తెల్ల కాగితం (Thellakaagitham)
Thellakaagitham : తెల్ల కాగితం లాంటి జీవితం... మరో టీనేజ్ లవ్ స్టోరీ.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Available in:
About This Movie
కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ (Harsh Roshan), నక్షత్ర జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "తెల్ల కాగితం" (Thellakaagitham). అజయ్, దీపక్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. టీనేజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ తెల్ల కాగితం ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ ఆకట్టుకుంటుంది.
ఇక ట్రైలర్ ని గమనిస్తే... స్కూల్ డేస్ నుండే ఇందులో హీరో హీరోయిన్లు లవ్ చేసుకుంటున్నట్టు చూపించడం జరిగింది. ఆ తర్వాత కాలేజ్ లైఫ్... అక్కడ మాములుగా జరిగే సరదా సన్నివేశాలు, గొడవలు, అపార్ధాలు ఈ సీన్స్ తోనే ట్రైలర్ మొత్తం చూపించేయగా, ట్రైలర్ లో ఎక్కువగా విలేజ్ నేటివిటీని చూపించడం బాగా ఆకట్టుకుంటుంది. అలాగే ట్రైలర్ లో విజయ్ బుల్గానిన్ ఇచ్చిన బీజీఎమ్ స్కోర్ సినిమాని ఎలివేట్ చేసేలా ఉంది. సాంగ్స్ గనుక బాగుంటే సినిమాకి మంచి ప్లస్ అవుతుంది.
ఇక గతంలోనూ ఇలాంటి సినిమాలు బాగానే వచ్చాయి కానీ, రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సార్లు వచ్చినా ఫ్రెష్ గానే అనిపిస్తాయి. ఇక ఈ సినిమా ఆడియన్స్ ని ఎంత వరకు ఆకట్టుకునేలా తీశారో దర్శకత్వ ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఈ తెల్ల కాగితం సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.