Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

682
Total Reviews
56
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 373-384 of 682 reviews

Hey Balwanth movie Review

6.0
out of 10
" హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని థియేటర్ల ముందుకు వచ్చాడు. సినిమా పరంగా కథ బాగున్నా, స్క్రీన్ ప్లే అంత ఇంప్రెసివ్ గా ఉండదు. కానీ డైరెక్టర్ ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ నటీనటులు సుహాస్, శివాని నాగారం, నరేష్ సహా అందరూ మెప్పించారు. ఇక ఆడియన్స్ కి ఓ కొత్త తరహా కామెడీని ఎంజాయ్ చేయడానికి...

" హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని థియేటర్ల ముందుకు వచ్చాడు. సినిమా పరంగా కథ బాగున్నా, స్క్రీన్ ప్లే అంత ఇంప్రెసివ్ గా ఉండదు. కానీ డైరెక్టర్ ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ నటీనటులు సుహాస్, శివాని నాగారం, నరేష్ సహా అందరూ మెప్పించారు. ఇక ఆడియన్స్ కి ఓ కొత్త తరహా కామెడీని ఎంజాయ్ చేయడానికి పనికొచ్చే సినిమా ఈ హే బల్వంత్. ఇక ఫస్టాఫ్ వినోదానికి కొదవలేదు. సెకండాఫ్ లోనే కొంత భాగం కామెడీని మర్చిపోయి కుంటుపడింది. ఆ తర్వాత వేగం పుంజుకోవడం, ముగింపూ సినిమాని రక్షించాయి. దర్శకుడు గోపీ అచ్చర చేసిన ప్రయత్నం సుహాస్ కి ఎదురు చూస్తున్న విజయాన్ని అందించేలా వుంది. ప్రేక్షకులు ఓటీటీ కోసం వేచి ఉండకుండా థియేటర్ కెళ్ళి ఎంజాయ్ చేస్తే బావుంటుంది. అయితే ఫైనల్ రిసల్ట్ ఆడియన్స్ చేతుల్లోనే ఉంది.

Feb 27, 2026 Telugu

Hey Balwanth Movie Review

6.0
out of 10
కొన్ని ప్లాప్ మూవీస్ తర్వాత " హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. బట్ అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇక దర్శకుడు గోపి ఆచార స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. వివేక్‌ సాగర్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. అయితే పాటల పరంగా ఇంకొంత కేర్‌ తీసుకోవాల్సింది. అయితే దర్శకుడు కథలో మెయిన్ పాయింట్ ని దాన్ని ఆవిష్కరించిన తీరు బా...

కొన్ని ప్లాప్ మూవీస్ తర్వాత " హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. బట్ అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇక దర్శకుడు గోపి ఆచార స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. వివేక్‌ సాగర్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. అయితే పాటల పరంగా ఇంకొంత కేర్‌ తీసుకోవాల్సింది. అయితే దర్శకుడు కథలో మెయిన్ పాయింట్ ని దాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. ప్రొస్ట్రిట్యూషన్‌ అనే అంశాన్ని చాలా నీట్‌ గా, ఫన్నీగా, ఎమోషనల్‌గా డీల్‌ చేసిన తీరు మాత్రం సూపర్బ్. తండ్రికి సంబంధించిన ఎమోషన్స్, సెంటిమెంట్‌ ని కూడా చాలా బాగా చూపించాడు. డైలాగ్‌లు బాగున్నాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. బాగా రాసుకున్నారు, పర్‌ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించారు. కాకపోతే కొంత డ్రామా ఎక్కువ అయ్యిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. కొన్ని చోట్ల కామెడీ అంతగా పండలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్‌ చేశాడు. ఓవరాల్ గా 'హే బలవంత్' ఒక వర్గం ఆడియన్స్ ని అయితే మెప్పిస్తుందని చెప్పాలి.

