మహాశక్తి (Maha Sakthi)
Maha Sakthi : అమ్మోరుగా మరోసారి నయనతార... డైరెక్టర్ సుందర్. సి కం బ్యాక్ కి రెడీయా? త్వరలోనే వచ్చేస్తున్నారు!
About This Movie
ప్రస్తుతం సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ లో టాప్ లో ఉన్న హీరోయిన్ నయనతార. హీరోయిన్ గా ఫిమేల్ లీడ్ గా లేడీ సూపర్ స్టార్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఆరేళ్ల క్రితం నయనతార హీరోయిన్ గా నటించిన "అమ్మోరు తల్లి" సినిమా ఓటిటి లో విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. తమిళ్ లో మూకుత్తి అమ్మన్ గా తెరకెక్కగా, తెలుగులో అమ్మోరు తల్లి పేరిట డబ్ అయి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. డివోషనల్ ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో నయనతార అమ్మవారిగా దేవతగా నటించారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా "మూకుత్తి అమ్మన్ 2" మరో సినిమా రాబోతుంది. ఈ సినిమాను తెలుగులో "మహాశక్తి" పేరుతో డబ్ చేయనున్నారు మేకర్స్. రీసెంట్ గా టీజర్ ని విడుదల చేయగా, నెట్టింట మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలోనూ అమ్మవారిగా నయనతార పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఇక టీజర్ లో ఓ చిన్నారిని శత్రువుల బారి నుంచి కాపాడే మహాశక్తిగా నయనతారను చూపించడం జరిగింది. ఆ చిన్నారి ఓ రాజవంశానికి చెందిన పాపగా చూపించారు. మరి ఆ చిన్నారిని చంపాలని చుసిన వారెవరు. ఎందుకు చంపాలని చుస్తున్నారు, అనే విషయాన్నీ థియేటర్లో చూసి తెలుసుకోవాలి.
ఇక అమ్మోరు తల్లి ఫస్ట్ పార్ట్ లో ఫాంటసీతో పాటు కామెడీ అంశాలతో కలిపి మెసేజ్ అంశాలు కూడా జోడించగా, ఈ సెకండ్ పార్ట్ లో సీరియస్ హిస్టరీతో పాటు, పలు డివోషనల్ సోషియో ఫాంటసీ అంశాలను కూడా చూపించబోతున్నారు. ఇక టీజర్ ని గమనిస్తే విజువల్ పరంగా అద్భుతంగా ఉంది. కాకపోతే ఈ జెనరేషన్ కి అవి సరిపోనట్లు, అలాగే VFX లో కొన్ని షార్ట్స్ AI లాగా కనిపించాయి. ఇక ఈ టీజర్ కి హిప్ హాప్ తమిజా అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. అయితే మూకుత్తి అమ్మన్ ఫస్ట్ పార్ట్ కు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడమే కాకుండా, అందులో కీలకపాత్రలో నటించారు.
అయితే ఈ సీక్వెల్ కి మాత్రం ఫాంటసీ మూవీస్ స్పెషలిస్ట్ సుందర్ సి దర్శకత్వం వహించారు. ఒకప్పుడు కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా సత్తా చాటిన దర్శకుడు సుందర్ సి... ఇప్పుడు తన సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ సాధించలేక వెనుకబడ్డాడు. ఇప్పడు ఈ మహాశక్తి సినిమాతో కం బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీలో నయనతారతో పాటు దునియా విజయ్, రెజీనా కసాండ్ర, ఊర్వశి, యోగి బాబు, సునీల్ తదితరులు కీ రోల్స్ లో నటించారు. ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇషారి కె గణేష్ నిర్మించగా, ఈ సినిమాను నవంబర్ 6న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.