ఆకాశంలో ఒక తార (Aakasamlo Oka Tara)
Aakasamlo Oka Tara : ఆకాశానికి నిచ్చెన లాంటి అమ్ములు కల.. ఆ కలని కృష్ణ నిజం చేస్తాడా..? త్వరలోనే వచ్చేస్తున్నారు..!
About This Movie
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ "ఆకాశంలో ఒక తార". సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేసుకోగా, లేటెస్ట్ గా ఆకాశంలో ఒక తార సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తుంది. టీజర్ చాలా డీసెంట్ గా కూల్ గా ఉండి ఇట్టే అట్రాక్ట్ చేస్తుంది.
ఇక టీజర్ ని గమనిస్తే... టీజర్ లో "ఆమె కల.. అతడి నమ్మకం.. ఇది వారిద్దరి ప్రయాణం" అంటూ బ్యూటిఫుల్ లైన్స్ తో టీజర్ అంచనాలు పెంచేస్తుంది. ఇందులో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని కల్పన (సాత్విక).. చదువులో ఎంత ప్రతిభ చూపించినా ఆమెను ప్రోత్సహించేవారు లేకపోగా, పైగా కల్పన తన ఊరిని కూడా దాటలేదని అందరూ నిరుత్సాహ పరిస్తే, కల్పన మాత్రం ఏకంగా ఈ భూమి హద్దుల్ని దాటి ఆకాశాన్ని చేరుకుంటానని ఛాలెంజ్ చేస్తుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కూడా ఆమె కలల్ని పట్టించుకోకుండా పెళ్లి చేసేస్తే... ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవితంలోకి వచ్చిన కృష్ణ (దుల్కర్ సల్మాన్), తన కలల్ని అర్ధం చేసుకుని అండగా నిలుస్తాడు. మరి భర్త అండతో కల్పన తన కలను నిజం చేసుకుందా లేదా? అనేది సినిమా కథగా ఉండనుంది.
కథ పరంగా సింపుల్ గా ఉన్నప్పటికీ నేటి సమాజంలో మంచి మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. 'ఆకాశంలో ఒక తార' టైటిల్ తోనే మంచి క్లాసీ వైబ్ ని తీసుకొచ్చిన మేకర్స్ ఈ సినిమాతో మంచి మెసేజ్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అలాగే సాత్విక వీరవల్లికి మంచి డెబ్యు రోల్ దొరికినట్టు చెప్పొచ్చు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో, లైట్ బాక్స్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తుండగా, గుణ్ణం గంగరాజు రచయితగా పని చేస్తున్నారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 20న విడుదల చేయనున్నారు మేకర్స్. మరి టాలీవుడ్ లో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.