Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1479
Total Reviews
99
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 289-300 of 1479 reviews
6.0
out of 10
Venky Atluri has delivered two successful films with non-Telugu stars, His third film also with a non-Telugu star, Vishwanath and Sons, features Suriya in the lead. coming to the vishwanath and sons movie reviews in single words... HighlightsSuriya’s charismaEntertaining first halfMamitha Baiju’s comic scenesDrawbacksOld-school melodrama in the second halfLack of good songsOoty portionsLength...

Venky Atluri has delivered two successful films with non-Telugu stars, His third film also with a non-Telugu star, Vishwanath and Sons, features Suriya in the lead. coming to the vishwanath and sons movie reviews in single words... 


Highlights

Suriya’s charisma

Entertaining first half

Mamitha Baiju’s comic scenes


Drawbacks

Old-school melodrama in the second half

Lack of good songs

Ooty portions

Lengthy runtime


Overall, Vishwanath and Sons has its moments, particularly in the first half. The driver episode, the fun moments involving Suriya’s family and Mamitha Baiju, and the performances of the lead actors work well. However, the lengthy runtime, formulaic scenes and uneven second half prevent it from becoming a completely engaging family drama. Nevertheless, Vishwanath and Sons makes for a decent watch.


Aug 17, 2026 Tamil +1
6.0
out of 10
డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ కొత్త కోణంలో విశ్వనాధ్ అండ్ సన్స్ ఫ్యామిలీ డ్రామాను రూపొందించారు. సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా, వినోదాత్మకంగా సాగిపోతుంది. సూర్య-మమితా బైజుల మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, రాధిక మార్క్ కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చిన్నారి ఎంట్రీతో డైలాగ్స్ మరింత జీవాన్ని తెస్తాయి. ఇక సెకండాఫ్ లో కథ కాస్త వేగం తగ్గి తీవ్రమైన భావోద్వేగాల వైపు సాగుతుంది. ఫస్టాఫ్ లో ఉన...

డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ కొత్త కోణంలో విశ్వనాధ్ అండ్ సన్స్ ఫ్యామిలీ డ్రామాను రూపొందించారు. సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా, వినోదాత్మకంగా సాగిపోతుంది. సూర్య-మమితా బైజుల మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, రాధిక మార్క్ కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చిన్నారి ఎంట్రీతో డైలాగ్స్ మరింత జీవాన్ని తెస్తాయి. ఇక సెకండాఫ్ లో కథ కాస్త వేగం తగ్గి తీవ్రమైన భావోద్వేగాల వైపు సాగుతుంది. ఫస్టాఫ్ లో ఉన్న కామెడీ లోపించడంతో పాటు స్టోరీ కొంతవరకు అంచనా వేసేలా మారుతుంది. 


అలాగే సినిమాలో వయస్సు వ్యత్యాసం, సరోగసీ వంటి అంశాలను సంక్లిష్టం చేయకుండా చూపించడంలో డైరెక్టర్ విజయం సాధించారు. రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి సామాజిక సందేశాలను చక్కగా జోడించారు. సూర్య, మామితా బైజు అల్టిమేట్ పెర్ఫార్మన్స్ కి తోడు వెంకీ అట్లూరి డైరెక్షన్, జివి ప్రకాష్ మ్యూజిక్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా 'విశ్వనాథ్ అండ్ సన్స్' కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. బంధాలు, అనుబంధాల ప్రాధాన్యతను చాటిచెప్పే మంచి ప్రయత్నం.


Aug 17, 2026 Tamil +1
7.0
out of 10
సూర్య–మామిత విశ్వనాధ్ అండ్ సన్స్ టీజర్‌ లో ఇద్దరూ లవర్స్‌ గా కనిపించడంతో అసలు కథ ఇదేనా అంటూ ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. స్టార్ హీరోతో ఇలాంటి ఏజ్-గ్యాప్ లవ్ స్టోరీని ఎంచుకోవడం వెంకీ అట్లూరి చేసిన డిఫరెంట్ అటెంప్ట్. అయితే కొత్త పాయింట్ ఉన్నప్పటికీ సినిమా పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వదు. రెగ్యులర్ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఫీల్ గుడ్ టచ్‌తో చెప్పాడు వెంకీ. ఎమోషనల్ డైలాగ్స్, ఫన్నీ మూమెంట్స్, సూర్య–...

సూర్య–మామిత విశ్వనాధ్ అండ్ సన్స్ టీజర్‌ లో ఇద్దరూ లవర్స్‌ గా కనిపించడంతో అసలు కథ ఇదేనా అంటూ ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. స్టార్ హీరోతో ఇలాంటి ఏజ్-గ్యాప్ లవ్ స్టోరీని ఎంచుకోవడం వెంకీ అట్లూరి చేసిన డిఫరెంట్ అటెంప్ట్. అయితే కొత్త పాయింట్ ఉన్నప్పటికీ సినిమా పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వదు. రెగ్యులర్ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఫీల్ గుడ్ టచ్‌తో చెప్పాడు వెంకీ. ఎమోషనల్ డైలాగ్స్, ఫన్నీ మూమెంట్స్, సూర్య–మామిత కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.


ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త వీక్‌గా అనిపించినా.. 2.5 గంటలకు పైగా ఉన్న రన్‌టైమ్‌లోనూ కథనాన్ని ఎంగేజింగ్‌గా నడిపించడం ప్లస్ పాయింట్. మొత్తంగా కొత్త కాన్సెప్ట్ కంటే వెంకీ అట్లూరి ట్రీట్‌మెంట్, ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఈ సినిమాకు అసలు బలం. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను క్రిస్పీగా కట్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్. 

Aug 17, 2026 Tamil +1
సూర్య ఫ్యామిలీ చిత్రాలు చేసి చాలా కాలం అవుతుంది. వెంకీ అట్లూరి ఇలాంటి మంచి క్లీన్‌ ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆయుధంగా మలుచుకుని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు, హిట్‌ కొడుతున్నారు. ఇప్పుడు `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` కూడా అలాంటిదే. సంజయ్‌ విశ్వనాథ్‌ పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. యాప్ట్ గా నిలిచాడు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరెవ్వరినీ చూడలేం అనేంత బాగా నటించి మ...

సూర్య ఫ్యామిలీ చిత్రాలు చేసి చాలా కాలం అవుతుంది. వెంకీ అట్లూరి ఇలాంటి మంచి క్లీన్‌ ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆయుధంగా మలుచుకుని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు, హిట్‌ కొడుతున్నారు. ఇప్పుడు `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` కూడా అలాంటిదే. సంజయ్‌ విశ్వనాథ్‌ పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. యాప్ట్ గా నిలిచాడు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరెవ్వరినీ చూడలేం అనేంత బాగా నటించి మెప్పించాడు. ఇక మ్యాడీ పాత్రలో మమితా బైజు ఇరగదీసింది. ఆద్యంతం నవ్విస్తూనే గుండెని బరువెక్కించింది. 


దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న కథ బాగుంది. స్క్రీన్‌ ప్లే సినిమాకి ప్రాణమని చెప్పొచ్చు. డైలాగ్‌లు కూడా అంతే బాగున్నాయి. టైట్‌గా రాసుకున్నారు. కొంత స్లో, రొటీన్‌ సీన్లు, ఊహించే సన్నివేశాలు మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే ఫ్యామిలీకి కావాల్సిన అంశాలు జోడించాడు. కుటుంబ విలువలు, ఇంట్లో ఉండే ఈగోలు, ఫన్‌, యాక్షన్‌ మేళవింపుగా రూపొందించారు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. ఫైనల్‌ గా ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌ లా సాగే క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ విశ్వనాథ్‌ అండ్‌ సన్స్.


Aug 17, 2026 Tamil +1
7.0
out of 10
సూర్యకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు కారణం ఆయన చేసిన సినిమాలు. గజినీ నుంచి వీరభద్రుడు వరకు... తెలుగులో సూపర్ హిట్ అయిన సూర్య సినిమాలు చూస్తే, కంటెంట్ బేస్డ్ కథలు ఎక్కువ. ప్రయోగాత్మక సినిమాలు ఉన్నాయి. కొత్త తరహా కథలతో సినిమాలు చేసి సూర్య విజయాలు అందుకున్నారు. ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా అనేసరికి ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సారి సార్, లక్కీ భాస్కర్ తరహాలో కాకుండా...

సూర్యకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు కారణం ఆయన చేసిన సినిమాలు. గజినీ నుంచి వీరభద్రుడు వరకు... తెలుగులో సూపర్ హిట్ అయిన సూర్య సినిమాలు చూస్తే, కంటెంట్ బేస్డ్ కథలు ఎక్కువ. ప్రయోగాత్మక సినిమాలు ఉన్నాయి. కొత్త తరహా కథలతో సినిమాలు చేసి సూర్య విజయాలు అందుకున్నారు. ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా అనేసరికి ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సారి సార్, లక్కీ భాస్కర్ తరహాలో కాకుండా దర్శకుడు వెంకీ అట్లూరి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీశారు.


విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో వెంకీ అట్లూరి మరీ కొత్త కథను చెప్పలేదు. సెంటిమెంట్, ఫామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్లలో ఉండే కథ రెడీ చేశారు అంతే. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రారంభం నుంచి దర్శకుడిగా కంటే రచయితగా వెంకీ అట్లూరి ప్రేక్షకులను కట్టి పడేశారు. ఫ్యామిలీ సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. టెక్నికల్ పరంగా కూడా విశ్వనాథ్ అండ్ సన్స్ ఉన్నత స్థాయిలో ఉంది. సినిమాలో ఫ్రేమ్ కలర్ ఫుల్ గా, వైబ్రెంట్ గా ఉండేలా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ అన్నీ బావున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సాంగ్స్ తో పాటు బీజీఎమ్ సినిమాకు ఎక్కువ వేల్యూ యాడ్ చేసింది. 


ఫైనల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్... మంచి ఎంటర్టైనర్. వర్షాకాలంలో వీచే చల్లటి గాలి లాంటిది. సూర్య, మమితా బైజు నటనకు తోడు వెంకీ అట్లూరి డైలాగ్స్ & సన్నివేశాల్లో వినోదం, భావోద్వేగాలు మంచి అనుభూతి ఇస్తాయి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే చిత్రమిది. డోంట్ మిస్ ఇట్.

Aug 17, 2026 Tamil +1
6.0
out of 10
ఇలాంటి కథలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చినా... ఈ విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా బోర్ కొట్టదు. కొత్త కథ కాదు గాని, ఈ కథను నడిపిన తీరు, నటీనటుల నటన కారణంగా ఇది ఎంగేజింగ్ మూవీ అయిపోయింది. సినిమాలో సంజయ్‌ బాల్యం నుండి క్రీడాకారుడిగా, బిజినెస్ మెన్ గా అతను ఎదిగిన తీరు, వివాహ బంధానికి ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉండటం, అందుకు చూపించిన కారణాలు... ఇవన్నీ ఆడియెన్స్ ను ఇంప్రస్ చే...

ఇలాంటి కథలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చినా... ఈ విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా బోర్ కొట్టదు. కొత్త కథ కాదు గాని, ఈ కథను నడిపిన తీరు, నటీనటుల నటన కారణంగా ఇది ఎంగేజింగ్ మూవీ అయిపోయింది. సినిమాలో సంజయ్‌ బాల్యం నుండి క్రీడాకారుడిగా, బిజినెస్ మెన్ గా అతను ఎదిగిన తీరు, వివాహ బంధానికి ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉండటం, అందుకు చూపించిన కారణాలు... ఇవన్నీ ఆడియెన్స్ ను ఇంప్రస్ చేసేలా ఉన్నాయి. 


