Register as a Reviewer
రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)

రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)

04 Sep 2026
Overall Rating
4.6/10
21 Reviews

Ramba Oorvasi Menaka : కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రంభ ఊర్వశి మేనకా". చంద్ర మోహన్ చింతాడా దర్శకత్వం వహించిన ఈ మూవీని అన్నపూర్ణ బ్యానర్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై నిమ్మకాయల ప్రసాద్, రాజేష్ దండ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Chandra Mohan Chintada
Cast: Allari Naresh, Surbhi, Rashi Singh, Vishnupriya, Prisha Singh, Vennela Kishore, Naresh VK, Srinivas Reddy, Racha Ravi, Muralidhar Goud

Available in:

Reviews

What critics and the public are saying about రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)

Media Reviews

17 Avg: 4.6/10
C
Cinema Picha Youtube Channel
4

Below Average

Ramba Oorvasi Menaka Movie review

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ఆల్మోస్ట్ అల్లరి నరేష్ గత మూవీ యముడికి మొగుడు కాన్సెప్ట్ లాగానే ఇది కూడా ఉంటుంది. అండ్ సినిమా స్టోరీ పాయింట్ గురించి చెప్తే బానే ఉంది. ఓవరాల్ గా కామెడీ అయితే నాకు వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కి కూడా కనెక్ట్ అవ...

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ఆల్మోస్ట్ అల్లరి నరేష్ గత మూవీ యముడికి మొగుడు కాన్సెప్ట్ లాగానే ఇది కూడా ఉంటుంది. అండ్ సినిమా స్టోరీ పాయింట్ గురించి చెప్తే బానే ఉంది. ఓవరాల్ గా కామెడీ అయితే నాకు వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కి కూడా కనెక్ట్ అవలేం. అండ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక AI అయితే సినిమాలో వరెస్ట్ గా ఉన్నాయి. సెట్ ప్రాపర్టీస్ ఫేక్ గా అనిపిస్తాయి. 


అండ్ సినిమాలో మెయిన్ గా అల్లరి నరేష్ గారి యాక్టింగ్ పెద్దగా లేదు. కానీ ఆయన పొటెన్షియల్ కి తగ్గ రోల్ కాదు ఇది. అండ్ మిగతా వాళ్ళు అంతంత మాత్రమే.. అండ్ సినిమాలో ఓవరాల్ గా కొన్ని కామెడీ సీన్స్ తప్ప ఇంకేమి వర్కౌట్ కాలేదు. ఫైనల్లీ అల్లరి నరేష్ గారు ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా బాగా చేద్దామనుకున్నారు కానీ, ఇది యముడికి మొగుడు 2.0 లా ఉంది కానీ, కనెక్ట్ కాదు. 

Sep 04, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Ramba oorvasi menaka movie review

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. నాకు అల్లరి నరేష్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన మీదున్న అభిమానంతోనే సినిమాకి వెళ్ళాను. సినిమా చూసాక ఓవరాల్ గా కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి. బేసిగ్గా స్టోరీ పాయింట్ చూస్తే.. ఒక బుక్ లో ఉన్నట్టు, రంభ ఊర్వశి మేనక లు ఏదో ఒకరోజు వచ్చి వరం ఇస్తాడని ఎదురుచూస్తుంటారు. ఓపెన్ గా చె...

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. నాకు అల్లరి నరేష్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన మీదున్న అభిమానంతోనే సినిమాకి వెళ్ళాను. సినిమా చూసాక ఓవరాల్ గా కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి. బేసిగ్గా స్టోరీ పాయింట్ చూస్తే.. ఒక బుక్ లో ఉన్నట్టు, రంభ ఊర్వశి మేనక లు ఏదో ఒకరోజు వచ్చి వరం ఇస్తాడని ఎదురుచూస్తుంటారు. ఓపెన్ గా చెప్పాలంటే మంచి లైన్ ని తీసుకొచ్చి, రొటీన్ ట్రీట్మెంట్ తో తలనొప్పి తీసుకొచ్చారు. అండ్ సినిమాలో నరేష్ గారు మాత్రం బాగా పెర్ఫార్మ్ చేసారు. 


కొన్ని సీన్స్ కోసం ఒకసారి చూసేలానే ఉంది. మూవీలోని కాన్సెప్ట్ బాగుంది. కామెడీ సీన్స్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ ఇంద్రుడిగా బాగున్నాడు. మైనస్ పాయింట్స్ చెప్పుకుంటే, రొటీన్ సీన్స్, రొటీన్ స్టోరీ.. అండ్ ట్రీట్మెంట్ కూడా యావరేజ్ టెంప్లెట్ తో వెళ్ళిపోతుంది. అండ్ మదర్ సెంటిమెంట్ కనెక్ట్ కాలేదు. కొన్ని సీన్స్ కన్విన్సింగ్ గా లేదు. అండ్ ముగ్గురి హీరోయిన్లకు సరైన సీన్లు లేవు. ఓవరాల్ గా పెద్ద పెద్ద కామెడియన్లను పెట్టి బాగానే ట్రై చేసారు. కానీ ఫ్రెష్ ఫీల్ అయితే రాలేదు. కొన్ని ఫన్ సీన్ల కోసం ఒకసారి చూసేలా సినిమా ఉంది. అండ్ ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ 2.75\5

Sep 05, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
4

Below Average

Rambha Oorvasi Menaka movie review

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదండి. అసలు సినిమాలో స్టోరీ పాయింట్ ఏముందో కూడా సరిగా అర్ధం కాదు. ఎందుకంటే టైటిల్ రోల్ చేసిన వాళ్ళ చుట్టూ సినిమా ఉంటుంది కానీ, వాళ్లకు అస్సలు కనెక్ట్ అవదు. అండ్ ఈ సినిమా పదేళ్ల కిందట వచ్చినా కూడా హిట్ అవదు. మొత్తం సినిమాలో ఒక...

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదండి. అసలు సినిమాలో స్టోరీ పాయింట్ ఏముందో కూడా సరిగా అర్ధం కాదు. ఎందుకంటే టైటిల్ రోల్ చేసిన వాళ్ళ చుట్టూ సినిమా ఉంటుంది కానీ, వాళ్లకు అస్సలు కనెక్ట్ అవదు. అండ్ ఈ సినిమా పదేళ్ల కిందట వచ్చినా కూడా హిట్ అవదు. మొత్తం సినిమాలో ఒక్క సీన్ కూడా నచ్చలేదు. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ లో సినిమా చేంజ్ అవుతుంది అన్న ఆశ వస్తుంది, కానీ సినిమాలో అదొక్క సీన్ తప్ప ఇంకేమి లేదు. 


