321 (Love Marriage vs. Arranged)
321 (Love Marriage vs. Arranged) : మోహిత్ పెదడ, లావణ్య సాహుకార జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్). శాంతికుమార్ చిలుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కగా తాజాగా అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలై యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది.
Available in:
Reviews
What critics and the public are saying about 321 (Love Marriage vs. Arranged)
Media Reviews
4 Avg: 5.0/10Average
321 Movie Review
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో గ్రూప్ డిస్కషన్స్ లో 321 లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ టాపిక్ తో కథ మొదలవుతుంది. హీరో హీరోయిన్ పరిచయం.. అమ్మాయిని పడేయడానికి హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో అసలు కథ ట్రాక్‌లోకి వస్తుంది. శ్రుతీ ప్రేమించిన వాడిని...
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో గ్రూప్ డిస్కషన్స్ లో 321 లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ టాపిక్ తో కథ మొదలవుతుంది. హీరో హీరోయిన్ పరిచయం.. అమ్మాయిని పడేయడానికి హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో అసలు కథ ట్రాక్‌లోకి వస్తుంది. శ్రుతీ ప్రేమించిన వాడిని చేసుకోవాలా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా అన్న డైలామాలో ఉండడంతో కథ మొత్తం భావోద్వేగ భరితంగా మారిపోతుంది. ఓ 20 నిమిషాల కథ కుటుంబ చర్చల నేపథ్యంలోనే సాగుతుంది. అజ్ఞాతవాసిలా ఫోన్‌లో మాట్లాడిన రాధ పాత్ర రివీల్ కావడం మంచి ట్విస్ట్‌గా నిలిచింది. క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్‌తో హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు.
ఇక మోహిత్ పెద్దాడ పక్కింటి అబ్బాయిలా చక్కని నటన కనబర్చాడు. శ్రుతి పాత్రలో లావణ్య హుందాగా నటించింది. క్లైమాక్స్‌లో భావోద్వేగాలను అద్భుతంగా పండించింది. సినిమాటోగ్రఫీ బావుంది. కాల్విన్ జాయ్ సంగీతం బాగా కుదిరింది. రెండు పాటలు ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ సన్నివేశంలో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ఫస్టాఫ్‌ను కాస్తంత ట్రిమ్ చేసి ఉంటే, స్టోరీ రన్ క్రిస్ప్‌గా ఉండేది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా ఇద్దరి వైపు పరస్పర అవగాహన, గౌరవం, నమ్మకంతో ఉంటే ఆనందం వెన్నంటి ఉంటుందని దర్శకుడు సందేశం ఇచ్చారు.
Average
321 movie review
"321". మోహిత్ పెదడ, లావణ్య సాహుకార లీడ్ రోల్స్ లో శాంతికుమార్ చిలుముల తెరకెక్కించిన ఈ మూవీ.. లవ్ మ్యారేజ్ డ్రీమ్ చేసే హీరో అభి, కేవలం అరేంజ్డ్ మ్యారేజ్ కే ఫిక్స్ అయిన శ్రుతి మధ్య సాగే ఐడియాలజీ వార్ ఈ సినిమా మెయిన్ ప్లాట్. అవుట్ డేటెడ్ కాన్సెప్టే అయినప్పటికీ.. రెండు వేర్వేరు ఆలోచనలని గౌరవిస్తూ ఫ్య...
"321". మోహిత్ పెదడ, లావణ్య సాహుకార లీడ్ రోల్స్ లో శాంతికుమార్ చిలుముల తెరకెక్కించిన ఈ మూవీ.. లవ్ మ్యారేజ్ డ్రీమ్ చేసే హీరో అభి, కేవలం అరేంజ్డ్ మ్యారేజ్ కే ఫిక్స్ అయిన శ్రుతి మధ్య సాగే ఐడియాలజీ వార్ ఈ సినిమా మెయిన్ ప్లాట్. అవుట్ డేటెడ్ కాన్సెప్టే అయినప్పటికీ.. రెండు వేర్వేరు ఆలోచనలని గౌరవిస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
మోహిత్ నేచురల్ యాక్టింగ్‌తో ప్రూవ్ చేసుకోగా, లావణ్య తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది. ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. అయితే, ఫస్ట్ హాఫ్‌లో ల్యాగ్ సీన్స్, డల్ మ్యూజిక్, నత్తనడకన సాగే స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌కి తీవ్ర అసహనం కలిగిస్తాయి. క్లైమాక్స్ కూడా ఊహించినట్టే రివీల్ చేయడం నీరసపరుస్తుంది. ఓవరాల్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇది జస్ట్ యావరేజ్ వాచ్ మాత్రమే!