Feb 27, 2026 Telugu

Hey Balwanth movie Review

5.0
out of 10
కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "హే బలవంత్" మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కథ బాగానే రాసుకున్నా, సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ ట్రాక్ / సీన్స్ లెంగ్త్ ఎక్కువైంది. కామెడీ నుంచి ఎమోషన్ వైపు కథ టర్న్ తీసుకున్న తీరు ఫోర్డ్స్‌గా కాకుండా ఆర్గానిక్‌గా ఉంటే బావుండేది. వినోదాన్ని, భావోద్వేగాన్ని సరిగా మిక్స్ చేయడంలో దర్...

కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "హే బలవంత్" మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కథ బాగానే రాసుకున్నా, సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ ట్రాక్ / సీన్స్ లెంగ్త్ ఎక్కువైంది. కామెడీ నుంచి ఎమోషన్ వైపు కథ టర్న్ తీసుకున్న తీరు ఫోర్డ్స్‌గా కాకుండా ఆర్గానిక్‌గా ఉంటే బావుండేది. వినోదాన్ని, భావోద్వేగాన్ని సరిగా మిక్స్ చేయడంలో దర్శకుడి తడబాటు కనిపించింది. కానీ చెప్పాలనుకున్న విషయం బావుంది. లాజిక్కులు పట్టుకుంటూ వెళితే చాలా కనిపిస్తాయి. కానీ కంటెంట్ పరంగా సినిమాలో లాజిక్స్ ఆలోచిస్తే చూడలేం. పైగా 'హే బల్‌వంత్' లో నవ్వులకు లోటు ఉండదు. కానీ, స్క్రీన్ మీద చూస్తే కిక్. సుదర్శన్ కామెడీ, ఆ బిజినెస్ చుట్టూ రాసుకున్న సీన్స్ వర్కవుట్ అయ్యాయి. సీనియర్ నరేష్ మరోసారి తన మార్క్ చూపించారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సుహాస్, శివానీ చక్కగా నటించారు. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు కాసేపు నవ్వుకునే సినిమా.

Feb 27, 2026 Telugu

Hey Balwanth movie Review

5.0
out of 10
సుహాస్ నటించిన "హే బలవంత్" సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో థియేటర్లకు ఆడియన్స్ ని రప్పించే సత్తా సినిమాకుంది. హీరోహీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం సహా నరేష్ కూడా ఇందులో అల్టిమేట్ పాత్ర పోషించారు. అయితే డైరెక్టర్ గోపి ఆచార కథనం విషయంలో తడబడ్డాడు. కథ స్క్రీన్ ప్లే కాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. వివేక్ సాగర్ అందించిన సాంగ్స్ పెద్ద...

సుహాస్ నటించిన "హే బలవంత్" సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో థియేటర్లకు ఆడియన్స్ ని రప్పించే సత్తా సినిమాకుంది. హీరోహీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం సహా నరేష్ కూడా ఇందులో అల్టిమేట్ పాత్ర పోషించారు. అయితే డైరెక్టర్ గోపి ఆచార కథనం విషయంలో తడబడ్డాడు. కథ స్క్రీన్ ప్లే కాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. వివేక్ సాగర్ అందించిన సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు కానీ బీజీఎమ్ విషయంలో మాత్రం న్యాయం చేశారు. ఓవరాల్‌గా సినిమా అయితే ఎక్కడా నిరాశపరచలేదు. కానీ హీరో తండ్రి ఇలాంటి కాలంలో కూడా సమాజం ఒప్పుకోలేని ఒక వ్యాపారాన్ని ఎందుకు కొనసాగించాడనే ప్రశ్న మాత్రం ఆడియన్స్‌లో మిగిలిపోతుంది. దీనికి డైరెక్టర్ ఆన్సర్ ఇచ్చారు కానీ ఆడియన్స్ దానికి పూర్తిగా కనిన్స్ కాలేకపోవచ్చు. కానీ క్లైమాక్స్‌లో నరేష్, అన్నపూర్ణ పాత్రలకి సంబంధించి ఇచ్చిన చిన్న ట్విస్ట్ మాత్రం బావుంది.

Feb 27, 2026 Telugu

Hey Balwanth movie Review

6.0
out of 10
'హే బలవంత్' మూవీ కంటెంట్ విషయానికి వస్తే... కథకుడు షణ్ముఖ ప్రశాంత్ రాసుకొన్న పాయింట్.. అందులో జొప్పించిన ట్విస్టులు, టర్నులు చాలా చక్కగా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. హే బలవంత్ సినిమాను బయటి నుంచి చూస్తే.. ఫన్, కామెడీ సినిమాగానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల భావోద్వేగాలు హృదయానికి హత్తుకొనేలా ఉంటాయి. వీకే నరేష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అత్యంత బలం. సుహాస్, శివానీ కూడ...

'హే బలవంత్' మూవీ కంటెంట్ విషయానికి వస్తే... కథకుడు షణ్ముఖ ప్రశాంత్ రాసుకొన్న పాయింట్.. అందులో జొప్పించిన ట్విస్టులు, టర్నులు చాలా చక్కగా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. హే బలవంత్ సినిమాను బయటి నుంచి చూస్తే.. ఫన్, కామెడీ సినిమాగానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల భావోద్వేగాలు హృదయానికి హత్తుకొనేలా ఉంటాయి. వీకే నరేష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అత్యంత బలం. సుహాస్, శివానీ కూడా మరోసారి మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్ అందించారు. రైటింగ్ పరంగా, టెక్నికల్‌గా ఈ సినిమా హైలీ అప్రిషియేబుల్. కన్విన్సింగ్, కమిటెడ్‌గా కథను తెరపైకి తెచ్చారు. డైరెక్టర్ గోపి, రైటర్స్ మిథున్, షణ్ముఖ కొత్తవారైనా ప్రతీ సీన్‌లో అరిపించేశారు. ఈ సినిమా ఆద్యంతం నవ్వులతో సాగే కామెడీ సినిమా మాత్రమే కాదు.. ఓ ఎమోషనల్ జర్నీ. 100 శాతం థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా తప్పకుండా.. సినిమా హాల్‌లోనే చూడండి.

Feb 27, 2026 Telugu
5.0
out of 10
టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ “హే బలవంత్’’ (Hey Balwanth). గోపి ఆచార డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివాని నాగారం హీరోయిన్ గా నటించింది. కామెడీ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుహాస్, సీనియర్ నరేశ్ నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓ...

టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ “హే బలవంత్’’ (Hey Balwanth). గోపి ఆచార డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివాని నాగారం హీరోయిన్ గా నటించింది. కామెడీ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుహాస్, సీనియర్ నరేశ్ నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని యూత్ ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.

Feb 27, 2026 Telugu

Cheekatilo Movie Review

5.0
out of 10
చీకటిలో (Cheekatilo) అనే టైటిల్‌కే తగ్గట్టుగా సినిమా పూర్తిగా డార్క్ టోన్‌లో సాగుతుంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక హేవీ మూడ్‌ను క్యారీ చేస్తుంది. డైరెక్టర్ Sharan Koppisetty ఈ సినిమాను కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా కంటెంట్ డ్రివెన్ స్టైల్‌లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి 20–30 నిమిషాలు క్యారెక్టర్స్ సెటప్, వాతావరణ నిర్మాణం మీదే ఫోకస్ ఉంటుంది. ఈ బిల్డ్-అప్ కొంతమందికి ఆసక్తికరంగా అనిపిస్తే, మరి...

చీకటిలో (Cheekatilo) అనే టైటిల్‌కే తగ్గట్టుగా సినిమా పూర్తిగా డార్క్ టోన్‌లో సాగుతుంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక హేవీ మూడ్‌ను క్యారీ చేస్తుంది. డైరెక్టర్ Sharan Koppisetty ఈ సినిమాను కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా కంటెంట్ డ్రివెన్ స్టైల్‌లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి 20–30 నిమిషాలు క్యారెక్టర్స్ సెటప్, వాతావరణ నిర్మాణం మీదే ఫోకస్ ఉంటుంది. ఈ బిల్డ్-అప్ కొంతమందికి ఆసక్తికరంగా అనిపిస్తే, మరికొంతమందికి స్లోగా అనిపించే అవకాశం ఉంది. సినిమా అసలు బలం మెయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఎమోషనల్ లేయర్స్. ఇక్కడ Sobhita Dhulipala పూర్తిగా సినిమాను మోస్తుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా కంట్రోల్డ్, అండర్‌ప్లే స్టైల్‌లో ఉంటుంది. ఓవర్ డ్రామా లేకుండా కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఆమె ప్లస్. కొన్ని సైలెంట్ సీన్స్‌లో డైలాగ్ కన్నా ఎక్స్‌ప్రెషన్ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. టెక్నికల్‌గా చూస్తే సినిమాటోగ్రఫీ హైలైట్. లో లైటింగ్, షాడో ఫ్రేమ్స్ కథకు సరిపోయే మూడ్ క్రియేట్ చేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సబ్టిల్‌గా ఉంటుంది కానీ స్క్రీన్‌ప్లే మరింత క్రిస్ప్‌గా ఉంటే థ్రిల్ ఫ్యాక్టర్ ఇంకాస్త పెరిగేది. క్లైమాక్స్ ఓకే — కానీ షాకింగ్ కాదు. మొత్తం మీద ఇది మాస్ థ్రిల్లర్ కాదు

Feb 18, 2026 Telugu

Cheekatilo Movie Review

Thyview

By Thyview

5.0
out of 10
చీకటిలో (Cheekatilo) అంటేనే డార్క్ టోన్, ఇంటెన్స్ మూడ్. అదే ఫీల్‌ని మొదటి సీన్ నుంచే సెట్ చేస్తాడు డైరెక్టర్ Sharan Koppisetty. సినిమా స్లో బర్న్ థ్రిల్లర్ స్టైల్‌లో సాగుతుంది. పెద్దగా హడావుడి లేకుండా కథ క్రమంగా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడే మైనస్ కూడా ఉంది — ఎవరైనా ఫాస్ట్ పేస్ థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం బోర్ ఫీలయ్యే ఛాన్స్ ఉంది. మెయిన్ లీడ్‌గా Sobhita Dhulipala పూర్తిగా సినిమాను తన భుజాల...

చీకటిలో (Cheekatilo) అంటేనే డార్క్ టోన్, ఇంటెన్స్ మూడ్. అదే ఫీల్‌ని మొదటి సీన్ నుంచే సెట్ చేస్తాడు డైరెక్టర్ Sharan Koppisetty. సినిమా స్లో బర్న్ థ్రిల్లర్ స్టైల్‌లో సాగుతుంది. పెద్దగా హడావుడి లేకుండా కథ క్రమంగా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడే మైనస్ కూడా ఉంది — ఎవరైనా ఫాస్ట్ పేస్ థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం బోర్ ఫీలయ్యే ఛాన్స్ ఉంది. మెయిన్ లీడ్‌గా Sobhita Dhulipala పూర్తిగా సినిమాను తన భుజాల మీద మోసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, కూల్ కానీ ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ బాగుంటాయి. కొన్ని సైలెంట్ సీన్స్‌లో ఆమె కళ్లే మాట్లాడతాయి. కానీ కథలో ఉన్న ట్విస్టులు చాలా మందికి ప్రిడిక్టబుల్‌గా అనిపించవచ్చు. టెక్నికల్‌గా మాత్రం సినిమా క్లాస్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా — స్టైలిష్ కానీ పూర్తిగా థ్రిల్ ఇవ్వని క్రైమ్ డ్రామా.

Feb 18, 2026 Telugu

Cheekatilo movie Review

Tupaki

By Tupaki

5.0
out of 10
అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన చీకటిలో మూవీ లో శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ లో నటించింది. కథంతా తన చుట్టూనే తిరిగే సినిమాలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. అమ్మాయి కావడం వల్ల అనేక ఆంక్షలతో పెరిగి.. అనేక సందర్భాల్లో నోరు కట్టేసుకుని.. తన వాయిస్ బలంగా వినిపించే అవకాశం వచ్చినపుడు విజృంభించే పాత్రకు శోభిత న్యాయం చేసింది. పాత్రకు తగ్గట్లు సింపుల్ లుక్స్.. సటిల్ యాక్టింగ్ తో శోభిత మెప్పించింది. ఆమెకు జోడీగా నటించ...

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన చీకటిలో మూవీ లో శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ లో నటించింది. కథంతా తన చుట్టూనే తిరిగే సినిమాలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. అమ్మాయి కావడం వల్ల అనేక ఆంక్షలతో పెరిగి.. అనేక సందర్భాల్లో నోరు కట్టేసుకుని.. తన వాయిస్ బలంగా వినిపించే అవకాశం వచ్చినపుడు విజృంభించే పాత్రకు శోభిత న్యాయం చేసింది. పాత్రకు తగ్గట్లు సింపుల్ లుక్స్.. సటిల్ యాక్టింగ్ తో శోభిత మెప్పించింది. ఆమెకు జోడీగా నటించిన విశ్వదేవ్ రాచకొండ జస్ట్ ఓకే అనిపించాడు. కృష్ణచైతన్య పోలీస్ పాత్రకు న్యాయం చేశాడు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన సీనయిర్ నటుడు సురేష్.. ఈషా చావ్లాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఏమీ లేదు. వాళ్ల పాత్రలు అంతగా ఇంపాక్ట్ వేయలేకపోయాయి. రవీంద్ర విజయ్ క్యారెక్టర్ కూడా అంతే. వడ్లమాని శ్రీనివాస్ బాగా చేశాడు. అయితే ఓవరాల్ గా యావరేజ్ కంటెంట్ గా చీకటిలో ఒకసారి ట్రై చేయొచ్చు.

Feb 18, 2026 Telugu

Cheekatilo Movie Review

5.0
out of 10
శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ గా నటించిన చీకటిలో సినిమా గురించి చెప్పాలంటే.. దర్శకుడు శరణ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఇంకా బెటర్‌గా కంటెంట్‌ను డిజైన్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పటి వరకు శోభితాను చూసిన విధానం వేరు.. ఈ సినిమాలో సంధ్య పాత్రలో ఆమె ఫుల్ మార్కులు కొట్టేసింది. సీనియర్ నటుడు సురేష్, రవీంద్ర విజయ్, ఆమని, ఝాన్సీ, చైతన్య లాంటి ఆర్టిస్టులు ఉన్నా కథలో వారి పాత్రలను బలంగా చూపించకలేకపోయారనిపి...

శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ గా నటించిన చీకటిలో సినిమా గురించి చెప్పాలంటే.. దర్శకుడు శరణ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఇంకా బెటర్‌గా కంటెంట్‌ను డిజైన్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పటి వరకు శోభితాను చూసిన విధానం వేరు.. ఈ సినిమాలో సంధ్య పాత్రలో ఆమె ఫుల్ మార్కులు కొట్టేసింది. సీనియర్ నటుడు సురేష్, రవీంద్ర విజయ్, ఆమని, ఝాన్సీ, చైతన్య లాంటి ఆర్టిస్టులు ఉన్నా కథలో వారి పాత్రలను బలంగా చూపించకలేకపోయారనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య నడిచే ట్విస్టు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఆ ఎపిసోడ్ కొంత మేరకు హైలెట్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా రెగ్యులర్ పాయింట్‌తో సాగే ఎమోషనల్ మర్డర్ మిస్టరీ అనే ఫీలింగ్ కలిగేలా చేస్తుంది.

Feb 18, 2026 Telugu

Cheekatilo Movie Review

5.0
out of 10
అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన 'చీకటిలో' మూవీలో శోభిత క్రైమ్ జర్నలిస్ట్ గా బాగానే చేసింది. సీఐ గా నటించిన చైతన్య కృష్ణ పాత్ర కాస్తంత బలమైంది. చాలా గ్యాప్ తర్వాత ఇషాచావ్లా మరోసారి కెమెరా ముందుకొచ్చింది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఆమె నటించింది. వడ్లమాని సాయి శ్రీనివాస్ పాత్ర ఇందులో భిన్నమైంది. నిజానికి ఈ సినిమాలో ప్రతిభగల నటీనటులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళను పూర్తి స్థాయిలో దర్శకుడు శరణ్‌...

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన 'చీకటిలో' మూవీలో శోభిత క్రైమ్ జర్నలిస్ట్ గా బాగానే చేసింది. సీఐ గా నటించిన చైతన్య కృష్ణ పాత్ర కాస్తంత బలమైంది. చాలా గ్యాప్ తర్వాత ఇషాచావ్లా మరోసారి కెమెరా ముందుకొచ్చింది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఆమె నటించింది. వడ్లమాని సాయి శ్రీనివాస్ పాత్ర ఇందులో భిన్నమైంది. నిజానికి ఈ సినిమాలో ప్రతిభగల నటీనటులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళను పూర్తి స్థాయిలో దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి ఉపయోగించుకోలేదు. శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం బాగుంది. సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. 'తప్పు చేసి చీకట్లో దాక్కునే ఏ మృగాన్ని వదల కూడదు, మన భయం వాళ్ళకి బలంగా మారకూడదు' అనే పాయింట్ మీద తీసిన 'చీకటిలో...' మూవీ క్రైమ్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం ఉంది. కాకపోతే భారీ అంచనాలు మాత్రం పెట్టుకోకూడదు.

Feb 18, 2026 Telugu

Cheekatilo Movie Review

5.0
out of 10
సినిమాల్లో, ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లలో సత్యం కోసం వెతికే జర్నలిస్ట్ అనేది ఫెమిలియర్ క్యారక్టెర్‌. OTT ప్లాట్‌ఫామ్‌లలో ట్రూ-క్రైమ్‌ జానర్‌ని బాగా ఎక్స్‌ప్లోర్‌ చేసేసిన సమయంలో ‘చీకటిలో’ సినిమా వచ్చింది. 126 నిమిషాల క్రిస్ప్‌ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా జానర్‌కి కొత్తగా ఏం యాడ్‌ చేయలేదు. తెలిసిన కథనే చెబుతున్నట్లు ఉంటుంది. చాలా సీన్స్‌ని ముందే ఊహించవచ్చు. మిస్టరీ థ్రిల్లర్ మూడ్‌, టెన్షన్‌, అట్మా...

సినిమాల్లో, ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లలో సత్యం కోసం వెతికే జర్నలిస్ట్ అనేది ఫెమిలియర్ క్యారక్టెర్‌. OTT ప్లాట్‌ఫామ్‌లలో ట్రూ-క్రైమ్‌ జానర్‌ని బాగా ఎక్స్‌ప్లోర్‌ చేసేసిన సమయంలో ‘చీకటిలో’ సినిమా వచ్చింది. 126 నిమిషాల క్రిస్ప్‌ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా జానర్‌కి కొత్తగా ఏం యాడ్‌ చేయలేదు. తెలిసిన కథనే చెబుతున్నట్లు ఉంటుంది. చాలా సీన్స్‌ని ముందే ఊహించవచ్చు. మిస్టరీ థ్రిల్లర్ మూడ్‌, టెన్షన్‌, అట్మాస్ఫియర్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇందులోని పాత్రలు, వరల్డ్‌ నేచురల్‌గా డెవలప్ అయి ఉంటే ఇంకా బాగుండేది. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలా సీన్స్‌ని ఎలివేట్‌ చేసింది. రైటింగ్‌ వీక్‌గా ఉన్న ప్రతి సీన్‌లో బలంగా పని చేసింది. అయితే కేవలం మ్యూజిక్‌ మాత్రమే సినిమాని కాపాడలేదు. శోభితా ధూళిపాల యాక్టింగ్‌, సోషల్లీ రిలవెంట్‌ ఐడియా పక్కనపెడితే ‘చీకటిలో’.. ఓ యావరేజ్‌ అనే ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

Feb 18, 2026 Telugu
Why MRO?