Register as a Reviewer
డోరతి (Dorothy)

డోరతి (Dorothy)

02 Oct 2026
Overall Rating
4.9/10
10 Reviews

కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "డోరతి". కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా, సనంత్, రిషికాంత్ కీ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందించగా, ఆల్రెడీ తమిళ్ లో హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Karthik Subbaraj
Cast: Keerthy Suresh, Sananth and Rishikanth and others

Available in:

Reviews

What critics and the public are saying about డోరతి (Dorothy)

Media Reviews

8 Avg: 5.0/10
Thyview
Thyview Youtube Channel
7

Hit

Dorothy movie review

డొరతి సినిమా చూసాక మూవీ గురించి చెప్పాలంటే... నాకు చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ ఇండియాలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ లో ఇదొకటి. అప్పట్లో లారెన్స్ కాంచనా మూవీలో చూశా ట్రాన్స్ పీపుల్ స్టోరీని మంచిగా చూపెట్టడం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ మూవీలో కార్తీక్ సుబ్బరాజు దానికన్నా బెటర్ గా చూపెట్టారు. అండ్ ట్...

డొరతి సినిమా చూసాక మూవీ గురించి చెప్పాలంటే... నాకు చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ ఇండియాలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ లో ఇదొకటి. అప్పట్లో లారెన్స్ కాంచనా మూవీలో చూశా ట్రాన్స్ పీపుల్ స్టోరీని మంచిగా చూపెట్టడం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ మూవీలో కార్తీక్ సుబ్బరాజు దానికన్నా బెటర్ గా చూపెట్టారు. అండ్ ట్రాన్స్ పీపుల్ స్టోరీ అంటే చాలా సీరియస్ ఉంటదేమో మూవీ అని అనుకున్నా, కానీ సర్ప్రైజ్ ఏందీ దానికి కంప్లీట్ ఆపోజిట్. దిస్ ఇస్ ఏ వెరీ ఫన్నీ మూవీ. చాలా అంటే చాలా కామెడీ ఉంటది. ఇన్ఫాక్ట్ అంత కామెడీ ఉండడమే ప్లస్ అయింది ఈ సినిమాకి. ఇక సినిమాలో వాళ్ళ సిచువేషన్ లో మనం ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ వచ్చేలా చేయడం కష్టం. కానీ అది కార్తీక్ సుబ్బరాజు సక్సెస్ఫుల్ గా చేస్తారు ఈ మూవీలో. 


ఈ మూవీలో క్యారెక్టర్స్ అందరూ ఒక హైలీ మాస్కులర్ అండ్ పేట్రియార్కల్ సొసైటీలో ఉంటారు. అందుకే చాలా రూరల్ ఏరియాలో ఉంటది సెటప్ అంతా. ఇక్కడ ప్రేమకన్నా పరువే ముఖ్యం అంటారు. అది ప్లస్ అయింది అనిపించింది. మొత్తం ఆ క్యారెక్టర్ ఫీల్ అయ్యేది అంతా మనం ఫీల్ అవుతాం. కెమెరా మొత్తం సెకండ్ హాఫ్ లో కూడా ఇలాంటి కొన్ని సర్ప్రైజింగ్ డిసిషన్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ సర్ప్రైజింగ్ అంటే అది క్లైమాక్సే. మూవీకి పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. కొన్ని కొన్ని థీమ్స్ అయితే థియేటర్ బయటికి వచ్చాక కూడా మనల్ని హాంట్ చేస్తాయి. అండ్ ఇళయరాజా ఈ ఏజ్ లో కూడా ఇంత క్యాజువల్ గా మాస్టర్ పీస్ ఆల్బం డెలివరీ చేసేసారు. ఓవరాల్ గా మస్ట్ వాచబుల్.

Oct 03, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
3

Not Good

Dorothy movie review

డోరోతీ సినిమా గురించి చెప్పాలంటే రకరకాలుగా ఉందబ్బా. ఇప్పుడు ఈ సినిమాని చూసే విధానాన్ని బట్టి సినిమా తాలూకా అభిప్రాయం అనేది పూర్తిగా మారిపోతుంది. ఒక బోల్డ్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా నో ఈ మూవీస్ తో మోస్ట్లీ ఇటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చే...

డోరోతీ సినిమా గురించి చెప్పాలంటే రకరకాలుగా ఉందబ్బా. ఇప్పుడు ఈ సినిమాని చూసే విధానాన్ని బట్టి సినిమా తాలూకా అభిప్రాయం అనేది పూర్తిగా మారిపోతుంది. ఒక బోల్డ్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా నో ఈ మూవీస్ తో మోస్ట్లీ ఇటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారని కూడా చెప్పను అప్పుడు కూడా. మే బి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారు ఈ సినిమాని. అదర్ వైస్ ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాజిబుల్. అండ్ నేనేమంటున్నాను అంటే నా దృష్టిలో ఆ దృష్టిలో ఇలాంటి సినిమాలు సొసైటీకి హానికరమైన నమ్ముతాను నేను. మన ఇండియన్ సొసైటీకి ఎస్పెషల్లీ. 


ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లోనే చాలా క్లియర్ గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ట్రంప్ కూడా కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాడు. కొన్ని కొన్ని విషయాల్లో. అది ఏ రకంగా అయినా సరే. ఏ రకంగా అయినా సరే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో యాక్సెప్ట్నెస్ అనేది ఉంటుంది. అయితే యాక్సెప్ట్నెస్ ఉంటుంది కానీ దాన్ని బయటికి వచ్చి దండోరా వేసుకొని చెప్పే పరిస్థితి అయితే లేదు కొన్ని కొన్ని విషయాల్లో. నాకు బేసిక్ గా చిరాకు అనిపించింది సినిమా చూస్తున్నంత సేపు కూడా. నాకైతే చిరాగ్గానే ఉంది సినిమా అంతా. చాలా దరిద్రంగా అనిపించింది. కొన్ని వర్గాల జనాలకి నచ్చుద్దేమో అంతే. ఇలాంటి సినిమాలకు రేటింగ్ కూడా ఇవ్వను నేనైతే. 

Oct 03, 2026 Watch
10TV Telugu
10TV Telugu News Channel
5

Average

Dorothy movie Review

కొంత మంది తమిళ దర్శకుల సినిమాలు అంటే కులం, వివక్షలు, సమాజంలో అంగీకరించని కొన్ని సంఘటనలపై సినిమాలు తీస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. హిజ్రాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు హిజ్రాగా మారడం అనేది కొత్త పాయింట్ గా రాసుకున్నారు. కార్తీక్ సుబ్బరాజు సినిమాలంటే రా & రస్ట...

కొంత మంది తమిళ దర్శకుల సినిమాలు అంటే కులం, వివక్షలు, సమాజంలో అంగీకరించని కొన్ని సంఘటనలపై సినిమాలు తీస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. హిజ్రాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు హిజ్రాగా మారడం అనేది కొత్త పాయింట్ గా రాసుకున్నారు. కార్తీక్ సుబ్బరాజు సినిమాలంటే రా & రస్టిక్ గా, పూర్తి తమిళనాడు నేటివిటీలో ఉంటాయి. తమిళ్ లో డోరతి సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుగులో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఈ సినిమా LGBTQ వివాదంలో నిలవడంతో ఒక్కసారిగా హైప్ వచ్చింది. దీంతో తమిళ్ లో ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా తమ ప్రయోగం తెలుగులో సక్సెస్ అవుతుందేమో అని భావించి ఇక్కడ రిలీజ్ చేసారు.


అయితే ఇక్కడ కూడా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. సినిమాలో సినిమాటోగ్రఫీ విజువల్స్ రా & రస్టిక్ గా బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో మంచి విజువల్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఒక డేరింగ్ కథని సింపుల్ స్క్రీన్ ప్లే తో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ‘డోరతి’ సినిమా చిన్నప్పట్నుంచి అబ్బాయిగా పెరిగి సడెన్ గా హిజ్రాగా మారితే అతని కుటుంబం, అతని బెస్ట్ ఫ్రెండ్ ఏం చేసారు అనే కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.


Oct 02, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Dorothy movie Review

తమిళ వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ మరియు మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డోరతీ’ చిత్రం ఈ వారం తెలుగు ప్రేక్షకు ముందుకు వచ్చి ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. సమాజంలో నేటికీ వేరూనుకున్న కులం, హోదా మరియు పరువు పేరిట జరిగే సామాజిక వివక్షపై కా...

తమిళ వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ మరియు మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డోరతీ’ చిత్రం ఈ వారం తెలుగు ప్రేక్షకు ముందుకు వచ్చి ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. సమాజంలో నేటికీ వేరూనుకున్న కులం, హోదా మరియు పరువు పేరిట జరిగే సామాజిక వివక్షపై కార్తీక్ సుబ్బరాజ్ ఒక సున్నితమైన సబ్జెక్ట్‌ను ఎంచుకుని అత్యంత అర్థవంతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.


కీర్తి సురేష్ తన సాలిడ్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్రధాన బలంగా నిలవగా, సాంకేతిక విభాగం అందించిన డెప్త్ సినిమా స్థాయిని పెంచింది. అయితే, ఈ తరహా ఎమోషనల్ అండ్ సీరియస్ కంటెంట్ కమర్షియల్ మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడం కాస్త కష్టమే. కథనంలో కనిపించే సాగదీత, కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు ల్యాగ్‌గా అనిపించినప్పటికీ... కొత్త నేపథ్యంతో కూడిన సీరియస్ డ్రామాలను ఆదరించే ప్రేక్షకులకు ‘డోరతీ’ ఒక డిఫరెంట్ అండ్ ఓకే అనిపించే రేర్ అటెంప్ట్!

Oct 02, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Dorothy movie review

సమాజంలో అంతరాలను తెరపై చూపించడంలో తమిళ దర్శకులు కొందరు ముందుంటారు. అందులో కార్తిక్‌ సుబ్బరాజు ఒకరు. ఈ డోరతీ సినిమాలో కుల, లింగ వివక్షత గురించి చర్చించారు. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు హిజ్రాగా మారితే ఏం జరిగింది అన్నది సింపుల్‌గా ఈ సినిమా కథ. సినిమాలో హిజ్రాల లైఫ్‌ స్టైల్‌, వారికి జరిగే ఉత్సవాలు ఇవన్నీ...

సమాజంలో అంతరాలను తెరపై చూపించడంలో తమిళ దర్శకులు కొందరు ముందుంటారు. అందులో కార్తిక్‌ సుబ్బరాజు ఒకరు. ఈ డోరతీ సినిమాలో కుల, లింగ వివక్షత గురించి చర్చించారు. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు హిజ్రాగా మారితే ఏం జరిగింది అన్నది సింపుల్‌గా ఈ సినిమా కథ. సినిమాలో హిజ్రాల లైఫ్‌ స్టైల్‌, వారికి జరిగే ఉత్సవాలు ఇవన్నీ సెకెండాఫ్‌లో కాస్త ఎక్కువే చూపించారు. సుబ్బు హిజ్రాగా మారిన తర్వాత కార్తీతో చేసిన జర్నీ, వినోదాన్ని భావోద్వేగాన్ని పంచుతుంది. ప్రాణ స్నేహితుడైన సుబ్బుని చంపడానికి కార్తి తీసుకున్న ప్లాన్‌ ఆకట్టుకుంటుంది. అయితే డోరతి ఎలా చనిపోయిందనేది క్లారిటీ ఇవ్వలేదు.  


నటీనటులు అందరూ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక ఎడిటర్‌ సెకెండాఫ్‌ను కాస్తంత ట్రిమ్‌ చేసి ఉంటే బోర్‌ ఫీలింగ్‌ కలిగేది కాదు. నిర్మాణ పరంగా పేరు పెట్టక్కర్లేదు. లింగ వివక్ష, కులం, వర్ణంతో పాటు పితృస్వామ్య భావజాలం వరకు సమాజంలోని అనేక అసమానతలను గురించి దర్శకుడు ప్రశ్నించాడు. అలాగే సమాజం ట్రాన్స్‌జెండర్స్‌ ఎదుర్కొంటున్న అవమానాలు, వారి లోలోపలి సంఘర్షణలను సున్నితంగా తెరపై చూపించారు. లైన్‌ మంచిదే అయినా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో కాస్త వెనకడుగులో ఉన్నట్లే అనిపిస్తుంది. దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోతగ్గదే! అయితే ఇలాంటి కథాంశాలతో తెరకెక్కే చిత్రాలు అందరికీ నచ్చే ఆస్కారం లేదు.


Oct 05, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Dorothy movie review

కోలీవుడ్ బోల్డ్ డైరెక్ట్ సెన్సేషన్ కార్తీక్ సుబ్బరాజ్, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ అండ్ మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా కాంబోలో వచ్చిన రేర్ అటెంప్ట్ ‘డోరతీ’. ఈ వారం తెలుగులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ట్రెండీ డిస్కషన్‌‌గా మారింది!సమాజంలో ఇంకా పేరుకుని ఉన్న కులం, హోదా అండ్ 'పరువు' అనే తప్ప...

కోలీవుడ్ బోల్డ్ డైరెక్ట్ సెన్సేషన్ కార్తీక్ సుబ్బరాజ్, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ అండ్ మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా కాంబోలో వచ్చిన రేర్ అటెంప్ట్ ‘డోరతీ’. ఈ వారం తెలుగులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ట్రెండీ డిస్కషన్‌‌గా మారింది!


సమాజంలో ఇంకా పేరుకుని ఉన్న కులం, హోదా అండ్ 'పరువు' అనే తప్పుడు భావనలతో ఇతరులను కంట్రోల్ చేసే వివక్షపై కార్తీక్ సుబ్బరాజ్ తన మార్క్ ఎమోషనల్ అండ్ మీనింగ్‌ఫుల్ స్టోరీలైన్‌ను రాసుకున్నారు. కీర్తి సురేష్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. పవర్ ఫుల్ ఎమోషన్స్, రో డ్రామా అండ్ ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ సినిమా డెప్త్‌ను పెంచాయి.


అయితే కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ల కోరుకునే మాస్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్‌కి ఈ కాన్సెప్ట్ కనెక్ట్ అవ్వడం కాస్త కష్టమే. కథనంలో స్లో పేసింగ్, కొన్ని చోట్ల రిపీటెడ్ అనిపించే సీన్స్ కాస్త ల్యాగ్‌గా అనిపిస్తాయి. ఫైనల్ గా కార్తీక్ సుబ్బరాజ్ తీసుకున్న పాయింట్ సాహసోపేతమైంది అయినా, స్క్రీన్ ప్లే మరింత పగడ్బందీగా ప్లాన్ చేసి ఉంటె అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరేది.



Oct 02, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Dorothy Movie Review

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర వచ్చి షాకింగ్ టాక్ అందుకున్న సినిమానే డోరతి. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, కీర్తి సురేష్ అలాగే ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఈ వారం తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఇప్పటికీ మనం ఉన్న సమాజంలోనే కులం, హోదా లేదా కాలం చెల్లిన సామాజిక విశ్వాసాల రూపంలో సామాజిక వివక్ష ఉ...

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర వచ్చి షాకింగ్ టాక్ అందుకున్న సినిమానే డోరతి. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, కీర్తి సురేష్ అలాగే ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఈ వారం తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఇప్పటికీ మనం ఉన్న సమాజంలోనే కులం, హోదా లేదా కాలం చెల్లిన సామాజిక విశ్వాసాల రూపంలో సామాజిక వివక్ష ఉంది అనేది తరతరాలుగా వస్తున్న ఒక కఠినమైన వాస్తవం. ఇతరులను ప్రత్యక్షంగానో పరోక్షంగానో నియంత్రించడానికి ఉపయోగించే పరువు అనే తప్పుడు భావనలపై దృష్టి పెడుతూ, కార్తీక్ సుబ్బరాజ్ ఓ సున్నితమైన సబ్జెక్ట్ చుట్టూ తన కథను అల్లారు.


అయితే ఈ తరహా సబ్జెక్ట్ లు డెఫినెట్ గా అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించే అవకాశం చాలా తక్కువ. ఇందులోని డెప్త్, ఎమోషన్స్ కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం అనిపిస్తాయి. మొత్తంగా చూసుకుంటే, ‘డోరతీ’ ఓకే అనిపించే ఓ డిఫరెంట్ అండ్ రేర్ అటెంప్ట్ గా నిలుస్తుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ సున్నితమైన సబ్జెక్ట్ ని ఎంచుకొని అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే నటీనటులు నుంచి సాలిడ్ పెర్ఫార్మన్స్ లు కూడా తాను రాబట్టారు. కానీ ఈ సబ్జెక్ట్ అన్ని వర్గాల ఆడియెన్స్ కి డెఫినెట్ గా కనెక్ట్ కావడం కష్టం. పైగా సాగదీతగా, రిపీటెడ్ గా అనిపించే సీన్స్ కొన్ని ఇబ్బంది పెడతాయి. కొంచెం స్లోగా ఉన్నా పర్వాలేదు, కొత్త నేపథ్యం ఉండే సినిమా చూడాలి అనుకునేవారికి ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.




Oct 02, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Dorothy movie review

కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ డోరతీ ’. ఈ సినిమా ఆల్రెడీ తమిళంలో విడుదలై అక్కడ కాంట్రవర్సీతో దూసుకుపోతోంది. తెలుగులో ఇప్పుడు విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. కార్తిక్ సుబ్బరాజ్ చిత్రాలు దాదాపు సమాజంలోని అసమానతలపైనే ఉంటాయి. అయితే ఈ...

కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ డోరతీ ’. ఈ సినిమా ఆల్రెడీ తమిళంలో విడుదలై అక్కడ కాంట్రవర్సీతో దూసుకుపోతోంది. తెలుగులో ఇప్పుడు విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. కార్తిక్ సుబ్బరాజ్ చిత్రాలు దాదాపు సమాజంలోని అసమానతలపైనే ఉంటాయి. అయితే ఈ సారి లింగ వివక్షను ప్రధాన అంశంగా తీసుకున్నాడు. సినిమాలో సుబ్బు పాత్ర మారిన తీరు.. కార్తి సంఘర్షణ.. ఇలా అన్నీ కూడా ఎమోషనల్‌గా సాగుతాయి. ఓ కమ్యూనిటీ ఈ సమాజం నుంచి ఎదుర్కొనే అవమానాలు, చీత్కారాన్ని మనసుని కదిలించేలా తెరకెక్కించాడు కార్తిక్ సుబ్బరాజ్. 


అయితే కీర్తి సురేష్ పాత్ర కూడా మధ్యలోనే అలా అర్దాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. కానీ టెక్నికల్‌గా మ్యాజిక్ చేసిన ‘డోరతీ’.. ఎమోషనల్‌గా అందరినీ కదిలించలేకపోయిందని చెప్పుకోవచ్చు. చివరగా ‘డోరతీ’ మనం రెగ్యులర్‌గా చూసే మాస్ మసాలా కమర్షియల్ చిత్రం అయితే కాదు. కొడితే వంద మంది గాల్లోకి ఎగరం, రక్తం ఏరులైపారే సీన్స్ ఇందులో ఉండవు. ఓ ఆర్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అందరికీ నచ్చకపోయినా కొందరిని మాత్రం మెప్పించే అవకాశం ఉంది.


Oct 02, 2026 Read Review

Public Reviews

2 Avg: 4.5/10
G
Goshika Shreshta CA/Advocate
5

Average

Dorothy movie review

Directed by Karthik Subbaraj and starring Keerthy Suresh alongside Ilaiyaraaja's music, Dorothy tackles complex social themes like caste discrimination and false notions of honor. Keerthy delivers a powerhouse performance in this meaningful narrative.However, the film’s slow pacing, repetitive scene...

Directed by Karthik Subbaraj and starring Keerthy Suresh alongside Ilaiyaraaja's music, Dorothy tackles complex social themes like caste discrimination and false notions of honor. Keerthy delivers a powerhouse performance in this meaningful narrative.


However, the film’s slow pacing, repetitive scenes, and heavy emotional tone may fail to connect with mainstream commercial audiences.


Verdict: overall Dorothy isn't a mindless entertainer, but for viewers seeking serious, impactful storytelling with strong artistic depth, it stands as a unique, worthwhile attempt. but familys not acceptable.

Oct 03, 2026
A
Arige Srikanth Private Employee
4

Below Average

Dorothy movie Review

Just ippude Dorothy movie first show chusoccha... alaready dont trouble the trouble movie dissapointment tho dull ayina nenu.. edo fresh concept annarani ee movie ki vellanu.. concept ayithe baane undi gani.. aa konni sences ki headdek occhindi. asalu directer karthik subbaraj ki ilanti story ela ra...

Just ippude Dorothy movie first show chusoccha... alaready dont trouble the trouble movie dissapointment tho dull ayina nenu.. edo fresh concept annarani ee movie ki vellanu.. concept ayithe baane undi gani.. aa konni sences ki headdek occhindi.


asalu directer karthik subbaraj ki ilanti story ela rayalani anipinchindemo mari.. at the same time ilanti concepts teeyadaniki kooda guts undali.

but ela unna... ela teesinaa audiance ki nacchali kada.. mari nakaithe nacchaledu. but lead actors perfarmance bagundi. keerthy gurinche vellanu cinemaku.. kaani tanu takkuva sepe untundi.


familys ayithe may be chudakapovacchu. but oka different concept.. ilantivi hollywood lo, bollywood lo aadatayemo gani.. mana daggara kastame.

Oct 02, 2026

About This Movie

Story :

 

కథ విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఓ పల్లెటూళ్ళో సుబ్బు (సనంత్), కార్తీక్ (రిషికాంత్) స్కూల్ డేస్ నుండే బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు సుబ్బు చాలా ఫైర్ గా ఉంటె, కార్తీక్ భయపడుతూ ఉంటాడు. కానీ పెద్దయ్యాక సుబ్బు నెమ్మదస్తుడైతే, కార్తీక్ మొండిగా కోపిష్టిగా, ఫైర్ గా మారతాడు. అయితే సుబ్బు ఇంట్లో నాన్న, అన్నలు పరువే ప్రాణంగా బతుకుతుంటారు. సుబ్బు చిన్నతనంలోనే తన అమ్మ, అక్కలు చనిపోవడంతో, వాళ్ళ ఇంట్లోకి వదిన డోరతి (కీర్తి సురేష్) రాకతో సంతోషంగా ఉంటాడు. అయితే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం సుబ్బు ఇంట్లో ఓ ఊహించని విషాదం వల్ల వారి కుటుంబం సంతోషాలను దూరం చేస్తుంది. పైగా ఆ విషాదం తర్వాత సుబ్బు తీసుకున్న ఓ పెద్ద నిర్ణయంతో అతనిపై కుటుంబం అలాగే స్నేహితుడ్ని ఆగ్రహానికి గురి చేస్తుంది. ఇంతకీ సుబ్బు అసలు ఏం చేసాడు? సుబ్బుపై తన కుటుంబం, స్నేహితుడు కూడా ఎందుకు చంపాలని చూస్తారు? సుబ్బు, కార్తీక్ స్నేహం ఎలా సాగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Plus Points :

