Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1888
Total Reviews
134
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 181-192 of 1888 reviews

Ranabaali Movie Review

Thyview

By Thyview

5.0
out of 10
రణబాలి చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అందుకు ఫ్రస్ట్రేషన్. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే రణబాలి అనే వీరుడు కథ, బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుతాడు, ఫామిలీ జరుగుతున్న టైం లో పుట్టాడు అండ్ తన బర్త్ చుట్టూ కూడా ఒక సర్టెన్ మిత్ ఉంటది. అది రివీల్ చేసి నేను మీకు స్పాయిల్ చేయదలుచుకోలేదు. రాహుల్ బిగ్గెస్ట్ ప్...

రణబాలి చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అందుకు ఫ్రస్ట్రేషన్. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే రణబాలి అనే వీరుడు కథ, బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుతాడు, ఫామిలీ జరుగుతున్న టైం లో పుట్టాడు అండ్ తన బర్త్ చుట్టూ కూడా ఒక సర్టెన్ మిత్ ఉంటది. అది రివీల్ చేసి నేను మీకు స్పాయిల్ చేయదలుచుకోలేదు. రాహుల్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పర్సనల్ రిలేషన్స్ బాగా రాస్తాడు తను. సో విజయ్ రష్మిక వీళ్ళిద్దరి పోర్షన్ బాగుంది. 


అండ్ రాహుల్ కరెక్ట్ థాట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి డిజైన్ చేసిన సీన్స్ కరెక్ట్ గా ల్యాండ్ అవ్వకపోవడం అండ్ ఈ డ్రామాకి ఎప్పుడైనా పే ఆఫ్ ఇచ్చేది త్రూ యాక్షనే కదా. ఈ సింక్ ని తెప్పియలేదు యాక్షన్. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. బట్ బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ సౌండ్ అండి. అది నాకు థియేటర్ ప్రాబ్లమో లేకపోతే ఏంటో తెలియదు కానీ అంటే స్క్రీన్ మీద ఏదో సౌండ్ వస్తుంది అన్నట్టు ఏముంది కానీ బట్ ఫిల్మ్ రాహుల్ ఏం చెప్పాలనుకున్నాడు అనేది నాకు క్లారిటీ వస్తుంది, కొన్ని ఐడియాస్ ఏమో ప్రాపర్ బిల్డ్ అప్ లేకుండా వచ్చేస్తాయి. విజయ్ దేవరకొండ ఇస్ ఫినోమినల్ అండి. చాలా బాగా చేసాడు. ఆ స్లాంగ్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి.. బట్ ఈ యాక్షన్ బిల్డ్ చేయడము అండ్ మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ తను నాకు చెప్పడం వల్ల గాని ఏదన్నా గాని సో ఆ కాన్వర్సేషన్ బిల్డ్ చేయడంలో హి సక్సీడెడ్. ఫైనల్ వర్డ్ ఏంటంటే ఓకే ఒకే. 

Oct 16, 2026 Hindi +4
7.0
out of 10
‘Ranabaali’ బొమ్మ చూశాక నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది! థియేటర్‌లో ఇది కేవలం ఒక సినిమా లాగ అనిపించలేదు.1900ల నాటి భయంకరమైన కరవు పరిస్థితుల్ని, అండ్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ల దౌర్జన్యాలను ఎదిరించే ఒక అన్‌టోల్డ్ హిస్టారికల్ మాస్టర్‌పీస్‌ ని డైరెక్టర్ మనకు బాగా చూపించారు. అండ్ స్పెషల్ గా మా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మా కల్చర్ కి దగ్గరగా చూపించినందుకు నాకు బాగా నచ్చిందేమో. అండ్ విజయ్ దేవరకొండ అన్న పర్ఫా...

‘Ranabaali’ బొమ్మ చూశాక నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది! థియేటర్‌లో ఇది కేవలం ఒక సినిమా లాగ అనిపించలేదు.1900ల నాటి భయంకరమైన కరవు పరిస్థితుల్ని, అండ్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ల దౌర్జన్యాలను ఎదిరించే ఒక అన్‌టోల్డ్ హిస్టారికల్ మాస్టర్‌పీస్‌ ని డైరెక్టర్ మనకు బాగా చూపించారు.


అండ్ స్పెషల్ గా మా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మా కల్చర్ కి దగ్గరగా చూపించినందుకు నాకు బాగా నచ్చిందేమో. అండ్ విజయ్ దేవరకొండ అన్న పర్ఫార్మెన్స్ సూపర్ అసలు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా హ్యాండిల్ చేసాడు. బట్ సీమ స్లాంగ్ అంత సెట్ అవ్వలేదనిపించింది. అండ్ సినిమాలో కొన్ని యాక్షన్స్ సీన్స్ కి పూనకాలు వచ్చేసేలా ఉన్నాయి.


బట్ కొంచెం న్యాచురాలిటీ తగ్గిందనిపిస్తుంది. అండ్ ఇది ఫిక్షనల్ స్టోరీ అని సినిమా చూసేదాకా తెలీదు. సో దాంట్లో చిన్న డిస్సపాయింట్మెంట్ అంతే. మిగతా అంతా సూపర్.


Oct 16, 2026 Hindi +4
8.0
out of 10
గైస్, ‘Ranabaali’ ఇప్పుడే చూసొస్తున్నా... అసలు థియేటర్‌లో ప్యూర్ విజువల్ ఫీస్ట్ అండ్ మైండ్-బ్లోయింగ్ పీరియాడిక్ డ్రామా అంతే!Vijay Deverakonda పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్! మన తెలంగాణోడు అయినా కూడా సీమ యాస, ఆ ఆవేశం సీన్లలో కంప్లీట్ రా ఫైర్ కనిపించింది. Rashmika యాక్టింగ్ నాకంత నచ్చదు కానీ.. ఈ సినిమాలో బాగా చేసింది. అండ్ రియల్ లైఫ్ జోడి కాబట్టి ఇద్దరి పెయిర్ కూడా మస్త్ ఉంది సినిమాలో కూడా.అండ్...

గైస్, ‘Ranabaali’ ఇప్పుడే చూసొస్తున్నా... అసలు థియేటర్‌లో ప్యూర్ విజువల్ ఫీస్ట్ అండ్ మైండ్-బ్లోయింగ్ పీరియాడిక్ డ్రామా అంతే!


Vijay Deverakonda పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్! మన తెలంగాణోడు అయినా కూడా సీమ యాస, ఆ ఆవేశం సీన్లలో కంప్లీట్ రా ఫైర్ కనిపించింది. Rashmika యాక్టింగ్ నాకంత నచ్చదు కానీ.. ఈ సినిమాలో బాగా చేసింది. అండ్ రియల్ లైఫ్ జోడి కాబట్టి ఇద్దరి పెయిర్ కూడా మస్త్ ఉంది సినిమాలో కూడా.


అండ్ సినిమాలో అప్పటి కరువు బ్యాక్‌డ్రాప్‌ ల మరుగున పడిన మన రియల్ హిస్టరీని డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ బాగా చూపించాడు. ఇదైతే మెయిన్ నాకు బాగా నచ్చింది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ అయితే థియేటర్‌లో goosebumps తెప్పించేశాయి!


కథలో ఉన్న emotion అండ్ డిటైలింగ్ మనల్ని ఆ కాలానికి తీసుకెళ్తది. మరీ క్లాసిక్ రేంజ్ లో కాదు గాని, మన తెలుగు సినిమా లవర్స్ కైతే బాగా నచ్చుతాది సినిమా. కొండన్న ఫ్యాన్స్ కైతే పిచ్చెక్కుద్దేమో.

