Register as a Reviewer
అనకాపల్లి (Anakapalli)

అనకాపల్లి (Anakapalli)

02 Oct 2026

Anakapalli : విక్రమ్ సహిదేవ్ హీరోగా సంధ్య వశిష్ట హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ "అనకాపల్లి". ఖగేష్ తమ్మినేని డైరెక్షన్‌ లో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Khagesh Tammineni
Cast: Vikram Sahidev, Sandhya Vasishta, Tarak Ponnappa, Thrinadha Rao Nakkina, Indraja Absar, Srinivas Vadlamani, Naidu Kadregula

Available in:

About This Movie

Story :

కథ విషయానికి వస్తే... అనకాపల్లికి చెందిన సూర్య (విక్రమ్ సహిదేవ్) కాలేజ్ లైఫ్ లీడ్ చేస్తూ సరదాగా గడుపుతూ ఉంటాడు. అయితే అదే ఊళ్లో గూండా గా తన హవా చూపిస్తున్న బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ని చూసి సూర్య అతడ్ని రోల్ మోడల్ గా తీసుకుని అతని లాగే అవ్వాలని, బుల్లెట్ దగ్గర చేరి తక్కువ కాలంలోనే అతనికి ప్రధాన అనుచరుడౌతాడు. ఇద్దరూ కలిసి ఎమ్మెల్యే ( వడ్లమాని శ్రీనివాస్) అనుచరుడు నాయుడ్ని మర్డర్ చేస్తారు. ఇలా తన లైఫ్ క్రైమ్ బాటలో వెళ్తున్న టైం లో అమృత (సంధ్య వసిష్ఠ) తన లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తొలిచూపులోనే సూర్య, అమృతతో ప్రేమలో పడతాడు. అయితే అమృతతో ప్రేమే సూర్య- బుల్లెట్ మధ్య విభేదాలకు కారణమవుతుంది. ఈ క్రమంలో సూర్య - అమృత ఒకటవుతారా? లేదా? సూర్య అమృత కోసం చేసిన త్యాగం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Why MRO?