ది ప్యారడైజ్ (The Paradise)
న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న "ది ప్యారడైజ్" (The Paradise) సినిమా ఎట్టకేలకు వచ్చేసింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా, కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఎస్ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా థియేటర్ల వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
Reviews
What critics and the public are saying about ది ప్యారడైజ్ (The Paradise)
Media Reviews
24 Avg: 4.7/10Below Average
The paradise movie review
ఇప్పుడే మన పారడైస్ సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. ఆ మూడు ముక్కల్లో పారడైస్ గురించి చెప్పేయాలంటే ఫస్ట్ హాఫ్ పారా రైస్, సెకండ్ హాఫ్ పారా ఫాల్స్, ఓవరాల్ గా పారా డైస్ అన్నమాట. యాక్చువల్ గా ఈ సినిమా గురించి ఇలా చెప్పాల్సి వస్తది అని నేను కలలో కూడా అనుకోలేదు. కాకపోతే సినిమా చూసిన తర్వాత ఇలాగే చెప్పాల్సి...
ఇప్పుడే మన పారడైస్ సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. ఆ మూడు ముక్కల్లో పారడైస్ గురించి చెప్పేయాలంటే ఫస్ట్ హాఫ్ పారా రైస్, సెకండ్ హాఫ్ పారా ఫాల్స్, ఓవరాల్ గా పారా డైస్ అన్నమాట. యాక్చువల్ గా ఈ సినిమా గురించి ఇలా చెప్పాల్సి వస్తది అని నేను కలలో కూడా అనుకోలేదు. కాకపోతే సినిమా చూసిన తర్వాత ఇలాగే చెప్పాల్సి వచ్చింది. ఇంట్రో అయితే అదిరింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో యాక్చువల్ గా కన్ఫ్రంటెషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ కన్ఫ్రంటెషన్ సీన్స్ అంత పవర్ఫుల్ గా నాకైతే అనిపించలేదు.
మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో ప్లస్ పాయింట్ ఇస్ ది మదర్ అండ్ సన్ సెంటిమెంట్. ఆ తర్వాత ఇంకేమి కనెక్ట్ అవ్వవు. మోహన్ బాబు గారు కనిపిస్తున్నా కూడా, ఒక పక్క మన రాఘవ్ యాక్షన్ విరగ్గొడుతున్నా also మనకి ఆ విలనిజంలోనూ ఆ కన్ఫ్రంటెషన్ లోనూ ఫస్ట్ హాఫ్ లో అంత కిక్ అయితే నాకు దొరికినట్టు అనిపించలేదు. ఓవరాల్ గా అయితే ఆయన క్యారెక్టర్ నుంచి అంత స్ట్రాంగ్ గా రాలేదు. ఇంకా లాస్ట్ కి వచ్చేటప్పటికి మనకి ఇదేంట్రా బాబు ఇంత హెవీ క్లైమాక్స్ వస్తున్నా కూడా మనకి ఎటువంటి ఇంపాక్ట్ కలగట్లేదేమిటి అని కైండ్ ఆఫ్ అనిపించే కైండ్ ఆఫ్ లాస్ట్ లో వచ్చే ఆ క్లైమాక్స్... అండ్ సెకండ్ హాఫ్ లో రెండు క్యారెక్టర్లు స్పెషల్ అప్పియరెన్స్ లు ఉన్నాయి బాబు.
నాని డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ హిస్ క్యారెక్టర్. మోహన్ బాబు గారికి నాకు తెలిసి గట్టిగా కొడితే ఒక ఐదు ఆరు సీన్లు ఉంటాయి అనుకుంటా సినిమా మొత్తం. అది కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ని వాడుకున్నారు కానీ మోహన్ బాబు గారిలో నుంచి వచ్చే ఆ అగ్రెసివ్ యాంగిల్ ని వాడుకోలేదేమో అనేది నా ఫీలింగ్. ఓవరాల్ గా మన నాని చేసిన హార్డ్ వర్క్ కోసం ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు కోసం అండ్ అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం చూడాలి అనుకుంటే మీ ఎక్స్పెక్టేషన్ ని కంప్లీట్ గా అండర్లైనర్ లో పెట్టుకొని వెళ్తే మీరు ఈ థియేటర్ ని సినిమాని అలా చూసి మీరు బయటికి వచ్చేటప్పుడు మీకున్న లిస్ట్ ఆఫ్ కంప్లైంట్స్ రాసుకుంటూ థియేటర్ లో నుంచి బయటికి వస్తారు అన్నమాట. సారీ టు సే నాని అండ్ శ్రీకాంత్ ఓదెల టీం మీరు ఎఫర్ట్ అయితే బాగానే పెట్టారు. కాకపోతే దట్ ఎఫర్ట్ ఇస్ పారా టైట్ అన్నమాట. అదన్నమాట సంగతి.
Bad
The paradise movie review
ది పారడైస్ సినిమా ఎలా ఉంది అనేదానికి ఒక్క మాటలో చెప్తాను. నా జీవితంలో నేను చూసిన సినిమాలలో నేను చూసిన వర్స్ట్ మూవీస్ లో ఇది నెంబర్ వన్ లో ఉంటది. లాజిక్ లేదు, మ్యూజిక్ లేదు, ఒక్క డైలాగ్ అంటే ఒక్క డైలాగ్ గుర్తుండేటట్లు లేదు. సినిమా గురించి చెప్పాలంటే. అసలు ఏంటండీ ఆ సినిమా నాకు అర్థం కాలేదు. అంత డిజాస్...
ది పారడైస్ సినిమా ఎలా ఉంది అనేదానికి ఒక్క మాటలో చెప్తాను. నా జీవితంలో నేను చూసిన సినిమాలలో నేను చూసిన వర్స్ట్ మూవీస్ లో ఇది నెంబర్ వన్ లో ఉంటది. లాజిక్ లేదు, మ్యూజిక్ లేదు, ఒక్క డైలాగ్ అంటే ఒక్క డైలాగ్ గుర్తుండేటట్లు లేదు. సినిమా గురించి చెప్పాలంటే. అసలు ఏంటండీ ఆ సినిమా నాకు అర్థం కాలేదు. అంత డిజాస్టర్. సినిమాలో సాంగ్స్ కోసం మాత్రమే వచ్చిన ఆడియన్స్ ని చూసాను. ఇవన్నీ నేను అబద్ధాలు చెప్పట్లే. అసలు ఆ సెన్సార్ ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు. ఎంత వయొలెన్స్ తెలుసా? హ్యూజ్ వయొలెన్స్. నాని గారి కష్టం బాగుంది, నాని గారి యాక్టింగ్ బాగుంది, కానీ ఏం కనెక్ట్ అవ్వలేం.
అసలు హీరోయిన్ ని ఎందుకు పెట్టారో తెలియదు మామ. కొన్ని సీన్స్ అయితే ఇంత స్లోగా పెట్టారు ఈ సీన్స్ ఏంట్రా దీన్ని ఎలా తీసుకోవాలిరా అని. ఇంటర్వెల్ సీన్ సినిమా మొత్తంలోకి నాకు బాగా నచ్చింది. అండ్ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంది మామ. బట్ ఆ మదర్ సెంటిమెంట్ కి మనం కనెక్ట్ అవ్వలేం. ఎందుకు కనెక్ట్ అవ్వం? మొత్తం చూసి వచ్చి ఈ డైలాగ్ అబ్బా అనిపించింది అనే దానికి ఒక్కటి కూడా చెప్పలేం. అండ్ సినిమాలో కొన్ని కామియోస్ ఉంటాయి. కానీ అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ సినిమాకి దీనికి ఎంత కరెక్ట్ చేశారు అసలు ఆ పర్పస్ ఏంటి ఈ సినిమా మొత్తాన్ని ఎక్కడికి తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి నాని గారు వయొలెన్స్ తీసుకుంటారు, ఒకసారి పీస్ ఫుల్ అంటారు. సంబంధం ఉండదు. ఎంత స్లో మామ. అసలు సినిమాలో ఏ లాజిక్ లేదు మామ. నేనేం స్టోరీ రివీల్ చేయట్లేదు. సినిమాకి నాని గారు ప్రాణం పెట్టినా ఏం లాభం? విషయం లేదు, సినిమాలో స్టోరీ లేదు. నా ఒపీనియన్ లో అయితే నాకైతే, నా వల్ల కాలేదండి.
Not Good
The Paradise movie Review
ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, "ది పారడైజ్" మూవీ చూశాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నాకు అసలు నచ్చలేదండి ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ లో ఏదో కొన్ని మోమెంట్స్ వర్కవుట్ అయ్యాయి కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్‌గా డిస్‌కనెక్ట్ అయ్యాను. సినిమాలో హీరోకి, వాళ్ళ మదర్‌కి మధ్య, హీరోకి, తన ఫ్రెండ్‌కి మధ్య, హీరోకి, హీరోయిన్‌కి మధ...
ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, "ది పారడైజ్" మూవీ చూశాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నాకు అసలు నచ్చలేదండి ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ లో ఏదో కొన్ని మోమెంట్స్ వర్కవుట్ అయ్యాయి కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్‌గా డిస్‌కనెక్ట్ అయ్యాను. సినిమాలో హీరోకి, వాళ్ళ మదర్‌కి మధ్య, హీరోకి, తన ఫ్రెండ్‌కి మధ్య, హీరోకి, హీరోయిన్‌కి మధ్య లేదా ఈ సవారీ గ్యాంగ్ నుండి మనకొక డ్రామా జనరేట్ అవుతాది, దాని నుండి మనం ఒక హై కానీ ఏమైనా ఫీల్ అవుతాం అనుకున్నా, కానీ ఈ మూవీలో విలన్ ఈ సవారీ గ్యాంగ్ మెంబర్స్‌ని కానీ ఎంతలా హింసించాడు, దాన్ని బట్టి విలన్ మీద మనకెంత కోపం వచ్చింది, దాని నుండి హీరో ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇదే ఎమోషన్ అండి వాళ్ళు ట్రై చేసింది.
