Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1888
Total Reviews
134
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 157-168 of 1888 reviews
6.0
out of 10
garividi lakshmi సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా, ఎపిసోడ్స్ లా సాగుతూ కొంచెం బోర్ కొట్టించింది. కానీ ఆ చివరి 30-40 నిమిషాలు మాత్రం సినిమా total మార్చేసింది! బుర్రకథ దిగ్గజం గరివిడి లక్ష్మి గారి పేరుని, పాటలను ఎలా పక్కకు నెట్టేశారో తెలిశాక గుండె బరువెక్కిపోయింది. ఆనంది అద్భుతమైన నటనతో కంటతడి పెట్టించారు, పైగా ఉత్తరాంధ్ర స్లాంగ్ సినిమాకు అదనపు బలం తెచ్చింది. ఓవరాల్‌గా ఫుల్ మూవీ పరంగా కొన్ని మైనస...

garividi lakshmi సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా, ఎపిసోడ్స్ లా సాగుతూ కొంచెం బోర్ కొట్టించింది. కానీ ఆ చివరి 30-40 నిమిషాలు మాత్రం సినిమా total మార్చేసింది! బుర్రకథ దిగ్గజం గరివిడి లక్ష్మి గారి పేరుని, పాటలను ఎలా పక్కకు నెట్టేశారో తెలిశాక గుండె బరువెక్కిపోయింది. ఆనంది అద్భుతమైన నటనతో కంటతడి పెట్టించారు, పైగా ఉత్తరాంధ్ర స్లాంగ్ సినిమాకు అదనపు బలం తెచ్చింది.


ఓవరాల్‌గా ఫుల్ మూవీ పరంగా కొన్ని మైనస్‌లు ఉన్నా, ఆ ఎమోషనల్ క్లైమాక్స్ మాత్రం కచ్చితంగా చూడాల్సిందే! really i liked it.


Oct 21, 2026 Telugu

Garividi lakshmi movie review

Thyview

By Thyview

6.0
out of 10
హియర్ ఈజ్ అవర్ నాన్-స్పోయిలర్ రివ్యూ అఫ్ ది ఫిల్మ్ 'గరికపాటి లక్ష్మి', స్టార్రింగ్ ఆనంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు అని చెప్పలేకపోతున్నానండి. అదేక్కడా ఎలా చెప్పావు అంటే.. లాస్ట్ 30-40 మినిట్స్ గరివిడి లక్ష్మి గారి జీవితంలో ఏం జరిగిందో సినిమా వాళ్లతో సహా చాలమంది ఆవిడ పేరుని, పాటల్ని ఎలా ఆవిడకి గుర్తింపు ఇప్పించకుండా పడేసుకున్నారో తెలిశాక గుండె బరువెక్కిపోయింది....

హియర్ ఈజ్ అవర్ నాన్-స్పోయిలర్ రివ్యూ అఫ్ ది ఫిల్మ్ 'గరికపాటి లక్ష్మి', స్టార్రింగ్ ఆనంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు అని చెప్పలేకపోతున్నానండి. అదేక్కడా ఎలా చెప్పావు అంటే.. లాస్ట్ 30-40 మినిట్స్ గరివిడి లక్ష్మి గారి జీవితంలో ఏం జరిగిందో సినిమా వాళ్లతో సహా చాలమంది ఆవిడ పేరుని, పాటల్ని ఎలా ఆవిడకి గుర్తింపు ఇప్పించకుండా పడేసుకున్నారో తెలిశాక గుండె బరువెక్కిపోయింది. ముఖ్యంగా ఒకప్పుడు ఆవిడ పాటలు మారుమోగిన ఉత్తరాంధ్ర వాళ్లందరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన కథ.


