Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

201
Total Reviews
76
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: News Channel ×
Showing 25-36 of 201 reviews
Clear all filters

Ramba Oorvasi menaka movie review

Sakshi

By Sakshi

5.0
out of 10
ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథలతో మెప్పించిన అల్లరి నరేష్, మళ్లీ తనదైన మార్క్ సోషియో-ఫాంటసీ కామెడీతో ముందుకు వచ్చిన చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. దేవలోక నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో దర్శకుడు చంద్రమోహన్ 'సుడిగాడు' తరహా స్పూఫ్‌లు, హాస్యాన్ని జోడించి అలరించే ప్రయత్నం చేశారు. అల్లరి నరేష్ తనదైన ఈజీ మేనరిజమ్, కామెడీ టైమింగ్‌తో సినిమాను నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, స్క్రిప్ట్‌లో కొత్తదనం లేకపోవడ...

ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథలతో మెప్పించిన అల్లరి నరేష్, మళ్లీ తనదైన మార్క్ సోషియో-ఫాంటసీ కామెడీతో ముందుకు వచ్చిన చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. దేవలోక నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో దర్శకుడు చంద్రమోహన్ 'సుడిగాడు' తరహా స్పూఫ్‌లు, హాస్యాన్ని జోడించి అలరించే ప్రయత్నం చేశారు.


అల్లరి నరేష్ తనదైన ఈజీ మేనరిజమ్, కామెడీ టైమింగ్‌తో సినిమాను నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, స్క్రిప్ట్‌లో కొత్తదనం లేకపోవడం సినిమాకు పెద్ద మైలేజ్ ఇవ్వలేకపోయింది. గతంలో వచ్చిన అనేక ఫాంటసీ సినిమాల ఛాయలు స్పష్టంగా కనిపించడంతో పాటు, ద్వితీయార్థంలో సాగదీత సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి.


ప్రొడక్షన్ విలువలు, శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదనిపించినా, బలహీనమైన కథనం వల్ల సినిమా గ్రాఫ్ కిందకే పడిపోయింది. మొత్తంగా చెప్పాలంటే, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా కేవలం అల్లరి నరేష్ కామెడీ కోసం చూస్తే ఈ పాత ఫార్ములా చిత్రం ఒకసారి ట్రై చేయొచ్చు!

Sep 08, 2026 Telugu

Romanchakam movie review

Sakshi

By Sakshi

5.0
out of 10
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది. డేటింగ్ యాప్ నేపథ్యంలో మొదలయ్యే అన్వేష్, మైథిలి లవ్ స్టోరీకి ఫ్రెండ్స్ గ్యాంగ్ కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.సుమంత్ ప్రభాస్ చాలా నేచురల్‌గా నటించారు. కామెడీ సీన్స్‌లోనూ, సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్‌లోనూ మెప్పించారు. అనంతికతో అతని కెమిస్ట్రీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్...

సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది. డేటింగ్ యాప్ నేపథ్యంలో మొదలయ్యే అన్వేష్, మైథిలి లవ్ స్టోరీకి ఫ్రెండ్స్ గ్యాంగ్ కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

సుమంత్ ప్రభాస్ చాలా నేచురల్‌గా నటించారు. కామెడీ సీన్స్‌లోనూ, సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్‌లోనూ మెప్పించారు. అనంతికతో అతని కెమిస్ట్రీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్యాంగ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి.

అయితే కథలో కొత్తదనం కంటే స్క్రీన్‌ప్లే కొంత తడబడటం, కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించడం మైనస్. వాసుకి వైభవ్ సంగీతం, పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చాయి.

ఓవరాల్‌గా.. మంచి కామెడీ, యూత్‌ఫుల్ లవ్ ట్రాక్‌తో ‘రోమాంచకం’ వన్‌టైమ్ వాచ్‌గా ఓకే అనిపిస్తుంది

Sep 08, 2026 Telugu

I'M Game movie review

5.0
out of 10
దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్’ కాసినో, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ క్రైమ్ డ్రామా. దర్శకుడు నివాస్ ఎంచుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, కథనం అన్ని చోట్లా ఒకే స్థాయిలో ఆకట్టుకోదు.ఫస్టాఫ్‌లో దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం. క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఆటగాళ్ల జీవితాల్లో వచ్చే సమస్యలను ఆసక్తికరంగా చూపించారు. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపి...

దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్’ కాసినో, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ క్రైమ్ డ్రామా. దర్శకుడు నివాస్ ఎంచుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, కథనం అన్ని చోట్లా ఒకే స్థాయిలో ఆకట్టుకోదు.


ఫస్టాఫ్‌లో దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం. క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఆటగాళ్ల జీవితాల్లో వచ్చే సమస్యలను ఆసక్తికరంగా చూపించారు. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి.


సెకండాఫ్‌లో మిస్కిన్, ఆంటోని వర్గీస్ ఎంట్రీతో కథలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. కాయదు లోహర్ తన పాత్ర పరిధిలో ఆకట్టుకున్నారు.

యాక్షన్, స్పోర్ట్స్ కొరియోగ్రఫీ బాగున్నాయి. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జిమ్‌షి ఖాలీద్ సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చాయి.


ఓవరాల్‌గా.. డిఫరెంట్ కాన్సెప్ట్, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ, కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉంటే సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉండేది. వన్‌టైమ్ వాచ్‌గా ‘ఐ యామ్ గేమ్’ ఓకే అనిపిస్తుంది.

Sep 08, 2026 Telugu +1
7.0
out of 10
ఒక సినిమాను మనం టెక్నికల్ అంశాలు, బడ్జెట్, భారీతనం కంటే ప్రేక్షకుల మనసుకు హత్తుకునే భావోద్వేగాలే సినిమాను నిలబెడతాయని బెత్లేహెం కుడుంబ యూనిట్ సినిమాతో దర్శకుడు గిరీష్ ఏ.డి మరోసారి నిరూపించాడు. ప్రేమ అనేది అప్పటికప్పుడు పుట్టే ఆకర్షణలా కాకుండా, ఓ విత్తనం పడే రోజు నుంచి అది పువ్వులా మారేంత సున్నితంగా, సహజంగా చూపించిన విధానం కట్టిపడేస్తుంది. ప్రతి పాత్రకు ఒక లోతైన, బలమైన నేపథ్యం ఉంటుంది.ఇక ఈ మూవీలో ప...

ఒక సినిమాను మనం టెక్నికల్ అంశాలు, బడ్జెట్, భారీతనం కంటే ప్రేక్షకుల మనసుకు హత్తుకునే భావోద్వేగాలే సినిమాను నిలబెడతాయని బెత్లేహెం కుడుంబ యూనిట్ సినిమాతో దర్శకుడు గిరీష్ ఏ.డి మరోసారి నిరూపించాడు. ప్రేమ అనేది అప్పటికప్పుడు పుట్టే ఆకర్షణలా కాకుండా, ఓ విత్తనం పడే రోజు నుంచి అది పువ్వులా మారేంత సున్నితంగా, సహజంగా చూపించిన విధానం కట్టిపడేస్తుంది. ప్రతి పాత్రకు ఒక లోతైన, బలమైన నేపథ్యం ఉంటుంది.


ఇక ఈ మూవీలో ప్రపోజల్ సీన్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. కాలేజీ వార్షికోత్సవంలో జరిగే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. సంభాషణల్లోని పంచ్‌లు బాగా పేలాయి. అయితే అక్కడక్కడా కొన్ని మైనస్‌లు లేకపోలేదు. జోయెల్ ప్రియురాలి అన్నయ్య క్యారెక్టర్ కథలో అంతగా ఇమడలేదు. అలాగే వినయ్ ఫోర్ట్ చిన్న పాత్ర, పదే పదే వచ్చే మద్యపాన సన్నివేశాలు కాస్త శృతి మించినట్లు అనిపిస్తాయి. సింపుల్ అండ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే బెత్లెహెం కుటుంబ యూనిట్ బెస్ట్ ఛాయిస్..


