ఐమ్ గేమ్ (I'M GAME)
I'M GAME : మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఐమ్ గేమ్". నహస్ హిదయత్ దర్శకత్వంలో నటించిన కొత్త మూవీ "ఐమ్ గేమ్". కాయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
Reviews
What critics and the public are saying about ఐమ్ గేమ్ (I'M GAME)
Media Reviews
6 Avg: 5.5/10Average
I'm Game movie review
వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఐమ్ గేమ్ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఐమ్ గేమ్ సినిమాను దుల్కర్ స్వయంగా తన నిర్మాణంలో తీసుకొచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే... కథ పరంగా మంచి పాయింట్ నే తీసుకున్నాడు. క...
వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఐమ్ గేమ్ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఐమ్ గేమ్ సినిమాను దుల్కర్ స్వయంగా తన నిర్మాణంలో తీసుకొచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే... కథ పరంగా మంచి పాయింట్ నే తీసుకున్నాడు. కాకపోతే ఈ స్టోరీ లైన్ తెలుగు మూవీ సవ్యసాచికి దగ్గరగా ఉంటుంది.
అయితే సినిమాలో చాలా సీన్లు అన్నీ మూస పద్ధతిలోనే సాగుతాయి. ఒక అద్భుతమైన ఫాంటసీ థ్రిల్లర్‌లా మొదలైన సినిమా, కాస్తా చివరికి రొటీన్ రివెంజ్ డ్రామాగా మారిపోవడం ప్రేక్షకుడికి కొంత అసంతృప్తిని మిగులుస్తుంది. దానం చేసిన వ్యక్తి గతం ఏంటో తెలిశాక, కథ ముగింపు ఎలా ఉండబోతుందో ఎవరైనా ఇట్టే ఊహించేయవచ్చు. ఓవరాల్ గా దర్శకుడు నహాస్ హిదాయత్ తనకున్న మంచి కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో తడబడ్డాడు. అద్భుతమైన ఐడియాతో కథను మొదలుపెట్టిన అతను, ద్వితీయార్థంలో మాత్రం కొత్తగా రిస్క్ తీసుకోలేక పాత ఫార్ములాతోనే సేఫ్ గేమ్ ఆడాడు.
Average
I'm Game movie review
దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ తెరకెక్కించిన యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో మొదలయ్యే కథ.. ఊహించని మలుపులతో సాగుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. సెకండాఫ్‌లో కథనం కొంత గాడి తప్పుతుంది.దుల్కర్ సల్మాన్ తన పా...
దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ తెరకెక్కించిన యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో మొదలయ్యే కథ.. ఊహించని మలుపులతో సాగుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. సెకండాఫ్‌లో కథనం కొంత గాడి తప్పుతుంది.
దుల్కర్ సల్మాన్ తన పాత్రలో మరోసారి మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాత్రలో వచ్చే మార్పులను ఆయన ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో చక్కగా చూపించారు. ఆంటోని వర్గీస్, మిస్కిన్ తమ పాత్రలకు న్యాయం చేయగా.. కయాదు లోహర్ ఆకట్టుకున్నారు.
సినిమాకు జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం. జిమ్షి ఖాలీద్ సినిమాటోగ్రఫీ విజువల్‌గా రిచ్‌గా ఉంది. అయితే లాంగ్ రన్‌టైమ్, సెకండాఫ్‌లో స్లో నెరేషన్, కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ మైనస్‌గా నిలిచాయి.
ఓవరాల్ గా.. డిఫరెంట్ కాన్సెప్ట్, దుల్కర్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ కోసం ‘ఐయామ్ గేమ్’ను ఓసారి ట్రై చేయొచ్చు.
Average
I'M Game movie review
Dulquer Salmaan came up with ‘I’m Game’, an action fantasy thriller, in the direction of Nahas Hidhayath. Kayadu Lohar, played the lead actress role while Antony Varghese, Mysskin, Samyuktha Viswanathan and Kathir played crucial roles in the film. Let’s figure it out with a detailed analysis.Positiv...
