సమ్మర్ హాలిడేస్ (Summer Holidays)
Summer Holidays : చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంది... కిడ్స్ కి రావాల్సింది ర్యాంకులా..? స్కిల్స్ ఆ..? త్వరలో ప్రేక్షకుల ముందుకు...
Available in:
About This Movie
శ్రీకర్ దర్శకత్వంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "సమ్మర్ హాలిడేస్". ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు మెయిన్ లీడ్ గా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సినిమాలు వచ్చాయి కానీ, మెసేజ్ ఇస్తూ తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువ. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ తో పాటు పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్ గురించి చెప్పే విధంగా, ఫ్యామిలీస్ కి ఓ మెసేజ్ ఇచ్చే విధంగా తెరకెక్కింది. తాజాగా సమ్మర్ హాలిడేస్ మూవీ ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.
సమ్మర్ హాలిడేస్ లో అమ్మమ్మ ఇంటికెళిన ఓ పిల్లాడు, అక్కడ స్నేహితులతో గడిపిన అనుభవాలు, మధ్యలో తల్లిదండ్రులు పిల్లలపై పెట్టే చదువుల ఒత్తిడి, సొసైటీ లో చదవడంతో కాకుండా వేరే విధంగా పెంచుకునే స్కిల్స్ ఎలా ఉపయోగపడతాయో సినిమాలో ప్రధానంగా చూడొచ్చని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. చివరగా '35 చిన్న కథ కాదు' సినిమాతో మంచి కాన్సెప్ట్ ఉన్న చిన్న పిల్లల సినిమాను తెలుగులో చూసారు ఆడియన్స్. ఇప్పుడు 'సమ్మర్ హాలిడేస్' సినిమాతో, పిల్లలతో పాటు ఫ్యామిలీస్ కి మెసేజ్ ఇచ్చేలా సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.
ఇక ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, విజిబి బ్యానర్స్ లో ధీరజ్ మొగిలినేని, వల్లభనేని గిరిబాబు నిర్మించిన ఈ సినిమాను శ్రీకర్ డైరెక్ట్ చేయగా, సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. జయ సుధ, వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, రమణ భార్గవ్, హర్షిణి కోడూరి, మహేష్ చింతల ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా వచ్చే నవంబర్ 6న థియేటర్లలో విడుదల కాబోతుంది.