రామాయణ (Ramayana)
Ramayana : నితీష్ తివారీ దర్శకత్వం వహించిన మైథలాజికల్ మూవీ "రామాయణం". రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన ఈ గ్రాండియర్ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించగా, యష్ రావణుడిగా నటించడం జరిగింది. ఇక ఈ దీపావళి కానుకగా పార్ట్ 1 మూవీ థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
Reviews
What critics and the public are saying about రామాయణ (Ramayana)
Media Reviews
17 Avg: 6.1/10Above Average
Ramayana movie review
రామాయణ సినిమా ఎలా ఉంది రివ్యూ అంటే యావరేజ్ అనిపించింది. మనం పాజిటివ్స్ మాట్లాడేస్తుందాం ఫస్ట్ పాజిటివ్స్ అయితే మాత్రం విజువల్స్ ఆబియస్లీ ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతారు 4000 కోట్లు పెట్టిరో రెండు పార్ట్లు కలిపేసి దీనికి 2000 పెట్టారో 1500 పెట్టారో తెలియదు కానీ యు కెన్ సీ ఈ సినిమాలో ద గ్రేటె...
రామాయణ సినిమా ఎలా ఉంది రివ్యూ అంటే యావరేజ్ అనిపించింది. మనం పాజిటివ్స్ మాట్లాడేస్తుందాం ఫస్ట్ పాజిటివ్స్ అయితే మాత్రం విజువల్స్ ఆబియస్లీ ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతారు 4000 కోట్లు పెట్టిరో రెండు పార్ట్లు కలిపేసి దీనికి 2000 పెట్టారో 1500 పెట్టారో తెలియదు కానీ యు కెన్ సీ ఈ సినిమాలో ద గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ ఏదైనా ఉంది అంటే మాత్రం విజువల్స్ భయ్యా జటాయు ఫైట్ సీక్వెన్స్ గాని జెట్టాయు గాని అనిమల్స్ గాని టోటల్ ల్ాండ్స్కేప్ గాని ద వే ద ఫిలి లుక్ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ విజువల్ పరంగా మాత్రం టాప్ నానాచ్ ఉంది. టెక్నికల్ చెప్పాలంటే కొన్ని కొన్ని ఏరియాస్ లో అసలు ఈ హాలీవుడ్ మూవీస్ కూడా ఈ రేంజ్ లో చూపెట్టలేరేమో అనే ఫీలింగ్ తో ఉన్న విజువల్స్ ఉన్నాయి ఈ సినిమాలో ఫెంటాస్టిక్ అనిపించినాయి.
ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మాత్రం పర్ఫార్మెన్సెస్ అని చెప్తా ముఖ్యంగా నాకు రణ్బీర్ కపూర్ యస్ రామ చాలా యస్ రామ ఆయనకు కొన్ని డైలాగ్స్ పర్ఫార్మెన్స్ విత్ కన్విక్షన్ తో చాలా చాలా బాగా చేసి అనిపించింది. కొన్ని కొన్ని ఏరియాస్ లో అక్కడ మన వనవాసం ఎపిసోడ్ గాని వనవాసానికి ఒప్పుకునే సీన్ గాగానీ అక్కడ పడే డైలాగ్స్ గాని చాలా చాలా బాగా పడ్డాయి రణ్బీర్ ప్రాణం పెట్టిండు. సీతగా సాయి పల్లవి గారు చాలా బాగా చేశారు అనిపించింది. అంటే లైక్ ఆమెకి చాలా తక్కువ స్కోప్ ఇచ్చారు.
ముఖ్యంగా రవి దూబే యస్ లక్ష్మణ్ క్యారెక్టర్ ఆయన కొంచెం కామిక్ రిలీఫ్ లు ఎక్కువ ఉంటాడు అన్నమాట సినిమాలో అండ్ ఆల్సో లైక్ లక్ష్మణుడు కొంచెం కోపం ఎక్కువ బిజీ వచ్చేస్తది ఎక్కువ ఎక్స్ప్రెసివ్ ఎక్కువ ఉంటాడు. యష్ యస్ రావణ బాయ యష్ అనిపించింది. కొన్ని కొన్ని ఏరియాస్ లో యు కెన్ సీ రాకీ బాయ్ యు కెన్ సీ రాయ
ఫ్రమ్ టాక్సిక్ అక్కడ కొంచెం తేడా కొట్టింది.
అందరూ వచ్చి చూస్తారు డబ్బులు కచ్చితంగా వస్తాయి కలెక్షన్స్ బాగా వస్తాయి ఇంకా పెట్టిన డబ్బులన్నీ తిరిగి వస్తాయి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వీలైనంత ఎక్కువ మంది చూడాలి సినిమాని అంటే నువ్వు పెట్టిన డబ్బులకి మన ఇండియన్స్ మాత్రమే చూస్తే సరిపోదు ఏం చేయాలి ఇంటర్నేషనల్ ఆడియన్స్ అందరూ కలిసి చూడాలి అందరూ సినిమా బాగుంది. పట్టించారు అనే బాధ అయితే గ్యారెంటీగా ఉంది. మాట్లాడాలి ఇంకా బట్ ఇట్స్ ఆన్ ఆవరేజ్ మూవీ పక్క చెప్తా అట్ల చెప్పేసి ఓ ఇంత ఇంత మాట్లాడి యవరేజ్ అంటాం ఏంటరా అంటే లిటరల్ గా సినిమాలో చాలా మంచి పాజిటివ్స్ ఉన్నాయి డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి అన్నీ బాగున్నాయి అనిపించినాయి. సెకండ్ హాఫ్ మొత్తానికి లిటరీల వాస్ లిట్రలీ ఫ్యూమింగ్ అన్నమాట.
Above Average
Ramayana Part 1 movie review
Positives:1. The director’s emphasis on lesser-known details of the Ramayana2. Grandeur & Visuals3. Ranbir Kapoor’s performance from the start of the Vanavasa episode4. Yash’s screen presence5. Action episode involving Jatayu6. Sequence involving Ravana’s ten personalitiesNegatives:1...
Positives:
1. The director’s emphasis on lesser-known details of the Ramayana
2. Grandeur & Visuals
3. Ranbir Kapoor’s performance from the start of the Vanavasa episode
4. Yash’s screen presence
5. Action episode involving Jatayu
6. Sequence involving Ravana’s ten personalities
Negatives:
1. Dragged-out episode between Ravana & Vidyutjihva
2. Leisurely pace at times
Overall, the Ramayana part one lived up to all the pre-release hype and expectations. Barring a couple of dragged-out sequences and a leisurely pace at times, the film largely engages the audience. The soul of the Ramayana was beautifully blended with amazing visuals and the film gives a pleasant feeling throughout its runtime. The film certainly deserves to be watched in the theatre with family to witness our epic story in all its glory. Especially, it is definitely worth showing the film to the kids, preferably on an IMAX screen. And yes, Part One ends at the crucial juncture of the Ramayana and it certainly makes us wait for Part Two which is scheduled to release in theatres next year.
Bottomline – Grand, yet it retained the Ramayana’s soul.