Oct 16, 2026 Hindi +4
6.0
out of 10
ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ‘రణబాలి’ సినిమా వస్తుందంటే ఫస్ట్ డే చూడ్డానికి వెళ్ళిపోయా. బట్ సినిమా చూసాక తెలిసింది. దీని కాన్సెప్ట్ వేరే అని. బట్ ఒకే. సినిమా బాగానే తీశారు. బ్రిటిష్ వాళ్ళతోనే వార్ ఉంటుంది, కానీ అది వాళ్ళ ఊరి కోసం అంతే.. బట్ సినిమాలో ఆ టైం లో కరువు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో బాగా చూపించారు.అండ్ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ సప్రైజ్ ఏంటంటే రష్మిక యాక్టింగ్...

ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ‘రణబాలి’ సినిమా వస్తుందంటే ఫస్ట్ డే చూడ్డానికి వెళ్ళిపోయా. బట్ సినిమా చూసాక తెలిసింది. దీని కాన్సెప్ట్ వేరే అని. బట్ ఒకే. సినిమా బాగానే తీశారు. బ్రిటిష్ వాళ్ళతోనే వార్ ఉంటుంది, కానీ అది వాళ్ళ ఊరి కోసం అంతే.. బట్ సినిమాలో ఆ టైం లో కరువు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో బాగా చూపించారు.


అండ్ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ సప్రైజ్ ఏంటంటే రష్మిక యాక్టింగ్ చాలా సినిమాల్లో క్రింజ్ లాగ అనిపిస్తది. బట్ ఇందులో చాలా బాగా చేసింది. బట్ సినిమాను డైరెక్టర్ ఒక ఆర్ట్ సినిమా టైపులో సీన్లను పిచ్చి ఫ్లాట్‌ గా లాగేశాడు. అండ్ నేటివిటీ మిస్ అయింది. చాలా మందికి సెట్స్ చూసి, విజువల్స్ చూసి తెలుగు సినిమాలాగే అనిపించొచ్చు. బట్ నాకైతే అంత అనిపించలేదు.


బట్ విజయ్ కష్టం సీన్లలో కనిపిస్తుంది కానీ.. ఆ డల్ నరేషన్, వల్ల బొమ్మ కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. బట్ ఒకసారైతే చూసేలాగానే ఉంది.


Oct 16, 2026 Hindi +4

Ranabaali movie Review

6.0
out of 10
just ippude Ranabaali matnee show finish chesa.. movie lo content and potential aithe solid ga undi, kani execution matram total ga patience test chesindi! actually nenu idedo biopic anukunna.. but fictional story ani movie chusedaka telidu. anduke konchem dissapoint ayya.and 1890s backdrop lo Britishers meeda fight chese story concept, and Vijay Deverakonda, Seema slang performance chaala bagunna...

just ippude Ranabaali matnee show finish chesa.. movie lo content and potential aithe solid ga undi, kani execution matram total ga patience test chesindi! actually nenu idedo biopic anukunna.. but fictional story ani movie chusedaka telidu. anduke konchem dissapoint ayya.


and 1890s backdrop lo Britishers meeda fight chese story concept, and Vijay Deverakonda, Seema slang performance chaala bagunnai. Rashmika tho pair super.


Kani problem entante, super mass elevation undalsina places lo director oversized art-house movie la teesi flat ga laagessadu. Daaniki thodu sluggish narration, weak BGM, and lagging second half valla hype motham poyindi.


Intent and efforts super kani, slow pacing & limited high moments valla below-average feel ostundi.but vijay and rashmika performance kosam, makers kashtaniki okasari try cheyocchu.

Oct 16, 2026 Hindi +4
5.0
out of 10
just now finished Ranabaali movie first show.. the movie was decent. ranabaali had all the raw potential to be an absolute epic, but man, it turned out to be a total patience test!The core story about a hero fighting British exploitation during a devastating 1900s famine is solid. Rahul Sankrityan clearly did his homework on history, Vijay Deverakonda gave it his all with intense Seema slang, and...

just now finished Ranabaali movie first show.. the movie was decent. ranabaali had all the raw potential to be an absolute epic, but man, it turned out to be a total patience test!