అండ్ సినిమాలో హీరోయిన్లు ఐదు నిమిషాల కొచ్చి ఏవో డాన్సులు వేసి, డైలాగులు చెప్పి వెళ్ళిపోతారు. అండ్ సినిమాలో వింటేజ్ నరేష్ కనిపిస్తాడు అని, చాలా మంది ఆడియన్స్ అనుకున్నారు కానీ, ఇప్పుడు కూడా దెబ్బేసారు. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే ఎవ్వరు కూడా ఫ్రెష్ గా చేయలేదు. ఓవరాల్ గా మూవీలో కథ పరంగా ఎక్కడా సీరియస్ నెస్ లేదు. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా లేదు. ఓవరాల్ గా రంభ ఊర్వశి మేనకా డిస్సపాయింట్ చేసిందండి. 

Sep 04, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
5

Average

Ramba Oorvasi menaka movie review

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. మూవీ గురించి చెప్పాలంటే గుడ్. బాగుంది సినిమా.. అంటే అవుట్ రైట్ ఫన్నే. స్టార్టింగ్ లో ఒకలాగా ఉంటది, ఎండింగ్ లో ఒకలా ఉంటది. సినిమాలో ఫన్ బాగానే వర్కవుట్ అయింది. అవుట్ డేటెడ్ అనుకున్నా, కానీ మంచి ఫన్ అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పాలి. అల్లరి నరేష్ గారు ఇలా ఫన్ ఓరియెంటెడ్ మూవీస్...

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. మూవీ గురించి చెప్పాలంటే గుడ్. బాగుంది సినిమా.. అంటే అవుట్ రైట్ ఫన్నే. స్టార్టింగ్ లో ఒకలాగా ఉంటది, ఎండింగ్ లో ఒకలా ఉంటది. సినిమాలో ఫన్ బాగానే వర్కవుట్ అయింది. అవుట్ డేటెడ్ అనుకున్నా, కానీ మంచి ఫన్ అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పాలి. అల్లరి నరేష్ గారు ఇలా ఫన్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తే బాగుంటుంది. అండ్ సినిమాలో చాలా సినిమాల రిఫరెన్స్ లు ఉంటాయి. ఇక ఎమోషనల్ డ్రామా అనేది సినిమాలో వర్కౌట్ అయింది. కానీ దానికన్నా ఫన్ మెయిన్ కంటెంట్ అని చెప్పాలి. 


అండ్ సినిమాలో 1 or 2 సీన్స్ రొటీన్ గా బోరింగ్ గా అనిపిస్తాయి. అల్లరి నరేష్ గారితో పాటు, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా బాగుంది. హీరోయిన్లు అందరూ బాగా చేసారు. సినిమాలో చిన్న మెసేజ్ కూడా బాగుంది. సాంగ్స్ అండ్ బీజీఎమ్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా గుడ్. ఇప్పటికైతే ఈ రివ్యూ ఇంతే.


 


Sep 05, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
2

Bad

Ramba Oorvasi menaka movie review

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ముందు నేను అల్లరి నరేష్ మూవీ చాలా రోజులుగా మిస్ అయ్యాను ఎలాగైనా వెళ్లాలని వెళ్ళా... చూసాక it is so bad... ఈ సినిమా అయితే ఇక కష్టమే. మాములుగా కొన్ని సినిమాలుంటాయి.. అరె ఇది అప్పుడొచ్చుంటే ఆడుండేదేమో రా అనేట్టు ఉంటాయి.. కానీ ఈ సినిమా అలా కూడా ఉండదు. ఎప్...

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ముందు నేను అల్లరి నరేష్ మూవీ చాలా రోజులుగా మిస్ అయ్యాను ఎలాగైనా వెళ్లాలని వెళ్ళా... చూసాక it is so bad... ఈ సినిమా అయితే ఇక కష్టమే. మాములుగా కొన్ని సినిమాలుంటాయి.. అరె ఇది అప్పుడొచ్చుంటే ఆడుండేదేమో రా అనేట్టు ఉంటాయి.. కానీ ఈ సినిమా అలా కూడా ఉండదు. ఎప్పుడొచ్చినా ఆడవు అనేలా ఉంటుంది.


పైగా ఈ సినిమాలో రంభ ఊర్వశి మేనకలను దేవతలంటూ చూపిస్తూ ఐటెం సాంగ్ చేయించారు అది అస్సలు నచ్చలేదు. పైగా వెకిలి చేష్టలు చేయిస్తారు. ఈ స్టోరీ లైన్ రాయడం చాలా రొట్టగా ఉంది. అసలు ఈ సీన్ కి నవ్వాలా అని ఒక్క సీన్ కూడా అనిపించదు. తల తోక సంబంధం లేని జబర్దస్త్ కామెడీ కన్నా ఘోరంగా రోతగా ఉంటుంది ఈ సినిమా. సినిమాలో ఎన్ని బెస్ట్ సీన్స్ ఉన్నాయో లెక్కబెట్టడం కూడా అవసరం ఉండదు. ఎందుకంటే నాకైతే ఎక్కడా కనిపించలేదు. అసలు స్టోరీ ఎట్నుంచి ఎటొచ్చి ఎల్తుందో కూడా తెలీదు. పైగా సినిమాలో AI సీన్లు పెట్టారు. దరిద్రంగా ఉంటాయి. చాలా సీన్లు non sink లో ఉంటాయి. ఓవరాల్ గా దీని గురించి ఎంత మాట్లాడితే అంత వేస్ట్.

Sep 05, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
3

Not Good

Ramba oorvasi menaka movie review

సో 'రంభ ఊర్వశి మేనక' మూవీ చూసొస్తున్నాను. సగమే చూసొస్తున్నాను. బేసిగ్గా అంతే ఎం లేదు మూవీ.. నేను సినిమాలో ఎంత దరిద్రం ఉన్నా, ఒక్క పాజిటివ్ ఉన్నా మొత్తం చూస్తా.. కానీ ఈ సినిమాలో ఒక్క జోక్ కి నవ్వు రాలేదు. నాకొక్కడికే నవ్వు రావట్లేదేమో అనుకున్నా, కానీ థియేటర్లో మిగతా వాళ్ళు కూడా నవ్వట్లేదు. సినిమా మొత...

సో 'రంభ ఊర్వశి మేనక' మూవీ చూసొస్తున్నాను. సగమే చూసొస్తున్నాను. బేసిగ్గా అంతే ఎం లేదు మూవీ.. నేను సినిమాలో ఎంత దరిద్రం ఉన్నా, ఒక్క పాజిటివ్ ఉన్నా మొత్తం చూస్తా.. కానీ ఈ సినిమాలో ఒక్క జోక్ కి నవ్వు రాలేదు. నాకొక్కడికే నవ్వు రావట్లేదేమో అనుకున్నా, కానీ థియేటర్లో మిగతా వాళ్ళు కూడా నవ్వట్లేదు. సినిమా మొత్తం 90స్ లో కూడా రాని క్రిమ్జ్ కామెడీని ఇరికించారు. ఎంతలా అంటే నేను చూసిన థియేటర్లో కొంతమంది నిద్రపోయారు. 


సినిమా అయితే దారుణాతి దారుణం. సినిమాలో హీరో సహా ఎవ్వరి క్యారెక్టర్ కూడా నచ్చలేదు నాకు. అండ్ సినిమా కోసం చాలా ట్రావెల్ చేశా.. దాంతో మరింత తలనొప్పి ఒచ్చింది నాకు. అండ్ ట్రైలర్ కూడా నచ్చలేదు కానీ ఎందుకు పోయాను అంటే... ఈ ఇయర్ లో కొన్ని రొటీన్ ట్రైలర్ ఇచ్చి, సినిమాలో మంచి కంటెంట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా కూడా ఉంటుందేమో అని ఆశతో వెళ్ళాను. కానీ తప్పు చేసానని వెళ్ళాక తెలిసింది. సింపుల్ గా చెప్పాలంటే ఏదో పైత్యంతో వెళ్ళాను. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే... నా వల్ల కాదు. ఇక మిగతా వాళ్ళు రుద్దుతున్నావు అంటే కూడా నేనేం చేయలేను. ఓవరాల్ గా నాకైతే నచ్చలేదు. 

Sep 05, 2026 Watch
ABP Desam
ABP Desam Website
4

Below Average

Ramba oorvasi menaka movie review

అల్లరి' నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే పేరుండేది ఒకప్పుడు. తెరపై ఆయన కనిపిస్తే చాలు... ఆడియన్స్ కూడా నవ్వేవారు. అయితే... క్రమక్రమంగా ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. 'జబర్దస్త్' వంటి కామెడీ షోలు వచ్చాక ఒకప్పటి అల్లరి నరేష్ సినిమాల్లో జోకులకు జనాలు నవ్వడం మానేశారు. ఇటువంటి తరుణంలో 'రంభ...

అల్లరి' నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే పేరుండేది ఒకప్పుడు. తెరపై ఆయన కనిపిస్తే చాలు... ఆడియన్స్ కూడా నవ్వేవారు. అయితే... క్రమక్రమంగా ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. 'జబర్దస్త్' వంటి కామెడీ షోలు వచ్చాక ఒకప్పటి అల్లరి నరేష్ సినిమాల్లో జోకులకు జనాలు నవ్వడం మానేశారు. ఇటువంటి తరుణంలో 'రంభ ఊర్వశి మేనక' అంటూ కామెడీ మూవీతో వచ్చారు.


ఇక సినిమా విషయానికి వస్తే... ఒక మూవీలో ఉండాల్సిన సెంటిమెంట్, ఎమోషన్ గాని, కామెడీ గాని 'రంభ ఊర్వశి మేనక'లో మిస్ అయ్యింది. ఒక్కటంటే ఒక్క జోక్ కూడా సరిగా ల్యాండ్ కాలేదు. నవ్వించలేదు. సీనియర్ నరేష్ కాస్త నవ్వించడానికి ట్రై చేశారు గానీ వర్కవుట్ అవ్వలేదు. అల్లరి' నరేష్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 'రంభం ఊర్వశి మేనక'లో ఆ టైమింగ్ కనిపించలేదు. ఓవరాల్ గా కష్టపడకుండా ఏదీ రాదని, యువత కలలు కంటే సరిపోదని, కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలని సందేశంతో తెరకెక్కిన సినిమా 'రంభ ఊర్వశి మేనక'. చివరిలో మదర్ సెంటిమెంట్ ఉంది. ఆ రెండూ మంచి పాయింట్స్. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. అసలు నవ్వించలేదు. అల్లరి నరేష్ మరోసారి డిజప్పాయింట్ చేశారు. కొన్ని నవ్వులు మాత్రమే ఉన్నాయి.



Sep 04, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Ramba Oorvasi menaka movie review

రంభ ఊర్వశి మేనక : మంచి రోల్‌ తో కమ్‌బ్యాక్ ఇస్తాడనుకుంటే, అల్లరి నరేష్ మళ్లీ అదే రొటీన్ ట్రాప్‌లో పడిపోయాడు. రంభ ఊర్వశి మేనక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం కంప్లీట్ హెడేక్!దేవలోకం డ్రామాలు, యముడి సీన్లు, దానికి తోడు కాలం చెల్లిన సుడిగాడు స్పూఫ్‌లు.. అబ్బో! ఏమాత్రం వర్కవుట్ అవ్వని ఐడియాలని కలిపి తిప్...

రంభ ఊర్వశి మేనక : మంచి రోల్‌ తో కమ్‌బ్యాక్ ఇస్తాడనుకుంటే, అల్లరి నరేష్ మళ్లీ అదే రొటీన్ ట్రాప్‌లో పడిపోయాడు. రంభ ఊర్వశి మేనక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం కంప్లీట్ హెడేక్!


దేవలోకం డ్రామాలు, యముడి సీన్లు, దానికి తోడు కాలం చెల్లిన సుడిగాడు స్పూఫ్‌లు.. అబ్బో! ఏమాత్రం వర్కవుట్ అవ్వని ఐడియాలని కలిపి తిప్పి కొట్టారు. ఆడియెన్స్‌ని సర్ ప్రైజ్ చేసే ఒక్క ఎలిమెంట్ కూడా లేదు.


