Register as a Reviewer
సీక్రెట్ సోల్జర్ (Secret Soldier)

సీక్రెట్ సోల్జర్ (Secret Soldier)

19 Sep 2026
Overall Rating
4.9/10
7 Reviews

టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో విడుదలైన సినిమాల్లో "సీక్రెట్ సోల్జర్" మూవీ ఒకటి. పాట్రియాటిక్ స్పై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీని అక్కి విశ్వనాథ్ రెడ్డి డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించారు.

Director: Akki Viswanadha Reddy
Cast: Nihal Kodhaty, Surya Srinivas, Harshitha Bandlamuri, Sreesha Nulu, Kamal Kamaraju, Srikanth Iyenger, Srinivas Vadlamani, Vinod Sagar, Deeksha Panth, Raj Tirandasu, Mahesh Achanta, Vamsi Nekkanti, Era

Available in:

Reviews

What critics and the public are saying about సీక్రెట్ సోల్జర్ (Secret Soldier)

Media Reviews

5 Avg: 5.2/10
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
6

Above Average

Secret Soldier movie review

అండ్ ఇంకా సీక్రెట్ సోల్జర్ మూవీ గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది మూవీ. అంటే కాన్సెప్ట్ పరంగా చాలా చాలా బాగుంది. స్పై జోనరే బట్ ఆ స్పై జోనర్ లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫీల్ వస్తది అన్నమాట. సో గూఢచారి కైండ్ ఆఫ్ జోనరే బట్ దాంట్లో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఓవరాల్ గా ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ చేసిన విధాన...

అండ్ ఇంకా సీక్రెట్ సోల్జర్ మూవీ గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది మూవీ. అంటే కాన్సెప్ట్ పరంగా చాలా చాలా బాగుంది. స్పై జోనరే బట్ ఆ స్పై జోనర్ లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫీల్ వస్తది అన్నమాట. సో గూఢచారి కైండ్ ఆఫ్ జోనరే బట్ దాంట్లో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఓవరాల్ గా ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. ఆ ఇంటెన్స్, ఆ సస్పెన్స్ అది కొంచెం బాగా మెయింటైన్ అయింది. ఓన్లీ స్పై అన్న జోనర్ లోనే కాకుండా ఫ్రెండ్ ఎమోషన్ ని కూడా చాలా బాగా తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఓవరాల్ గా మూవీకి ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి లాస్ట్ కి అర్థమైంది. 


ఓవరాల్ గా స్పై జోనర్ లో ఈ ఫ్రెండ్షిప్ ఎమోషన్ ని బ్లెండ్ చేసిన విధానం అది చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్ అయితే బాగున్నాయి. అండ్ ఓవరాల్ గా చెప్తున్నాను కదా కాన్సెప్ట్ అదంతా ఎగ్జిక్యూషన్ బాగుంది. బట్ అదర్ దన్ దట్ కాన్సెప్ట్ మిగతా ఎగ్జిక్యూషన్, మిగతా పాయింట్స్ అన్నీ కూడా చాలా బాగా కనెక్ట్ చేసి చాలా పర్ఫెక్ట్ గా మన ముందు పెట్టిన ఫీలింగ్ అయితే ఉంటది. ఎక్జిగ్యుట్ చేసిన తీరు అండ్ జనరల్ గా కొన్ని రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వాటిని కూడా చాలా బాగా టచ్ చేశారు. ఓవరాల్ గా బాగుంది. సో అదన్నమాట సిచువేషన్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.5 అవుట్ ఆఫ్ ఫైవ్. 

Sep 21, 2026 Watch
123telugu
123telugu Website
5

Average

Secret Soldier movie review

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే స్నేహం, దేశభక్తి మరియు గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది. ప్రధానంగా చర్చించిన స్న...

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే స్నేహం, దేశభక్తి మరియు గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది. ప్రధానంగా చర్చించిన స్నేహానికి సంబధించిన అంశం..అలాగే ‘దేశం కోసం కొంతమంది ఎలాంటి త్యాగం చేస్తారు ?, ప్రాణం ఇచ్చి అయినా సరే దేశాన్ని ఎలా కాపాడతారనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించడం కూడా బాగుంది.


ఈ ‘సీక్రెట్ సోల్జర్’ సినిమాలో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉన్నా.. చాలా చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. ఓవరాల్ గా ‘సీక్రెట్ సోల్జర్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ క్రైమ్ డ్రామాలో.. స్నేహం, దేశభక్తి వంటి అంశాలను బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. కథలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కూడా దర్శకుడు బాగానే ప్లాన్ చేశాడు. కానీ.. స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Sep 19, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Secret soldier movie review

‘సీక్రెట్ సోల్జర్’ మూవీ ట్రెండింగ్ న్యూస్ రివ్యూ: దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్స్ మరియు ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. కొత్త నటీనటులతో ఇంత పెద్ద రేంజ్ స్టోరీని ఎంచుకోవడం ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయమే. కథలో వచ్చే ట్...

‘సీక్రెట్ సోల్జర్’ మూవీ ట్రెండింగ్ న్యూస్ రివ్యూ: దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్స్ మరియు ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. కొత్త నటీనటులతో ఇంత పెద్ద రేంజ్ స్టోరీని ఎంచుకోవడం ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయమే. కథలో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్, స్పై ఏజెన్సీ మిషన్స్‌ని ప్రెజెంట్ చేసిన తీరు మరియు ఫ్రెండ్‌షిప్ జర్నీ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తాయి. కొత్తవారైనా నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.


అయితే స్క్రీన్ ప్లేలో లింక్‌లు, లాజిక్‌లు తీవ్రంగా మిస్ కావడం సినిమాకు ప్రధాన బలహీనతగా మారింది. ముఖ్యంగా ఒక స్పై ఏజెన్సీ అధికారుల మధ్యే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం ప్రేక్షకులకు కొంత అసహజంగా అనిపిస్తుంది. ఇది ప్యూర్ స్పై యాక్షన్ ఫిల్మ్ కాకుండా ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే డ్రామాగా సాగుతుంది. మొత్తంగా కథను ఇంకాస్త బలంగా రాసుకుని. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా శ్రద్ధ తీసుకుని ఉంటె ఫలితం వేరేలా ఉండేది. 


Sep 19, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Secret soldier movie review

దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్, అండ్ ఫ్రెండ్‌షిప్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. కొత్త యాక్టర్స్‌తో ఇంత పెద్ద స్కేల్ ఉన్న స్పై డ్రామాను హెవీ రేంజ్‌లో ప్లాన్ చేయడం గుడ్ ఎఫర్ట్!ఫస్ట్ హాఫ్ నుండి కథలో వచ్చే ట్విస్ట్‌లు, స్పై ఏజెన్సీ మిషన్స్, అండ్ ఫ్రెండ...

దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్, అండ్ ఫ్రెండ్‌షిప్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. కొత్త యాక్టర్స్‌తో ఇంత పెద్ద స్కేల్ ఉన్న స్పై డ్రామాను హెవీ రేంజ్‌లో ప్లాన్ చేయడం గుడ్ ఎఫర్ట్!


ఫస్ట్ హాఫ్ నుండి కథలో వచ్చే ట్విస్ట్‌లు, స్పై ఏజెన్సీ మిషన్స్, అండ్ ఫ్రెండ్‌షిప్ జర్నీని చూపించిన తీరు బాగుంది. నటీనటులు కొత్తవారైనా తమ రోల్స్‌కి న్యాయం చేశారు. కానీ, స్పై థ్రిల్లర్ అని వెళ్లిపోతే మాత్రం కొంత డిసప్పాయింట్ అవ్వక తప్పదు. స్క్రీన్ ప్లే చాలా చోట్ల లాజిక్ మిస్ అయింది. ఏజెన్సీ కమ్యూనికేషన్ లేకపోవడం, కథకి సంబంధం లేకుండా టర్న్‌లు తీసుకోవడం కొంచెం అసహజంగా అనిపిస్తాయి.


ఓవరాల్‌గా ఇది ప్యూర్ స్పై యాక్షన్ ఫిల్మ్ కాకుండా, ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే ఓకే-ఒకే డ్రామా. దేశభక్తి అండ్ స్పై ఎలిమెంట్స్ ఇష్టపడేవారు ఒకసారి క్యాజువల్‌గా ట్రై చేయొచ్చు!

Sep 19, 2026 Read Review
5

Average

Secret soldier movie review

దేశభక్తి, దేశం కోసం సీక్రెట్‌ గా పోరాడే సైనికులు చాలా మంది ఉంటారు. అలాంటి సీక్రెట్‌ సోల్జర్స్ ని ప్రధానంగా చేసుకొని రూపొందిన మూవీ `సీక్రెట్‌ సోల్జర్`. దేశభక్తి, స్నేహాన్ని మేళవిస్తూ రూపొందించిన చిత్రమిది. నిజానికిది చాలా పెద్ద రేంజ్‌ స్టోరీ. కానీ కొత్త నటీనటులు, అప్‌కమింగ్‌ యాక్టర్స్ తో ఈ రేంజ్‌ సిన...

దేశభక్తి, దేశం కోసం సీక్రెట్‌ గా పోరాడే సైనికులు చాలా మంది ఉంటారు. అలాంటి సీక్రెట్‌ సోల్జర్స్ ని ప్రధానంగా చేసుకొని రూపొందిన మూవీ `సీక్రెట్‌ సోల్జర్`. దేశభక్తి, స్నేహాన్ని మేళవిస్తూ రూపొందించిన చిత్రమిది. నిజానికిది చాలా పెద్ద రేంజ్‌ స్టోరీ. కానీ కొత్త నటీనటులు, అప్‌కమింగ్‌ యాక్టర్స్ తో ఈ రేంజ్‌ సినిమా తీయడం విశేషమని చెప్పాలి. ఇక సినిమాలో డిఫెన్స్ కి సంబంధించిన సీక్రెట్‌ మిషన్‌ లీక్‌కి, స్నేహాన్ని ముడిపెడుతూ రూపొందించిన తీరు బాగుంది. సినిమాలోని ట్విస్ట్ లు, టర్న్ లు మరో హైలైట్‌గా నిలిచాయి. 


ఇక ఒక్కో ట్విస్ట్, అసలు కథ రివీల్‌ అవుతున్న నేపథ్యంలో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఓ వైపు దేశానికి సంబంధించిన స్పై ఏజెన్సీ చేసే కార్యక్రమాలు, వారు చేసే మిషన్‌ లీక్‌ కావడం వంటి అంశాలను, మరోవైపు స్నేహానికి సంబంధించిన జర్నీని ఆవిష్కరించిన తీరు బాగుంది. స్క్రీన్‌ ప్లే చాలా నీట్‌గా సాగుతుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా చాలా చోట్ల కథనంలో లింక్‌లు మిస్‌ అయ్యాయి. ఒక వైపు వెళ్లే కథ, మరోవైపు టర్న్ తీసుకున్నట్టుగా ఉంటుంది. చాలా చోట్ల లాజిక్‌ లు మిస్‌ అయ్యాయి. స్పై ఏజెన్సీలోనే వారికే కమ్యూనికేషన్‌ లేకపోవడమనేది కొంత అసహజంగా అనిపిస్తుంది. పాత్రల్లోని ట్విస్ట్ లు కూడా పెద్దగా పేలలేదు. కాకపోతే చాలా వరకు ఎంగేజ్‌ చేస్తుంది. కొత్త వారైనా చాలా బాగా చేశారు. ఇదొక స్పై యాక్షన్‌ ఫిల్మ్ లా కాకుండా, స్నేహం చుట్టూ కథని నడిపించడం విశేషంగా చెప్పొచ్చు. ఓవరాల్ గా దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఒక కొత్త తరహా చిత్రమిది. స్పై మూవీస్‌, దేశభక్తి మూవీస్‌ని ఇష్టపడే వారికి నచ్చే సినిమా అవుతుంది.




Sep 19, 2026 Read Review

Public Reviews

2 Avg: 4.0/10
A
3

Not Good

Secrect solider movie review

Guys, Secret Soldier ani edo heavy secret agent action movie anukuni velthe... pure disappointment! Spy thriller ani coloring ichi, lopala matram boring friendship drama pettaru.Main problem entante... screenplay lo okka chukka logic kooda ledhu boss! Oka high-level spy agency lo unna officers ke co...

Guys, Secret Soldier ani edo heavy secret agent action movie anukuni velthe... pure disappointment! Spy thriller ani coloring ichi, lopala matram boring friendship drama pettaru.


Main problem entante... screenplay lo okka chukka logic kooda ledhu boss! Oka high-level spy agency lo unna officers ke communication undadhu anta... entha comedy asalu idi? Story ekkadiko velthundhi, sudden ga random turns theskuntundhi. Twists ani vesina scenes okkati kooda workout kaaledhu, clear ga navvulataga anipinchay.


New actors and camera work okayish anipinchina... aa slow-paced narrative and logic-less scenes ni save cheyaka poyay. Time and money bakkas guys, strictly skippable!

Sep 20, 2026
A
Arige Srikanth Private Employee
5

Average

Secret Soldier Movie review

Secret Soldier movie review : దేశభక్తి, సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ లీక్స్ అని అనౌన్స్ చేసినప్పుడు భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లాను. కొత్త యాక్టర్స్ అయినా ఫ్రెండ్‌షిప్ అండ్ స్పై ఎలిమెంట్స్‌ని బాగానే డీల్ చేశారు, కొన్ని ట్విస్ట్‌లు కూడా వర్కవుట్ అయ్యాయి.కానీ మైన్ ప్రాబ్లం ఏంటంటే... స్క్రీన్ ప్లేలో...

Secret Soldier movie review : దేశభక్తి, సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ లీక్స్ అని అనౌన్స్ చేసినప్పుడు భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లాను. కొత్త యాక్టర్స్ అయినా ఫ్రెండ్‌షిప్ అండ్ స్పై ఎలిమెంట్స్‌ని బాగానే డీల్ చేశారు, కొన్ని ట్విస్ట్‌లు కూడా వర్కవుట్ అయ్యాయి.


కానీ మైన్ ప్రాబ్లం ఏంటంటే... స్క్రీన్ ప్లేలో లాజిక్ తీవ్రంగా మిస్ అయింది! స్పై ఏజెన్సీలోనే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అసహజంగా అనిపిస్తుంది. ఫ్రెండ్‌షిప్ డ్రామా కోసం స్పై థ్రిల్లర్ గ్రాఫ్ తగ్గించేశారు.


పెద్ద రిజల్ట్ ఆశించకుండా, క్యాజువల్‌గా దేశభక్తి మూవీస్ ఇష్టపడేవాళ్లు ఒకసారి చూసేయొచ్చు. నా దృష్టిలో ఇదొక యావరేజ్ వాచ్!

Sep 21, 2026

About This Movie

Story :

నెల్లూరుకి చెందిన యువకులు మీరా వలి(నిహాల్‌ కోదాటి), పృథ్వీ(సూర్య శ్రీనివాస్‌) మంచి స్నేహితులు. సాధారణ జీవితం గడిపే వీళ్ళు, మంచి దేశభక్తి కలిగి ఉంటారు. కానీ వలి ముస్లిం కావడం వల్లో మరే కారణం వల్లో అతనిపై అనుకోకుండా దేశద్రోహి ముద్ర పడుతుంది. దాని వల్ల ఆర్మీలో జాయిన్‌ కావాలనుకున్న అతని కల కూడా దూరమవుతుంది. అతని ఫ్యామిలీపై సొంత వదినే కేసు పెడుతుంది. ఈ క్రమంలో దేశ సేవ కోసం మరో దారి ఎంచుకుంటాడు. ఓ సీక్రెట్ మిషన్ కోసం ఉగ్రవాదులకు దగ్గరయి, తనని తాను దేశ ద్రోహిగా ముద్ర వేసుకుంటాడు. ఈ క్రమంలో దేశంలో జరగబోయే ఉగ్రవాద కుట్రలను వలి ఎలా అడ్డుకున్నాడు. స్నేహితుడు చేసే ఈ పనులన్నీ తెలియని పృథ్వీ ఆ తర్వాత వలి కోసం ఏం చేసాడు? చివరికి వలి, పృథ్వీ ఏం సాధించారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Plus points : 

 

