Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
ఇరుముడి... 2 hours 25 minutes తో థియేటర్లో రిలీజ్ అయింది. పాయింట్ కొస్తే ఎక్కడా బోర్ కొట్టకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా బాగా తీశారు.. ఒక మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ ఒచ్చింది. రవితేజకి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. చాలా రోజులకి కళ్ళలో నీళ్లు తిప్పుకుంటూ బైటికి వచ్చాను. స్లో గా కాకుండా స్పీడ్ గా వెళ్లే మలయాళం మూవీ లా అనిపించింది. అండ్ మాస్ అండ్ క్లాస్ గా సినిమా అనిపించింది. ఎక్కడా చాలా సినిమాల్లో సనాతన ధర్మం అంటూ దేవుడ్ని వాడుకుని సినిమా తీస్తారేమో అనుకున్నా... కానీ స్టోరీలో భక్తిని చూపించారు గాని, వాడుకోని హిట్ కొట్టెయాలని కాదు...
ఇక రవితేజ గారు నెల రోజుల్లో ఫినిష్ అయ్యే సినిమాలు కాకుండా.. ఇలాంటి సూట్ అయ్యే కామన్ మ్యాన్ రోల్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక రవితేజ గారు చాలా న్యాచురల్ గా చేసారు. తండ్రి కూతుళ్ళ అనుబంధం చాలా బాగా తీశారు. అండ్ సాంగ్స్ సూపర్ ప్లస్ అవుతాయి. జివి ప్రకాష్ బీజీఎమ్ చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగా తీశారు. కాకపోతే మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమాటిక్ లిబర్టీని బాగా తీసుకున్నారు. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు. మిగతా అంతా బాగుంది. ఓవరాల్ గా ఇరుముడి వర్త్ వాచబుల్ మూవీ.
ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజ గారిని after maybe 10, 12 films తర్వాత అనుకుంటా... చాలా కొత్తగా చూసాను. ఇలాంటి పాత్రలు చేయాలి ఆయన. అలాగని సినిమా మరీ బాగుందని కాదు... కష్టమే...
సింపుల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఇదొక థ్రిల్లర్ మూవీ. డివోషనల్ ఎలిమెంట్స్ కొంచెం ఉంటాయి కానీ... ఇలా చాలా ఉంటాయి సినిమాలో... ముందుగా ఏం బాగున్నాయో మాట్లాడితే.. రెండు పాటలైతే చాలా బాగున్నాయి. అండ్ సినిమాలో డివైన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. కాకపోతే సినిమాలో మాల వేసినప్పుడు కొన్ని రూల్స్ గురించి సినిమాలో చెప్పిస్తారనుకున్నాను... అంటే నిష్ఠ గురించి.. పెద్దగా ఏం చూపించలేదు.
అండ్ సినిమా మొత్తం గురించి ఆలోచిస్తే.. ఒక్కటే ఒక్క పాయింట్ పెట్టుకున్నారు... రంగస్థలం సినిమాలో ట్విస్ట్ లాగానే.. ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. తీయడం అయితే చాలా సిన్సియర్ గా వర్కౌట్ అయింది. అండ్ సినిమాలో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. కానీ సస్పెన్స్ వర్కౌట్ కాలేదు. విజయ్ సేతుపతి గారి ఒక మూవీకి సెమిలర్ గా ఈ సినిమా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగా తీశారు. కానీ ముందే తెలిసిపోతుంది. ఓవరాల్ గా పెద్దగా ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు.
సో రవితేజ గారి ఇరుముడి మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ బెస్ట్ రవితేజ మూవీ since forever బ్రో. ముఖ్యంగా సినిమాలో అనవసరమైన ఎలివేషన్లు పెద్దగా ఏం లేవు.. మంచి భక్తిభావం ఉన్న సీన్లు పెట్టి అయ్యప్ప సీన్స్ తో పాటు ఒక సూపర్ డ్రామా నడించింది. అది నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం స్లో ఉందని కొందరు అనుకోవచ్చు, కానీ నాకు నచ్చింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని థ్రెట్స్ ఉంటాయి. అవి బాగా రాసుకున్నారు. అండ్ కొన్ని డార్క్ ఎలిమెంట్స్ ని కూడా బాగా రాసారు.
అండ్ సినిమాలో టెక్నికల్లి హీరో రవితేజ స్వామి మాల వేసుకున్నాక ఉండే నిస్సహాయతని బాగా చూపించారు. కొన్ని సీన్లు పెట్టాలి అన్నట్టు కాకుండా ఆ సీన్స్ కి మంచి మీనింగ్ ఉన్నట్టు పెట్టారు. అండ్ ఎక్కడా మితిమీరలేదు. అండ్ కొన్ని సినిమాటిక్ లిబర్టీ సీన్స్ ఉంటాయి. రొటీన్ గా ఉన్నా వర్కౌట్ అయ్యాయి. అండ్ రవితేజ లాస్ట్ బెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ కంటే చాలా బెస్ట్ మూవీ ఇది. ఇక సినిమాలో ఎమోషన్ చాలా బాగుంది. అండ్ శివ నిర్వాణ పర్ఫెక్ట్ డైరెక్షన్ ఈ మూవీ. మజిలీ కంటే కూడా ఈ సినిమా బాగా అనిపించింది. ఓవరాల్ గా నైస్ రా మంచి సినిమా పడింది అన్న ఫీల్ వచ్చింది.
ఇరుముడి... first things first... సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఇది చాలా ట్రిక్కీ ఫిలిం అండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని 3 జోనర్స్ లో డివైడ్ చేస్తే... ముందుగా అందులో ఒకటి ఫ్యామిలీ డ్రామా... చాలా బాగా తీశారు. స్పెషల్లీ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలా బాగుంది. రవితేజ రోల్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. రెండోది ఆ డివోషనల్ టచ్. మరీ ఓ రేంజ్ లో వాడుకున్నట్టు కాకుండా, ఎక్కడా తప్పులేకుండా సహజంగా చూపించారు. అండ్ మూడోది థ్రిల్లర్ అంది.. సెకండ్ హాఫ్ లో ఒక మెయిన్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కి సప్రయిజ్ అవుతారు.
రివెంజ్ డ్రామా... ఇదొక్కటి మనకు రొటీన్ ఫీల్ ఇస్తుంది. అవి కథకు అవసరమా అని కూడా అనిపిస్తుంది. అండ్ మూవీ ఎండ్ చేసిన విధానం కూడా అంతగా తీసుకోలేకపోయాను. బట్ ఓవరాల్ మూవీ బాగుంది. రవితేజకి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది.
ఇరుముడి... సినిమా గురించి చెప్పాలంటే good. చాలా మంచి decent message oriented సినిమా. అండ్ unnessesery commerial elements లేని సినిమా. రవితేజ గారికి performance oriented movies లో వన్ అఫ్ ది బెస్ట్ సినిమా. కొంతమందికి ఈ సినిమా నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళకి సినిమా taste లేదనుకొని వదిలేయాలి. అలాంటి వాళ్ళకోసం రొట్ట సినిమాలు తీసే రవితేజ ఈ పరిస్థితికొచ్చాడు అనిపిస్తుంది. ఏదేమైనా ఫైనల్ గా రవితేజ మంచి సక్సెస్ ఫుల్ కం బ్యాక్, చాలా మంచి హిట్టు ఈ సినిమాతో కొట్టాడు, come back ఇచ్చాడు అని చెప్పొచ్చు.
and సినిమాలో కొంచెం heavy sences ఉన్నాయి. కొన్ని సార్లు తీసుకోలేకపోవచ్చు. మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. మెయిన్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటది సినిమా. ఇంకొకటి నాకనిపించిందేంటంటే, లాస్ట్ లో స్క్రీన్ ప్లే కొంచెం టూ మచ్ గా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. బట్ మిగతా అంత బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బాగా ఉంది. సాంగ్స్ బాగా తీశారు. అండ్ అయ్యప్ప మాల వేసుకునే భక్తులకు ఐ ఫీస్ట్ లాంటి సినిమా ఇది. అండ్ ఫ్యామిలీస్ కి మంచి ఆప్షన్. అండ్ యాక్టింగ్ రవితేజ సహా అందరూ చాల బాగా చేసారు. అండ్ ఇరుముడి సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మంచి కం బ్యాక్ ఇచ్చారు రవన్న.
స్వామియే శరణం అయ్యప్ప: ఈ story ఇలా ప్రెజెంట్ చేసినందుకు, ఈ story ని ఇలా ప్రెజెంట్ చేస్తున్నట్టు తెలిసినా, మన రవితేజ గారు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఈ message ని delivery చేసినందుకు రవన్న మనం పెద్ద kudos చెప్పాలన్నమాట. దీక్ష వేయని నాకే ఆ అయ్యప్ప స్వామి దీక్ష సీన్స్ ఈ సినిమాలో ఆ పాటలు గాని సీన్స్ గాని superb గా అనిపించాయి. goosbumps తెప్పించాయి. ఇంక దీక్షలో ఉన్న వారికి ఈ సీన్స్ ఏ రేంజ్ లో అనిపిస్తాయో చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే చాలా చాలా heavy గా ఉంది ఇరుముడి సబ్జెక్టు. కొంచెం distrubing గా కూడా అనిపిస్తది. అందరూ ఈ సినిమాని ఒకే రకంగా recive చేసుకుని బైటికి వెళ్లరు అనిపిస్తుంది. ఈ సినిమాని ఈ tone లో ఎందుకు చెప్పారు, వేరే tone లో కూడా చెప్పుండొచ్చు అని కూడా అనిపించొచ్చు. అలాగే మీరనొచ్చు. ఇలాంటి సినిమాలు తమిళ్ లో తీస్తే ఇలాగే encourage చేస్తారు కదరా అనొచ్చు. నాకు ఏ భాష అయినా, ఒకేలా చూస్తాను. కానీ ఈ సినిమాలో నాకైతే కొంచెం వేరే విధంగా తీస్తే బాగుందనిపించింది.
ఇక రవితేజ గారు చాలా రోజుల తర్వాత veru settled role లో అద్భుతంగా నటించి చితక్కొట్టేశారని చెప్పొచ్చు. హీరోయిన్ కైతే పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. బట్ డీసెంట్. సాయి కుమార్ గారు ప్లెయిడ్ ఏ వెరీ ఇంపార్టెన్స్ డీసెంట్ రోల్. అండ్ రవితేజ కూతురిగా నటించిన అమ్మాయి కూడా బ్రిలియంట్. ఇక జివి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక క్లైమాక్స్ కి అయితే హెవీ టోన్ తో బైటికి వస్తారు. నాకైతే అయ్యప్ప దీక్ష సీన్స్, అలాగే ఫాదర్ అండ్ డాటర్ సీన్స్ బాగా నచ్చాయి. ఇక సినిమాకైతే కొంచెం తక్కువ ఆలోచనలు పెట్టుకుని వెళ్తే, చాలా బాగా నచ్చుతుంది.
అగధ... డైరెక్ట్డ్ బై ఎమ్మెస్ రాజు గారు... అగధ సినిమా గురించి ఇప్పుడు చెప్పాలంటే అగధ... అగాధమే... సో.. బేసిగ్గా ఏందో ఆ హర్రర్.. ఎక్కడ కూడా భయమనేది లేదు... ప్రీమియర్ కే సినిమాకెళ్ళాను... కానీ నిద్రొచ్చేసింది.. బట్ దిస్ అగధ.. నాకు తెలిసి డైరెక్టర్ ఎమ్మెస్ రాజు.. లాస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన సినిమా మస్కా నో ఎదో ఉంది. బట్ డైరెక్టర్ గా అయితే ఫెయిల్ అయ్యారు. కొన్ని కళాఖండాలు తీసిన తర్వాత ఇప్పుడు అగధ సినిమా తీశారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు కొడుతున్నాం ఈ సినిమాతో హిట్టు అన్నట్టు అన్నారు.
కానీ ఈ సినిమాలో మాత్రం అన్నంత స్టఫ్ లేదు. అస్సలు బాలేదు సినిమా. మాములుగా నాకే సినిమాకి వెళ్లినా నిద్ర రాదు. కానీ ఈ సినిమాకి మాత్రం ఇంట్రడక్షన్ నుంచే కళ్ళు మూసుకుపోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాయి. సింపుల్ గా సినిమా రిజల్ట్ గురించి చెప్పాలంటే కష్టమే... చాలా కష్టమే... ఇంకా చెప్పాలంటే ఎవరైనా చూసుంటే వాళ్ళని సినిమాలో ఎంత సేపు నిద్రపోకుండా ఉన్నారు అని అడగాల్సొస్తుంది.
అగధ... 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది. ఇక సినిమా గురించి చెప్పాలంటే థియేటర్లో అగధ.. ఇక ఆగదా అని అనే స్టేజి నుంచి ఎప్పుడైపోద్దా అనిపించేలా చేసింది. ఒక హారర్ ఎలిమెంట్ లేదు. సస్పెన్సు లేదు. థ్రిల్ మూవ్మెంట్స్ అసలేమీ కనిపించలేదు. రైటింగ్స్ టూ బ్యాడ్ అని చెప్పాలి. చెప్పుకోవడానికి నాకైతే ఒక్క సీన్ కూడా లేదు. పాపం కష్టపడి మేకర్స్ తీశారు అనడానికి నాకొక్క సీన్ కూడా కనిపించలేదు. పైగా సినిమాలో మనుషుల కన్నా కాకులు మెయిన్ లీడ్ గా చేసారు అనిపించింది.
సినిమాటోగ్రఫి అయితే సినిమాలో బాగుంది. బీజీఎమ్ కొంచెం బాగుంది. కాన్సెప్ట్ చిన్నగా బాగా రాసుకున్నా, స్క్రీన్ ప్లే దారుణంగా ఉంది. డైరెక్టర్ ఏం అనుకోని సినిమా తీశారో ఏం అర్ధం కాలేదు. రైటింగ్ అస్సలు బాలేదని చెప్పాలి. ఇక నా రేటింగ్ ఈ సినేమాకివ్వాలనిపిస్తే... 1.5/5
movie review of the film Palla Burusu : సుధాకర్ గారు అండ్ మురళీధర్ గారు భలే సెట్టయ్యారండి ఫాదర్ అండ్ సన్ లాగా. సినిమా గురించి చెప్పాలంటే బాగుందండి సినిమా. ఒక తండ్రికి కొడుకు పళ్ళ బురుసు కొనివ్వలేదు అని మొదలైన సినిమా ఎక్కడివరకు వెళ్తుంది, ఎలాంటి ఎమోషన్స్ ని ఎక్సప్లోర్ చేస్తుంది అనే విషయం మీదుంటుంది ఈ సినిమా. ఇండెప్త్ గా చాలా మెసేజెస్ ఉన్నాయి ఈ సినిమాలో. కానీ ఏది రుద్దకుండా, మంచి సీన్స్ తోటి బాగా వర్కవుట్ చేసారు.
చాలా ఎమోషన్స్ మనం ఫీల్ అవుతాం సినిమాలో. కానీ మొత్తానికి ఒక మంచి ఫీల్ తోటి, చిన్న స్మైల్ తోటి థియేటర్ బైటికి వస్తాం. కామెడీ కూడా న్యాచురల్ గా భలే పండాయి. మెయిన్ గా ఇంటర్వెల్ చాలా బాగుంది. ఇక ఓవరాల్ గా ఈ సినిమాలో ఇప్పటిరోజుల్లో మనం మానవ సంబంధాలకు ఎంత దూరంగా ఎల్లిపోతున్నాం, పెద్దవాళ్ళు మన దగ్గరి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం రిటర్న్ ఇవ్వాల్సింది ఏముంది అన్నది బాగా చూపించారు. అండ్ సినిమాలో తండ్రీకొడుకుల మిస్టేక్స్ ని రెండు సైడ్స్ లో బాగా చూపించారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మంచి సినిమా అండి, ఫ్యామిలీతో చూడాలి.
మకుటం... ప్రామిస్ గా చెప్తున్నా. ఈ సినిమా ఫినిష్ అయ్యే వరకు ఈ మూవీ డైరెక్ట్ చేసింది విశాల్ అని అస్సలు తెలీదు. రివ్యూ గురించి చెప్పాలంటే అసలు విశాల్ మీద ఉన్న అభిమానంతోనే సినిమా మొత్తం చూసాను. ఫస్ట్ హాఫ్ ఏమో యావరేజ్. సెకండ్ హాఫ్ నరకం అనిపించింది. మకుటం అని చెప్పి పెద్ద టోపీయే పెట్టారండి. అసలు దీనికెందుకు 3 గంటల సినిమా అనిపించింది. మళ్ళీ సినిమాకి వచ్చిన పది మంది కూడా ఎందుకొచ్చామురా అని ఫీల్ అయ్యారు.
నాకు తెలిసి విశాల్ కి కూడా ఇది ప్లాప్ అవుతుందని ముందే తెలుసనుకుంటా. అందుకే పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. ఇక జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ దెబ్బేసాడు. బీజీఎమ్ బాగుంది. కానీ ఈ సినిమాకి ఆ మ్యూజిక్ వేస్ట్ అయింది. ఇక ప్లస్ పాయింట్ అంటే ఇంటర్వెల్ సీన్, ప్లస్ బీజీఎమ్. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ అంతే. మైనస్ పాయింట్ అంటే చాలానే ఉన్నాయి. పనికి మాలిన సీన్లతో చాలా బోరింగ్ కొట్టేసింది. సినిమా అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు. రేటింగ్ కూడా ఇవ్వాలంటే 2/5 ఇస్తున్న అంతే.
Vishwanath and sons movie review
By Thyview
విశ్వనాధ్ అండ్ సన్స్... first of all సినిమా చూసాక నా ఎక్స్పీరెన్స్ చెప్పాలంటే... బావుంది. చాలా నచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బ్రిజిగా అలా వెళ్ళిపోతుంది. అండ్ ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న కపుల్స్ కైతే ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో చాలా సేపు బోరింగ్ సీన్స్ తో అలా నడుస్తుంటే... మామితా ఎంటర్ అయిన తర్వాతే ఊపందుకుంటది. అండ్ సూర్య మామితా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.
సినిమాలో కొన్ని సీన్స్ కొంతమందికి డీసెంట్ గా, బోర్ ఫీల్ కూడా అవ్వచ్చు. స్పెషల్ గా సెకండ్ హాఫ్ లో అలాంటి సీన్స్ ఉన్నాయి. బట్ నాకైతే చాలా బాగా నచ్చాయి. becuase స్టోరీకి తగ్గట్టున్నాయి ఆ సీన్స్. ఇప్పుడు ఎక్కకపోతే తర్వాతైనా ఆ సీన్స్ మైండ్ లోకి బాగా ఎక్కుతాయి. కాకపోతే క్లైమాక్స్ కూడా ఇంకొంచెం నీట్ గా రాసుకోవాల్సింది అనిపించింది. అండ్ కమర్షియలైజ్ కోసం కొన్ని ఫైట్స్ పెట్టారు. అవి అంత అనవసరం అనిపించింది. అండ్ టెక్నికల్లి మూవీ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. జివి ప్రకాష్ మాత్రం ఈసారి అంత లేదు. ఓవరాల్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ డీసెంట్ మూవీ.
Vishwanath and Sons Movie Review
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చూసొస్తున్నా.. నాకు వెంకీ అట్లూరి సినిమాలంటే చాలా ఇష్టం.. కానీ వెంకీ ముందు సినిమాలతో ఈ సినిమాను పోల్చను... టెక్నికల్లి ఈ సినిమా త్రివిక్రమ్ సినిమాలా అనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో మెయిన్ మామితా చాలా బాగా చేసింది. అండ్ తాను తప్ప మిగతా వాళ్ళందరూ aged గానే కనిపిస్తారు. అండ్ సినిమాలో మంచి మంచి సీన్లు పడ్డాయందరికి. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది.
అండ్ సినిమాలో మంచి మంచి డైలాగ్స్ పడ్డాయి. ఈ సినిమాలో నచ్చని విషయమేంటంటే... తమిళ్ లో మొత్తం సినిమా తీశారు, అది అంత నచ్చలేదు. కానీ తమిళ్ లో డైలాగ్స్ తెలుగు కంటే బాగున్నాయి. ప్రాబ్లెమ్ ఏంటంటే దీంట్లో నాకు వెంకీ అట్లూరి మార్క్ కనిపించలేదు. అండ్ సినిమాలో అందరూ చాలా బాగా యాక్ట్ చేసారు. అయితే సినిమాలో స్టోరీలో ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లెమ్ ని చాలా పెద్దగా చూపించి, క్లైమాక్స్ లో ఆ ప్రాబ్లెమ్ ని చిన్నది చేసారు అది నాకు నచ్చలేదు. అండ్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కొన్ని ఫైట్స్ పెట్టారు అది అస్సలు నచ్చలేదు. జివి ప్రకాష్ అయితే దెబ్బేసాడు. మ్యూజిక్ ఎక్కడా ఎక్కలేదు. ఓవరాల్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ వన్ టైం వాచబుల్.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers