Register as a Reviewer
రోమాంచకం (Romanchakam)

రోమాంచకం (Romanchakam)

Upcoming Expected Release: 03 Sep 2026

Romanchakam : ఊహకే అందని, ఉవ్వెత్తున ఎగిసే, ఉత్తుంగ తరంగమే ఈ రోమాంచకం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..

Director: Venu Gopal Reddy
Cast: Sumanth Prabhas, Ananthika Sanilkumar, Upendra Limaye, Venkatesh Kakumanu, Narendra Ravi, Mani Aegurla, Sai Sohan and others

Available in:

About This Movie

టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ వైల్డ్ డైరెక్టర్ "సందీప్ రెడ్డి వంగ" (SandeepReddy Vanga) సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌ పై ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా "రోమాంచకం"(Romanchakam) అనే సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. "మేమ్ ఫేమస్" ఫేమ్ సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా నటిస్తున్న ఈ మూవీలో 8 వసంతాలు(8 Vasanthalu) సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంతిక (Ananthika) హీరోయిన్‌ గా నటించింది. వేణు గోపాల్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ అండ్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, లేటెస్ట్ గా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్.

 

ఇక వినడానికి ఏదో మలయాళం మూవీ పేరులా ఉన్నా, పక్కా తెలుగు సినిమా ఇది. ట్రైలర్ చూస్తుంటే... వంగ సినిమాల్లో లాగానే ఈ మూవీలో కూడా లవ్ ట్రాక్ సీన్స్, బైక్ రైడ్స్, సముద్ర తీరంలో పరుగులు.. లాంటి సీన్స్ తో ట్రైలర్ బాగానే అట్రాక్ట్ చేస్తుంది. దానికి తోడు మ్యూజిక్ కూడా మంచి వైబ్ ఇస్తుంది. కానీ పక్కా కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా రోమాంచకం ఉండబోతుందని ట్రైలర్ ని బట్టి అనిపిస్తుంది. ఇక సందీప్ రెడ్డి వంగ బ్యానర్స్ నుండి ఈ సినిమా వస్తుండడంతో సినిమాకి మంచి మార్కెటింగ్, హైప్ కూడా వస్తుంది. 

 

ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో మంచి లవ్ స్టోరీలా అనిపించినప్పటికీ, కొన్ని సీన్స్ లో ట్విస్ట్ అండ్ టర్న్స్ చూస్తే మూవీపై ఇంట్రెస్ట్ ని పెంచేస్తున్నాయి. అలాగే సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, చాలా బాగా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. అలాగే ట్రైలర్ కి వాసుకి వైభవ్ అందించిన బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఫైనల్ గా "రోమాంచకం" సెన్సార్ కార్యక్రమాలను కూడా త్వరలోనే ఫినిష్ చేసుకుని, సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్‌ కి రెడీ అవుతుంది.

Why MRO?