పేట్రియాటిక్ స్పై బ్యాక్ డ్రాప్ లో తెలుగులో ఈ మధ్య తక్కువ సినిమాలే వచ్చాయి. అంటే వచ్చినా ఆకట్టుకునే కథా కథనాలతో మెప్పించలేవు. కానీ ఇలాంటి కథలు బాగుంటే, ప్రేక్షకుడికి నచ్చితే ఎప్పటికి ఆదరణ ఉంటుంది. ఇక ఇప్పుడు విడుదలైన సీక్రెట్ సోల్జర్ కథ కూడా అలాంటిదే. ఫ్రెండ్షిప్, దేశభక్తి మరియు గూఢచర్యం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కథకి సంబంధించి మెయిన్ పాయింట్ బాగుంది. దేశం గురించి దేశభక్తిని గురించి ప్రధానంగా మంచి సీన్లు రాసుకున్నారు. కథ ఇంతకు ముందు సినిమాల్లో లాగానే సింపుల్ గా ఉన్నపటికీ, దేశభక్తి ప్రధానంగా వచ్చే సినిమాల్లో సన్నివేశాలకి మంచి గూస్బంప్స్ వస్తూనే ఉంటాయి. ఇందులో అలాంటి సీన్లు బాగున్నాయి. అలాగే ఫ్రెండ్షిప్ కి సంబంధించిన సీన్స్ కూడా బాగున్నాయి. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ లో నటించిన నిహాల్ కొదాటి, సూర్య శ్రీనివాస్ బాగా నటించారు. ముఖ్యంగా నిహాల్ భావోద్వేగ సన్నివేశాల్లో బాగా ఇంప్రెస్ చేస్తాడు. ఇక కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సినిమాలో స్పై ఇంటెలిజెన్స్ సిస్టం లో జరిగే కొన్ని సీన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. 

 

Minus Points :

అయితే కథ వరకు బాగానే రాసుకున్నా, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. ‘సీక్రెట్ సోల్జర్’ కథ పరంగా మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న పాయింట్స్ కూడా ఉన్నాయి. కానీ చాలా వరకు సింపుల్ వే లో రెగ్యులర్ డ్రామాగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక 20 నిమిషాల వరకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, ఆ తర్వాత చాలా సీన్స్ బోరింగ్ గానే సాగుతాయి. అనవసరమైన ల్యాగ్ సీన్స్ తో ఆడియన్స్ కి విసుగు తెప్పిచాడు డైరెక్టర్. అండ్ ఎమోషనల్ సన్నివేశాలని ఇంకా స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. పైగా దేశద్రోహం కాన్సెప్ట్ అంటూ కథను అల్లారు కానీ, దానికి తగ్గ స్ట్రాంగ్ సీన్స్ రాయలేదు. ఇంటర్వెల్ ఎపిసోడ్  బాగుంది. కానీ కనీసం క్లైమాక్స్ ని బాగా తీసినా, కొంతవరకు ఆడియన్స్ డీసెంట్ అని ఫీల్ అయ్యేవారేమో.

 

Technical Values :

ఇక టెక్నికల్ గా చూసుకుంటే.. ఇలాంటి మూవీస్ కి ఖర్చు బాగానే అవుతుంది కానీ, మేకర్స్ దాదాపు డీసెంట్ గా ఖర్చు పెట్టారు. సురేశ్ ఆర్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. క్వాలిటీ పరంగా బాగా ఇచ్చాడు. ఎడిటింగ్ వర్క్ బాగుంది కానీ, కొన్ని సాగదీత సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది.  అలాగే ఎడిటింగ్ కూడా బావుంది. సంగీతం పర్వాలేదు. ఇక డైరెక్టర్ మంచి కథ రాసుకున్నా దాన్ని ఆడియన్స్ కి ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యాడు. కార్తీక్ ఇచ్చిన మ్యూజిక్ పర్లేదు.


Final Review :

ఓవరాల్ గా "సీక్రెట్ సోల్జర్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ స్పై యాక్షన్ క్రైమ్ డ్రామా ఆడియన్స్ ని కొంతవరకు మెప్పించే అవకాశం ఉంది. ఫ్రెండ్షిప్, దేశభక్తి వంటి అంశాలను బాగానే టచ్ చేసారు. కాకపోతే రొటీన్ కథ, కథనాల వల్ల, రెగ్యులర్ బోరింగ్ డ్రామా వల్ల కొన్ని ఇల్లాజికల్ సీన్స్ వల్ల ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఓవరాల్ గా పేట్రియాటిక్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు.

Review Statistics

4.9
Overall Rating
Avg. of all reviews
7
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.2/10
Public
4.0/10
Why MRO?