Register as a Reviewer
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble The Trouble)

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble The Trouble)

Upcoming Expected Release: 02 Oct 2026

Dont Trouble The Trouble : బాలయ్య ట్రోల్ డైలాగే మూవీ టైటిల్... "ఫాఫా" మెయిన్ లీడ్ లో కామెడీ థ్రిల్లర్ డ్రామా..!

Director: Shashank Yeleti
Cast: Fahadh Faasil, Ssara Palekar, Saurabh Sachdeva

About This Movie

టాలీవుడ్ లో ఓ ఫేమస్ మీమ్ డైలాగ్ చాలా పాపులర్. బాలకృష్ణ నటించిన ఓ సినిమా లో "డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు" ఐ యామ్ నాట్ ట్రబుల్, ఐ మ్ ది ట్రుత్" అంటూ ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఇది ట్రోల్ మీమ్స్ గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్. అయితే ఇప్పుడు ఇదే ట్రోల్ డైలాగే టైటిల్ గా ఓ సినిమా తెరకెక్కుతుంది. మలయాళ స్టార్ "ఫహాద్ ఫాజిల్" హీరోగా నటిస్తున్న ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు "డోంట్ ట్రబుల్ ద ట్రబుల్" అనే టైటిల్ ఫిక్స్ చేసారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా, నందమూరి బాలకృష్ణ ఆ ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. 

 

ఇక ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ "డోంట్ ట్రబుల్ ద ట్రబుల్" మూవీలో ఫహద్ ఫాజిల్ సూరి అనే రోల్ లో నటించగా, ఎప్పుడూ డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఉండే ఒక మెజీషియన్ గా ఇందులో కనిపించబోతున్నాడు. ఈ క్రమంలో అతనికి అనుకోకుండా పరిచయమైనా ఓ చిన్నారి ద్వారా, ఆమెను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని చూస్తాడు. ఈ క్రమంలో ఆ చిన్నారితో ప్రయాణం అతడ్ని మరింత సమస్యల్లో నెట్టేస్తుంది. ఆమె దగ్గర ఉండే అద్భుతమైన మ్యాజిక్ శక్తుల వల్ల సూరి పడే ఇబ్బందులు హాస్యభరితంగా ఉంటాయి. 

 

అయితే ఆ చిన్నారికి ఉన్న సమస్య గురించి తెలుసుకుని, అలాగే తన ప్రాబ్లెమ్స్ ని కూడా ఎలా సాల్వ్ చేసుకున్నాడో వీళ్ళిద్దరూ చేసే ఆ జర్నీయే సినిమాగా ఉండబోతుందని తెలుస్తుంది. ఒక ఫన్, ఫాంటసీ, థ్రిల్స్ మేళవించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శశాంక్ యేలేటి. ఇక ట్రైలర్‌లో బాలకృష్ణ వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. ఇక ఈ మూవీలో ఆ చిన్నారిగా స్సార నటించింది. అయితే ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, కాల భైరవ సంగీతాన్ని అందించడం జరిగింది. ఇక ఈ "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్" సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మేకర్స్ విడుదల చేయబోతున్నారు. 

 

Why MRO?