Above Average
Ramayana part 1 movie review
‘రాామాయణం’ కథ చాలాసార్లు విన్నది.. చూసిందే కాబట్టి.. తెలిసిన విషయాలను తెర మీద ఎలా ప్రెజెంట్ చేశారా అని చూస్తాం. ఈ ప్రెజెంటేషన్ విషయంలో లోపాలు ఎంచలేని విధంగా.. చాలా నీట్ గా ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దింది నితీశ్ తివారి అండ్ టీం. మనం ఎప్పుడూ రామాయణంలో చూసే ఘట్టాలకు తోడు.. ఇందులో కొన్ని అదనపు సన్ని...
‘రాామాయణం’ కథ చాలాసార్లు విన్నది.. చూసిందే కాబట్టి.. తెలిసిన విషయాలను తెర మీద ఎలా ప్రెజెంట్ చేశారా అని చూస్తాం. ఈ ప్రెజెంటేషన్ విషయంలో లోపాలు ఎంచలేని విధంగా.. చాలా నీట్ గా ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దింది నితీశ్ తివారి అండ్ టీం. మనం ఎప్పుడూ రామాయణంలో చూసే ఘట్టాలకు తోడు.. ఇందులో కొన్ని అదనపు సన్నివేశాలున్నాయి. అలాగే ఇంతకుముందు సింపుల్ గా.. షార్ట్ గా చూసిన సన్నివేశాలను ఇందులో కొంచెం లెంగ్తీగా.. చాలా గ్రాండ్ గా చూస్తాం. సీతను రావణుడు అపహరిస్తుంటే.. జటాయువు ఎదురుపడి పోరాడే సన్నివేశాాన్ని ఒకట్రెండు నిమిషాల వ్యవధిలో చూసి ఉంటాం. కానీ ఇందులో అదే ఒక క్లైమాక్సులా మారి అరగంట పాటు ప్రేక్షకులను విజువల్ మాయాజాలంలో ముంచెత్తి అద్భుత అనుభూతిని పంచుతుంది.
కాకపోతే ‘రామాయణం’ విజువల్ గా ఎంత గొప్పగా అనిపించినప్పటికీ.. ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలించడంలో.. రామాయణ గాథను తెర మీద చూస్తే వచ్చే డివైన్ ఫీలింగ్ తీసుకురావడంలో మాత్రం అనుకున్నంత మేర విజయవంతం కాలేకపోయింది. దర్శకుడు నితీశ్ తివారి.. రామాయణ గాథను ఇప్పటి సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుంటూ విజువల్ వండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని సిన్సియర్ గా చేశాడు. తన టేకింగ్ చాలా బాగుంది. కాకపోతే భావోద్వేగాలను పండించే విషయంలో మరింత కసరత్తు చేయాల్సింది. నరేషన్లో ఇంకొంత వేగం చూపించాల్సింది. చివరగా: రామాయణం.. దృశ్యాలు అద్భుతం.. భావోద్వేగాలు పరిమితం.
Average
Ramayana Part 1 movie review
వాల్మీకి రామాయణాన్ని ఎందరెందరో తమ అనుభూతులను జోడించి, వేల గ్రంథాలుగా తీసుకొచ్చారు. అలాగే 'రామాయణ' గాథను ఎందరెందరో దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. ఇక రామానందసాగర్ వంటి వారు బుల్లితెర ధారావాహికగానూ రూపొందించారు. తెలుగులో అయితే రామాయణం ఎన్నిసార్లు సినిమాగా వచ్చిందో లెక్కేలేదు. తాజాగా వచ్చిన నితీశ్...
వాల్మీకి రామాయణాన్ని ఎందరెందరో తమ అనుభూతులను జోడించి, వేల గ్రంథాలుగా తీసుకొచ్చారు. అలాగే 'రామాయణ' గాథను ఎందరెందరో దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. ఇక రామానందసాగర్ వంటి వారు బుల్లితెర ధారావాహికగానూ రూపొందించారు. తెలుగులో అయితే రామాయణం ఎన్నిసార్లు సినిమాగా వచ్చిందో లెక్కేలేదు. తాజాగా వచ్చిన నితీశ్ తివారీ 'రామాయణం', నిజానికి ఇదో విజువల్ వండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నితీశ్ 'రామాయణం' కాకుండా 'రావణాయణం' చూపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విడుదలైన ప్రథమభాగం చూస్తే అందరికీ అదే భావన కలగటం ఖాయం.
అయితే ప్రథమ భాగం చూసిన తర్వాత అందరికీ కలిగే సందేహం ఒక్కటే. రాముడి గాథను కాకుండా నితీశ్ తివారి రావణ గాథగా ఈ కథను ఎందుకు చెప్పాడు అని!? రావణాసుడితో మొదలైన సినిమా, రాముడి ప్రతిజ్ఞతో ముగిసింది. అందరూ ఎదురుచూసిన రాముడి ఆగమనం సినిమా మొదలైన అరగంటకు కానీ జరగదు. అక్కడ కూడా బాలకాండకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా... సీతారాముల వివాహఘట్టానికి, ఆపైన అరణ్యవాసానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా రావణుడు, శూర్పణఖ కథకు ప్రాధాన్యం ఇచ్చాడు తప్ప... సీతారాముల అనుబంధానికి పెద్దంత చోటు దక్కనివ్వలేదు. దాంతో వెండితెరపై రామాయణాన్ని చూద్దామని వచ్చిన వారికి కాస్తంత నిరాశ ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఏదేమైనా... సర్వజనులకు తెలిసిన రామాయణాన్ని ధైర్యంగా మరోసారి వెండితెరపై భారీ బడ్జెట్‌తో ఆవిష్కరించాలనే సాహసం చేసిన దర్శక నిర్మాతలను అభినందించి తీరాలి.
Above Average
Ramayana movie part 1 review
ప్రేక్షకులకు తెలిసిన కథతో సినిమా తీయడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. అందులోనూ భారతీయులు దైవంగా కొలిచే శ్రీరామునిపై, 'రామాయణం' మీద సినిమా తీయడం అంటే సవాలే. కొంచెం తప్పు జరిగినా సరే చీల్చి చెండాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకు ప్రభాస్ 'ఆదిపురుష్' ఓ ఉదాహరణ. ఈ తరుణంలో 'రామాయణ' అంటూ వచ్చారు దర్శక నిర్మాతలు...
ప్రేక్షకులకు తెలిసిన కథతో సినిమా తీయడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. అందులోనూ భారతీయులు దైవంగా కొలిచే శ్రీరామునిపై, 'రామాయణం' మీద సినిమా తీయడం అంటే సవాలే. కొంచెం తప్పు జరిగినా సరే చీల్చి చెండాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకు ప్రభాస్ 'ఆదిపురుష్' ఓ ఉదాహరణ. ఈ తరుణంలో 'రామాయణ' అంటూ వచ్చారు దర్శక నిర్మాతలు నితేష్ తివారి, నమిత్ మల్హోత్రా. అయితే రామాయణం గురించి పూర్తి అవగాహన ఉన్న ప్రేక్షకులకు తప్పులు కనిపించే అవకాశం లేకపోలేదు. తెలియని ప్రేక్షకులకు ఓ అద్భుత దృశ్యకావ్యంగా అనిపిస్తుంది.