ఫస్ట్ హాఫ్ మూవీ అంతా ఇంట్రెస్టింగ్ గా అనిపించక లేదా ఇంట్రెస్టింగ్ నరేటివ్ లేదు. ఏ బయోపిక్ సినిమాకి అయినా మనం ఆ క్యారెక్టర్ కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ మీద ఒక ఎమోషన్ వస్తుందో అక్కడ ఉన్నది ఆ కథ మీద ఇష్టం పెరుగుతుంది. అలా ఈ సినిమాలో ఆ ఫీలింగ్ నాకు లాస్ట్ 30 టూ 40 మినిట్స్ లో వచ్చింది. ఇక ఫైనల్లీ క్లైమాక్స్ లో ఆవిడ (గరివిడిలక్ష్మి) ఫేస్ రివీల్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. యాజ్ ఎ కంప్లీట్ స్టోరీ ఎస్ ఈ సినిమా నాకు వర్క్ అవ్వలేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పివుండాల్సింది. కాని వాళ్ళు ఆ ఎమోషన్ అండ్ థాట్ అయితే ఆడియన్స్ కి చూపిద్దాం అనుకున్నారో లాస్ట్ హాఫ్ ఆన్ అవర్ వాళ్ళ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్.. ఆనంది చించేసారు పెర్ఫార్మెన్స్. మయూర్ ఆల్సో డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ నరేష్ గారికి మంచి రోల్ దొరికింది.  


ఫస్ట్ హాఫ్ స్టోరీని గ్రిప్పింగ్ గా చెప్పుకుంటే వేరేలా ఉండేది ఈ సినిమా. మోస్ట్లీ స్టోరీ ఏదో మోమెంట్స్ చూపిస్తున్నట్టు వెళ్లిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. బట్ ఆ లాస్ట్ 30 మినిట్స్ బాగా హ్యాండిల్ చేశారు. ఆడియన్స్ ని మూవ్ చేసింది. ఓవరాల్ గా డీసెంట్ మూవీ.

Oct 21, 2026 Telugu
6.0
out of 10
ఈ వారం ఈటీవీ విన్ వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘నల్లజర్ల రోడ్డు’. ప్రముఖ రచయిత బాల గంగాధర్ తిలక్ రచన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. బాలగంగాధర్ తిలక్ గారు రచించిన ‘నల్లజర్ల రోడ్డు’ అనే పుస్తకం నుంచి దర్శకుడు వర ముళ్ళపూడి అందులోని ఎమోషన్ ని సరిగ్గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పుస్తకం కోసం కానీ అందులోని కథ...

ఈ వారం ఈటీవీ విన్ వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘నల్లజర్ల రోడ్డు’. ప్రముఖ రచయిత బాల గంగాధర్ తిలక్ రచన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. బాలగంగాధర్ తిలక్ గారు రచించిన ‘నల్లజర్ల రోడ్డు’ అనే పుస్తకం నుంచి దర్శకుడు వర ముళ్ళపూడి అందులోని ఎమోషన్ ని సరిగ్గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పుస్తకం కోసం కానీ అందులోని కథ కోసం కానీ మినిమమ్ ఐడియా లేకుండా చూసేవారికి ఈ లఘు చిత్రం మంచి థ్రిల్స్ తో పాటుగా మంచి సందేశాన్ని కూడా అందిస్తుంది.


ఆల్రెడీ సక్సెస్ అయ్యిన పుస్తకం నుంచి ఈ లఘు చిత్రం అడాప్ట్ చేసుకున్నప్పటికీ మొదట్లో పరిస్థితులు కొంచెం నెమ్మదిగా సాగాయి. సో కథనం కొంచెం ఓపికగా ఆగి చూస్తే మిమ్మల్ని లీనం చేస్తుంది. చిన్న లాజికల్ ఎర్రర్స్ కనిపిస్తాయి అంతే. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘నల్లజర్ల రోడ్డు’ అనే లఘు చిత్రం ఆకట్టుకునే అడాప్షన్ గా నిలుస్తుంది. బాలగంగాధర్ తిలక్ గారి అద్భుత రచన నుంచి లఘు చిత్రంగా దర్శకుడు వర ముళ్ళపూడి మంచి అవుట్ పుట్ అందించారు. అందులోని థ్రిల్ మూడ్ ని మైంటైన్ చేస్తూ, అందులోని సందేశాన్ని కూడా బాగా చేరవేశారు. కాకపోతే ప్రారంభ సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా ఉన్నాయి. ఇవి పక్కన పెడితే ఈ లఘు చిత్రం తప్పకుండా చూడాల్సినదే.




Oct 21, 2026 Telugu
4.0
out of 10
Crazy Kalyanam Movie reviewHighlightsAnupama Parameswaran and VK Naresh’s performancesA couple of episodesDrawbacksLack of noveltyThe track between Anupama and Akhil RajThe wedding episode towards the end turns farcicalFilms set in rural Telangana have become increasingly common in Telugu cinema, with one or two such films arriving in theatres almost every month. Crazy Kalyanam is the latest addit...

