Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1479
Total Reviews
99
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 385-396 of 1479 reviews
5.0
out of 10
"వీక్ మొత్తం ఆఫీస్ టెన్షన్ తర్వాత వీకెండ్‌ లో లైట్‌గా ఏదైనా చూడాలని 'గట్టా కుస్తీ 2' పెట్టా. కామెడీ పరంగా సినిమా ఓకే అనిపించింది. విష్ణు విశాల్ తన టైమింగ్‌తో చాలా చోట్ల ఎంటర్‌టైన్ చేశాడు. కానీ కథలో ఒక్క ట్విస్ట్ కూడా కొత్తగా అనిపించలేదు. తర్వాత ఏం జరుగుతుందో ముందే అర్థమైపోయింది. కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే ఇంకా క్రిస్ప్‌గా ఉండేది. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఈసారి మ్యాజిక్ కాస్త తక్కువే. నా వరకు ఇది...

"వీక్ మొత్తం ఆఫీస్ టెన్షన్ తర్వాత వీకెండ్‌ లో లైట్‌గా ఏదైనా చూడాలని 'గట్టా కుస్తీ 2' పెట్టా. కామెడీ పరంగా సినిమా ఓకే అనిపించింది. విష్ణు విశాల్ తన టైమింగ్‌తో చాలా చోట్ల ఎంటర్‌టైన్ చేశాడు. కానీ కథలో ఒక్క ట్విస్ట్ కూడా కొత్తగా అనిపించలేదు. తర్వాత ఏం జరుగుతుందో ముందే అర్థమైపోయింది. కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే ఇంకా క్రిస్ప్‌గా ఉండేది. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఈసారి మ్యాజిక్ కాస్త తక్కువే. నా వరకు ఇది ఒక వన్‌టైమ్ వాచ్ మూవీ."

Aug 03, 2026 Tamil +1
6.0
out of 10
"రోజంతా hospital lo బిజీగా ఉండి relax అవ్వాలని ఈ సినిమా చూశా. నిజం చెప్పాలంటే విష్ణు విశాల్ కామెడీ బాగా నవ్వించింది. family emotions కూడా కనెక్ట్ అయ్యాయి. కానీ కథ మాత్రం చాలా predictible గా అనిపించింది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, విడిపోవడం, మళ్లీ కలవడం లాంటి ట్రాక్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. కొన్ని సీన్లు కాస్త lengthy గా అనిపించాయి. ఐశ్వర్య లక్ష్మీ తన role లో బాగా చేసింది, చైల్డ్ ఆర్టిస్ట...

"రోజంతా hospital lo బిజీగా ఉండి relax అవ్వాలని ఈ సినిమా చూశా. నిజం చెప్పాలంటే విష్ణు విశాల్ కామెడీ బాగా నవ్వించింది. family emotions కూడా కనెక్ట్ అయ్యాయి. కానీ కథ మాత్రం చాలా predictible గా అనిపించింది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, విడిపోవడం, మళ్లీ కలవడం లాంటి ట్రాక్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. కొన్ని సీన్లు కాస్త lengthy గా అనిపించాయి.


ఐశ్వర్య లక్ష్మీ తన role లో బాగా చేసింది, చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఆకట్టుకుంది. కొత్త కథ కోసం చూస్తే నిరాశే. కానీ ఎక్కువగా ఆలోచించకుండా ఫ్యామిలీతో కలిసి రెండు గంటలు నవ్వుకుంటూ timepass చేయాలంటే మాత్రం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు."

Aug 03, 2026 Tamil +1
6.0
out of 10
సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్‌ అనిపించింది ఒక్కటే... **'గట్టా కుస్తీ 2'**లో కామెడీ బాగానే వర్కౌట్ అయింది కానీ, కథ మాత్రం చాలా రొటీన్‌గా ఉంది. విష్ణు విశాల్ స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా నవ్వించాడు. ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రలో బాగా చేసింది. అయితే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, మళ్లీ కలవడం లాంటి ట్రాక్ చాలా సినిమాల్లో చూసినట్టే అనిపించింది. తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేయొచ్చు. మధ్యలో...

సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్‌ అనిపించింది ఒక్కటే... **'గట్టా కుస్తీ 2'**లో కామెడీ బాగానే వర్కౌట్ అయింది కానీ, కథ మాత్రం చాలా రొటీన్‌గా ఉంది. విష్ణు విశాల్ స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా నవ్వించాడు. ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రలో బాగా చేసింది. అయితే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, మళ్లీ కలవడం లాంటి ట్రాక్ చాలా సినిమాల్లో చూసినట్టే అనిపించింది. తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేయొచ్చు.


మధ్యలో కొన్ని సీన్లు కాస్త సాగదీసిన ఫీలింగ్ కూడా వచ్చింది. అయినా ఫ్యామిలీతో కలిసి లైట్‌గా టైంపాస్ చేయాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ పార్ట్‌లా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం కొంచెం నిరాశే. నా వరకు అయితే ఇది వన్‌టైమ్ వాచ్ మూవీ...

Aug 03, 2026 Tamil +1

Gatta Kusthi 2 movie Review

5.0
out of 10
గట్ట కుస్తీ 2. అంటే తెలుగులో మట్టి కుస్తీ 2 అని అర్ధం. 2022 లో వచ్చిన మట్టి కుస్తీ కి సీక్వెల్ ఈ మూవీ. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ కూడా చూసి తీరాలి. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో సెకండ్ పార్ట్ అక్కడి నుండే మొదలవుతుంది. అండ్ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే ఫస్ట్ పార్ట్ బాగానే నచ్చింది. ఈ సినిమా మాత్రం అంత లేదు. అండ్ లాజిక్స్ గురించి మాట్లాడితే సినిమా అస్సలు చూడలేం. సినిమా కథ అయితే...

గట్ట కుస్తీ 2. అంటే తెలుగులో మట్టి కుస్తీ 2 అని అర్ధం. 2022 లో వచ్చిన మట్టి కుస్తీ కి సీక్వెల్ ఈ మూవీ. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ కూడా చూసి తీరాలి. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో సెకండ్ పార్ట్ అక్కడి నుండే మొదలవుతుంది. అండ్ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే ఫస్ట్ పార్ట్ బాగానే నచ్చింది. ఈ సినిమా మాత్రం అంత లేదు. అండ్ లాజిక్స్ గురించి మాట్లాడితే సినిమా అస్సలు చూడలేం.


సినిమా కథ అయితే ఏం పెద్దగా లేదు. విష్ణు విశాల్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాడు కానీ, తన కెరీర్ కి ఈ మూవీ ఉపయోగపడలేదు. ఐశ్వర్య లక్ష్మికి కూడా అంతే. కానీ కామెడీ బాగుంది. కొన్ని కామెడీ సీన్స్ కోసం మాత్రం ఈ సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ మూవీకి నా రేటింగ్ చెప్పాలంటే 5.5

Aug 03, 2026 Tamil +1

Gatta Kusthi 2 movie Review

5.0
out of 10
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' తమిళంలో థియేటర్లలో విడుదలై డీసెంట్ సక్సెస్ అవగా, తెలుగులో మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా గురించి ఓవరాల్ గా చెప్పాలంటే.. రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ‘గట్టా కుస్తీ 2’ మూవీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. స్పోర్ట్స్ నేపథ్యం ఉన్నా, వీక్ రైటిం...

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' తమిళంలో థియేటర్లలో విడుదలై డీసెంట్ సక్సెస్ అవగా, తెలుగులో మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా గురించి ఓవరాల్ గా చెప్పాలంటే.. రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ‘గట్టా కుస్తీ 2’ మూవీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. స్పోర్ట్స్ నేపథ్యం ఉన్నా, వీక్ రైటింగ్‌తో కథను ట్రాక్ తప్పించారు. విష్ణు విశాల్-ఐశ్వర్య లక్ష్మిల పర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. అయితే, రొటీన్ కథ, సాగదీసిన రన్‌టైమ్ ఈ చిత్రానికి మైనస్. టైమ్ పాస్ కోసం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలనుకునే వారు ఈ చిత్రాన్ని ఓసారి ట్రై చేయవచ్చు. మిగతా వారు ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.


Aug 03, 2026 Tamil +1

Gatta Kusthi 2 movie review

Sakshi

By Sakshi

6.0
out of 10
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' తమిళంలో థియేటర్లలో విడుదలై, తెలుగులో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య అపార్థాలు, భావోద్వేగాలు, కామెడీ ప్రధానంగా సాగుతాయి. విష్ణు విశాల్ తన న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకోగా, ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీతో...

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' తమిళంలో థియేటర్లలో విడుదలై, తెలుగులో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య అపార్థాలు, భావోద్వేగాలు, కామెడీ ప్రధానంగా సాగుతాయి. విష్ణు విశాల్ తన న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకోగా, ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ జారా నటన హైలైట్‌గా నిలిచింది. అయితే కథ పూర్తిగా రొటీన్‌గా ఉండడం, ముందే ఊహించగల స్క్రీన్‌ప్లే, కొన్ని సాగదీత సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా మారాయి. మొత్తంగా 'గట్టా కుస్తీ 2' నవ్వులు పంచే టైంపాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కొత్త కథ ఆశించే వారికి మాత్రం పెద్దగా మెప్పించకపోవచ్చు. ఓవరాల్ గా మంచి టైం పాస్ మూవీగా ఫ్యామిలీతో ఓసారి చూసేయొచ్చు.


Aug 03, 2026 Tamil +1
సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు అయితే అస్సలు నచ్చలేదు గైస్. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా కొత్తదనం కనిపించలేదు. ప్రతి సీన్ ముందే ఊహించినట్టే జరుగుతూ ఉంటుంది. కథైనా, స్క్రీన్‌ప్లే అయినా ఎక్కడా సర్‌ప్రైజ్ చేసే ఎలిమెంట్ లేదు. నిజంగా చెప్పాలంటే సినిమా మొత్తం చాలా ఫ్లాట్‌గా అనిపించింది. 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' లాంటి సినిమాలు తీసిన అజయ్ భూపతి గారి నుంచి ఇలాంటి రొటీన్ సినిమా వస్తుందని...

సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు అయితే అస్సలు నచ్చలేదు గైస్. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా కొత్తదనం కనిపించలేదు. ప్రతి సీన్ ముందే ఊహించినట్టే జరుగుతూ ఉంటుంది. కథైనా, స్క్రీన్‌ప్లే అయినా ఎక్కడా సర్‌ప్రైజ్ చేసే ఎలిమెంట్ లేదు. నిజంగా చెప్పాలంటే సినిమా మొత్తం చాలా ఫ్లాట్‌గా అనిపించింది. 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' లాంటి సినిమాలు తీసిన అజయ్ భూపతి గారి నుంచి ఇలాంటి రొటీన్ సినిమా వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే ఇంకా ఎక్కువ నిరాశ కలిగింది. కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలనే ప్రయత్నం కనిపించినా, అవి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. పాటలు, ఫైట్లు, లవ్ ట్రాక్ అన్నీ వచ్చినా ఎక్కడా ఎమోషన్ మాత్రం ఫీల్ కాలేదు. సినిమా చూస్తున్నంతసేపు "ఇంకా ఏమైనా కొత్తగా చూపిస్తారా?" అని ఎదురుచూశాను కానీ అలాంటి మూమెంట్ ఒక్కటి కూడా రాలేదు. హీరో జైకృష్ణ తన వంతు ప్రయత్నం చేశాడు, కానీ బలమైన కథ లేకపోవడంతో అతని కష్టం కూడా పూర్తిగా కనిపించలేదు. మొత్తానికి నాకు అయితే ఈ సినిమా చాలా పెద్ద డిసప్పాయింట్. అజయ్ భూపతి గారి నుంచి నేను ఊహించిన సినిమా ఇది మాత్రం కాదు గైస్.

Aug 01, 2026 Telugu
ఈ సినిమా భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ థియేటర్లలో మాత్రం ఆ హైప్‌కు తగ్గ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. పెద్దిరెడ్డి, వెంకటప్ప నాయుడు మధ్య జరిగే గొడవల నేపథ్యంలో హీరో, హీరోయిన్ ప్రేమకథను చూపించే ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ల ప్రేమ గెలిచిందా..? ఇద్దరూ ఒక్కటయ్యారా..? అనేదే సినిమా కథ. కానీ సినిమా చూస్తుంటే కథ కంటే పాటలు, ఫైట్లు ఎక్కువగా కనిపిస్తాయి. హీరో హీరోయిన్ కనిపిస్తే ఒక పాట... వ...

ఈ సినిమా భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ థియేటర్లలో మాత్రం ఆ హైప్‌కు తగ్గ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. పెద్దిరెడ్డి, వెంకటప్ప నాయుడు మధ్య జరిగే గొడవల నేపథ్యంలో హీరో, హీరోయిన్ ప్రేమకథను చూపించే ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ల ప్రేమ గెలిచిందా..? ఇద్దరూ ఒక్కటయ్యారా..? అనేదే సినిమా కథ. కానీ సినిమా చూస్తుంటే కథ కంటే పాటలు, ఫైట్లు ఎక్కువగా కనిపిస్తాయి. హీరో హీరోయిన్ కనిపిస్తే ఒక పాట... వెంటనే ఒక ఫైట్... మళ్లీ ఇంకో పాట అన్నట్టే సినిమా ముందుకు సాగుతుంది. ఎక్కడా కూడా బలమైన ఎమోషన్ కానీ, కథలో గ్రిప్ కానీ కనిపించదు. జైకృష్ణ మాత్రం తన వంతు ప్రయత్నం చేశాడు. నటనలో కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించాడు. లుక్స్ కూడా హీరోకి బాగానే సెట్ అయ్యాయి. కానీ దర్శకుడు కథను బలంగా చెప్పడం కంటే కమర్షియల్ ఎలిమెంట్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపించింది. అదే ఫోకస్ కథ, స్క్రీన్‌ప్లేపై పెట్టి ఉంటే సినిమా ఇంకాస్త బెటర్‌గా వచ్చేదేమో. మొత్తానికి సినిమాలో చెప్పుకోదగ్గ కొత్త కథ ఏమీ లేదు. అయితే టైమ్‌పాస్ కోసం ఒకసారి చూడాలనుకునేవాళ్లు ట్రై చేయొచ్చు గైస్. నాకు మాత్రం ఆశించినంతగా ఈ సినిమా కనెక్ట్ కాలేదు.

Aug 01, 2026 Telugu
అసలు ఈ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన మొదటి ఫీలింగ్ ఒక్కటే... "ఎందుకురా బాబు ఈ సినిమా తీశారు?" అని. నిజంగా చెప్పాలంటే అజయ్ భూపతి గారి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని అస్సలు ఊహించలేదు. 'మంగళవారం' తీసిన దర్శకుడు ఇదేనా అనిపించింది. ఆ సినిమా ఎక్కడ... ఈ 'శ్రీనివాస మంగాపురం' ఎక్కడ... రెండింటికీ అస్సలు పోలికే లేదు. టైమ్ మొత్తం వేస్ట్ అయిందనే ఫీలింగ్ వచ్చింది. వైజయంతి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ ఇలాంటి కథను...

అసలు ఈ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన మొదటి ఫీలింగ్ ఒక్కటే... "ఎందుకురా బాబు ఈ సినిమా తీశారు?" అని. నిజంగా చెప్పాలంటే అజయ్ భూపతి గారి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని అస్సలు ఊహించలేదు. 'మంగళవారం' తీసిన దర్శకుడు ఇదేనా అనిపించింది. ఆ సినిమా ఎక్కడ... ఈ 'శ్రీనివాస మంగాపురం' ఎక్కడ... రెండింటికీ అస్సలు పోలికే లేదు. టైమ్ మొత్తం వేస్ట్ అయిందనే ఫీలింగ్ వచ్చింది. వైజయంతి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ ఇలాంటి కథను ఎందుకు ఓకే చేసిందో కూడా అర్థం కాలేదు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినట్టే అనిపించింది. సినిమాలో ఎవరైనా నిజంగా కష్టపడ్డారు అంటే అది జీవీ ప్రకాశ్ గారేనేమో అనిపించింది. రెండు పాటలు బాగున్నాయి, మిగతావి కూడా ఓకే అనిపిస్తాయి. కానీ అవి కూడా సినిమాను పైకి లేపే స్థాయిలో లేవు. సినిమాలో అవసరానికి మించి అల్ట్రా వైడ్ షాట్లు కనిపిస్తాయి. అవి ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఫైట్లు చూస్తుంటే ఎక్కడా థ్రిల్ అనిపించలేదు. నటన విషయానికి వస్తే కూడా చాలా పాత్రలు తేలిపోయాయి. నాకు మాత్రం మోహన్ బాబు గారి పాత్ర ఒక్కటే కాస్త పర్వాలేదు అనిపించింది. కానీ ఆ పాత్రను కూడా బలంగా రాయకపోవడంతో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా ఉపయోగపడలేదు. మొత్తానికి నాకు అయితే ఈ సినిమా ఏమాత్రం నచ్చలేదు గైస్.