ఆ తర్వాత సరొగసీ ద్వారా బిడ్డను ఇంటికి తీసుకు రావడం, ఆ తర్వాత కుటుంబంలో జరిగే పరిణామాలు, వాటిని అతను మ్యాడీ సాయంతో అధిగమించడం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఇక పైకి ప్రాక్టికల్ పర్సన్ గా కనిపించినా, సంజయ్ మనసు లోతుల్లోని మెత్తదనాన్ని దర్శకుడు చక్కగా ఆవిష్కరించాడు. సూర్య పాత్రకు పూర్తి కాంట్రాస్ట్ గా మ్యాడీ పాత్రను తీర్చిదిద్దడం కొత్త రంగును యాడ్ చేసినట్టు అయ్యింది. రాధిక, రవీనా టాండన్ పాత్రలు హుందాగా బాగున్నాయి. ఇక సూర్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎలివేషన్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ను అవసరం లేకపోయినా మిక్స్ చేశాడు. ఫైనల్ గా కథ, కథనాలలో కొత్తదనం లేకపోయినా... హాయిగా దీన్ని ఆస్వాదించే ఆస్కారం ఏర్పడిందనుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో ఈ మాత్రం ఎంగేజ్ చేసే మూవీ ఏదీ రాలేదనే చెప్పాలి. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్' ఫస్ట్ ఛాయిస్‌గా నిలువనుంది.


Aug 17, 2026 Tamil +1
7.0
out of 10
ఒలంపిక్‌లో షూటింగ్‌‌ లో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా దర్శకుడు వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్ కథను హై నోట్‌లో స్టార్ట్ చేశాడు. ఒక్కసారి కథ టేకాఫ్ అందుకొన్న తర్వాత ఏ ఒక్క క్షణంలో కూడా ల్యాండింగ్ అయ్యే ఛాన్సే రాకుండా సినిమాను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఫస్టాఫ్‌లో పూర్తిగా వినోదం, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసి, సంజయ్‌కి మ్యాడీ ఇచ్చిన చిన్న స్ట్రోక్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని క్రియేట్ చేయడంలో దర్శకుడ...

ఒలంపిక్‌లో షూటింగ్‌‌ లో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా దర్శకుడు వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్ కథను హై నోట్‌లో స్టార్ట్ చేశాడు. ఒక్కసారి కథ టేకాఫ్ అందుకొన్న తర్వాత ఏ ఒక్క క్షణంలో కూడా ల్యాండింగ్ అయ్యే ఛాన్సే రాకుండా సినిమాను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఫస్టాఫ్‌లో పూర్తిగా వినోదం, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసి, సంజయ్‌కి మ్యాడీ ఇచ్చిన చిన్న స్ట్రోక్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో పూర్తిగా ఎమోషనల్‌ కంటెంట్‌ ను నమ్ముకొన్నాడు. భావోద్వేగంతో కూడిన ఎమోషనల్ సీన్లను ఒక్కొక్కటిగా పేర్చుకొంటూ పోయాడు. 


రాధిక, రవీనా, మమితా బైజు, సూర్య, నాజర్ ఇలా అందరూ పీక్‌ రేంజ్ పెర్ఫార్మెన్స్‌తో కేక పెట్టించారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు నడిపించిన ఫ్యామిలీ డ్రామా ఉద్వేగానికి గురి చేస్తుంది. ఫైనల్ గా ఈ మధ్యకాలంలో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ను చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా కొన్ని సీన్లలో డైలాగ్స్ హృదయాన్ని టచ్ చేయడమే కాకుండా ఎమోషనల్‌గా మారుస్తాయి. నిర్మాతలు నాగవంశీ, సౌజన్య అనుసరించిన నిర్మాణ విలువలు హై రేంజ్‌లో ఉన్నాయి. లావిష్, రిచ్ సెట్స్‌ సినిమాను గ్రాండియర్‌గా మార్చాయి. సూర్య, మమితా, రాధిక, రవీనా పెర్ఫార్మెన్స్, దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్, విజన్ కోసం ఈ సినిమాను తప్పకుండా థియేటర్‌లోనే చూడాల్సిందే.


Aug 17, 2026 Tamil +1
7.0
out of 10
సూర్య–మామిత కాంబినేషన్ అనగానే ఫాదర్–డాటర్ తరహా కథ అనుకున్న వారికి టీజర్ షాకిచ్చింది. ఇద్దరి మధ్య వయసు తేడాతో కూడిన ప్రేమకథగా సినిమా ఆసక్తిని పెంచింది. అయితే వెంకీ అట్లూరి కొత్త పాయింట్‌ను ఎంచుకున్నా.. కథనం మాత్రం సగటు లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామాగానే సాగుతుంది.ఫీల్ గుడ్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్, యూత్‌ను ఆకట్టుకునే ఫన్నీ డైలాగ్స్‌తో వెంకీ అట్లూరి రచయితగా, దర్శకుడిగా మెప్పించాడు. ముఖ్యంగా “మనుషులు వ...

సూర్య–మామిత కాంబినేషన్ అనగానే ఫాదర్–డాటర్ తరహా కథ అనుకున్న వారికి టీజర్ షాకిచ్చింది. ఇద్దరి మధ్య వయసు తేడాతో కూడిన ప్రేమకథగా సినిమా ఆసక్తిని పెంచింది. అయితే వెంకీ అట్లూరి కొత్త పాయింట్‌ను ఎంచుకున్నా.. కథనం మాత్రం సగటు లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామాగానే సాగుతుంది.


ఫీల్ గుడ్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్, యూత్‌ను ఆకట్టుకునే ఫన్నీ డైలాగ్స్‌తో వెంకీ అట్లూరి రచయితగా, దర్శకుడిగా మెప్పించాడు. ముఖ్యంగా “మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు.. ఆ గొడవల తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక” వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.


సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే ఇంకాస్త బలంగా ఉంటే సినిమా మరింత ఇంప్రెస్ చేసేది. అయినప్పటికీ రెండున్నర గంటలకు పైగా ఉన్నా పెద్దగా బోర్ కొట్టకుండా సాగడం సినిమాకు ప్లస్. ఓవరాల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్..క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ప్లెజెంట్ మూమెంట్స్. 

Aug 17, 2026 Tamil +1
6.0
out of 10
విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మొదలైనపుడు సూర్య-మామిత బైజు కాంబినేషన్ అనగానే.. ఇదేదో ‘భగవంత్ కేసరి’ టైపు సినిమా అయ్యుండొచ్చని.. మామితకు ఫాదర్ ఫిగర్ లాంటి పాత్రలో సూర్య కనిపిస్తాడేమో అనుకున్నారు చాలామంది. కానీ టీజర్లో సూర్యకు జోడీగానే మామిత నటించిందని.. ఇది వయసు అంతరం ఉన్న ఇద్దరి మధ్య ప్రేమాయణం నేపథ్యంలో నడిచే కథ అని తెలిసినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెంకీ అట్లూరి ఎంచుకున్న ఈ పాయింట్ ఒక స్టార్ హీరో సి...

విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మొదలైనపుడు సూర్య-మామిత బైజు కాంబినేషన్ అనగానే.. ఇదేదో ‘భగవంత్ కేసరి’ టైపు సినిమా అయ్యుండొచ్చని.. మామితకు ఫాదర్ ఫిగర్ లాంటి పాత్రలో సూర్య కనిపిస్తాడేమో అనుకున్నారు చాలామంది. కానీ టీజర్లో సూర్యకు జోడీగానే మామిత నటించిందని.. ఇది వయసు అంతరం ఉన్న ఇద్దరి మధ్య ప్రేమాయణం నేపథ్యంలో నడిచే కథ అని తెలిసినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెంకీ అట్లూరి ఎంచుకున్న ఈ పాయింట్ ఒక స్టార్ హీరో సినిమాల్లో ఊహించలేనిది. ఐతే ఇక్కడి వరకు కొత్తదనం చూపించిన వెంకీ.. మిగతా సినిమాలో చూపించింది సగటు ప్రేమకథ.. ఫ్యామిలీ డ్రామానే. అయినా రెండున్నర గంటలకు పైగా నిడివిలో పెద్దగా బోర్ కొట్టకుండా ఆసక్తికర కథనంతో సినిమాను నడిపించాడు.