యూజువల్లీ మనం కమర్షియల్ సినిమాలు తీసుకున్నా అండి మనకి ఆ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆ క్యారెక్టర్స్‌తో మనం పరిచయం అవుతాం, ఆ క్యారెక్టర్ మీద ఒకే ఈ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం, ఈ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం కాదు అనేది రైటింగ్ బట్టి ఉంటుంది. సో ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ బాగుంది. కానీ జనాలు ఇప్పుడు థియేటర్ కి వచ్చారు అంటే 50% నాని గురించి అయితే 50% అనిరుధ్ వల్లనే. ఆయాశర్ సాంగ్ కానివ్వండి, ఏషనాగుల సాంగ్ కానివ్వండి, మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సమ్మక్క సాంగ్ కానివ్వండి నా ఫ్రెండ్స్ కొంతమంది సమ్మక్క సాంగ్ విన్న తర్వాత ఓకే ఎమోషనల్లీ ఉంటది అని చెప్పేసి వాళ్ళు కూడా నాతో పాటు టికెట్స్ బుక్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ ఈజ్ ది లాస్ట్ పాజిటివ్ పాయింట్. అండ్ మిగతావేమి నచ్చలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈజ్ ఎడిటర్స్ డెసిషన్ ఆర్ ది డైరెక్టర్స్ డెసిషన్. ఓవరాల్ నాకైతే నచ్చలేదు. కానీ మీరు నాని డాన్స్ చేస్తే చాలు చూసేస్తా, ఫైట్ చేస్తే చాలు చూసేస్తా అంటే.. చుడండి చూసాక మీకు ఎలా అనిపించిందో recap చేసుకోండి.
Not Good
The Paradise movie review
పారడైస్ మీద చాలా హైప్ ఉండే వన్ అండ్ హాఫ్ ఇయర్ గా క్రియేట్ చేసిరు. సో పారడైస్ వెరీ వెరీ మచ్ హైప్ అవన్నీ పక్కన పెట్టినా కానీ సినిమాలో పాజిటివ్స్ ఫస్ట్ మాట్లాడేసుకుందాం. సినిమాలో చూపించే ప్రతి ఫ్రేమ్ చాలా బాగున్నాయి, నన్ను అడిగితే ఫస్ట్ 20 టు 30 మినిట్స్ ఒక రకమైన ఎస్తటిక్ పెడతారు సినిమాలో మన తెలుగు సిన...
పారడైస్ మీద చాలా హైప్ ఉండే వన్ అండ్ హాఫ్ ఇయర్ గా క్రియేట్ చేసిరు. సో పారడైస్ వెరీ వెరీ మచ్ హైప్ అవన్నీ పక్కన పెట్టినా కానీ సినిమాలో పాజిటివ్స్ ఫస్ట్ మాట్లాడేసుకుందాం. సినిమాలో చూపించే ప్రతి ఫ్రేమ్ చాలా బాగున్నాయి, నన్ను అడిగితే ఫస్ట్ 20 టు 30 మినిట్స్ ఒక రకమైన ఎస్తటిక్ పెడతారు సినిమాలో మన తెలుగు సినిమానేనా అనే ఫీలింగ్ అయితే కొన్ని కొన్ని షాట్స్ కచ్చితంగా అనిపించినాయి. విజువల్ గా చాలా చెప్పడానికి ట్రై చేసిండు మన ఒడేలా అదైతే మాత్రం కనబడుతుంది. పాటలు మనకి ఏసనాగుల అండ్ ఆల్సో ఆయా షేరు ఆ పాటలు ఆబ్వియస్లీ చాలా బాగున్నాయి.
ఇంటర్వెల్ లో అయితే మాత్రం అది అనిపించింది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ గా అరే పారడైస్ ఏదో ఉండబోతుంది రా ఏదో చేస్తున్నారు నేను అప్పటి నుంచి కూడా అదే చెప్తున్నా కొడితే గట్టిగా కొడతది లేకపోతే ఏటు లేకుండా పోతది సినిమా అని చెప్పేసి. నేను ఎందుకు రైట్ అయినా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. పారడైస్ సర్కిల్ అని పెట్టిన్రు. సినిమాలో ఒక్క క్యారెక్టర్ వర్క్ కాలేదు, ఏది వర్క్అవుట్ కాలేదు నాకైతే. ఇక సినిమాలో ముఖ్యంగా టాటూ ఏదైతే సీన్ రావాలో అది చాలా ఎమోషనల్ సీన్ అవ్వాల్సింది, చాలా చాలా జరగాల్సింది చాలా టర్మాయిల్ అవ్వాల్సింది మనకి ఏమి అనిపియట్లేదు. బేసిక్ గా స్టోరీ సమ్మక్క అండ్ ఆల్సో వాళ్ళ కొడుకు జడల మధ్యలో జరిగే స్టోరీ. వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఎమోషన్స్ కొన్ని సీన్లు వర్క్ అవుట్ అయినాయి. నాని గారు ఎప్పుడైనా బానే చేస్తారు ఈ సినిమాలో కూడా వీలైనంత వరకు బానే చేసిరు అని చెప్తా. నాకు బిగ్గస్ట్ డిసప్పాయింట్మెంట్ యు హాడ్ సంపూర్ణేష్ బాబు. ఏమీ లేదు. సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఉండడానికి రీజన్ ఏంటి? మోహన్ బాబు గారు ఈ సినిమాలో ఉండడానికి రీజన్ ఏంటి? రాఘవ లారెన్స్ అసలు ఎందుకున్నాడు సినిమాలో? నాకు అర్థం కాలేదు. ఫైనల్లీ నాకైతే అస్సలు నచ్చలేదు.
Below Average
The paradise movie review
ది పారడైస్ సినిమా గురించి చెప్పాలంటే సీరియస్లీ చెప్తున్నా నాని అన్న కాకుండా ఈ సినిమా ఇంకా ఎవరైనా చేసి ఉంటే కచ్చితంగా చేతిలో రాడ్డు ఉండేది. అలాంటి సినిమా ఇది. నిజంగా చెప్తున్నా అవుట్ రైట్ బ్యాడ్ ఫిలిం అబ్బా. సినిమాలో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ పక్కన పెడితే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ బాగుంటది. ఒక 10 నిమిషా...
ది పారడైస్ సినిమా గురించి చెప్పాలంటే సీరియస్లీ చెప్తున్నా నాని అన్న కాకుండా ఈ సినిమా ఇంకా ఎవరైనా చేసి ఉంటే కచ్చితంగా చేతిలో రాడ్డు ఉండేది. అలాంటి సినిమా ఇది. నిజంగా చెప్తున్నా అవుట్ రైట్ బ్యాడ్ ఫిలిం అబ్బా. సినిమాలో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ పక్కన పెడితే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ బాగుంటది. ఒక 10 నిమిషాలు అద్భుతంగా అనిపిస్తది. సీరియస్లీ ఆ సీన్ చూసి ఏం రాసిండయ్యా శ్రీకాంత్ ఓడెలా అనిపించింది నాకైతే. కానీ ఆ తర్వాత నుంచి కూడా ఏం రాసిండయ్యా శ్రీకాంత్ ఓడెలా అసలు అన్న ఫీలింగ్ ఏ కలిగింది నాకైతే మటుకు. సీరియస్లీ చెప్తున్నా టిపికల్ ప్లాట్ లైన్ చాలా అంటే చాలా రొటీన్ ప్లాటు. అసలు ఏ ఉద్దేశంతో ఇది అంత లెవెల్ లో హైప్ ఇచ్చి మరి దీన్ని రిలీజ్ చేశారు అనేది నాకు అర్థం కాలే.
అసలు ఆయా షేర్ పాట ప్లేస్మెంట్ ఏందో, ఏశ నాగుల పాట ప్లేస్మెంట్ ఏందో ప్లేస్మెంట్లు మరీ వరస్ట్. అసలు ఏమనుకొని తీశారో ఏందో ఏం అర్థం కావట్లే అసలు సీరియస్లీ. మళ్ళీ నాకు దసరా గుర్తు చేసింది. బేసిక్ గా దసరా సినిమా తర్వాత అనుకున్నంత బాగా తీయలేకపోయానన్నా అని చెప్పి దగ్గరికి వచ్చి దసరా కంటే 10 రెట్లు బ్యాడ్ ఫిలిం తీయాలన్న ఆలోచన ఏ యాంగిల్ లో వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. ఆ బిర్యానీ క్యారెక్టర్ సంపూర్ణేష్ బాబు గారికి అంత పెద్ద క్యారెక్టర్ కూడా కాదు. తర్వాత రెండు ఇంట్రెస్టింగ్ క్యామియోస్ ఉంటాయి. అవి రెండు బాగుంటాయి. అది కొంచెం సర్ప్రైజ్ లాగా. డైరెక్షన్ సైడ్ అవుట్ రైట్ డిజాస్ట్రస్ ఫీల్ అయితే వస్తోంది నాకైతే మటుకు. నాకైతే మటుకు. బాలేదబ్బా. అసలు ఏందో అవుట్ రైట్ డిసపాయింట్మెంట్. సో దట్స్ గైస్ అంతే ఇంకా. సోది లేకుండా ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే పారడైస్. స్వర్గం మిస్సింగ్, నరకంలోకి స్వాగతం. అంతే నా రేటింగ్ అయితే 1.75\ 5.
Not Good
The paradise movie review
ది ప్యారడైజ్ రివ్యూ... నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ లోనే ఏదో కుచ్ తో తేడా హై. కుచ్ తో తేడా హై. ఏందిరా తేడా హై తేడా హై తేడా అంటారా...? సింపుల్ లాజిక్ అండి ఇప్పుడు దసరానే అసలు ఎక్కలేదు. పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు సుకుమార్ గారి శిష్యుల సినిమా వస్తది. రంగస్థలం షేట్స్ చాలా కనిపిస్తాయి దసరాలో. అంటే ఒక ప...
ది ప్యారడైజ్ రివ్యూ... నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ లోనే ఏదో కుచ్ తో తేడా హై. కుచ్ తో తేడా హై. ఏందిరా తేడా హై తేడా హై తేడా అంటారా...? సింపుల్ లాజిక్ అండి ఇప్పుడు దసరానే అసలు ఎక్కలేదు. పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు సుకుమార్ గారి శిష్యుల సినిమా వస్తది. రంగస్థలం షేట్స్ చాలా కనిపిస్తాయి దసరాలో. అంటే ఒక పూర్లీ మేడ్ దసరా ఏదో కాపీ చేద్దాం అని సరిగ్గా వర్క్ అవుట్ అవ్వకుండా అయిన సినిమా అనిపించింది నాకైతే. దాన్ని ఎటెటో తీసుకెళ్లిపోయి ఒక కొత్త దేశం అని చెప్పి దేశాన్ని దున్నేస్తా అని చెప్పి మన మీద పడ్డారు మన మీద దండయాత్ర చేశారు.
అసలు నాకు దసరానే ఎక్కలేదు. ఇదైతే ఇంకా ఇంకా దీని తర్వాత కూడా ఇంకో సినిమా తీస్తా అంటే అది నాకు అర్థం కావట్లే. చూస్తే ఏందిరా మీరు ఏదేదో అన్నారు ఏందిరా ఇది అన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తా. ఒరేయ్ జెనరిక్ టెంప్లేట్ రొట్ట కొట్టుడు విలన్ క్యారెక్టర్ అది నథింగ్ మోర్ అసలు బాహుబలి నుంచి కూడా కొంచెం అడవి శేషు సీన్స్ త్రెడ్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ అఫ్ ఆల్ నాకు సాంగ్ ఏ బొక్క అనిపిస్తుంది ఈ సినిమాలో అలా అది పక్కన పెడితే నాకు అక్కడ హీరో గారిని హీరోయిన్ గారిని చూసినప్పుడు అది ఓవర్ ఎక్స్పోజర్ అని నాకు అనిపించింది.
ఫర్ ఎ పర్సన్ లైక్ నాని. నానిని చూసి నానిని నమ్మి వస్తాము జనాలు. ఇదేదో పారడైస్ అది ఇది కాదు నాని గారి సినిమా నాని గారు నాని గారు చెప్తే ఇది అని చెప్పి వచ్చారు. అలాంటిది ఇక పేరు పోగొట్టుకున్నట్టే ఉంటదండి ఇలా చేసుకుంటూ వెళ్తే. చెప్తున్నా కదా ఈ మాస్ జోన్ లోకి ఎందుకు వెళ్తారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ తెలంగాణ రిఫరెన్స్ కూడా అండి మేము మేము తెలంగాణనే నేను మేడారం జాతర వీటన్నిటికి వెళ్ళాము సమ్మక్క సారక్క అని దానికి ఒక మంచి స్టోరీ ఉంది. దాన్ని తీసుకొచ్చి మీ గబ్బు స్టోరీలో ఇన్వాల్వ్ చేయడం అవసరమా చెప్పండి రాహుల్ గారు. ఫైనల్ గా నాకైతే ఎక్కలేదండి మైండ్ పాడైపోయింది.
Average
The Paradise movie review
254 మినిట్స్ రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ అయిన ది పారడైస్. ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ది పారడైస్ అనే ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే పర్సనల్లీ సాటిస్ఫైడ్ ఫీలింగ్ అస్సలు రాలేదండి. మూవీలో ఫస్ట్ 40 మినిట్స్ అయితే సినిమా ఎంత బాగా ఉంటుందనే ఎక్స్పెటేషన్స్ పెంచేస్తాయి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి ఓ...
254 మినిట్స్ రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ అయిన ది పారడైస్. ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ది పారడైస్ అనే ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే పర్సనల్లీ సాటిస్ఫైడ్ ఫీలింగ్ అస్సలు రాలేదండి. మూవీలో ఫస్ట్ 40 మినిట్స్ అయితే సినిమా ఎంత బాగా ఉంటుందనే ఎక్స్పెటేషన్స్ పెంచేస్తాయి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి ఓకే సినిమా బానే ఉంది పర్లేదు అనే ఫీలింగ్ కలిగింది ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయిందండి. అసలు సెకండ్ హాఫ్ లో ఒక సీన్ కూడా నాకు ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు.
ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు, యాక్షన్ సీక్వెన్స్ వర్కౌట్ అవ్వలేదు, స్టోరీ ప్రోగ్రెస్ కూడా ఎంగేజింగ్ అనిపించలేదు. అసలు స్టోరీయే పెద్దగా అనిపించలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో ఫ్యామిలీతో చూడడానికి డెఫినెట్లీ సూటబుల్ కాదు. మూవీకి ఏ సర్టిఫికేట్ ఉంది. నాని గారి కెరియర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అనే చెప్పాలి. నాని గారికి ఉన్న స్కోప్ ని బాగా యూస్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ అండ్ ఎలివేషన్స్ పక్కకి వెళ్లి బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ 100% జస్టిఫై చేసిందండి. టిహెచ్ సాయి గారు వర్క్ చాలా బాగుంది. ఫ్రేమ్స్, లైటింగ్, లొకేషన్స్, ప్రొడక్షన్ డిజైన్ ఓవరాల్ గా మూవీ విజువల్ క్వాలిటీ చాలా హై లెవెల్ లో ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో వరల్డ్ ఎస్టాబ్లిష్ చేసిన వే, కలర్ ప్యాలెట్, కంపోజిషన్స్ థియేటర్ ఎలివేషన్ ని బాగా క్యారీ చేసింది. ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2.5/5
Below Average
The Paradise movie review
#TheParadise A Patience Testing Artificial Mass Film!An interesting start and decent interval are about the only portions that work in the first half. The second half is even worse with senseless writing, tedious narration, and barely any emotional connect. There are moments that show some promise i...
#TheParadise A Patience Testing Artificial Mass Film!
An interesting start and decent interval are about the only portions that work in the first half. The second half is even worse with senseless writing, tedious narration, and barely any emotional connect. There are moments that show some promise in the film, but everything feels artificial, from the staging and performances to the action, while the lackluster editing and abrupt cuts only make it more chaotic.
Apart from the songs, Anirudh’s BGM is surprisingly weak, and the poor sound mixing makes things worse with excessive loudness and dialogues that are hard to follow at times. Odela completely fumbles the writing and execution, wasting a golden opportunity. It’s a head scratcher how he followed Dasara up with this. Nani puts in the effort, but even he feels like a misfit in this poorly sketched world. A completely forgettable film and easily one of Nani’s weakest.
Rating: 1.75/5
Average
The Paradise Movie Review
#TheParadise REVIEW #iDream Media Rating 2.25/5 హీరో కష్టం..దర్శకుడి విజువలైజేషన్ నిర్మాత డబ్బులు అన్నీ వృధా అయిపోయాయి. ...కేవలం సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో.. ...తొలిసగం ఫరవాలేదు అనిపించినా మలిసగం ఎక్కడెక్కడో తిరిగేసింది.... సినిమాకు చాలా ప్లస్ పాయింట్లు వున్నాయి కానీ అంతకు మించి మైనస్ పాయింట...
#TheParadise REVIEW #iDream Media Rating 2.25/5
హీరో కష్టం..
దర్శకుడి విజువలైజేషన్
నిర్మాత డబ్బులు
అన్నీ వృధా అయిపోయాయి.
...
కేవలం సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో..
...
తొలిసగం ఫరవాలేదు అనిపించినా
మలిసగం ఎక్కడెక్కడో తిరిగేసింది.
...
సినిమాకు చాలా ప్లస్ పాయింట్లు వున్నాయి
కానీ
అంతకు మించి మైనస్ పాయింట్లూ వున్నాయి
అదే సమస్య.
...
పంచ్ లైన్ - పారడైజ్ బిరియానీ కాదు కిచిడీ
Below Average
The Paradise Movie Review
‘ది ప్యారడైజ్’.. ప్రొడ్యూసర్లు solid pan india సినిమా తీశామని అనుకుంటున్నారు కానీ, నిజానికి ప్రేక్షకుల ఓర్పుకి నోబెల్ బహుమతి ఇచ్చే పరీక్ష పెట్టారు! సినిమాలోని లాజిక్కులు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే! ఒకవైపు హీరో విలన్లను నరికి పడేస్తుంటే, బందీగా ఉన్న అతనమ్మ హాయిగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తోంది—పాప...
‘ది ప్యారడైజ్’.. ప్రొడ్యూసర్లు solid pan india సినిమా తీశామని అనుకుంటున్నారు కానీ, నిజానికి ప్రేక్షకుల ఓర్పుకి నోబెల్ బహుమతి ఇచ్చే పరీక్ష పెట్టారు! సినిమాలోని లాజిక్కులు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే! ఒకవైపు హీరో విలన్లను నరికి పడేస్తుంటే, బందీగా ఉన్న అతనమ్మ హాయిగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తోంది—పాపం, ఎమోషన్ పండించబోయి థియేటర్లలో నవ్వులు పూయించారు! ఇక కలెక్టర్ గారైతే గుర్తింపు కార్డు సంతకాల కోసం పిక్కల్లోతు నీళ్లలో కూర్చుని సత్యగ్రహం చేస్తారు. అంతటితో ఆగారా? మన హీరో ఏకంగా సొంత 'దేశాన్ని' ప్రకటించేసి, టీచర్లు, డాక్టర్లను కిడ్నాప్ చేసి మరీ ఆ దేశంలో జాబ్‌లో పెట్టేస్తాడు. ఇదెక్కడి సిల్లీ కాన్సెప్ట్ రా బాబూ!
ఇక మోహన్ బాబు గారు 'భారతీయుడు' కమల్ హాసన్ లా వర్మకళ ప్రయోగించి మహాబలశాలి నానిని గాల్లోకి లేపి తంతే, ప్రేక్షకులు భరించలేక దీర్ఘంగా నిట్టూర్చాల్సి వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే, ఇది 'ప్యారడైజ్' కాదు, పక్కా రక్తసిక్తమైన 'హెల్-బిర్యానీ'! తెరపై ముక్కలు నరుకుతుంటే మన మీద పడతాయేమో అని భయపడేంత నరమేధం. సత్యరాజ్ గారు సినిమాలో అన్నట్లు "ప్యారడైజ్ ఈజ్ గోయింగ్ టు బి హెల్" అనేది ఆడియన్స్ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. బిల్డప్ ఎక్కువ... విషయం తక్కువ!
Average
The Paradise Movie Review
రీసెంట్ టైంలో హీరో కానీ తన ఊరు కానీ జాతి కాని ఒక గుర్తింపు కోసం చేసే పోరాటం నేపధ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి…అవే కోవలోకి వచ్చే సినిమానే ప్యారడైజ్ కూడా. కానీ ఇక్కడ కొన్ని స్పెషాలిటీలు కూడా ఉన్నప్పటికీ కూడా టేకింగ్ పరంగా డైరెక్టర్ అనుకున్న పాయింట్ ను సీన్స్ వైజ్ బాగానే ప్రజెంట్ చేశాడు కానీ ఎందుకో అది...
రీసెంట్ టైంలో హీరో కానీ తన ఊరు కానీ జాతి కాని ఒక గుర్తింపు కోసం చేసే పోరాటం నేపధ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి…అవే కోవలోకి వచ్చే సినిమానే ప్యారడైజ్ కూడా. కానీ ఇక్కడ కొన్ని స్పెషాలిటీలు కూడా ఉన్నప్పటికీ కూడా టేకింగ్ పరంగా డైరెక్టర్ అనుకున్న పాయింట్ ను సీన్స్ వైజ్ బాగానే ప్రజెంట్ చేశాడు కానీ ఎందుకో అది పూర్తిగా అంచనాలను అందుకునే రేంజ్ లో తీయలేకపోయాడు.
నాని మాస్ అవతార్ లో కుమ్మేస్తున్నా కూడా ఎందుకో ఆ రోల్ లో నాని సెట్ అవ్వలేదు అనిపించింది. అందరూ బాగానే చేసినా ఏవి కూడా పెద్దగా రిజిస్టర్ అయ్యే రేంజ్ పాత్రలు కావు…అనిరుద్ మరోసారి తన మార్క్ ను చూపించి వీక్ సీన్స్ ను కూడా లేపే ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా మరీ హైప్ తో కానీ దసరాని మించే రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఓవర్ గా అంచనాలతో వెళితే మాత్రం ఆ అంచనాలను సినిమా అందుకోలేదు. హైప్ ను చాలా తగ్గించుకుని వెళితే మాత్రం సినిమా లెంత్ అండ్ సీన్స్ డ్రాగ్ అయినా ఓవరాల్ గా ఒక సారి చూడొచ్చు అనిపించవచ్చు.
Above Average
The Paradise Movie Review
నాని ఇటీవల ఫ్యామిలీ హీరో నుంచి మెల్లిమెల్లిగా యాక్షన్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. హిట్ 3 నాని కెరీర్ లో ఎక్కువ యాక్షన్, వైలెన్స్ అనుకుంటే దాన్ని మించిన వైలెన్స్ తో ది ప్యారడైజ్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈ కథ కొత్తదేమీ కాదు. గుర్తింపు లేని మనుషుల కోసం పోరాటం చేయడం గతంలో అనేక సినిమాల్లో చూసాము...
నాని ఇటీవల ఫ్యామిలీ హీరో నుంచి మెల్లిమెల్లిగా యాక్షన్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. హిట్ 3 నాని కెరీర్ లో ఎక్కువ యాక్షన్, వైలెన్స్ అనుకుంటే దాన్ని మించిన వైలెన్స్ తో ది ప్యారడైజ్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈ కథ కొత్తదేమీ కాదు. గుర్తింపు లేని మనుషుల కోసం పోరాటం చేయడం గతంలో అనేక సినిమాల్లో చూసాము. ఇటీవల వచ్చిన పెద్ది సినిమా మెయిన్ పాయింట్ కూడా అదే. కాకపోతే కథ పాతదే అయినా కథనం మాత్రం కొత్తదే. స్క్రీన్ ప్లేలో కథని ఆరు చాఫ్టర్స్ గా చెప్పారు. మాములు స్క్రీన్ ప్లే తో ఈ కథ చెప్పొచ్చు కానీ దర్శకుడు అలా చెప్పాలనుకున్నాడేమో.
ఈ సినిమాతో నాని పూర్తి స్థాయిలో యాక్షన్ హీరోగా మారిపోయాడు అని చెప్పొచ్చు. రెండు జడలు, పర్ఫెక్ట్ జిమ్ బాడీతో, ముక్కుపుడకలు, గొలుసులు, స్పెషల్ డ్రెస్సులతో ఒక సరికొత్త లుక్ లో కనపడటమే కాక యాక్టింగ్ కూడా అదరగొట్టేసాడు. మోహన్ బాబు చాన్నాళ్ల తర్వాత పూర్తి నెగిటివ్ పాత్రలో విలనిజం చూపిస్తూ అదరగొట్టారు. కిల్ సినిమాతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరైన బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కూడా ఇందులో నెగిటివ్ షేడ్స్ తో మెప్పించాడు. ఓవరాల్ గా హీరోయిన్ ట్రాక్, సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. కథ పాతదే అయిన కొత్త కథనంతో కొత్త ప్రపంచం సృష్టించి సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా ‘ది ప్యారడైజ్’ ఓ కొత్త ప్రపంచంలో సవారీల జాతి గుర్తింపు కోసం జరిగే యాక్షన్ ఎమోషనల్ కథ.
Above Average
The paradise movie review
ది ప్యారడైజ్ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సీక్వెన్సెస్. మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా ప్రతి యాక్షన్ బ్లాక్‌ను అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేశారు. నాని తన పాత్ర కోసం పడ్డ శ్రమ, శారీరక మార్పులు స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తాయి. షికాంజా మాలిక్ ను డిజైన్ చేసుకోవడం.. విలనిజం, హీరోయిజంకు స...
ది ప్యారడైజ్ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సీక్వెన్సెస్. మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా ప్రతి యాక్షన్ బ్లాక్‌ను అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేశారు. నాని తన పాత్ర కోసం పడ్డ శ్రమ, శారీరక మార్పులు స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తాయి. షికాంజా మాలిక్ ను డిజైన్ చేసుకోవడం.. విలనిజం, హీరోయిజంకు సంబంధించిన సీన్లను అద్భుతంగా రాసుకుని తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల్ సక్సెస్ అయ్యాడు. అయితే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పాతకాలపు రొటీన్ స్టోరీనే ఎంచుకోవడం, దానికి తగ్గట్టుగా స్టోరీలో ఎలాంటి కొత్తదనం చూపించకపోవడం ఈ చిత్రానికి మైనస్ గా నిలించింది.
నాని క్యారెక్టర్ తప్ప మిగతా ఏ పాత్ర కూడా హలంగా నమోదు కాకపోవడం నిరాశపరుస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగుతూ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ఇక హీరోయిన్ పాత్రను రాసుకున్న తీరు, రాఘవ్ జుయల్ లాంటి నటులను సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లేలో బలం లేకపోవడంతో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఓవరాల్ గా 'ది ప్యారడైజ్' సినిమా మాస్ ఆడియన్స్‌కు, నాని అభిమానులకు ఓ ట్రీట్. మాస్ అభిమానులు మెచ్చే సినిమా.
Above Average
The Paradise movie review
ది పారడైజ్ ఫస్ట్ అఫ్ చూసిన తర్వాత నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అనిపించింది.. కానీ సెకండ్ హాఫ్ దారి తప్పాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అంత పెద్ద ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత సెకండ్ హాఫ్ సరిగా డీల్ చేయలేకపోయాడు. ఫస్టాఫ్ లో వర్కవుట్ అయిన ఎమోషన్ సెకండ్ హాఫ్ లో కుదరలేదు. దానితోడు అనవసరపు రాజకీయ...
ది పారడైజ్ ఫస్ట్ అఫ్ చూసిన తర్వాత నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అనిపించింది.. కానీ సెకండ్ హాఫ్ దారి తప్పాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అంత పెద్ద ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత సెకండ్ హాఫ్ సరిగా డీల్ చేయలేకపోయాడు. ఫస్టాఫ్ లో వర్కవుట్ అయిన ఎమోషన్ సెకండ్ హాఫ్ లో కుదరలేదు. దానితోడు అనవసరపు రాజకీయాలు సినిమాలో ఇరికించినట్టు అనిపించింది.. క్లైమాక్స్ కూడా పూర్తిగా రాజకీయం చేయడం అసంపూర్తిగా అనిపించింది. నాని తన వరకు అద్భుతంగా నటించాడు.. తన దర్శకుడు ఏం చెప్తే అది చేశాడు. మోహన్ బాబు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.. కానీ ఆయనను కూడా ఇంకాస్త వాడుకొని ఉంటే బాగుండేది అనిపించింది. రాఘవ్ జుయల్ ఉన్నంతసేపు బాగున్నాడు. మరొక కీలక పాత్రలో సోనాలి కులకర్ణి బాగా నటించింది.
ఈ సినిమాకు మెయిన్ హీరో అనిరుద్.. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా కోసం ప్రాణం పెట్టాడు. చాలా చోట్ల అనిరుద్ సంగీతం సినిమాను కాపాడింది. నవీన్ నూలి సెకండ్ హాఫ్ మీద ఫోకస్ చేసి ఉండాల్సిందే. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకాంత్ ఓదెల తనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ఇంకాస్త బాగా యూస్ చేసుకొని ఉండాల్సింది. సెకండ్ హాఫ్ మీద ఫోకస్ చేసి ఉంటే ప్యారడైజ్ చాలా మంచి మాస్ సినిమా అయి ఉండేది. ఇప్పటికీ అదిరిపోయే ఫస్ట్ ఆఫ్ ఈ సినిమాను మాస్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్ గా ది ప్యారడైజ్.. గుర్తింపు కోసం పోరాటం..!
Above Average
The Paradise Movie Review
భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన న్యాచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' (The Paradise) పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా నిలిచింది! 'దసరా' కాంబో శ్రీకాంత్ ఓదెల - నాని మళ్లీ స్క్రీన్ పై మాస్ విధ్వంసాన్ని సృష్టించారు. దర్శకుడు రాసుకున్న విలనిజం, హీరోయిజం ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్! మైండ్ బ్లోయింగ్...
భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన న్యాచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' (The Paradise) పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా నిలిచింది! 'దసరా' కాంబో శ్రీకాంత్ ఓదెల - నాని మళ్లీ స్క్రీన్ పై మాస్ విధ్వంసాన్ని సృష్టించారు. దర్శకుడు రాసుకున్న విలనిజం, హీరోయిజం ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్! మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ ఫైట్, అమ్మోరు ఆవాహించినట్టు ఉండే యాక్షన్ సీన్, మోహన్ బాబు స్ట్రాంగ్ రోల్ సినిమాకు హైలైట్. దీనికి తోడు అనిరుధ్ అందించిన ఊరమాస్ BGM సింగిల్ స్క్రీన్లలో విజిల్స్ వేయించింది!
but తెలంగాణ యాస, కొన్ని ఎమోషనల్ సీన్లు అనుకున్నంతగా పండకపోవడం చిన్న మైనస్. సెకండాఫ్ కాస్త మందగించి, పొలిటికల్ లింకులు, logics మిస్ అవ్వడంతో ముగింపు కొంత తేలిపోయింది. overall లాజిక్స్ పక్కనబెడితే... నాని నటన, అనిరుధ్ మ్యూజిక్, ఊరమాస్ యాక్షన్ సీన్స్ కోసం ఓసారి థియేటర్లో చుసేయోచ్చు.
Average
The Paradise movie review
విలన్ ఎంత పవర్‌ఫుల్ అయితే హీరోయిజం అంతకు అంత ఎలివేట్ అవుతుంది - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ప్రశాంత్ నీల్ వరకు పలువురు దర్శకులు ఫాలో అయ్యే ఫార్ములా. పాన్ ఇండియా హిట్స్ సాధించిన యాక్షన్ ఫిలిమ్స్ చూస్తే... పవర్ ఫుల్ విలన్స్, తెరపై ఇప్పటి వరకు మనం చూడని కొత్త ప్రపంచాలు కనిపిస్తాయి. 'ది ప్యారడైజ్'...
విలన్ ఎంత పవర్‌ఫుల్ అయితే హీరోయిజం అంతకు అంత ఎలివేట్ అవుతుంది - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ప్రశాంత్ నీల్ వరకు పలువురు దర్శకులు ఫాలో అయ్యే ఫార్ములా. పాన్ ఇండియా హిట్స్ సాధించిన యాక్షన్ ఫిలిమ్స్ చూస్తే... పవర్ ఫుల్ విలన్స్, తెరపై ఇప్పటి వరకు మనం చూడని కొత్త ప్రపంచాలు కనిపిస్తాయి. 'ది ప్యారడైజ్'లోనూ ఆ తరహా సెటప్ చక్కగా కుదిరింది. కానీ, అవుట్ పుట్ మాత్రం ఆశించినట్టు రాలేదు. నాని ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ వరకు అందరినీ కాస్త డిజప్పాయింట్ చేసేలా ఉంది.
శ్రీకాంత్ ఓదెల కథలో కొత్తదనం లేదు. కానీ, కొత్త ప్రపంచం ఉంది. కామన్ కథలను కొత్తగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. 'ది ప్యారడైజ్'లో కథను పక్కన పెడితే... శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా లేదు. తల్లిని హీరో ఎందుకు అసహించుకుంటున్నాడు? అనేదానికి ఓ రీజన్ ఉంది. కానీ, ఆ ఎమోషన్ ఆడియన్ ఫీలయ్యేలా తీయలేదు. ఇంటర్వెల్ తర్వాత నాని - మోహన్ బాబు సీన్ చూశాక... నెక్స్ట్ లెవల్‌కు వెళుతుందని అనుకుంటే, హీరో వర్సెస్ విలన్ ఎపిసోడ్ కంప్లీట్ సైడ్ ట్రాక్ చేసేశారు.
ఓవరాల్ గా మాంచి మాస్ మసాలా బిర్యానీకి కావాల్సిన సరుకు 'ది ప్యారడైజ్' లో ఉంది. కానీ టేస్ట్ ఆశించినట్టు లేదు. కొత్త ప్రపంచం, పవర్ ఫుల్ విలన్, జాతి గుర్తింపు కోసం పోరాడే నాయకుడు, మదర్ సెంటిమెంట్, ఛార్ట్ బస్టర్ సాంగ్స్... అన్నీ ఉన్నా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే రీతిలో కథనం సాగలేదు. పార్టులుగా యాక్షన్ బ్లాక్స్ ఓకే. నాని కూడా! అసలు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే రక్తం ఏరులై పారే, తలలు తెగిపడే యాక్షన్ సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ 'ది ప్యారడైజ్' ను కాస్త ఓపిక చేసుకుని చూడవచ్చు. లేదంటే చాలా కష్టం. ఆ వయలెన్స్ ను ఫ్యామిలీతో చూడలేం.
Below Average
The Paradise movie review
Dasara (2023), the first film pairing Nani and Srikanth Odela, was a huge box-office success and also received critical acclaim. After its phenomenal success, both the hero and the director teamed up once again for, The Paradise. After finishing a quick round of promotions in various cities, the mak...
Dasara (2023), the first film pairing Nani and Srikanth Odela, was a huge box-office success and also received critical acclaim. After its phenomenal success, both the hero and the director teamed up once again for, The Paradise. After finishing a quick round of promotions in various cities, the makers released the film in theatres today. Nani in the role of Jadal aka Sarakka did a good job and he gave his best to appear tough during the action episodes.
Positives :
1. Pre-Interval Sequence
2. Two Songs
Negatives :
1. Lack of Emotional Connection
2. Never-Ending Action Episodes
3. Poor Screenplay
4. Loud Background Score
5. Lengthy Runtime
6. Every Scene Feels Like a ‘Climax’
Overall, The Paradise is most likely to end up as a ‘missed opportunity’. And yes, yet another director in Tollywood failed to break the ‘failure of the second film’ syndrome.
Bottom Line – ‘Pretentious’ Paradise
Average
The Paradise movie Review
తమ గుర్తింపు కోసం ప్యారడైజ్‌లోని సవారీలు చేసిన తిరుగుబాటు, సవారీల నాయకుడు జడల్ చేసిన పోరాటం ప్రధానంగా సాగే మూవీ. ఇదొక ఫిక్షన్ స్టోరీ. కానీ కొన్ని రియల్ ఎలిమెంట్లని మేళవించడం విశేషం. కథగా ఇది చాలా డెప్త్ ఉన్న స్టోరీ. కానీ దాన్ని అంతే అర్థవంతంగా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఇంటర్వె...
తమ గుర్తింపు కోసం ప్యారడైజ్‌లోని సవారీలు చేసిన తిరుగుబాటు, సవారీల నాయకుడు జడల్ చేసిన పోరాటం ప్రధానంగా సాగే మూవీ. ఇదొక ఫిక్షన్ స్టోరీ. కానీ కొన్ని రియల్ ఎలిమెంట్లని మేళవించడం విశేషం. కథగా ఇది చాలా డెప్త్ ఉన్న స్టోరీ. కానీ దాన్ని అంతే అర్థవంతంగా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. అయితే కథ అక్కడితోనే మేజర్ గా పూర్తయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో మాలిక్‌తో జడల్ పోరాటం చూపించారు. అది యాక్షన్ కే పరిమితం చేశారు. ఆ తర్వాత కథ మరోలా టర్న్ తీసుకుంటుంది. క్లైమాక్స్ ముగింపు కూడా చప్పగా ఉంది.
జడల్ పాత్రలో నాని ఇరగదీశాడు. ఆయన మూవీకోసం ఎంతో కష్టపడ్డాడు. సినిమాలో నాని పాత్ర హైలైట్, అదే సమయంలో అదే మైనస్ కూడా. ఎందుకంటే కథ చాలా బలమైన యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. దానికి నాని సరిపోలేకపోతున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. తన స్థాయికి మించిన కథగా అనిపిస్తుంది. కథ పరంగా దర్శకుడు ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఇంకా బాగా తీయాల్సింది. క్లారిటీగా తీయాల్సింది. డైవర్షన్ లేకుండా చేయాల్సింది. కానీ రాజకీయాలను ఇన్‌వాల్వ్ చేసి కథ లక్ష్యమే మారిపోయింది. యాక్షన్ మీద పెట్టిన దృష్టి ఎమోషన్స్ మీద పెడితే సినిమా బాగుండేది. నానినికాదు, కేసీఆర్‌ని హీరోని చేసిన చిత్రమిది.
Average
The Paradise Movie Review
అతిగా చేసిన పనులు బెడిసికొట్టడమే కాదు... వారిపై నెగెటివ్ ఇంపాక్ట్ ను కూడా కలగ చేశాయి. తాజాగా విడుదలైన న్యాచురల్ స్టార్ నాని 'ప్యారడైజ్' విషయంలోనూ అదే జరిగింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా జనం ముందుకొచ్చిన ప్యారడైజ్ బిలో యావరేజ్ అన్న టాక్ తెచ్చుకుంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినా గుర్తింప...
అతిగా చేసిన పనులు బెడిసికొట్టడమే కాదు... వారిపై నెగెటివ్ ఇంపాక్ట్ ను కూడా కలగ చేశాయి. తాజాగా విడుదలైన న్యాచురల్ స్టార్ నాని 'ప్యారడైజ్' విషయంలోనూ అదే జరిగింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా జనం ముందుకొచ్చిన ప్యారడైజ్ బిలో యావరేజ్ అన్న టాక్ తెచ్చుకుంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినా గుర్తింపు నోచుకోలేని వాళ్ళ కథలు ఈ మధ్య కాలంలో మనం చాలానే చూశాం. నిజానికి 'పెద్ది' సినిమా బేసిక్ పాయింట్ కూడా అదే. అయితే అదే అంశాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో కోణంలో చెప్పాడు.
అస్తిత్వ పోరాట గాథలలో ఎమోషన్ ప్రధానం. అది ఏ మాత్రం అటూ ఇటూ అయినా... హాస్యాస్పదంగా మారిపోతుంది. ఈ కథ చెప్పడానికి ఇంత దారుణ మారణకాండ అవసరమా? అనిపిస్తుంది. సినిమా రంగంలో మరో మెట్టు పైకి వెళ్ళాలనే ఎవరైనా అనుకుంటారు. కానీ మాస్ హీరో ఇమేజ్ కోసం పడే తాపత్రయంలో నాని ఎంచుకునే కథలే అందరినీ ఒప్పించలేకపోతున్నాయి. ఈ సినిమాలో జడల్ పాత్రకు అతను సంపూర్ణ న్యాయం చేశాడు. కానీ ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. నిజానికి ఈ సినిమాకు 'ది ప్యారడైజ్' అని కాకుండా 'సమ్మక్క' అని పెట్టి ఉంటే సబబుగా ఉండేది. ఇంత హైప్ క్రియేట్ కాకపోను! ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన జనాలు... ఏదో భిన్నమైన సినిమా చూశాం అని కొంతలో కొంత తృప్తి పడి ఉండేవారేమో! ఒకటి మాత్రం నిజం... ఈ సినిమాలోని పొలిటికల్ అంశాల కారణం, సెన్సార్ నిర్లిప్తత కారణంగా రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో రచ్చ జరగడం ఖాయం.
Average
The Paradise Movie Review
క్రూరుడైన విలన్, నలిగిపోయే ప్రజా సమూహం, వారి రక్షణ కోసం తిరగబడే కథానాయకుడు... "ది ప్యారడైజ్" (The Paradise) కథాంశం పాతదే అయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దానిని ఆవిష్కరించిన తీరు super. విలనిజం, హీరోయిజం సమపాళ్లలో మేళవించి తెరపై ఊరమాస్ విధ్వంసం సృష్టించారు.కథానాయకుడి తెలంగాణ యాస కొంత తడబడినట్లు అనిపిం...
క్రూరుడైన విలన్, నలిగిపోయే ప్రజా సమూహం, వారి రక్షణ కోసం తిరగబడే కథానాయకుడు... "ది ప్యారడైజ్" (The Paradise) కథాంశం పాతదే అయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దానిని ఆవిష్కరించిన తీరు super. విలనిజం, హీరోయిజం సమపాళ్లలో మేళవించి తెరపై ఊరమాస్ విధ్వంసం సృష్టించారు.
కథానాయకుడి తెలంగాణ యాస కొంత తడబడినట్లు అనిపించినా, అంతగా ప్రభావం చూపకపోయినా... ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అల్టిమేట్! థియేటర్లలో సీట్ల అంచున కూర్చోబెడుతుంది. సెకండాఫ్ కాస్త మందగించినా, అనిరుధ్ అందించిన విశ్వరూప బిజిఎమ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
overall కథలో కొత్తదనం లేకపోయినా, ఊపిరిసలపని రా యాక్షన్ ఎలివేషన్స్‌తో మాస్ ఆడియన్స్, నాని అభిమానులకు ఈ చిత్రం I feast. ఫైనల్ గా ది ప్యారడైజ్ బిర్యానీ బాగుంది.. కానీ ఎదో మిస్సయింది.
Average
The Paradise Movie Review
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాసుకొన్న కథను సింగిల్ పాయింట్‌గా చూస్తే ఫుల్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను కథగా విస్తరించి సన్నివేశాలు మలచే క్రమంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. కానీ తాను చెప్పాలనుకొన్న కథను పర్‌ఫెక్ట్ ఫ్లోలో చెప్పలేకపోయాడనే విషయం సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేపటికే అర్ధమవుతుంది...
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాసుకొన్న కథను సింగిల్ పాయింట్‌గా చూస్తే ఫుల్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను కథగా విస్తరించి సన్నివేశాలు మలచే క్రమంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. కానీ తాను చెప్పాలనుకొన్న కథను పర్‌ఫెక్ట్ ఫ్లోలో చెప్పలేకపోయాడనే విషయం సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేపటికే అర్ధమవుతుంది. అలా కథ నడిచిన కొద్ది ట్రాక్ మిస్ అవుతున్నాడనే విషయంపై ఫుల్‌గా క్లారిటీ వస్తుంది. సుబ్బలక్ష్మీగా కాయదు లోహర్ ఎంట్రీతో సినిమా చిన్న కుదుకులోనవ్వడమే కాకుండా అప్పటి వరకు ఉన్న మంచి ఎమోషన్స్ డైల్యూట్ చేసేలా చేస్తుంది.
ఇక ప్యారడైజ్ సినిమా ఫస్టాఫ్‌లోనే కథ ముగిసినంత పని చేశాడనే ఫీలింగ్ శ్రీకాంత్ ఓదెల కల్పించాడు. కానీ సెకండ్ హాఫ్ లో కథలో బలంగా చెప్పడానికి కంటెంట్ లేకపోవడంతో కాసేపు టైంపాస్ చేశాడా? అనే విధంగా కొన్ని సీన్లను సాదాసీదాగా నడిపించాడు. ఓవరాల్ గా మళ్లీ అదే నరుకుడు, హింస, రక్తపాతాన్ని కొనసాగించి.. కథను ఎమోషన్స్ తో చెప్పే ఛాన్స్ ను మిస్ చేసుకొన్నాడు. ఓవరాల్ గా నాని పెర్ఫార్మెన్స్, కాయదు గ్లామర్, మోహన్ బాబు యాక్టింగ్ సంతృప్తిని కలిగిస్తాయి. ఎక్కువ అంచనాలతో కాకుండా వెళితే.. ఫీల్‌గుడ్ మూవీని చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
Average
The Paradise Movie Review
దసరా సినిమాతో సంచలనం రేపిన నేచురల్ స్టార్ నాని.. శ్రీకాంత్ ఓదెల కలిసి చేసిన 'ది ప్యారడైజ్' ఆరంభం నుంచే మాంచి హైప్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తమకంటూ ఏ గుర్తింపు లేని ఒక జాతి.. ఆ గుర్తింపు కోసం చేసే పోరాటం.. ఆ క్రమంలో ఎదిగే ఒక...
దసరా సినిమాతో సంచలనం రేపిన నేచురల్ స్టార్ నాని.. శ్రీకాంత్ ఓదెల కలిసి చేసిన 'ది ప్యారడైజ్' ఆరంభం నుంచే మాంచి హైప్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తమకంటూ ఏ గుర్తింపు లేని ఒక జాతి.. ఆ గుర్తింపు కోసం చేసే పోరాటం.. ఆ క్రమంలో ఎదిగే ఒక నాయకుడు.. ఇలా ఫెమిలియర్ లైన్లోనే నడిచే ‘ది ప్యారడైజ్’ కథను డిఫరెంట్ స్టైల్లో చెప్పాలని చూశాడు శ్రీకాంత్. ఇందుకోసం అతను ఎంచుకున్న స్టైల్.. వయొలెన్స్. కానీ ఆ వయొలెన్స్ మరీ శ్రుతిమించిపోవడం.. కథలోని ఎమోషన్ అనుకున్నంతగా పండకపోవడం.. హీరో-విలన్ రెండు పాత్రలూ అనుకున్నంతగా క్లిక్ కాకపోవడంతో ‘ది ప్యారడైజ్’ అంచనాలను అందుకోలేకపోయింది. విడివిడిగా కొన్ని ఎపిసోడ్లు బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా ఈ సినిమా నిరాశపరుస్తుంది.
సన్నివేశాల టేకింగ్ అదిరిపోయినప్పటికీ వయొలెన్స్ వెనుక ఎమోషన్ మిస్ అవ్వడంతో సన్నివేశాలు అతిగా అనిపిస్తాయి. తన కథను కొంచెం పచ్చిగా చూపించాలనే దర్శకుడి ప్రయత్నాన్ని తప్పుబట్టలేం కానీ.. ఆ క్రమంలో మరీ హద్దులు దాటిపోవడంతో కొన్ని సన్నివేశాలను తట్టుకోవడం కష్టమవుతుంది. ఓవరాల్ గా ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాత.. ఎంతైనా కష్టపడే హీరో.. ఇంకా కోరుకున్న అన్ని వనరులు సమకూరినా.. రైటర్ - డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఉపయోగించుకోలేక పోయాడు. ఎన్నోసార్లు చూసిన కథకే మేకప్ వెయ్యాలని.. టేకింగ్ తో మ్యాజిక్ చెయ్యాలని చూశాడు కానీ ఆశించిన ఫలితం రాలేదు. కొన్ని ఎపిసోడ్ల వరకు ఓకే అనిపించినా ఓవరాల్ గా శ్రీకాంత్ తనపై నెలకొన్న భారీ అంచనాలను అందుకోలేకపోయాడు. చివరగా ప్యారడైజ్.. మాస్ ఓవర్ డోస్
Above Average
The Paradise movie Review
నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా గురించి చెప్పుకుంటే... కథ కొత్తదేమీ కాదు. ఇది వరకు ఎన్నో చిత్రాల్లో చూసే ఉంటాం. అందరినీ గుప్పిట్లో పెట్టుకునే ఓ క్రూరుడు.. వాడి కింద నలిగే ఓ సమూహం.. అందులోంచి పుట్టుకొచ్చే నాయకుడు.. చివరకు ఆ నాయకుడు ఆ సమూహానికి స్వాతంత్ర్యం ఇప్పించడం.. ఓవరాల్‌గా చెప్పుకుంటే ప్యారడైజ్...
నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా గురించి చెప్పుకుంటే... కథ కొత్తదేమీ కాదు. ఇది వరకు ఎన్నో చిత్రాల్లో చూసే ఉంటాం. అందరినీ గుప్పిట్లో పెట్టుకునే ఓ క్రూరుడు.. వాడి కింద నలిగే ఓ సమూహం.. అందులోంచి పుట్టుకొచ్చే నాయకుడు.. చివరకు ఆ నాయకుడు ఆ సమూహానికి స్వాతంత్ర్యం ఇప్పించడం.. ఓవరాల్‌గా చెప్పుకుంటే ప్యారడైజ్ కథ ఇదే. సినిమాలో మెయిన్ గా విలనిజం, హీరోయిజంకి సంబంధించిన సీన్లను అద్భుతంగా రాసుకుని, తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అదే ఈ సినిమాకి ప్రధానంగా కలిసి వచ్చే అంశం. ఇక ఇందులో శ్రీకాంత్ తన మెగా అభిమానాన్ని చాలా సీన్లలో చూపించాడు.
