Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1888
Total Reviews
134
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 169-180 of 1888 reviews

Garividi lakshmi movie review

Sakshi

By Sakshi

6.0
out of 10
ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథలో తనదైన ముద్ర వేసిన అరుదైన గాయని ‘గరివిడి లక్ష్మి’ జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. ఇక సినిమాలో ఆనంది గరివిడి లక్ష్మి పాత్రలో జీవించేసింది! నటుడు నరేష్, రాగ్ మయూర్ లు నటనతో ఆకట్టుకోగా, చరణ్ అర్జున్ అందించిన ఫోక్ సాంగ్స్ మాస్ ఆడియెన్స్ ని ఊపేస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లోని చివరి 30 నిమిషాల ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ గుండెలను పిండేస్తాయి. డెబ్యూ డైరెక్టర్ గౌరీ నా...

ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథలో తనదైన ముద్ర వేసిన అరుదైన గాయని ‘గరివిడి లక్ష్మి’ జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. ఇక సినిమాలో ఆనంది గరివిడి లక్ష్మి పాత్రలో జీవించేసింది! నటుడు నరేష్, రాగ్ మయూర్ లు నటనతో ఆకట్టుకోగా, చరణ్ అర్జున్ అందించిన ఫోక్ సాంగ్స్ మాస్ ఆడియెన్స్ ని ఊపేస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లోని చివరి 30 నిమిషాల ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ గుండెలను పిండేస్తాయి. డెబ్యూ డైరెక్టర్ గౌరీ నాయుడు జమ్ము విజయనగర నేటివిటీని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు.  


అయితే బయోపిక్ లో ఉండాల్సిన మెయిన్ ‘హై’ ఎలివేషన్లు మిస్ కావడం పెద్ద డిజప్పాయింట్మెంట్. ఆమె సక్సెస్ గ్రాఫ్ కన్నా పతనాన్నే ఎక్కువగా చూపించారు. ఫస్టాఫ్ బాగా స్లోగా సాగడం వల్ల ఆడియెన్ కి కనెక్ట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఒక గొప్ప జానపద కళాకారిణి కథను ప్రపంచానికి పరిచయం చేసిన నిజాయితీ గల ప్రయత్నమే 'గరివిడి లక్ష్మి'. ఆనంది మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ క్లైమాక్స్ ప్లస్ అయినా.. స్లో పేసింగ్ అండ్ కమర్షియల్ హై ఎలివేషన్లు లేకపోవడం మైనస్. బయోపిక్స్, డిఫరెంట్ ఎమోషనల్ సినిమాలను ఇష్టపడేవారు లో-ఎక్స్‌పెక్టేషన్స్‌తో హ్యాపీగా ఒక లుక్ వేయొచ్చు

Oct 18, 2026 Telugu
6.0
out of 10
1990 వ దశకంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి ఇంటా మార్మోగిన పేరు రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి.. అలా ఓ దశాబ్దం పాటు తన జానపద గేయాలతో అలరించిన కళాకారిణి గరివిడి లక్ష్మి. అయితే తాజాగా ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం గరివిడి లక్ష్మి. దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించారు.ఇక హీరోయిన్ ఆనంది.. గరివిడి లక్ష్మి పాత్రలో జీవించిందనే చెప్పాలి. భావోద్వే...

1990 వ దశకంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి ఇంటా మార్మోగిన పేరు రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి.. అలా ఓ దశాబ్దం పాటు తన జానపద గేయాలతో అలరించిన కళాకారిణి గరివిడి లక్ష్మి. అయితే తాజాగా ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం గరివిడి లక్ష్మి. దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించారు.


ఇక హీరోయిన్ ఆనంది.. గరివిడి లక్ష్మి పాత్రలో జీవించిందనే చెప్పాలి. భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది ఆనంది. ఆమెతోపాటు సీనియర్ నటుడు నరేష్, యంగ్ హీరో రాగ్ మయూర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే రాశి, శరణ్య ప్రదీప్ తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు. ఇక ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో లేకపోవడం కొంత వెలితిగా అనిపిస్తుంది. కానీ రియల్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది.