టెక్నికల్ పరంగా 'రామాయణ' సినిమాను హై స్టాండర్డ్స్‌లో తీశారు. విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. ఐరావతం, జటాయువు సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. సీతారాములుగా సాయి పల్లవి, రణబీర్ కపూర్ ఒదిగిపోయారు. అయితే వాళ్ళిద్దరినీ డామినేట్ చేశారు రావణాసురునిగా నటించిన యష్. భారతీయులకు, ఈతరం సినిమా ప్రేక్షకులకు సైతం తెలిసిన కథను వెండితెరపై అద్భుత దృశ్య కావ్యంగా మలచడంలో దర్శక నిర్మాతలు నితేష్ తివారి, నమిత్ మల్హోత్రా, యష్ సక్సెస్ అయ్యారు. కథ, కథనంతో కంటే విజువల్స్‌తో మేజిక్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడంలో దర్శక నిర్మాతలతో పాటు నటీనటులు పడిన కృషి స్పష్టంగా తెలుస్తుంది. సంగీత పరంగా కొంచెం డిజప్పాయింట్ చేసిన చిత్రమిది. ఓవరాల్‌గా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
Above Average
Ramayana movie review
రామాయణం మన తెలుగువారికి చాలా బాగా తెలుసు. చిన్నప్పట్నుంచి రామాయణం వింటూ, రామాయణంపై వచ్చిన సినిమాలు, సీరియల్స్ చూస్తూ, కథలు చదువుతూ, వింటూ పెరిగాం. కథగా ఇదేమి కొత్త కాదు. కానీ ఈ `రామాయణం` మూవీని ఎలా చూపించారనేది ఇందులో ఆసక్తికరం. ఆడియెన్స్ ని ఎలా ఎంగేజ్ చేశారనేది ఇందులో మెయిన్. అలా చూస్తే ఈ సినిమాన...
రామాయణం మన తెలుగువారికి చాలా బాగా తెలుసు. చిన్నప్పట్నుంచి రామాయణం వింటూ, రామాయణంపై వచ్చిన సినిమాలు, సీరియల్స్ చూస్తూ, కథలు చదువుతూ, వింటూ పెరిగాం. కథగా ఇదేమి కొత్త కాదు. కానీ ఈ `రామాయణం` మూవీని ఎలా చూపించారనేది ఇందులో ఆసక్తికరం. ఆడియెన్స్ ని ఎలా ఎంగేజ్ చేశారనేది ఇందులో మెయిన్. అలా చూస్తే ఈ సినిమాని విజువల్ ట్రీట్‌గా ప్రజెంట్ చేశారు. సినిమాలో మెయిన్‌గా కథ ముందే తెలియడం, దీనికితోడు రాముడు గొప్పవాడు అని పదే పదే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కన్విన్సింగ్‌గా లేదు. ఆ సస్పెన్స్ ని నీరుగార్చినట్టుగా ఉంది. అలాగే రాముడు, సీత కలయికలోని డ్రామా కూడా తేలిపోయినట్టుగా ఉంది.
రామాయణం మన తెలుగు వారికి, ఇండియన్స్ కి తెలిసిన గాథ. దాన్ని ఎంత ఆకట్టుకునేలా తెరకెక్కిస్తారు, తీసుకెళ్తారు, ఎంత అలరించేలా నడిపిస్తారు, చూపిస్తారనేది ముఖ్యం. ఇందులో ఆ విషయంలో విజువల్ గ్రాండియర్ పరంగా ఎక్కువ ఫోకస్ కనిపించింది. దీనికితోడు ఇందులో కొన్ని కొత్త ఎలిమెంట్లని చూపించి ఫ్రెష్ ఫీలింగ్ తెప్పించారు. అదే సమయంలో ఎమోషన్స్ ని ఇంకా బాగా రాసుకోవాల్సింది. డ్రామాపై కూడా వర్క్ చేయాల్సింది. మెయిన్‌గా సస్సెన్స్ అంశాలు, వాహ్ ఫ్యాక్టర్స్ పై ఇంకా ఫోకస్ పెట్టాలి. అవి ఇందులో ఆశించిన స్థాయిలో లేవు. కానీ ఓవరాల్‌గా మాత్రం ఒక విజువల్ ట్రీట్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. కొంత వరకు ఆకట్టుకుంటుంది.
Above Average
Ramayana movie review
రామాయణ తెలిసిన కథనే అయినా విజువల్ గా మాత్రం ప్రతీ సీన్ గ్రాండియర్ కానీ టేకింగ్ కానీ ఎక్స్ లెంట్ లెవల్ లో మెప్పించాయి అని చెప్పాలి. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ క్వాలిటీ తగ్గినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా ఎక్కువ శాతం సినిమా విజువల్స్ ఆడియన్స్ ను మరో ప్రపంచంలో ఉన్నట్లు ఫీల్ అయ్యేలా చేస్తుంది. రాముడిగా రణ...
రామాయణ తెలిసిన కథనే అయినా విజువల్ గా మాత్రం ప్రతీ సీన్ గ్రాండియర్ కానీ టేకింగ్ కానీ ఎక్స్ లెంట్ లెవల్ లో మెప్పించాయి అని చెప్పాలి. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ క్వాలిటీ తగ్గినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా ఎక్కువ శాతం సినిమా విజువల్స్ ఆడియన్స్ ను మరో ప్రపంచంలో ఉన్నట్లు ఫీల్ అయ్యేలా చేస్తుంది. రాముడిగా రణబీర్ కపూర్ బాగా మెప్పించాడు. సీతగా సాయి పల్లవి ఆకట్టుకుంది. కానీ రావణాసురుడిగా యష్ మాత్రం ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఆ రోల్ కి తను తప్ప ఎవరూ చేయలేరు అనిపించేలా మెప్పించాడు యష్. సినిమాలో సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ అంచనాలను మించలేదు కానీ పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం స్లో నరేషన్ తో ఉంటుంది .
మోషన్స్ ను ఎక్కువగా చూపించాలి అనుకున్నారు కానీ తెలిసిన కథే అవ్వడంతో ఆ ఎమోషన్స్ మరీ అనుకున్న రేంజ్ లో పండలేదు. అలాగే ఆ సీన్స్ కొంచం డ్రాగ్ అయినట్లు కూడా అనిపించింది. కానీ ఎప్పటికప్పుడు విజువల్స్ ఎక్స్ లెంట్ గా ఉండటంతో, ఇలా డ్రాగ్ అయిన సీన్స్ ఉన్నా కూడా సినిమా ఓవరాల్ గా ఓ విజువల్ వండర్ నే చూసిన ఫీలింగ్ కలిగింది. సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా ఎక్స్ లెంట్ గా విజువల్ గా మెప్పించి సెకెండ్ పార్ట్ పై అంచనాలను పెంచింది. ఓవరాల్ గా సినిమా లెంత్ ఒక్కటి ఎక్కువ అవ్వడం మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అనుకున్న రేంజ్ లో లేకపోవడం లాంటివి డ్రా బ్యాక్స్ అయినా కూడా సినిమా మొత్తం విజువల్స్ అండ్ టేకింగ్ తో చివరి వరకు కూర్చోబెట్టి ఎంజాయ్ చేసేలా చేశారు.