The core story about a hero fighting British exploitation during a devastating 1900s famine is solid. Rahul Sankrityan clearly did his homework on history, Vijay Deverakonda gave it his all with intense Seema slang, and Rashmika looked stunning. Plus, that cave action sequence and the climax actually go hard!


flat BGM, and weak VFX to the mix, and the second half just drags down completely. overall Great intent, huge effort, and solid performances, but ruined by a slow-paced screenplay and zero theater hype. A strictly below-average affair that tests your endurance!

Oct 16, 2026 Hindi +4

Ranabaali movie review

6.0
out of 10
జస్ట్ ఇప్పుడే రణబాలి (Ranabaali) మార్నింగ్ షో చూసొస్తున్నా. సినిమా బాగుందా అంటే.. నాకయితే అబొవ్ యావరేజ్ అనిపించింది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ బెంగాలీ సినిమాలు బాగా చూస్తాడో ఏమో.. తెలుగు నేటివిటీ తన సినిమాల్లో అంతగా కనిపించదు. సినిమా చూస్తుంటే నాకు తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. బట్ అప్పటి రాయలసీమ కరువు కష్టాలు, బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ ఎలా ఉండేదో న్యాచురల్ గా చూపించాడు డైరెక్టర్. కొన్న...

జస్ట్ ఇప్పుడే రణబాలి (Ranabaali) మార్నింగ్ షో చూసొస్తున్నా. సినిమా బాగుందా అంటే.. నాకయితే అబొవ్ యావరేజ్ అనిపించింది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ బెంగాలీ సినిమాలు బాగా చూస్తాడో ఏమో.. తెలుగు నేటివిటీ తన సినిమాల్లో అంతగా కనిపించదు. సినిమా చూస్తుంటే నాకు తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే రాలేదు.


బట్ అప్పటి రాయలసీమ కరువు కష్టాలు, బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ ఎలా ఉండేదో న్యాచురల్ గా చూపించాడు డైరెక్టర్. కొన్ని సార్లు ఎదో ఆర్ట్ ఫిలిం లాంటి ఫీల్ కూడా వచ్చింది. బట్ యాక్షన్ సీన్స్ లో మాత్రం మన తెలుగు సినిమానే అనిపిస్తది. అండ్ చాలా సార్లు సైరా సినిమా గుర్తొస్తుంది కొన్ని సీన్స్ చూస్తుంటే. ఏంటో మరి.. బట్ విజయ్ అండ్ రష్మిక పెర్ఫార్మన్స్ మాత్రం సూపర్. వీళ్ళ కోసమైనా ఒకసారి చూడొచ్చు.

Oct 16, 2026 Hindi +4

Ranabaali movie review

7.0
out of 10
చారిత్రక నేపథ్యానికి కల్పిత కథ, జానపద విశ్వాసాలు, యాక్షన్ అంశాలను జోడించడం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ రణబాలి చిత్రాన్ని పూర్తిగా చారిత్రక సినిమా గా కాకుండా, చరిత్ర నుంచి స్ఫూర్తి పొందిన కల్పిత కథగా చూడాలి. ‘రణబాలి’లో ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రధాన అంశం కరువు నేపథ్యం. వర్షాలు లేక పంటలు పండకపోవడం, గ్రామాల్లో ఆహార కొరత ఏర్పడటం వంటి పరిస్థితులు ప్రజల జీవితాలను ఎలా కుదేలు చేస్తాయో కథ వివరిస్తుంది. విజయ...

చారిత్రక నేపథ్యానికి కల్పిత కథ, జానపద విశ్వాసాలు, యాక్షన్ అంశాలను జోడించడం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ రణబాలి చిత్రాన్ని పూర్తిగా చారిత్రక సినిమా గా కాకుండా, చరిత్ర నుంచి స్ఫూర్తి పొందిన కల్పిత కథగా చూడాలి. ‘రణబాలి’లో ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రధాన అంశం కరువు నేపథ్యం. వర్షాలు లేక పంటలు పండకపోవడం, గ్రామాల్లో ఆహార కొరత ఏర్పడటం వంటి పరిస్థితులు ప్రజల జీవితాలను ఎలా కుదేలు చేస్తాయో కథ వివరిస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో ఆయన తన మాస్ ఇమేజ్‌కు భిన్నమైన పీరియాడికల్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. జయమ్మ పాత్రలో రష్మిక కథకు భావోద్వేగ కోణాన్ని అందిస్తారు. రణబాలి వ్యక్తిగత జీవితానికి, అతడి పోరాటానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో ఈ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.