Crazy Kalyanam Movie review


Highlights

Anupama Parameswaran and VK Naresh’s performances

A couple of episodes


Drawbacks

Lack of novelty

The track between Anupama and Akhil Raj

The wedding episode towards the end turns farcical


Films set in rural Telangana have become increasingly common in Telugu cinema, with one or two such films arriving in theatres almost every month. Crazy Kalyanam is the latest addition to this trend. It also marks Anupama Parameswaran’s first attempt at playing a rural Telangana girl and speaking the dialect. Beyond that, however, the film offers little that feels new.


On the whole, Crazy Kalyanam benefits from strong performances by Anupama Parameswaran and VK Naresh, and its underlying message has merit. But the familiar storyline, unconvincing romantic track, uneven comedy and stretched wedding episode prevent it from being a fun ride. The director struggles to sustain audience interest throughout the runtime, and the climax turns increasingly cacophonous.


Bottom Line: Not So ‘Crazy’

Oct 21, 2026 Telugu
6.0
out of 10
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘క్రేజీ కళ్యాణం’ కూడా ఒకటి. థియేటర్లలో ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఈ చిత్రంలో మెయిన్ అట్రాక్షన్ అనుపమ అనుకోవచ్చు కానీ ఇందులో ఆశ్చర్యపరిచేది మాత్రం నటుడు నరేష్ అని చెప్పాలి. తాను తన లోని నటుడ్ని చూపించి ఆద్యంతం ఆశ్చర్యపరుస్తారు. తన నుంచి కామెడీ టైమింగ్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ లో కూడా ఎంతో క...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘క్రేజీ కళ్యాణం’ కూడా ఒకటి. థియేటర్లలో ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఈ చిత్రంలో మెయిన్ అట్రాక్షన్ అనుపమ అనుకోవచ్చు కానీ ఇందులో ఆశ్చర్యపరిచేది మాత్రం నటుడు నరేష్ అని చెప్పాలి. తాను తన లోని నటుడ్ని చూపించి ఆద్యంతం ఆశ్చర్యపరుస్తారు. తన నుంచి కామెడీ టైమింగ్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ లో కూడా ఎంతో కదిలిస్తారు. అలాగే అనుపమ సహజంగా నటించి మెప్పించింది.


అయితే మంచి ఎంటర్టైనర్ గా సాగాల్సిన ఈ సినిమాని అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమాని బాగా సాగదీశారు. అనవసరమైన ఇరికించినట్టుగా ఇక్కడ అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే.. ‘క్రేజీ కళ్యాణం’ కొంతమేరకు మంచి ఫన్ అందించే ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. ఫస్టాఫ్ లో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే నటుడు పెర్ఫామెన్స్ కూడా సినిమాలో మరో హైలైట్ గా నిలిచింది. కానీ పట్టు లేని సెకండాఫ్, లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు సినిమాలో పొటెన్షియల్ ని దెబ్బ తీశాయి. వీటితో ఈ చిత్రం కొంత మేరే ఓకే అనిపిస్తుంది.


Oct 19, 2026 Telugu
6.0
out of 10
తెలంగాణ నేపథ్యంతో దర్శకుడు బద్రప్ప గాజుల రాసుకొన్న ఫ్యామిలీ డ్రామాలో ట్విస్టులు, టర్నింగ్‌లు, సంచలనాలు లేకుండా ఫన్, ఎమోషన్స్, ఫ్యామిలీ అఫైర్స్‌తో సింపుల్‌గా రన్ చేసే ప్రయత్నం బాగుంటుంది. ఫస్టాఫ్‌లో ఇంకా బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామాను నడిపి ఉంటే బెటర్‌గా ఉండేది. అయితే ఫస్టాఫ్‌ను కామెడీకి పెద్ద పీట వేసి సాధాసీదాగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్‌పై ఫోకస్ చేయడంతో ఆడియన్స్‌ సినిమ...

