జైలర్ 2 (Jailer 2)
Jailer 2 : ముత్తువేళ్ పాండియన్ అగైన్ రిపోర్టింగ్.. ఈసారి డబుల్ బొనాంజా.. త్వరలోనే వచ్చేస్తున్నాడు..
About This Movie
రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడేళ్ళ కిందట సైలెంట్ గా వచ్చి ఏకంగా తమిళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి 600 కోట్లు కొల్ల గొట్టింది. ఇక దాదాపు మూడేళ్ళ తర్వాత ఇప్పుడు నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ కి సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కగా, తాజాగా దాని ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇక సోషల్ మీడియాలో జైలర్ 2 ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుండగా, ట్రైలర్ తో హైప్ ని అమాంతం పెంచేసింది.
ఇక ట్రైలర్ ని గమనిస్తే... ముత్తువేల్ పాండియన్ గా ఫస్ట్ పార్ట్ లో కనిపించిన రజిని అందులో బడా గ్యాంగ్ స్టర్ అయిన వర్మన్ ని చంపేస్తాడు. అయితే ఈ సెకండ్ పార్ట్ లో పాండియన్ ని ఎలాగైనా పట్టుకోవాలని, వర్మన్ సన్నిహిత గ్యాంగ్ స్టర్లు వెతుకుతుంటారు. ఇటు ముట్టువేల్ పాండియన్ క్యాబ్ డ్రైవర్ గా అజ్ఞాతంలో గడుపుతుంటాడు. అలాగే ముత్తువేల్ పాండియన్ తన శత్రువులను ఎదుర్కోవడం కోసం మరో సీక్రెట్ మిషన్ లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక జైలర్ సినిమాను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సీక్వెల్ ని మరింత స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నట్టు విజువల్స్ చూస్తేనే తెలుస్తుంది.
ఇక ఈ సీక్వెల్ లో కూడా ఫస్ట్ పార్ట్ లో కనిపించిన సూపర్ స్టార్స్ శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఇందులో కూడా అప్పీరెన్స్ ఇవ్వనుండగా, వీళ్ళతో పాటు హృతిక్ రోషన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ఎస్.జె.సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజారమూడు, మిర్నా, రమ్యకృష్ణన్, మిథున్ చక్రవర్తి, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, అక్టోబర్ 15న సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ జైలర్ 2 సినిమాతో తమిళ సినిమా తొలి వెయ్యి కోట్ల సినిమా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.