Aug 01, 2026 Telugu
సినిమా చూసాక నాకు అయితే అస్సలు నచ్చలేదు గైస్. నిజంగా చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత రొటీన్‌గా, ఇంత ఫ్లాట్‌గా సినిమా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇలాంటి కథలు ఇప్పటికే చాలానే చూశాం. కానీ ఈ సినిమాను అజయ్ భూపతి గారు తీశారంటే మాత్రం ఇంకా నమ్మలేకపోతున్నా. "ఎందుకురా బాబు ఇలా తీశారు?" అనిపించింది. ఎడిటింగ్ కూడా చాలా వీక్‌గా ఉంది. నిజంగా చెప్పాలంటే సగం సినిమా తీసేసినా పెద్దగా తేడా ఉండేదేమో అనిపిస్...

సినిమా చూసాక నాకు అయితే అస్సలు నచ్చలేదు గైస్. నిజంగా చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత రొటీన్‌గా, ఇంత ఫ్లాట్‌గా సినిమా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇలాంటి కథలు ఇప్పటికే చాలానే చూశాం. కానీ ఈ సినిమాను అజయ్ భూపతి గారు తీశారంటే మాత్రం ఇంకా నమ్మలేకపోతున్నా. "ఎందుకురా బాబు ఇలా తీశారు?" అనిపించింది. ఎడిటింగ్ కూడా చాలా వీక్‌గా ఉంది. నిజంగా చెప్పాలంటే సగం సినిమా తీసేసినా పెద్దగా తేడా ఉండేదేమో అనిపిస్తుంది. పాటల సంగతి అయితే చెప్పక్కర్లేదు... యూట్యూబ్‌లో మధ్య మధ్యలో యాడ్స్ వచ్చినట్టు సంబంధం లేకుండా వస్తూనే ఉంటాయి. అసలు కథ ఫ్లోనే డిస్టర్బ్ చేస్తాయి. ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన నటన మాత్రమే. ఆయన వచ్చిన కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమాకు కాస్త ఊపిరి పోస్తాయి. ఇంకొన్ని సీన్లు బాగున్నా, చాలా వరకు మాత్రం మామూలుగానే అనిపిస్తాయి. కథలో కొత్తదనం అనే మాటే లేదు. 'మంగళవారం' తర్వాత అజయ్ భూపతి గారి నుంచి ఇంకో మంచి సినిమా వస్తుందని చాలా ఆశించాను. కానీ ఈ సినిమా మాత్రం నా ఎక్స్‌పెక్టేషన్స్‌కు అస్సలు మ్యాచ్ కాలేదు. ఇలాంటి రొటీన్ కథను ఎందుకు ఎంచుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మొత్తానికి నాకు అయితే ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాలేదు గైస్. ఇదంతా పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.



Aug 01, 2026 Telugu
సినిమా గురించి చెప్పాలంటే గైస్.. మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అని అందరూ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ నాకు మాత్రం ఈ సినిమా అస్సలు కనెక్ట్ కాలేదు. చాలా రోజుల తర్వాత "ఎందుకు ఈ సినిమాకి వచ్చానురా బాబు" అనిపించింది. కథ పూర్తిగా పాత కమర్షియల్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. స్క్రీన్‌ప్లేలో కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఇరవై ఏళ్ల క్రితం వచ్చి ఉంటే బాగ...

సినిమా గురించి చెప్పాలంటే గైస్.. మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అని అందరూ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ నాకు మాత్రం ఈ సినిమా అస్సలు కనెక్ట్ కాలేదు. చాలా రోజుల తర్వాత "ఎందుకు ఈ సినిమాకి వచ్చానురా బాబు" అనిపించింది. కథ పూర్తిగా పాత కమర్షియల్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. స్క్రీన్‌ప్లేలో కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఇరవై ఏళ్ల క్రితం వచ్చి ఉంటే బాగుండేదేమో కానీ ఇప్పటి ఆడియన్స్‌కు మాత్రం చాలా అవుట్‌డేటెడ్‌గా అనిపిస్తుంది. కథ కూడా తిరుపతికి వచ్చిన శ్రీను (జైకృష్ణ) మంగ (రషా తడానీ)ని ప్రేమించడం, ఆ తర్వాత వాళ్ల ప్రేమకి వచ్చిన అడ్డంకులు ఏంటి..? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా..? అనే రొటీన్ లైన్‌పైనే నడుస్తుంది. జైకృష్ణ మాత్రం తన వంతు ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల బాగానే నటించాడు కానీ ఇంకా యాక్టింగ్‌లో చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. సినిమాలో వరుసగా వచ్చే పాటలు మాత్రం విపరీతంగా బోర్ కొట్టిస్తాయి. ప్రేమకథలో కూడా ఎక్కడా ఎమోషన్ ఫీల్ అవ్వదు. హీరోయిన్ ఒకసారి ఇలా, ఇంకోసారి అలా ప్రవర్తించడం వల్ల వాళ్ల మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మోహన్ బాబు గారి పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు సినిమా గేర్ మారుతుందేమో అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికే మళ్లీ అదే రొటీన్ ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. మొత్తానికి నాకు అయితే ఈ సినిమా అస్సలు నచ్చలేదు గైస్. అయితే కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీతో కలిసి చూడాలనుకునేవాళ్లు ఒకసారి ట్రై చేయొచ్చు.

Aug 01, 2026 Telugu
ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన జైకృష్ణ నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. తిరుపతి, బళ్లారి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రేమ, కుటుంబ బంధాలు, యాక్షన్ అంశాలను కమర్షియల్ శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. కథ మొదట్లో హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథతో ముందుకు వెళ్లినా, ఇంటర్వెల్ తర్వాత కొన్ని కీలక మలుపులతో అసలు కథ బయటపడుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సంఘటనలు, కుటుంబ అనుబంధాల చుట్టూ తిరిగే ఎమ...

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన జైకృష్ణ నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. తిరుపతి, బళ్లారి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రేమ, కుటుంబ బంధాలు, యాక్షన్ అంశాలను కమర్షియల్ శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. కథ మొదట్లో హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథతో ముందుకు వెళ్లినా, ఇంటర్వెల్ తర్వాత కొన్ని కీలక మలుపులతో అసలు కథ బయటపడుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సంఘటనలు, కుటుంబ అనుబంధాల చుట్టూ తిరిగే ఎమోషన్స్ కథకు కొంత బలం చేకూరుస్తాయి. అయితే మొత్తం కథనం మాత్రం చాలా వరకు ముందే ఊహించగలిగేలా సాగుతుంది. దర్శకుడు అజయ్ భూపతి ఈసారి తన మార్క్‌కు భిన్నంగా పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్‌ను ఎంచుకోవడంతో కొత్తదనం పెద్దగా కనిపించదు. జైకృష్ణ తొలి సినిమాకే మంచి కష్టపడినట్లు ప్రతి సన్నివేశంలో తెలుస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్‌లలో తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. నటన పరంగా ఇంకా అనుభవం అవసరమైనా, భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు అందుకునే సామర్థ్యం కనిపిస్తుంది. రషా తడానీ తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. మోహన్ బాబు తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించినప్పటికీ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేకంగా నిలిచారు. బ్రహ్మాజీ, నరేష్ అక్కడక్కడా నవ్వులు పంచగా, మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిలో నటించారు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బలపరిచినా, పాటలు మాత్రం పెద్దగా గుర్తుండేలా లేవు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. మొత్తంగా ‘శ్రీనివాస మంగాపురం’ రొటీన్ కమర్షియల్ కథతో సాగినా, జైకృష్ణకు ఓ గౌరవప్రదమైన ఆరంగేట్రంగా నిలిచే యాక్షన్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.

Aug 01, 2026 Telugu
Why MRO?