అయితే దాదాపు మూడు గంటల నిడివి ఉండటంతో కొన్ని సన్నివేశాలను కుదించి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం వల్ల ఉత్కంఠ తగ్గుతుంది. కొన్ని సన్నివేశాల్లో సంగీతం మరింత సమతూకంగా ఉంటే భావోద్వేగ ప్రభావం పెరిగేది. ఫైనల్ గా ‘రణబాలి’ ఒక విభిన్నమైన చారిత్రక నేపథ్యాన్ని ఎంచుకున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా. కొన్ని చోట్ల నిడివి, కథనం విషయంలో మెరుగుదలకు అవకాశం ఉన్నప్పటికీ, చారిత్రక అంశాలను కమర్షియల్ కథనంతో కలపాలనే ప్రయత్నం ప్రశంసనీయం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు, విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమాను పరిశీలించవచ్చు.



Oct 16, 2026 Hindi +4

Ranabaali movie review

5.0
out of 10
అసలు ‘రణబాలి’ చూశాక అర్థమైంది ఏంటంటే.. సినిమాలో విషయం ఉంది, టీమ్ పడ్డ కష్టం కనిపిస్తోంది, కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల సహనానికి మాత్రం గట్టి రోప్‌వాక్ టెస్ట్ పెట్టేశారు! 1900ల నాటి కరవు కథ అని చెప్పారు కానీ, ఆ సీన్ల కన్నా స్క్రీన్ ప్లే చూస్తూ ఉంటేనే మనకి ఆకలి, నిద్ర ఎక్కువైపోతాయి. రాజమౌళి రేంజ్‌లో రచ్చ లేపాల్సిన 'బ్రిటిషర్ల ప్యాంట్లు విప్పి కారం కూరే సీన్' ని కూడా ఏదో సీరియల్‌లో ఊరగాయ నూరిన...

అసలు ‘రణబాలి’ చూశాక అర్థమైంది ఏంటంటే.. సినిమాలో విషయం ఉంది, టీమ్ పడ్డ కష్టం కనిపిస్తోంది, కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల సహనానికి మాత్రం గట్టి రోప్‌వాక్ టెస్ట్ పెట్టేశారు! 1900ల నాటి కరవు కథ అని చెప్పారు కానీ, ఆ సీన్ల కన్నా స్క్రీన్ ప్లే చూస్తూ ఉంటేనే మనకి ఆకలి, నిద్ర ఎక్కువైపోతాయి. రాజమౌళి రేంజ్‌లో రచ్చ లేపాల్సిన 'బ్రిటిషర్ల ప్యాంట్లు విప్పి కారం కూరే సీన్' ని కూడా ఏదో సీరియల్‌లో ఊరగాయ నూరినంత కూల్‌గా లాగించేశారు రాహుల్ సంకృత్యన్ సర్!


ఇక విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో రణరంగం సృష్టిస్తే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సైలెంట్‌గా మెడిటేషన్ చేయిస్తుంది.రష్మిక లుక్స్, గుహ యాక్షన్ సీన్, క్లైమాక్స్ బాగున్నా.. ఆ స్లో నరేషన్ దెబ్బకి క్లైమాక్స్ వచ్చేసరికి ఆడియెన్స్ ఆల్రెడీ మైండ్ బ్లాంక్ అయిపోతారు. మొత్తానికి 'రణబాలి' ఒక మంచి ఆర్ట్ ఫిలిం విత్ ఆస్కార్ రేంజ్ ఓపిక పరీక్ష! ఫైనల్ గా తెరమీద చేసిన వాళ్ళ కష్టం పనబడింది కానీ, కూర్చోడానికి కూడా కష్టం గానే ఉంది.