Average
321 Movie Review
321 Movie review : ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరికి వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ '321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్)'. మోహిత్ పెదడ, లావణ్య సాహుకార జంటగా శాంతికుమార్ చిలుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. కథ విషయానికి వస్తే.. లవ్ మ్యారేజ్ కోరుకునే హీరో అభి, అరేంజ్డ్ మ్యారేజ్‌కే మొగ్గుచ...
321 Movie review :
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరికి వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ '321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్)'. మోహిత్ పెదడ, లావణ్య సాహుకార జంటగా శాంతికుమార్ చిలుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. కథ విషయానికి వస్తే.. లవ్ మ్యారేజ్ కోరుకునే హీరో అభి, అరేంజ్డ్ మ్యారేజ్‌కే మొగ్గుచూపే శ్రుతి మధ్య నడిచే కాన్సెప్ట్ ఇది. రొటీన్ టెంప్లేట్ కథే అయినా.. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ ఫ్యామిలీ వాల్యూస్, కామెడీతో నడిపించిన తీరు బాగుంది.
నటీనటులు కొత్తవారైనా మోహిత్ తన యాక్టింగ్‌తో, లావణ్య తన బబ్లీ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. సినిమాటోగ్రఫీ వర్క్ విజువల్‌గా రిచ్‌గా ఉంది. అయితే, ఫస్ట్ హాఫ్‌లో లవ్ సీన్స్ సాగదీత, స్లో నేరేషన్, ఇంప్రెస్ చేయని పాటలు సినిమాకి బిగ్ మైనస్. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ బాగున్నా, క్లైమాక్స్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. తక్కువ అంచనాలతో వెళ్తే యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇది ఒక సరాసరి వీక్షణ! finally కాన్సెప్ట్ ఓకే.. కానీ రొటీన్ టెంప్లేట్ అండ్ స్లో నేరేషన్ విసిగిస్తాయి!
Average
321 Movie review
మోహిత్ పెదడ, లావణ్య సాహుకార జంటగా 321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) మూవీ అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలై యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్ అనే కాన్సె్ప్ట్‌తో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఈ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు బ...
మోహిత్ పెదడ, లావణ్య సాహుకార జంటగా 321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) మూవీ అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలై యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్ అనే కాన్సె్ప్ట్‌తో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఈ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు బాగుంది. సింపుల్ కథకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను యాడ్ చేసి విధానం బాగుంది. ఈ సినిమాలో నటీనటులు కొత్తవారే అయినా, వారు మంచి ప్రతిభను కనబరిచారు. ముఖ్యంగా హీరో మోహిత్ పెడద తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడు. హీరోయిన్ లావణ్య సాహుకార కూడా బబ్లీ పర్ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేస్తుంది.
ఈ సినిమాకు మేజర్ డ్రాబ్యాక్ ఇందులోని రొటీన్ టెంప్లేట్ కథ. ఇలాంటి కథలు చాలా సినిమాల్లో చూసిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్‌లో హీరోకు లవ్ మ్యారేజ్ పై ఉన్న అభిప్రాయాన్ని వ్యక్త పరచడం.. దానికోసం హీరో, అతడి స్నేహితులు ప్రయత్నించడం వంటి సీన్స్ చాలా సాగదీతగా అనిపిస్తాయి. ఓవరాల్‌గా చూస్తే, ‘321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్)’ అంటూ వచ్చిన ఈ చిత్రం రొటీన్ టెంప్లేట్‌తో కొంత వరకే వర్కవుట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. నటీనటులు పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే, స్లో గా సాగే నెరేషన్, సాగదీత సీన్స్, ఆకట్టుకోని మ్యూజిక్ ఈ చిత్రానికి మైనస్. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని చాలా తక్కువ అంచనాలతో చూడడం బెటర్.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే అభి (మోహిత్ పెదడ) ఎప్పటికైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలని సెటిల్ అవ్వాలని కలలుగంటూ ఉంటాడు. ఈ క్రమంలో అసలు లవ్ అంటేనే ఇష్టపడని శ్రుతి (లావణ్య సాహుకార) అరేంజ్డ్ మ్యారేజే చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. ఈ క్రమంలో శ్రుతిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు అభి. ఈ క్రమంలో లవ్ మ్యారేజ్ ను ఇష్టపడని శ్రుతి అభి ప్రేమను యాక్సప్ట్ చేస్తుందా? శృతికి లవ్ మ్యారేజ్ పై ఉన్న ఒపీనియన్ తెలుసుకున్న అభి ఏం చేస్తాడు? చివరికి వీరిది అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా? లేక లవ్ మ్యారేజ్ అవుతుందా? పెద్దలు వీళ్ళ పెళ్లిని అంగీకరించారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus points :
సినిమాలో ఒకరిది లవ్ మ్యారేజ్ గోల్... ఇంకొకరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని పంతం... ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేవి చాలా తక్కువ. ఇక ఈ సినిమా వరకైతే మంచి కాన్సెప్ట్ నే ఎంచుకున్నారు దర్శకుడు శాంతికుమార్ చిలుముల. ముఖ్యంగా సినిమాలో హీరో హీరోయిన్లు వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించుకోవడం బాగుంది. సినిమాకి ఎంటర్టైన్మెంట్ పాళ్ళు మిక్స్ చేయడం కలిసొచ్చింది. ఇక మెయిన్ లీడ్ లో నటించిన మోహిత్ పెడద, లావణ్య సాహుకార ఫస్ట్ మూవీ అయినా మంచి పెర్ఫార్మన్స్ కనబరిచారు. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. కామెడీ సీన్స్ కొన్ని నవ్విస్తాయి.
Minus points :
అయితే ఈ సినిమాకు కథ సింపుల్ గా తీసుకోగా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయినా రాసుకోవాల్సింది. కానీ అది కూడా చేయలేదు. టోటల్ రొటీన్ కథ కథనాలతో ఆడియన్స్ కి బోర్ కొట్టేలా సినిమాని తెరకెక్కించారు. కాకపోతే ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించడం వల్ల కాస్త బెటర్ గా మరీ విసుగు రాకుండా చూడొచ్చు. పైగా ఈ సినిమా చూస్తున్నంత సేపు పాత సినిమాలు గుర్తొస్తుంటాయి. మరీ సాగదీత సీన్స్ తో స్క్రీన్ ప్లే ల్యాగ్ చేసారు. ఇక మ్యూజిక్ పరంగా యావరేజ్ ఫీల్ నే ఇస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్రెష్ ఫీల్ ఇవ్వలేదు. హీరోయిన్ రోల్ కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. క్లైమాక్స్ ని ఇంకా సింపుల్ గా ముగించేసినట్టుంది.
Technical values :
ఇక టెక్నికల్ పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా కుదిరాయి. దర్శకుడు శాంతికుమార్ చిలుముల రొటీన్ ఫార్ములా స్టోరీ స్క్రీన్ ప్లే తో నిరాశపరిచారు. ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం బాగానే చేసినా, రొటీన్ కథా కథనాలతో ఆడియన్స్ కి బోర్ కొట్టించారు. మ్యూజిక్ యావరేజ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ పరంగా కొన్ని సాగదీత సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది.
Final Review :
ఓవరాల్ గా "321" (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తో ఒక యావరేజ్ డ్రామాగా నిలిచే అవకాశం ఉంది. కథ కథనాల పరంగా ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. రెగ్యులర్ డ్రామాలు అన్ని సినిమాలు చూసే ఒక టైప్ అఫ్ ఆడియన్స్ ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు.
Review Statistics
Review Average
You Might Also Like
హైకూ (Haiku)
2026
418 (#418)
2026