ఈ సినిమా కథ పరంగా ట్రైలర్ చూసినపుడు ఆడియన్స్ ఊహించుకునేది వేరేలా ఉంటుంది. కానీ సినిమా చూసినపుడు మరోలా ఊహించని విధంగా ఉంటుంది. అది ఒక రకంగా ప్లస్ అయినా, ట్రైలర్ చూసి ఒకటి ఊహించుకున్న ఆడియన్స్ దృష్టిలో మైనస్ అవుతుంది. మాములుగా సంఘంలో ఈ కులమతాల చిచ్చు, లేదా సొసైటీలో మనుషులు నడుచుకునే తీరులో కొన్ని విశ్వాసాల రూపంలో ఇప్పటికి మారని కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులోని ఒక అంశాన్ని ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. కానీ దర్శకుడు ఆడియన్స్ కి ఎంత ఎంగేజింగ్ గా చుపించాడన్నదే అసలు మ్యాటర్. స్టోరీ లైన్ పరంగా సెన్సిటివ్ సబ్జెక్టును బాగానే డీల్ చేసాడు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. 

ఇక  కీ రోల్స్ లో నటించిన రిషికాంత్, సనంత్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సనంత్ చేసిన రోల్ ఛాలెంజింగ్ గా ఉంటుంది. అయితే కీర్తి సురేష్ ది టైటిల్ రోల్ కాబట్టి మెయిన్ లీడ్ అవుతుందనుకున్నా, ఆమె కూడా కీ రోల్ ప్లే చేసింది. తక్కువ నిడివే దక్కినా, ఇంపాక్ట్ ఉన్న రోల్ పడింది. ఇక ముత్తుకుమార్ సహా మిగతా వాళ్ళు వాళ్ళ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.

 

Minus Points :

అయితే ఇలాంటి సబ్జెక్టులు అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించడం కష్టం. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. కథలోని ఎమోషన్స్, అండ్ డెప్త్ కొందర్ని మాత్రమే ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇక ఆల్రెడీ తమిళ్ లో రిలీజ్ అయ్యాక కొంత గ్యాప్ తర్వాత తెలుగులో విడుదలైంది కాబట్టి కథ గురించి చాలా మందికి తెలియడంతో ఇంట్రెస్ట్ తగ్గింది. పైగా సినిమాలో స్క్రీన్ ప్లే చాలా ల్యాగ్ అయి, నెమ్మదిగా సాగడంతో బోర్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ మరీ సాగదీశారు. పైగా సినిమాలో మ్యూజిక్ అంత  బాగా లేదు.

 

Technical Values : 

ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 90స్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమా కథ ఉండడం వల్ల అప్పటి సెట్స్ ని న్యాచురల్ గా డిజైన్ చేసారు. ఇక మాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఒక వింటేజ్ వైబ్ ఇస్తుంది. కాకపోతే ట్రెండ్ కి తగ్గట్టు కోరుకునే ఆడియన్స్ కి అంతగా ఎక్కకపోవచ్చు. తిరు కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. అయితే ఎడిటింగ్ పై ఇంకాస్త వర్క్ చేయాల్సింది. అనవసరమైన ల్యాగ్ సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. అయితే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ వాడకుండా న్యాచురల్ గా తీసాడు. 

 

Final Review :

ఇక ఓవరాల్ గా "డోరతి" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ డిఫరెంట్ ఆక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా, ఒక డిఫరెంట్ మూవీగా కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ని కొంతవరకు ఆకట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే కమర్షియల్ మూవీ లవర్స్ కి అంతగా కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డిఫరెంట్ సెన్సిటివ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తో పాటు నటీనటుల సాలిడ్ పెర్ఫార్మన్స్ లు మూవీలో ఆకట్టుకుంటాయి. కొంచెం స్లోగా బోరింగ్ గా ఉన్నా, మేకర్స్ ఎఫర్ట్ కోసం ఓసారి ట్రై చేయొచ్చు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగులో ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. 

Review Statistics

4.9
Overall Rating
Avg. of all reviews
10
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.0/10
Public
4.5/10
Why MRO?