండాఫ్‌లో శ్రీదేవీ, ఫెమీనా జార్జ్ పాత్రలతోపాటు ఏగెన్ చూపించిన నటనతో ఈ సినిమా జెన్ జీని ఆకట్టుకొనే ప్రేమ కథగా నిలిచేలా చేసింది. ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. సిద్దూ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు కూడా బాగున్నాయి. పియూష్ గురుస్వామి సినిమాటోగ్రఫి సినిమాకు ఫీల్ గుడ్‌గా మారింది. ఇది జెన్ జీ కేటగిరీ లవ్ స్టోరీ మాత్రమే కాదు.. మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా. కథ, కథనాలు రొటీన్‌గా ఉన్నప్పటికీ.. యంగ్ టాలెంట్ ఆ లోపాన్ని సరి చేసింది. ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
తొలి ప్రేమ, కాలేజీ జ్ఞాపకాలు, విడిపోయిన బంధాలు, కొత్తగా జీవితంలోకి వచ్చే వ్యక్తుల మధ్య భావోద్వేగాలు.. ఇవన్నీ ప్రేమకథలకు ఎప్పుడూ ఆసక్తికరమైన అంశాలే. అయితే, ఇలాంటి కథను ప్రేక్షకులకు కొత్తగా చెప్పడంలోనే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. అలాంటి ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే `హైకూ`. ఈ సినిమా కథలో ప్రధానంగా కనిపించే అంశం ప్రేమలో ఎదురయ్యే మార్పులు, గత అనుభవాలు మనిషి నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది. మొదటి ప్రేమలో కలిగే అనుభూతులు, విడిపోయిన తర్వాత మిగిలే జ్ఞాపకాలు, మరో వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు కలిగే సందిగ్ధతను కథలో చూపించే ప్రయత్నం చేశారు. ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. అయితే, ఆ భావాలను ప్రేక్షకులకు బలంగా చేరవేయడంలోనే సినిమా కొంత వెనుకబడింది.
సినిమాలో క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. ముగింపు మాత్రం ఊహించినట్టుగానే ఉంటుంది. అయితే కథని ఎత్తుకున్న తీరు బాగుంది, కొత్తగా ఉంది. ఆ తర్వాత రొటీన్‌లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో లవ్ లో డెప్త్, ఫీల్ ఎమోషన్స్ ఇంకా బాగా పండితే సినిమా అదిరిపోయేది. ప్రేమలోని కొత్త కథలను ఆవిష్కరించే `హైకూ`. చివరగా ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకునే చిత్రమవుతుంది.
తమిళ్ యంగ్ హీరో ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ జంటగా యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రోమ్‌కామ్ డ్రామా 'హైకూ' ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. హీరో మనో తన ప్రజెంట్ లవ్ నివేద, పాస్ట్ లవ్ పవళకొడిల మధ్య నలిగే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఇక సినిమాలో రెండు వేల మంది అమ్మాయిలున్న ఉమెన్స్ కాలేజీలో ఒకే ఒక్క అబ్బాయి చదివితే ఎలా ఉంటుందనే పాయింట్, కొన్ని కాలేజ్ ఫన్ మోమెంట్స్ ఆడియన్స్‌కి బాగానే నవ్విస్తాయి.
ప్రొడక్షన్ వాల్యూస్, హీరో హీరోయిన్ల పెర్ఫార్మన్స్, కొన్నిచోట్ల బీజీఎమ్ ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే, రొటీన్ కథతో పాటు పాత చింతకాయ పచ్చడిలాంటి స్క్రీన్‌ప్లే, స్లోగా సాగే సెకండాఫ్, గుర్తుందిపోని పాటలు సినిమా గ్రాఫ్‌ని తగ్గించేశాయి. కొత్తదనం పెద్దగా లేకపోయినా, ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే రొటీన్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు!
ప్రేమ కథల్లో ఎంత సంఘర్షణ ఉంటే.. ఆడియెన్స్‌కి అంతగా కనెక్ట్ అవుతుంది. ఎమోషన్స్, కాన్ ఫ్లిక్ట్ అనేదే ప్రేమ కథకు ప్రధాన అంశంగా నిలుస్తుంది. హైకూ చిత్రంలో అవే దాదాపుగా మిస్ అయ్యాయ్ అన్నట్టుగా కనిపిస్తుంది. అమ్మాయిల కాలేజ్‌లో అబ్బాయి జాయిన్ అవ్వడం అనే పాయింట్ కొత్తగా ఉంటుంది. ఇంకో అమ్మాయిని ప్రేమించి, ఆమెనే తల్చుకుంటూ ఉండే అబ్బాయి జీవితంలోకి రీప్లేస్‌గా ఉండటం ఇష్టం లేని అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ బాగానే అనిపిస్తాయి. అయితే పూర్తి సినిమాగా చూసుకుంటే మాత్రం హైకూ అందరినీ ఆకట్టుకోలేదనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా.. తీసిన విధానం, జనాలకు కనెక్ట్ చేయడంలో మాత్రం తడబడినట్టు అనిపిస్తుంది.
అయితే సినిమాలో ఇంటర్వెల్ కి బ్రేకప్ సీన్ ఉంటుందని అందరూ ఊహించేస్తారు. అలా ఊహకు అందేలానే చాలా సీన్స్ సాగుతుంటాయి. ఇక సెకండాఫ్ అంతా కూడా ఎమోషనల్ గానే సాగుతాయి. అయితే ప్రేమ జంటలోని ఎమోషన్‌ను మాత్రం ఆడియెన్స్ ఫీల్ అవ్వకపోవచ్చు. ఇంకెంత సేపు అక్కడక్కడే తిప్పుతార్రా బాబు అన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రేమలో అబ్బాయి ఎలా ప్రవర్తించాలి? అమ్మాయి ఆత్మగౌరవం కోసం ఎలా ఫైట్ చేయాలి.. ఎలా తన కోసం తాను నిలబడాలి అన్నది మాత్రం చక్కగా చూపించారు. ఓవరాల్‌గా ‘హైకూ’.. రెగ్యులర్ కమర్షియల్ డ్రామా అయితే కాదు. లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు కొంత మేరకు నచ్చే అవకాశం ఉంది. హాస్యం, ప్రేమ, స్నేహం చుట్టూ తిరిగే ఈ ‘హైకూ’ తెలుగులో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers