Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1045
Total Reviews
71
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 517-528 of 1045 reviews

Vaazha 2 Movie Review

7.0
out of 10
వాఝా2 పేరిట మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా తాజాగా తెలుగులో వాలా 2 పేరుతో రిలీజ్ కాగా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది. హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ మెయిన్ లీడ్స్ లో నటించగా, వీరు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేకపోయినా, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక దర్శకుడిగా సావిన్ SA తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాణ డీసెంట్ గా ఉన్నాయి. పైగా సినిమాలో సహజత్వం చాలా ఇంప్రెస్...

వాఝా2 పేరిట మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా తాజాగా తెలుగులో వాలా 2 పేరుతో రిలీజ్ కాగా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది. హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ మెయిన్ లీడ్స్ లో నటించగా, వీరు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేకపోయినా, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక దర్శకుడిగా సావిన్ SA తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాణ డీసెంట్ గా ఉన్నాయి. పైగా సినిమాలో సహజత్వం చాలా ఇంప్రెస్ చేస్తుంది. పైగా మండుతున్న సమ్మర్ లో కూల్ గా ఇలాంటి పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూ వచ్చిన ఈ మూవీ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది.


ఇక రకరకాల కారణాలతో కుటుంబాలను వదిలి దూరం వెళ్లిన యువత ఎలా రియలైజ్ అవుతుంది. వారి మార్పు కుటుంబాలకు ఎలా అండగా ఉంటుందనే క్లైమాక్స్ ఎంతో బలంగా నిలిచింది. దర్శకుడు ఆ సన్నివేశాలు తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. సినిమా నాచురల్ గా ఉంది. అనువాదం చేసే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. మిడిల్ క్లాస్ కుర్రకారుకు, కుటుంబాలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. మధ్యతరగతి మనుషుల జీవితాల్లో పలు విషయాలను గుర్తు చేస్తుందీ వాలా 2 సినిమా.

Apr 28, 2026 Telugu

Vaazha 2 Movie Review

వాలా 2 (Vaazha 2) 2026 News Channel
6.0
out of 10
మలయాళంలో వచ్చిన వాఝా సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన వాఝా2 మూవీ తెలుగులో తాజాగా వాలా 2 పేరుతో రిలీజ్ కాగా థియేటర్ల వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాలో పరిచయం లేని నటులే ఉన్నా, అందరూ ఇంప్రెస్ చేసారు. హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వంటి వారు మూవీకి బ్యాక్ బోన్ గా నిలవగా, మిగతా అన్ని రకాలుగానూ సినిమా యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ఇక సావిన్ SA దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ...

మలయాళంలో వచ్చిన వాఝా సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన వాఝా2 మూవీ తెలుగులో తాజాగా వాలా 2 పేరుతో రిలీజ్ కాగా థియేటర్ల వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాలో పరిచయం లేని నటులే ఉన్నా, అందరూ ఇంప్రెస్ చేసారు. హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వంటి వారు మూవీకి బ్యాక్ బోన్ గా నిలవగా, మిగతా అన్ని రకాలుగానూ సినిమా యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ఇక సావిన్ SA దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.


మేకర్స్ కేరళ లోని రియల్ లొకేషన్స్ లో సినిమాని తెరకెక్కించడం వల్ల సహజత్వం ఎంతో నచ్చుతుంది. ఇక మ్యూజిక్, బీజీఎమ్ తో పాటు తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్క్రీన్ ప్లే మంచి రేసి గా ఉండి ఎంటర్టైనింగ్ గా ఉంది. మొత్తంగా ‘వాలా 2’ మిడిల్ క్లాస్ కాలేజీ చదివే అబ్బాయిల జీవితంలో ఎదురైన సంఘటనలతో బాధ్యతగా ఎలా మారారు అని కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించిన సినిమాగా చెప్పుకోవచ్చు. 

Apr 28, 2026 Telugu

Vaazha 2 Movie Review

వాలా 2 (Vaazha 2) 2026 Youtube Channel
Thyview

By Thyview

7.0
out of 10
మలయాళంలో బ్లాక్‌బస్టర్ కొట్టిన “వాఘా 2” ఇప్పుడు తెలుగులో “వాలా 2”గా వచ్చేసింది. సో… ఈ సినిమా హైప్‌కి తగ్గట్టు ఉందా? లేక జస్ట్ ఓకేనా? చూద్దాం! మొదటగా చెప్పాలంటే… స్టోరీ చాలా సింపుల్. కానీ దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం ఫ్రెష్‌ గా అనిపిస్తుంది. కొత్త వాళ్లు అయినా హషీర్, అలన్, వినాయక్, అజిన్ ఈ గ్యాంగ్ మొత్తం స్క్రీన్ మీద నేచురల్‌ గా ఫీల్ ఇచ్చారు. అసలు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించదు. జస్ట్ వాళ్ల ల...

మలయాళంలో బ్లాక్‌బస్టర్ కొట్టిన “వాఘా 2” ఇప్పుడు తెలుగులో “వాలా 2”గా వచ్చేసింది. సో… ఈ సినిమా హైప్‌కి తగ్గట్టు ఉందా? లేక జస్ట్ ఓకేనా? చూద్దాం! మొదటగా చెప్పాలంటే… స్టోరీ చాలా సింపుల్. కానీ దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం ఫ్రెష్‌ గా అనిపిస్తుంది. కొత్త వాళ్లు అయినా హషీర్, అలన్, వినాయక్, అజిన్ ఈ గ్యాంగ్ మొత్తం స్క్రీన్ మీద నేచురల్‌ గా ఫీల్ ఇచ్చారు. అసలు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించదు. జస్ట్ వాళ్ల లైఫ్‌ ని చూస్తున్నట్టు ఉంటుంది.


ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ మోడ్! కాలేజ్ ఫ్రెండ్స్‌ తో చేసే టైం పాస్, ఫన్ మోమెంట్స్, చిన్న చిన్న కామెడీ సీన్స్ – ఇవన్నీ బాగా వర్క్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్‌కి వెళ్లేసరికి టోన్ కొంచెం మారుతుంది. ఫన్‌తో పాటు స్ట్రగుల్స్, ఎమోషన్స్ కూడా చూపించారు. కొన్ని చోట్ల స్లోగా అనిపించినా… క్లైమాక్స్ మాత్రం సైలెంట్‌గా హార్ట్‌ని టచ్ చేస్తుంది. టెక్నికల్‌ గా చూసినా… మ్యూజిక్ డీసెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. పెద్దగా కంప్లైంట్స్ లేవు. ఫైనల్‌గా చెప్పాలంటే… “వాలా 2” అనేది ఫ్రెండ్స్‌తో కూర్చొని చూసే ఫీల్ గుడ్ మూవీ. మీ కాలేజ్ డేస్ గుర్తొచ్చేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్ తో తాపీగా థియేటర్లకు వెళ్లిపోవచ్చు. 


Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

వాలా 2 (Vaazha 2) 2026 News Channel
7.0
out of 10
ఈ వారం థియేటర్లలో విడుదలైన వాలా 2 ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్ద కథ కాకపోయినా, కథనం పరంగా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఎంతలా అంటే అసలు ఈ సినిమాకు అసలైన బలం, ప్రాణం.. దీని కథనం. ఒక సింపుల్ పాయింట్‌ను తీసుకొని, ఆడియన్స్‌ను ఎమోషనల్ రోలర్ కోస్టర్‌ ఎక్కించడంలో డైరెక్టర్ సావిన్ ఎస్.ఏ, రచయిత విపిన్ దాస్ సక్సెస్ అయ్యారు. ఇక ఏ టీమ్ (అంకిత్ మీనన్)...

ఈ వారం థియేటర్లలో విడుదలైన వాలా 2 ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్ద కథ కాకపోయినా, కథనం పరంగా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఎంతలా అంటే అసలు ఈ సినిమాకు అసలైన బలం, ప్రాణం.. దీని కథనం. ఒక సింపుల్ పాయింట్‌ను తీసుకొని, ఆడియన్స్‌ను ఎమోషనల్ రోలర్ కోస్టర్‌ ఎక్కించడంలో డైరెక్టర్ సావిన్ ఎస్.ఏ, రచయిత విపిన్ దాస్ సక్సెస్ అయ్యారు. ఇక ఏ టీమ్ (అంకిత్ మీనన్) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం. సీన్‌లోని మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. 


ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ ఈ నలుగురు కుర్రాళ్లే. హాషిర్, అలెన్, అజిన్, వినాయక్ పాత్రల్లో నటించిన వాళ్లంతా మలయాళంలో సోషల్ మీడియా స్టార్లు. వాళ్లకు ఇది నిజజీవితానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ కావడంతో కెమెరా ముందు యాక్ట్ చేసినట్లు అస్సలు అనిపించదు, క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేశారు. వాళ్ల మధ్య ఆన్-స్క్రీన్ కెమెస్ట్రీ, కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్.డబ్బింగ్ క్వాలిటీ, లోకలైజేషన్ చాలా నీట్‌గా ఉన్నాయి. విపిన్ దాస్ రైటింగ్ చాలా షార్ప్ అండ్ రిలేటబుల్. దర్శకుడు సావిన్ ఎస్.ఏ తన ఫస్ట్ సినిమా అయినా కూడా, యూత్ పల్స్ పట్టుకొని ఎక్కడా డీవియేట్ అవ్వకుండా సినిమాను ప్రెజెంట్ చేశాడు. 


ఓవరాల్ గా వాలా 2.. సగటు మిడిల్ క్లాస్ కుర్రాడి బయోపిక్..!

Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

Tupaki

By Tupaki

6.0
out of 10
గతంలో మలయాళంలో వచ్చిన ‘వాఘా’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘వాలా-2’ మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాలో నటీనటులు కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం అతి పెద్ద బలం. ‘ఎ టీమ్’ సన్నివేశాలకు తగ్గట్లుగా చక్కటి బీజీఎంతో సినిమాకు కావాల్సిన ఎలివేషన్ ఇచ్చింది. అఖిల్ లైలాసురన...

గతంలో మలయాళంలో వచ్చిన ‘వాఘా’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘వాలా-2’ మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాలో నటీనటులు కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం అతి పెద్ద బలం. ‘ఎ టీమ్’ సన్నివేశాలకు తగ్గట్లుగా చక్కటి బీజీఎంతో సినిమాకు కావాల్సిన ఎలివేషన్ ఇచ్చింది. అఖిల్ లైలాసురన్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు తెలుగులో ట్రెండీ డైలాగ్స్ రాసి మన వాళ్లు బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. ‘‘మేము ప్యూర్ ఫామిలీ ఆడియన్స్ సార్, మమ్మల్ని కొడితే అనిల్ రావిపూడి అన్న ఫీల్ అవుతాడు సార్’’ లాంటి డైలాగులతో మన ఆడియన్స్ రిలేట్ అవుతారు. 


ఐతే డబ్బింగ్ విషయంలో అంత శ్రద్ధ తీసుకున్న వాళ్ళు.. ఈ చిత్రానికి ఒక తెలుగు టైటిల్ పెట్టలేక పోవడమే విచిత్రం. నిర్మాణ విలువలు ఈ కథకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. విపిన్ దాస్ ట్రెండీ కథ రాయగా.. దర్శకుడు సవిన్ దాన్ని బాగా డీల్ చేశాడు. ఇటు కామెడీని.. అటు ఎమోషన్లను బాగా బ్యాలెన్స్ చేసి మెప్పించాడు. చివరగా: వాలా-2.. యువతకు కిక్కు

Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

6.0
out of 10
మలయాళ సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు విశేషంగా అలరిస్తున్నాయి. ఆయా సినిమాలను మన ఆడియెన్స్ కూడా ఆదరిస్తుంటారు. లేటెస్ట్ గా మలయాళంలో బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న మూవీ `వాలా 2`.(vaazha 2) అంతా కొత్త కుర్రాళ్లు నటించిన ఈ మూవీ తాజాగా తెలుగులో విడుదలయింది.ఇక ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకోగా, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చ...

మలయాళ సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు విశేషంగా అలరిస్తున్నాయి. ఆయా సినిమాలను మన ఆడియెన్స్ కూడా ఆదరిస్తుంటారు. లేటెస్ట్ గా మలయాళంలో బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న మూవీ `వాలా 2`.(vaazha 2) అంతా కొత్త కుర్రాళ్లు నటించిన ఈ మూవీ తాజాగా తెలుగులో విడుదలయింది.


ఇక ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకోగా, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఒక మంచి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామాగా రెస్పాన్స్ తెచ్చుకుంది. నేచురల్ పెర్ఫార్మెన్స్, రిలేటబుల్ కామెడీ, మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడా సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, మీ స్నేహితులతో కలిసి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. 


దర్శకుడు సావిన్‌ షా ఎంచుకున్న కథ బాగుంది. తెరకెక్కించిన తీరు బాగుంది. అయితే మలయాళ నేపథ్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మన తెలుగు వారికి కొంత మైనస్‌గా చెప్పొచ్చు. మతం, కమ్యూనిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మనకు మైనస్‌. దర్శకుడిగా సినిమాని ఎంగేజింగ్‌గా, కామెడీగా, ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇక అఖిల్‌ లైలాసురన్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. కనువిందు చేస్తాయి. పాటలు సినిమాకి ప్లస్‌, బీజీఎం అదిరిపోయింది. కన్నన్‌ మోహన్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. టెక్నీకల్‌గా మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు. ఫైనల్ గా టీనేజ్‌ (స్కూల్‌, కాలేజీ) కుర్రాళ్ల బయోపిక్‌ ఇది. వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు.

Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

7.0
out of 10
మలయాళంలో ‘వాలా’ (Vaazha) మొదటి భాగం సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చదువులో వెనుకబడి, సమాజం దృష్టిలో ‘వేస్ట్’ అనిపించుకునే కుర్రాళ్ల కథ అది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘వాలా 2’ (Vaazha 2) కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది మనందరి ఇళ్లలో ఉండే, పక్కింట్లో కనిపించే సగటు కుర్రాళ్ల జీవిత చరిత్ర (Biopic of a Billion Bros). కథ వరకు మొదటి భాగం టెంప్లేట్‌నే తీసుకున్నా, ఈసారి ఎమోషన్స్, హ్యూమర్‌ను...

మలయాళంలో ‘వాలా’ (Vaazha) మొదటి భాగం సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చదువులో వెనుకబడి, సమాజం దృష్టిలో ‘వేస్ట్’ అనిపించుకునే కుర్రాళ్ల కథ అది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘వాలా 2’ (Vaazha 2) కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది మనందరి ఇళ్లలో ఉండే, పక్కింట్లో కనిపించే సగటు కుర్రాళ్ల జీవిత చరిత్ర (Biopic of a Billion Bros). కథ వరకు మొదటి భాగం టెంప్లేట్‌నే తీసుకున్నా, ఈసారి ఎమోషన్స్, హ్యూమర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు రచయిత విపిన్ దాస్. హషీర్, వినాయక్, అలన్, అజిన్.. ఈ నలుగురు స్నేహితుల జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. 


ఇక ‘వాలా 2’ (Vaazha 2) మొదటి భాగం కంటే చాలా మెరుగ్గా ఉంది. కేవలం కుర్రాళ్లు మాత్రమే కాదు, తమ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా ఇది.మలయాళ సినిమా మళ్ళీ తన మ్యాజిక్‌ని రిపీట్ చేసింది. మన పక్కన ఉండే మనుషుల కథలను మనకు నచ్చేలా చెప్పడంలో మలయాళం తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపించింది. సింగిల్ వర్డ్ లో మూవీ గురించి చెప్పాలంటే... ఇది మనందరి కుర్రాళ్ల బయోపిక్.. నవ్వుతూ ఏడిపించేస్తుంది!

Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

6.0
out of 10
సందేశాన్ని చేదు గుళికలా కాకుండా షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయాలు సాధించాయి. ఈ 'వాలా 2' కూడా ఆ కోవలోకి వస్తుంది. కథగా చూస్తే ఇదేమీ కొత్త కాదు. కానీ, ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కారణం అదే అయ్యి ఉంటుంది. నేటివిటీని పక్కన పెడితే... తెలుగు యువత సైతం కనెక్ట్ అయ్యే అంశాలు 'వాలా 2'లో పుష్కలంగా ఉన్నాయ్.'వాలా 2' స్పెషాలిటీ ఏమిటం...

సందేశాన్ని చేదు గుళికలా కాకుండా షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయాలు సాధించాయి. ఈ 'వాలా 2' కూడా ఆ కోవలోకి వస్తుంది. కథగా చూస్తే ఇదేమీ కొత్త కాదు. కానీ, ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కారణం అదే అయ్యి ఉంటుంది. నేటివిటీని పక్కన పెడితే... తెలుగు యువత సైతం కనెక్ట్ అయ్యే అంశాలు 'వాలా 2'లో పుష్కలంగా ఉన్నాయ్.


'వాలా 2' స్పెషాలిటీ ఏమిటంటే... నేటివిటీకి, సహజత్వానికి దగ్గరగా సినిమా తీశారు. ఎక్కడా గీత దాటలేదు. ఇందులో యువతకు స్కూల్, కాలేజ్ లైఫ్ గుర్తు చేసే నోస్టాల్జియా మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ చాలా కీలకం. ఇండియా నుంచి విదేశాలకు చదువు (అమెరికా) లేదా ఉద్యోగం (దుబాయ్) కోసం వెళ్లిన యువత సినిమాలు చూడటం వల్ల ఓవర్సీస్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే విదేశాల్లో వాళ్ళు పడే కష్టాలను వినోదాత్మకంగా చూపించారు దర్శక రచయితలు శివన్ ఎస్ఏ, విపిన్ దాస్. పరోక్షంగా సందేశం కూడా ఇచ్చారు.




అయితే 'వాలా' చూడని ప్రేక్షకులకు 'వాలా 2' చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు మరోసారి నోస్టాల్జియా మూమెంట్స్ గుర్తు చేస్తుంది. అక్కడక్కడా కాస్త డౌన్ అయినట్టు అనిపించినా... యూత్‌కి మాత్రం తప్పకుండా కనెక్ట్ అవుతుంది. వినోదంతో పాటు చక్కటి సందేశం ఇస్తుంది. యువతకు తమను తాము తెరపై చూసుకున్నట్టు అనిపిస్తుంది.

Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

వాలా 2 (Vaazha 2) 2026 News Channel
7.0
out of 10
ఈ వారం తెలుగులో థియేటర్లలో విడుదలైన ‘వాలా 2’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, దర్శకుడు సావిన్ ఎస్ఏ ఒక చిన్న కథను తీసుకుని, దానికి యూత్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్‌ను జోడించి ఆసక్తికరంగా మలిచారు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ తమ పాత్రల్లో సహజంగా నటిస్తూ సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా కామెడీతో వేగంగా సా...

ఈ వారం తెలుగులో థియేటర్లలో విడుదలైన ‘వాలా 2’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, దర్శకుడు సావిన్ ఎస్ఏ ఒక చిన్న కథను తీసుకుని, దానికి యూత్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్‌ను జోడించి ఆసక్తికరంగా మలిచారు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ తమ పాత్రల్లో సహజంగా నటిస్తూ సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా కామెడీతో వేగంగా సాగిపోతూ, కాలేజ్ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో విదేశాల్లో ఎదురయ్యే సమస్యలను చూపిస్తూ కథలో కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చారు. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి.


సాంకేతికంగా కూడా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంగీతం, నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి. అయితే కొత్త నటీనటులు మాత్రమే ఉండి, పెద్దగా పేరున్న నటులు లేకపోవడం చిన్న వెలితి. మొత్తంగా ‘వాలా 2’ యూత్‌ను టార్గెట్ చేసిన కమింగ్ ఆఫ్ ఏజ్ ఎంటర్టైనర్. ఫ్రెండ్స్‌తో కలిసి వీకెండ్‌లో చూసేందుకు ఓ సరదా చిత్రం. ఫైనల్ గా "ఇది బిలియన్ బాయ్స్ బయోపిక్. అంటే నాది నీది మనందరిది".


Apr 24, 2026 Telugu

Vaazha 2 movie Review

వాలా 2 (Vaazha 2) 2026 News Channel
Sakshi

By Sakshi

7.0
out of 10
తెలుగులో ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో 'వాలా 2' ఒకటి. మలయాళం లో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తాజాగా తెలుగులో విడుదలైంది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, కొత్త నటుల ఎనర్జీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది.దర్శకుడు సావిన్ ఎస్ఏ చిన్న కథను తీసుకుని, దానిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్ వైబ్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి బాగా ప్రెజెంట్ చేశాడు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ లాంటి లీడ్ యాక్టర్స్ తమ పాత్రల...

తెలుగులో ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో 'వాలా 2' ఒకటి. మలయాళం లో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తాజాగా తెలుగులో విడుదలైంది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, కొత్త నటుల ఎనర్జీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది.


దర్శకుడు సావిన్ ఎస్ఏ చిన్న కథను తీసుకుని, దానిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్ వైబ్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి బాగా ప్రెజెంట్ చేశాడు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ లాంటి లీడ్ యాక్టర్స్ తమ పాత్రల్లో నేచురల్‌గా లివ్ చేశారు. వారి మధ్య కెమిస్ట్రీనే సినిమాను ముందుకు నడిపించే ప్రధాన బలం.


ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ రైడ్ లా సాగిపోతూ, కాలేజ్ డేస్‌ను రీక్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో విదేశాల్లో ఫేస్ చేసే స్ట్రగుల్స్‌ను చూపిస్తూ, నవ్వుల మధ్య ఒక ఫీలింగ్ కూడా ఇస్తుంది. క్లైమాక్స్ మాత్రం సైలెంట్‌గా హార్ట్‌ని టచ్ చేసేలా డిజైన్ చేశారు. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి సపోర్ట్ అయ్యాయి. కొన్ని చోట్ల స్లోగా అనిపించినా, ఓవరాల్‌గా ‘వాలా 2’ యూత్‌తో పాటు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే ఫీల్ గుడ్ మూవీ.


ఫైనల్ వర్డ్: ఫ్రెండ్షిప్ + ఫన్ + ఎమోషన్ కావాలంటే ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఛాయిస్

Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

7.0
out of 10
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన "వాఘా 2" మూవీ తాజాగా "వాలా 2" పేరిట తెలుగులో రిలీజ్ అవగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులు అందరూ చిన్నవాళ్ళే అయినా అందరూ బాగా నటించారు. చిన్న కథని ఎంతో ఎంటర్టైనింగ్ గా మంచి ఎమోషన్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు సావిన్ ఎస్ఏ. మ్యూజిక్ పరంగా నిర్మాణ విలువల పరంగా కూడా టీం ని మెచ్చుకోవాలి. ఇక ​ఓవరాల్ గా చూసుకుంటే, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజు...

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన "వాఘా 2" మూవీ తాజాగా "వాలా 2" పేరిట తెలుగులో రిలీజ్ అవగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులు అందరూ చిన్నవాళ్ళే అయినా అందరూ బాగా నటించారు. చిన్న కథని ఎంతో ఎంటర్టైనింగ్ గా మంచి ఎమోషన్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు సావిన్ ఎస్ఏ. మ్యూజిక్ పరంగా నిర్మాణ విలువల పరంగా కూడా టీం ని మెచ్చుకోవాలి. 


ఇక ​ఓవరాల్ గా చూసుకుంటే, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఒక మంచి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. నేచురల్ పెర్ఫార్మెన్స్, రిలేటబుల్ కామెడీ, మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడా సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, మీ స్నేహితులతో కలిసి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.

Apr 24, 2026 Telugu

K - Ramp Movie Review

6.0
out of 10
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే పది చిత్రాలు పూర్తి చేశాడు. తన కథల ఎంపిక బాగా ఉన్నా ఏదో కలిసి రావడం లేదు. గతేడాది ‘క’ తో సూపర్ హిట్ అందుకున్న, ఇప్పుడు ‘కె-ర్యాంప్’ అంటూ వచ్చాడు. యుక్తి తరేజా (Yukti Tareja)కథానాయికగా జైన్స్ నాని (Jains Nani) దర్శకత్వంలో రాజేష్ దండా-శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం...

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే పది చిత్రాలు పూర్తి చేశాడు. తన కథల ఎంపిక బాగా ఉన్నా ఏదో కలిసి రావడం లేదు. గతేడాది ‘క’ తో సూపర్ హిట్ అందుకున్న, ఇప్పుడు ‘కె-ర్యాంప్’ అంటూ వచ్చాడు. యుక్తి తరేజా (Yukti Tareja)కథానాయికగా జైన్స్ నాని (Jains Nani) దర్శకత్వంలో రాజేష్ దండా-శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం తాజాగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది


మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ రొటీన్ లవ్ స్టోరీ ని దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది. ఇక వినోదాన్ని, భావోద్వేగాలను మేళవిస్తూ సినిమా జైన్స్ నాని సినిమా తీసిన విధానం అందరినీ అలరిస్తుందనే చెప్పవచ్చు. నిజానికి ఇది తనకు మంచి పరిచయ చిత్రం అవుతుంది. లోపాలు, లాజిక్కులు వెతక్కుండా ఓసారి ఈ సినిమా చూసేయవచ్చు.

Apr 20, 2026 Telugu
Why MRO?