Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

470
Total Reviews
64
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 97-108 of 470 reviews
Clear all filters
5.0
out of 10
`మేమ్‌ ఫేమస్‌`తో దర్శకుడిగా, హీరోగా ఆకట్టుకున్న సుమంత్‌ ప్రభాస్‌ కొంత గ్యాప్‌తో `గోదారి గట్టుపైన` అనే చిత్రంలో హీరోగా నటించాడు. సుభాష్‌ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో జగపతిబాబు కీలక పాత్ర పోషించగా తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా కథా కథనాలు అంతా రొటీన్ గా ఉండి ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేసింది. ఎప్పుడో పాతికేళ్ల కిందటే ఇలాంటి కథలకు కాలం చెల్లిపోయింది. ఎదో ట్రెండి ఎంటర్ట...

`మేమ్‌ ఫేమస్‌`తో దర్శకుడిగా, హీరోగా ఆకట్టుకున్న సుమంత్‌ ప్రభాస్‌ కొంత గ్యాప్‌తో `గోదారి గట్టుపైన` అనే చిత్రంలో హీరోగా నటించాడు. సుభాష్‌ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో జగపతిబాబు కీలక పాత్ర పోషించగా తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా కథా కథనాలు అంతా రొటీన్ గా ఉండి ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేసింది. ఎప్పుడో పాతికేళ్ల కిందటే ఇలాంటి కథలకు కాలం చెల్లిపోయింది. ఎదో ట్రెండి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో మేజిక్ చేస్తే తప్ప ఇలాంటి స్టోరీతో సినిమాలు ఇప్పుడు ఆడవు. 


ఓవరాల్ గా రొటీన్‌, ఓల్డ్ ఫార్మాట్‌ తో గోదారిగట్టుపైన మూవీ తెరకెక్కిందని చెప్పొచ్చు. కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. లౌడ్‌ ఎక్కువైంది, కామెడీ తక్కువైంది. ఎమోషన్స్ సీన్లు కూడా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. జగపతిబాబు పాత్రకి చాలా ఎలివేషన్లు ఇచ్చారు, కానీ ఎక్కడా ఆయా సీన్లు చూపించలేదు. ఈ జెనరేషన్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష్టమనే చెప్పొచ్చు. సింపుల్ గా ఒక్క డైలాగ్ లో సినిమా గురించి చెప్పాలంటే... కొత్త సీసాలో చాలా పాత సారా అన్నట్టు ఉంటుంది. 



May 11, 2026 Telugu
5.0
out of 10
హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన చిత్రం `సతీ లీలావతి`. దేవ్‌ మోహన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్‌ నిర్మాత. ఇందులో వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ అందుకుంది. కథా కథనాల్లో నిరాశపరచగా, నటీనటులు కూడా పెద్దగా గుర్తుండిపోయే రోల్స్ చేయలేదు. లావణ్య త్రిపాఠి రోల్ బా...

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన చిత్రం `సతీ లీలావతి`. దేవ్‌ మోహన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్‌ నిర్మాత. ఇందులో వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ అందుకుంది. కథా కథనాల్లో నిరాశపరచగా, నటీనటులు కూడా పెద్దగా గుర్తుండిపోయే రోల్స్ చేయలేదు. లావణ్య త్రిపాఠి రోల్ బానే ఉన్నా, అంత కొత్త తరహా రోల్ ఏమి కాదు.

 

టెక్నీకల్‌ గా మాత్రం సతీ లీలావతి బాగుంది. స్క్రీన్‌ కలర్‌ఫుల్‌ గా ఉంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం ఫర్వాలేదు. దర్శకుడు తాతినేని సత్య ఎంచుకున్న కథ ఫర్వాలేదు. దాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఫన్నీ సీన్లు అన్నీ వర్కౌట్‌ కాలేదు. కొంత వరకు మాత్రమే నవ్వించాయి. నిర్మాణ విలువలకు కొదవలేదు. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌ ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. అయితే సినిమాలో ఫ్యామిలీకి సంబంధించి అంతర్లీనంగా అందించిన సందేశం బాగుంది. కొంత వరకు అలరించే సతీ లీలావతి, భార్యాభర్తలకు సంబంధించిన ఇచ్చిన సందేశం బాగుంది.