తెలంగాణ నేపథ్యంతో దర్శకుడు బద్రప్ప గాజుల రాసుకొన్న ఫ్యామిలీ డ్రామాలో ట్విస్టులు, టర్నింగ్‌లు, సంచలనాలు లేకుండా ఫన్, ఎమోషన్స్, ఫ్యామిలీ అఫైర్స్‌తో సింపుల్‌గా రన్ చేసే ప్రయత్నం బాగుంటుంది. ఫస్టాఫ్‌లో ఇంకా బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామాను నడిపి ఉంటే బెటర్‌గా ఉండేది. అయితే ఫస్టాఫ్‌ను కామెడీకి పెద్ద పీట వేసి సాధాసీదాగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్‌పై ఫోకస్ చేయడంతో ఆడియన్స్‌ సినిమాలో లీనమయ్యేలా చేసింది. చివరి 20 నిమిషాలు వీకే నరేష్‌పై నడిపించిన డ్రామా బాగా వర్కవుట్ అయింది. చివర్లో అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన ట్విస్ట్ ఫీల్‌గుడ్‌గా ఉండటంతో సినిమా సంతృప్తికరంగా ముగుస్తుంది.


ఇక ఈ సినిమాకు పూర్తిగా ఫేస్‌గా అనుపమ పరమేశ్వరన్ అని చెప్పుకోవాలి. మూవీ భారాన్నంత తన భుజాలపై మోసింది. ఫన్, లవ్, ఎమోషన్స్ ఉన్న కీర్తీ పాత్రలో ఒదిగిపోయింది. అనుపమ తర్వాత సినిమాలో బలంగా మారిన క్యారెక్టర్ పర్వతాలు. ఈ పాత్రలో వీకే నరేష్ అదరగొట్టాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు ఒంటి చేత్తో నడిపించాడు. అఖిల్ రాజ్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయింది. తరుణ్ భాస్కర్ సినిమాకు ఎంటర్‌టైనర్‌గా పూర్తి న్యాయం చేశాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు. ఫ్యామిలీ డ్రామా, తెలంగాణ నేపథ్యంతో వచ్చిన లవ్ స్టోరీ, కుటుంబ నేపథ్యంగా ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది.

Oct 19, 2026 Telugu

Garividi Lakshmi movie Review

7.0
out of 10
గరివిడి లక్ష్మి.. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి గారి రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. చిన్నప్పుడు తీర్థాల్లో, పండగల్లో బుర్రకథలు నేను కూడా చూశాను. అందుకే ఈ సినిమా నాకు కనెక్ట్ అవుతుంది అనిపించి థియేటర్ లో చూశాను. సినిమా చూస...

గరివిడి లక్ష్మి.. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి గారి రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. చిన్నప్పుడు తీర్థాల్లో, పండగల్లో బుర్రకథలు నేను కూడా చూశాను. అందుకే ఈ సినిమా నాకు కనెక్ట్ అవుతుంది అనిపించి థియేటర్ లో చూశాను. సినిమా చూసిన తర్వాత నిజంగా నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ లో దాదాపు ఒక అరగంట అక్కడక్కడా కొంచెం లాగ్ అనిపించినా క్లైమాక్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా ఎమోషనల్ గా అనిపించింది. 


అడల్ట్ కంటెంట్, ఎక్స్పోజింగ్ లాంటివి ఏమీ ఉండవు. జనాల్ని బుర్రకథల్లో కొంతమంది వల్గర్ గా చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అలాంటి వల్గారిటీ కూడా లేకుండా చాలా నేచురల్ గా చూపించారు. ఆనంది గారి పెర్ఫార్మెన్స్... ఇలాంటి రోల్ చేయడం నిజంగా చాలా కష్టం. బుర్రకథ చెప్తూ, పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ చుట్టూ ఎంతో మంది జనాలు ఉన్నా నేచురల్ గా యాక్ట్ చేయడం చిన్న విషయం కాదు. అందులోనూ రెప్యుటేషన్ ఉన్న ఆనంది లాంటి యాక్ట్రెస్ ద్వారా. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆమె చాలా బాగా నటించారు. ఇక ఇంటర్వెల్, క్లైమాక్స్ అయితే నాకు పర్సనల్లీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగా నచ్చింది. గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. మొత్తానికి గరివిడి లక్ష్మి అనే మూవీ ఒక హానెస్ట్ ఎమోషనల్ బయోపిక్ అండి. ఆనంద్ గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, మంచి మ్యూజిక్, నేచురల్ విలేజ్ అట్మాస్పియర్, ఇంటర్వెల్ సీన్, ఎమోషనల్ క్లైమాక్స్ బ్యూటిఫుల్ ఫోక్ మ్యూజిక్ అండ్ పవర్ఫుల్ క్లైమాక్స్ డిస్పైట్ సం లాగ్ సీన్స్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. 