Above Average
Ramayana movie review
అయితే ఈ సినిమాలో మాత్రం ఇలా రావణుడి నుంచి కథ మొదలు పెట్టి.. సరిగ్గా సీతాపహరణంతో కథని ఆపారు. అంటే ఈ పార్ట్‌లో సీతాపహరణం వరకూ మాత్రమే ఉంటుందన్నమాట. మిగిలిన కథని రెండవ పార్ట్‌లో చూపిస్తారు. నిజానికి ఈ రామాయణం సినిమాపై చాలానే వివాదాలు చుట్టుముట్టాయి. రావణుడిపై సాయిపల్లవి, రెహమాన్ లాంటి వ్యక్తులు చేసిన క...
అయితే ఈ సినిమాలో మాత్రం ఇలా రావణుడి నుంచి కథ మొదలు పెట్టి.. సరిగ్గా సీతాపహరణంతో కథని ఆపారు. అంటే ఈ పార్ట్‌లో సీతాపహరణం వరకూ మాత్రమే ఉంటుందన్నమాట. మిగిలిన కథని రెండవ పార్ట్‌లో చూపిస్తారు. నిజానికి ఈ రామాయణం సినిమాపై చాలానే వివాదాలు చుట్టుముట్టాయి. రావణుడిపై సాయిపల్లవి, రెహమాన్ లాంటి వ్యక్తులు చేసిన కామెంట్లపై చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. అలానే యానిమల్ లాంటి సినిమాలు చేసిన రణబీర్ కపూర్ రాముడిగా ఎలా నటిస్తాడనేది అందరూ ఉత్కంఠగా చూశారు. అయితే సినిమా చూస్తున్నంతసేపు మాత్రం ఎక్కడా రణబీర్ కపూర్ కనిపించలేదు. అంతలా మనల్ని కథలో లీనమయ్యేలా చేసిన క్రెడిట్ మాత్రం నితీష్ తివారీకే దక్కుతుంది.
రావణుడి అధికార దాహం, ఆకలి, కోపం, క్రోథం, ఆవేశం, దర్పం, ఠీవి, రూపం ఇలా అన్నీ తన ముఖంలో కనిపించేలా అయితే యష్ న్యాయం చేశాడు. అయితే ఇక్కడ కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకొని సీతతో కూడా కొన్ని యాక్షన్ సీన్లు చేయించారు. సినిమాని ఈ స్థాయిలో నిలబెట్టింది మాత్రం రెండే రెండు విషయాలు. ఒకటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇక రామాయణాన్ని జెన్ జీకి దగ్గరయ్యేందుకు వాడిన సాంకేతికత, AI వాడకం కూడా సినిమాకి, చూపించిన కథకి బలాన్ని ఇచ్చింది. ఓవరాల్‌గా చెప్పాలంటే రామాయణం.. ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.. చూస్తే బావుండు అనిపిస్తుంది. కనుక ఆ కథకి ఇబ్బంది కలగకుండా రామాయణాన్ని ఇప్పుడున్న టెక్నాలజీతో కలిసి ఒక దృశ్య కావ్యంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో అయితే వీళ్లు ఫెయిల్ అవ్వలేదు. పార్ట్ 2 కోసం ఎదురుచూసేలా చేయడంలో అయితే టీమ్ సక్సెస్ అయింది. కనుక పిల్లలతో, ఫ్యామిలీతో కలిసి మరోసారి రామాయాణాన్ని మనసారా, కనులారా చూసి రండి.
Above Average
Ramayana part 1 movie review
నితీశ్ తివారీ, నమిత్ మల్హోత్రా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘రామాయణం పార్ట్ 1’ నేడు థియేటర్లలోకి వచ్చింది! రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే సినిమాలో విశ్వామిత్రుడు “బాలా-అతిబాలా” విద్యల గురించి చెప్పిన సీన్ లేకపోవడం, రాముడు మానవుడైనప్ప...
నితీశ్ తివారీ, నమిత్ మల్హోత్రా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘రామాయణం పార్ట్ 1’ నేడు థియేటర్లలోకి వచ్చింది! రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే సినిమాలో విశ్వామిత్రుడు “బాలా-అతిబాలా” విద్యల గురించి చెప్పిన సీన్ లేకపోవడం, రాముడు మానవుడైనప్పటికీ కొండలు దూకేస్తూ, చెట్లు ఎక్కేస్తూ, గ్రద్ద కాలు పట్టుకుని వేలాడుతూ ఆకాశంలో ఎగిరేస్తూ చిత్ర విచిత్ర వానర విన్యాసాలు చేయించడం వంటి చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, 3Dలో చూస్తే ఇదొక నెక్స్ట్ లెవెల్ థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది.
(VFX), ఏ.ఆర్. రెహమాన్ - హాన్స్ జిమ్మర్ బీజీఎం, జటాయువు ఫైట్ సీన్లు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ఏ పాత్ర గౌరవాన్ని తగ్గించకుండా జెన్-జీ (Gen-Z) ఆడియన్స్‌ని ఆకట్టుకునే మేకింగ్ వర్కౌట్ అయింది. అయితే ఇందులో ఉన్న ఒక్కటే మైనస్ ఏమిటంటే.. హనుమాన్ సాక్షాత్కారం రెండో భాగంలోనే ఉండబోతోంది. 2027 దీపావళి అనుకున్నా, 2028కి గానీ రాదని టాక్ ఉండటంతో రెండో పార్ట్ కోసం చాలా కాలం వెయిట్ చేయక తప్పదు.
Above Average
Ramayana Movie part 1 review
ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్‌గా తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. టెక్నికల్ క్వాలిటీ, బాక్సాఫీస్ పొటెన్షియల్ అంచనా వేస్తే ఈ చిత్రం ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో ఇప్పుడు విశ్లేషిద్దాం. 3 గంటల 15 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్నప్ప...
ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్‌గా తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. టెక్నికల్ క్వాలిటీ, బాక్సాఫీస్ పొటెన్షియల్ అంచనా వేస్తే ఈ చిత్రం ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో ఇప్పుడు విశ్లేషిద్దాం.
3 గంటల 15 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, రావణాసురుడి ఇతివృత్తం, రాముడి జననం, సీతా స్వయంవరం మరియు జటాయువు ఎపిసోడ్ వరకు కథనాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్‌గా నడిపించడంలో దర్శకుడు విజయం సాధించారు. నటీనటుల్లో రాముడిగా రణ్‌బీర్ కపూర్ సటిల్ పెర్ఫార్మెన్స్, సీతగా సాయి పల్లవి క్లాసిక్ నటన, మరియు రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
సాంకేతికంగా DNEG స్టూడియోస్ అందించిన వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్, జటాయువు పోరాట సన్నివేశాలు హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోవు. దీనికి ఏ.ఆర్. రెహమాన్ మరియు హాన్స్ జిమ్మర్ అందించిన వరల్డ్-క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. మొదటి భాగంలో హనుమంతుడి పాత్ర లేకపోవడం చిన్న లోపమే అయినప్పటికీ, పార్ట్-2 కోసం వేసిన బేస్‌మెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది.