Oct 18, 2026 Telugu
6.0
out of 10
సినిమాలందు బయోపిక్స్ ప్రత్యేకత వేరు. ఒక మనిషి వాస్తవ జీవితాన్ని ప్రభావవంతంగా తెరపైకి తీసుకొస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో మహానటి లాంటి సినిమాలు రుజువు. అలా అని ప్రతి బయోపిక్ ‘మహానటి’ అయిపోదు. ప్రేక్షకులను ఆకట్టుకోదు. ఐతే సావిత్రి స్థాయిలో కాకపోయినా.. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితంలో సినిమాకు అవసరమైన నాటకీయత ఉంది. చాలామంది కళాకారులు జీవితంలో ఎంత ఎత్తు చూస్తారో.. అంత లోతుకు పడిపోతారు. దానిక...

సినిమాలందు బయోపిక్స్ ప్రత్యేకత వేరు. ఒక మనిషి వాస్తవ జీవితాన్ని ప్రభావవంతంగా తెరపైకి తీసుకొస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో మహానటి లాంటి సినిమాలు రుజువు. అలా అని ప్రతి బయోపిక్ ‘మహానటి’ అయిపోదు. ప్రేక్షకులను ఆకట్టుకోదు. ఐతే సావిత్రి స్థాయిలో కాకపోయినా.. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితంలో సినిమాకు అవసరమైన నాటకీయత ఉంది. చాలామంది కళాకారులు జీవితంలో ఎంత ఎత్తు చూస్తారో.. అంత లోతుకు పడిపోతారు. దానికి గల సంఘటనలు ఏంటి? చుట్టూ ఉన్న జనాలు ఎలా మోసం చేస్తారు అని.. గరివిడి లక్ష్మి జీవితంలో జరిగిన అనేక ఉదంతాల ఆధారంగా పాటలతో, ఎమోషన్లతో ఈ సినిమాని బాగానే తెరకెక్కించారు. కథ పరంగా ‘మహానటి’ని తలపించే ‘గరివిడి లక్ష్మి’లో విషయానికేమీ లోటు లేదు. కాకపోతే కొంచెం ఓపిక చేసుకుని చూడాల్సిన సినిమా ఇది.


ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా వరకు ‘మహానటి’లాగే రాసుకున్నారు. గరివిడి లక్ష్మి కథ కూడా ఆల్మోస్ట్ సావిత్రి స్టోరీలాగే అనిపిస్తుంది. లక్ష్మి బాల్యం.. కళాకారిణిగా ఎదగడం.. తన ప్రేమ.. జీవితంలో మోసాలు.. ఇవన్నీ ‘మహానటి’ని గుర్తుకు తెస్తాయి. గరివిడి లక్ష్మి’కి ఎమోషనల్ సీన్లే ఆయువుపట్టు. పాటలు, బుర్రకథలు సింగిల్ స్క్రీన్లలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాతో బాగా రిలేటయ్యే అవకాశముంది. ఈ కథతో అందరూ కనెక్టవుతారని చెప్పలేం కానీ.. నచ్చేవాళ్లకు మాత్రం ఇది బాగా ఎమోషనల్ గా అనిపిస్తుంది.


Oct 18, 2026 Telugu
7.0
out of 10
బుర్రకథకు జన పదాలను జోడించిన లక్ష్మీ జీవితాన్ని ప్రజలకు చెప్పాలని దర్శకుడు గౌరీ నాయకుడు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ చేసిన ప్రయత్నం బాగుంది. ఆ ప్రయత్నానికి వారు చేసిన రీసెర్చ్, కథను రూపొందించిన తీరు, తెరపైన ఎమోషనల్‌గా సన్నివేశాలను నడిపించడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. వీటన్నిటికి తోడు పాత్రను తెర మీద సజీవంగా పండించడంలో ఆనందిని నుంచి పెర్ఫార్మెన్స్‌ను ర...

బుర్రకథకు జన పదాలను జోడించిన లక్ష్మీ జీవితాన్ని ప్రజలకు చెప్పాలని దర్శకుడు గౌరీ నాయకుడు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ చేసిన ప్రయత్నం బాగుంది. ఆ ప్రయత్నానికి వారు చేసిన రీసెర్చ్, కథను రూపొందించిన తీరు, తెరపైన ఎమోషనల్‌గా సన్నివేశాలను నడిపించడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. వీటన్నిటికి తోడు పాత్రను తెర మీద సజీవంగా పండించడంలో ఆనందిని నుంచి పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్న విధానానికి దర్శకుడిని ఎంత అభినందించినా తక్కువే.