Dulquer Salmaan came up with ‘I’m Game’, an action fantasy thriller, in the direction of Nahas Hidhayath. Kayadu Lohar, played the lead actress role while Antony Varghese, Mysskin, Samyuktha Viswanathan and Kathir played crucial roles in the film. Let’s figure it out with a detailed analysis.
Positives:
1. First Half
2. Dulquer’s Performance
Negatives:
1. Second Half
2. Predictable Backstory
3. Excessive Runtime
4. Dragged-Out Action Episodes
Overall, I’m Game appeared promising in the first half with quite a few thrilling moments but the predictable execution during the second half along with unnecessary commercial elements, worked against the film. Especially, the film tests patience after a point with repetitive sequences. Better care in editing, a crisp runtime and an engaging backstory, could have made the film a memorable one but what we eventually got to see is a film which does not use its interesting core point to its full potential.
Bottom Line – ‘Game’ Lost In Second Innings
Average
I'M Game movie review
దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్’ కాసినో, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ క్రైమ్ డ్రామా. దర్శకుడు నివాస్ ఎంచుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, కథనం అన్ని చోట్లా ఒకే స్థాయిలో ఆకట్టుకోదు.ఫస్టాఫ్‌లో దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం. క్రికెట్ బెట్టింగ్ కా...
దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్’ కాసినో, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ క్రైమ్ డ్రామా. దర్శకుడు నివాస్ ఎంచుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, కథనం అన్ని చోట్లా ఒకే స్థాయిలో ఆకట్టుకోదు.
ఫస్టాఫ్‌లో దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం. క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఆటగాళ్ల జీవితాల్లో వచ్చే సమస్యలను ఆసక్తికరంగా చూపించారు. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి.
సెకండాఫ్‌లో మిస్కిన్, ఆంటోని వర్గీస్ ఎంట్రీతో కథలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. కాయదు లోహర్ తన పాత్ర పరిధిలో ఆకట్టుకున్నారు.
యాక్షన్, స్పోర్ట్స్ కొరియోగ్రఫీ బాగున్నాయి. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జిమ్‌షి ఖాలీద్ సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చాయి.
ఓవరాల్‌గా.. డిఫరెంట్ కాన్సెప్ట్, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ, కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉంటే సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉండేది. వన్‌టైమ్ వాచ్‌గా ‘ఐ యామ్ గేమ్’ ఓకే అనిపిస్తుంది.
Hit
IM Game movie review
దుల్కర్ సల్మాన్ నటించిన ఐమ్ గేమ్ సినిమా గురించి చెప్పుకుంటే... తన యాక్టింగ్ ప్రతిభను దృష్టిలో పెట్టుకొని కాసినో, క్రికెట్ బెట్టింగ్ అంశాలను దర్శకుడు నివాస్ రాసుకొన్న ఇంటెన్సివ్ కథ, దుల్కర్ సల్మాన్ చేత మరోసారి నట విశ్వరూపం చూపించే ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఫస్టాఫ్ దుల్కర్ సల్మాన్ తన పాత్ర...
దుల్కర్ సల్మాన్ నటించిన ఐమ్ గేమ్ సినిమా గురించి చెప్పుకుంటే... తన యాక్టింగ్ ప్రతిభను దృష్టిలో పెట్టుకొని కాసినో, క్రికెట్ బెట్టింగ్ అంశాలను దర్శకుడు నివాస్ రాసుకొన్న ఇంటెన్సివ్ కథ, దుల్కర్ సల్మాన్ చేత మరోసారి నట విశ్వరూపం చూపించే ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఫస్టాఫ్ దుల్కర్ సల్మాన్ తన పాత్రలో పెర్ఫార్మెన్స్ పరంగా చెలరేగిపోయారు. ప్రీమియర్ లీగ్ టోర్ని క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా క్రికెటర్ల జీవితాలు ఎలా డేంజరస్‌గా మారుతున్నాయనే విషయాన్ని స్పష్టంగా చూపించారు.
