ఈNఈ (ENE Repeat)
ENE Repeat : సాలిడ్ కాంబో సీక్వెల్.. 8 ఏళ్లకు రిపీట్.. అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తారా? ఆడియన్స్ కి పిచ్చెకించడానికి వచ్చేస్తున్నారు..!
Available in:
About This Movie
తెలుగు మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో "ఈNఈ రిపీట్" మూవీ కూడా ఒకటి. టాలీవుడ్ లో 8 ఏళ్ల కిందట రిలీజ్ అయిన "ఈ నగరానికి ఏమైంది" సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించగా, యూత్ ఆడియన్స్ కి చాలా ఫెవరేట్ మూవీ, అండ్ ఈ జెనరేషన్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ అనుకోకుండా గోవాకి వెళ్లి అక్కడ ఏం చేశారనే చిన్న కాన్సెప్ట్ ని ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించి ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని వార్తలు వచ్చినా, పట్టాలెక్కడానికి ఇన్నేళ్లు పట్టింది. ఫైనల్ గా ఈ క్లాసిక్ "ఈ నగరానికి ఏమైంది" మూవీకి సీక్వెల్ గా "ఈNఈ రిపీట్" పేరుతో సినిమా రావడానికి రెడీ అయింది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుకోగా, తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లో ఉన్న నలుగురు ఫ్రెండ్స్ లో ఒకరు మాత్రం ఈ సినిమాలో రీప్లేస్ చేయబడ్డారు. ట్రైలర్ ని గమనిస్తే... ఓ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ప్లాన్ ఓ సినిమా ప్లాన్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో వాళ్లకు ఎదురయ్యే పరిస్థితులు, కొత్త వ్యక్తులు, అలాగే వాళ్ళ మధ్య జరిగే గొడవలు, అండ్ ఫన్ వీటన్నిటి మధ్య సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తారా లేదా? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్ గా తెరకెక్కిందని తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫి కూడా బాగా కుదిరింది.
ఇక పార్ట్ 1 లో ఉన్న విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కుకుమాను ఈ సీక్వెల్ లో కూడా మంచి ఫన్ జెనెరేట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అలాగే శ్రీనాథ్, శివాత్మిక రాజశేఖర్, జీవన్ ఇందులో కీ రోల్స్ లో నటించారు. పార్ట్ వన్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ట్రైలర్ లో వివేక్ సాగర్ అందించిన స్కోర్ మరోసారి ఈ సినిమాకి హైలైట్ గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను సందీప్ నాగిరెడ్డి, సృజన్ యెరబోలు నిర్మించగా, తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసాడు. ఈ "ఈNఈ repeat" సినిమాను నవంబర్ 19న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
You Might Also Like
సీన్ (SCENE)
2026
రామాయణ (Ramayana)
2026