Oct 16, 2026 Hindi +4

Ranabaali Movie Review

Sakshi

By Sakshi

6.0
out of 10
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వచ్చిన ‘రణబాలి’ 1900ల నాటి బ్రిటిష్ పాలన, కరవు నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామా. మరుగున పడిన ఒక అద్భుతమైన చారిత్రక కథను శోధించి రాయడంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కృషి స్పష్టంగా కనిపిస్తుంది.రణబాలిగా విజయ్ తన మాస్ ఆవేశం, రాయలసీమ యాసతో ప్రాణం పోయగా, జయమ్మగా రష్మిక నటన, మైత్రీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు పెద్ద ప్లస్. అయితే, ఒక రాజమౌళి రేంజ్ కమర్షియల్...

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వచ్చిన ‘రణబాలి’ 1900ల నాటి బ్రిటిష్ పాలన, కరవు నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామా. మరుగున పడిన ఒక అద్భుతమైన చారిత్రక కథను శోధించి రాయడంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కృషి స్పష్టంగా కనిపిస్తుంది.


రణబాలిగా విజయ్ తన మాస్ ఆవేశం, రాయలసీమ యాసతో ప్రాణం పోయగా, జయమ్మగా రష్మిక నటన, మైత్రీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు పెద్ద ప్లస్. అయితే, ఒక రాజమౌళి రేంజ్ కమర్షియల్ ఎలివేషన్లు పడాల్సిన సీన్లను కూడా ఆర్ట్ ఫిలిం తరహాలో చాలా సింపుల్‌గా తీయడం, స్లో నరేషన్ మరియు ఇంపాక్ట్ లేని బిజీఎమ్ (BGM) ప్రేక్షకుల అనుభూతిని బాగా దెబ్బతీశాయి.


అయితే గుహ యాక్షన్ ఎపిసోడ్, క్లైమాక్స్ బాగున్నప్పటికీ, సుదీర్ఘ నిడివి వల్ల సినిమా గ్రాఫ్ పడిపోతుంది. మొత్తానికి ‘రణబాలి’ మంచి కంటెంట్ ఉన్న చిత్రమే కానీ, కానీ తక్కువ అంచనాలతో చుస్తే సినిమా నచ్చవచ్చు.

Oct 16, 2026 Hindi +4

Ranabaali Movie Review

6.0
out of 10
రణబాలి సినిమాలో ఫస్టాఫ్‌ లో దర్శకుడు కథకు అవసరమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేశాడు. రణబాలి ఎవరు, అతడి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను పరిచయం చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఇక్కడే సినిమా కాస్త నెమ్మదిస్తుంది. విజయ్, రష్మిక సన్నివేశాలు, పీరియడ్ బ్యాక్‌డ్రాప్ ఆసక్తిని నిలబెట్టినా.. ఫస్టాఫ్‌ను ఇంకాస్త క్రిస్ప్‌గా ఎడిట్ చేసి ఉం...

రణబాలి సినిమాలో ఫస్టాఫ్‌ లో దర్శకుడు కథకు అవసరమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేశాడు. రణబాలి ఎవరు, అతడి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను పరిచయం చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఇక్కడే సినిమా కాస్త నెమ్మదిస్తుంది. విజయ్, రష్మిక సన్నివేశాలు, పీరియడ్ బ్యాక్‌డ్రాప్ ఆసక్తిని నిలబెట్టినా.. ఫస్టాఫ్‌ను ఇంకాస్త క్రిస్ప్‌గా ఎడిట్ చేసి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. సెకండాఫ్‌లో రణబాలి పోరాటం మరింత తీవ్రంగా మారుతుంది. దాదాపు మూడు గంటల రన్‌టైమ్ కారణంగా కొన్ని చోట్ల సినిమా సాగదీసిన భావన కలుగుతుంది. అయితే క్లైమాక్స్‌కు చేరుకునే కొద్దీ కథలో వేగం పెరుగుతుంది. విజయ్, రష్మిక పెర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్ కలిసి సినిమాను మంచి స్థాయిలో ముగిస్తాయి.