ఇక సెకండాఫ్‌లో మిస్కిన్, ఆంటోని వర్గీస్ సినిమాకు మరింత బలంగా మారారు. కాయదు లోహర్ ఈ సినిమాకు గ్లామర్ పరంగానే కాకుండా తనకు లభించిన స్పేస్‌లో యాక్టింగ్‌తో మెప్పించారు. సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫి, స్పోర్ట్స్ కోరియోగ్రఫి బాగా డిజైన్ చేశారు. జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎమోషనల్‌గాను, యాక్షన్ మోడ్‌ను బాగా ఎలిమేట్ చేసింది. జిమ్‌షి ఖాలీద్ సినిమాటోగ్రఫి ఈ సినిమాను క్వాలిటీగా, రిచ్‌గా చూపించారు. ఓవరాల్ గా ఒక డిఫరెంట్ కంటెంట్, హై ఎండ్ పెర్ఫార్మెన్స్ చూడాలనుకొంటే.. ఈ వారం ఐయామ్ గేమ్ సినిమాను తప్పకుండా చూడొచ్చు. ఈ సినిమా మంచి థియేట్రికల్ వాల్యూ ఉన్న సినిమా. మంచి అనుభూతి కలిగిస్తుంది.
Above Average
IM Game movie review
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా ఐమ్ గేమ్, తెలుగులో పలు ఇబ్బందులు ఎదురైన ఈ సినిమా ఫైనల్ గా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో కథాంశం కొత్తగా ఉన్నప్పటికీ, తెరపై దాన్ని ఆవిష్కరించిన విధానం చాలా రొటీన్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కథను బాగా...
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా ఐమ్ గేమ్, తెలుగులో పలు ఇబ్బందులు ఎదురైన ఈ సినిమా ఫైనల్ గా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో కథాంశం కొత్తగా ఉన్నప్పటికీ, తెరపై దాన్ని ఆవిష్కరించిన విధానం చాలా రొటీన్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కథను బాగా సెట్ చేసి ఒక పెద్ద ట్విస్ట్‌తో ముగుస్తుంది. కానీ అందుకు భిన్నంగా సెకండాఫ్ కథనం పేలవంగా మిగిలిపోవడం బాధాకరం.
ఈ సినిమా కథ ముందుగానే ఊహించేలా ఉండటంతో మెల్లగా సినిమాపై పట్టు తగ్గిపోతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే, ‘ఐమ్ గేమ్’ ఆసక్తికరమైన కథాంశాన్ని కలిగి ఉన్నప్పటికీ, కథనంలో ఇంపాక్ట్ లోపించింది. దుల్కర్ సల్మాన్, సాంకేతిక బృందం సినిమాను నిలబెట్టడానికి తమ వంతు కృషి చేసినా, నెమ్మదిగా సాగే సెకండాఫ్, ఊహాజనితంగానే సాగే సీన్స్ ఈ సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. సో ఈ సినిమా అక్కడక్కడా మాత్రమే వర్కౌట్ అవుతుంది. కాబట్టి, కొత్త కథలను ఇష్టపడే యాక్షన్ సినీ ప్రియులు ఎలాంటి అంచనాలు లేకుండా ఒకసారికి ట్రై చేయవచ్చు.
Public Reviews
2 Avg: 5.0/10Average
I'M Game Movie Review
just now finished I'M game movie first showAfter a hectic work week, I checked out Dulquer Salmaan’s 'I’m Game' for a quick weekend stress-buster.Dulquer’s effortless swagger, the stylish casino / gambling backdrop, and Jakes Bejoy’s killer background score make the first half extremely slick and en...
just now finished I'M game movie first show
After a hectic work week, I checked out Dulquer Salmaan’s 'I’m Game' for a quick weekend stress-buster.
Dulquer’s effortless swagger, the stylish casino / gambling backdrop, and Jakes Bejoy’s killer background score make the first half extremely slick and engaging.
The second half drags significantly. A predictable plot and an oversized runtime (nearly 3 hours) make the latter part a test of patience.
A decent one-time theatrical watch for DQ’s performance and sleek production, but otherwise ideal for a casual weekend OTT binge.