నరేష్ ఎనర్జీ ఓకే కానీ, రాసిన రైటింగ్‌లోనే అసలు దమ్ము లేదు. సీన్లలో పంచ్‌లు పేలక నవ్వులు అస్సలు రావు. ఫస్టాఫ్ ఎటో వెళ్తే, సెకండాఫ్ ఇంకాస్త సాగదీసి ఆడియెన్స్ ఓపికకి పెద్ద పరీక్షే పెట్టారు.


Sep 04, 2026 Read Review
5

Average

Ramba Oorvasi Menaka movie Review

ఇంద్రలోకం, దేవలోకం, యమలోకంతో ముడిపెడుతూ కామెడీ ప్రధానంగా చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఈ "రంభ ఊర్వశి మేనక" చాలా కాలం తర్వాత వచ్చిన మూవీ అని చెప్పొచ్చు. ఇక అల్లరి నరేష్‌ అంటే కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఈ మధ్య గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అలాంటి జోనర్‌లో ఈ మూవీ చేశాడు. చేస్తే చేశాడు కానీ, నేట...

ఇంద్రలోకం, దేవలోకం, యమలోకంతో ముడిపెడుతూ కామెడీ ప్రధానంగా చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఈ "రంభ ఊర్వశి మేనక" చాలా కాలం తర్వాత వచ్చిన మూవీ అని చెప్పొచ్చు. ఇక అల్లరి నరేష్‌ అంటే కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఈ మధ్య గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అలాంటి జోనర్‌లో ఈ మూవీ చేశాడు. చేస్తే చేశాడు కానీ, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా కామెడీ ఉండాలి, కానీ ఆయన తన ఇరవై ఏళ్ల క్రితం స్టయిల్‌ కామెడీతోనే రావడం, అదే ఫార్మాట్‌లో ఈ మూవీ చేయడం గమనార్హం. 


మూవీ స్టార్టింగ్ నుంచి అల్లరి నరేష్‌ మార్క్ రొటీన్‌ కామెడీ డైలాగ్‌లు, సీన్లతో సాగుతుంది. సీన్లలో మ్యాటర్‌ లేదు, డైలాగ్‌ల్లో కామెడీ లేదు. పైగా నాయిస్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో నవ్వు రాదు కదా, చిరాకు తెప్పిస్తుంది. చాలా సన్నివేశాలు సిల్లీగా ఉంటాయి. సీన్లలో క్వాలిటీ లేదు. అంతా ఊహించినట్టుగా, మరోవైపు రొటీన్‌గా నడుస్తుంటాయి. ఓవరాల్‌ గా మూవీ క్లైమాక్స్ ఉన్నంతలో బెటర్‌ గా ఉంటుంది. మిగిలిన సినిమా మొత్తం రొటీన్‌ రొడ్డకొట్టుడు, అరిగిపోయిన ఓల్డ్ ఫార్మాట్‌లో సాగే కామెడీ మూవీగా చెప్పొచ్చు.


ఓవరాల్ గా ఇది అల్లరి నరేష్‌ మార్క్ పరమ రొటీన్‌ కామెడీ సినిమా. నవ్వులు తక్కువ గోల ఎక్కువ. అల్లరి నరేష్‌ తన బలమైన గ్రౌండ్‌(కామెడీ)లోనూ సిక్స్ కాదు కదా, కనీసం ఫోర్‌ కూడా కొట్టలేకపోయారు.




Sep 04, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Ramba oorvasi menaka movie review

ఈ మధ్య సీరియస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న అల్లరి నరేష్.. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా రంభ ఊర్వశి మేనక. దానికితోడు దేవకన్యలు భూమ్మీదకు వస్తే అనే ఫాంటసీ పాయింట్‌తో ఈ సినిమాను చంద్రమోహన్ తెరకెక్కించారు. కానీ ఈ పాయింట్‌ను తీసుకుని వినోదాన్ని పంచాలని దర్శకుడు చేసిన ప్రయత్నం తెరపై మాత్రం బెడిసిక...

ఈ మధ్య సీరియస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న అల్లరి నరేష్.. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా రంభ ఊర్వశి మేనక. దానికితోడు దేవకన్యలు భూమ్మీదకు వస్తే అనే ఫాంటసీ పాయింట్‌తో ఈ సినిమాను చంద్రమోహన్ తెరకెక్కించారు. కానీ ఈ పాయింట్‌ను తీసుకుని వినోదాన్ని పంచాలని దర్శకుడు చేసిన ప్రయత్నం తెరపై మాత్రం బెడిసికొట్టింది. ఎక్కడా ఎలాంటి కొత్తదనం లేని రొటీన్ ఫార్ములాతో సాగడం వల్ల తర్వాత ఏం జరగబోతోందో ప్రేక్షకుడు ఈజీగా ఊహించేయవచ్చు. 


చాలా గ్యాప్ తర్వాత తన మార్క్ పూర్తి స్థాయి కామెడీ రోల్‌లో అల్లరి నరేష్ చక్కగా నటించాడు. కానీ ఏం చేస్తాం కథ సహకరించకపోతే నరేష్ ఎంత బాగా చేసినా ప్రయోజనం అయితే ఉండదు. దర్శకుడు చంద్రమోహన్ రాసుకున్న కాన్సెప్ట్‌కు బలమైన స్క్రిప్ట్ తోడై ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. కానీ సరైన ఎగ్జిక్యూషన్ లేకపోవడంతో సినిమా నిరాశపరుస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా బాగున్నాయి. ఓవరాల్‌ గా రంభ ఊర్వశి మేనక.. ఆకట్టుకోని ఫాంటసీ డ్రామా..!

Sep 04, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
4

Below Average

Ramba oorvasi menaka movie review

సినిమా రివ్యూ: రంభ ఊర్వశి మేనకఏదో కొత్త రుచి చూపిస్తారనుకుంటే, తిప్పి తిప్పి అదే పాత చింతకాయ పచ్చడిని విస్తరిలో వడ్డించారు! రంభ ఊర్వశి మేనక సినిమా కథ, కథనాలు చూస్తుంటే మన తాతల కాలం నాటి దేవలోకం ఫార్ములాకి కాస్త తిరగమాత పెట్టి రీ-సర్వ్ చేసినట్టే ఉంది.దేవలోకం కాన్సెప్ట్, యముడి హడావుడి, సుడిగాడు టైమ్ న...

