Register as a Reviewer
418 (#418)

418 (#418)

Upcoming Expected Release: 23 Oct 2026

#418 Movie : మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ హారర్ మూవీ "418 The Movie". కీర్తన్ నడగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జె ఆచార్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించగా లేటెస్ట్ గా అక్టోబర్ 23న విడుదలై థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.

Director: Kirtan Nadagouda
Cast: Chaithra J Achar, Ramesh Indira, Surya Raj Veerabathini, Charan Lakkaraju, Preethi Pagadala, Shree Vaishnav, Shashank Patil, Kota Jayaram, Goparaju Vijay, Shrikanth Ganesh, Gopi Gavireddy

Available in:

About This Movie

Story : 

 

కథ విషయానికి వస్తే... కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత టైం లో నడుస్తుంది. వివేక్ శంకర్ (సూర్య రాజ్) అనే యువకుడు డాక్టర్ అవ్వాలనే గోల్ తో కోస్టల్ కర్ణాటక దగ్గర ఉన్న వేదగిరి మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. అయితే అక్కడే ఉన్న బాయ్స్ హాస్టల్ లో రూమ్ నెం.. 418 కి పక్కనే ఉన్న 417 లో ఉండాల్సి వస్తుంది. అయితే ఆ 418 రూమ్ వైపు ఎవ్వరూ వెళ్లరు.. దీంతో.. అక్కడ ఏముంది.. అసలేం జరిగింది అని కూడా తెలీని వివేక్ తన రూమ్ మేట్స్ రోహిత్ (చరణ్ లక్కరాజు) సహా కొంతమందితో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వివేక్ కి రాత్రుళ్ళు ఓ అమ్మాయి గజ్జల శబ్దం చేస్తూ హాస్టల్ లోనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ వివేక్ ని ఎవరూ నమ్మరు? ఈ పరిస్థితుల్లో వివేక్ ఇంకా ఫ్రెండ్స్ ఆ 418 రూమ్ ని తెరిచే ప్రయత్నం చేస్తారు? మరి ఆ రూమ్ లో ఏముంది? అసలు అక్కడేం జరిగింది? చాలా రోజులు మూతబడ్డ ఆ హాస్టల్ ని ఎందుకు తెరిచారు? ఈ కథ మధ్యలో దేవిక (చైత్ర జే ఆచార్) ఎవరు? వివేక్ ఈ పరిస్థితుల నుండి ఎలా బయటపడ్డాడా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points :

 

రీసెంట్ గా హారర్ నేపథ్యంలో సినిమాలు బాగానే విడుదలయ్యాయి. కానీ అందులో ఒక్క రాకాస తప్ప మిగతావి పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన 418 ట్రైలర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. సినిమా విషయానికి వస్తే... సింపుల్ గా ఒక పెద్ద బిల్డింగ్.. ఆ భవనంలో వింత వింత శబ్దాలు... అదేంటో కనిపెట్టే భయంభయంతో ఉన్న గ్యాంగ్... చాలా హారర్ సినిమాల్లో ఉన్న రొటీన్ టెంప్లేటే... దాన్ని కొంతమంది ప్యూర్ హారర్ ఎలిమెంట్స్ తో, మరికొందరు డైరెక్టర్లు కామెడీని యాడ్ చేసి వదులుతుంటారు. ఇక ఈ సినిమా మాంచి హారర్ ఎలిమెంట్స్ తోనే తెరకెక్కగా, ఆడియన్స్ ని భయపెట్టడంలో దాదాపు సక్సెస్ అయ్యారు మేకర్స్. ముఖ్యంగా సినిమాలో ఆ నైట్ విజువల్స్ దానికి తగ్గ బీజీఎమ్ సౌండ్స్ అదిరిపోయాయి. 

 

ఇక ఇంటర్వెల్ సీన్, అండ్ క్లైమాక్స్ మంచి థ్రిల్ ఫీల్ ఇస్తాయి. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా కనెక్ట్ అవడం ఖాయం. అలాగే నటీనటులు సూర్య రాజ్, చరణ్ లక్కరాజు తో పాటు, నటి ప్రీతీ పగడాల, అద్భుతంగా సహజంగా నటించారు. అయితే వీళ్ళని మించి ఇంప్రెస్ చేసి హైలెట్ గా చేసింది మాత్రం చైత్ర జే ఆచార్. ఇన్నోసెంట్ గా కనిపిస్తూనే ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ని కనబరిచింది. అలాగే సినిమాకి  హారర్ మ్యూజిక్ హైలెట్ అయింది. 

 

Minus Points :

 

అయితే ఈ సినిమా ట్రైలర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేయడంతో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్లే ఆడియన్స్ ని మాత్రం ఈ సినిమా నిరాశపరచవచ్చు. కథ సింపుల్ గా ఉంటే, కథనం ఇంకా సింపుల్ గా ఉంటుంది. దర్శకుడు ఆడియన్స్ ని భయపెట్టడమే టార్గెట్ పెట్టుకున్నాడు కాబట్టి, కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుంటే ఈజీగా కనెక్ట్ ఆయే ఛాన్స్ ఉంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ వంటివి బాగానే ఉన్నా, మిగతా స్క్రీన్ ప్లే అంతా స్లో గా సాగుతుంది. ట్రైలర్ లో ఉన్నట్టు సినిమా మొత్తం హారర్ ఎలిమెంట్స్ ఉండవు.. అందువల్ల థ్రిల్లర్ ప్రియులకు కొంత బోర్ కొట్టొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ మరీ స్లో అయినట్టుంటుంది. కాన్సెప్ట్ కూడా చాలా సినిమాల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఫ్రెష్ నెస్ కోరుకునే వాళ్లకు కూడా అంతగా కనెక్ట్ అవకపోవచ్చు. పైగా పేరున్న నటీనటులు పెద్దగా కనిపించరు. 

Why MRO?