May 11, 2026 Telugu

Sathi Leelavathi Movie Review

5.0
out of 10
చిన్న చిన్న కారణాల వల్ల భార్య భర్తలు విడిపోవడం చూస్తున్నాం. ఈ "సతీ లీలావతి" కథలోనూ అలాంటి సిల్లీ రీజనే దర్శకుడు తీసుకున్నాడు. సినిమాలో భర్త బుర్ర బద్దలు కొట్టి ఇంటిలోనే బంధించే సన్నివేశాలు, దాని చుట్టూ అల్లిన కామెడీ కూడా అతికించినట్టే ఉంది. కాగితం మీద కథగా రాసుకున్నప్పుడు కాస్తంత కొత్తగా ఉండి ఉండొచ్చు కానీ దాని ఎగ్జిక్యూషన్ ను దర్శకుడు సత్య ఫెయిల్ అయ్యాడు. దాంతో సతీ లీలావతి శిరోభారంగా మారిపోయింది....

చిన్న చిన్న కారణాల వల్ల భార్య భర్తలు విడిపోవడం చూస్తున్నాం. ఈ "సతీ లీలావతి" కథలోనూ అలాంటి సిల్లీ రీజనే దర్శకుడు తీసుకున్నాడు. సినిమాలో భర్త బుర్ర బద్దలు కొట్టి ఇంటిలోనే బంధించే సన్నివేశాలు, దాని చుట్టూ అల్లిన కామెడీ కూడా అతికించినట్టే ఉంది. కాగితం మీద కథగా రాసుకున్నప్పుడు కాస్తంత కొత్తగా ఉండి ఉండొచ్చు కానీ దాని ఎగ్జిక్యూషన్ ను దర్శకుడు సత్య ఫెయిల్ అయ్యాడు. దాంతో సతీ లీలావతి శిరోభారంగా మారిపోయింది. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ బాగా నటించారు. కానీ పాత్రలు, వాటికీ సంబంధించిన ఎమోషన్స్ ను స్ట్రాంగ్ గా చూపించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. 


ఉదయ్ పొట్టిపాడు రాసిన కొన్ని డైలాగ్స్ శృత్రిమించాయి. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాత నాగమోహన్ తొలి యత్నంగా తీసిన 'సతీ లీలావతి' ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చే ఆస్కారం ఎక్కువ. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లి అయిన లావణ్య త్రిపాఠి ఈ సినిమా ప్రమోషన్స్ లో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 'సతీ లీలావతి' చూసిన తర్వాత ఆమె సరైన నిర్ణయమే తీసుకున్నారనిపిస్తుంది. ఓవరాల్ గా సతీ లీలావతి మూవీ అంతగా మెప్పించలేకపోయింది. 





May 11, 2026 Telugu
5.0
out of 10
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన చిత్రం 'గోదారి గట్టుపైన’ (Godari Gattupaina). 100కు పైగా లఘు చిత్రాలు తీసిన అనుభవం ఉన్న సుభాష్ చంద్ర (Subhash Chandra) దర్శకత్వం వహించిన ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా తాజాగా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇక థియేటర్లో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. జగపతిబాబు రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సుభాష...

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన చిత్రం 'గోదారి గట్టుపైన’ (Godari Gattupaina). 100కు పైగా లఘు చిత్రాలు తీసిన అనుభవం ఉన్న సుభాష్ చంద్ర (Subhash Chandra) దర్శకత్వం వహించిన ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా తాజాగా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇక థియేటర్లో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. జగపతిబాబు రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. 


సుభాష్ చంద్ర రచనలో పెద్దగా మెరుపులు లేకున్నా… విజువల్ గ్రాండియర్ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ బావుంది. గోదావరి జిల్లా అందాలను చక్కగా క్యాప్చర్ చేశాడు. కథ రొటీన్ దే అయినా కథనంతో మెప్పించాల్సింది. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ కాలేక పోయాడు. కానీ ఆ క్యూట్ నెస్ వెండితెరపై క్యారీ చేయలేక పోయాడు. చాలా సీన్స్ ప్రత్యేకించి తొలి అర్ధభాగం చాలా వరకూ సాగదీతతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. ప్రేమకథలను ఇష్టపడే కొందరికి నచ్చవచ్చు. అసలు టైటిల్ ‘గోదారి గట్టుపైన’ అని ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. ఓవరాల్ గా మౌత్ టాక్ కూడా సరిగా లేని ఈ సినిమా ఎలా నిలబడుతుందో లాంగ్ రన్ లో తెలుస్తుంది. 


May 11, 2026 Telugu

Sathi Leelavathi Movie Review

5.0
out of 10
భార్యాభర్తల విడాకుల అంశంతో వచ్చిన కొత్త సినిమా సతి లీలావతి. కథ కొత్తగా లేకపోయినా బోర్ కొట్టించకుండా దర్శకుడు సత్య తెరకెక్కించారని చెప్పాలి. డిఫరెంట్ స్టోరీ కాకపోయినప్పటికీ.. లావణ్య త్రిపాఠి కథను తన పాత్ర ద్వారా నడిపించిన విధానం బాగుంది. ఆమె డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ ను చాలా సులభంగా పోషించారు. దేవ్ మోహన్ కూడా తన పాత్ర పరిధి మేరకు రాణించారు. మడోన్నా సెబాస్టియన్ పాత్ర నిడివి తక్కువే. అయితే ఓవ...

భార్యాభర్తల విడాకుల అంశంతో వచ్చిన కొత్త సినిమా సతి లీలావతి. కథ కొత్తగా లేకపోయినా బోర్ కొట్టించకుండా దర్శకుడు సత్య తెరకెక్కించారని చెప్పాలి. డిఫరెంట్ స్టోరీ కాకపోయినప్పటికీ.. లావణ్య త్రిపాఠి కథను తన పాత్ర ద్వారా నడిపించిన విధానం బాగుంది. ఆమె డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ ను చాలా సులభంగా పోషించారు. దేవ్ మోహన్ కూడా తన పాత్ర పరిధి మేరకు రాణించారు. మడోన్నా సెబాస్టియన్ పాత్ర నిడివి తక్కువే. అయితే ఓవరాల్ గా ఫ్రెష్ నెస్ కోరుకునే ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేస్తుంది.


అయితే టెక్నికల్ విషయానికి వస్తే.. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా బ్యాక్ డ్రాప్‌ కు సంబంధించిన సన్నివేశాలను నేచురల్‌ గా తెరకెక్కించారు. మిక్కి జే మేయర్ తన మ్యూజిక్‌ తో ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్స్ ఎడిట్ చేస్తే.. ఫీల్, రన్ బెటర్‌‌ గా ఉండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కాకపోతే దాని మీద పెట్టిన ఫోకస్, కథ, కథనాలపై కూడా పెట్టి ఉంటే.. ఇదోక డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాగా మారేంది. దాంపత్య జీవితంలో విభేదాలు, విడాకులు, లవ్, ఎమోషన్స్ అంశాలతో రూపొందే సినిమాలను ఇష్టపడే వారికి సతీ లీలావతి కొంతవరకు నచ్చడానికి అవకాశం ఉంది.

May 11, 2026 Telugu
4.0
out of 10
గోదారి గట్టుపైన సినిమా విషయానికి వస్తే.. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్ అంశంతో ఎమోషనల్‌ గా కథను సుభాష్ చంద్ర ప్రారంభించారనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథలోకి వెళ్లిన కొద్ది పక్కా రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్‌ను అనుసరించారనే విషయం కామెడీ ట్రాక్ చెప్పకనే చెబుతుంది. సినిమాలో రాజు, మాయ ప్రేమ కథ మొదలైనప్పటి నుంచి రిపీట్ సీన్లతో విసుగుపుట్టించేలా చేశారు. కథ, కథనాల్లో పస లేకపోవడం వల్ల సాంకేతిక విభాగాల పనితీరు క...

గోదారి గట్టుపైన సినిమా విషయానికి వస్తే.. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్ అంశంతో ఎమోషనల్‌ గా కథను సుభాష్ చంద్ర ప్రారంభించారనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథలోకి వెళ్లిన కొద్ది పక్కా రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్‌ను అనుసరించారనే విషయం కామెడీ ట్రాక్ చెప్పకనే చెబుతుంది. సినిమాలో రాజు, మాయ ప్రేమ కథ మొదలైనప్పటి నుంచి రిపీట్ సీన్లతో విసుగుపుట్టించేలా చేశారు. కథ, కథనాల్లో పస లేకపోవడం వల్ల సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. 


సినిమాలో సిట్యుయేషనల్‌గా పాటలు ఉన్నప్పటికీ.. పెద్దగా ఎలివేట్ కాలేకపోయాయి. కథలో బలం లేనప్పుడు సినిమా రన్‌టైమ్ తగ్గిస్తే ఫీల్ ఏదైనా పెరిగేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే ఈ సినిమా ఫలితం వేరేలా ఉండేదనిపిస్తుంది. జగపతిబాబు మినహా మిగతా నటీనటుల ప్రతిభ ఏమి అంత లేదు. ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ ని నిరాశపరుస్తుంది. 


