Register as a Reviewer
గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)

గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)

Upcoming Expected Release: 17 Oct 2026

Garividi Lakshmi : మన నేల మట్టి కథలాంటి "గరివిడిలక్ష్మి" బుర్రకథ.. త్వరలో మన ముందుకు..

Director: Gowri Naidu Jammu
Cast: Anandhi, Rag Mayur, Naresh, Raasi, L B Sreeram, Avasarala Srinivas, Ankith Koyya, Shakalaka Shankar, Sharanya Pradeep, Kancharapalem Kishore, Nithin Prasanna, Viva Raghava, Kushalini, Anil, Chinni Sathya, Bongu Satti, Laxman

Available in:

About This Movie

టాలీవుడ్ లో ఈ దసరాకి రాబోతున్న క్రేజీ సినిమాల్లో "గరివిడి లక్ష్మి" ఒకటి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా ట్రైలర్ ని విడుదల చేయగా, సోషల్ మీడియాలో దానికి అనూహ్య స్పందన లభిస్తుంది. తెలుగమ్మాయి ఆనంది మెయిన్ లీడ్ గా టైటిల్ రోల్ లో నటించగా, ఈ సినిమాను గౌరీ నాయుడు డైరెక్ట్ చేసాడు. 


ఇక ట్రైలర్ ని చూస్తుంటే... ఇదొక స్వచ్ఛమైన మట్టి కథలా, పల్లెటూరి నేపథ్యంలో తిరణాల్లో బుర్రకథ నేపథ్యంతో తెరకెక్కిందని తెలుస్తుంది. ఇక సినిమాలో కళను వాడుకుని ఆ రోజుల్లో చేసే మోసాల గురించి బాగా చూపించబోతున్నారని తెలుస్తుంది. చదువు లేకపోయినా, పాటలు పాడే టాలెంట్ ఉన్న పల్లెటూరి అమ్మాయి లక్ష్మి, ఆమెకున్న కళతో బుర్రకథతో ఎలాంటి స్థాయికి ఎదిగిందనేది, ఆ ప్రయాణంలో ఈమె ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అన్నది మెయిన్ స్టోరీగా చూపించబోతున్నారు మేకర్స్. ఇక ట్రైలర్ లో ఉత్తరాంధ్ర యాస మాట్లాడుతున్న జానపద కళాకారిణిగా ఆనంది లుక్స్ చాలా బాగున్నాయి. 

 

అలాగే కీ రోల్స్ లో రాగ్ మయూర్, నరేష్, రాశి, ఎల్బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్ పాత్రలు సినిమాలో హైలెట్ కానున్నాయని తెలుస్తుంది. ఇక చివర్లో "నీది కానిది నువ్వు అడగొద్దు, నీదైంది నువ్వు వదలద్దు" అంటూ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక డైరెక్టర్ ఉత్తరాంధ్ర నేటివిటీని చాలా రియలిస్టిక్ గా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే చరణ్ అర్జున్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ పాటలు సినిమాకు ప్లస్ అవనున్నట్టు తెలుస్తుంది. మరి అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ సినిమా థియేటర్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.  

Why MRO?