Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1479
Total Reviews
99
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 253-264 of 1479 reviews

Agadha Movie Review

5.0
out of 10
ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్‌, ఈవిల్ స్పిరిట్‌ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్‌ స్పిరిట్‌ రిలేటెడ్ మూవీనే. ఈ తరహా చిత్రాలలో లాజిక్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. అప్పుడే సినిమాను ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. మూవీ చూస్తుండగా, 'ఇది ఎలా సాధ్యం?' అనే ప్రశ్న ప్రేక్షకుడి మనసులో ఉదయించిందంటే, దర్శకుడు ఫెయిల్‌ అయినట్టే.&nbs...

ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్‌, ఈవిల్ స్పిరిట్‌ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్‌ స్పిరిట్‌ రిలేటెడ్ మూవీనే. ఈ తరహా చిత్రాలలో లాజిక్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. అప్పుడే సినిమాను ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. మూవీ చూస్తుండగా, 'ఇది ఎలా సాధ్యం?' అనే ప్రశ్న ప్రేక్షకుడి మనసులో ఉదయించిందంటే, దర్శకుడు ఫెయిల్‌ అయినట్టే. 


సినిమాలో.. తన బలాన్ని పెంచుకోవడానికి క్షుద్ర శక్తి చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న కారణంగా, దానికి కారకులైన వారి మీద అది పగ బట్టడం అనేది చాలా రొటీన్ థీమ్‌. కాకపోతే దాన్ని టెక్నికల్‌ సపోర్ట్ తో కొత్తగా చూపించే ప్రయత్నం ఎమ్మెస్ రాజు చేశారు. కొత్తదనం లేని కథను తీసుకుని, భిన్నంగా చెప్పే ప్రయత్నం చేసినా... రొటీన్ అండ్ రిపీటెడ్ సీన్స్ తో అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలా అని ఇది తీసి పారేసే సినిమా కాదు. కానీ ఏదో ఊహించుకుని వస్తే మాత్రం నిరాశకు గురికాక తప్పదు. టెక్నికల్‌ ఇష్యూస్ మీద, నటీనటుల యాక్టింగ్‌ మీద ఎక్కువ దృష్టిపెట్టిన దర్శకుడు ఎమ్మెస్ రాజు... కథ విషయంలోనూ ఎక్కువ కసరత్తు చేసి ఉంటే అగధ మరో స్థాయిలో ఉండేది.

Aug 20, 2026 Telugu

Agadha Movie Review

అగధ (Agadha) 2026 News Channel
5.0
out of 10
దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. దర్శకుడు ఎమ్మెస్ రాజు గతంలో తీసిన ‘దేవి’ సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ పాత సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు కానీ, కట్టిపడేసే విషయాలు కానీ ఇందులో కాస్త లోపించాయి. కేవలం ఆ సినిమా వాతావరణాన్ని మాత్రమే ఇక్కడ వాడుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి...

దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. దర్శకుడు ఎమ్మెస్ రాజు గతంలో తీసిన ‘దేవి’ సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ పాత సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు కానీ, కట్టిపడేసే విషయాలు కానీ ఇందులో కాస్త లోపించాయి. కేవలం ఆ సినిమా వాతావరణాన్ని మాత్రమే ఇక్కడ వాడుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి సినిమాలకు బిగువైన స్క్రీన్ ప్లే చాలా అవసరం. కానీ ఇందులో అదే మిస్ అయింది. 


టెక్నికల్ గా ఒక హారర్ సినిమాకు కావాల్సిన సాంకేతిక హంగులన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. కానీ పేలవమైన బోరింగ్ స్క్రీన్ ప్లే కారణంగా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఒకసారి చూసేలానే ఉంది. ఓవరాల్ గా అగధ.. కొంచెం థ్రిల్.. మిస్టిక్ థ్రిల్లర్..! 