May 11, 2026 Telugu

Sathi Leelavathi Movie Review

Tupaki

By Tupaki

4.0
out of 10
పెళ్లి తర్వాత సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న లావణ్య త్రిపాఠి.. తాజాగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కథ గురించి సింపుల్ గా చెప్పాలంటే... పెళ్లయిన కొన్నేళ్లకు భార్యాభర్తల మధ్య అపార్థాలు రావడం.. ఇద్దరి మధ్య దూరం పెరగడం చాలామందిలో జరిగేదే. ఇద్దరి తప్పొప్పులు తెలుసుకుని కలిసిపోవడమే మెయిన్ పాయింట్. సినిమాలో దానికి...

పెళ్లి తర్వాత సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న లావణ్య త్రిపాఠి.. తాజాగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కథ గురించి సింపుల్ గా చెప్పాలంటే... పెళ్లయిన కొన్నేళ్లకు భార్యాభర్తల మధ్య అపార్థాలు రావడం.. ఇద్దరి మధ్య దూరం పెరగడం చాలామందిలో జరిగేదే. ఇద్దరి తప్పొప్పులు తెలుసుకుని కలిసిపోవడమే మెయిన్ పాయింట్. సినిమాలో దానికి ఏ మార్గం ఎంచుకున్నా తెర మీద అవతలి పాత్ర మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా కన్విన్స్ అయ్యేలా పరిష్కారం చూపించాలి. కానీ 'సతీ లీలావతి'లో తన నుంచి విడిపోవాలని అనుకునే భర్తను మార్చడానికి హీరోయిన్ ఎంచుకునే మార్గం సిల్లీగా అనిపిస్తుంది. 


సినిమాలో ఏ దశలోనూ ఆమె భర్తలో పరివర్తన తెచ్చేలా తన ప్రవర్తన ఉండదు. ఆ క్యారెక్టర్ని చూస్తే భర్త ఆమె నుంచి విడిపోవడం కరక్టే అని ఆడియన్సుకి అనిపించేలా డిజైన్ చేసారు ఆ పాత్రని. ఇలాగే సినిమా మొత్తం గొడవలు పడుతూనే ఉంటాయి సీన్లు. ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే... ఒక్క కమెడియన్ ని కూడా యూస్ చేసుకోలేదు. దర్శకుడు తాతినేని సత్య ఎంచుకున్న కాన్సెప్ట్ మంచిదే. కానీ కథను ఒక తీరుగా చెప్పడంలో అతను ఫెయిలయ్యాడు. అతను కథను మొదలుపెట్టిన విధానమే అంత ఆసక్తికరంగా లేదు. నరేషన్ ఆద్యంతం గందరగోళంగా సాగింది. సెకండాఫ్ లో కొంత మేర ఎంటర్టైన్మెంట్ పండించినా.. అది సరిపోలేదు. ఓవరాల్ గా సతీలీలావతి ఎవర్ని మెప్పించలేదు. 

May 09, 2026 Telugu
5.0
out of 10
షార్ట్ ఫిలిమ్స్ తో పేరు సంపాదించి.. ‘మేం ఫేమస్’ సినిమాతో హీరోగా దర్శకుడిగా మారిన సుమంత్ ప్రభాస్ ఆ చిత్రంతో బానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘గోదారి గట్టుపైన’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ చూస్తేనే ఇదొక సగటు టీనేజీ ప్రేమకథ అనే విషయం అర్థమైపోతుంది. కథ విషయంలోనూ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్ గా కథ చెప్పాలంటే.. కూతురిని అమితంగా ఇష్టపడే తండ్రి.. ఆమెను తమ కంటే ఉన...

షార్ట్ ఫిలిమ్స్ తో పేరు సంపాదించి.. ‘మేం ఫేమస్’ సినిమాతో హీరోగా దర్శకుడిగా మారిన సుమంత్ ప్రభాస్ ఆ చిత్రంతో బానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘గోదారి గట్టుపైన’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ చూస్తేనే ఇదొక సగటు టీనేజీ ప్రేమకథ అనే విషయం అర్థమైపోతుంది. కథ విషయంలోనూ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్ గా కథ చెప్పాలంటే.. కూతురిని అమితంగా ఇష్టపడే తండ్రి.. ఆమెను తమ కంటే ఉన్నత స్థాయి కుటుంబంలో ఇవ్వాలని ఆశిస్తాడు. కథానాయికేమో హీరో గుణం చూసి ఇష్టపడుతుంది. వీరి పెళ్లికి ఇష్టపడని తండ్రి.. మిగతా విషయాల కంటే ఆ గుణమే గొప్పదని అర్థం చేసుకోవడం.. ఆ ఇద్దరినీ ఒక్కటి చేయడం.. ఈ నేపథ్యంలో బాగా అలవాటైన కథలాగే నడుస్తుంది ‘గోదారి గట్టుపైన’. 


