బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)
Bethlehem Kudumba Unit Trailer : చూడ్డానికి క్లాసిక్.. కానీ ఇదో GenZ సినిమాలా ఉందే.. ఇక్కడే అన్ని రివ్యూస్ చూసేయండి!
About This Movie
మలయాళ స్టార్ నివిన్ పౌలీ (Nivin Pauly), మమిత బైజు (Mamitha Baiju) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit). మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లతో 200 కోట్లకి పైగా వసూలు చేసి ఇప్పటికి థియేటర్లలో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు ఈ క్లాసిక్ మూవీ తెలుగులోనూ రిలీజ్ కి రెడీ అయింది. తాజాగా 'బెత్లెహెం కుటుంబ యూనిట్' తెలుగు ట్రైలర్ విడుదల కాగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇక ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ట్రైలర్ మొత్తం ఎంటర్టైనింగ్ గా ఉండి సినిమా కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందన్న భరోసానిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక ఫ్రెష్ ఫీల్-గుడ్ లవ్ స్టోరీలా ఆడియన్స్ ని మెప్పించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా నివిన్ పౌలీ - మమిత బైజు మధ్య కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. అలాగే ట్రైలర్ లో కనిపిస్తున్న నటీనటులు తెలుగు వారికి పెద్దగా పరిచయం లేకున్నా తెలుగులో మంచి టాక్ వస్తే గనుక బ్లాక్ బస్టర్ రన్ సాధించే అవకాశం ఎంతైనా ఉంది. సంగీత్ ప్రతాప్, సురేష్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, బిందు పణిగర్ తదితరులు కీ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి విష్ణు విజయ్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ ప్లస్ పాయింట్ అవనున్నాయి.
ఇక ఇంతకు ముందు ‘ప్రేమలు’ వంటి సెన్సేషనల్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించిన డైరెక్టర్ గిరీష్ ఏ.డి, ఈ బెత్లెహెం కుటుంబ యూనిట్ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇక ప్రముఖ మలయాళ నిర్మాణ సంస్థ "భావన స్టూడియోస్" బ్యానర్ పై దిలీష్ పోతన్, ఫహాద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ మూవీని తెలుగులో మైత్రీ మూవీ రిలీజ్ - ఫ్యూచర్ రన్‌అప్ ఫిలిమ్స్ సంయుక్తంగా సెప్టెంబర్ 4న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా కూడా ప్రేమలు లాగా మరో క్లాసిక్ సినిమాగా ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
You Might Also Like
టాక్సిక్ (Toxic)
2026
ఇరుముడి (Irumudi)
2026