Average
I'M Game Movie Review
ఇప్పుడే థియేటర్‌లో దుల్కర్ సల్మాన్ 'I’m Game' చూసి బయటకొచ్చా. concept వినడానికి చాలా fresh గా ఉంది కానీ, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఓ మోస్తరుగానే అనిపించింది. gambling, సూపర్ నేచురల్ elements తో పాయింట్ భలే ప్లాన్ చేశాడు డైరెక్టర్ నహాస్ హిదాయత్. డీక్యూ (DQ) నటన, స్టైలిష్ యాక్షన్ అండ్ ఫస్టాఫ్ బ్య...
ఇప్పుడే థియేటర్‌లో దుల్కర్ సల్మాన్ 'I’m Game' చూసి బయటకొచ్చా. concept వినడానికి చాలా fresh గా ఉంది కానీ, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఓ మోస్తరుగానే అనిపించింది.
gambling, సూపర్ నేచురల్ elements తో పాయింట్ భలే ప్లాన్ చేశాడు డైరెక్టర్ నహాస్ హిదాయత్. డీక్యూ (DQ) నటన, స్టైలిష్ యాక్షన్ అండ్ ఫస్టాఫ్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్! జేక్స్ బిజోయ్ బిజీఎమ్ సీన్లను వేరే రేంజ్‌కి తీసుకెళ్లింది.
but ఇంటర్‌వెల్ వరకు ఉన్న గ్రాఫ్ సెకండాఫ్‌కి వచ్చేసరికి పూర్తిగా పడిపోతుంది. రొటీన్ ప్రిడిక్టబుల్ సీన్లు, దాదాపు 3 గంటల రన్‌టైమ్ ఓపికకు పెద్ద పరీక్ష! మిస్కిన్ విలనిజం కాస్త వీక్‌గా అనిపించింది.
స్టైలిష్ మేకింగ్ & డ్యూక్యూ పెర్ఫార్మన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ హై ఎక్స్‌పెక్టేషన్స్ తో వెళ్తే కాస్త డిజప్పాయింట్ అవ్వక తప్పదు
About This Movie
Story :
సిటీలో ధనవంతుడి వారసుడైన డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) తన తండ్రి సాయం లేకుండా మనీ సంపాదించి సొంత కాళ్ల మీద నిలబడాలని భావించి, అడ్డదార్లలో బెట్టింగ్ లు కూడా చేస్తూ, కోట్లలో డబ్బు నష్టపోతాడు. ఈ క్రమంలో బెట్టింగ్ నిర్వాహకులతో గొడవలో ప్రమాదానికి గురై తన చేతిని కూడా కోల్పోతాడు. కానీ అదే సమయంలో మరో డోనర్ దొరకడంతో అతడి చేతిని ఆపరేషన్ చేసి జాన్ కు అతికిస్తారు. కానీ అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. అతనికి అతికించిన చేయి అతని మాట వినకుండా, తన ప్రమేయం లేకుండానే చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో అసలు జాన్ కి ఉన్న ఆ చేయి అలా ఎందుకు చేసింది? తనకు ఎదురైన సమస్యలను డాన్ జాన్ ఎదుర్కొని ఎలా నిలబడ్డాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
ఇప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసుకునే దుల్కర్ సల్మాన్ కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే తన ప్రతి మూవీని తెలుగులో డబ్ చేస్తుంటాడు. అలాగే ఈ ఐమ్ గేమ్ కూడా మంచి అంచనాలతో విడుదలైంది. పైగా తెలుగులో ప్రతి డైరెక్ట్ గా చేసిన ప్రతి మూవీ హిట్టే. ఇక దుల్కర్ సల్మాన్ ఎంచుకున్న మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఈ ఐమ్ గేమ్ అని చెప్పొచ్చు. ట్రైలర్ చూసి ఈ మూవీ గ్యాంబ్లింగ్ నేపథ్యంలో నడుస్తున్న కమర్షియల్ మూవీ అనుకున్నా, స్టోరీ పాయింట్ వేరే విధంగా ఉండడం మంచి ప్లస్ పాయింట్. ఆ పాయింట్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. అది సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్.
