కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan)
Comrade Kalyan : లాల్ సలాం అంటున్న శ్రీవిష్ణు.. త్వరలోనే కామ్రేడ్ 'కళ్యాణ్' గా మన ముందుకు..
Available in:
About This Movie
టాలీవుడ్ లో టాలెంటెడ్ యంగ్ హీరోస్ లో ఒకరైన శ్రీవిష్ణు ఫుల్ జోష్ లో ఉన్నాడు. కంటెంట్ బేస్డ్ మూవీస్ తో ప్రేక్షకులని అలరిస్తున్న ఈ హీరో చివరిగా విష్ణు విన్యాసం మూవీతో సక్సెస్ అందుకుని ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. శ్రీ విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ "కామ్రేడ్ కళ్యాణ్". జానకి రామ్ మారెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో కామెడీ కం యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
టీజర్ ని గమనిస్తే... నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నప్పటికీ ఈ సినిమాని పక్కా కామెడీ ఎంటర్టైనర్ లాగానే తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. టాలీవుడ్ పైకి నవ్వుల విప్లవంతో "కామ్రేడ్ కళ్యాణ్" గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీవిష్ణు. ఇక టీజర్ లో "నక్సలైట్ అంటే ఏంటి.. నక్సల్ చేతిలో లైటు.. కమ్యూనిజం అంటే ఏంటీ.. కమ్యూనిస్టులు చెప్పే నిజం".. అందులో ఉన్న వేగుచుక్కలను, చీమల దండును ఊరు తండాలో చూసుకుందాం.. సాయి బుకింగ్స్ ఓపెన్ చేయి రా..?" అంటూ శ్రీ విష్ణు తన స్టైల్ అఫ్ మ్యానరిజంతో చెప్పే డైలాగ్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసాయి.
ఇక ఈ మూవీ 90స్ పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతుండగా, ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మాడుగుల నేపథ్యంతో తెరకెక్కుతుంది. మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్య, ముక్కు అవినాష్, రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే కీ రోల్స్ లో నటిస్తున్నారు. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా అక్టోబర్ 9న కామ్రేడ్ కళ్యాణ్ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ప్రేక్షకులని ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.