ఇక ఈ సినిమా కథ ప్రవాహాన్ని చూస్తే మహానటి సినిమా ఫార్మాట్ అనుక్షణం గుర్తుకు వస్తుంది. మరుగున పడిన అద్బుతమైన కళాకారిణి జీవితాన్ని తెరపైన ఆవిష్కరించాలనే నిర్మాతల అభిరుచి, ఈ సినిమా కోసం వారు చేసిన కృషి తెరపైన ప్రతీ సీన్‌లో కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్న సేపు ఎమోషన్స్, జాయ్ వెంటాడుతూనే ఉంటుంది. ప్రతీ సన్నివేశంలో అభినయంతోపాటు డ్యాన్సులు, హావభావాలు, పాత్రకు తగ్గిన యాటిట్యూడ్‌ తో అదరగొట్టింది. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌ తో మెప్పించింది. ఓవరాల్ గా ఓ మంచి అనుభూతిని అందించిన సినిమాను చూశామనే సంతృప్తి కలుగుతుంది.

Oct 17, 2026 Telugu
5.0
out of 10
చిన్న స్థాయి నుంచి ఉత్తరాంధ్రను ఊపేసే స్థాయికి వెళ్లడం.. నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోవడం.. అందరూ తన పేరుని వాడుకుని చివరకు తననే అనాథలా మూలకు వదిలేయడం.. ఇలా గరివిడి లక్ష్మీలో కావాల్సినంత డ్రామా ఉంది. మామూలుగానే బయోపిక్ అంటే ఇప్పుడు అంతా కూడా ‘మహానటి’ మూవీతో పోల్చుతారు. ఈ సినిమాలోనూ అదే టెంప్లెట్ వాడుతారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లక్ష్మి ప్రయాణమే కనిపిస్తుంది. లక్ష్మి జీవితంలోకి బుర్ర కథ ఎంట్రీ ఇవ్వడం,...

చిన్న స్థాయి నుంచి ఉత్తరాంధ్రను ఊపేసే స్థాయికి వెళ్లడం.. నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోవడం.. అందరూ తన పేరుని వాడుకుని చివరకు తననే అనాథలా మూలకు వదిలేయడం.. ఇలా గరివిడి లక్ష్మీలో కావాల్సినంత డ్రామా ఉంది. మామూలుగానే బయోపిక్ అంటే ఇప్పుడు అంతా కూడా ‘మహానటి’ మూవీతో పోల్చుతారు. ఈ సినిమాలోనూ అదే టెంప్లెట్ వాడుతారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లక్ష్మి ప్రయాణమే కనిపిస్తుంది. లక్ష్మి జీవితంలోకి బుర్ర కథ ఎంట్రీ ఇవ్వడం, నేర్చుకోవడం, స్టేజ్ మీద మొదటి పర్ఫామెన్స్ ఇవ్వడం, అవమానాలు ఇలా అన్నీ ముందుకు సాగుతుంటాయి.


ఇక సెకండాఫ్‌లో గరివిడిలక్ష్మి వైభవాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఆమె పేరుని, గాత్రాన్ని చివరకు సినీ ప్రముఖులు కూడా ఎంతలా వాడుకున్నారు.. తన పేరు చెప్పుకుని ఎవరెవరికో స్టేజ్ మీదే ప్రభుత్వ పురస్కారాలు అందుకోవడం ఇవన్నీ మనసుని కదిలిస్తుంటాయి. నమ్మిన వారే మోసం చేయడం, చివరకు అన్నీ కోల్పోయి అనాథగా మిగలడం ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించేలా ఉంటాయి. పాటలు మాత్రం థియేటర్లో ఊపును తీసుకు వస్తాయి. మాటలు అంత గొప్పగా అనిపించవు. చివరగా ‘గరివిడి లక్ష్మి’ చిత్రం ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గరివిడిలక్ష్మికి నివాళిలా అనిపించే రేంజ్‌లో సినిమా లేకపోయినా.. ఆమెకి ఇన్నేళ్లు రాని గుర్తింపుని తీసుకు వచ్చే చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.