 


ఇక సినిమాలో 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యాన్ని తెరపై చూపించిన విధానం, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, వార్ సీన్స్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్స్‌ గా నిలిచాయి. కథలో పెద్దగా అవసరం లేని కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది. స్క్రీన్‌ప్లే కూడా కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. ఫైనల్‌ గా.. భారీ అంచనాలతో వచ్చే మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కంటే రణబాలి ఒక నెమ్మదిగా సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్, విజువల్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ కోసం ఒకసారి థియేటర్‌లో చూడొచ్చు.

Oct 16, 2026 Hindi +4

Ranabaali Movie Review

5.0
out of 10
ఎంతో మంది ఆకలి తీర్చినది భారతదేశం. అన్నపూర్ణ లాంటి దేశంలో కరువుకు కారణమైన బ్రిటీషర్ల మీద రణబాలి ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది క్లుప్తంగా చిత్రకథ. అయితే... ఆ యుద్ధం, బ్రిటీషర్లపై రణబాలి చేసిన పోరాటం, సినిమా ముందుకు వెళ్ళిన విధానం కొత్తగా అనిపించవు. అందుకు కారణం బ్రిటీషర్లపై పోరాటం చేసిన భారతీయ యోధుల కథను గతంలో తెరపై చూడటమే. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యంలో 'సైరా నరసింహారెడ్డి' రావడం కూడా 'రణబాలి'కి కొంత మ...

ఎంతో మంది ఆకలి తీర్చినది భారతదేశం. అన్నపూర్ణ లాంటి దేశంలో కరువుకు కారణమైన బ్రిటీషర్ల మీద రణబాలి ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది క్లుప్తంగా చిత్రకథ. అయితే... ఆ యుద్ధం, బ్రిటీషర్లపై రణబాలి చేసిన పోరాటం, సినిమా ముందుకు వెళ్ళిన విధానం కొత్తగా అనిపించవు. అందుకు కారణం బ్రిటీషర్లపై పోరాటం చేసిన భారతీయ యోధుల కథను గతంలో తెరపై చూడటమే. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యంలో 'సైరా నరసింహారెడ్డి' రావడం కూడా 'రణబాలి'కి కొంత మైనస్ అని చెప్పాలి. కథ పరంగా 'సైరా', 'రణబాలి' మధ్య వ్యత్యాసం ఉంది. ఈ సినిమాలో కరువుపై ఎక్కువ ఫోకస్ చేశారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. కానీ పోరాటం చేసినది మాత్రం బ్రిటీషర్లపైనే.


'రణబాలి'గా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక పాత్రలను... వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ చాలా బాగా రాశారు. క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ అంటే జస్ట్ సీన్లు, డైలాగులు మాత్రమే కాదు... ఎక్స్‌ప్రెషన్స్ నుంచి బిహేవియర్ వరకు ఎలా ఉండాలో డిసైడ్ చేయడంలో రాహుల్ సాంకృత్యాన్ తన ట్యాలెంట్ చూపించారు. అయితే... నిడివి విషయంలో కాస్త తప్పటడుగు వేశారు. ఫస్టాఫ్ డీసెంట్ అనిపించినా... సెకండాఫ్ లెంగ్త్ ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం పేలవంగా సాగింది. అజయ్ - అతుల్ సంగీతంలో పాటలు బావున్నాయి. కానీ, ఆర్ఆర్ మాత్రం సినిమాను ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. ఇక విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని 'రణబాలి'లో చూడొచ్చు. విజయ్ దేవరకొండ, రష్మిక జోడీతో పాటు వాళ్ళిద్దరి సన్నివేశాలూ బావున్నాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కథలో కొత్తదనం లేదు. కానీ, కథనంలో కొన్ని 'హై' మూమెంట్స్, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాను మరీ తీసిపారేయలేం. అంచనాలు తక్కువ పెట్టుకుని వెళితే విజయ్ దేవరకొండ నటన నచ్చుతుంది.


Oct 16, 2026 Hindi +4
Why MRO?