సినిమా రివ్యూ: రంభ ఊర్వశి మేనక

ఏదో కొత్త రుచి చూపిస్తారనుకుంటే, తిప్పి తిప్పి అదే పాత చింతకాయ పచ్చడిని విస్తరిలో వడ్డించారు! రంభ ఊర్వశి మేనక సినిమా కథ, కథనాలు చూస్తుంటే మన తాతల కాలం నాటి దేవలోకం ఫార్ములాకి కాస్త తిరగమాత పెట్టి రీ-సర్వ్ చేసినట్టే ఉంది.


దేవలోకం కాన్సెప్ట్, యముడి హడావుడి, సుడిగాడు టైమ్ నాటి పాత స్పూఫ్‌లు.. ఇవన్నీ మనం ఎన్నో ఏళ్లుగా నమిలేసిన పాత రోటీన్ పిండే! రీసెంట్‌గా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసిన అల్లరి నరేష్, మళ్లీ ఈ బూజు పట్టిన రెసిపీని ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాదు.


ఆయన తన టైమింగ్‌తో కాపాడే ప్రయత్నం చేసినా, చప్పబడిన సీన్ల వల్ల ఎక్కడా నవ్వులు పండవు. ద్వితీయార్థంలో సాగదీత ఎక్కువై ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

ఆఖరి మాట:

ఏమాత్రం కొత్తదనం లేని ఈ పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాను జీర్ణించుకోవడం కష్టమే. నిరభ్యంతరంగా స్కిప్ చేసేయొచ్చు!

Sep 04, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Ramba Oorvasi menaka movie review

ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథలతో మెప్పించిన అల్లరి నరేష్, మళ్లీ తనదైన మార్క్ సోషియో-ఫాంటసీ కామెడీతో ముందుకు వచ్చిన చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. దేవలోక నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో దర్శకుడు చంద్రమోహన్ 'సుడిగాడు' తరహా స్పూఫ్‌లు, హాస్యాన్ని జోడించి అలరించే ప్రయత్నం చేశారు. అల్లరి నరేష్ తనదైన ఈజీ మేనరిజమ్, కామ...

ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథలతో మెప్పించిన అల్లరి నరేష్, మళ్లీ తనదైన మార్క్ సోషియో-ఫాంటసీ కామెడీతో ముందుకు వచ్చిన చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. దేవలోక నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో దర్శకుడు చంద్రమోహన్ 'సుడిగాడు' తరహా స్పూఫ్‌లు, హాస్యాన్ని జోడించి అలరించే ప్రయత్నం చేశారు.


అల్లరి నరేష్ తనదైన ఈజీ మేనరిజమ్, కామెడీ టైమింగ్‌తో సినిమాను నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, స్క్రిప్ట్‌లో కొత్తదనం లేకపోవడం సినిమాకు పెద్ద మైలేజ్ ఇవ్వలేకపోయింది. గతంలో వచ్చిన అనేక ఫాంటసీ సినిమాల ఛాయలు స్పష్టంగా కనిపించడంతో పాటు, ద్వితీయార్థంలో సాగదీత సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి.


ప్రొడక్షన్ విలువలు, శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదనిపించినా, బలహీనమైన కథనం వల్ల సినిమా గ్రాఫ్ కిందకే పడిపోయింది. మొత్తంగా చెప్పాలంటే, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా కేవలం అల్లరి నరేష్ కామెడీ కోసం చూస్తే ఈ పాత ఫార్ములా చిత్రం ఒకసారి ట్రై చేయొచ్చు!

Sep 04, 2026 Read Review
Gulte
Gulte Website
4

Below Average

Rambha Oorvasi menaka movie review

Allari Naresh who is doing too many Serious films these days is back to his strong forte, comedy with Ramba Oorvashi Menaka. Directed by Chandramohan, the movie is jointly produced by Hasya Movies Razesh Danda and Annapurna Studios.Allari Naresh is sincere in his act in the film. Probably, he has do...

Allari Naresh who is doing too many Serious films these days is back to his strong forte, comedy with Ramba Oorvashi Menaka. Directed by Chandramohan, the movie is jointly produced by Hasya Movies Razesh Danda and Annapurna Studios.


Allari Naresh is sincere in his act in the film. Probably, he has done more comedy characters than any of the heroes in this generation. But then, he is letdown by some bad writing in the film.


Positives:


1.⁠ ⁠A Few Comedy Episodes


Negatives:


1.⁠ ⁠Outdated Ideas In Writing

2.⁠ ⁠Unexciting Execution

3.⁠ ⁠Bland Emotions

4.⁠ ⁠Excessive pop-culture References


Overall, Ramba Oorvashi Menaka, offers nothing new to the audience.


Bottomline: Outdated Comedy




Sep 04, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Rambha oorvasi mekaka movie review

తెలుగులో సోషియో ఫాంటసీలకు కొదవలేదు. పైగా దేవలోకం, యమలోకం నేపథ్యంలో ఎన్నో సినిమాలు యేళ్ళ తరబడి వస్తూనే ఉన్నాయి. గతంలో వచ్చిన ఇలాంటి సినిమాల్లోని అంశాలు తీసుకుని దర్శకుడు చంద్రమోహన్‌ 'పులిహోర' కలిపారు. అంతే! రంభ ఊర్వశి మేనక సినిమా కథ, కథనాలలో ఎలాంటి కొత్తదనం లేదు. ఇందులో చాలా సన్నివేశాలు స్పూఫ్ తో సాగ...

తెలుగులో సోషియో ఫాంటసీలకు కొదవలేదు. పైగా దేవలోకం, యమలోకం నేపథ్యంలో ఎన్నో సినిమాలు యేళ్ళ తరబడి వస్తూనే ఉన్నాయి. గతంలో వచ్చిన ఇలాంటి సినిమాల్లోని అంశాలు తీసుకుని దర్శకుడు చంద్రమోహన్‌ 'పులిహోర' కలిపారు. అంతే! రంభ ఊర్వశి మేనక సినిమా కథ, కథనాలలో ఎలాంటి కొత్తదనం లేదు. ఇందులో చాలా సన్నివేశాలు స్పూఫ్ తో సాగి 'సుడిగాడు' మూవీని గుర్తు చేస్తాయి. జయాపజయాలను పక్కన పెడితే ఈ మధ్య కాలంలో 'అల్లరి' నరేశ్‌ కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తున్నాడు. దాంతో అతనిలోని నటుడు వెలుగులోకి వస్తున్నాడు. కానీ ఈ తరహా రొట్టకొట్టుడు కథలను ఎంచుకుని, సినిమాలు చేస్తే జనం ఆదరిస్తారని ఎలా అనుకున్నాడో అర్థం కాదు. 