వెంకీ అట్లూరి రచయితగా.. దర్శకుడిగా మెప్పించాడు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మీద అతను సినిమాను నడిపించాడు. అతను ప్లెజెంట్ మూమెంట్స్ చుట్టూ కథాకథనాలను అల్లుకున్న తీరు.. వాటిని తెరపై ప్రెజెంట్ చేసిన వైనం బాగుంది. అతను డైలాగ్ రైటర్ గానూ ఆకట్టుకున్నాడు. "మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు.. ఆ గొడవల తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక" లాంటి హృద్యమైన సంభాషణలతో పాటు యూత్ మెచ్చే ఫన్నీ డైలాగ్స్ కూడా రాశాడు వెంకీ. సెకండాఫ్ లో వెంకీ రైటింగ్.. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త కసరత్తు చెయ్యాల్సింది. ఓవరాల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్.. ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమాగా ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది. 

Aug 17, 2026 Tamil +1
7.0
out of 10

Done with #ViswanathAndSons. It’s about how Viswanath takes on responsibilities and sets things right.


Venky Atluri has a mature way of handling things. I liked the way he ended the movie.


Family entertainers can never go wrong when they are handled reasonably well.


Suriya is extremely good. What surprised me is how well Mamitha matched him with her performance.


This will be a sure-shot hit



Aug 14, 2026 Tamil +1
7.0
out of 10
‘విశ్వనాథ్ అండ్ సన్స్’’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. సూర్య నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు అలాగే సూర్య పాత్ర తాలూకు ఎమోషన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా సాగాయి. వెంకీ అట్లూరి కథ, దర్శకత్వంతో పాటు జివి ప్రకాష్ అదిరిపోయే బీజీఎమ్ సాంగ్స్, అలాగే సూర్య, మామితా బైజు పెర్ఫార్మన్స్ సినిమాకి మంచి హై ఇచ్చాయి. ఓవరాల్ గా...

‘విశ్వనాథ్ అండ్ సన్స్’’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. సూర్య నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు అలాగే సూర్య పాత్ర తాలూకు ఎమోషన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా సాగాయి. వెంకీ అట్లూరి కథ, దర్శకత్వంతో పాటు జివి ప్రకాష్ అదిరిపోయే బీజీఎమ్ సాంగ్స్, అలాగే సూర్య, మామితా బైజు పెర్ఫార్మన్స్ సినిమాకి మంచి హై ఇచ్చాయి.


 ఓవరాల్ గా ఈ సినిమాలో సూర్య నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.


Aug 14, 2026 Tamil +1
విశ్వనాధ్ అండ్ సన్స్ (Viswanath & Sons)... సినిమా చూసాక నా opinion చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య నుండి మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ చూసాం. మొన్న చూసిన వీరభద్రుడు కూడా నాకుaverage గా అనిపించింది. కానీ ఈ మూవీ మాత్రం ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం superb గా ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం lag అనిపించింది. అండ్ సూర్య, మామితా తో పాటు రాధికా, రవీనా roles...

విశ్వనాధ్ అండ్ సన్స్ (Viswanath & Sons)... సినిమా చూసాక నా opinion చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య నుండి మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ చూసాం. మొన్న చూసిన వీరభద్రుడు కూడా నాకుaverage గా అనిపించింది. కానీ ఈ మూవీ మాత్రం ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం superb గా ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం lag అనిపించింది. 


అండ్ సూర్య, మామితా తో పాటు రాధికా, రవీనా roles కూడా నాకు చాలా నచ్చాయి. అండ్ ఎవరికీ వాళ్ళు వాళ్ళ రోల్స్ లో జీవించేసారు. జివి ప్రకాష్ మ్యూజిక్ biggest plus ఈ మూవీకి. స్పెషల్ గా directer వెంకీ అట్లూరి కి thanks చెప్పాలి ఆడియన్స్. overall its a worth watchable movie. 

Aug 14, 2026 Tamil +1
Why MRO?