Above Average
Ramayana movie part 1 review
రామాయణం మూవీ రివ్యూ ఎలా ఉంది అంటే విజువల్లీ చాలా బాగుంది. ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ కనెక్ట్ ఎంత ఉందిరా అంటే అక్కడే తేడా కొట్టేసింది అనిపించింది. సో మిడ్ అని చెప్తాను అంతే. ఈ సినిమా ఏంట్రా అంటే రామాయణం అనేది మనం చిన్నప్పటి నుంచి చాలా విని ఉంటాం, చాలా వెర్షన్స్ చూసి ఉంటాం, సీరియల్ లో చూసి ఉంటాం, కార్టూ...
రామాయణం మూవీ రివ్యూ ఎలా ఉంది అంటే విజువల్లీ చాలా బాగుంది. ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ కనెక్ట్ ఎంత ఉందిరా అంటే అక్కడే తేడా కొట్టేసింది అనిపించింది. సో మిడ్ అని చెప్తాను అంతే. ఈ సినిమా ఏంట్రా అంటే రామాయణం అనేది మనం చిన్నప్పటి నుంచి చాలా విని ఉంటాం, చాలా వెర్షన్స్ చూసి ఉంటాం, సీరియల్ లో చూసి ఉంటాం, కార్టూన్స్ లో వచ్చింది. అయితే ముందుగా ఈ సినిమాలో ఎవరైతే ఆంటాగనిస్టులు ఉంటారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకా విచ్చలవిడిగా చేసి బాగా చేశారు అనిపించింది. ఎవరైతే దైవత్వం, డివినిటీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయో దాంట్లో ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం వల్లో లేకపోతే యాక్టింగ్ చేసి నాకు కొంచెం గట్టిగా నవ్వినా ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఏదైనా చూపించిన ఆ అది పోతుందేమో అలా చేయకండి సార్ అన్నట్టు ఎవరైనా చెప్పినట్టు అలానే బొమ్మల్లా ఉన్నారు ఆల్మోస్ట్.
రణబీర్ కపూర్ వెరీ గుడ్ యాక్టర్ వేరే సినిమాలు చాలా బాగా చేశారు. సాయి పల్లవి గారు కూడా అంతే వెరీ గుడ్ యాక్టర్స్ చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో ఏదో కొడుతుంది సీనా అన్నట్టే ఉన్నారు ఇద్దరు. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా నాకు అంత వర్కౌట్ అయినట్టు అనిపియలేదు అండ్ స్పెషల్లీ సాయి పల్లవి గారు నాకు కొంచెం మిస్ కాస్టెడ్ అనిపించారు. బట్ యష్ గారు రావణుడిగా జీవించేసారు. అండ్ కొన్ని బ్యాక్ స్టోరీస్ ని జనాలకి తెలీనివి కూడా బాగా చూపించారు. అండ్ నేను కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఎంతూజియాస్టిక్ గా నేను చూసేది ఏంటంటే హనుమంతుల వారి పార్ట్. ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు ఆయన బ్యాక్ స్టోరీ మన మొత్తం ఆ సేన ఉంటారు కదా వానర సేన ఆ జోన్ అంతా నాకు చాలా ఇష్టం. ఇందులో అసలు టచ్ కూడా చేయరు.
అండ్ చాలా సినిమాల్లో రాముడిది, రావణాసురుడిది, హనుమంతుల వారిది ముగ్గురిది పారలల్ గా, ముగ్గురికి క్రేజీ బ్యాక్ స్టోరీలు ఉంటాయి. ముగ్గురికి ఒక స్టోరీ ఉంటది చిన్నప్పటి నుంచి ఎలా త్రీ డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్ లా పారలల్ గా చూపించుకుంటూ అలా సంథింగ్ ఇలానే చేయాలని అనట్లేదు. సంథింగ్ న్యూ, సంథింగ్ మోర్ ఎంగేజింగ్ గా తీసుంటే బాగుండేది అనిపించింది. నాకైతే ఎట్ టైమ్స్ ఇంకా కానివ్వండిరా అన్నట్టు అయితే అనిపించింది. ఫైనల్ గా ఒకే ఒకే.. మరి మీరు చూడండి సినిమా, చూసాక ఎలా ఉందో కింద రాయండి.
Above Average
Ramayana movie review
రామాయణం - 2.75/5అందరికీ తెలిసిన పురాణ గాథనుఈ తరం యంగ్ జనరేషన్ కోసం మళ్లీ తీసినట్టుంది.అద్భుతమైన స్టోరీ బోర్డ్ విజువల్స్, రావణుడి పాత్ర,జటాయువుపు యుద్ధం, కుంభకర్ణుడి ఎపిసోడ్ ప్లస్ పాయింట్లు.రణబీర్ కపూర్ ఓకే, యశ్ సూపర్, సాయి పల్లవి మైనస్.ఫస్ట్ పార్ట్ ఆపిన తీరు అసంతృప్తి మిగులుస్తుంది.ఎపిసోడ్స్ మీద దృష...
రామాయణం - 2.75/5
అందరికీ తెలిసిన పురాణ గాథను
ఈ తరం యంగ్ జనరేషన్ కోసం మళ్లీ తీసినట్టుంది.
అద్భుతమైన స్టోరీ బోర్డ్ విజువల్స్, రావణుడి పాత్ర,
జటాయువుపు యుద్ధం, కుంభకర్ణుడి ఎపిసోడ్ ప్లస్ పాయింట్లు.
రణబీర్ కపూర్ ఓకే, యశ్ సూపర్, సాయి పల్లవి మైనస్.
ఫస్ట్ పార్ట్ ఆపిన తీరు అసంతృప్తి మిగులుస్తుంది.
ఎపిసోడ్స్ మీద దృష్టి పెట్టి, గ్లామర్ పాత్రలను ఇంకా బాగా
డిజైన్ చేసి వుండాల్సింది.
జెన్ జీ లు చూసేలా, చూపించేలా ఉంది అంతవరకే...
పంచ్ లైన్ - వాళ్ళ దృష్టి రామాయణం
Above Average
Ramayana Movie review
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేసింది! దాదాపు 3 గంటల 15 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మేకర్స్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. కథ రా...
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేసింది! దాదాపు 3 గంటల 15 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మేకర్స్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.
కథ రావణాసురుడి ఇతివృత్తంతో ప్రారంభమై, రాముడి జననం, సీతా స్వయంవరం, వనవాసం, జటాయువు పోరాటం వరకు మొదటి భాగంలో చాలా ఆసక్తికరంగా నడిపించారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్ సటిల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ రచ్చ లేపాడు, ఆ రోల్‌లో ఆయనను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం!
సాంకేతికంగా ఈ సినిమా హాలీవుడ్ స్థాయిని తలపించింది. DNEG స్టూడియోస్ అందించిన టాప్-నాచ్ VFX, ముఖ్యంగా జటాయువు యుద్ధం, రాక్షసులతో ఫైట్ సీన్లు థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. వీటికి ఏ.ఆర్. రెహమాన్ అండ్ హాన్స్ జిమ్మర్ అందించిన మైండ్ బ్లోయింగ్ BGM తోడై మైండ్ బ్లాంక్ చేస్తుంది. మొదటి భాగంలో హనుమంతుడి ఎంట్రీ లేకపోవడం చిన్న వెలితే (పోస్ట్ క్రెడిట్స్‌లో హింట్ ఇచ్చారు). సెకండ్ పార్ట్ కోసం వేసిన ఈ సాలిడ్ బేస్‌మెంట్ తప్పక చూడాల్సిందే!