కథ పరంగా ఏ కొత్తదనం కనిపించదు. ఇందులో ఆశ్చర్యపరిచే అంశాలు కూడా ఏమీ లేవు. కథాకథనాలు రొటీన్ అనిపించినా.. టైంపాస్ వినోదాన్ని ఇవ్వడం ద్వారా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇలాంటి రూరల్ లవ్ స్టోరీలకు వీనుల విందైన సంగీతం అవసరం. కానీ ఆ పాటలు వినాలి అనిపించే స్థాయిలో లేవు. సాయి సంతోష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. గోదారి పల్లెటూర్లను.. ప్రేమ సన్నివేశాలను బాగా చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇటు ప్రేమ సన్నివేశాలు కానీ.. అటు కాన్ఫ్లిక్ట్ కానీ బలంగా లేకపోవడంతో సినిమా మరీ తేలిగ్గా అనిపిస్తుంది. ఐతే కొన్ని కామెడీ సీన్లు.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ వరకు అతను బాగా డీల్ చేశాడు. ఓవరాల్ గా గోదారి గట్టుపైన.. కూసింత కాలక్షేపం అన్నట్టు లో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా చూసి బైటికొచ్చేయాలి. 


May 09, 2026 Telugu
5.0
out of 10
‘మేం ఫేమస్’ అంటూ సుమంత్ ప్రభాస్ సోషల్ మీడియాలో కాస్త హడావిడి చేశాడు. సినిమా అంతగా హిట్ కాకపోయినా మనోడు తన డిఫరెంట్ ప్రమోషన్స్‌, మాటలు, చేతలతో ఎక్కువగానే ట్రెండ్ అయ్యాడు. ఇప్పుడు సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రేమకు కులం, మతం, డబ్బు అడ్డు వచ్చిన కథలెన్నో మనం చూశాం. ఇందులో ఏమైనా కొత్తగా చెబుతాడని, చూపిస్తాడని ప్రేక్షకులు ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది.దర్...

‘మేం ఫేమస్’ అంటూ సుమంత్ ప్రభాస్ సోషల్ మీడియాలో కాస్త హడావిడి చేశాడు. సినిమా అంతగా హిట్ కాకపోయినా మనోడు తన డిఫరెంట్ ప్రమోషన్స్‌, మాటలు, చేతలతో ఎక్కువగానే ట్రెండ్ అయ్యాడు. ఇప్పుడు సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రేమకు కులం, మతం, డబ్బు అడ్డు వచ్చిన కథలెన్నో మనం చూశాం. ఇందులో ఏమైనా కొత్తగా చెబుతాడని, చూపిస్తాడని ప్రేక్షకులు ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది.


దర్శకుడు సుభాష్ చంద్ర తీసుకున్న పాయింట్, కథ, కథనం, మేకింగ్, టేకింగ్ ఇవన్నీ కూడా అవుట్ డేటెడ్‌గానే కనిపిస్తాయి. ఏ ఒక్క చోట కూడా అరెరే ఇదేదో కొత్త సీన్‌లా ఉందే, సినిమా కొత్తగా ఉందే అని అనిపించదు. నటీనటులు కూడా పెద్దగా గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ చేసింది లేదు... దాని కంటే ముందు ఆ రోల్స్ అంత స్ట్రాంగ్ గా లేవు కూడా. ఉన్నంతలో జగపతిబాబు రోల్ కొంచెం బాగుంటుంది. ఓవరాల్‌ గా గోదారి గట్టుపైన అని అందమైన టైటిల్, ఓ ఆహ్లాదకరమైన టైటిల్‌ను పెట్టారు. కానీ అందులోని కథ, కథనం, ఎమోషన్స్ మాత్రం అంత గొప్పగా ఉండవు. అంచనాలతో థియేటర్‌కి వెళ్తే ప్రేక్షకుడు కాస్త భంగపడే అవకాశం ఉందనిపిస్తుంది.


May 09, 2026 Telugu
5.0
out of 10
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే రొటీన్ కథా కథనాలతో సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. గోదావరి నేటివిటీ బాగానే చూపించినా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఆసక్తిగా చూపించలేకపోయారు.ఓవరాల్ గా “గోదారి గట్టుపైన’’ అంటూ ఎమోషనల్...