ఇక మూవీలో దుల్కర్ మరోసారి తన న్యాచురల్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసాడు. పలు సన్నివేశాల్లో డిఫరెంట్ షేడ్స్ ని, విభిన్న భావోద్వేగాలను పలికించాడు. ఇక హీరోయిన్ కయాదు లోహర్ కి లిమిటెడ్ స్క్రీన్ టైం లభించినా తెరపై అందంగా కనిపించింది. మిగతా ఆర్టిస్ట్ లు తమ పరిధిమేరకు బాగా నటించారు. ఇక మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ లో క్రియేటివ్ గా, ముఖ్యంగా ఫైట్ సీన్స్ లో ఇంప్రెస్ చేస్తుంది.
Minus Points :
అయితే మూవీకి కథ పరంగా మంచి కాన్సెప్ట్ రాసుకున్న డైరెక్టర్, ఆ స్థాయిలో ట్రీట్మెంట్ చూపించలేదు. ఫస్ట్ హాఫ్ ని చాలా రొటీన్ గా లాగించేసి, ఒక పెద్ద ట్విస్ట్ తో బ్రేక్ ఇస్తారు. ఆ ట్విస్ట్ వల్ల సెకండ్ హాఫ్ పై మంచి హై మొదలైంది. కానీ దానికి రివర్స్ లో ఆ హై ని మెయింటైన్ చేయకుండా, రొటీన్ గా బోరింగ్ స్క్రీన్లతో నడిపించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రమే హైలెట్ గా ఉండడం, ఆ తర్వాత సీన్స్ ని ఇంట్రెస్టింగ్ గా చూపించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. ఇక యాక్షన్ సీన్స్ బాగున్నా, సెకండ్ హాఫ్ తర్వాత చాలా సీన్లు ఊహాజనితంగా ఉండడం వల్ల ఆడియన్స్ కి ఓ దశలో ఇరిటేషన్ వస్తుంది. మూవీలో ట్విస్ట్ లను మెయింటైన్ చేయడానికి వాటి చుట్టూ మరింత ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ను జోడించాల్సింది. పైగా గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ నేపథ్యంలో ఉన్న సీన్లు చాలా రొటీన్ గా ఉంటాయి. అలాగే మూవీ లెంగ్త్ బిగ్ మైనస్ అయింది.
Technical values :
ఇక టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే... ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ మూవీ కెమెరా వర్క్ క్వాలిటీ రిచ్ గా ఉంది. అయితే ఎడిటింగ్ పరంగా మూవీని కనీసం అరగంట ట్రిమ్ చేయాల్సింది. అనవసర సన్నివేశాలు చాలా ఎడిట్ చేస్తే మూవీకి ప్లస్ అయ్యేది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజొయ్ సినిమాకి మరో సాలిడ్ బీజీఎమ్ అందించాడు. సాంగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. ఇక ఐమ్ గేమ్ డైరెక్టర్ నహాస్ హిదాయత్ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ని రాసుకున్నా, దానికి ఆడియన్స్ ని ఉత్కంఠకి గురిచేసేలా స్క్రీన్ ప్లే మాత్రం రాసుకోలేదు. కొన్ని మంచి సీన్ల వల్ల తన డైరెక్షన్ స్కిల్స్ ని మెచ్చుకోవాలి. కానీ స్క్రీన్ ప్లే పరంగా దెబ్బేసాడు.
Final Review :
ఫైనల్ గా ఐమ్ గేమ్ సినిమా చూస్తే... మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ రాసుకున్న డైరెక్టర్ దానికి తగ్గ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. రొటీన్ రెగ్యులర్ సీన్స్ తో ఆడియన్స్ కి బోర్ కొట్టింది. అయితే దుల్కర్ సల్మాన్ తన వంతు పెర్ఫార్మన్స్ బాగా చేసారు. ఇక టెక్నికల్ గా సినిమా బాగానే ఉంటుంది. కానీ కంటెంట్ సరిగా లేకపోతే ఎన్ని సాంగ్స్ పెట్టినా, ఫైట్స్ పెట్టినా, సెట్టింగ్స్ వేసినా ఏంటి లాభం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమా రిజల్ట్ ని దెబ్బతీసింది. ఓవరాల్ గా దుల్కర్ ఫ్యాన్స్, రెగ్యులర్ మూవీస్ ఇష్టపడే ఓ వర్గం ఆడియన్స్ తక్కువ అంచనాలతో ఈ సినిమాని ట్రై చేయొచ్చు.