ఇక నటన విషయానికి వస్తే అల్లరి నరేశ్‌ కు ఇలాంటి పాత్ర చేయడం నల్లేరు మీద బండి నడక. అలానే సాఫీగా లాగించేశాడు. మిగతా వాళ్ళందరూ సోసోగానే నటించారు. అయితే అల్లరి నరేశ్‌ తనదైన కామెడీని పండించాలని అనుకున్నప్పుడు ఈ తరం మెచ్చే కథలను ఎంచుకోవాలని తప్పితే... కోల్డ్ స్టోరేజ్ లోని స్టోరీలను ఇకపై ముట్టుకోకుండా ఉంటే బెటర్. ఈ కథను జనం మెచ్చుతారని నిర్మాతలు రాజేశ్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ ఎలా నమ్మి కోట్లు ఖర్చు పెట్టారో అర్థమే కాదు. ఓవరాల్ గా ఈ పాత చింతకాయ పచ్చడిని ఎంజాయ్ చేయాలంటే చాలా ఓపికుండాలి. 


Sep 04, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Rambha oorvasi menaka movie review

సెకండ్ ఇన్నింగ్స్ లో ‘నాంది’ సినిమాతో విజయాన్నందుకున్నప్పటికీ.. ఆ తర్వాత ట్రాక్ తప్పాడు అల్లరి నరేష్. సీరియస్ సినిమాలు కొన్ని తేడా కొట్టాక ఒకప్పుడు తనకు అనేక విజయాలందించిన కామెడీ జానర్లో రంభ ఊర్వశి మేనక మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.&nb...

సెకండ్ ఇన్నింగ్స్ లో ‘నాంది’ సినిమాతో విజయాన్నందుకున్నప్పటికీ.. ఆ తర్వాత ట్రాక్ తప్పాడు అల్లరి నరేష్. సీరియస్ సినిమాలు కొన్ని తేడా కొట్టాక ఒకప్పుడు తనకు అనేక విజయాలందించిన కామెడీ జానర్లో రంభ ఊర్వశి మేనక మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. 


అల్లరి నరేష్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన మాట వాస్తవం. అతడికో మంచి హిట్ పడాలని అందరూ కోరుకుంటారన్నది నిజం. కానీ ఇప్పుడు అతను కామెడీ ట్రై చేస్తున్నా ముందులా నవ్వులు పండట్లేదని ‘ఆ ఒక్కటీ అడక్కు’తోనే రుజువైంది. ఒకవేళ కామెడీ ట్రై చేసినా.. ఇప్పటి ట్రెండుకు తగ్గ కథను ఎంచుకుని డిఫరెంటుగా ఏదైనా ప్రయత్నించాలి కానీ.. కానీ ‘రంభ ఊర్వశి మేనక’లో ఓల్డ్ ట్రీట్మెంట్ వల్ల చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు అసహనమే కలిగిస్తాయి. ఇందులో ఇచ్చిన మెసేజ్ ఎన్నో వందల సినిమాల్లో చూసిందే. ఈ మాత్రం దానికి ఇంత డ్రామా అవసరమా అన్నట్లుగా నడుస్తుందీ సినిమా.


ఒకప్పుడు అల్లరి నరేష్ కామెడీ సినిమాలు బాగా నడిచిన రోజుల్లో ఈ కథను ట్రై చేస్తే బాగుండేది. ఈ రోజుల్లో మాత్రం ఇలాంటి కథ.. ఈ తరహా నరేషన్ తో మెప్పించడం చాలా కష్టం. చివరగా: రంభ ఊర్వశి మేనక.. మ్యాజిక్ పని చేయలేదు 

Sep 04, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Rambha orvasi menaka movie review

హీరో అల్లరి నరేష్, సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ నటించిన చిత్రం రంభ ఊర్వశి మేనక. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయి బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. సినిమాలో దర్శకుడు చంద్రమ...

హీరో అల్లరి నరేష్, సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ నటించిన చిత్రం రంభ ఊర్వశి మేనక. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయి బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు.


‘రంభ ఊర్వశి మేనక’ అంటూ వచ్చిన ఈ ఫాంటసీ ఫన్ డ్రామాలో.. మెయిన్ థీమ్, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, బోరింగ్ అండ్ సిల్లీ ప్లేతో సినిమా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్నిచోట్ల మాత్రమే ఫన్ బాగుంది.


Sep 04, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
4

Below Average

Rambha oorvasi menaka movie review

దర్శకుడు చంద్రమోహన్ చింతాడ రాసుకొన్న "రంభ ఊర్వశి మేనక" కథ నేటి ప్రేక్షకుల అభిరుచికి సుదూరంగా ఉందనే విషయం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్. ఇక పాత చింతకాయపచ్చడి లాంటి కథకు 80 దశకం నాటి కథనం, సన్నివేశాలు జోడించడంతో ఫస్టాఫ్‌లో పూర్తిగా విసుగు, పరమ బోర్‌గా ఉంటాయి. అలా నిస్సారంగా, ఎలాంటి కొత్తదనం, వెగటు హాస్యంత...

దర్శకుడు చంద్రమోహన్ చింతాడ రాసుకొన్న "రంభ ఊర్వశి మేనక" కథ నేటి ప్రేక్షకుల అభిరుచికి సుదూరంగా ఉందనే విషయం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్. ఇక పాత చింతకాయపచ్చడి లాంటి కథకు 80 దశకం నాటి కథనం, సన్నివేశాలు జోడించడంతో ఫస్టాఫ్‌లో పూర్తిగా విసుగు, పరమ బోర్‌గా ఉంటాయి. అలా నిస్సారంగా, ఎలాంటి కొత్తదనం, వెగటు హాస్యంతో సాగడంతో సినిమా ప్రేక్షకుడిని సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. 