Aug 20, 2026 Telugu

Agadha movie Review

5.0
out of 10
మిస్టరీ, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో కూడిన సినిమాలు చాలా వస్తూనే ఉంటాయి. అయితే కామెడీ హార్రర్‌ థ్రిల్లర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కామెడీని ప్రధానంగా చేసుకొని ఇలాంటి హర్రర్‌ చిత్రాలను రూపొందిస్తుంటారు. సీరియస్‌ ఫిల్మ్స్ వచ్చి చాలా రోజులవుతుంది. ఎంఎస్‌ రాజుగారు `అగధ` ని సీరియస్‌ ఫిల్మ్ గా రూపొందించారు. ఒక మిస్టరీని బేస్ చేసుకొని, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమాని తెరకెక్క...

మిస్టరీ, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో కూడిన సినిమాలు చాలా వస్తూనే ఉంటాయి. అయితే కామెడీ హార్రర్‌ థ్రిల్లర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కామెడీని ప్రధానంగా చేసుకొని ఇలాంటి హర్రర్‌ చిత్రాలను రూపొందిస్తుంటారు. సీరియస్‌ ఫిల్మ్స్ వచ్చి చాలా రోజులవుతుంది. ఎంఎస్‌ రాజుగారు `అగధ` ని సీరియస్‌ ఫిల్మ్ గా రూపొందించారు. ఒక మిస్టరీని బేస్ చేసుకొని, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక సినిమా ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. 


సినిమాలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ కొన్ని బాగున్నాయి. బీజీఎం ఆకట్టుకుంటుంది. కొత్తగా ఉంటుంది. మహాదేవి పాత్రలో కామాక్షి అదరగొట్టింది. శ్రావణ్‌ రెడ్డి పాత్రలోని ట్విస్ట్ వాహ్‌ అనిపిస్తుంది. గుహలోని సన్నివేశాలు థ్రిల్‌కి గురి చేస్తాయి. కానీ కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలో థ్రిల్స్ సరిపోవని చెప్పొచ్చు. ఎంఎస్‌ రాజు చెప్పింతనంతగా అయితే సినిమా లేదు. డివైన్‌ హర్రర్‌, థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది. అగధ కొత్త అనుభవాన్నిస్తుంది. కొంత వరకు ఎంగేజ్‌ చేస్తుంది.

Aug 20, 2026 Telugu

Agadha Movie Review

5.0
out of 10
ippude Agadha movie chusoccha... trailer chusi movie baga thrilling ga untundanukunna.. but thrill kaadu kada... kaneesam entertainment koooda ledu. peddag twistlu kooda levu. perukemo... horror, thriller annaru. but rendu kooda levu. suspence kooda maintain cheyaledu directer. emaina konchem better ga undi ante climax matrame. adi kooda fresh ga em ledu. but story point bagundi. alagani cine...

ippude Agadha movie chusoccha... trailer chusi movie baga thrilling ga untundanukunna.. but thrill kaadu kada... kaneesam entertainment koooda ledu. peddag twistlu kooda levu. perukemo... horror, thriller annaru. but rendu kooda levu. suspence kooda maintain cheyaledu directer. 


emaina konchem better ga undi ante climax matrame. adi kooda fresh ga em ledu. but story point bagundi. alagani cinema ayithe nakassalu nacchaledu. edo friends force cheste vella weekend lo chill avudamani.. but chala bore feel ayya... ide cinema ku naa rating ivvalsoste 2 kante ekkuvivvanu. 

Aug 20, 2026 Telugu

Agadha movie review

అగధ (Agadha) 2026 News Channel
Sakshi

By Sakshi

5.0
out of 10
దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ "అగధ". కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. బట్ ఈ సినిమా స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్నా, దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మాత్రం డైరెక్టర్ రాసుకోలేకపోయాడు. ఇంట్రెస్టింగ్ సీన్లు కూడా పెద్దగా ఏం లేవు. థ్రిల్లర్ మూవీ అంటే ట్విస్టులు, థ్రిల్స్, హారర్ వంటి ఎలిమెంట్స్ చాలా...

దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ "అగధ". కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. బట్ ఈ సినిమా స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్నా, దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మాత్రం డైరెక్టర్ రాసుకోలేకపోయాడు. 


ఇంట్రెస్టింగ్ సీన్లు కూడా పెద్దగా ఏం లేవు. థ్రిల్లర్ మూవీ అంటే ట్విస్టులు, థ్రిల్స్, హారర్ వంటి ఎలిమెంట్స్ చాలా ఉండాలి. కానీ ఈ సినిమాలో అవి ఊహించిన దానికంటే తక్కువే ఉన్నాయి. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ వన్ టైం వాచబుల్. 

Aug 20, 2026 Telugu

Agadha Movie Review

4.0
out of 10
I watched the Sunday matinee show of the movie *Agadha*. As for the film... the story is decent, but the screenplay isn't particularly impressive.there are quite a few boring scenes. Kamakshi Bhaskarla, who played the lead role, performed well. However, I didn't really care for the thriller elements in the movie. I love thriller films, but this one lacked impactful thriller or horror sequences. St...

I watched the Sunday matinee show of the movie *Agadha*. As for the film... the story is decent, but the screenplay isn't particularly impressive.


there are quite a few boring scenes. Kamakshi Bhaskarla, who played the lead role, performed well.


However, I didn't really care for the thriller elements in the movie.


I love thriller films, but this one lacked impactful thriller or horror sequences.


Still, general audiences might want to give it a try—it is worth a one-time watch.

Aug 20, 2026 Telugu

Agadha movie Review

6.0
out of 10
ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన అగధ మూవీ గురించి చెప్పాలంటే... సినిమా మంచి స్టోరీ ఉన్నా, రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫస్టాఫ్‌ లో కొన్ని చోట్ల సాగదీసినట్టు.. కథ నత్త నడకగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌ లో సన్నివేశాలను రాసుకొన్న విధానం బాగుంది. సెకండాఫ్‌ లో యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు చెప్పిన కథ ఈ సినిమాకు మరింత బలంగా మారింది....

ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన అగధ మూవీ గురించి చెప్పాలంటే... సినిమా మంచి స్టోరీ ఉన్నా, రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫస్టాఫ్‌ లో కొన్ని చోట్ల సాగదీసినట్టు.. కథ నత్త నడకగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌ లో సన్నివేశాలను రాసుకొన్న విధానం బాగుంది. సెకండాఫ్‌ లో యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు చెప్పిన కథ ఈ సినిమాకు మరింత బలంగా మారింది. అయితే ఈ సినిమాలో నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్‌ను ఎంఎస్ రాజు రాబట్టుకొన్న విధానం ఈ సినిమాకు హైలెట్‌గా మారింది. క్రైస్తవ, ఇస్లాం మతాల కంటే.. హిందూ మతమే గొప్పది. హిందూ మతంలో ఆచరించే పద్దతులే ఉత్తమం అనే కోణంలో కథను నడించిన తీరు ఆకట్టుకొంటుంది.


ఈ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ఈ మూవీ కొత్త రకమైన హారర్, థ్రిల్లర్, మైథాలజీ ఎలిమెంట్స్, హిందూ మత అచారాలను జోప్పించి చేసిన మిస్టిక్ డివైన్ మిస్టరీ, సైకాలజికల్ థ్రిల్లర్. ఈ సినిమాను ఎంగేజింగ్‌గా చెప్పడానికి ఎంఎస్ రాజు విజన్ బాగా ప్లస్ అయింది. థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ. ఈ వారం మంచి హారర్ థ్రిల్లర్‌ను చూడాలనుకొంటే అగాధ మూవీ బెస్ట్ ఆప్షన్.


