Register as a Reviewer
టాక్సిక్ (Toxic)

టాక్సిక్ (Toxic)

Upcoming Expected Release: 26 Aug 2026

Toxic Trailer : గ్యాంగ్ స్టర్ గా మళ్ళీ బాక్స్ ఆఫీస్ పైకి టాక్సిక్ తో దండెత్తనున్న రాకీ భాయ్...

Director: Geetu Mohandas
Cast: Yash, Nayanthara, Kiara Advani, Tara Sutaria, Rukmini Vasanth, Huma Qureshi

About This Movie

పాన్ ఇండియా వైడ్ గా అతి త్వరలో రాబోయే క్రేజీ సినిమాల్లో "టాక్సిక్" కూడా ఒకటి.  శాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాపై ఏ రేంజ్ భారీ అంచనాలున్నాయో తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, అండ్ సాంగ్స్ హైప్ ని పీక్స్ కి తీసుకెళ్లిపోయాయి. ఇక తాజాగా ఈ మూవీ నుండి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ట్రైలర్ కూడా విడుదలైంది. సోషల్ మీడియాలో కాసేపటికే ట్రెండింగ్ లోకి వచ్చిన టాక్సిక్ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలని డబుల్ చేసేసింది. 

 

ఇక టాక్సిక్ సినిమాకు యష్, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కలిసి కథని రెడీ చేయడం విశేషం. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ హీరోయిన్లుగా కీ రోల్స్  లోనూ నటించగా, ట్రైలర్ అయితే ఫ్యాన్స్ కి మంచి థ్రిల్ ఫీల్ ఇస్తుంది. నాలుగు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో యష్ తో పూర్తిగా అదిరిపోయే ఆక్షన్ సీన్స్ ని నింపేయగా, హీరోయిన్లతో కూడా సాలిడ్ ఫైట్ సీన్స్ ని చూపించడం జరిగింది. వాటికి తగ్గట్టు రవి బసూర్ అదిరిపోయే బీజీఎమ్, విజువల్స్ తో హై లెవెల్లో ట్రైలర్ అట్రాక్ట్ అయ్యేలా ఉంది. అన్నటికి మించి ఇందులో యష్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. 

 

ఓవరాల్ గా ఈ మూవీలో తండ్రి కొడుకుల వైరమే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. చాలా సినిమాల్లో చూసే కథే.. కొంచెం కొత్తగా హాలీవుడ్ రేంజ్ లో మేకర్స్ చూపిస్తున్నారు. ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న యష్, ముందు సినిమాలకంటే స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక కొన్ని సింగిల్ లైన్ డైలాగులు చాలా పవర్ ఫుల్ గా, బోల్డ్ గా ఉన్నాయి.

 

అయితే సినిమా అడల్ట్స్ మాత్రమే చుసేటట్టు తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక టాక్సిక్ మూవీ కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ విడుదల చేయనున్నారు.  కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ టాక్సిక్ సినిమాను గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేయగా, సినిమాను ఫైనల్ గా ఆగస్టు 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఏడాదిగా వాయిదా పడుతూ వస్తున్న టాక్సిక్ మూవీ ఫైనల్ గా మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానుండగా, టాక్సిక్ తో యష్ మళ్ళీ రాకీ భాయ్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తాడో లేదో చూడాలి.

Why MRO?