Hit
Ramayana movie part 1 movie review
తెలుగు సినిమా తెరపైన రామాయణం కథను ఎన్నో రకాలుగా చూసి ఉంటాం. కానీ తెలుగులో వచ్చిన రామాయణ కథలకు భిన్నంగా దర్శకుడు నితీష్ తివారీ ఎంచుకొన్న కథ, అనుసరించిన కథనాలు కొత్తగా ఉండటంతో ఈ సినిమా చూస్తున్నంత సేపు డిఫరెంట్ రామాయణం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దేవతలు, రాక్షసుల యుద్ధం, రావణాసురుడి పరిచయం ఈ సినిమాక...
తెలుగు సినిమా తెరపైన రామాయణం కథను ఎన్నో రకాలుగా చూసి ఉంటాం. కానీ తెలుగులో వచ్చిన రామాయణ కథలకు భిన్నంగా దర్శకుడు నితీష్ తివారీ ఎంచుకొన్న కథ, అనుసరించిన కథనాలు కొత్తగా ఉండటంతో ఈ సినిమా చూస్తున్నంత సేపు డిఫరెంట్ రామాయణం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దేవతలు, రాక్షసుల యుద్ధం, రావణాసురుడి పరిచయం ఈ సినిమాకు హైలెట్‌గా మారడమే కాకుండా.. టేకాఫ్ బ్రహ్మండంగా సాగిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. తెలుగు తెర మీద ఇలాంటి సన్నివేశం చూసి ఉండకపోవడం వల్ల థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఈ రామాయణ కథలో చూపించిన తీరు కొత్తగా ఉంటుంది. ఇక జటాయువుతో రావణుడి ఫైట్ ఈ సినిమాకు మరో హైలెట్‌గా నిలిచింది.
ఓవరాల్‌గా దర్శకుడిగా నితీష్ తివారీ తన మార్కు రామాయణాన్ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడమే కాకుండా పాతతరం ప్రేక్షకులను మెప్పిస్తూ.. కొత్తతరం ఆడియెన్స్‌కు థ్రిల్‌గా మార్చేలా సినిమాను రూపొందించడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రామాయణం కథలను ఇప్పటి వరకు ఎన్నో వెర్షన్లు చూసి ఉంటాం. నితీష్ తివారీ రామాయణం డెఫినెట్‌గా డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. తెలుగు తెర మీద, ఇతర భాషల్లో రూపొందిన రామాయణంలో చూపించని ఎన్నో అంశాలు కొత్తగా ఉన్నాయి. నితీష్ వర్క్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఈ సినిమా మస్ట్ వాచ్ మూవీ. మంచి అనుభూతిని పొందాలనుకొనే వారు తప్పకుండా చూడాలని సలహా ఇస్తున్నాం.
Hit
Ramayana movie review
దర్శకుడు నితీష్ తివారి రామాయణ చిత్రాన్ని కేవలం మన కోసమే కాకుండా, ప్రపంచ స్థాయిలో అందరికీ అర్థమయ్యేలా ఒక గ్లోబల్ ప్రాజెక్ట్‌గా డిజైన్ చేశాడు. వాల్మీకి రాసిన మూల కథను తీసుకుని, దానిలోని ప్రతి చిన్న విషయాన్ని చాలా వివరంగా, సులభంగా కనెక్ట్ అయ్యే రీతిలో స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. రామాయణాన్ని కేవలం ఒక...
దర్శకుడు నితీష్ తివారి రామాయణ చిత్రాన్ని కేవలం మన కోసమే కాకుండా, ప్రపంచ స్థాయిలో అందరికీ అర్థమయ్యేలా ఒక గ్లోబల్ ప్రాజెక్ట్‌గా డిజైన్ చేశాడు. వాల్మీకి రాసిన మూల కథను తీసుకుని, దానిలోని ప్రతి చిన్న విషయాన్ని చాలా వివరంగా, సులభంగా కనెక్ట్ అయ్యే రీతిలో స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. రామాయణాన్ని కేవలం ఒక పాత పురాణంగా కాకుండా, ధర్మానికి అధర్మానికి, జాలికి అహంకారానికి మధ్య జరిగే ఒక మహా యుద్ధంగా మార్చి చూపించిన విధానం కట్టిపడేస్తుంది. ఈ ఇతిహాసం సులభంగా అర్థం కావాలనే ఉద్దేశ్యంతో ప్రతీ పాయింట్ ను చాలా క్లియర్‌గా వివరిస్తూ కథను నడిపించాడు. స్క్రీన్ ప్లే లో రాముడు, రావణుడి పాత్రలను పూర్తిగా రెండు భిన్నమైన కోణాలుగా చూపించిన తీరు అద్భుతంగా కుదిరింది.
గాల్లో ఎగిరే ఏనుగులు, పరిగెత్తే ఖడ్గమృగాలు, రూపాలు మార్చుకునే రాక్షసులు లాంటి ఎలిమెంట్స్‌తో అడుగడుగునా ప్రేక్షకులను ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సీతాపహరణం తర్వాత వచ్చే ఎపిసోడ్స్, హనుమంతుడి ఎంట్రీకి ముందు జరిగే పరిణామాల వరకు మొదటి భాగాన్ని చాలా ఉత్కంఠభరితంగా డిజైన్ చేశాడు. అయితే కథనంలో ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పటికీ కొన్ని నెగెటివ్స్ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. సినిమా మొత్తం అబ్బురపరిచే గ్రాఫిక్స్, భారీ విజువల్స్ చుట్టూ తిరగడం వల్ల, రామాయణంలో ఉండాల్సిన అసలైన ఎమోషన్ కొన్ని చోట్ల మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. స్టోరీ అంతా ఒక స్మూత్ ఫ్లోలో కాకుండా, కేవలం కొన్ని భారీ ఎపిసోడ్స్‌ను ఒకదాని తర్వాత ఒకటిగా అతికించినట్లు సాగుతుంది. కొన్ని క్యారెక్టర్స్‌తో మనం ఎమోషనల్‌గా పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వలేము. విజువల్ ఎఫెక్ట్స్ చాలా వరకు బాగున్నప్పటికీ, ఇంకాస్త బెటర్‌గా ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది. ఈ సినిమా కోసం దర్శకుడు నితీష్ తివారి చేసిన రీసెర్చ్, ఆయన విజన్ ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. ఓవరాల్ గా రామాయణ.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సరికొత్త రామరావణ సంగ్రామం.
Hit
Ramayana part 1 Movie review
రామాయణ పార్ట్-1లో నేరుగా శ్రీరాముడు, రావణాసురుని మధ్య జరిగే మహా సంగ్రామానికి వెళ్లకుండా, పాత్రల స్వభావం, భావోద్వేగాలు, కథా పునాదిని బలంగా స్థాపించడంపై డైరెక్టర్ దృష్టి పెట్టారు. అయోధ్య రాజకుమారుడిగా శ్రీరాముడి ప్రారంభ జీవితం, విశ్వామిత్రునితో ప్రయాణం, మిథిలా నగరంలో శివధనస్సును ఎత్తి సీతాదేవిని పరిణయ...