Aug 20, 2026 Telugu

Agadha Movie Review

5.0
out of 10
ఇప్పుడే ‘అగధ’ సినిమా చూసొచ్చాను. సినిమా అయితే అంతగా నచ్చలేదు, but directer తీసుకున్న కోర్ పాయింట్ బాగుంది. కానీ డైరెక్షనే దొబ్బింది. థ్రిల్లర్ సినిమా తీస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా తీయాలి... అసలు ఈ సినిమాలో ట్విస్టులు గాని, థ్రిల్స్ గని నాకైతే ఏం ఎక్కలేదు. And సినిమా మొత్తం ఫినిష్ అయ్యాక తెలిసింది... మూవీ తీసింది ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు అని. ఆయన ప్రొడ్యూసర్ గా ఒకే గాని... డైర...

ఇప్పుడే ‘అగధ’ సినిమా చూసొచ్చాను. సినిమా అయితే అంతగా నచ్చలేదు, but directer తీసుకున్న కోర్ పాయింట్ బాగుంది. కానీ డైరెక్షనే దొబ్బింది. థ్రిల్లర్ సినిమా తీస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా తీయాలి... అసలు ఈ సినిమాలో ట్విస్టులు గాని, థ్రిల్స్ గని నాకైతే ఏం ఎక్కలేదు.


And సినిమా మొత్తం ఫినిష్ అయ్యాక తెలిసింది... మూవీ తీసింది ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు అని. ఆయన ప్రొడ్యూసర్ గా ఒకే గాని... డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత సెట్ అవలేదు అనిపిస్తుంది. ఎవరైనా ఈ సినిమాకెళ్లాలంటే ఇదే వీక్ వేరే మూవీస్ చాలా ఉన్నాయి. ఈ మూవీని లాస్ట్ ఆప్షన్ గా choose చేసుకొమ్మంట. అయినా వెళ్తామంటే వాళ్ళిష్టం. నాకైతే పెద్దగా నచ్చలేదు.

Aug 20, 2026 Telugu

Agadha movie Review

6.0
out of 10
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అగధ అంటూ తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ దీనితో నడిపించే కథనమే కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇక మొత్తంగా చూసుకున్నట్ట...

ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అగధ అంటూ తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ దీనితో నడిపించే కథనమే కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల బాగా పెర్ఫార్మ్ చేసింది. 


ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అగధ’ అక్కడక్కడా ఓకే అనిపించే మిస్టరీ థ్రిల్లర్ గా నిలుస్తుంది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కోర్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అలాగే దానికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఇదే తరహాలో కథనం కొనసాగితే బాగుండేది. సో ఈ చిత్రం థ్రిల్లర్ మూవీ లవర్స్ కి కొంతమేర ఓకే అనిపిస్తుంది.


Aug 20, 2026 Telugu
7.0
out of 10
పళ్ళ బురుసు.. ఒక చిన్న Toothbrush Point తో స్టార్ట్ అయ్యే సినిమా.. చివరికి మంచి Emotional Journey గా మారుతుంది.సినిమాలో Family, Relationships, Emotions ని చాలా Natural Way లో చూపించారు. ఎక్కడా Over Drama లేకుండా మంచి Scenes తో చెప్పిన Message బాగుంది. కామెడీ కూడా చాలా Natural గా వర్కౌట్ అయ్యింది. Interval Block కూడా చాలా బాగుంది.ఈ రోజుల్లో మనం Human Relationships కి ఎంత దూరం అవుతున్నాం, అనేది బాగా...

పళ్ళ బురుసు.. ఒక చిన్న Toothbrush Point తో స్టార్ట్ అయ్యే సినిమా.. చివరికి మంచి Emotional Journey గా మారుతుంది.

సినిమాలో Family, Relationships, Emotions ని చాలా Natural Way లో చూపించారు. ఎక్కడా Over Drama లేకుండా మంచి Scenes తో చెప్పిన Message బాగుంది. కామెడీ కూడా చాలా Natural గా వర్కౌట్ అయ్యింది. Interval Block కూడా చాలా బాగుంది.


ఈ రోజుల్లో మనం Human Relationships కి ఎంత దూరం అవుతున్నాం, అనేది బాగా చూపించారు. Father-Son ఇద్దరి Mistakes ని కూడా Both Sides నుంచి చూపించడం నచ్చింది. కొన్ని Emotional Moments బాగా Connect అవుతాయి. Theatre నుంచి మంచి Feel తో బయటికి వస్తాం.


