Register as a Reviewer
హైకూ (Haiku)

హైకూ (Haiku)

Upcoming Expected Release: 23 Oct 2026

Haiku : అమ్మాయిల కాలేజీలో ఒకే ఒక అబ్బాయి చదివితే..? ఈ అరవ కథ తెలుగోళ్ళకు కనెక్ట్ అవుతుందా?  త్వరలోనే మన ముందుకు..!

Director: Yuvaraj Chinnasamy
Cast: Aegan, Sri Devi, Femina George, Adirchi Arun, Subramanian Sethu, Adhiyaman, Mime Gopi, Indhumathi Manigandan

Available in:

About This Movie

కోలీవుడ్ నుండి ఈ మధ్య కాలేజ్ లవ్ స్టోరీస్ బాగా సక్సెస్ అవుతున్నాయి. ఆ మధ్య వచ్చిన డ్రాగన్, ఓహ్ మై లవ్, యూత్ సినిమాలు తెలుగులోనూ బాగా ఆడాయి. ఇప్పుడు మరో క్రేజీ కాన్సెప్ట్ తో ఓ సినిమా తెలుగులో రాబోతుంది. తమిళ్ హీరో ఏగన్ హీరోగా శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ "హైకూ". విజన్ సినిమా హౌస్ బ్యానర్‌ పై డా.డి.అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించగా, యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించారు. ఒక డిఫరెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి తాజాగా ట్రైలర్‌ విడుదల చేయగా, నెట్టింట మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

 

'హైకూ' అనే డిఫరెంట్ టైటిల్ తోనే ఆసక్తిని కనబరచగా, ఈ ట్రైలర్ ని గమనిస్తే... సినిమాలో హీరో అమ్మాయిల కాలేజ్‌ లో చదువుతున్నట్టు, ఆ కాలేజ్ లో ఒకే అబ్బాయి ఉండ దాని వల్ల అబ్బాయికి ఎదురయ్యే పరిస్థితులను చూపిస్తూ ట్రైలర్ ని ఎంటర్టైనింగ్ గా అలాగే ఎమోషన్స్ తో కట్ చేసారు. ఇక ట్రైలర్ లో లవ్ తో పాటు ఫ్రెండ్షిప్ సీన్స్ కూడా ఎలివేట్ చేయగా, ఎమోషనల్ లవ్ సీన్స్ కి తగ్గట్టు ఇచ్చిన బీజీఎమ్ హైలెట్ గా కనిపించింది ట్రైలర్ లో. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమాలో కాలేజ్ లైఫ్, జాబ్ లైఫ్ ని రెండు దశల్లో మేకర్స్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఇక ట్రైలర్ చివర్లో వచ్చే డైలాగ్ "ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు.. బాగా చూసుకోవాలి.. వన్స్ తను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయితే కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఉపయోగం ఉండదు" అంటూ వచ్చే డైలాగ్‌ తో సినిమా కాన్సెప్ట్ అర్ధమైపోతుంది. అయితే ఆ రేంజ్ లో సినిమాని ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ చేస్తారో థియేటర్లో చూడాలి. ఇక ఈ 'హైకూ' సినిమాను అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు మేకర్స్. మరి థియేటర్లో ఏ విధంగా తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి. 

Why MRO?