ఇక అల్లరి నరేష్ నటన చూస్తే ఇంకా పాతకాలం స్ట్రాటెజీలోనే కొట్టుమిట్టాడుతున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం ఆడియెన్స్ టేస్ట్ మారింది. ప్రేక్షకులు మామూలు కంటెంట్‌ను విసిరికొడుతున్న విషయాన్ని ఆయన గ్రహించలేదా? అనే డౌట్ వస్తుంది. ఇక వీకే నరేష్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కొన్ని సన్నివేశాల్లో తన మార్క్ కామెడీ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. ఇక రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, సురభి గ్లామర్‌పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా నిరాశపరిచారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను చూడాలా? వద్దా? అనేది మీరే నిర్ణయించుకోండి.


Sep 04, 2026 Read Review

Public Reviews

4 Avg: 4.8/10
G
Goshika Shreshta CA/Advocate
5

Average

Ramba oorvasi menaka movie review

Just finished watching Rambha Urvashi Menaka, and it’s a major letdown.The film recycles age-old socio-fantasy tropes mixed with jabardast style spoofs, but the execution completely misses the mark.It’s surprising to see Allari Naresh—who has been picking solid, content-driven roles lately—fall back...

Just finished watching Rambha Urvashi Menaka, and it’s a major letdown.


The film recycles age-old socio-fantasy tropes mixed with jabardast style spoofs, but the execution completely misses the mark.


It’s surprising to see Allari Naresh—who has been picking solid, content-driven roles lately—fall back into such a dated, routine script.


While his performance is decent, the flat writing, weak comedy, and predictable story offer zero fresh appeal.


overall Outdated and tedious. Save your time and skip this one unless you have serious patience to spare.


Sep 07, 2026
B
Baswaraj Students & Youth
4

Below Average

Ramba oorvasi menaka movie review

Ippude Rambha Urvashi Menaka show aipoyi hall nunchi bayatakochha bro. Standard exam hall lo bench meeda kurchunnantha torture anipinchindi...Ilanti concept unna movies na childhood nunchi TV lo enno sarlu chusesam. Adhe paatha stuff ni malli add chesi try chesaru. Kaani trust me, single scene meeda...

Ippude Rambha Urvashi Menaka show aipoyi hall nunchi bayatakochha bro. Standard exam hall lo bench meeda kurchunnantha torture anipinchindi...


Ilanti concept unna movies na childhood nunchi TV lo enno sarlu chusesam. Adhe paatha stuff ni malli add chesi try chesaru. Kaani trust me, single scene meeda kuda smile raaledhu, poorthiga flat aipoindi.


Asalu hero Naresh bro recent ga Naandhi, Itlu Maredumilli thoti solid content orientation loki veltunnadu anukunna. Malli ippudu e back-bench level outdated story enduku sign chesado, aayana career graph ki e script ela set avtundhanukunnaado assalu samaj kaavatledhu.


simple ga ee weekend ee movie ki velle plan unte immediate ga cancel cheskoni aa money thoti biryani thinesi chill avvandi. Completely skippable!


Sep 04, 2026
T
Talari Snehalatha IT Employee
5

Average

Ramba oorvasi menaka movie review

ఇప్పుడే 'రంభ ఊర్వశి మేనక' షో ముగించుకుని బయటపడ్డా! నిజం చెప్పాలంటే థియేటర్లో నా సహనానికి పెద్ద పరీక్షే ఎదురైంది.దేవలోకం బ్యాక్‌డ్రాప్‌ లో గతంలో డజన్ల కొద్దీ సినిమాలు చూసేశాం. అదే ఫార్ములాకి కొన్ని స్పూఫ్‌లు జోడించి ఏదో ప్రయోగం చేయబోయారు కానీ, రన్ టైమ్ అంతా బోర్ కొట్టించేసింది. 'సుడిగాడు' టైప్ వైబ్స్...

ఇప్పుడే 'రంభ ఊర్వశి మేనక' షో ముగించుకుని బయటపడ్డా! నిజం చెప్పాలంటే థియేటర్లో నా సహనానికి పెద్ద పరీక్షే ఎదురైంది.


దేవలోకం బ్యాక్‌డ్రాప్‌ లో గతంలో డజన్ల కొద్దీ సినిమాలు చూసేశాం. అదే ఫార్ములాకి కొన్ని స్పూఫ్‌లు జోడించి ఏదో ప్రయోగం చేయబోయారు కానీ, రన్ టైమ్ అంతా బోర్ కొట్టించేసింది. 'సుడిగాడు' టైప్ వైబ్స్ ట్రై చేసినా నాన్-స్టాప్ సీన్స్ ఏవీ నవ్వించలేకపోయాయి.


రీసెంట్‌గా సీరియస్ రోల్స్‌తో మెప్పించిన అల్లరి నరేష్, మళ్లీ ఇలాంటి కాలం చెల్లిన ప్రాసెస్ లోకి ఎందుకు వెళ్లాడో క్లూ లేదు. ఆయన నటన డిసెంట్గానే ఉన్నా, రైటింగ్ లో దమ్ము లేకపోవడంతో సీన్లు ఫ్లాట్‌గా వెళ్లాయి. ఫైనల్ గా ఒక ట్రెండీ కంటెంట్ కోరుకునే ఇప్పటి ఆడియెన్స్‌కి ఈ ప్రొడక్ట్ ఏమాత్రం కనెక్ట్ అవ్వదు. Skip it!


Sep 04, 2026
A
Arige Srikanth Private Employee
5

Average

Ramba oorvasi menaka movie review

Theater నుంచి ఇప్పుడే 'రంభ ఊర్వశి మేనక' (Ramba oorvasi menaka) చూసి వస్తున్నా.. నిజంగా పెద్ద పరీక్షే పడింది!Socio Fantacy, దేవలోకం Concept తో వందల సినిమాలు వచ్చాయి, అందులోంచి కొద్దికొద్దిగా తీసి దర్శకుడు చంద్రమోహన్ దారుణమైన 'పులిహోర' వండేశాడు. ఎక్కడా కొత్తదనం లేదు. 'సుడిగాడు' (Sudigadu) తరహా Spoof ల...

Theater నుంచి ఇప్పుడే 'రంభ ఊర్వశి మేనక' (Ramba oorvasi menaka) చూసి వస్తున్నా.. నిజంగా పెద్ద పరీక్షే పడింది!


Socio Fantacy, దేవలోకం Concept తో వందల సినిమాలు వచ్చాయి, అందులోంచి కొద్దికొద్దిగా తీసి దర్శకుడు చంద్రమోహన్ దారుణమైన 'పులిహోర' వండేశాడు. ఎక్కడా కొత్తదనం లేదు. 'సుడిగాడు' (Sudigadu) తరహా Spoof లు ఉన్నా అస్సలు పేలలేదు.