రామాయణ పార్ట్-1లో నేరుగా శ్రీరాముడు, రావణాసురుని మధ్య జరిగే మహా సంగ్రామానికి వెళ్లకుండా, పాత్రల స్వభావం, భావోద్వేగాలు, కథా పునాదిని బలంగా స్థాపించడంపై డైరెక్టర్ దృష్టి పెట్టారు. అయోధ్య రాజకుమారుడిగా శ్రీరాముడి ప్రారంభ జీవితం, విశ్వామిత్రునితో ప్రయాణం, మిథిలా నగరంలో శివధనస్సును ఎత్తి సీతాదేవిని పరిణయమాడటం వంటి ఘట్టాలతో స్టోరీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 14 సంవత్సరాల అరణ్యవాసం సీతాదేవి, లక్ష్మణుడు సహా అడవికి పయనం కావడం, శూర్పణఖ ఘట్టం, మారీచుని స్వర్ణ లేడి ఉదంతం, రావణాసురుడు సీతను అపహరించే కీలక సన్నివేశాలతో మొదటి భాగాన్ని ముగించి సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలను పెంచారు.
శ్రీరాముడిగా రణబీర్ కపూర్ అత్యంత వినయం, ధర్మబద్ధత, శాంత స్వరూపాన్ని అద్భుతంగా పండించారు. సీతాదేవిగా సాయి పల్లవి తన సహజ నటన, రాజసం, ఆత్మస్థైర్యంతో మెప్పించారు. ఇక రావణాసురుడిగా నటించిన రాకింగ్ స్టార్ యష్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మొత్తంగా చూస్తే రామాయణ పార్ట్-1 అనేది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు.. వెండితెరపై ఆవిష్కృతమైన ఓ విజువల్ వండర్. శ్రీరాముడు, రావణాసురుని మధ్య రాబోయే మహా యుద్ధానికి ఇది బలమైన పునాది వేసింది. ముఖ్యంగా అద్భుతమైన విజువల్స్, నటీనటుల అత్యుత్తమ ప్రదర్శన, సంగీతం కోసం ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
Average
Ramayana Movie review
#Ramayana A Watchable Epic That Prioritizes Spectacle and Action Over Drama and Emotion!The film opens superbly with Ravana’s introduction, and the first half offers a decent experience overall despite a few dips here and there. But instead of giving enough weight and properly introducing the rest o...
#Ramayana A Watchable Epic That Prioritizes Spectacle and Action Over Drama and Emotion!
The film opens superbly with Ravana’s introduction, and the first half offers a decent experience overall despite a few dips here and there. But instead of giving enough weight and properly introducing the rest of characters, the narration moves from one event to another, making the drama feel flat and even serial like at times. The second half is where it starts to falter, with very prolonged action sequences becoming tiring before the climax briefly picks up momentum again. Even where Part 1 chooses to end feels somewhat unsatisfying, especially knowing that most of the major high points are being saved for a sequel that is still two years away.
Yash is easily the biggest highlight and delivers a terrific performance as Ravana. Ranbir Kapoor and Sai Pallavi are sincere as Ram and Sita, but the divine and emotional connect never comes through consistently. Technically, the film is impressive, but Ramayana needs more than scale. AR Rahman and Hans Zimmer’s score is the biggest disappointment and often feels more like a generic superhero score than something that captures the story’s spiritual essence.
Better than a few recent adaptations and definitely watchable with expectations in check, but the ambition never fully translates into lasting impact. A mixed bag that leaves you thinking about how much more it could’ve been.
Rating: 2.5/5
Public Reviews
1 Avg: 6.0/10Above Average
Ramayana movie part 1 review
జస్ట్ ఇప్పుడే రామాయణ ఫస్ట్ పార్ట్ చూసొచ్చాను... సినిమా నాకైతే ఒకే ఒకే పర్లేదు అనిపించింది. ఏమాటకామాట... రామాయణ, మహాభారత ఇతిహాసాల గురించి చెప్పాలంటే మన తెలుగు వాళ్ళ తర్వాతే ఎవరైనా... మన ఆడియన్స్ కూడా అంత ఆదరిస్తారు ఆ సినిమాలని. కంటెంట్ నచ్చిందంటే... భాషా భేదం లేకుండా అన్ని సినిమాలని ఆదరిస్తారు కూడా.....
జస్ట్ ఇప్పుడే రామాయణ ఫస్ట్ పార్ట్ చూసొచ్చాను... సినిమా నాకైతే ఒకే ఒకే పర్లేదు అనిపించింది. ఏమాటకామాట... రామాయణ, మహాభారత ఇతిహాసాల గురించి చెప్పాలంటే మన తెలుగు వాళ్ళ తర్వాతే ఎవరైనా... మన ఆడియన్స్ కూడా అంత ఆదరిస్తారు ఆ సినిమాలని. కంటెంట్ నచ్చిందంటే... భాషా భేదం లేకుండా అన్ని సినిమాలని ఆదరిస్తారు కూడా.. కానీ ఇలాంటి కాన్సెప్ట్ ని కొంచెం తేడాగా చూపించినా, ప్రేక్షకులు దారుణంగా తిరస్కరిస్తారు. లాస్ట్ టైం ఆదిపురుష్ కి ఎలా జరిగిందో చూసాను కదా..
అండ్ ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే.. నాకు ట్రైలర్ చూసి ఎక్కడ చెడగొడతారేమో అనిపించింది కానీ... మరీ కథను మార్చకుండా.. డీసెంట్ గానే ఈ జెనరేషన్ ఆడియన్స్ కి తగ్గట్టు చుపించారనిపించింది. అండ్ రణబీర్ రాముడిగా బాగానే ఇంప్రెస్ చేసారు. బట్ సీతగా సాయి పల్లవి రాంగ్ చాయిస్ అనిపించింది. అండ్ రావణుడిగా యష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా బాగానే చేసారు.
