సీన్ (SCENE)
SCENE : DSP ప్రేమ్ రాజ్ గా సూర్య.. ఖాకి చొక్కాతో మరోసారి సత్తా చూపడానికి రెడీ! త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
About This Movie
కోలీవుడ్ స్టార్ సూర్య వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఇయర్ "వీరభద్రుడు" సినిమాతో బ్లాక్ బస్టర్ కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా. రీసెంట్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "సీన్"(Scene). టైటిల్ క్యాచీగా ఉన్నప్పటికీ ఇదొక పక్కా యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ఇక టీజర్ ని గమనిస్తే... ఎంట్రీ లోనే బ్యాక్ నుండి పోలీస్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన సూర్య, ఆ తర్వాత జైలులో షార్ట్ అండ్ టీ షర్ట్ లో లేటెస్ట్ మేకోవర్ లో కనిపిస్తూ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చి అలా నడుచుకుంటూ వస్తున్న షాట్ అదిరిపోతోంది. ఆ సన్నివేశంలో సూర్య ఒక పోలీసాఫీసర్ భుజంపై చేయి వేసి జైలులో ఖైదీల మధ్య నుంచి నడుచుకుంటూ రావడం సినిమాలో మంచి హై ఇచ్చే సీన్ లా ఉంది. ఇక ఈ సినిమాలో సూర్య DSP ప్రేమ్ రాజ్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ మూవీలో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ హీరోయిన్ గా కనిపించనుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ మలయాళ యువ నటుడు నస్లెన్ కీ రోల్ లో కనిపించనున్నాడు. ఒక డిఫరెంట్ స్టైల్ అఫ్ యాక్షన్ - కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6, 2026 న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో సూర్య హ్యాట్రిక్ సక్సెస్ అందుకుని కోలీవుడ్ లో తన సత్తా చాటుతాడా? కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా స్థానం దక్కించుకుంటాడా లేదా అనేది మున్ముందు ఈ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.