మంచి కంటెంట్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ మళ్ళీ ఈ కోల్డ్ స్టోరేజ్ రొటీన్ కథని ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాలేదు. తన రోల్ సాఫీగా చేసుకుపోయినా, కామెడీకి ఏమాత్రం వర్కవుట్ అవ్వలేదు. ప్రొడక్షన్ వేస్ట్ అనిపించింది. ఫైనల్ గా ఈ పాత చింతకాయ పచ్చడిని భరించాలంటే కొండంత ఓపిక ఉండాలి!

నేనైతే as a అల్లరినరేష్ ఫ్యాన్ గా మూవీకి వెళ్ళాను గాని, ఆ రొటీన్ ఫార్మాట్ కి జబర్దస్త్ పంచ్ లకి ఒక్క సీన్ ఎక్కలేదు. 


Sep 04, 2026

About This Movie

Story :

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రంభ ఊర్వశి మేనకా". చంద్ర మోహన్ చింతాడా దర్శకత్వం వహించిన ఈ మూవీని అన్నపూర్ణ బ్యానర్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై నిమ్మకాయల ప్రసాద్, రాజేష్ దండ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. 

Detailed Description :

మంతెన సూర్య నారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేష్) సినిమా హీరో కావాలని కలలు కంటూ, రంభ ఊర్వశి మేనక అనే డ్రామా కంపెనీ కొనసాగిస్తుంటాడు. అయితే సూరి ఇంట్లో వంశపారంపర్యంగా ఉన్న ఓ మ్యాజిక్ బుక్ లో కరెక్ట్‌ గా ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి, మేనకలు ప్రత్యక్ష్యం అవుతారని సూరికి బాబాయ్ (వీకే నరేష్) చెప్తుంటాడు. అది నమ్మి సూరి పాతికేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో ఓరోజు సూరి వేసిన ముగ్గుకి నిజంగానే రంభ (రాశి సింగ్), ఊర్వశి (ప్రిషా సింగ్), మేనక (విష్ణు ప్రియ) ప్రత్యక్ష్యమవుతారు. ఈ క్రమంలో సూరి ఆ ముగ్గురు దేవకన్యల నుంచి ఏం కోరుకున్నాడు? చిన్ననాటి స్నేహితురాలు చిన్ని (సురభి)తో సూరి లవ్ ట్రాక్ ఎలా సాగింది? భువికి దిగి వచ్చిన దేవకన్యల విషయంలో ఇంద్రుడు (వెన్నెల కిషోర్) పెట్టిన శాపం ఏమిటి? అసలు సూరి అనుకున్న కలలు నెరవేరాయా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Plus Points :

చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ కామెడీ జోనర్ లో మూవీ చేయడం వల్ల ఈ సినిమాకి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ట్రైలర్ లో చూపించినట్టుగానే అల్లరి నరేష్ సంపూర్ణంగా ఈ సినిమాలో కామెడీ రోల్ లో, తన క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంతో నరేష్ కామెడీని మిస్ అయిన వాళ్ళకి ఈ మూవీ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నరేష్ కి - బుక్ కి మధ్య నడిచే సన్నివేశాలు, అలాగే రంభ, ఊర్వశి, మేనక ఇంద్రలోకం నుంచి భూమి మీదకు వచ్చాక నడిచే సన్నివేశాలు బాగున్నాయి. ఇక అల్లరినరేష్ సహా మిగతా నటీనటులు తమ తమ రోల్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసారు. సురభి నటనతో పాటు, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ గ్లామర్ షో మంచి ప్లస్ అయ్యింది. 

 

Minus Points :

అయితే ఈ రంభ ఊర్వశి మేనక సినిమా కథను సింపుల్ గా రాసుకున్నా, దాన్ని ఆడియన్స్ ఇమేజిన్ చేసుకున్నట్టు ఎంటర్టైనింగ్ వే లో రాసుకోలేకపోయాడు. డైరెక్టర్ చంద్రమోహన్ చింతాడ ఇలాంటి ఫాంటసీ కామెడీ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి పూర్తి స్థాయిలో నవ్వించేలా సీన్లు రాసుకోవాలి. కానీ సినిమా చూస్తుంటే ఒక ఫ్రెష్ స్టోరీ గాని, ఫ్రెష్ సీన్లు చూస్తున్న ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. అల్లరి నరేష్ పాత్రతో సహా చాలా పాత్రల డిజైన్లు తేలిపోయాయి. అలాగే ఏ కామెడీ చూసిన అల్లరి నరేష్ పేరడీ సినిమాల కామెడీ, లేదా జబర్దస్త్ కామెడీ సీన్లు గుర్తొస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే కథ మాత్రమే ఓల్డ్ కాదు, కథనం కూడా ఓల్డ్ ఫార్ములాతో సాగి ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. అనవసరమైన సన్నివేశాలతో సాగదీసిన ఫీల్ వస్తుంది.


Technical Values :

ఇక టెక్నికల్ గా చూసుకుంటే... ఈ సినిమా డైరెక్టర్ చంద్రమోహన్ చింతాడ స్క్రీన్ ప్లే విషయంలో బాగా దెబ్బేసాడు. కామెడీ కథను బాగానే అల్లుకున్నా, దానికి ప్రేక్షకులని ఎంగేజ్ చేసేలా సీన్లు రాసుకోలేకపోయాడు. ఇక చేతన్ భరద్వాజ్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ పరంగా లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ వరకు సాగదీత సీన్లు ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 


Final Review : 

ఓవరాల్ గా "రంభ ఊర్వశి మేనక" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ ఫాంటసీ కామెడీ డ్రామా కథ పరంగా ఆకట్టుకోలేకపోయినా, అల్లరి నరేష్ కామెడీ, అలాగే మరికొన్ని కామెడీ సీన్ల వలన నరేష్ ఫ్యాన్స్ ని మెప్పించొచ్చు. రొటీన్ స్టోరీ అండ్ సాగదీత స్క్రీన్ ప్లే వల్ల ఈ సినిమా ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. అల్లరి నరేష్ కామెడీని ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. 

Review Statistics

4.6
Overall Rating
Avg. of all reviews
21
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
4.6/10
Public
4.8/10
Why MRO?