అయితే తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమానే అయినా.. హీరో మాట్లాడే తీరు మాత్రం తెలంగాణ యాసలా అనిపించదు. ఇంటర్వెల్ ఫైట్ అయితే నెక్ట్స్ లెవెల్ అనిపిస్తుంది. ఇక శేఖరన్న పాత్రలో ప్రియదర్శి పాత్ర ఎంట్రీ, సవారీలను టెర్రరిస్టులుగా ముద్ర వేయడం ఇవన్నీ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వవు. అయితే ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్, అనిరుధ్ ఇచ్చే బీజీఎం హైలెట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై సెకండాఫ్ ఇవ్వలేకపోయినా.. ఓవరాల్ గా ప్యారడైజ్ సినిమా ఆడియెన్స్‌కి ఓ హై ఇస్తుంది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌కి, నాని ఫ్యాన్స్‌కి అయితే ఓ ట్రీట్‌లా ఉంటుంది. ఇక సింగిల్ స్క్రీన్లలో పాటలకు, ఫైట్లకు ఆడియెన్స్‌కి ఊగిపోతారు. మరి కమర్షియల్‌గా ‘ప్యారడైజ్’ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
Above Average
The Paradise Movie Review
న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన సినిమా ‘ది ప్యారడైజ్’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఎప్పటిలాగే, నాని అద్భుతంగా నటించాడు. మోహన్ బాబు మాలిక్ పాత్రలో జీవించాడు. 1980-90 నేపథ్యంలో ఈ మూవీ సాగినా.. కమర్షియల్ మూవీకి అనుగుణంగ...
న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన సినిమా ‘ది ప్యారడైజ్’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఎప్పటిలాగే, నాని అద్భుతంగా నటించాడు. మోహన్ బాబు మాలిక్ పాత్రలో జీవించాడు. 1980-90 నేపథ్యంలో ఈ మూవీ సాగినా.. కమర్షియల్ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్‌తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘ది ప్యారడైజ్’ రొటీన్ గా సాగుతూ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.
హీరో – విలన్ ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. పలు సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో శ్రీకాంత్ కొన్ని చోట్ల విఫలం అయ్యారు. ఓవరాల్ గా ‘ది ప్యారడైజ్’ అంటూ హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో.. నాని నటన, వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ హెవీ ఎమోషన్స్ బాగున్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికితోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ ను మరియు నాని అభిమానులను మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.
Public Reviews
8 Avg: 4.8/10Not Good
The Paradise movie review
just now finished The paradise movie first show... The Paradise delivers a mixed bag that ultimately fails to hold up. While the film kicks off with a strong hero entry and a genuinely touching mother-son sentiment in the first half, it quickly loses momentum.The core conflict and hero-villain confr...
just now finished The paradise movie first show... The Paradise delivers a mixed bag that ultimately fails to hold up. While the film kicks off with a strong hero entry and a genuinely touching mother-son sentiment in the first half, it quickly loses momentum.
The core conflict and hero-villain confrontations lack the required punch and intensity.
The heavy climax fails to leave an impact, leaving the narrative flat.
Nani’s sheer hard work and Anirudh’s thumping BGM are the only saving graces.
Go in with low expectations, or prepare to walk out disappointed!
Not Good
The Paradise movie review
ఇప్పుడే థియేటర్ నుండి రావడం జరిగింది. మూడు ముక్కల్లో చెప్పాలంటే... ఫస్ట్ హాఫ్ ok, సెకండ్ హాఫ్ worset, ఓవరాల్ గా not ok!simply movie ఇంట్రో అదిరింది, ఫస్ట్ హాఫ్‌లో మదర్-సన్ సెంటిమెంట్ బాగుంది. కానీ విలనిజం, కన్ఫ్రంటెషన్ సీన్లలో అసలు కిక్ లేదు. మోహన్ బాబు గారిని వాడుకోలేదు. హెవీ క్లైమాక్స్ వస్తున్నా...
ఇప్పుడే థియేటర్ నుండి రావడం జరిగింది. మూడు ముక్కల్లో చెప్పాలంటే... ఫస్ట్ హాఫ్ ok, సెకండ్ హాఫ్ worset, ఓవరాల్ గా not ok!
simply movie ఇంట్రో అదిరింది, ఫస్ట్ హాఫ్‌లో మదర్-సన్ సెంటిమెంట్ బాగుంది.
కానీ విలనిజం, కన్ఫ్రంటెషన్ సీన్లలో అసలు కిక్ లేదు. మోహన్ బాబు గారిని వాడుకోలేదు.
హెవీ క్లైమాక్స్ వస్తున్నా ఎలాంటి ఇంపాక్ట్ కలగలేదు.
overall నాని యాక్టింగ్, హార్డ్ వర్క్, అనిరుధ్ BGM ప్లస్ పాయింట్స్ ! ఎక్స్‌పెక్టేషన్స్ బాగా తగ్గించుకుని వెళ్తేనే ఓకే... లేదంటే torture..
Hit
The Paradise movie review
just ippude The Paradise matinee show chusi vacha! Overall ga cheppalante.. Neither a complete masterpiece nor a total disaster. It’s a Decent One-Time Watch!Srikanth Odela create chesina world, period setup & 80s aesthetics chala organic ga unnay. Interval bang aithe purely theater-worthy! Anir...
just ippude The Paradise matinee show chusi vacha! Overall ga cheppalante.. Neither a complete masterpiece nor a total disaster. It’s a Decent One-Time Watch!
Srikanth Odela create chesina world, period setup & 80s aesthetics chala organic ga unnay. Interval bang aithe purely theater-worthy! Anirudh’s background score theatrical experience ki pedda asset.
Transformation lo, screen presence & physical effort lo Nani anna 100% ichadu.
overall Extreme expectations lekunda, purely technical visuals & grand action set pieces kosam velthe definitely enjoy chestharu. Friends tho weekend ki oka solid single-screen watch!
Average
The Paradise movie review
ippude The paradise movie chusi bayataki vacha bro... honest ga cheppalante Full Lag & Overdose Drama!Anirudh BGM & Interval Fight lo konni elevation scenes thappa, cinema lo content peddaga em ledhu. intha brutal violence asalu avasarama anipisthundi. Srikanth Odela elevations meedha pettin...
ippude The paradise movie chusi bayataki vacha bro... honest ga cheppalante Full Lag & Overdose Drama!
Anirudh BGM & Interval Fight lo konni elevation scenes thappa, cinema lo content peddaga em ledhu. intha brutal violence asalu avasarama anipisthundi. Srikanth Odela elevations meedha pettina focus... Story & Logic meedha petti unte baagundedhi.
Nani anna acting super.. but mana telangana slang athaniki set avvaledhu ani clear ga thelusthundi. Mother sentiment & emotional scenes decent.. but antha connect avvaledhu. konni memes metirial sence unnayi. final ga movie gurinchi cheppalante.. Pocket money bokka bhayya
Average
The Paradise movie Review
ఇప్పుడే థియేటర్ నుండి బయటకి వస్తూ చెప్తున్నా... "ది ప్యారడైజ్" (The Paradise) పక్కా హై-డోస్ ఊరమాస్ ఎంటర్‌టైనర్! శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో యాక్షన్ ఎలివేషన్స్, గూస్‌బంప్స్ ఇచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్, అమ్మోరు ఆవాహించినట్టు వచ్చే ఫైట్ సీక్వెన్స్ థియేటర్లలో విజిల్స్ వేయించాయి! అనిరుధ్ BGM అయితే నెక్స్ట్ ల...
ఇప్పుడే థియేటర్ నుండి బయటకి వస్తూ చెప్తున్నా... "ది ప్యారడైజ్" (The Paradise) పక్కా హై-డోస్ ఊరమాస్ ఎంటర్‌టైనర్! శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో యాక్షన్ ఎలివేషన్స్, గూస్‌బంప్స్ ఇచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్, అమ్మోరు ఆవాహించినట్టు వచ్చే ఫైట్ సీక్వెన్స్ థియేటర్లలో విజిల్స్ వేయించాయి! అనిరుధ్ BGM అయితే నెక్స్ట్ లెవెల్ రాంపేజ్!
మోహన్ బాబు స్ట్రాంగ్ రోల్, KCR-NTR రిఫరెన్స్ బ్లాక్స్ బాగున్నా... సెకండాఫ్‌లో కనెక్టివిటీ మిస్ అయ్యి ముగింపు కాస్త తేలిపోయింది. లాజిక్స్ పక్కనబెట్టి, ఎమోషన్స్ వర్కవుట్ అవ్వకపోవడంతో 'నాని' లెవెల్ పొటెన్షియల్ కంటే మాస్ డోస్ ఎక్కువైందనిపిస్తుంది.
overall కథ, ఎమోషన్స్ పక్కన పెడితే... మాస్ లవర్స్ కి, manchi treat.
Below Average
The Paradise Movie Review
Overhype ఇస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది! Massive expectations తో వచ్చిన 'The Paradise',below avarage డ్రామాగా మిగిలిపోయింది.అణచివేత, independence కోసం fight చేసే కాన్సెప్ట్ ఓకే కానీ... కథలో ఎమోషన్ కన్నా voilence, blood shade ఎక్కువైపోయి కాస్త over ga అనిపిస్తుంది. నాని తన మాస్ ఇమేజ్ కోసం పడ్డ Hard Work...
Overhype ఇస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది! Massive expectations తో వచ్చిన 'The Paradise',below avarage డ్రామాగా మిగిలిపోయింది.
అణచివేత, independence కోసం fight చేసే కాన్సెప్ట్ ఓకే కానీ... కథలో ఎమోషన్ కన్నా voilence, blood shade ఎక్కువైపోయి కాస్త over ga అనిపిస్తుంది. నాని తన మాస్ ఇమేజ్ కోసం పడ్డ Hard Work & Performance వేరే లెవెల్... కానీ ఆ శ్రమంతా waste.
Director శ్రీకాంత్ ఓదెల ఎలివేషన్స్ మీద పెట్టిన focus... Core Content & Logic మీద పెట్టి ఉంటే సీన్ వేరేలా ఉండేది. పక్కా సోషల్ మీడియా రచ్చకి, పొలిటికల్ Discoussion కి అయితే full stuff ఉంది కానీ... Normal Movie lovers కి ఈ సీరియస్‌నెస్ ఎక్కడం కష్టమే!
finally Just a One-Time Watch for Nani's performance!