Oct 18, 2026 Telugu
7.0
out of 10
just ippude Garividi lakshmi cinema chusoccha. asalu mundu intrest ledu naaku.. friends jailer 2 cinemaki malli podam ante.. malli malli em podam vere edaina kottha cinemaki veldam ani.. appatikappudu fix ayi ee movie ki vellam.. honest ga cheppalante manchi feel icchindi cinema chustunte.. garividi lakshmi ane women biopic ani cinema chusaka telisindi. naku special ga nacchindi entante burra kath...

just ippude Garividi lakshmi cinema chusoccha. asalu mundu intrest ledu naaku.. friends jailer 2 cinemaki malli podam ante.. malli malli em podam vere edaina kottha cinemaki veldam ani.. appatikappudu fix ayi ee movie ki vellam..


honest ga cheppalante manchi feel icchindi cinema chustunte.. garividi lakshmi ane women biopic ani cinema chusaka telisindi.


naku special ga nacchindi entante burra katha scnce.. and climax. anandi career best performance icchindi.


and mahanati range cinema kadu idi. but aa movieki deeniki chala polikalu unnayi. directer gowri naidu honest attempt idi. okasari theaterlo pakka chudocchu ee movie.

Oct 18, 2026 Telugu

Garividi Lakshmi movie review

6.0
out of 10
బయోపిక్స్ తీయాలి అనుకున్నప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి.. అలాగే కొన్ని డిస్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోవడం చాలా కష్టం. గరివిడి లక్ష్మి బయోపిక్ మాత్రం చాలా హానెస్ట్ గా చేసినట్టు అనిపిస్తుంది. ఆమె ఇప్పటికీ ప్రాణాలతోనే ఉన్నారని విషయం చాలా మందికి తెలియదు. ఇది ఎప్పుడో జరిగిన కథ కాదు ఒక 30 ఏళ్ల కింద జరిగిన స్టోరీ మాత్రమే. ఈ బయోపిక్ పూర్తిగా మహానటి టెంప్లేట్ లోనే సాగింది....

బయోపిక్స్ తీయాలి అనుకున్నప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి.. అలాగే కొన్ని డిస్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోవడం చాలా కష్టం. గరివిడి లక్ష్మి బయోపిక్ మాత్రం చాలా హానెస్ట్ గా చేసినట్టు అనిపిస్తుంది. ఆమె ఇప్పటికీ ప్రాణాలతోనే ఉన్నారని విషయం చాలా మందికి తెలియదు. ఇది ఎప్పుడో జరిగిన కథ కాదు ఒక 30 ఏళ్ల కింద జరిగిన స్టోరీ మాత్రమే. ఈ బయోపిక్ పూర్తిగా మహానటి టెంప్లేట్ లోనే సాగింది. అసలు కథ ఏంటో తెలియకుండా, అంచనాలే లేకుండా వెళ్ళిన సినిమాలు సర్ప్రైజ్ చేస్తే భలే కిక్కు వస్తుంది.. 


గరివిడి లక్ష్మి అలాంటి సర్ప్రైజ్ ఇస్తుంది. నిజంగా ఆమె ఎవరు ఏం చేసేవారు అనేది చాలామందికి ఎలాంటి ఐడియా లేదు.. కానీ సినిమా మొదలైన కాసేపటికే ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అర్థమైంది.. మనం చాలా సినిమాల్లో చూసిన జానపదాలు ఆమె నోటి నుంచి వచ్చినవే అని తెలిసింది.. చదువు లేకపోయినా జానపదాన్ని దశాబ్దం పాటు ఏలింది అనేది అర్థమైంది.. ఈ సినిమా చూస్తున్నంత సేపు మహానటి గుర్తుకొచ్చింది. సేమ్ టు సేమ్ స్క్రీన్ ప్లే వాడుకున్నాడు దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము. చాలావరకు మహానటి సినిమా పోలికలు ఇందులో కూడా కనిపిస్తాయి. దర్శకుడు గౌరీ నాయుడు ఒక మంచి కథను తీసుకొని చాలా మంచి ప్రయత్నం చేశాడు.