విజువల్లీ మాత్రం సినిమా సాలిడ్ గా ఉంది. నాకు మాత్రం జటాయువు - రవాణ యాక్షన్ సీక్వెన్స్ బాగా నచ్చింది. డిస్సపాయింట్మెంట్ ఏంటంటే నా ఫేవరేట్ గాడ్ హనుమాన్ ని ఈ పార్ట్ లో చూపించలేదు. సెకండ్ పార్ట్ లోనే చూడాలట. ఓవరాల్ గా సినిమా అయితే ఒకసారి పక్కాగా చూడొచ్చు.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... వాల్మీకి రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా జరిగే ఈ కథలో ముందుగా రావణుడి పరిశయంతోనే కథను మొదలుపెట్టారు. లంక లోని రాక్షసుల సామ్రాజ్యాన్ని ఇంద్రుడు (కునాల్ కపూర్) దేవతల సహకారంతో భీకర యుద్ధం చేసి సొంతం చేసుకొని, లంక బాధ్యతను కుబేరునికి అప్పగిస్తాడు. రావణుడు (యష్) తల్లి కైకసి (శోభన) తన కొడుకును బ్రహ్మ అనుగ్రహంతో తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుని అసుర జాతిని కాపాడమని చెప్తుంది. ఈ క్రమంలో ఘోర తపస్సు చేసి రావణుడు బ్రహ్మ నుంచి వరాలు సొంతం చేసుకుంటాడు. ఆ తర్వాత అనేక రాజులను, సహా ఇంద్రుడుని కూడా ఓడిస్తాడు. ఈ క్రమంలో ఇంద్రుడు విష్ణు మూర్తిని శరణు వేడితే, అయోధ్యలో రాముడు (రణబీర్ కపూర్) జన్మించాక రావణుడి పతనం మొదలవుతుందని అభయమిస్తారు. ఆ తర్వాత రాముని జననం, పట్టాభిషేకం, సీత (సాయి పల్లవి) తో వివాహం, దశరథుడి మరణం తర్వాత సోదరుడు లక్ష్మణుడు (రవి దూబే)తో 14 ఏళ్ళ వనవాసానికి వెళ్తారు. అక్కడ సూర్పనఖ ఘట్టం తర్వాత సీతా అపహరణ జరుగుతుంది. దానికి కారణం ఏంటి? నిస్సహాయతలో ఉన్న రాముడు అక్కడినుండి ఎదుర్కున్న సంఘటనలు ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
దేశం గర్వించదగ్గ రామాయణ ఇతిహాస చరిత్రను సినిమా రూపంలో చుపించాలనుకోవడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ కథకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కంటెంట్ ఆడియన్స్ కి నచ్చే విధంగా తీస్తే జనాలు ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. రామాయణాన్ని కొత్తగా నచ్చే విధంగా ఎన్నిసార్లు తీసినా ఆడియన్స్ ఆదరిస్తారు. ఇక ఇప్పుడొచ్చిన రామాయణాన్ని దర్శకుడు నితీష్ తివారి ఈ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. తెలిసిన సన్నివేశాలే అయినా, ప్రతి ఫ్రేమ్ ని, ప్రతి సీన్ ని చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు. పైగా కొన్ని ఈ తరం ఆడియన్స్ కి తెలియని సన్నివేశాలను ఘట్టాలను మరింత డిటైలింగ్ గా చూపించారు. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. సినిమాలో చూపించే ఆ గ్రాండ్ విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ మంచి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో రావణ - జటాయువు సీక్వెన్స్ హైలెట్ గానిలిచాయి .
ఇక రణబీర్ కపూర్ రాముడిగా ఆ పాత్రలోని తేజస్సు, వినయ విధేయతలను తన అభినయంతో అద్భుతంగా ఆవిష్కరించాడు. అలాగే సాయి పల్లవి సీత పాత్రలో ఒదిగిపోయింది. ఇద్దరి జంట కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. ఇక రావణ పాత్రలో యష్ జీవించేసాడు. ఫ్యాన్స్ ఆ రోల్ లో చూసి ససప్రైజ్ అవడం ఖాయం. అలాగే ఆ పాత్రలోని ఆహార్యం, విభిన్నమైన షేడ్స్ లో మెస్మరైజ్ చేసాడు. అలాగే లక్ష్మణుడిగా రవి దూబే, వివేక్ ఓబెరాయ్, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ వాళ్ళ పాత్రల్లో బాగా నటించి మెప్పించారు. కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకి దాదాపు బాగా సెట్ అయ్యారు.
Minus Points :
ఈ సినిమా కాన్సెప్ట్ ని ఎంత బాగా విడమరిచినా ఇంట్రెస్టింగ్ గా మలిచే సన్నివేశాలు ఎన్నైనా రాసుకోవచ్చు. కానీ ఈ చిత్రాన్ని భాగాలుగా విభజించి ప్లాన్ చేసుకున్న క్రమంలో పార్ట్ 2 కి కావాల్సిన డ్రామాని పార్ట్ 1 సెకండాఫ్ లో మరికాస్త ఎంగేజింగ్ గా మలచాల్సింది. ముగింపు ఇచ్చిన విధానం కూడా ఇంప్రెసివ్ గా లేదు. సినిమాకి విజువల్స్ పరంగా బడ్జెట్ బాగానే పెట్టారు. కానీ నిజానికి అంత బడ్జెట్ అస్సలు అవసరం లేదనిపించింది. 1000 కోట్లలో అద్భుతంగా తీసే సినిమాను అనవసరంగా 4000 కోట్లు పెట్టారనిపించింది. అది కూడా కన్ఫర్మ్ తెలీదు. బట్ విజువల్ ట్రీట్ పరంగా ఎక్కడా సినిమా డిస్సపాయింట్ చేయదు. అండ్ రాక్షసుల VFX అయితే వరస్ట్ గా ఉంది. ముఖ్యంగా హెవీ బాడీ ఉన్న కొంతమంది పాత్రలు ఆనిమేటెడ్ ని పోలి ఉన్నాయి. అలాగే సెకండ్ హాఫ్ మరీ స్లో గా ఉంది. ఇక చాలా చోట్ల AI తో చేసినట్లు లిప్ సింక్ అనిపించింది. అన్నిటికి మించి పలు పాత్రలలో సహజత్వం లోపించింది. సీత పాత్రలో సాయి పల్లవి సెట్ అయినట్టు అనిపించలేదు.
Technical Values :
టెక్నికల్ గా చూసుకుంటే రామాయణం సినిమాకి భారీగానే ఖర్చుపెట్టారు. ఎక్కడా మేకింగ్ క్వాలిటీలో తగ్గకుండా, అన్ని విభాగాల్లో టాప్ క్వాలిటీని మెయింటైన్ చేసారు. స్క్రీన్ పై ఆ విజువల్స్ చూస్తుంటే ప్రొడ్యూసర్స్ పెట్టిన ప్రతి పైసా కనిపిస్తుంది. సినిమాకి VFX బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇక రెహమాన్ సంగీతం పర్లేదు. బీజీఎమ్ మాత్రం అదిరిపోయింది. అలాగే కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ నితీష్ తివారి సినిమాలో సోల్ ని దెబ్బ తీయకుండా మంచి ఎమోషన్స్ ని పండించారు. కాకపోతే మరింత స్ట్రాంగ్ గా ఉండాల్సింది. ఇక యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. అలాగే ఆ గ్రాండియర్ విజువల్స్ తో కూడిన స్క్రీన్ ప్లే ను బాగా రాసుకున్నారు. ఆడియన్స్ కి తెలియని రామాయణంలోని కొన్ని విషయాలను ఈ జెనరేషన్ వాళ్ళకి బాగా చూపించారు.
Final Review :
ఇక "రామాయణ" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మైథలాజికల్ ఇతిహాస గాథ.. ఆడియన్స్ ని ఖచ్చితంగా మెప్పిస్తుందని చెప్పాలి. అద్భుతమైన విజువల్స్, అండ్ యాక్షన్ ఎలిమెంట్స్, తో పాటు హృద్యమైన కథనం, ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకి మంచి ఎస్సెట్. ఓవరాల్ గా ఒక అద్భుతమైన దృశ కావ్యంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ల పెర్ఫార్మన్స్, నితీష్ తివారి అద్భుతమైన కథనం, సహా గ్రాండియర్ విజువల్స్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. పౌరాణిక చిత్రాలు ఇష్టపడే వారికీ ఈ సినిమా ఐ ఫీస్ట్ అవుతుంది.