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే రొటీన్ కథా కథనాలతో సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. గోదావరి నేటివిటీ బాగానే చూపించినా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఆసక్తిగా చూపించలేకపోయారు.


ఓవరాల్ గా “గోదారి గట్టుపైన’’ అంటూ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, ప్రేమ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుమంత్ ప్రభాస్, జగపతి బాబు నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.


May 08, 2026 Telugu

Sathi Leelavathi Movie Review

5.0
out of 10
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... రొటీన్ కథా కథనాలతో దర్శకుడు తాతినేని సత్య ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి వన్ విమెన్ షోగా నడిపించింది. ఓవరాల్‌ గా చూసుకుంటే, ‘సతీ లీలావతి’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక...

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... రొటీన్ కథా కథనాలతో దర్శకుడు తాతినేని సత్య ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి వన్ విమెన్ షోగా నడిపించింది. 


ఓవరాల్‌ గా చూసుకుంటే, ‘సతీ లీలావతి’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. లావణ్య త్రిపాఠి పెర్ఫార్మెన్స్ మరియు పర్వాలేదనిపించే ఫస్టాఫ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సెకండాఫ్ లో వచ్చే కామెడీ ట్రాక్స్, మెయిన్ ప్లాట్ నుంచి కథ డీవియేట్ కావడం మైనస్. ఈ వీకెండ్ ఏదైనా ఫ్యామిలీ డ్రామా చూడాలనుకునే వారు తక్కువ అంచనాలతో ఈ చిత్రాన్ని చూడటం బెటర్.

May 08, 2026 Telugu
6.0
out of 10
తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం తాజాగా థియేటర్లలో విడుదల కాగా థియేటర్లలో మిక్స్డ్ రెస్పన్స్ అందుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో ట్రంప్ అంశాన్ని వినియోగించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమ కథ, అమెరికా ప్రయాణం, ట్రంప్‌ పై ప్రతీకారం వంటి అంశాలు ప్రధానంగా చూపించారు. సెకండ్ హాఫ్‌ లో పోలీస్ అంశాలు, ధర్మ పాత్ర, భైరవ్ దాస్ కథ ప్రధానంగా సాగుతుంది. శ్రీ విష్ణు పాత్ర గె...

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం తాజాగా థియేటర్లలో విడుదల కాగా థియేటర్లలో మిక్స్డ్ రెస్పన్స్ అందుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో ట్రంప్ అంశాన్ని వినియోగించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమ కథ, అమెరికా ప్రయాణం, ట్రంప్‌ పై ప్రతీకారం వంటి అంశాలు ప్రధానంగా చూపించారు. సెకండ్ హాఫ్‌ లో పోలీస్ అంశాలు, ధర్మ పాత్ర, భైరవ్ దాస్ కథ ప్రధానంగా సాగుతుంది. శ్రీ విష్ణు పాత్ర గెస్ట్ రోల్‌ గా కాకుండా సెకండ్ హీరోలా కనిపించడం విశేషం. అతని పాత్రకు ప్రత్యేకంగా కథను రూపొందించడం కొత్తగా అనిపించింది.


అయితే ఈ ప్రయోగం మెయిన్ స్టోరీని కొంతవరకు డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. భైరవ్ దాస్ పాత్ర ఆధారంగా భవిష్యత్తులో ప్రత్యేక సినిమా వచ్చే అవకాశం ఉందని క్లైమాక్స్ తో హింట్ ఇచ్చారు టీమ్. ట్రంప్‌కు సంబంధించిన సన్నివేశాలు హాస్యాన్ని అందిస్తాయి. అమెరికాకు వెళ్లాలని ఆశపడే ప్రేక్షకులకు ఈ కథ కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినప్పటికీ, కామెడీ సీన్స్ కడుబుబ్బా నవ్విస్తాయి. ఓవరాల్ గా సినిమా గురించి సింపుల్ గా చెప్పేస్తే... “గాయపడ్డ సింహం” సినిమా అమెరికా వెళ్లాలన్న ఓ వ్యక్తి కల నెరవేరకపోవడంతో అతను తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం చుట్టూ తిరిగే కథ. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో సినిమా రూపొందించబడింది. హ్యాపీగా నవ్వుకోవాలి అనుకునేవారికి గాయపడ్డ సింహం సినిమా మంచి ఆప్షన్.


May 06, 2026 Telugu
Why MRO?