Oct 17, 2026 Telugu
6.0
out of 10
ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు వచ్చిన చిత్రాల్లో ఒక ఫోక్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ‘గరివిడి లక్ష్మి’ కూడా ఒకటి. టాలెంటెడ్ నటీనటులు ఆనంది, రాగ్ మయూర్, షకలక శంకర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.ఇందులో గరివిడి లక్ష్మి జీవితంలో చూసిన పతనం మంచి ప్రభావవంతంగా ఇందులో కనిపిస్తాయి. బుఱ్ఱకథ అనే కళని ఆమె తనదైన శైలిలో మార్చి తనకి తెలియకుండానే ఎలా కమిలిపోయారు అనే ఎమోషనల...

ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు వచ్చిన చిత్రాల్లో ఒక ఫోక్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ‘గరివిడి లక్ష్మి’ కూడా ఒకటి. టాలెంటెడ్ నటీనటులు ఆనంది, రాగ్ మయూర్, షకలక శంకర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.


ఇందులో గరివిడి లక్ష్మి జీవితంలో చూసిన పతనం మంచి ప్రభావవంతంగా ఇందులో కనిపిస్తాయి. బుఱ్ఱకథ అనే కళని ఆమె తనదైన శైలిలో మార్చి తనకి తెలియకుండానే ఎలా కమిలిపోయారు అనే ఎమోషనల్ పార్ట్ ఇందులో వర్క్ అవుతుంది. ముఖ్యంగా కొన్ని ఫోక్ సాంగ్స్ థియేటర్స్ లో మాస్ ఆడియెన్స్ ని ఊగేలా చేస్తాయి. ఇక సెకండాఫ్ లో చివరి 30 నిమిషాలు చూసే ఆడియెన్ ని అలా హుక్ చేసి ఉంచుతాయి. ఈ పార్ట్ అంతా సినిమాకి, గరివిడి లక్ష్మికి న్యాయం చేసినట్టు అనిపించింది.


అయితే ఏ బయోపిక్ చూసినా సరే సాలిడ్ ఎలివేషన్స్ ఆ పాత్రకి ఉంటాయి కానీ అలాంటి సన్నివేశాలు ఇందులో డిజైన్ చేసుకోలేకపోవడం డిజప్పాయింట్ చేస్తుంది. అలాగే సినిమాలో ఫస్టాఫ్ కూడా ఏమంత ఇంపాక్ట్ కలిగించేలా లేదు. నెమ్మదిగా కథనం పికప్ అవుతూ వెళుతుంది. దీనితో చూసే ఆడియెన్ కి ఒక బయోపిక్ ఇవ్వాల్సిన హై ని ఈ చిత్రం అందించలేదు. ఇక సెకండాఫ్ లో కూడా కొంతమేర ఇదే పరిస్థితి కొనసాగుతుంది.


ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘గరివిడి లక్ష్మి’ ప్రతీ ఒకరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక చారిత్రక వ్యక్తుల కథల్లో ఒకటిగా కనిపిస్తుంది. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలు ఊగించిన గరివిడి లక్ష్మి కోసం ఒకప్పుడు ఉన్న సాధనాలు రీత్యా చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆమె ‘ఎవరు’ అని ప్రపంచానికి చూపించిన సినిమా ఇది. అయితే ఈ క్రమంలో సెకండాఫ్ లో ఎమోషనల్ పార్ట్ బాగా వర్క్ అవుతుంది. పాటలు, సంగీతం, ఆనంది సాలిడ్ పెర్ఫామెన్స్, ఇతర నటీనటుల దన్ను కూడా బాగుంది కానీ ఈ తరహా బయోపిక్ లకి కావాల్సిన హై మూమెంట్స్ ఇందులో మిస్ అయ్యాయి. పైగా ఒక స్లో ఫస్టాఫ్ కూడా డల్ గా అనిపిస్తుంది. వీటిని పక్కన పెడితే ఈ తరహా బయోపిక్ లు ఇష్టపడేవారిని ఈ చిత్రం మెప్పిస్తుంది. మిగతా ఆడియెన్స్ తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చెయ్యండి.

Oct 17, 2026 Telugu

Garividi lakshmi movie review

6.0
out of 10
#GarividiLakshmi is a well-made film with good casting, an authentic script (though I’m not sure about its historical accuracy), an entertaining first half, and an emotional second half.Like most biopics, it chronicles the rise and fall of the legendary Uttarandhra folk singer.Anandi is brilliant, the direction feels genuine, and the music is superb.Producer Krithi & TG Vishwa Prasad deserve a...

#GarividiLakshmi is a well-made film with good casting, an authentic script (though I’m not sure about its historical accuracy), an entertaining first half, and an emotional second half.