Oct 18, 2026 Telugu

Garividi Lakshmi movie review

Gulte

By Gulte

5.0
out of 10
People Media Factory has produced Garividi Lakshmi, a Biopic based on the life of Legendary Folk Singer from Uttarandhra. The idea of making a Biopic of a Burra Katha artist itself has instilled curiosity factor on the film and Anandhi’s Live Performance of a Song created buzz for the movie.Positives:1.⁠ ⁠Garividi Lakshmi’s Life & Times2.⁠ ⁠Pre-Climax & Climax Portions3.⁠ ⁠Anandhi’s Perfor...

People Media Factory has produced Garividi Lakshmi, a Biopic based on the life of Legendary Folk Singer from Uttarandhra. The idea of making a Biopic of a Burra Katha artist itself has instilled curiosity factor on the film and Anandhi’s Live Performance of a Song created buzz for the movie.


Positives:


1.⁠ ⁠Garividi Lakshmi’s Life & Times

2.⁠ ⁠Pre-Climax & Climax Portions

3.⁠ ⁠Anandhi’s Performance


Negatives:


1.⁠ ⁠Mahanati’s storytelling pattern

2.⁠ ⁠Not so engaging first half


Finally, Garividi Lakshmi has an engaging pre-climax, climax and a few other good moments here and there. However, the not-so-engaging first half worked against the film’s overall graph. A bit more care in writing and screenplay, would have made the film great. That said, the film and the makers of it deserve our respect for their attempt to tell us the story of Garividi Lakshmi.


Bottom line: Final Act Worked. Other Two Acts, Arent


Oct 18, 2026 Telugu
5.0
out of 10
Garividi Lakshmi movie reviewHighlightsAnandhi’s performanceFolk musicDrawbacksSlow-paced narrativeDull first halfLack of a contemporary storytelling approachOn the whole, Garividi Lakshmi is a sincere attempt to document the life and contribution of a folk artist. However, its sluggish narrative and lack of dramatic engagement undermine the effort. Despite Anandhi’s strong performance and the eff...

Garividi Lakshmi movie review


Highlights

Anandhi’s performance

Folk music


Drawbacks

Slow-paced narrative

Dull first half

Lack of a contemporary storytelling approach


On the whole, Garividi Lakshmi is a sincere attempt to document the life and contribution of a folk artist. However, its sluggish narrative and lack of dramatic engagement undermine the effort. Despite Anandhi’s strong performance and the effective use of folk music, the film makes for a largely tedious watch.


Bottom Line: Honest, but Boring



Oct 18, 2026 Telugu

Garividi Lakshmi Movie review

6.0
out of 10
ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుదైన గాయని జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ (అంకిత్ కొయ్య) ఆమె నిజమైన కథను శోధించే క్రమంలో సాగే ఈ చిత్రంలో, టైటిల్ రోల్ పోషించిన ఆనంది తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. చరణ్ అర్జున్ అందించిన ఫోక్ సాంగ్స్, విజయనగర నేటివిటీ, ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగున్నాయి. ము...

ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుదైన గాయని జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ (అంకిత్ కొయ్య) ఆమె నిజమైన కథను శోధించే క్రమంలో సాగే ఈ చిత్రంలో, టైటిల్ రోల్ పోషించిన ఆనంది తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. చరణ్ అర్జున్ అందించిన ఫోక్ సాంగ్స్, విజయనగర నేటివిటీ, ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో చివరి 30 నిమిషాల ఎమోషనల్ సీన్లు అండ్ క్లైమాక్స్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటాయి.


అయితే, ఒక సాధారణ బయోపిక్‌లో ఉండే మాస్ 'హై' ఎలివేషన్లు మిస్ అవ్వడం, లక్ష్మి సాధించిన విజయాల కంటే పతనాన్నే ఎక్కువగా చూపించడం కాస్త నిరాశపరుస్తుంది. దానికి తోడు స్లోగా సాగే ఫస్టాఫ్ సినిమా టెంపోను తగ్గిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే.. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక విస్మరించబడిన కళాకారిణిని గుర్తుచేసే నిజాయితీ గల ప్రయత్నం. డీసెంట్ ఎమోషన్స్, జానపద సంగీతం, ఆనంది నటన కోసం బయోపిక్స్ ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో థియేటర్‌లో హ్యాపీగా ఒక లుక్ వేయొచ్చు!


Oct 18, 2026 Telugu
Why MRO?