మయూఖ (Mayookha)
Mayookha : సస్పెన్స్ తో అంచనాలు పెంచేసిన "మయూఖ"... ఇంతకీ ఎవరీమె? త్వరలో ప్రేక్షకుల ముందుకు!
About This Movie
టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ చెంగప్ప మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ "మయూఖ". ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన మయూఖ సినిమాను ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశిధర్ నల్ల నిర్మించారు. కాగా ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేయగా, ఈ సినిమాకి సంబంధించి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది మయూఖ ట్రైలర్.
ట్రైలర్ ని గమనిస్తే... ఈ సినిమా పక్కా క్రైమ్, మిస్టరీ అండ్ సస్పెన్స్ అంశాలతో తెరకెక్కినట్టు, సినిమా కూడా మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్ మూవ్మెంట్స్ తో సాగనున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ని చూపించి దాన్ని బేస్ చేసుకునే సినిమా నేపథ్యం ఉంటుందని హింట్ ఇచ్చారు. ట్రైలర్ లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేలాడదీశారని కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది. దీంతో పోలీసులు మిస్టరీని ఛేదించి క్రమంలో అన్ని సీన్స్ చూపిస్తూ, మెల్లిగా పాయల్ చెంగప్ప పాత్రను పరిచయం చేశారు. అయితే ఇందులో హీరోయిన్ కి వేరే సమస్య ఉంటుంది. ఆ సమస్య కూడా సినిమాలో కీలకం కానుంది. దాని వల్ల సినిమాలో పాయల్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవుతుంది.
ఇక ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో క్రైమ్ థ్రిల్లర్ పాయింట్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పాయల్ చెంగప్పతో పాటు బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ దబ్బార, జాను వర్మ, నానాజీ కర్రి, రఘు వాసిరెడ్డి తదితరులు కీ రోల్స్ లో నటించడం జరిగింది. ఇక ఈ మయూఖ సినిమాను అక్టోబర్ 9న తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.