Like most biopics, it chronicles the rise and fall of the legendary Uttarandhra folk singer.


Anandi is brilliant, the direction feels genuine, and the music is superb.


Producer Krithi & TG Vishwa Prasad deserve appreciation for producing this film.


Worth giving it a try! 👍

Oct 17, 2026 Telugu

Ranabaali movie review

5.0
out of 10
రణబాలి సినిమా గురించి చెప్పాలంటే.. డైరెక్టర్ రాహుల్ అనుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని సూపర్బ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. రణబాలి అనే క్యారెక్టర్ ని కూడా ఫెంటాస్టిక్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ క్యారెక్టర్ మ్యానరిజమ్స్ ని కానీ చాలా బాగా లేఅవుట్ చేసుకున్నాడు. కాకపోతే సెకండ్ హాఫ్ ఇస్ ఏ లెట్ డౌన్ అని నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కి హైలైట్ ఇస్ ద ఇంటర్వెల్. అక్కడ మన అజయ్ అతుల్ కొట్టిన ఆ మ్యూజిక్ కాన...

రణబాలి సినిమా గురించి చెప్పాలంటే.. డైరెక్టర్ రాహుల్ అనుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని సూపర్బ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. రణబాలి అనే క్యారెక్టర్ ని కూడా ఫెంటాస్టిక్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ క్యారెక్టర్ మ్యానరిజమ్స్ ని కానీ చాలా బాగా లేఅవుట్ చేసుకున్నాడు. కాకపోతే సెకండ్ హాఫ్ ఇస్ ఏ లెట్ డౌన్ అని నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కి హైలైట్ ఇస్ ద ఇంటర్వెల్. అక్కడ మన అజయ్ అతుల్ కొట్టిన ఆ మ్యూజిక్ కానీ అండ్ ఆల్సో అక్కడ ఉన్న ఆ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అని అనిపించలేదు. అసలు లేవు అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఒక రెండు మూడు ఎపిసోడ్లు పెట్టుకున్నారు కానీ ఫీలయ్యాను. అండ్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేసిన అంత పవర్ఫుల్ విలన్ మనకు తగలలేదు. 


మరి నేను చెప్పాను కదా ఇందాక అలాగే కాకుండా వేరేలాగా తీసుంటే చాలా బాగుండేది అనే ఫీలింగ్ తో నేను థియేటర్ లో నుంచి ఇదేంట్రా బాబు సినిమా అంతా ఒకలాగా చూపించి లాస్ట్ లో ఇలా ఎండ్ చేశారు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ తో నేను బయటికి వచ్చాను. లాస్ట్ క్లైమాక్స్ గురించి నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అజయ్ అతుల్ మ్యూజిక్ అయితే ఇరక్కొట్టారు. రాహుల్ ఏ పాయింట్ తో అయితే ఈ సినిమాని ఎస్టాబ్లిష్ చేస్తాడో ఒక ఫెయిరీ టేల్ లాగా లాస్ట్ కి వచ్చేటప్పటికి ఈ సినిమాని మరి ఫెయిరీ టేల్ లాగా ఎండ్ చేస్తున్నామా లేకపోతే మనం ఎలా చేద్దాము అన్న కైండ్ ఆఫ్ ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఈ మూవీని ఇలా ఎండ్ చేయాల్సి వచ్చిందేమో అనేది నా ఫీలింగ్. సో ఓవరాల్ గా మీరు గనుక ఈ సినిమా చూడాలి అనుకుంటే మీ ఎక్స్పెటేషన్స్ ని డెఫినెట్ గా కొంచెం తక్కువగా పెట్టుకోండి. నాకైతే నేను ఫస్ట్ హాఫ్ ఇస్ గ్రేట్, సెకండ్ హాఫ్ నాకైతే లెట్ డౌన్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంక రణబాలి గురించి ఇంకా మనం ఇంతకన్నా మాట్లాడుకునేది ఏమీ లేదన్నమాట. 

