కికు చిరంజీవి (Kiku Chiranjeevi)
యంగ్ హీరో "కికు యనమల" హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "కికు చిరంజీవి". కాశిష్ ఖాన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి, గోపరాజు రమణ తదితరులు కీ రోల్స్ లో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని శుభ సాయి వెంకట్ డైరెక్ట్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలైంది.
Available in:
Reviews
What critics and the public are saying about కికు చిరంజీవి (Kiku Chiranjeevi)
Media Reviews
1 Avg: 6.0/10Above Average
Kiku chiranjeevi movie Review
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో ఓ చిన్న థ్రిల్లర్ చిత్రం “చిరంజీవి” కూడా ఒకటి. యువ నటుడు కికు యనమల హీరోగా ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “చిరంజీవి” సినిమా అక్కడక్కడా ఓకే అనిపి...
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో ఓ చిన్న థ్రిల్లర్ చిత్రం “చిరంజీవి” కూడా ఒకటి. యువ నటుడు కికు యనమల హీరోగా ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “చిరంజీవి” సినిమా అక్కడక్కడా ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామాగా నిలిచింది.
దర్శకుడు శుభ సాయి వెంకట్ తీసుకున్న పాయింట్ లో మంచి పోటెన్షియల్ ఉంది. దీనికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. నటీనటులు కూడా తమ బెస్ట్ ఇచ్చారు. కానీ ఇంకా క్లారిటీతో కూడిన కథనం ఇందులో అవసరం ఉంది. దర్శకుడు కొన్ని మూమెంట్స్ ని సింపుల్ గా వదిలేశారు. వీటిని కూడా బాగా డిజైన్ చేసుకొని ఉంటే ఈ థ్రిల్లర్ బెటర్ గా ఉండేది. సో, ఈ కికు చిరంజీవి చిత్రాన్ని తక్కువ అంచనాలతో ప్రయత్నిస్తే మంచిది.
Public Reviews
1 Avg: 7.0/10Hit
Kiku Chiranjeevi movie review
జస్ట్ ఇప్పుడే కికు చిరంజీవి మూవీ చూసి వచ్చాను. లాస్ట్ వీక్ ఇరుముడి మూవీ హడావిడిలో ఉన్నాను. ఈ వీక్ వేరే మూవీకి వెళదామని అందరూ టాక్సిక్ వెళ్దాం అని ఫ్రెండ్స్ అంటే, ఆ మూవీ టాక్ ముందే తెలిసి... ఈ మూవీకి తీసుకెళ్ళా. మూవీ చుశాక వీళ్ళని చిరంజీవి మూవీకి తీసుకొచ్చి మంచి పనే చేసాను అనిపించింది. సినిమా ఒక...
జస్ట్ ఇప్పుడే కికు చిరంజీవి మూవీ చూసి వచ్చాను. లాస్ట్ వీక్ ఇరుముడి మూవీ హడావిడిలో ఉన్నాను. ఈ వీక్ వేరే మూవీకి వెళదామని అందరూ టాక్సిక్ వెళ్దాం అని ఫ్రెండ్స్ అంటే, ఆ మూవీ టాక్ ముందే తెలిసి... ఈ మూవీకి తీసుకెళ్ళా. మూవీ చుశాక వీళ్ళని చిరంజీవి మూవీకి తీసుకొచ్చి మంచి పనే చేసాను అనిపించింది.
సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా బాగానే తీశారు. కానీ కొన్ని థ్రిల్ మూమెంట్స్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూపించి ఉండాల్సింది. అయితే ఈ మూవీమీద అసలు నేనేం ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా చూసాను కాబట్టి ఈ మూవీ నాకు నచ్చింది. అండ్ టాక్సిక్ లాంటి కళాఖండంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ మూవీ. డైరెక్టర్ పేరు కూడా తెలీదు కానీ అతను బాగానే హ్యాండిల్ చేసాడు. మంచి స్టోరీ పాయింట్ ను రాసుకున్నాడు. కాకపోతే స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఏది ఏమైనా ఈ వారం ఎవరైనా మంచి మూవీకి వెళ్దాం అనుకుంటే, ఆ టాక్సిక్ ని పక్కనబెట్టి ఈ చిరంజీవి సినిమాకెళ్ళండి.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... ఫోటోగ్రాఫర్ అయిన చిరంజీవి (కికు యనమల)కు ఊహకందని ఓ విచిత్రమైన గుండె సమస్యతో బాధపడుతుంటాడు. అందరిలా కాకుండా చిరంజీవికి ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉంటుంది. అయితే అనాథలా పెరిగిన చిరంజీవి మరో అనాథగా పెరిగిన మను (కశీష్ ఖాన్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఫస్ట్ నైట్ తర్వాత చిరంజీవికి కుడి వైపు ఉన్న గుండె మళ్ళీ ఎడమవైపుకు మారుతుందనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల దృష్ట్యా మనుకి దగ్గరయ్యే వాళ్ళను ఓ గ్యాంగ్ చంపేస్తుంటారు. అలాగే చిరంజీవిపై కూడా ఎటాక్ జరుగుతుంది. కానీ చిరంజీవి బయటపడతాడు. ఈ క్రమంలో అసలు చిరంజీవికి ఉన్న గుండె సమస్య ఏంటి? అనాథలైన చిరంజీవి, మనులను ఎవరు పెంచి పెద్ద చేశారు? మధ్యలో హైదరాబాద్ లో బిగ్ బిజినెస్ విమెన్ అయిన ఈశ్వరీరావుకి చిరంజీవికి సంబంధమేంటి? చిరంజీవితో మను జర్నీ ఎలా సాగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
సినిమా కథ పరంగా మంచి పాయింట్ ని రాసుకున్నారు. మూవీలో కొన్ని ట్విస్ట్ లు కొన్ని థ్రిల్ మూమెంట్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే రైటింగ్ పరంగా కొన్ని సీన్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. అయితే క్లైమాక్స్ లో కథ గురించి రివీల్ చేసే సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. ఇక హీరోగా నటించిన కికు యనమల తన రోల్ లో బాగా నటించాడు. తన రోల్ లో నెగిటివ్ షేడ్స్ ని కూడా బాగా చూపించాడు. నటన పరంగా అనుభవం లేకపోయినా, ఈ మూవీలో ఎంతో మెచ్యూరిటీ చూపించాడు. అలాగే హీరోయిన్ కాశిష్ ఖాన్ కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది. అలాగే సీనియర్ నటీనటులు ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తమ రోల్స్ లో సీనియారిటీ చూపించడంతో పాటు, సప్రైజ్ చేస్తారు. మిగతా నటీనటులు వాళ్ళ రోల్స్ పరిధి మేరకు బాగా నటించారు.
Minus Points :
అయితే కికు చిరంజీవికి కాన్సెప్ట్ పరంగా బాగానే రాసుకున్నప్పటికీ, దీనికి కావాల్సిన స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ని రాసుకోలేకపోయారు. కొన్ని ట్విస్ట్ లు చివరిదాకా మెయింటైన్ చేయడంలో తడబడ్డారు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని చాలా సింపుల్ గా ముగించేస్తారు. అందువల్ల కథనం నెమ్మదించింది. అలాగే హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా పండలేదు. అందువల్ల కొన్ని రొమాంటిక్ సీన్స్ ని ఇరికించినట్టు ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే సాగదీసినట్టు ఉండగా, చాలా సీన్స్ ఊహాజనితంగా ఉండడంతో ఆడియన్స్ కి బోర్ కొట్టిస్తాయి. పైగా హీరో నెగిటివ్ షేడ్ క్యారెక్టరైజేషన్ కొన్ని పాత సినిమాల్ని గుర్తుచేసేలా ఉంది.
Technical Values :
ఇక టెక్నికల్ వాల్యూస్ గురించి చెప్పుకుంటే... ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్కడ ఎంత కావాలో అంతే ఖర్చుపెట్టారు. ప్రొడ్యూసర్ దీప్తి నడిమింటి మూవీ సెటప్ కి తగ్గట్టు అన్ని బాగా ప్లాన్ చేసుకున్నారు. అలాగే చిరంజీవికి శేఖర్ చంద్ర అందించిన సంగీతం, బీజీఎమ్ బాగుంది. కెమెరా వర్క్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. కాకపోతే చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ చాలా బెటర్ గా రాసుకోవాల్సింది. సినిమాలో అనవసరమైన సీన్స్ ఎడిట్ చేయాల్సింది. డైరెక్టర్ శుభ సాయి వెంకట్ రాసుకున్న స్టోరీలో మంచి పోటెన్షియల్ ఉంది. కానీ వాటిని స్క్రీన్ పై ఇంట్రెస్టింగ్ గా చూపడంలో తడబడ్డారు. కొన్ని సీన్స్ ని క్లారిటీగా చూపించి ఉంటే వన్ అఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ గా ఈ మూవీ అనిపించేది.
Final Review :
ఓవరాల్ గా కికు చిరంజీవి మంచి స్టోరీ లైన్ తో తెరకెక్కినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే లేక, సాగదీత సీన్ల వల్ల బోర్ కొట్టేస్తుంది. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీలోని ఎమోషనల్ కంటెంట్, ట్విస్ట్ లు, ఈ రకమైన థ్రిల్లర్ జోనర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి నచ్చుతుంది. కానీ అన్ని రకాల ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో ముందు ముందు తెలుస్తుంది.