Average
The Paradise Movie Review
The Paradise takes a classic, time-tested storyline a ruthless villain, an oppressed community, and a savior rising for freedom - and transforms it into a raw, adrenaline - fueled theatrical spectacle. Director Srikanth Odela delivers high - voltage heroism and a truly "next-level" interval fight se...
The Paradise takes a classic, time-tested storyline a ruthless villain, an oppressed community, and a savior rising for freedom - and transforms it into a raw, adrenaline - fueled theatrical spectacle. Director Srikanth Odela delivers high - voltage heroism and a truly "next-level" interval fight sequence that will have single screens roaring.
While Nani's dialect feels a bit off at times and subplots like Priyadarshi’s entry miss the emotional mark, the film’s sheer energy easily overshadows its predictable plot. Backed by Anirudh’s thumping BGM and non-stop mass elevations, the second half may slow down slightly, but the overall experience is a whistle-worthy treat for Nani fans and mass movie lovers!
Above Average
The Paradise movie review
teaser చూసినప్పుడే డిసైడ్ అయ్యా ఫస్ట్ డేనే వెళ్లాలని... ఇప్పుడే షో ఫినిష్ అయింది. and నాని 'ది ప్యారడైజ్' కథ కొత్తదేమీ కాదు. అణచివేతకు గురైన సమూహం నుండి ఒక నాయకుడు పుట్టుకురావడం అనే కాన్సెప్ట్ ను గతంలో ఎన్నో సినిమాల్లో చూశాం. కానీ, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రాసుకున్న హీరో-విలన్ ఎలివేషన్స్ మాత్రం నెక...
teaser చూసినప్పుడే డిసైడ్ అయ్యా ఫస్ట్ డేనే వెళ్లాలని... ఇప్పుడే షో ఫినిష్ అయింది. and నాని 'ది ప్యారడైజ్' కథ కొత్తదేమీ కాదు. అణచివేతకు గురైన సమూహం నుండి ఒక నాయకుడు పుట్టుకురావడం అనే కాన్సెప్ట్ ను గతంలో ఎన్నో సినిమాల్లో చూశాం. కానీ, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రాసుకున్న హీరో-విలన్ ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్! మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ ఫైట్ సీన్, అనిరుధ్ ఇచ్చే ఊరమాస్ బిజిఎమ్ థియేటర్లలో రచ్చ లేపాయి.
but హీరో తెలంగాణ యాస సరిగ్గా కుదరకపోవడం చిన్న మైనస్. సెకండాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై ఇవ్వలేకపోయింది. ఎమోషన్స్, రా యాక్షన్ సీన్స్ సినిమాకి బలంగా నిలిచాయి. ఓవరాల్ గా రొటీన్ కథే అయినప్పటికీ, శ్రీకాంత్ ఎగ్జిక్యూషన్ వల్ల సింగిల్ స్క్రీన్లలో మాస్ ఆడియెన్స్‌కి, నాని ఫ్యాన్స్‌కి ఇది ఒక పూనకాలు తెప్పించే movie.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... 1980స్ బ్యాక్ డ్రాప్ లో ప్యారడైజ్ నేపథ్యంలో కథ నడుస్తుంది. ప్యారడైజ్ కి వలస వచ్చిన సవారీ జాతి ప్రజలు షికాంజ మాలిక్ (మోహన్ బాబు) గుప్పిట్లో కొట్టు మిట్టాడుతుంటారు. అయితే తమ సవారీ జాతి హక్కుల కోసం, భారత గుర్తింపు కోసం ఆ జాతి ఆడబిడ్డ సమ్మక్క (సోనాలీ కులకర్ణి) తమ వాళ్లందరితో కలిసి పోరాడుతూ ఉంటుంది. కానీ మాలిక్ పవర్ ముందు వాళ్ళంతా ఏం చేయలేకపోతారు. పైగా సమ్మక్క తప్పుడు మనిషి అని షికాంజ మాలిక్ ఆమె కొడుకు జడల్ (నాని) చేతిపై పచ్చబొట్టు వేయిస్తాడు. అయితే తన తల్లి చెడ్డది అన్న కోపంతో చిన్నతనం నుంచి జడల్ ద్వేషిస్తూ, మాలిక్ మనిషిని చంపి జడల్ జైలుకి వెళ్తాడు. ఇటు షికాంజ మాలిక్ తన సామ్రాజ్యాన్ని తన కొడుకు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయాల్) కి అప్పగిస్తాడు. అయితే షికాంజ మాలిక్ ఆగడాలు మితిమీరిన టైం లో జడల్ జైలు నుండి వచ్చి, సవారీలకు అండగా ఒక నాయకుడిగా, విక్రమ్ మాలిక్ - షికాంజ మాలిక్ వ్యవస్థకి ఎదురెళ్తాడు. మరి జడల్ లో ఈ మార్పు ఎలా వచ్చింది. తల్లి సమ్మక్కని ఎందుకు అంత ద్వేషించాడు? చివరకు సవారీల జాతికి గుర్తింపు వచ్చిందా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
ప్యారడైజ్ కథ విన్నాక... ఇలాంటి స్టోరీస్ నేపథ్యంలో చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ ఎన్ని వచ్చినా, హీరో కింది నుండి పైకొస్తాడు. అందుకే ఈ కథలకి డిమాండ్ తగ్గదు. 80స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్యారడైజ్ స్టోరీ కూడా అలాంటిదే. అణగారిన వర్గం నుండి వచ్చిన హీరో, విలన్ చేసే ఆగడాలకు అడ్డుకట్ట ఎలా వేసాడన్నది.. సినిమాటిక్ గా బాగా చూపించాడు దర్శకుడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథ పరంగా నార్మల్ స్టోరీ పాయింటే తీసుకున్నా, తెలంగాణ నేపథ్యం తీసుకోవడం ఫ్రెష్ గా ఉంది. దానికి తగ్గ స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకున్నాడు. ఇక జడల్ గా నాని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. వన్ మ్యాన్ షో తో అదరగొట్టాడు. డిఫరెంట్ వేరియషన్స్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. అలాగే మూవీలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి.
ఇక మోహన్ బాబు మాలిక్ పాత్రలో జీవించాడు. సినిమాకి సరైన ప్రతినాయకుడుంటేనే హీరో పాత్ర కూడా బాగా ఎలివేట్ అవుతుంది. జడల్ కి ధీటుగా మాలిక్ రోల్ ఆశ్చర్యపరుస్తుంది. ఇక హీరోయిన్ గా కయదు లోహర్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. కొన్ని యాక్టింగ్ కి స్కోప్ ఉన్న సీన్స్ కూడా బాగున్నాయి. అలాగే జడల్ తల్లి పాత్రలో నటించిన సోనాలి కులకర్ణి బాగా నటించింది. ఆమె స్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ప్లస్ పాయింట్. ఇక కీ రోల్స్ లో నటించిన బరగి విక్రమ్ రెడ్డి, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్, ప్రియదర్శి వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా ఆకట్టుకున్నారు. అండ్ ఎమోషనల్ సీన్స్, అందులోనే డెప్త్ కూడా బాగా రాసుకున్నాడు దర్శకుడు.
Minus Points :
అయితే సినిమాకి మంచి స్టోరీ లైన్ రాసుకుని, స్క్రీన్ ప్లే కూడా పేపర్ మీద బాగా రాసుకుని, తెరపై మాత్రం పూర్తిగా ఎంటర్టైన్ అయ్యేలా చేయలేకపోయాడు దర్శకుడు. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమానే అయినా.. హీరో మాట్లాడే తీరు తెలంగాణ యాసలా న్యాచురల్ గా అనిపించదు. ఇతర పాత్రల తీరు అంతే.. బహుశా డబ్బింగ్ వర్క్ పై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. పైగా మూవీని చాప్టర్ ల వైస్ గా విడగొట్టి స్టోరీ చెప్పడం అంత ఇంప్రెసివ్ గా లేదు. అలాగే హీరోయిన్ ట్రాక్ కాస్త కథకి డీవియేషన్ లా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఓ రేంజ్ లో ఉండి కథ పరుగులు పెడుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో అదే రేంజ్ లో నెమ్మదిస్తుంది.
ఇక కథలో బరువైన ఎమోషన్స్ ఉన్నా, సినిమా మాత్రం, భారీ యాక్షన్ విజువల్స్ తో రొటీన్ గా సాగుతూ ఆకట్టుకోలేదు. హీరో – విలన్ ల మధ్య సీన్స్ ఇంకా బాగా రాసుకోవాల్సింది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ ని అద్భుతంగా రాసుకున్న డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని గాలికొదిలేశారు. ఓవరాల్ గా మంచి కథకు, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే రాసుకోలేదు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ సాగదీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన సీన్స్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండవు. అయితే సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని క్యామియోస్ థ్రిల్ చేస్తాయి.
Technical Values :
ఇక టెక్నికల్ వాల్యూస్ గురించి చూస్తే.. మంచి స్టోరీ రాసుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని సరిగా చూపించలేదు. కానీ డైరెక్టర్ గా మెప్పించాడు. మేకింగ్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇక సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సాంగ్స్ అదిరిపోయాయి. అలాగే బీజీఎమ్ హైలెట్ అయి చాలా సీన్స్ ని లేపింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ లోని కొన్ని బోరింగ్ సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది.
Final Review :
ఓవరాల్ గా "ది ప్యారడైజ్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో నాని వన్ మ్యాన్ షో తో మెప్పించాడు. అలాగే హై వోల్టేజ్ వైల్డ్ యాక్షన్ సీన్స్ ఇంప్రెసివ్ గా అనిపించాయి. కానీ సినిమాలో బలమైన ఎమోషన్ ఉన్నప్పటికీ వాటిని ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడం వల్ల మూవీ రొటీన్ రెగ్యులర్ డ్రామా అనే ఫీల్ వస్తుంది. దీనికి తోడు సెకండ్ హాఫ్ లో ట్రాక్ పూర్తిగా మిస్ ఫైర్ అయింది. ఫైనల్ గా నాని ఫ్యాన్స్ ని, అలాగే రెగ్యులర్ యాక్షన్ మూవీ లవర్స్ చూసేలానే ఉంది. కానీ కామన్ ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.