Oct 16, 2026 Hindi +4

Ranabaali movie review

3.0
out of 10
రణబాలి ఎగ్జామ్ అయిపోయింది. ఇది ఎలా ఉందిరా, ఎలా జరిగింది ఎగ్జామ్ అంటే చెప్పాలా స్పెషల్ గా చెప్పాలా అన్నట్టు గుర్రం అయితే చచ్చింది. నా లాజిక్ ఏందంటే ఏరా నువ్వు ముందు ఎందుకు ఇలా చెప్తున్నావ్ అంటే నాకైతే అసలు మూడు ఉత్సాహం లేదు ఎప్పుడూ లేదు. ఏంట్రా అంటే ఎమోషన్ ఫీల్ కమాన్ ఇప్పుడు ఎలా చెప్పాలి దేశభక్తి సినిమాలో గాని వేరే సినిమాలో గాని అది చూస్తే మనకు ఒక ఫీల్ రావాలి. ఆ ఫీల్ అనేది ఎమోషన్ ద్వారా నో సీన్ల ద్...

రణబాలి ఎగ్జామ్ అయిపోయింది. ఇది ఎలా ఉందిరా, ఎలా జరిగింది ఎగ్జామ్ అంటే చెప్పాలా స్పెషల్ గా చెప్పాలా అన్నట్టు గుర్రం అయితే చచ్చింది. నా లాజిక్ ఏందంటే ఏరా నువ్వు ముందు ఎందుకు ఇలా చెప్తున్నావ్ అంటే నాకైతే అసలు మూడు ఉత్సాహం లేదు ఎప్పుడూ లేదు. ఏంట్రా అంటే ఎమోషన్ ఫీల్ కమాన్ ఇప్పుడు ఎలా చెప్పాలి దేశభక్తి సినిమాలో గాని వేరే సినిమాలో గాని అది చూస్తే మనకు ఒక ఫీల్ రావాలి. ఆ ఫీల్ అనేది ఎమోషన్ ద్వారా నో సీన్ల ద్వారా నో నాచురల్ గానో అది ఏదో యాక్టింగ్ కుదురో ఏదో ఒకటి బాగా రావాలి అవుట్పుట్. ఇక్కడ ఎలా ఉంటది అంటే అడ్డంగా నరుకుతా నిలువుగా నరుకుతా అన్నట్టుంది. సినిమాలో ఎమోషన్ పండితే యాక్షన్ పండిద్ది అంతేగాని యాక్షన్ లో 10 మందిని ఒకేసారి నరికితే పండిద్దా? 


రొట్టె కొట్టుడు సినిమాని తీస్తారు మళ్ళీ జనాలు మూడు లేదు అంటే ఆ దిగి దిగి అంటారు. ఫస్ట్ మన మెయిన్ టాపిక్ కొండన్న. కొండన్న గారి యాక్టింగ్ ఆ మ్యాండరిజమ్స్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించినాయి ఆయనే అన్ కంఫర్టబుల్ గా ఉన్నారు అన్నట్టు అనిపించింది. అంటే అది యాక్టింగ్ చాలా అన్ ఆర్టిఫిషియల్ గా ఉంది. సో నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు వెళ్ళండి. నాది ఇది మాత్రం ఇంకోటి లేదండి. తెలిసిందేగా అస్సలు నచ్చలేదు. 

Oct 16, 2026 Hindi +4

Ranabaali movie Review

4.0
out of 10
ఇప్పుడే రణబాలి సినిమా చూసొస్తున్నా.. ప్రతిదాన్ని తీసుకొచ్చి ఒక సీరియల్ వచ్చేసి కాపాడుతది తప్ప మనోళ్ళకి చివరి వరకు రాలేదు అన్నట్టుగా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల నాకు సినిమా నచ్చలేదు. బట్ సినిమాలో చాలా పొటెన్షియల్ ఉంది మంచి సీన్స్ పడ్డాయి. సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్స్ అయితే మాత్రం పర్ఫామెన్సెస్ అని చెప్తా ఫస్ట్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన చాలా చాలా బాగా వర్కౌట్ చేశారు. నాకు...

ఇప్పుడే రణబాలి సినిమా చూసొస్తున్నా.. ప్రతిదాన్ని తీసుకొచ్చి ఒక సీరియల్ వచ్చేసి కాపాడుతది తప్ప మనోళ్ళకి చివరి వరకు రాలేదు అన్నట్టుగా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల నాకు సినిమా నచ్చలేదు. బట్ సినిమాలో చాలా పొటెన్షియల్ ఉంది మంచి సీన్స్ పడ్డాయి. సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్స్ అయితే మాత్రం పర్ఫామెన్సెస్ అని చెప్తా ఫస్ట్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన చాలా చాలా బాగా వర్కౌట్ చేశారు. నాకు ముఖ్యంగా ఈ విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం ఆయన పర్ఫామెన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన స్క్రిప్ట్స్ ఎలక్షన్ అంటే నాకు అసలు నచ్చదు. జయమ్మ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి.


కానీ వీళ్ళు తీసుకున్న బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో 1876 టు 78 ఈ టైంలో ఒకటి ఇస్ ది గ్రేట్ ఫామిన్ వచ్చింది మనకి ఆ కరువుని డిపిక్ట్ అది మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ కొన్ని కొన్ని ఏరియాస్ లో చాలా బాగుందనిపించింది బట్ స్టిల్ కొన్ని కొన్ని ఏరియాస్ లో ఇంకా చాలా వాడాలి టచ్ ఉంటది ప్రతి తెలుగు సినిమాలో ప్రతి ఇండియన్ సినిమాలో బ్రిటిష్ ఏ రకంగా బిహేవ్ చేస్తారో ఈ సినిమాలో కూడా అదే రకంగా ఎందుకు బిహేవ్ చేస్తారు. అండ్ నాకు ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాన్సెప్ట్ ఏది లేదు 5 లక్షల టన్నులు బియ్యం దాన్ని తీసుకుపోవాలి ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటాడు తప్ప ఎందుకు ఎందుకు వీళ్ళని అణగదొక్కుతున్నారు ఏముంది న్యూన్స్ ఏమీ లేదు కొంచెం చూపెట్టు.. అనంటే ఎం చూపించలేదు. ఫస్ట్ హాఫ్ సెట్ అప్ అవ్వలేదు. సూపర్ ఓకే అని చెప్పలేను. ఇట్స్ ఆన్ యావరేజ్ ఫస్ట్ హాఫ్. సేమ్ అదే కమర్షియల్ డ్రాప్ వెళ్ళిపోయినా బానే ఉంది అని ఫీలింగ్ వస్తుంది కొన్ని ఏరియాలో. బట్ స్టిల్ సో ఇది సిచువేషన్. నాకైతే నచ్చలేదు. 

Oct 16, 2026 Hindi +4

Ranabaali movie review

7.0
out of 10
రణబాలి సినిమా గురించి చెప్పాలి అంటే ఇట్స్ లైక్ 50-50. అంటే బానే ఉంది అనిపిస్తది కానీ, చాలా చోట్ల ఆ రైటింగ్ పరంగా కావచ్చు లేదంటే ఎగ్జిక్యూషన్ పరంగా కావచ్చు కొంచెం బాగాలేదు అనిపిస్తూ ఉంటది. సో బట్ ఓవరాల్ గా పర్లేదు బానే ఉంది అని చెప్పొచ్చు. సినిమాలో బిజిఎంలు దెబ్బేశారు. సాంగ్స్ బానే ఉంటాయి. కొన్ని సీన్స్ చాలా బాగా అనిపిస్తది. లిటరల్లీ చెప్తున్నా రక్తం మరుగుతది నిజంగా. అండ్ ఎందుకంటే నేను నేను బేసిక్...

రణబాలి సినిమా గురించి చెప్పాలి అంటే ఇట్స్ లైక్ 50-50. అంటే బానే ఉంది అనిపిస్తది కానీ, చాలా చోట్ల ఆ రైటింగ్ పరంగా కావచ్చు లేదంటే ఎగ్జిక్యూషన్ పరంగా కావచ్చు కొంచెం బాగాలేదు అనిపిస్తూ ఉంటది. సో బట్ ఓవరాల్ గా పర్లేదు బానే ఉంది అని చెప్పొచ్చు. సినిమాలో బిజిఎంలు దెబ్బేశారు. సాంగ్స్ బానే ఉంటాయి. కొన్ని సీన్స్ చాలా బాగా అనిపిస్తది. లిటరల్లీ చెప్తున్నా రక్తం మరుగుతది నిజంగా. అండ్ ఎందుకంటే నేను నేను బేసిక్ గా ఫస్ట్ హాఫ్ లో ఒక గంటన్నర అనుకుందాం పోనీ రెండుగంటల కిందట తిన్నా. ఆ ఆకలే బేసిక్ గా నాకు చాలా చాలా అంటే లైక్ ఆ కడుపులో లాగేస్తుంది, కానీ అప్పటివాళ్ళు ఏడు రోజులు వారం నెల రోజులు ఎన్నో ఎన్నో రోజులు తిండి లేకుండా ఉన్నారే అసలు ఎలా రా నాయనా అని చెప్పి అండ్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ ట్రూ. నిజంగా జరిగింది.


ఓకే కాకపోతే లాస్ట్ లో అక్కడ చాలా కన్వీనియెంట్ రైటింగ్ లాస్ట్ లో ఉంటాయి. బట్ కొన్ని సీన్స్ ని మటుకు చాలా బాగా చూపించారు ఓవరాల్ గా పర్లేదు బానే ఉంది అన్న ఒక ఫీల్ వస్తది. అండ్ ఆక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ లో చేశాడు. అట్లా అంటే ఈ క్యారెక్టర్ ని యాక్సెస్ చేసి ఆ లెవెల్ లో చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ హి డిడ్ వెరీ వెల్. సో అది గైస్ సిచువేషన్ సో ఓవరాల్ గా మూవీ అయితే మటుకు బానే ఉంది పర్లేదు. ఇక ఈ మూవీకి జెనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నా రేటింగ్ 3.25\5. 

Oct 16, 2026 Hindi +4

Ranabaali movie review

6.0
out of 10
రణబాలి టు అవర్స్ 50 మినిట్స్ రన్ టైం తో థియేటర్ లో రిలీజ్ అయింది. 1870స్ బ్రిటిష్ పీరియడ్ వాళ్ళకి ఎదురు తిరగడం, ఫైట్స్ చేయడం ఇదే ప్లాట్ తీసుకోండి అది కూడా నేను చెప్తున్నాను.. సినిమాలో ఎక్స్ట్రార్డినరీ హై మూమెంట్స్ చాలా తక్కువ కనిపించాయి. నాకు 2019 లో వచ్చిన సైరా నరసింహారెడ్డి మూవీ చాలా ఇష్టం. ఆ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్, హీరో...

రణబాలి టు అవర్స్ 50 మినిట్స్ రన్ టైం తో థియేటర్ లో రిలీజ్ అయింది. 1870స్ బ్రిటిష్ పీరియడ్ వాళ్ళకి ఎదురు తిరగడం, ఫైట్స్ చేయడం ఇదే ప్లాట్ తీసుకోండి అది కూడా నేను చెప్తున్నాను.. సినిమాలో ఎక్స్ట్రార్డినరీ హై మూమెంట్స్ చాలా తక్కువ కనిపించాయి. నాకు 2019 లో వచ్చిన సైరా నరసింహారెడ్డి మూవీ చాలా ఇష్టం. ఆ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్, హీరో జర్నీ, సాక్రిఫైస్ చేసే ఎమోషన్స్ అన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. కానీ ఈ రణబాలిలో ఆ రేంజ్ లో ఎమోషన్ క్యారీ అవ్వలేదని నాకు అనిపించిందండి. అలా అని రణబాలి బ్యాడ్ అటెంప్ట్ అని చెప్పను. ఇంప్రెసివ్ పార్ట్స్ అని చెప్పొచ్చు. 


విజయ్ దేవరకొండ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంది. లాస్ట్ 25 మినిట్స్ కొంచెం స్ట్రెచ్ అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కంటెంట్ వైస్ ఫ్యామిలీతో చూడొచ్చు. అయితే సినిమాలో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాయింట్స్ లో ఇదొకటి. 1876 78 పీరియడ్ లో గ్రేట్ మద్రాస్ ఫెమిన్ వల్ల దక్షిణ భారతదేశంలో లక్షల మంది ప్రజలు ఆకలి, పోషకాహారం లేక ఇబ్బంది పడుతున్నారు. చనిపోయారు చాలా మంది. ఆ టైం ని రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేసారు. కొన్ని ప్లేసెస్ లో స్టోరీ సింపుల్ యాక్షన్ రివర్స్ ఫ్యాక్టర్ లో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఎమోషనల్ కనెక్షన్ కూడా తక్కువ. ఫస్ట్ హాఫ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ని సెకండ్ హాఫ్ మొత్తం మెయింటైన్ చేయలేకపోయింది. స్టోరీలో ఇంకా స్ట్రాంగ్ డ్రామా, ఎమోషనల్ క్యారెక్టర్, మెమరబుల్ హై మూమెంట్స్ ఉండుంటే ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండేది. ఇక ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే ఇది నా ఒపీనియన్ 2.75\5.

Oct 16, 2026 Hindi +4
Why MRO?