ఓవరాల్‌గా బెత్లెహెం కుటుంబ యూనిట్.. సింపుల్ అండ్ బ్యూటీఫుల్..!


Sep 05, 2026 Telugu +1
6.0
out of 10
బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌ – షార్ట్‌ రివ్యూసింపుల్‌ కథ.. నేచురల్‌ లొకేషన్స్‌.. క్లీన్‌ కామెడీతో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌’. నివిన్‌ పౌలి, మమితా బైజు మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంగీత్‌ ప్రతాప్‌ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.ఎలాంటి అనవసర హడావిడి లేకుండా ఫన్‌, రొమాన్స్‌, చిన్నపాటి ఎమోషన్స్‌ను దర్శకుడు గిరీష్‌ చక్కగా బ్యాలెన్స్‌ చ...

బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌ – షార్ట్‌ రివ్యూ


సింపుల్‌ కథ.. నేచురల్‌ లొకేషన్స్‌.. క్లీన్‌ కామెడీతో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌’. నివిన్‌ పౌలి, మమితా బైజు మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంగీత్‌ ప్రతాప్‌ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.


ఎలాంటి అనవసర హడావిడి లేకుండా ఫన్‌, రొమాన్స్‌, చిన్నపాటి ఎమోషన్స్‌ను దర్శకుడు గిరీష్‌ చక్కగా బ్యాలెన్స్‌ చేశారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే, క్లీన్‌ కామెడీ సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌.


మొత్తంగా.. సింపుల్‌ లవ్‌స్టోరీతో హాయిగా నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ‘బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌’ మంచి ఎంటర్‌టైనర్‌.

Sep 05, 2026 Telugu +1
‘బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌’ : నివిన్‌ పౌలి, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వినోదంతో పాటు లైట్‌ ఎమోషన్స్‌ను మేళవిస్తూ ఆకట్టుకుంటుంది. దర్శకుడు గిరీష్‌ కథను చాలా సింపుల్‌ గా ఉంచి, కామెడీ, రొమాన్స్‌, ఎమోషనల్‌ మూమెంట్స్‌ను సహజంగా కథలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే సినిమాకు ప్రధాన బలం. అనవసరమైన సన్నివేశాలు, ఓవర్‌ ది టాప్‌ కామెడీకి వెళ్లకుండా.. కథకు అవసరమైనంత మేరకే ఎంటర్‌టైన్‌మ...

‘బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌’ : నివిన్‌ పౌలి, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వినోదంతో పాటు లైట్‌ ఎమోషన్స్‌ను మేళవిస్తూ ఆకట్టుకుంటుంది. దర్శకుడు గిరీష్‌ కథను చాలా సింపుల్‌ గా ఉంచి, కామెడీ, రొమాన్స్‌, ఎమోషనల్‌ మూమెంట్స్‌ను సహజంగా కథలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే సినిమాకు ప్రధాన బలం. అనవసరమైన సన్నివేశాలు, ఓవర్‌ ది టాప్‌ కామెడీకి వెళ్లకుండా.. కథకు అవసరమైనంత మేరకే ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు.


నివిన్‌ పౌలి, మమితా బైజు మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఇద్దరూ తమ పాత్రలను సహజంగా పోషించి సినిమాకు మంచి ఫీల్‌ను తీసుకొచ్చారు. సంగీత్‌ ప్రతాప్‌ తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకుంటాడు. సహజమైన లొకేషన్స్‌, సింపుల్‌ మేకింగ్‌ సినిమాకు ఫ్రెష్‌ లుక్‌ను అందించాయి.


మొత్తంగా.. బలమైన కథ కంటే సహజమైన కథనం, మంచి కెమిస్ట్రీ, క్లీన్‌ కామెడీపై ఆధారపడిన లైట్‌ హార్ట్‌డ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌’. పెద్దగా అంచనాలు లేకుండా హాయిగా ఎంజాయ్‌ చేయాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఎంపిక. చివరిగా బెత్లేహెం కుడుంబ యూనిట్ ఒక చిల్, టైం పాస్ ఎంటర్టైనర్. ఫన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్... 


Sep 05, 2026 Telugu +1

Kiku Chiranjeevi movie review

6.0
out of 10
కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘కికు చిరంజీవి’. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మాణంలో శుభ సాయి వెంకట్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా రాఘవ.. పలువురు కీలక పాత్రలు పోషించారు. కికు చిరంజీవి సినిమా నేడు ఆగస్టు 28న థియేటర్స్ లోకి వచ్చింది.అయితే గుండె కుడివైపు ఉండటం అనే కాన్సెప్ట్ తో గతంలో కొన్...

కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘కికు చిరంజీవి’. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మాణంలో శుభ సాయి వెంకట్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా రాఘవ.. పలువురు కీలక పాత్రలు పోషించారు. కికు చిరంజీవి సినిమా నేడు ఆగస్టు 28న థియేటర్స్ లోకి వచ్చింది.


అయితే గుండె కుడివైపు ఉండటం అనే కాన్సెప్ట్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. పాయింట్ రేర్ గా వచ్చేదే అయినా కథనం బాగానే రాసుకున్నారు. చిరంజీవి అంటే మరణం లేనివారు అని అర్ధం. దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సీన్స్ బాగానే జస్టిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయొచ్చు. హీరో – హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ అంతగా పండలేదు. లవ్ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ని అక్కడక్కడా సాగదీశారు. కొత్త పాయింట్ తీసుకున్నా రెగ్యులర్ కథనంతో కాస్త థ్రిల్లింగ్ గా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా ‘కికు చిరంజీవి’ హీరోకి గుండె కుడివైపు పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించిన సినిమా. 


Aug 31, 2026 Telugu

Kiku Chiranjeevi movie review

Sakshi

By Sakshi

5.0
out of 10
‘కికు చిరంజీవి’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. గుండె కుడివైపున ఉండటం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాన్ని దర్శకుడు శుభ సాయి వెంకట్ తెరకెక్కించిన విధానం అక్కడక్కడా స్లోగా అనిపిస్తుంది. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను కలిపి కథను నడిపించే ప్రయత్నం చేశారు. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నా, అన్ని సీన్లు ఒకే స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వవు. ఫస్టాఫ్ ఓ మోస్తరుగా సాగితే, సెక...

‘కికు చిరంజీవి’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. గుండె కుడివైపున ఉండటం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాన్ని దర్శకుడు శుభ సాయి వెంకట్ తెరకెక్కించిన విధానం అక్కడక్కడా స్లోగా అనిపిస్తుంది. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను కలిపి కథను నడిపించే ప్రయత్నం చేశారు. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నా, అన్ని సీన్లు ఒకే స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వవు. ఫస్టాఫ్ ఓ మోస్తరుగా సాగితే, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.


క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ టచ్ సినిమాకు కొంత ప్లస్‌గా నిలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా ‘కికు చిరంజీవి’ ఒక డిఫరెంట్ ప్రయత్నం. కాన్సెప్ట్, థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారికి సినిమా ఓసారి ట్రై చేయొచ్చు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించే స్థాయిలో మాత్రం సినిమా లేదనే చెప్పాలి.


Aug 31, 2026 Telugu

Kiku Chiranjeevi Movie Review

5.0
out of 10
‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న థ్రిల్లర్!టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో తెరకెక్కిన చిత్రం ‘కికు చిరంజీవి’. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లింగ్ ట్విస్టులను కలిపి దర్శకుడు శుభ సాయి వెంకట్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపున ఉండటం అనే కాన్సెప...


‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న థ్రిల్లర్!


టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో తెరకెక్కిన చిత్రం ‘కికు చిరంజీవి’. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లింగ్ ట్విస్టులను కలిపి దర్శకుడు శుభ సాయి వెంకట్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపున ఉండటం అనే కాన్సెప్ట్. ఈ కొత్త పాయింట్ చుట్టూ దర్శకుడు రాసుకున్న పాత్రలు, కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి.


కథలో వచ్చే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాను రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కు భిన్నంగా నిలబెడతాయి. ముఖ్యంగా కథనం ముందుకు సాగే కొద్దీ వచ్చే మలుపులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఓవరాల్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను ఇష్టపడే వారికి ‘కికు చిరంజీవి’ మంచి ఆప్షన్. ఈ వారం థియేటర్‌లో తప్పక చూడాల్సిన సినిమాల జాబితాలో దీన్ని చేర్చుకోవచ్చు.


ఫైనల్లీ కొన్ని తడబాట్లు ఉన్నా, థ్రిల్లర్ లవర్స్ కి కికు చిరంజీవి నచ్చోచ్చు. 

Aug 31, 2026 Telugu

Toxic movie review

5.0
out of 10
టాక్సిక్ సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ అంతా కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కాకుండా అందులో ఒక అర్థం, బాధ ఉండేలా జాగ్రత్త పడ్డారు. క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఒక దారిలో వెళ్తుందని ఊహించిన కథకు, పూర్తి భిన్నంగా మరో ముగింపు ఇస్తూ దర్శకురాలు మాయ చేశారు. థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా సినిమా గురించే ఆలోచించేలా కథ...

టాక్సిక్ సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ అంతా కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కాకుండా అందులో ఒక అర్థం, బాధ ఉండేలా జాగ్రత్త పడ్డారు. క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఒక దారిలో వెళ్తుందని ఊహించిన కథకు, పూర్తి భిన్నంగా మరో ముగింపు ఇస్తూ దర్శకురాలు మాయ చేశారు. థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా సినిమా గురించే ఆలోచించేలా కథను నడిపించారు. ప్రతి విషయాన్ని తెరపై నేరుగా చెప్పకుండా, ప్రేక్షకులే అర్థం చేసుకునేలా చాలా అద్భుతంగా చిత్రాన్ని మలిచారు.


దర్శకురాలి ఆలోచనా విధానం చాలా ఉన్నతంగా ఉంది. ఒక పెద్ద ఎక్స్పరిమెంట్ చేస్తూనే.. అభిమానులు కోరుకునే మాస్ అంశాలను ఎక్కడా తగ్గించలేదు. నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను చాలా భారీగా నిర్మించారు. భారీ సెట్టింగులు, యాక్షన్ సీక్వెన్స్, కెమెరా పనితనం తెరమీద బాగా కనిపిస్తాయి. ఓవరాల్ గా టాక్సిక్.. స్లో పేస్డ్ యాక్షన్ డ్రామాగా డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా యష్ ఫ్యాన్స్ ని అయితే మెప్పించేలానే ఉంది. 

Aug 27, 2026 Hindi +5

Toxic Movie Review

7.0
out of 10
కెజిఎఫ్ తర్వాత సినిమా కావడం, టీజర్, గ్లింప్స్, ట్రైలర్స్ లో అడల్ట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా థియేటర్లలో విడుదలైంది. సినిమాలో అసలు డ్రగ్స్ మాఫియా డాన్ సెల్వడర్ తో చేతులు మొదలు పెట్టి బిజినెస్ చేస్తున్న దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారినా రొటీన్ డ్రగ్స్ బిజినెస్, గ్యాంగ్ స్టర్ గొడవలు, సెల్వడర్ కూతురుతో రొమాన్స్, తాగడం, ఫైట్స్ తోనే సరిపోతుం...

కెజిఎఫ్ తర్వాత సినిమా కావడం, టీజర్, గ్లింప్స్, ట్రైలర్స్ లో అడల్ట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా థియేటర్లలో విడుదలైంది. సినిమాలో అసలు డ్రగ్స్ మాఫియా డాన్ సెల్వడర్ తో చేతులు మొదలు పెట్టి బిజినెస్ చేస్తున్న దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారినా రొటీన్ డ్రగ్స్ బిజినెస్, గ్యాంగ్ స్టర్ గొడవలు, సెల్వడర్ కూతురుతో రొమాన్స్, తాగడం, ఫైట్స్ తోనే సరిపోతుంది. కియారా ఎంట్రీ నుంచి కథ ఆసక్తిగా మారడం అక్కడో చిన్న ట్విస్ట్. ఇక సెకండ్ హాఫ్ ఊహించిన సీన్ తోనే మొదలయి మళ్ళీ రాయ ఇంకా ఎదిగినట్టు రొటీన్ తాగుడు, అమ్మాయిలు, కాసినో, యాక్షన్ సీక్వెన్స్ లతో బాగా సాగదీశారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్. అసలు ఆ ట్విస్ట్ మాత్రం ఊహించము.


హాలీవుడ్ స్టైల్ లో ఎమోషన్స్ పండిద్దాం, కొత్తగా విజువల్స్ చూపిద్దాం అనుకున్నా ఆ ఎమోషనల్ సీన్స్ ఏవి కూడా పండలేదు. రొటీన్ స్టోరీ, కెజిఎఫ్ తర్వాత చాలా సినిమాల్లో వచ్చిన రొటీన్ యాక్షన్ సీక్వెన్స్, నరుక్కోవడం,కాల్చడం, పేల్చడం.. ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. ఇక తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ గూగుల్ ట్రాన్స్ లేషన్ చేసినట్టు అచ్చ తెలుగు పాత పదాలతో ఉన్నాయి. ఫైనల్ గా యశ్ ఎంత కష్టపడ్డా సరైన కథ, స్క్రీన్ ప్లే లేకపోతే అది వృధానే అవుతుంది. ఓవరాల్ గా యాక్షన్ అడల్ట్ సినిమా కాస్త ఒక్కసారిగా సైకాలజీ సినిమాగా మారిపోతుంది. పిల్లలతో, పేరెంట్స్ తో అయితే వెళ్లడం కష్టమే. ఎలాగో A సర్టిఫికెట్ సినిమా కాబట్టి పిల్లని రానివ్వరు. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు, దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించడం అనే కాన్సెప్ట్ తో ఈ కథ రాసుకున్నట్టు సినిమా అంతా అయ్యాక అర్ధమవుతుంది.

Aug 27, 2026 Hindi +5

Toxic movie review

Sakshi

By Sakshi

5.0
out of 10
భారీ అంచనాలతో వచ్చిన టాక్సిక్ ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యష్ తెరపై కనిపించిన ప్రతిసారీ మాస్ ఫీల్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌లో కథనం నెమ్మదించి, కొన్ని సన్నివేశాలు అసలు ఎందుకు పెట్టారో అనిపిస్తాయి. యష్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా, బలమైన కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌...

భారీ అంచనాలతో వచ్చిన టాక్సిక్ ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యష్ తెరపై కనిపించిన ప్రతిసారీ మాస్ ఫీల్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌లో కథనం నెమ్మదించి, కొన్ని సన్నివేశాలు అసలు ఎందుకు పెట్టారో అనిపిస్తాయి. యష్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా, బలమైన కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే లోపం స్పష్టంగా కనిపిస్తుంది.


అయితే అసలు యష్ లాంటి స్టార్‌కు మరింత పటిష్టమైన కథ ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. మొత్తంగా, టాక్సిక్ చెత్త సినిమా కాదు.. కానీ వచ్చిన హైప్, యష్‌పై ఉన్న అంచనాలకు మాత్రం న్యాయం చేయలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, అర్థం పర్థం లేని వృథా ప్రయాసతో కూడిన వ్యర్థ చిత్రం. సినిమా చూసాక చాలామంది అసలు సినిమాలో ఏముంది, అసలు ఎం చెప్పారు, ఎం అర్ధమైంది అని తేలిక ఆలోచిస్తూ బైటికొస్తారు. ఒక్క సీన్ గురించి కూడా మాట్లాడుకునేట్టు అనిపించదు. 

Aug 27, 2026 Hindi +5
Why MRO?