నాకైతే బలగం తర్వాత చూసిన వన్ అఫ్ ది బెస్ట్ rural backdrop ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇది. worth movie..

Aug 19, 2026 Telugu

Palla Burusu movie review

7.0
out of 10
movie review of the film Palla Burusu : సుధాకర్ గారు అండ్ మురళీధర్ గారు భలే సెట్టయ్యారండి ఫాదర్ అండ్ సన్ లాగా. సినిమా గురించి చెప్పాలంటే బాగుందండి సినిమా. ఒక తండ్రికి కొడుకు పళ్ళ బురుసు కొనివ్వలేదు అని మొదలైన సినిమా ఎక్కడివరకు వెళ్తుంది, ఎలాంటి ఎమోషన్స్ ని ఎక్సప్లోర్ చేస్తుంది అనే విషయం మీదుంటుంది ఈ సినిమా. ఇండెప్త్ గా చాలా మెసేజెస్ ఉన్నాయి ఈ సినిమాలో. కానీ ఏది రుద్దకుండా, మంచి సీన్స్ తోటి బాగా వర...

movie review of the film Palla Burusu : సుధాకర్ గారు అండ్ మురళీధర్ గారు భలే సెట్టయ్యారండి ఫాదర్ అండ్ సన్ లాగా. సినిమా గురించి చెప్పాలంటే బాగుందండి సినిమా. ఒక తండ్రికి కొడుకు పళ్ళ బురుసు కొనివ్వలేదు అని మొదలైన సినిమా ఎక్కడివరకు వెళ్తుంది, ఎలాంటి ఎమోషన్స్ ని ఎక్సప్లోర్ చేస్తుంది అనే విషయం మీదుంటుంది ఈ సినిమా. ఇండెప్త్ గా చాలా మెసేజెస్ ఉన్నాయి ఈ సినిమాలో. కానీ ఏది రుద్దకుండా, మంచి సీన్స్ తోటి బాగా వర్కవుట్ చేసారు. 


చాలా ఎమోషన్స్ మనం ఫీల్ అవుతాం సినిమాలో. కానీ మొత్తానికి ఒక మంచి ఫీల్ తోటి, చిన్న స్మైల్ తోటి థియేటర్ బైటికి వస్తాం. కామెడీ కూడా న్యాచురల్ గా భలే పండాయి. మెయిన్ గా ఇంటర్వెల్ చాలా బాగుంది. ఇక ఓవరాల్ గా ఈ సినిమాలో ఇప్పటిరోజుల్లో మనం మానవ సంబంధాలకు ఎంత దూరంగా ఎల్లిపోతున్నాం, పెద్దవాళ్ళు మన దగ్గరి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం రిటర్న్ ఇవ్వాల్సింది ఏముంది అన్నది బాగా చూపించారు. అండ్ సినిమాలో తండ్రీకొడుకుల మిస్టేక్స్ ని రెండు సైడ్స్ లో బాగా చూపించారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మంచి సినిమా అండి, ఫ్యామిలీతో చూడాలి. 

Aug 19, 2026 Telugu
5.0
out of 10
Palla Burusu has an interesting and relatable core idea, but the execution falls short. The story revolves around a small point and stretches it too much, with several silly and slow-paced scenes testing the audience’s patience.The message in the movie and emotional points are good, but the weak screenplay fails to create the impact expected.Overall A decent concept with good performances, but ave...

Palla Burusu has an interesting and relatable core idea, but the execution falls short. The story revolves around a small point and stretches it too much, with several silly and slow-paced scenes testing the audience’s patience.


The message in the movie and emotional points are good, but the weak screenplay fails to create the impact expected.


Overall A decent concept with good performances, but average writing and dragged-out narration make Palla Burusu just an okay one-time watch.

Aug 19, 2026 Telugu
Why MRO?