రణబాలి (RanaBaali)
RANABAALI : శింగనమల బొబ్బిలి "రణబాలి"గా విజయ్ దేవరకొండ.. ఫ్రీడమ్ నేపథ్యంతో త్వరలోనే వస్తున్నాడు..!
About This Movie
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన రౌడీ బాయ్ "విజయ్ దేవరకొండ" హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "రణబాలి". రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ స్వాతంత్రోద్యమ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకు ముందు వీళ్ళ కాంబోలో వచ్చిన "టాక్సీవాలా" మంచి సక్సెస్ సాధించగా, ఇప్పుడు రెండోసారి రణబాలి తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అండ్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా అఫిషియల్ టీజర్ ని కూడా లాంచ్ చేసారు. యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న ఈ సినిమా టీజర్ తో సినిమాపై అంచనాలను డబల్ చేసేసింది.
ఇక "రణబాలి" టీజర్ ని గమనిస్తే... 19వ శతాబ్దంలో అంటే.. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో భారతదేశం ఎదుర్కుంటున్న కరువు, ఆకలి, దోపిడీ వంటి అంశాలను టీజర్ లో చూపించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తున్నట్టు చూపించగా, ప్రజలు బ్రిటిష్ వారి బానిసల్లా బతుకుతున్న దారుణమైన పరిస్థితుల్లో.. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడే నాయకుడిగా "రణబాలి"గా విజయ్ దేవరకొండ పాత్రను పరిచయం చేశారు. టీజర్ లో "శింగనమల బొబ్బిలి రణబాలి" రా అంటూ విజయ్ చెప్పే డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలుస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయినట్టు ఆ గెటప్ ద్వారా తెలుస్తుంది.
అలాగే టీజర్ లో "ఆ కొండపై ఉన్న భద్ర మల్లాద్రి మీద ఆన".. నేను కాపలా కాస్తుండగా ఒక్క మెతుకు కూడా పోనివ్వను"... అంటూ విజయ్ చెప్పే డైలాగ్స్ కి గూస్బంప్స్ వచ్చేస్తాయి. విజయ్ గెటప్, బాడీ లాంగ్వేజ్ కూడా అదిరిపోయింది. ఇక ఈ మూవీలో రణబాలి భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనుంది. విలన్ గా హాలీవుడ్ నటుడు.. "ఆర్నాల్డ్ వోస్లూ" క్రూరమైన బ్రిటిష్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ "రణబాలి" సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16, 2026 న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి కింగ్డమ్ ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ఈ మూవీతో ఏ రేంజ్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.