Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Ustaad Bhagat singh movie Review ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ
By NTV Telugu
Ustaad Bhagat singh Movie Review
By TV9telugu
విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించిన సినిమా బైసన్. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 24న విడుదల చేసారు. డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది బైసన్. సాంకేతిక విభాగం పనితీరు ఈ సినిమా స్థాయిని పెంచింది. నివాస్ కె. ప్రసన్న అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. స్పోర్ట్స్ డ్రామాకు ఆర్ఆర్ కీలకం. ఈ విషయంలో ప్రసన్న విజయం సాధించాడు. కబడ్డీ మ్యాచ్‌లలో, గ్రామీణ నేపథ్యాన్ని ఎలివేట్ చేయడంలో ఎజిల్ అరుసు కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. శక్తి తిరు ఎడిటింగ్ చాలా పదునుగా ఉంది. పా రంజిత్ నేతృత్వంలోని నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు మారి సెల్వరాజ్ మరోసారి మ్యాజిక్ చేసాడు. సింపుల్ కథను సరైన స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు.
ఆర్. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన “అయలాన్” ఒక సగటు సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్. సినిమా పూర్తిగా శివకార్తికేయన్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన కామెడీ టైమింగ్ సినిమాను ముందుకు నడిపిస్తుంది. కథ కొత్తదేమీ కాకపోయినా, పిల్లలు మరియు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సరిపోతుంది. సీజీ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బాగున్నా, కొన్ని సీన్లలో కృత్రిమంగా కనిపిస్తాయి. విలన్ పాత్రకు సరైన డెప్త్ లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఇండియన్ స్థాయిలో బాగానే ఉన్నాయి. కొన్ని సీన్లు ఆకట్టుకుంటే, కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. పాటలు పెద్దగా గుర్తుండిపోవు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సపోర్ట్ చేస్తుంది. ఓసారి థియేటర్‌లో చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.
రవితేజ హీరోగా భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర మూవీ నవంబర్ లో రిలీజ్ అయింది. అయితే ఆడియన్స్ ఆశించిన రేంజ్ లో టాక్ రాలేదు. టెక్నికల్ గా సినిమాలో అడవివరం స్టేషన్, లొకేషన్లు, నైట్ షూట్, జాతర ఎపిసోడ్స్ ని బాగా డీల్ చేశారు డైరక్టర్. కానీ వాటి మీద ఫోకస్ పెట్టి కథ, స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డారు. రవితేజ మార్క్ హిట్ సినిమాల తాలూకు స్పెషల్ అంశాలు చాలా చోట్ల గుర్తుకొస్తాయి. కానీ అవి కామన్ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. పలు సన్నివేశాల్లో బలం లేకపోయినా హుషారైన నేపథ్య సంగీతంతో వాటిని రక్తికట్టించే ప్రయత్నం చేశారు భీమ్స్. యాక్షన్ ఎపిసోడ్స్ గగుర్పొడిచేలా ఉన్నాయి. ఫస్టాఫ్ లో ఉన్న ఫ్లో, సెకండ్ హాఫ్లోనూ ఉండుంటే బావుండేది. సన్నివేశాలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించేసరికి కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయింది. మొత్తానికి మాస్ మహరాజ్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఈ సినిమా. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అవలేదు.
'భానుభోగవరపు డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన "మాస్ జాతర" సినిమా నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయింది. రవితేజ తనకు కలిసొచ్చిన మాస్ జోనర్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది ఈ సినిమా. కానీ కొత్తదనం లేని కథ, కథనాలతో డైరెక్టర్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయాడు. సినిమాలో భారీ కాస్టింగ్ తో నింపినా రవితేజకి మినహా ఎవరికీ బలమైన పాత్ర లభించలేదు. అన్ని సన్నివేశాలు కూడా ఊహాజనితంగా ఉండడం వల్ల సామాన్య ప్రేక్షకులకి ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఉండదు. కానీ ఓటిటి లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే లోపం వల్ల, రొటీన్ కథ వల్ల అంతగా ఇంప్రెస్ చేయలేదు, కానీ రవితేజ కోసం రెగ్యులర్ ఆడియన్స్ ఒకసారి మాస్ జాతరని చూడొచ్చు.
శ్రీ నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. కథ ఓవరాల్ గా చెప్పాలంటే.. హీరో రూమ్, అతను ఉండే ప్లేస్ లో దరిద్రం చూపించడానికి చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడినట్టు కనిపిస్తుంది. ఎడిటింగ్ ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. ఎడిటింగ్ లోనే సినిమాను కొత్తగా ప్రజెంట్ చేసారు. పాత కథ తీసుకున్నా కొత్త స్క్రీన్ ప్లేతో ఎంటర్టైనింగ్ గా సినిమాని చూపించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా ‘సైక్ సిద్దార్థ’ సినిమా అన్ని కోల్పోయి సైకోగా బిహేవ్ చేసే ఓ అబ్బాయి కథ. ఫ్రెండ్స్ తో వెళ్తే ఎంజాయ్ చేస్తారు.
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్పిరిట్ మీడియా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్, రానా నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కథ కొత్తది తీసుకున్నా స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ గానే రాసుకున్నారు. సెకండ్ హాఫ్ అయితే రొటీన్ సస్పెన్స్ సినిమాలు చూసినట్టు ఉంటుంది. దర్శకుడు సాంకేతకంగా మాత్రం సినిమాని చాలా ఎత్తుకు తీసుకెళ్లాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్పటి కాలంకు చెందిన సెట్స్, సెటప్ చాలా బాగా డిజైన్ చేసారు. మొత్తంగా ‘కాంత’ సినిమా ఓ హీరో – డైరెక్టర్ మధ్య ఈగో, అహంకారంతో వచ్చే సమస్యలు, వీరిద్దరి మధ్య ఓ అమ్మాయి ఎలా నలిగింది అని సస్పెన్స్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించారు
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మరియు రానా, సముద్రఖని కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ ట్రేడ్ విశ్లేషకులు మంచి స్పందన కనబరిచారు. కథ పరంగా దర్శకుడు బలమైన సబ్జెక్టు తీసుకోగా, అంత బలంగా ఆయా పాత్రధారులు అద్భుతంగా నటించారని చెప్పాలి. అయితే స్క్రీన్ ప్లే పరంగా కాస్త వీక్ అయింది. కానీ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఆడియన్స్ ని కాంత ఇట్టే 1950 లోకి తీసుకెళ్లిపోతుందనడంలో సందేహం లేదు. కమర్షియల్ సినిమాలే కాదు, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు, ఆడియన్స్ చూస్తారని అలాంటివాటికే మేకర్స్ కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సినిమా కథ చెప్తుంది. రెగ్యులర్ మూవీ లవర్స్ కి ఈ కథ ఇంప్రెస్ చేయలేకపోయినా, పీరియాడికల్ సినిమాలు, నటనా ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
బలగం, కోర్ట్ లాంటి సినీమాల్లో హీరోగా మెప్పించిన ప్రియదర్శి ఈసారి ఒక రోమ్ కామ్ డ్రామా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. "ప్రేమంటే" అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. అయితే ఆడియన్స్ ని మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి. ప్రియదర్శి, ఆనంది పెర్ఫార్మన్స్ తో మెప్పించినా, అసలు వాళ్ళ మధ్యలో లవ్ ఉందా అన్న డౌట్ కొన్ని సిల్లీ సీన్స్ చూస్తే అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ సంగీతం బాగుంది. విశ్వంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ నీట్‌గా బాగుంది. ఎడిటింగ్ అంతగా ఏం లేదు. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ ఆలోచన బాగున్నా ఆచరణ మాత్రం అస్సలు ఆకట్టుకోలేదు. అనుకున్న కథను ఎస్టాబ్లిష్ చేయడంలో బాగా తడబడ్డారు. ఓవరాల్ గా ఆడియన్స్ ని మెప్పించలేదు.
కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన సినిమా ప్రేమంటే. టాలెంటెడ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. క్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోహీరోయిన్లు మంచి నటన కనబరిచారు. కాకపోతే వాళ్ళ మధ్య బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు. యాంకర్ సుమ పాత్ర అక్కడక్కడా నవ్వించినా, కొత్తదనం లేని నవ్వురాని కామెడీ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. లియోన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా యావరేజ్ గా ఉంది. కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేకింగ్ క్వాలిటీ బాగుంది. అయితే రెగ్యులర్ మూవీ లవర్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ అంచనాలు ఎక్కువగా పెట్టుకుంటే అంతగా ఇంప్రెస్ చేయకపోవచ్చు.
నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రేమంటే. ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, ఒక క్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా తెరకెక్కింది. అయితే ప్రేమ పెళ్లి కథ గా మొదలైన ఈ సినిమా క్లైమాక్స్ కి వచ్చే సరికి ఒక క్రైమ్ డ్రామాగా మారిపోతుంది. నటీనటులు మంచి పెర్ఫెర్మన్స్ చూపించినా, నాచురాలిటీ మిస్ అయింది. కమెడియన్స్ సుమ, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఫన్ జెనరేట్ చేయడానికి బాగానే కష్టపడ్డారు, కానీ అంతగా ఆకట్టుకోలేదు. దర్శకుడు నవనీత్ బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి ల్యాగ్ ఫీల్ అయ్యేలా చేసాడు. అయితే క్వాలిటీ విషయంలో మేకర్స్ బానే కష్టపడ్డారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లవర్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు, రెగ్యులర్ మూవీస్ చూసే వారు ఒక్కసారి ట్రై చేయొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers